సెలబ్రిటీల లైష్స్టైల్, వారుండే విలాసవంతమైన భవనాలు, వాడే కార్లపై ఉండే అసక్తి ఇంతా అంతా కాదు. అతిలోకి సుందరి వారసురాలు, టాలీవుడ్లో దేవర మూవీతో దుమ్మురేపిన బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ ఇల్లు అంటే క్రేజ్ మామూలుగా ఉండదుగా. సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి ముంబైలోని విలాసవంతమైన డూప్లెక్స్‌లో నివసిస్తుంది. పాలి హిల్‌లోని విలాసవంతమైన ఈ భవనం విలువ రూ. 65 కోట్లు. తెలుపు రంగు థీమ్‌తో నిర్మించిన లేటెస్ట్, క్లాసిక్ ఇంటీరియర్‌కు నిదర్శనంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొరియోగ్రాఫర్ , ఫిల్మ్ మేకర్, ఫరా ఖాన్ ఇటీవల తన తాజా వ్లాగ్‌లో బోనీ కపూర్ అద్భుతమైన ముంబై భవనాన్ని సందర్శించింది. ఈ సందర్బంగా ఈ ఇంటి విశేషాలు సందడిగామారాయి పదండి అంత అదమైన భవనం, సౌకర్యాల గురించితెలుసుకుందాం.
ఫరాఖాన్ అందించిన వివరాల ప్రకారం తొలి చూపులోనే పాలి హిల్‌లోని కుబెలిస్క్ భవనం(Kubelisque Building) పాలరాయితో, లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటుంది. పెయింటింగ్‌లు, ఫోటోలు, ఇతర కళాఖండాలతో అలంకరించడం మరో ప్రత్యేకత. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలోని ఈ అపార్ట్‌మెంట్‌ను 2022లో కొనుగోలు చేసిందట జాన్వి.
తన జుహు అపార్ట్‌మెంట్‌ని రాజ్‌కుమార్ రావ్‌కి విక్రయించి మరీ ఆ ఇల్లును ఇంటిని 65 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీనికి స్టాంప్ డ్యూటీ 3 లక్షల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తుంది. రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా,సంజయ్ దత్ లాంటి స్టార్లు జాన్వీ ఇంటికి పక్కనే నివస్తుండటం విశేషం. ఇల్లు మొత్తం 8,669 చదరపు అడుగులతో నిర్మించారు. రెండు అంతస్తుల్లో అంతస్తులలో నిర్మించిన ఈ గృహంలో ఓపెన్ కిచెన్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్,పెద్ద ఓపెన్ గార్డెన్ ఉన్నాయి. బార్ ఏరియా కూడా ఉంది, ఇక్కడ కపూర్ పార్టీలు జరుగుతాయట.ఐదు కార్ల పార్కింగ్ సదుపాయం కూడా ఉంది.
శ్రీదేవి పెయింటింగ్
అలనాటి అందాల తారు శ్రీదేవి వేసిన పెయింటింగ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు ఇంట్లో బెడ్రూమ్లు ,ఇతర లివింగ్ రూంకు దారతీసే మెట్లు , పక్కనే భారీ అద్దం అందంగా అమర్చారు. అలాగే మరొక గోడ కుటుంబ ఫ్రేమ్ , దివంగత భార్య శ్రీదేవికి బోనీ కపూర్ కుమార్తెలు ఖుషీ . జాన్వీ నివాళులర్పించే ఫోటో, ఇతర మెమరీస్ ఫోటోలుగా అమరాయి.
పొడవైన చెక్క డైనింగ్ టేబుల్‌పై వేలాడుతున్న భారీ క్రిస్టల్ షాన్డిలియర్తో డైనింగ్ మరింత సొగసుగా ఉంటుంది. అలాగే ఈ ఇంట్లోని ఆర్ట్‌వర్క్ అంతా తన తల్లి శ్రీదేవే సెలెక్ట్ చేసినట్టు గతంలో ఒక సందర్బంగా స్వయగా జాన్వీనే తెలిపింది. తన తల్లి ఎంచుకున్న ఈ పెయింటింగ్స్, ఆర్ట్వర్క్లేనని ఆమె గుర్తు చేసుకుంది. అందుకే ఈ ఇంట్లో ఉంటే అమ్మతో ఉన్నటే, అమ్మ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుందని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment