షారుఖ్‌ రూ. 5 కోట్ల లగ్జరీ వాచ్‌ : నెటిజన్ల జోక్స్‌ వైరల్‌ | Shah Rukh Khan's Rs 5 Crore Watch, Netizens Jokes Goes Viral | Sakshi
Sakshi News home page

షారుఖ్‌ రూ. 5 కోట్ల లగ్జరీ వాచ్‌ : నెటిజన్ల జోక్స్‌ వైరల్‌

Published Mon, Mar 25 2024 2:14 PM | Last Updated on Mon, Mar 25 2024 3:07 PM

Shah Rukh Khan Rs 5 Crore Watch Netizens Jokes goes viral - Sakshi

షారుఖ్ ఖాన్ తన రూ. 5 కోట్ల వాచ్

మాకు రూ. 200 లకే : నెటిజన్ల జోక్స్‌ వైరల్‌

గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో బాలీవుడ్ కింగ్ ఖాన్  షారుఖ్ ఖాన్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా  కాదు. గత కొన్నేళ్లుగా  ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల కొద్దీ అభిమానుల ఫాలోయింగ్‌, కోట్లాది రూపాయల సంపద,  ఖరీదైన వస్తువులు, లగ్జరీ లైఫ్‌ ఆయన సొంతం. తాజాగా  కింగ్‌ ఖాన్‌  లగ్జరీ వాచ్‌ వార్తల్లో నిలిచింది.   నీలిరంగు Audemars Piguet చేతి గడియారం దాని ధర  చూసి ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. దీని ధర సుమారు . 5 కోట్లు.  అయితే ఈ వాచ్‌ ధరపై నెటిజన్లు కమెంట్లు హాట్‌టాపిక్‌గా లిచాయి

ఆడెమర్స్ పిగెట్  బ్రాండ్‌కు  చెందిన రాయల్ ఓక్  వాచ్‌ను తన బ్లాక్‌బస్టర్ మూవీ పఠాన్ ప్రమోషన్‌ సమయంలో దీన్ని ధరించి అందర్నీ విస్మయ పర్చిన సంగతి తెలిసిందే. దీని డెలివరీ కోసం  రూ. 8 వేలకు చెల్లించాడంటేనే  దీని ప్రాముఖ్యతను  అర్థం చేసుకోవచ్చు. 

ఆడెమర్స్ వెబ్‌సైట్ ప్రకారం ఇది  బ్లూ-హ్యూడ్ స్టార్రి-నైట్ పీస్. ఇదిచాలా లిమిటెడ్‌ వెర్షన్‌ కూడా.  ఈ వాచ్ డిజైన్, బిల్డ్ విషయాలను గమనిస్తే..ఇందులో నాలుగు డయల్స్‌ ఉంటాయి. ఇందులో సమయంతోపాటు, నెలలు, రోజులు తదితర వివరాలు కూడా ఉంటాయి. దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్  T20  సందర్భంగా కూడా ఈ వాచ్‌తో దర్శమనిచ్చాడు షారుఖ్‌. 

అయితే దీన్ని కొంతమంది అభిమానులు వెరైటీగా స్పందించారు. రూ. 500 అయితే ఏంటి, 5 కోట్లు చూపించే టైం ఒకటేగాఅని ఒకరు, మీషో, షాప్సీ వంటి ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్‌లో  200 రూపాయలకే దీన్ని కొనుక్కోవవచ్చు. అంతేకాదు ఇంతకంటే మంచి వాచ్‌లు దొరుకుతాయంటూ వ్యాఖ్యానించడం విశేషం.షారుఖ్ ఖాన్ ఆడెమర్స్ పిగ్యెట్ రాయల్ ఓక్ వాచెస్‌  కలెక్షన్‌లో ఖరీదైనది మరొకటి కూడా ఉంది.  నీతా అంబానీ నేతృత్వంలోని ఎన్‌ఎంఏసీసీ ఈవెంట్‌లో  కింగ్ ఖాన్‌ దీన్ని ధరించాడు. దీని ధర  రూ. 31.1 లక్షలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement