Pathan Movie
-
షారుఖ్ రూ. 5 కోట్ల లగ్జరీ వాచ్ : నెటిజన్ల జోక్స్ వైరల్
గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కొద్దీ అభిమానుల ఫాలోయింగ్, కోట్లాది రూపాయల సంపద, ఖరీదైన వస్తువులు, లగ్జరీ లైఫ్ ఆయన సొంతం. తాజాగా కింగ్ ఖాన్ లగ్జరీ వాచ్ వార్తల్లో నిలిచింది. నీలిరంగు Audemars Piguet చేతి గడియారం దాని ధర చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీని ధర సుమారు . 5 కోట్లు. అయితే ఈ వాచ్ ధరపై నెటిజన్లు కమెంట్లు హాట్‌టాపిక్‌గా లిచాయి ఆడెమర్స్ పిగెట్ బ్రాండ్‌కు చెందిన రాయల్ ఓక్ వాచ్‌ను తన బ్లాక్‌బస్టర్ మూవీ పఠాన్ ప్రమోషన్ సమయంలో దీన్ని ధరించి అందర్నీ విస్మయ పర్చిన సంగతి తెలిసిందే. దీని డెలివరీ కోసం రూ. 8 వేలకు చెల్లించాడంటేనే దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఆడెమర్స్ వెబ్సైట్ ప్రకారం ఇది బ్లూ-హ్యూడ్ స్టార్రి-నైట్ పీస్. ఇదిచాలా లిమిటెడ్ వెర్షన్ కూడా. ఈ వాచ్ డిజైన్, బిల్డ్ విషయాలను గమనిస్తే..ఇందులో నాలుగు డయల్స్ ఉంటాయి. ఇందులో సమయంతోపాటు, నెలలు, రోజులు తదితర వివరాలు కూడా ఉంటాయి. దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ T20 సందర్భంగా కూడా ఈ వాచ్‌తో దర్శమనిచ్చాడు షారుఖ్. అయితే దీన్ని కొంతమంది అభిమానులు వెరైటీగా స్పందించారు. రూ. 500 అయితే ఏంటి, 5 కోట్లు చూపించే టైం ఒకటేగాఅని ఒకరు, మీషో, షాప్సీ వంటి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్స్‌లో 200 రూపాయలకే దీన్ని కొనుక్కోవవచ్చు. అంతేకాదు ఇంతకంటే మంచి వాచ్‌లు దొరుకుతాయంటూ వ్యాఖ్యానించడం విశేషం.షారుఖ్ ఖాన్ ఆడెమర్స్ పిగ్యెట్ రాయల్ ఓక్ వాచెస్ కలెక్షన్లో ఖరీదైనది మరొకటి కూడా ఉంది. నీతా అంబానీ నేతృత్వంలోని ఎన్ఎంఏసీసీ ఈవెంట్లో కింగ్ ఖాన్ దీన్ని ధరించాడు. దీని ధర రూ. 31.1 లక్షలు. -
Shah Rukh Khan: హాలీవుడ్ హీరోలతో షారుఖ్ పోటీ!
గతేడాది ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. వాటిలో పఠాన్, జవాన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సాధించి, రూ.1000 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక డిసెంబర్లో వచ్చిన ‘డంకీ’కూడా మంచి వసూళ్లను సాధించి, షారుఖ్‌కి హ్యాట్రిక్ హిట్‌ని అందించింది. ఇలా ఒకే ఏడాదిలో మూడు సినిమాలను రిలీజ్ చేసి, వాటిలో రెండు చిత్రాలు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఏకైక హీరోగా షారుఖ్ చరిత్ర సృష్టించాడు. (చదవండి: చాలా ఎళ్ల నుంచి అతనితో డేటింగ్లో ఉన్నాను: తాప్సీ) తాజాగా బాలీవుడ్ బాద్షా హాలీవుడ్ హీరోలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు. యాక్షన్, ఫైట్స్, స్టంట్స్ విషయంలో హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడడానికి పఠాన్, జవాన్ సినిమాలు సిద్ధమయ్యాయి. ఇటీవల ప్రకటించిన వల్చర్ 2023 ఆన్యువల్ స్టంట్ అవార్డ్స్ నామినేషన్స్ లిస్ట్‌లో షారుఖ్ నటించిన ‘జవాన్, పఠాన్ చిత్రాలు ఉన్నాయి. కేను రీవ్స్ నటించిన ‘జాన్ విక్ 4’, టామ్ క్రూజ్ హీరోగా చేసిన ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ పార్ట్ వన్’ లాంటి హాలీవుడ్ చిత్రాలతో ఇవి పోటీ పడనున్నాయి. (చదవండి: రొమాంటిక్ డ్రామాతో హాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ) బెస్ట్ వెహిక్యులర్ స్టంట్, బెస్ట్ స్టంట్ ఇన్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరీల్లో జవాన్, బెస్ట్ ఏరియల్ స్టంట్, బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిల్లో ‘పఠాన్’ నామినేట్ అయింది. ఇక బెస్ట్ ఓవరాల్ యాక్షన్ ఫిల్మ్ కేటగిరిలో హాలీవుడ్‌కి చెందిన ‘బెలరినా’, ‘గై రిచీస్ ది కోవనెంట్, ఎక్స్ట్రాక్షన్ 2, ఫిస్ట్ ఆఫ్ ది కోండర్’, ‘జాన్ విక్ - చాప్టర్ 4’, ‘మిషన్ ఇంపాజిబుల - డెడ్ రెకనింగ్ పార్ట్ 1’, ‘సైలెంట్ నైట్’, ‘షిన్ కామెన్ రైడర్ చిత్రాలు ఉన్నాయి. -
వైష్ణో దేవి అమ్మవారి సన్నిధిలో షారుక్ ఖాన్.. మరో హిట్ ఖాయం
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డంకీ' డిసెంబర్ 21న విడుదల కానుంది. ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా సినిమా విడుదలకు ముందు హీరో షారుక్ ఖాన్ జమ్మూలోని వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. నేడు ఉదయం జమ్మూలోని కత్రా వద్దకు ఆయన చేరుకున్నారు. ఏడాది సమయంలో మూడవసారి ఈ పవిత్ర స్థలాన్ని షారుక్ సందర్శించారు. 2023లో షారుక్ ఖాన్ రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో పఠాన్ సినిమాతో రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిన షారుక్ ఆ తర్వాత జవాన్ సినిమాతో కూడా మరో సూపర్ హిట్‌ను అందుకున్నారు. ఈ రెండు సినిమా విడుదలకు ముందు కూడా ఆయన వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. 'పఠాన్' విడుదలకు ముందు 2022 డిసెంబర్ 12న వైష్ణోదేవి ఆలయంలో పూజలు నిర్వహించిన షారుక్.. మళ్లీ 'జవాన్' విడుదలకు ముందు ఆగస్టులో మరోసారి అక్కడికి వెళ్లారు. మళ్లీ ఇప్పుడు 'డంకీ' విడుదల సమయంలో అక్కడ పూజలు నిర్వహించారు. అలా వైష్ణోదేవి అమ్మవారి సెంటిమెంట్‌ను షారుక్ పాటిస్తున్నారు. అమ్మవారి ఆలయం చుట్టూ షారుక్ తిరుగుతుండగా పలువురు వీడియోలు తీశారు. ఆయనతో పాటు తన అంగరక్షకులు, మేనేజర్ పూజా దద్లానీ ఉన్నారు. తన సినిమాలు విజయం సాధించాలని విడుదలకు ముందే పలు దేవాలయాలను ఆయన సందర్శిస్తారు. జవాన్ సినిమా సమయంలో తిరుమల శ్రీవారిని కూడా ఆయన దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రానున్న 'డంకీ'పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో షారుఖ్‌తో పాటు బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్ తదితరులు నటించారు. 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ ఈ మధ్యే విడుదలైంది. దానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది. డిసెంబర్ 22న డంకీ చిత్రానికి పోటీగా ప్రభాస్ సలార్ వస్తున్న విషయం తెలిసిందే. #WATCH | J&K: Actor Shah Rukh Khan visited Mata Vaishno Devi shrine, earlier today. (Source: J&K Police) pic.twitter.com/hK3JHvaCG2 — ANI (@ANI) December 12, 2023 -
‘ఆ జాబితాలో చాట్ జీపీటి టాప్.. ఇండియా నుంచి ఏడు’
సాధారణంగా ఏ విషయానైనా సంపూర్ణంగా తెలసుకునేందుకు అందరూ వికీపీడియా మీదనే ఆధారపడుతూ ఉండటం తెలిసిందే. అయితే.. అందులో అన్ని రంగాలకు సంబంధించిన వార్తలు, సమాచారం అందుబాటులో ఉంటుంది. 2023లో వికీపీడియాలోని సమాచారాన్ని ఎంత మంది చదివారో దాని సంబంధించిన.. నివేదికను తాజాగా వికీపీడియా ఫౌండేషన్ విడుదల చేసింది. 2023 ఏడాదిలో అధికంగా చదివిన పలు ఆంగ్ల ఆర్టికల్స్ గణాంకాలను రిలీజ్ చేసింది. విడుదల చేసిన జాబితాలో గణాంకల ప్రకారం మొత్తం 25 ఆర్టికల్స్‌లు వార్షిక నివేదికలో చోటు సంపాదించుకోగా.. అందులో భారత్‌కు చెందినవి ఏడింటికి చోటు దక్కటం గమనార్హం. వికీపీడియా విడుదల చేసిన వివరాల ప్రకారం.. సుమారు 8.4 బిలియన్ పేజ్ వ్యూస్ సాధించిన అర్టికల్స్‌లో టాప్‌లో ఐదు నిలిచాయి. చాట్ జీపీటీ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో.. 2023లో చోటుచేసుకున్న మరణాలు, 2023 క్రికెట్ ప్రపంచ కప్(3వ స్థానం), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (4వ స్థానం), హాలీవడ్ సినిమా ఓపెన్ హైమర్ ఐదో స్థానంలో చోటు సంపాధించింది. అదేవిధంగా ఆరో స్థానంలో క్రికెట్ ప్రపంచ కప్, ఏడో స్థానంలో జే.రాబర్ట్ ఓపెన్‌హైమర్, జవాన్ మూవీ (8వ స్థానం), 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్(9వ స్థానం) పఠాన్( 10వ స్థానం). ది లాస్ట్ ఆఫ్ అస్ (TV సిరీస్)(11వ స్థానం), టేలర్ స్విఫ్ట్(12వ స్థానం), బార్బీ మూవీ(13వ స్థానం), క్రిస్టియానో రొనాల్డో( 14 స్థానం), లియోనెల్ మెస్సీ( 15వ స్థానం), ప్రీమియర్ లీగ్( 16వ స్థానం), మాథ్యూ పెర్రీ(17వ స్థానం), యునైటెడ్ స్టేట్స్( 18వ స్థానం), ఎలోన్ మస్క్(19వ స్థానం), అవతార్: ది వే ఆఫ్ వాటర్( 20వ స్థానం), india( 21 వ స్థానం), లిసా మేరీ ప్రెస్లీ( 22 స్థానం), గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ ( 23వ స్థానం), ఉక్రెయిన్‌పై రష్యా దాడి( 24వ స్థానం), ఆండ్రూ టేట్( 25వ స్థానం)లో చోటు దక్కించుకున్నాయి. ఈ వివరాల నివేదిక జనవరి 1 నుంచి నవంబర్ 28 వరకు మాత్రమేనని వికీపీడియా ఫౌండేషన్ పేర్కొంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టాప్ 5లో చోటు సంపాదించటం విశేషం. అదే విధంగా షారుక్‌ఖాన్ నటించిన జవాన్, పఠాన్ బాలీవుడ్ సినిమాలు రెండు టాప్ టెన్‌లో నిలిచాయి. -
రూ.20 కోట్ల బడ్జెట్ సినిమా.. షారుక్ ఖాన్ పఠాన్‌కే షాకిచ్చింది!
సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా కోట్లలో వసూళ్ల సాధించడమంటే మాటలు కాదు. ఎంతటి స్టార్ హీరోల చిత్రాలైన ఒక్కోసారి బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడిన సంఘటనలు కూడా చూశాం. కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కించినప్పటికీ హిట్ కాకపోతే నష్టం భరించక తప్పదు. అయితే ఈ ఏడాదిలో బాలీవుడ్లో చాలా చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే హిట్‌గా నిలిచాయి. ఈ ఏడాదిలో థియేట్రికల్‌గా ఎక్కువ క్రేజ్ ఉన్న చిత్రాల్లో ఇటీవలే రిలీజైన షారుక్ ఖాన్ జవాన్ మొదటిస్థానంలో నిలిచింది. (ఇది చదవండి: స్టార్ హీరోతో ఒక్క సినిమా చేసింది.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తిని!) అయితే రెండోస్థానంలో ఎవరూ ఊహించని విధంగా ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ నిలిచి రికార్డ్ సృష్టించింది. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ పఠాన్, గదర్-2, ఓఎంజీ-2 చిత్రాలను వెనక్కి నెట్టింది. 2023లో ఆడియన్స్ అత్యధికంగా ఇష్టపడిన హిందీ థియేట్రికల్ చిత్రాల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. వసూళ్ల పరంగా చూస్తే.. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. పఠాన్ సైతం రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ. 20 కోట్ల రూపాయల చిన్న బడ్జెట్‌తో సుదీప్తో సేన్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్లు రాబట్టింది. సన్నీ డియోల్ నటించిన గదర్ 2 రూ. 650 కోట్లతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అక్షయ్ కుమార్ ఓఎంజీ- 2 రూ.220 కోట్లకు పైగా వసూలు చేసింది. (ఇది చదవండి: సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదు: ప్రియా ప్రకాశ్) View this post on Instagram A post shared by Ormax Media (@ormaxmedia) -
అప్పుడే ఆదిపురుష్ దెబ్బకి.. ఆర్ఆర్ఆర్, పఠాన్ రికార్డ్స్ ఢమాల్
-
రష్యా లో పఠాన్ సినిమాకి పెద్ద మిస్టరీ ఉంది అట
-
నిజమెంత? నిజాయతీ ఎంత?
‘నిజజీవిత ఘటనల నుంచి ప్రేరణ పొంది తీశామ’ని అంటున్న సినిమాలో నిజాలు ఉంటాయనే ఆశిస్తాం. నిజాయతీగా ఉంటుందనే భావిస్తాం. కానీ అవే లోపిస్తే? శుక్రవారం విడుదలవుతున్న హిందీ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ సరిగ్గా అవే ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. విషయం మద్రాస్, కేరళ హైకోర్ట్‌ల మొదలు సర్వోన్నత న్యాయస్థానం దాకా వెళ్ళాల్సి వచ్చింది. దాదాపు 10 కట్స్‌తో సెన్సార్ బోర్డ్ పచ్చజెండా ఊపిన ఈ వివాదాస్పద చిత్ర ప్రదర్శనను ఆపడానికి కానీ, కనీసం ‘కల్పిత పాత్రలతో అల్లుకున్న కథ’ అని టైటిల్స్‌లో వేయడానికి కానీ గడచిన మూడు రోజుల్లో 3 సార్లు సుప్రీమ్ ససేమిరా అనడంతో, బంతి ఇప్పుడు థియేటర్లలోని ప్రజాకోర్టులో పడింది. ‘సంఘ్ పరి వార్ వారి అసత్యాల కర్మాగారంలో తాజా ఉత్పత్తి’ అంటూ కేరళ సీఎం ఈ చిత్రాన్ని గర్హించారు. కేరళలో జెండా పాతాలని ప్రయత్నిస్తున్న బీజేపీ మినహా ప్రతిపక్షాలూ ఆ మాటే అంటున్నాయి. బహిష్కరణ పిలుపుతో సహా కేరళ సర్కార్ వివిధ మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలో కల్పనను నిజమని నమ్మించే ప్రమాదభరిత సృజనాత్మక స్వేచ్ఛ విపరిణామాలపై కచ్చితంగా చర్చ అవసరం. ఏప్రిల్ ద్వితీయార్ధంలో ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ‘కేరళ స్టోరీ’ వివాదాలకు కేంద్రబిందువైంది. తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రభావం పతాకస్థాయిలో ఉన్నవేళ కేరళ నుంచి ‘దాదాపు 32 వేల మంది స్త్రీలు’ కనిపించకుండాపోయారనీ, వారి తెర వెనుక కథల్ని ‘బహిర్గతం’ చేసే యత్నమే మత మార్పిడి అంశం ఇతివృత్తమైన ఈ చిత్రమనీ దర్శక, నిర్మాతల మాట. ‘లవ్ జిహాద్’లో భాగంగా 32 వేల మందినీ ముస్లిమ్‌లుగా మార్చి, అత్యధికులను ఐఎస్ పాలనలోని సిరియాకు తీసుకువెళ్ళారనేది ఈ చిత్ర వాదన. సాక్ష్యాధారాలు లేని ఈ కాకుల లెక్కతో కేరళను తీవ్రవాదానికి పట్టుగొమ్మ అన్నట్టు చిత్రించడంపై సహజంగానే అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇది ముస్లిమ్‌లపట్ల ద్వేషం పెంచే దుర్మార్గ ప్రయత్నమనే వాదన బలపడింది. ‘లవ్ జిహాద్’ లేదని నాటి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రే పార్లమెంట్లో చెప్పినప్పుడు కేరళపై బురద చల్లేలా ఇలాంటి సినిమా ఎలా తీస్తారన్నది ప్రశ్న. కేరళలో హిందువుల జనాభా దాదాపు 55 శాతమైతే, ఆ తర్వాత అత్యధికంగా ముస్లిమ్‌లు 26 శాతం పైగా, క్రైస్తవులు 18 శాతం ఉన్నట్టు లెక్క. దశాబ్దాల క్రితమే సంపూర్ణ అక్షరాస్యత సాధించి, నిత్యం చైతన్యం నిండిన ఆలోచనాపరుల సమాజంగా దేశంలో మలయాళ సీమది ప్రత్యేక స్థానం. సాహిత్యం, సంస్కృతి, కళలు, సినిమాలు సహా అనేక రంగాల్లో దిక్సూచిగా నిలిచిన ఘనత దానిది. మానవాభివృద్ధి సూచిలో ముందుంది. అలాంటి రాష్ట్రాన్ని పచ్చి తీవ్రవాదానికి పట్టుగొమ్మ అన్నట్టు చిత్రించడం కించపరచడమే. విమర్శలు పెరిగి, వివాదం ముదిరేసరికి సినీరూపకర్తలు సైతం సర్దు కోవాల్సి వచ్చింది. కేరళలోని ‘32 వేల మంది మహిళల కథల ఆధారంగా తీశా’మంటూ మొదట ట్రైలర్లో తొడకొట్టినవాళ్ళు చివరకు మే మొదట్లో దాన్ని ముగ్గురంటే ‘ముగ్గురు యువతులు’గా మార్చేశారు. కడుపులో ఏదో పెట్టుకొని కథ రాసుకున్నప్పటికీ కోట్లు పెట్టి సినిమా తీసినవారికి మూడుకూ, 32 వేలకూ తేడా తెలీదా? ఒకటీ అరా ఘటనలు జరిగాయేమో తెలీదు కానీ దాన్ని పట్టుకొని కేరళలోని ప్రబలమైన ధోరణి అన్నట్టు చిత్రించాలనుకోవడం ఏ రకంగా సమర్థనీయం? మొత్తం కేరళ కథ అన్నట్టు సినిమాకు పేరు పెట్టి, బురద జల్లడం ఎవరిచ్చిన సృజనాత్మక స్వేచ్ఛ? భావప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిందే. సృజనాత్మక స్వాతంత్య్రం కావాల్సిందే! కానీ ట్రైలర్‌ను బట్టి చూస్తే... వాస్తవాలను చూపుతున్నామనే పేరుతో, నిజాలను వక్రీకరించి సంచలనాత్మకం చేయడం ‘కేరళ స్టోరీ’లోని అతి పెద్ద ఇబ్బంది. ఇలా లెక్కలతో సహా అన్నిటినీ అతి చేస్తున్నప్పడు ఈ చిత్ర రూపకల్పన వెనుక ఉన్న ఉద్దేశాలపై, సాధించదలచిన లక్ష్యాలపై తప్పక అనుమానాలు తలెత్తుతాయి. పైగా, కేరళలో ముస్లిమ్, ముస్లిమేతరులుగా ప్రజలను రెండు ప్రత్యర్థి వర్గాలుగా ఏకీకృతం చేసే ప్రయత్నాలు పెరుగుతున్న సమయంలో సినిమా రావడం సందేహాల్ని పెంచుతోంది. ఆ మధ్య ‘పద్మావత్’ నుంచి ఇటీవలి ‘పఠాన్’ దాకా సినిమాలపై నిషేధపు డిమాండ్లు, కోర్టు కేసులు చూశాం. అప్పుడైనా ఇప్పుడైనా నిషేధాలు పరిష్కారం కావు. కానీ సెంటిమెంట్లను దెబ్బతీసి, ఉద్రి క్తత సృష్టించి, విద్వేషాన్ని పెంచే ప్రయత్నాలను తప్పక అడ్డుకోవాల్సిందే. శాంతిభద్రతలకు భంగం వాటిల్లినప్పుడు భావప్రకటన స్వేచ్ఛపై నిర్బంధాలు తప్పవని ఆర్టికల్ 19 (2) అనుమతిస్తోంది. శాంతిభద్రతలేమో కానీ, మనోఫలకంపై నిలిచి ఆలోచనల్లోకి ఇంకిపోయే భావోద్వేగాల ప్రభావమే అర్ధసత్య చిత్రాలతో అతి ప్రమాదం. బ్రిటిష్ వారి వద్దే మన్యం వీరుడు అల్లూరి పోలీసుగా పని చేశాడని భావితరాలు నమ్మేలా సినిమా తీసి, ఆస్కార్ల దాకా వెళ్ళిన మన కథలే అందుకు సాక్ష్యం. ‘కేరళ స్టోరీ’కీ కనీసం కల్పితపాత్రల కథనమని పేర్కొనమంటూ పిటిషనర్లు కోరిందీ అందుకే. సెకనుకు 24 ఫ్రేమ్‌ల చొప్పున తెరపై చూపే సత్యం సినిమా అనే సూక్తికి ‘కేరళ స్టోరీ’ లాంటివి నిలబడతాయా అన్నది సందేహమే! సామాన్య ప్రజలు తాము తెరపై చూసేదంతా సత్యమని భ్రమ పడితే, సమాజంలో పెచ్చరిల్లే విద్వేషాగ్నికి బాధ్యులెవరు? ‘కశ్మీర్ ఫైల్స్’తో దేశం ఆ చివరన మొద లైన అర్ధసత్య, అసత్య ప్రచార చిత్రాలు ఇప్పుడు ‘కేరళ స్టోరీ’తో ఈ చివరన కన్యాకుమారికి విస్తరించడం దేనికి సంకేతం? భావప్రకటన స్వేచ్ఛ ఓకే కానీ, నిజాన్ని వక్రీకరించి చూపడంపై గళమెత్తా ల్సిందే! ఈ రొచ్చుకు అడ్డుకట్ట ఏమిటో కనిపెట్టాల్సిందే! రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాను వాడుకొనేందుకు పెరుగుతున్న ప్రాపగాండా ప్రయత్నాలను గమనించాలి. గత తొమ్మిదేళ్ళలో ఎన్నికల ముందే ఇలాంటి చిత్రాలు ఎందుకు, ఎవరి ప్రాపుతో వస్తున్నాయో ఆలోచించాలి. -
ఓటీటీకి వచ్చేస్తోన్న పఠాన్.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచే, ఎక్కడంటే
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్గా నటించింది. యంగ్ డైరెక్టర్ సిద్దార్థ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 25న విడుదలై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. చాలా ఏళ్ల తర్వాత షారుఖ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందీ మూవీ. కరోనా తర్వాత సరైనా హిట్స్ లేక ఢిలా పడ్డ బిటౌన్‌కు పఠాన్ ఊహించనని సక్సెస్ అందించింది. సుమారు రూ. 1000 కోట్లకుపైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. చదవండి: ఆస్కార్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారా? నిర్మాత దానయ్య ఏమన్నాడంటే.. ఇదిలా ఉంటే ఇప్పుడు పఠాన్ డిజిటిల్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ థియేటర్లోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. తాజాగా పఠాన్ ఓటీటీ స్ట్రీమింగ్పై అమెజాన్ ప్రైం వీడియోస్ అధికారిక ప్రకటన ఇచ్చింది. మార్చి 22న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ వెల్లడించింది. we sense a turbulence in the weather, after all Pathaan is coming!#PathaanOnPrime, Mar 22 in Hindi, Tamil and Telugu @iamsrk @deepikapadukone @TheJohnAbraham #SiddharthAnand @yrf pic.twitter.com/MnytnUqZEj — prime video IN (@PrimeVideoIN) March 20, 2023 -
ఓటీటీలోకి షారుక్ ఖాన్ 'పఠాన్' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్గా నటించింది. యంగ్ డైరెక్టర్ సిద్దార్థ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 25న విడుదలై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. చాలా ఏళ్ల తర్వాత షారుఖ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందీ మూవీ. సుమారు రూ. 1000 కోట్లకుపైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పటికీ థియేటర్లలో అదే జోరును కంటిన్యూ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పఠాన్ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. -
వెయ్యి కోట్ల క్లబ్లో పఠాన్.. రేర్ రికార్డు
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు ‘పఠాన్’. షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో నటించిన హిందీ స్పై ఫిల్మ్ ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకోన్, జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలు పో షించగా, డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా కీ రోల్స్ చేశారు. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 25న విడుదలైంది. ఫిబ్రవరి 20 (సోమవారం) కి ‘పఠాన్’ చిత్రం రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. దేశంలో 623.. విదేశాల్లో 377 కోట్లు దేశవ్యాప్తంగా రూ. 623 కోట్ల గ్రాస్, ఓవర్సీస్లో రూ. 377 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను ‘పఠాన్’ రాబట్టిందని చిత్ర యూనిట్ పేర్కొంది. అలాగే సినిమా విడుదలైన తొలి దశలోనే రూ. 1000 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన తొలి హిందీ చిత్రంగా కూడా ‘పఠాన్’ నిలిచిందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘దంగల్’ చిత్రం ఆల్రెడీ వెయ్యి కోట్లు వసూలు చేసిన హిందీ చిత్రంగా రికార్డుల్లో ఉంది. అయితే తొలిసారి రిలీజ్ చేసినప్పుడే ఈ ఫీట్ సాధించలేదట. ఆ తర్వాత కొన్ని నెలలకు చైనాలో రిలీజ్ చేశాక ఈ సినిమా వసూళ్లు జోరందుకున్నాయని, దీంతో ‘దంగల్’ వెయ్యి కోట్లు వసూలు చేసిన హిందీ చిత్రంగా నిలిచిందని బాలీవుడ్ టాక్. ఇక విడుదలైన తక్కువ రోజుల్లోనే రూ. 250 కోట్లు వసూలు చేసిన తొలి హిందీ చిత్రం ‘పఠాన్’ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ‘దంగల్’ తర్వాత హిందీలో వెయ్యి కోట్లు సాధించిన రెండో చిత్రం రికార్డ్ ‘పఠాన్’దే. కాగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఐదో ఇండియన్ సినిమా భారతీయ చిత్రాల్లో రూ. 1000 కోట్లు వసూళ్లను సాధించిన తొలి సినిమా రికార్డు ప్రభాస్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ దక్కించుకుంది. ఆ తర్వాత ఆమిర్ ఖాన్ ‘దంగల్’, ఎన్టీర్ – రామ్‌చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’, యశ్ ‘కేజీఎఫ్’ చిత్రాలు ఉన్నాయి. అయితే అత్యధిక వసూళ్ల పరంగా మాత్రం ఈ జాబితా కాస్త మారుతుంది. ఈ లెక్కల ప్రకారం ‘దంగల్’ (దాదాపు 2000 కోట్లు) తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ దాదాపు 1800 కోట్లు, కేజీఎఫ్: ఛాప్టర్ 2 దాదాపు 1200 కోట్లు, దాదాపు‘ఆర్ఆర్ఆర్’ 1200 కోట్లు (ప్రస్తుతానికి జపాన్ వసూళ్లను కలుపుకుని... ఇంకా అక్కడ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రదర్శితమవుతోంది) సాధించాయి. బాద్షా ఈజ్ బ్యాక్ ‘పఠాన్’కు ముందు షారుక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘జీరో’ (2018). ఈ చిత్రం పరాజయాన్ని చవి చూసింది. దీంతో షారుక్ మరో చిత్రం ఒప్పుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఎన్నో కథలు విని ఫైనల్‌గా ‘పఠాన్’కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. షారుక్ నిర్ణయం ఎంత కరెక్టో ఈ సినిమా వసూళ్లు చెబుతున్నాయని బాలీవుడ్ అంటోంది. అలాగే నాలుగేళ్ల తర్వాత ఈ బాలీవుడ్ బాద్షా బ్లాక్బాస్టర్ హిట్ సాధించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నిజానికి ‘పఠాన్’ రూ. 970 కోట్ల (22 రోజులకు) గ్రాస్ సాధించిన సమయంలో వసూళ్లు కాస్త నెమ్మదించాయి. దీంతో సినిమా యూనిట్ టికెట్ ధరలను తగ్గించింది. ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో ఒక రోజు మొత్తం రూ. 110కే టికెట్స్‌ను అమ్మారు. ఆ తర్వాత కూడా కొన్ని మల్టీ ప్లెక్స్‌లలో ‘పఠాన్’ సినిమా టికెట్ ధరలు కాస్త తగ్గి ఉన్నాయి. ఎప్పుడైతే టికెట్ ధర తగ్గిందో అప్పుడు ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. ఇదే వెయ్యి కోట్ల క్లబ్లో చేరేందుకు దోహదపడిందని తెలుస్తోంది. అలాగే కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘సెహ్జాదా’ (తెలుగు హిట్ ‘అల.. వైకుంఠపురములో..’ హిందీ రీమేక్) సినిమా ఫిబ్రవరి 10న విడుదల కావాల్సింది. కానీ ‘పఠాన్’ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని వారం రోజులు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 17న రిలీజ్ చేశారు. అయితే ‘సెహ్జాదా’ హిందీ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపలేకపోయింది. కానీ ఈ సినిమా వారం రోజులు ఆలస్యంగా విడుదల కావడం మాత్రం బాక్సాఫీస్ పరంగా ‘పఠాన్’కు కలిసొచ్చిందనే చెప్పాలి. అలాగే ఫిబ్రవరి 17న విడుదలైన హాలీవుడ్ మూవీ ‘యాంట్ మ్యాన్’ తాజా వెర్షన్ కూడా ‘పఠాన్’ కలెక్షన్స్‌ను ప్రభావితం చేయలేక΄ోయింది. -
ఆసీస్‌పై విజయం.. డ్యాన్స్‌తో అదరగొట్టిన కోహ్లి, జడ్డూ
నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్ జడేజా, అశ్విన్ స్పిన్ మాయాజాలం దెబ్బకు రెండున్నర రోజుల్లోనే ముగిసిపోయింది. 224 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ అశ్విన్ దెబ్బకు 91 పరుగులకే కుప్పకూలింది. ఇక బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన జడేజాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. కాగా మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలు బాలీవుడ్ బ్లాక్బాస్టర్ పఠాన్ సినిమాలోని 'జూమే జో పఠాన్' సూపర్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్ స్టెప్పులతో అలరించారు. మొదట కోహ్లి డ్యాన్స్ మూమెంట్స్ చేయగా.. ఆ తర్వాత జడేజా అతన్ని అనుకరిస్తూ స్టెప్పులతో సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరగనుంది. Kohli & Jadeja doing jhoome jo pathaan step? 😂❤️ #INDvsAUS #pathaan #ShahRukhKhan𓀠 #ViratKohli𓃵 #RavindraJadeja pic.twitter.com/089U6NjOwg — Aarush Srk (@SRKAarush) February 11, 2023 చదవండి: IND VS AUS 1st Test: డేవిడ్ వార్నర్‌పై పగపట్టిన అశ్విన్ -
కళ్లు చెదిరే ధరకు పఠాన్ ఓటీటీ రైట్స్? స్ట్రీమింగ్ పార్ట్నర్ ఇదే!
చాలా కాలం తర్వాత కింగ్ ఖాన్ షారుక్ బాలీవుడ్‌కు బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించాడు. షారుక్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటించిన ‘పఠాన్ ’జనవరి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన తొలి రోజే రూ. 50 కోట్లకు పైగా రాబట్టి మంచి ఓపెనింగ్ ఇచ్చింది. విడుదలైన 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల కలెక్షన్స్ చేసి బాయ్‌కాట్ గ్యాంగ్ నోరు మూయించాడు షారుక్. చదవండి: నటుడిగా బ్రహ్మానందం ఎన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించాడో తెలుసా? వసూళ్లలో ఇప్పటికే కేజీయఫ్ 2, బాహుబలి వంటి పాన్ ఇండియా చిత్రాల రికార్డ్ బ్రేక్ చేసిన తొలి హిందీ చిత్రంగా పఠాన్ నిలిచింది. ఇక కలెక్షన్ల సునామీతో పఠాన్ చిత్రం ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ప్రస్తుతం థియేటర్లో అదే జోరును కొనసాగిస్తున్న పఠాన్ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఇదేనంటూ నెట్టింట ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైం వీడియోస్ భారీ ధరకు సొంతం చేసుకుందట. మేకర్స్‌తో అమెజాన్ కళ్లు చేదిరే ధరకు డీల్ కుదుర్చుకుందని సమాచారం. చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే.. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రన్ అనంతరం రెండు నెలల్లోపే ఓటీటీలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంటే ఈ తాజా సమాచారం ప్రకారం.. పఠాన్ మూవీ మార్చి మొదటి లేదా రెండో వారంలో ఓటీటీలోకి విడుదల కానుందని తెలుస్తోంది. ఇక పఠాన్ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సినీవర్గాల నుంచి సమాచారం. కాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షణ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించగా, సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించారు. -
‘పఠాన్’ సెలెబ్రేషన్స్‌లో షారుఖ్, దీపికా పదుకొణె (ఫొటోలు)
-
పిచ్చెక్కిస్తున్న పఠాన్... 4 రోజుల్లో రూ.400 కోట్లు!
'షారుక్‌ను ఆపొచ్చేమో కానీ పఠాన్‌ను ఎలా ఆపగలరు?' గతేడాది మార్చిలో కండలు తిరిగిన ఫోటో షేర్ చేస్తూ దానికి ఈ క్యాప్షన్ జోడించాడు షారుక్ ఖాన్. సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది. బాక్సాఫీస్ దగ్గర పఠాన్‌ను ఆపడం ఎవ్వరి తరం కానట్లే కనిపిస్తోంది. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ భారీ కలెక్షన్లు లేక బోసిపోయిన బాలీవుడ్‌కు కొత్త కళను తీసుకొచ్చింది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతూ రికార్డులు తిరగరాస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.429 కోట్లు రాబట్టింది. ఇందులో ఒక్క ఇండియాలోనే రూ.265 కోట్లు రాగా ఓవర్సీస్లో రూ.164 కోట్లు వసూలు చేసింది. దీంతో షారుక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా పఠాన్ సినిమాలో షారుక్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్గా నటించింది. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జాన్ అబ్రహం విలన్ పాత్రలో నటించాడు. ‘PATHAAN’: ₹ 429 CR WORLDWIDE *GROSS* IN 4 DAYS… #Pathaan WORLDWIDE [#India + #Overseas] *Gross* BOC… *4 days*… ⭐️ #India: ₹ 265 cr ⭐️ #Overseas: ₹ 164 cr ⭐️ Worldwide Total *GROSS*: ₹ 429 cr 🔥🔥🔥 pic.twitter.com/Qd8xriCFvX — taran adarsh (@taran_adarsh) January 29, 2023 ‘PATHAAN’ NEW MILESTONE: FASTEST TO HIT ₹ 250 CR… AGAIN OVERTAKES ‘KGF2’, ‘BAAHUBALI 2’, ‘DANGAL’… ⭐️ #Pathaan: Will cross ₹ 250 cr today [Day 5] ⭐️ #KGF2 #Hindi: Day 7 ⭐️ #Baahubali2 #Hindi: Day 8 ⭐️ #Dangal: Day 10 ⭐️ #Sanju: Day 10 ⭐️ #TigerZindaHai: Day 10#India biz. pic.twitter.com/DFsXcptErD — taran adarsh (@taran_adarsh) January 29, 2023 చదవండి: ఖరీదైన కారు కొన్న బుల్లితెర నటి సుశాంత్ చనిపోయేముందు మెసేజ్ వచ్చింది, కానీ నేనే పట్టించుకోలే -
వసూళ్ల వర్షం కురిపిస్తున్న పఠాన్, షారుక్ ట్వీట్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పఠాన్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. తొలిరోజు నుంచే వసూళ్ల వేట మొదటి పెట్టిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ వెండితెరపై సందడి చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 'వెనక్కు తిరిగిరావడం కోసం ప్లాన్ చేసుకోవద్దు. మున్ముందుకే అడుగులు వేయాలి. వెనక్కి తగ్గొద్దు. ప్రారంభించిన పనిని ముగించేందుకు ప్రయత్నించండి' అని సోషల్ మీడియాలో కింగ్ ఖాన్ సూచించారు. ఈ సినిమా విజయం పట్ల షారుక్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘PATHAAN’: ₹ 219.60 CR WORLDWIDE *GROSS* IN 2 DAYS… #Pathaan #India + #Overseas *Gross* BOC… ⭐️ Day 1: ₹ 106 cr ⭐️ Day 2: ₹ 113.60 cr ⭐️ Worldwide *GROSS* Total: ₹ 219.60 cr 🔥🔥🔥 pic.twitter.com/MFnr6gMK9z — taran adarsh (@taran_adarsh) January 27, 2023 Gattaca movie “I never saved anything for the swim back” I think life is a bit like that….You aren’t meant to plan your return…U r meant to move forward. Don’t come back…try to finish what u started. Just a 57yr olds’ advice things. — Shah Rukh Khan (@iamsrk) January 27, 2023 #Pathaan crosses ₹ 300 Crs Gross at the WW Box office in 3 days.. 🔥— Ramesh Bala (@rameshlaus) January 28, 2023 చదవండి: జమున బయోపిక్‌లో స్టార్ హీరోయిన్ కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున -
షారుక్ ఖాన్ పని అయిపోయిందంటూ ఆర్జీవీ ట్వీట్!
బాక్సాఫీస్ పని అయిపోయింది. హిందీ సినిమాలు ఆడే రోజులు పోయాయి. స్టార్ హీరోలు రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చోవాల్సిందే! కోట్లల్లో కలెక్షన్లు రాబట్టడం కేవలం కలే.. అన్నమాటలకు చెక్ పెట్టాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. అతడు ప్రధాన పాత్రలో నటించిన పఠాన్ సూపర్ డూపర్ హిట్టయింది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్ల పైచిలుకు గ్రాస్ రాబట్టి బాయ్‌కాట్ గ్యాంగ్‌కు చెంపపెట్టు సమాధానమిచ్చింది వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దీనిపై వెరైటీగా స్పందించాడు. '1. ఓటీటీలు వచ్చాక థియేటర్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం కష్టమే. 2. షారుక్ ఖాన్ పని అయిపోయింది. 3. దక్షిణాది డైరెక్టర్స్లా.. బాలీవుడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ సాధించడం జరగని పని. 3. కేజీఎఫ్ 2 మొదటిరోజు కలెక్షన్స్ బ్రేక్ చేయడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుంది... ఈ అపోహలన్నింటినీ పఠాన్ పఠాపంచలు చేసింది' అని ట్వీట్ చేశాడు. వర్మ పఠాన్ మూవీని ఓవైపు విమర్శిస్తున్నట్లుగా కనిపించినా చివరాఖరికి మాత్రం మెచ్చుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 1. Theatre collections will never be great again in times of OTT 2. SRK is a fading star 3. Bollywood can never make a COMMERCIAL BLOCKBUSTER like the south masala directors 4. It will take years to break the day 1 collections of KGF 2 ALL above MYTHS broken by PATHAN — Ram Gopal Varma (@RGVzoomin) January 27, 2023 చదవండి: హనీరోజ్‌ను గుర్తుపట్టారా? 15 ఏళ్ల క్రితమే తెలుగులో! నన్ను హత్య చేసేందుకు కుట్ర: సంచలన ఆరోపణలు చేసిన నరేశ్ -
బాయ్‌కాట్ చేయాల్సింది ఇదీ!
ఇది నిజంగా అసాధారణమే. ఒక జాతీయ పార్టీ కీలక సారథి, అందులోనూ ప్రధానమంత్రి హోదాలో దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి ఈ తరహా సూచన చేయడం మునుపెన్నడూ కనలేదు, వినలేదు. సినిమాల లాంటి అసంగతమైన వాటిపై అనవసర వ్యాఖ్యలు చేసి, మన కఠోరశ్రమపై నీలినీడలు కమ్ముకొనే పరిస్థితి తేవద్దని ప్రధాని నరేంద్ర మోదీ అధికార బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఇటీవల అన్నారన్న వార్త అందుకే ప్రధానమైనది. మోదీ వ్యాఖ్యలకు తాజా ప్రేరణ – షారుఖ్ ఖాన్ నటించిన తాజా హిందీ చిత్రం ‘పఠాన్’పై కొందరు బీజేపీ నేతలు చేస్తున్న విపరీత వ్యాఖ్యలు, వివాదాలు. ఒకపక్క సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ప్రచారాలు, మరోపక్క సినీ ప్రముఖుల గత చరిత్రలు, సినిమాల్లో దుస్తులపై అత్యుత్సాహ రాజకీయ దుమారాలు కలసి కొన్నేళ్ళుగా హిందీ చిత్ర సీమ ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ మోదీ మాట ఒకింత ఊరట. ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో ఇచ్చినప్పటికీ ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి సలహా ఇవ్వాల్సిన పరిస్థితి రావడం దేశంలో నెలకొన్న అసహన వాతావరణానికి అద్దం పడుతోంది. సోషల్ మీడియాలో హిందీ సినీ పరిశ్రమను కొన్నాళ్ళుగా వెంటాడుతున్న భూతం – బాయ్‌కాట్ ప్రచారం. విమర్శలు, ట్రోలింగ్‌ల నుంచి చివరకిది సంక్షోభం స్థాయికి వెళ్ళింది. ఆ మాటకొస్తే కొన్ని సినిమాలపై విద్వేష ప్రచారాలు, బాయ్‌కాట్ పిలుపులతో గడచిన 2022 ‘బాయ్‌కాట్ బాలీవుడ్’ నామ సంవత్సరంగా పాపులరైంది. చిత్రంగా బాయ్కాట్లేవీ జనంలో నుంచి తమకు తాము వచ్చి నవి కాదు. కొన్ని ట్విట్టర్ ఖాతాలు, వెబ్సైట్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల తతంగం. ప్రత్యేకించి నిర్ణీత సినిమాలపైనే, వాటి రిలీజ్ వేళే సోషల్ మీడియా విద్వేషం వెళ్ళగక్కడం, మతోన్మాదపు మాటలతో లక్షలకొద్దీ ట్వీట్లు వెల్లువెత్తడం ఓ పకడ్బందీ పథకమే. నిరుడు అలియా భట్ ‘డార్లింగ్స్’, ఆమిర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్ఢా’, విజయ్ దేవరకొండ ‘లైగర్’, రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’– ఇలా అనేకం బాయ్‌కాట్ విద్వేషం బారిన పడ్డవే. ఆ వరుసలో తాజా చేరిక ‘పఠాన్’. ఈ యాక్షన్–థ్రిల్లర్ గూఢచారి చిత్రం 57 ఏళ్ళ వయసులో షారుఖ్ కెరీర్‌తో పాటు కరోనా నుంచి కుదేలైన హిందీ చిత్రసీమనూ మళ్ళీ పట్టాలెక్కిస్తుందని ఓ ఆశ. ఆ పరిస్థితుల్లోఅందులోని ‘బేషరమ్’ పాటపై, ఆ పాటలో నాయిక ధరించిన ఆరెంజ్ రంగు బికినీపై, పాటలోని కొన్ని పదాలపై మధ్యప్రదేశ్ మంత్రి సహా విశ్వహిందూ పరిషత్ తదితర మితవాద సంస్థలు నిరసనల మొదలు నిషేధాల బెదిరింపుల దాకా వెళ్ళారు. చివరకు తమ నియామకమైన సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ ప్రసూన్ జోషీ చేతనే ధర్మోపన్యాసాలు చెప్పించి, భావప్రకటనా స్వేచ్ఛను గాలికొదిలి సినిమాలో మార్పులు చేయించడం అప్రజాస్వామికమే. అధికార పక్షానికి దగ్గరైన సినీ పెద్దలకూ ఈ సెగ తగిలి, కథ విదేశీ మీడియా దాకా వెళ్ళిందంటే తప్పెవరిది? ఎప్పుడూ పెదవి విప్పని అమితాబ్ సైతం కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదికపై పౌరహక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడాల్సి వచ్చింది. హీరో సునీల్ శెట్టి అస్తుబిస్తయిన చిత్రసీమ అవస్థను యూపీ సీఎంకు మొరపెట్టుకోవాల్సి వచ్చింది. పరిస్థితి చేయిదాటినప్పటికీ, ఇప్పటికైనా ప్రధాని తన వారికి సుద్దులు చెప్పడం చిరు సాంత్వన. అయినా సరే గోల పూర్తిగా సద్దుమణగలేదు. హిందూ స్వామీజీ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఏకంగా ‘ధర్మ సెన్సార్ బోర్డ్’ పెట్టి, సినిమాల్లో సనాతన ధర్మ వ్యతిరేకత ఉంటే అడ్డుకుంటామనడం పరాకాష్ఠ. జన్మనిచ్చిన తల్లితండ్రుల నుంచి ఇస్లామ్ ధర్మాన్ని గ్రహించి, క్రైస్తవ పాఠశాలలో చదువుకొని, ఢిల్లీ రామ్‌లీలా ఉత్సవాల్లో వానర వీరుడిగా నటించి, ‘జై సీతారామ్కీ’ అని నినదించి, హిందూస్త్రీని వివాహమాడి, పిల్లల్ని లౌకిక భారతీయులుగా పెంచుతున్న షారుఖ్ ఇవాళ ఈ ఉన్మాదులకు తన నిజాయతీని నిరూపించుకోవాల్సి రావడం సమాజానికే సిగ్గుచేటు. సెన్సారైన సినిమాలు సైతం కొన్నేళ్ళుగా చిక్కుల్లో పడుతున్నాయి. ఇందిరా గాంధీ కాలపు ‘ఆంధీ’, ‘కిస్సా కుర్సీకా’ నుంచి టీవీ సీరియల్ ‘తమస్’ (1988) మీదుగా ఇటీవలి ‘పద్మావత్’ (2018) దాకా అనేక చిత్రాలు కుల, మత, రాజకీయాల పేర అభ్యంతరకర చిత్రీకరణ అంటూ మూకస్వామ్యం పాలబడ్డాయి. సెన్సార్ సర్టిఫికెట్లకూ, చట్టానికీ అతీతంగా వ్యవహరిస్తున్న రాజకీయ, నైతిక పోలీసు మూకల ముందు మోకరిల్లాల్సి వస్తున్న సినీసీమ ఇకనైనా ఒక్కతాటిపైకి రావాలి. సెన్సార్ బోర్డ్ సంస్క రణలపై మళ్ళీ చర్చ లేవనెత్తాలి. ఒకప్పుడు సెన్సార్ బోర్డ్ నిర్ణయాలపైనా అప్పీల్ చేసుకొనేందుకు అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉండేది. ఘనత వహించిన సర్కార్ గత ఏడాది దాన్ని ఏకపక్షంగా రద్దు చేసేసింది. ఇక, 2016 నాటి శ్యామ్‌బెనెగల్ కమిటీ, 2013 నాటి జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీల సిఫార్సులకు అతీగతీ లేదు. వాటిని అమలు చేసేలా పాలకులను ఒప్పిస్తే మంచిది. ఏమైనా, దేశంలో అన్నిటికీ అసహనం పెరిగిపోతున్న వేళ కళను కళగా చూడడం నేర్చుకోవాలి. అసభ్యాలు, అభ్యంతరాలుంటే అడ్డుకోవడానికి ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన సెన్సార్ బోర్డ్, పోలీసు వ్యవస్థ ఉండనే ఉన్నాయి. వాటిని తోసిరాజని రాజ్యాంగేతర నైతిక సెన్సారింగ్, పోలీసింగ్ చేయాలనుకోవడమే పెద్ద తప్పు. వీటికి తక్షణం అడ్డుకట్ట పడకపోతే... అనేక కులాలు, ధర్మాలు, భావజాలాల సహజీవనంతో రంగురంగుల ఇంద్రచాపమైన మన సంస్కృతి మొత్తానికీ ఒకే దేశం – ఒకే భావజాలం – ఒకే సంస్కృతి అనే దురవస్థ పడుతుంది. అప్పుడు కళ కాంతి తప్పుతుంది. వేల ఏళ్ళ చరిత్ర గల భారతావని కళవళ పడుతుంది. తస్మాత్ జాగ్రత్త! -
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే!
ఈ ఏడాదికి స్టార్ హీరోలు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. సంక్రాంతి బరిలో దిగిన బడా హీరోల సినిమాలన్నీ సక్సెస్ కావడంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి ముగిసిపోయింది. దాదాపు రెండు వారాల తర్వాత కొత్త సినిమాలు థియేటర్లో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాయి. మరి జనవరి చివరి వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో చూసేద్దాం.. థియేటర్లో సందడి చేసే సినిమాల జాబితా.. ♦ పఠాన్ - జనవరి 25 ♦ హంట్ - జనవరి 26 ♦ గాంధీ.. గాడ్సే.. ఏక్ యుధ్ - జనవరి 26 ♦ సిందూరం - జనవరి 26 ♦ Who Am I - జనవరి 27 ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు, సిరీస్‌లివే! ఆహా ♦ 18 పేజెస్ - జనవరి 27 అమెజాన్ ప్రైమ్ వీడియో ♦ ఎంగ్గా హాస్టల్ (తమిళ్) - జనవరి 27 ♦ షాట్‌గన్ వెడ్డింగ్ (హాలీవుడ్)- జనవరి 27 ♦ యాక్షన్ హీరో (హిందీ) - జనవరి 27 హాట్‌స్టార్ ♦ ఎక్స్ట్రార్డినరీ (వెబ్‌సిరీస్) - జనవరి 25 ♦ డియర్ ఇష్క్(హిందీ) - జనవరి 26 ♦ సాటర్ డే నైట్ (మలయాళం) - జనవరి 27 నెట్‌ఫ్లిక్స్ ♦ నార్విక్(హాలీవుడ్) - జనవరి 23 ♦ బ్లాక్ సన్‌షైన్ బేబీ(డాక్యుమెంటరీ) - జనవరి 24 ♦ 18 పేజెస్ - జనవరి 27 జీ5 ♦ అయలీ (తెలుగు/తమిళ సిరీస్) - జనవరి 26 ♦ జాన్బాజ్ హిందుస్థాన్ కీ (హిందీ,తెలుగు, తమిళ్) - జనవరి 26 -
షారుఖ్ ఖాన్ ఫోన్ చేసి బాధపడ్డారు: అసోం సీఎం
గువహటి: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనకు ఆదివారం ఉదయం 2 గంటలకు ఫోన్ చేశారని తెలిపారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. గువహటిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్‌పై దాడి జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఈ విషయంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చానని, శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని చెప్పానని వివరించారు. అయితే శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో షారుఖ్ ఖాన్ అంటే ఎవరో తనకు తెలియదన్నారు హిమంత. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నుంచి చాలా మంది తనకు ఫోన్ చేస్తారని, కానీ ఇప్పటివరకు ఆ ఖాన్ ఎవరో తనకు కాల్ చేయలేదని పేర్కొన్నారు. ఒకవేళ అతను ఫోన్ చేస్తే సమస్యల గురించి ఆలోచిస్తానన్నారు. ఆ మరునాడే షారుఖ్ హిమంతకు ఫోన్ చేయడం గమనార్హం. షారఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ఈనెల 25న దేశవ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే ఈ చిత్రంలోని ఓ పాటలో హీరోయిన్ దీపికా పదుకొనే కాషాయం రంగు బికినీలో కన్పించింది. దీన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే గువహటిలోని నరెంగిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్‌పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో షారుఖ్ ఖాన్ స్వయంగా సీఎంకు ఫోన్ చేశారు. చదవండి: జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు -
పఠాన్ టికెట్ ఇప్పించండి.. లేదంటే చచ్చిపోతా: షారుక్ ఫ్యాన్ ఆవేదన
పలు వివాదాల తర్వాత బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ పఠాన్ చిత్రం ఎట్టకేలకు విడుదల కాబోతోంది. హై వోల్డేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో రూపొందిన ఈ మూవీ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు అయిదేళ్ల తర్వాత షారుక్ వెండితెరపై సందడి చేయబోతోంది. దీంతో ఈ చిత్రంపై బాద్షా ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో షారుక్ వీరాభిమాని ఓ వీడియో షేర్ చేశాడు. తనకు పఠాన్ మూవీ టికెట్ ఇప్పించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ రియాన్ అనే అభిమాని ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. ఈ మేరకు అతడు ట్విటర్లో వీడియో షేర్ చేశాడు. ‘నేను షారుక్ ఖాన్‌కు వీరాభిమానిని. ఐ లవ్ మై షారుక్. జనవరి 25న నేను పఠాన్ మూవీ చూడాలి, షారుక్‌ను కలవాల్సిందే. కానీ సినిమా టికెట్ కొనడానికి నా దగ్గర డబ్బు లేదు. ప్లీజ్ నాకు ఎవరైనా సాయం చేయండి. పఠాన్ మూవీ టికెట్ పంపించండి. ప్లీజ్ భయ్యా నాకు మద్దతు ఇవ్వండి. లేదండే ఈ పౌండ్లో దూకి ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరి అతడికి మద్దతుగా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నీ వల్ల ఈ దేశానికి, నీ కుటుంబానికి ఏం ఉపయోగం లేదు. ఎంటర్టైన్మెంట్ కోసం జీవితాన్నే పొగొట్టుకునేందుకు సిద్దపడ్డావు. ఈ సినిమా వల్ల నీ జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా? ఇదేం నీకు గుర్తింపు, గౌరవం ఇవ్వదు. సినిమాకు వినోదంలా మాత్రమే చూడండి’ అంటూ కామెంట్ చేయగా ‘మీరు ఎక్కడ ఉంటారు భయ్యా.. నేను మీకు సాయం చేస్తాను’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ‘మరి ఇంత డ్రామా చేయకు’ అంటూ ఇంకో నెటిజన్ వ్యంగ్యంగా స్పందించాడు. కాగా పఠాన్ మూవీ టికెట్లు ఇప్పటికే లక్షకు పైగా అడ్వాన్స్ బుక్ అయినట్లు ట్రెడ్ వర్గాల నుంచి సమాచారం. #Pathaan plz support me friends plz Pathaan 1 tickets plz help 😭😭 #PathaanMovie #PathaanFirstDayFirstShow pic.twitter.com/1ue59cw2OJ — Riyan (@Riyan0258) January 19, 2023 -
పఠాన్.. షారుక్ ఖాన్ పారితోషికం అంతేనా?
