Deepika Padukone gets emotional over Pathaan's success - Sakshi

Deepika Padukone : 'పఠాన్‌' సక్సెస్‌పై ఎమోషనల్‌ అయిన దీపికా పదుకొణె

Jan 31 2023 12:38 PM | Updated on Jan 31 2023 3:09 PM

Deepika Padukone Gets Emotional Over Pathaan Success - Sakshi

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం 'పఠాన్‌'. జాన్‌ అబ్రహం కీలక పాత్రలో నటించగా, సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 500కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే బాలీవుడ్‌లో `కేజీఎఫ్‌2` ‘బాహుబలి’ కలెక్షన్ల రికార్డులను బ్రేక్‌ చేసి హిందీ సినిమా చరిత్రలోనే హయ్యేస్ట్ గ్రాసింగ్ ఓపెనింగ్ వీకెండ్‌గా పఠాన్‌ నిలిచింది.

ఈ క్రమంలో చిత్ర బృందం ముంబైలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా పఠాన్‌పై అభిమానులు చూపిస్తున్న ప్రేమకు దీపికా పదుకొణె ఎమోషనల్‌ అయ్యింది. దీపికా మాట్లాడుతూ.. ''సినిమా రిలీజ్‌ నాడు థియేటర్‌కి వెళ్లి ఆడియెన్స్‌ రెస్పాన్స్‌ చూద్దామనుకున్నా. కానీ ఆరోజు కుదర్లేదు. కానీ ఈరోజు మీ అందరి ప్రేమ, ప్రశంసలు పొందుతుంటే చాలా ఆనందంగా, ఓ పండుగలా అనిపిస్తుంది. 

ఓం శాంతి ఓం సినిమా నుంచి షారుక్‌ ఖాన్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆరోజు నన్ను నమ్మి ఆయన అవకాశం ఇచ్చి ఉండకపోతే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు. నిజాయితీగా, చిత్తశుద్దితో పని చేస్తే అందుకు బహుమతిగా ఇలాంటి ప్రేమ, ప్రశంసలు దక్కుతాయాని  పఠాన్‌ రుజువు చేసింది'' అంటూ దీపికా కంటతడి పెట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement