Shah Rukh Khan 'Pathaan' Movie Completes Censor; Here's First Review - Sakshi
Sakshi News home page

Pathan Movie Censor Cuts: పఠాన్‌ మూవీ రన్‌ టైం లాక్‌.. ‘బెషరమ్‌ రంగ్‌’ పాటకు 3 సెన్సార్‌ కట్స్‌!

Published Wed, Jan 18 2023 11:37 AM | Last Updated on Wed, Jan 18 2023 12:14 PM

Shah Rukh Khan Pathan Movie Completes Censor And Here is First Review - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌, బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం పఠాన్‌. విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రెడీ అయ్యింది. హై వొల్టేజ్‌ యాక్షన్‌ డ్రామాగా పఠాన్‌ జవవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల సెన్సార్‌కు వెళ్లిన ఈ సినిమాకు బోర్డు షాకిచ్చిన సంగతి తెలిసిందే. పఠాన్‌కు యూ/ఏ సర్టిఫికేట్‌ కావాలంటే తాము సూచించిన విధంగా మార్పులు చేసుకురమ్మని మూవీ టీంను ఆదేశించారు సెన్సార్‌ బోర్డు సభ్యులు. పలు మార్పుల అనంతరం రెండోసారి సెన్సార్‌కు వెళ్లిన ఈ చిత్రానికి తాజాగా సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు.

చదవండి: అమలాపాల్‌కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్‌ సంఘటన!

అయితే ఈ చిత్రంలో మొత్తం 11పైగా పలు అభ్యంతకర సన్నివేశాల సెన్సార్‌ కట్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వివాదంలో నిలిచిన బెషరమ్‌ రంగ్‌ పాటలో దీపికాకు చెందిన 3 క్లోజప్‌ షాట్స్‌ను తొలగించినట్లు సమాచారం. అలా పలు కట్స్‌ అనంతరం ఆ మూవీకి సెన్సార్‌ బోర్డు సర్టిఫికేట్‌ జారీ చేసిందట. ఫైనల్‌గా మూవీ నిడివి 146.16 నిమిషాలు(2 గంటల 26 నిమిషాల 16 సెకన్లు) లాక్‌ అయ్యింది. కాగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించాడు. ఇందులో షారుక్‌ గూఢచారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి విశాల్‌ శేఖర్‌ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement