
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్‌గా నటించింది. యంగ్ డైరెక్టర్ సిద్దార్థ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 25న విడుదలై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. చాలా ఏళ్ల తర్వాత షారుఖ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందీ మూవీ.
సుమారు రూ. 1000 కోట్లకుపైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటికీ థియేటర్లలో అదే జోరును కంటిన్యూ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పఠాన్ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.
Comments
Please login to add a commentAdd a comment