బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు ‘పఠాన్’. షారుక్ ఖాన్ టైటిల్ రోల్‌లో నటించిన హిందీ స్పై ఫిల్మ్ ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదుకోన్, జాన్ అబ్రహాం ప్రధాన పాత్రలు పో షించగా, డింపుల్ కపాడియా, అశుతోష్ రాణా కీ రోల్స్ చేశారు.
దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 25న విడుదలైంది. ఫిబ్రవరి 20 (సోమవారం) కి ‘పఠాన్’ చిత్రం రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ ప్రతినిధులు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
దేశంలో 623.. విదేశాల్లో 377 కోట్లు
దేశవ్యాప్తంగా రూ. 623 కోట్ల గ్రాస్, ఓవర్‌సీస్‌లో రూ. 377 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను ‘పఠాన్’ రాబట్టిందని చిత్ర యూనిట్ పేర్కొంది. అలాగే సినిమా విడుదలైన తొలి దశలోనే రూ. 1000 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన తొలి హిందీ చిత్రంగా కూడా ‘పఠాన్’ నిలిచిందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘దంగల్’ చిత్రం ఆల్రెడీ వెయ్యి కోట్లు వసూలు చేసిన హిందీ చిత్రంగా రికార్డుల్లో ఉంది. అయితే తొలిసారి రిలీజ్ చేసినప్పుడే ఈ ఫీట్ సాధించలేదట.
ఆ తర్వాత కొన్ని నెలలకు చైనాలో రిలీజ్ చేశాక ఈ సినిమా వసూళ్లు జోరందుకున్నాయని, దీంతో ‘దంగల్’ వెయ్యి కోట్లు వసూలు చేసిన హిందీ చిత్రంగా నిలిచిందని బాలీవుడ్ టాక్. ఇక విడుదలైన తక్కువ రోజుల్లోనే రూ. 250 కోట్లు వసూలు చేసిన తొలి హిందీ చిత్రం ‘పఠాన్’ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ‘దంగల్’ తర్వాత హిందీలో వెయ్యి కోట్లు సాధించిన రెండో చిత్రం రికార్డ్ ‘పఠాన్’దే. కాగా తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఐదో ఇండియన్ సినిమా
భారతీయ చిత్రాల్లో రూ. 1000 కోట్లు వసూళ్లను సాధించిన తొలి సినిమా రికార్డు ప్రభాస్ ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ దక్కించుకుంది. ఆ తర్వాత ఆమిర్ ఖాన్ ‘దంగల్’, ఎన్టీర్ – రామ్‌చరణ్‌ల ‘ఆర్‌ఆర్‌ఆర్’, యశ్ ‘కేజీఎఫ్’ చిత్రాలు ఉన్నాయి. అయితే అత్యధిక వసూళ్ల పరంగా మాత్రం ఈ జాబితా కాస్త మారుతుంది.
ఈ లెక్కల ప్రకారం ‘దంగల్’ (దాదాపు 2000 కోట్లు) తొలి స్థానంలో ఉండగా, ఆ తర్వాత ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ దాదాపు 1800 కోట్లు, కేజీఎఫ్: ఛాప్టర్ 2 దాదాపు 1200 కోట్లు, దాదాపు‘ఆర్‌ఆర్‌ఆర్’ 1200 కోట్లు (ప్రస్తుతానికి జపాన్ వసూళ్లను కలుపుకుని... ఇంకా అక్కడ ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రదర్శితమవుతోంది) సాధించాయి.
బాద్‌షా ఈజ్ బ్యాక్
‘పఠాన్’కు ముందు షారుక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ‘జీరో’ (2018). ఈ చిత్రం పరాజయాన్ని చవి చూసింది. దీంతో షారుక్ మరో చిత్రం ఒప్పుకోవడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఎన్నో కథలు విని ఫైనల్‌గా ‘పఠాన్’కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. షారుక్ నిర్ణయం ఎంత కరెక్టో ఈ సినిమా వసూళ్లు చెబుతున్నాయని బాలీవుడ్ అంటోంది. అలాగే నాలుగేళ్ల తర్వాత ఈ బాలీవుడ్ బాద్‌షా బ్లాక్‌బాస్టర్ హిట్ సాధించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
నిజానికి ‘పఠాన్’ రూ. 970 కోట్ల (22 రోజులకు) గ్రాస్ సాధించిన సమయంలో వసూళ్లు కాస్త నెమ్మదించాయి. దీంతో సినిమా యూనిట్ టికెట్ ధరలను తగ్గించింది. ప్రముఖ మల్టీప్లెక్స్‌లలో ఒక రోజు మొత్తం రూ. 110కే టికెట్స్‌ను అమ్మారు. ఆ తర్వాత కూడా కొన్ని మల్టీ ప్లెక్స్‌లలో ‘పఠాన్’ సినిమా టికెట్ ధరలు కాస్త తగ్గి ఉన్నాయి.
ఎప్పుడైతే టికెట్ ధర తగ్గిందో అప్పుడు ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. ఇదే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరేందుకు దోహదపడిందని తెలుస్తోంది. అలాగే కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘సెహ్‌జాదా’ (తెలుగు హిట్ ‘అల.. వైకుంఠపురములో..’ హిందీ రీమేక్) సినిమా ఫిబ్రవరి 10న విడుదల కావాల్సింది.
కానీ ‘పఠాన్’ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని వారం రోజులు ఆలస్యంగా అంటే ఫిబ్రవరి 17న రిలీజ్ చేశారు. అయితే ‘సెహ్‌జాదా’ హిందీ బాక్సాఫీస్‌పై ప్రభావం చూపలేకపోయింది. కానీ ఈ సినిమా వారం రోజులు ఆలస్యంగా విడుదల కావడం మాత్రం బాక్సాఫీస్ పరంగా ‘పఠాన్’కు కలిసొచ్చిందనే చెప్పాలి. అలాగే ఫిబ్రవరి 17న విడుదలైన హాలీవుడ్ మూవీ ‘యాంట్ మ్యాన్’ తాజా వెర్షన్ కూడా ‘పఠాన్’ కలెక్షన్స్‌ను ప్రభావితం చేయలేక΄ోయింది.
Comments
Please login to add a commentAdd a comment