సుమారు ఐదేళ్ల విరామం తర్వాత పఠాన్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్. అతడిని స్క్రీన్‌పై ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా పఠాన్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు షారుక్ ఎంత పారితోషికం తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. బీటౌన్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం షారుక్ రూ.35 - 40 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకున్నాడట. ఇంతేనా అనుకోకండి. షారుక్ పారితోషికంతో పాటు తన సినిమాకు వచ్చే లాభాల్లో కొంత వాటా కూడా తీసుకుంటాడు. అంటే రెమ్యునరేషన్ తక్కువే అయినప్పటికీ సినిమాకు వచ్చే లాభాలతో భారీగా ఆర్జిస్తాడన్నమాట. ఇకపోతే పఠాన్ మూవీ తొలిరోజు రూ.35-40 కోట్ల మేర వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని సినీపండితులు అంచనా వేస్తున్నారు. మరి షారుక్ తన రికార్డులను తానే తిరగరాస్తాడా? లేదా? అనేది చూడాలి! చదవండి: పెళ్లి చేసుకున్న ప్రతినిధి హీరోయిన్, ఫోటోలు వైరల్ నన్ను అపార్థం చేసుకున్నారు, రోజూ ఏడ్చేదాన్ని: రష్మిక -
పఠాన్ మూవీ రన్ టైం లాక్.. ‘బెషరమ్ రంగ్’ పాటకు 3 సెన్సార్ కట్స్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం పఠాన్. విడుదలకు ముందే వివాదంలో చిక్కుకున్న ఈ సినిమా ఎట్టకేలకు రెడీ అయ్యింది. హై వొల్టేజ్ యాక్షన్ డ్రామాగా పఠాన్ జవవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల సెన్సార్‌కు వెళ్లిన ఈ సినిమాకు బోర్డు షాకిచ్చిన సంగతి తెలిసిందే. పఠాన్‌కు యూ/ఏ సర్టిఫికేట్ కావాలంటే తాము సూచించిన విధంగా మార్పులు చేసుకురమ్మని మూవీ టీంను ఆదేశించారు సెన్సార్ బోర్డు సభ్యులు. పలు మార్పుల అనంతరం రెండోసారి సెన్సార్‌కు వెళ్లిన ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. చదవండి: అమలాపాల్‌కు చేదు అనుభవం, వివాదాస్పదంగా టెంపుల్ సంఘటన! అయితే ఈ చిత్రంలో మొత్తం 11పైగా పలు అభ్యంతకర సన్నివేశాల సెన్సార్ కట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వివాదంలో నిలిచిన బెషరమ్ రంగ్ పాటలో దీపికాకు చెందిన 3 క్లోజప్ షాట్స్‌ను తొలగించినట్లు సమాచారం. అలా పలు కట్స్ అనంతరం ఆ మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసిందట. ఫైనల్‌గా మూవీ నిడివి 146.16 నిమిషాలు(2 గంటల 26 నిమిషాల 16 సెకన్లు) లాక్ అయ్యింది. కాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించాడు. ఇందులో షారుక్ గూఢచారిగా కనిపించనున్నాడు. ఈ చిత్రానికి విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నాడు. చదవండి: ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డాను: సీనియర్ నటి జయమాలిని -
నాటు నాటుకు డ్యాన్స్ చేశా!
షారుక్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ హిందీ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు హీరో రామ్‌చరణ్. ఈ సందర్భంగా ట్విట్టర్లో తనదైన స్టైల్లో రామ్‌చరణ్‌కి కృతజ్ఞతలు చెప్పారు షారుక్ ఖాన్. ‘‘థ్యాంక్యూ సో మచ్. నా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. మీ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకొచ్చినప్పుడు దయచేసి నన్ను తాకనివ్వండి.. లవ్యూ’’ అని ట్వీట్ చేశారు షారుక్. ‘‘తప్పకుండా ఎస్ఆర్కే సార్. ఈ అవార్డు ఇండియన్ సినిమాకు చెందింది’’ అని పోస్ట్ చేశారు చరణ్. కాగా ‘నాటు నాటు..’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించడం పట్ల షారుక్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. ఉదయం వార్త తెలిసిన వెంటనే ‘నాటు నాటు..’ పాటకు డ్యాన్స్ చేశానని ట్విట్టర్లో వెల్లడించారు. భారత్‌ను గర్వపడేలా చేశారని ప్రశంసించారు. -
‘కింగ్ ఖాన్’ బర్త్‌డే సర్ప్రైజ్.. పఠాన్ టీజర్ వదిలిన మూవీ టీం
నాలుగేళ్ల తర్వాత బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్ నటించిన చిత్రం పఠాన్. 2018లో వచ్చిన జీరో మూవీ ప్లాప్‌తో ఆయన సినిమాలకు కాస్తా విరామం తీసుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత యాక్షన్ ఎంటర్టైనర్ పఠాన్‌తో మూవీతో బౌన్స్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు షారుక్. ఇదిలా ఉంటే నేడు షారుక్ బర్త్‌డే. ఈ సందర్భంగా కింగ్ ఖాన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు పఠాన్ మేకర్స్. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘పఠాన్ గురించి నీకు ఏం తెలుసు?’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ను ఫైట్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఆసక్తిగా మలిచారు. ‘‘మూడేళ్ల నుంచి అతడి జాడ లేదు. చివరి మిషన్‌లో అతడు పట్టుబడ్డాడు. చదవండి: మరోసారి విష్ణుప్రియ ఫేస్బుక్లో అశ్లీల వీడియోలు కలకలం! ‘ఎందుకిలా చేస్తోంది?’ అతడిని వేధించారని విన్నా. పఠాన్ ఇంకా బతికే ఉన్నాడో లేదో తెలియదు’’ అనే డైలాగ్‌తో షారుక్ పాత్రని పరిచయం చేశారు. ‘బతికే ఉన్నా’ అంటూ టీజర్లో బాద్షా ఎంట్రీ ఫ్యాన్స్ చేత ఈళలు వేయించడం ఖాయం అనిపిస్తోంది. ఇంతకీ ఈ పఠాన్ ఎవరు? అతడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? ఇందులో జాన్ అబ్రహం పాత్ర ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె హీరోయిన్గా నటించిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 25న ఈసినిమా విడుదల కానుంది. చదవండి: ‘గాడ్ ఫాదర్’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఆ రోజు నుంచే స్ట్రీమింగ్? View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk)