కరోనా తర్వాత కళ తప్పిన బాలీవుడ్ బాక్సాఫీస్ ఊపిరి అందించింది పఠాన్ మూవీ. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ మూవీస్ క్రియేట్ చేసిన రికార్డ్స్ మొత్తం పఠాన్ బ్రేక్ చేసింది. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్,దీపికా పదుకొనే జంటగా నటించిన ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయటం స్టార్ట్ చేసింది. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పఠాన్ ఇప్పటి వరకు దాదాపు 30 రికార్డులు సాధించింది. అలాగే మరో అరుదైన ఘనతను పఠాన్ సొంతం చేసుకుంది.
జనవరి 25న విడుదలైన పఠాన్ మూవీ సక్సెస్ ఫుల్ గా 50 రోజు కంప్లీట్ చేసుకుంది. ఇండియాలో పఠాన్ మూవీ దాదాపు 800 స్క్రీన్లల లో 50 డేస్ కంప్లీట్ చేసుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా పఠాన్ మూవీ మరో 135 ధియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఇన్ని ధియేటర్స్ లో 50 డేస్ ఆడలేదు. ఆస్కార్ గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్...హిందీలో నిన్నటి వరకు హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచిన బాహుబలి 2 కూడా ఇన్ని ధియేటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకోలేదు. హైయెస్ట్ ధియేటర్స్ లో 50 డేస్ కంప్లీట్ చేసుకున్న పీట్ ను పఠాన్ అందుకుంది.
అలాగే ఆదిత్య చోప్రా యూనివర్స్ లో వచ్చిన పఠాన్ వరల్డ్ వైడ్ గా 30 రికార్డ్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో దంగల్ తర్వాత వెయ్యి కోట్లు వసూళ్లు చేసిన మూవీ గా పఠాన్ నిలిచింది. అలాగే హిందీలో హైయెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా, వరల్డ్ వైడ్ గా రెండు వందలు.. మూడు వందలు.. నాలుగు వందల కోట్ల క్లబ్ లో ఫాస్ట్ గా చేరిన సినిమాగా, ఇండియాలో 500 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన హిందీ సినిమాగా, యూకేలో భారీ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ మూవీగా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా టాప్ గ్రాసర్ మూవీగా ఇలా మొత్తంగా 30 రికార్డ్స్ సాధించినట్లు బీటౌన్ చెబుతోంది.
ప్రస్తుతం షారూఖ్ ఖాన్ నటిస్తున్న మూవీ జవాన్..సౌతిండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూన్ నుంచి అక్టోబర్ కి వాయిదా పడింది. పఠాన్ హిట్ కావటంతో జవాన్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.
#Pathaan celebrates 50 glorious days in theatres 💥💥 Keep the love coming ❤️
— Yash Raj Films (@yrf) March 15, 2023
Book your tickets now - https://t.co/SD17p6wBSa | https://t.co/VkhFng5XLL
Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/EsmowoZGWX
Comments
Please login to add a commentAdd a comment