mansion
-
కళ్లు చెదిరే ఈ భవనం కొనగలరా?
అమెరికన్ వ్యాపారవేత్త డార్విన్ డీసన్కు చెందిన లా జోల్లా ఎస్టేట్ 'ది శాండ్కాజిల్' రికార్డ్ ధరకు అమ్మకానికి వచ్చింది. 108 మిలియన్ డాలర్లు (సుమారు రూ.907 కోట్లు)కు లిస్టయింది. ఇది శాన్ డియాగో కౌంటీ రియల్ ఎస్టేట్‌కు రికార్డ్-బ్రేకింగ్ ధర.లిస్టింగ్‌లో పెట్టిన ధరకు అమ్ముడుపోతే ఈ సంవత్సరం ప్రారంభంలో డెల్ మార్ ఓషన్ ఫ్రంట్ ప్రాపర్టీని కొనుగోలు చేసిన బిలియనీర్ ఎగాన్ డర్బన్ పేరిట ఉన్న 44 మిలియన్ డాలర్ల ప్రస్తుత రికార్డును ఇది అధిగమిస్తుంది. అఫ్లియేటెడ్ కంప్యూటర్ సర్వీసెస్ (తర్వాత జిరాక్స్ సంస్థకు విక్రయించారు) స్థాపకుడు డార్విన్ డీసన్ 2009లో ఈ ఎస్టేట్‌ను, దాని పక్కనున్న స్థలాన్ని 26 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. తర్వాత దాని నిర్మాణం కోసం 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు.దాదాపు 13,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఎస్టేట్ ప్రైవేట్ ఎలివేటెడ్ బీచ్‌ను కలిగి ఉంది. అలనాటి ఐరోపా శైలిలో బంగారు పరదాలు, పాలరాతి ఫ్లోర్లు, ఆకృతులతో ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు. హాలీవుడ్ ప్రముఖులు, రాజ కుటుంబాల ఇళ్లకు డిజైన్ చేసిన ప్రఖ్యాత డిజైనర్ తిమోతీ కొరిగాన్ ఈ భవనానికి ఇంటీరియర్లను రూపొందించారు.ఇందులోని ఫర్నిచర్ ఫ్రెంచ్ సొగసుతో ఆకట్టుకుంటుంది. 16 మంది కూర్చునేందుకు వీలుగా రాజసమైన డైనింగ్ రూం, నాటికల్ నేపథ్యంతో తీర్చిదిద్దిన బార్ ఇందులో ఉన్నాయి. ఇక భవనం లోగిలిలో ఒక పూల్, ఫిట్నెస్ సెంటర్, చైనా స్లేట్ రూఫ్ టైల్స్‌తో కూడిన బీచ్ ఫ్రంట్ బోట్‌హౌస్ ఉన్నాయి. అగస్టా నేషనల్ గోల్ఫ్ క్లబ్ సిగ్నేచర్ వైట్ షేడ్ లాంటి లుక్ కోసం 40 వేల డాలర్లతో దిగుమతి చేసుకున్న ఇసుక ఈ భవనానికి వినిగియోగించారు. ఇంత విలాసవంతంగా భవనం నిర్మించుకున్నప్పటికీ దీన్ని పెద్దగా ఉపయోగించలేదని డీసన్ చెబుతున్నారు. -
అంబానీ ఇంటిని తలదన్నే ఇల్లు!! బెంగళూరులో..
దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏది అంటే టక్కున ముఖేష్ అంబానీది అనే చెప్పేస్తారు. ముంబైలో ఉన్న ఈ విలాసవంతమైన నివాసం పేరు ‘యాంటిలియా’. అయితే దీనిని తలదన్నే మ్యాన్షన్ బెంగళూరులో ఉంది. అది ఎవరిది.. దాని విలువ ఎంత.. ఇతర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం..400 అడుగుల ఎత్తు.. 33 అంతస్తుల లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్.. దానిపైన మ్యాన్షన్. రెండు అంతస్తుల్లో ఉన్న ఈ స్కై మ్యాన్షన్‌లో ఉన్న విలాసవంతమైన సదుపాయాల గురించి తెలిస్తే నోరెల్లబెడతారు. హెలిప్యాడ్, లష్ గార్డెన్స్, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, 360 డిగ్రీ వ్యూయింగ్ డెక్‌తో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.ప్రస్తుతం విదేశాలకు పరారైన, లిక్కర్ కింగ్‌గా పేరొందిన విజయ్ మాల్యాకు చెందిందే ఈ విలాసవంతమైన భవనం. కింగ్‌ఫిషర్ టవర్స్‌గా పిలిచే ఈ అపార్ట్మెంట్ బ్లాక్‌ను మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండే 4.5 ఎకరాల స్థలంలో నిర్మించారు. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ దీన్ని నిర్మించింది. ఈ ఇంటి విలువ 20 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.ఒక్క రోజు కూడా ఉండలేదుఇక అంబానీ కుటుంబానికి చెందిన ముంబై టవర్, యాంటిలియా దేశంలోని అత్యంత సంపన్నుల యాజమాన్యంలో ఉన్న మరో అద్భుతమైన ఇల్లు . దీని నిర్మాణానికి 2 బిలియన్ ఖర్చయినట్లు అంచనా. విలువపరంగా చూస్తే కింగ్‌ఫిషర్ టవర్స్ విలువ తక్కువే అయినా అంబానీ నివాసం 27 అంతస్తులు ఉంటే.. మాల్యా మ్యాన్షన్ ఉండే టవర్స్ 33 అంతస్తుల్లో ఉంది. అయితే ముచ్చట పడి కట్టించుకున్న ఈ మ్యాన్షన్‌లో విజయ్ మాల్యా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఇది ఇంకా నిర్మాణంలో ఉండగానే బ్యాంకులకు రుణాల ఎగవేత వ్యవహారంలో ఆయన దేశం వదిలి పారిపోయారు. -
రియల్ ఎస్టేట్ రికార్డ్.. రూ.1,754 కోట్ల ఇల్లు అమ్మకం
ఓక్లే అనే ఐవేర్ కంపెనీ వ్యవస్థాపకుడు జేమ్స్ జన్నార్డ్ ఇటీవల తన మాలిబు ప్రాపర్టీని 210 మిలియన్ డాలర్లకు (రూ.1,754 కోట్లు) విక్రయించి కాలిఫోర్నియాలో అత్యంత ఖరీదైన ఇంటి అమ్మకంలో కొత్త రికార్డు నెలకొల్పారు. రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేకమైన మాలిబు ప్రాంతంలో.. డెలావేర్ ఆధారిత లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ద్వారా ఈ విక్రయం జరిగింది. అయితే కొనుగోలుదారు ఎవరన్నది వెల్లడి కాలేదు.లాస్ ఏంజలెస్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. జానార్డ్ 2012లో బిలియనీర్ ఇన్వెస్టర్ హోవార్డ్ మార్క్స్ నుంచి 75 మిలియన్ డాలర్లకు ఈ ఓషన్ ఫ్రంట్ ఎస్టేట్ ను కొనుగోలు చేశారు. అంతకుముందు మార్క్స్ దీన్ని హెర్బాలైఫ్ సహ వ్యవస్థాపకుడు మార్క్ హ్యూస్ నుంచి 2002లో 31 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.ఇంటి ప్రత్యేకతలు ఇవే..15,000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీ ఎల్ పెస్కాడోర్ స్టేట్ బీచ్ కు ఆనుకుని ఉంది. దీనికి సొంత ప్రైవేట్ 300 అడుగుల స్ట్రెచ్ ఓషన్ ఫ్రంటేజ్ ఉంది. ప్రధాన నివాసంలో ఎనిమిది పడక గదులు, 14 బాత్ రూమ్ లు ఉన్నాయి. దీనికి అనుబంధంగా జిమ్, రెండు ప్రత్యేక గెస్ట్ హౌస్ లు ఉన్నాయి.ఈ అమ్మకంతో, మాలిబు ఇప్పుడు కాలిఫోర్నియా చరిత్రలో మూడు అత్యధిక గృహాల అమ్మకాలను కలిగి ఉంది. ప్రస్తుత అమ్మకపు ధర గత సంవత్సరం జే-జెడ్, బియోన్స్ వారి మాలిబు కాంపౌండ్ పై సాధించిన 200 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. 2021లో మాలిబు ప్యారడైజ్ కోవ్‌లో విస్తారమైన ఎస్టేట్‌ను 177 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించారు. -
విలాసవంతమైన ఆకాశహర్మ్యం: ఎవరిదో? ఎక్కడుందో తెలుసా?
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల ఎగవేసి లండన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మాల్యాకు చెందిన బెంగళూరులోని ప్రతిష్టాత్మక కింగ్ ఫిషర్ టవర్స్‌పై నిర్మించిన ఇంద్రభవనం లాంటి పెంట్‌హౌస్ గురించి ఎపుడైనా విన్నారా? దాదాపు 400 అడుగుల ఎత్తులో బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్ పైభాగంలోమాన్షన్ స్టైల్ పెంట్ హౌస్‌ను నిర్మించారు. ఒకపుడు అతని పూర్వీకులకు చెందిన 4.5 ఎకరాల భూమిపై టవర్, దానిపై పెంట్‌హౌస్‌ను రూపుదిద్దుకుంది. హెలీప్యాడ్, ఇన్ఫినిటీ పూల్ ఇలాంటి మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలు దీని సొంతం. హెలిప్యాడ్‌తో రెండు స్థాయిలలో (34- 35వ ఫోర్లు) 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని విలువ 20 వేల డాలర్లకు పైమాటే. This 20 million dollar mansion was built on top of Kingfisher Towers in Bengaluru, India pic.twitter.com/Zce8Kk6Lx4 — Historic Vids (@historyinmemes) March 19, 2024 మాల్యాకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (UBHL),ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్‌గా ఇది నిర్మితమైంది. ఇందులో యూబీహెచ్ఎల్కు 55 శాతం, ప్రెస్టీజ్ డెవలపర్‌కు 45 శాతం వాటా ఉంది. కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని ఫ్లాట్లను కూడా ఏడింటిని రూ.150 కోట్లకు విక్రయించిదంటే దీని క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. మొత్తం అమ్మకాలు 2013లోనే పూర్తి అయినట్టు భావిస్తున్నారు. అయితే మాల్యాపై మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో 2014లో UBHL ఫ్లాట్లను పెంట్ హౌస్‌ను విక్రయించకుండా దర్యాప్తు సంస్థలు నిషేధించాయి. దేశంనుంచి పారిపోయిన మాల్యాను తిరిగి దేశానికి రప్పించే ప్రయత్నంలో ఉంది కేంద్రం. -
ఆ దీవిలో ఏముంది? మరో భవంతి కొన్న అమెజాన్ ఫౌండర్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos).. ఫ్లోరిడాలోని ప్రత్యేకమైన ‘బిలియనీర్ బంకర్’ దీవిలో మరో భవంతిని కొనుగోలు చేశారు. దాదాపు 156 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్నుడైన బెజోస్ సుమారు 79 మిలియన్ డాలర్లు (రూ.659 కోట్లు) పెట్టి దీన్ని కొన్నారు. కాగా రెండు నెలల ముందే ఇదే దీవిలో ప్రస్తుతం కొన్న మాన్షన్‌కు పక్కనున్న భవంతిని 68 మిలియన్ డాలర్లకు బెజోస్ కొనుగోలు చేశారు. 7 బెడ్రూమ్లు అమెరికన్ రియల్ ఎస్టేట్ సంస్థ జ్లిలో (Zillow)లో ఈ ప్రాపర్టీ లిస్ట్ అయింది. అందులో పేర్కొన్న సమాచారం ప్రకారం.. ఈ భవంతిలో ఏడు పడక గదులు, 14 బాత్రూమ్లు ఉన్నాయి. ఈ మాన్షన్ విక్రయ ప్రక్రియ అక్టోబర్ 12న పూర్తయనట్లుగా పేర్కొన్నారు. ఈ భవంతి ధర 85 మిలియన్ డాలర్లు కాగా బెజోస్ 7.1 శాతం తగ్గింపుతో దక్కించుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో నిర్మించిన ఈ విశాలమైన 19,064 చదరపు అడుగుల నివాసం ఇండియన్ క్రీక్ ఐలాండ్ అని పిలిచే మానవ నిర్మిత ద్వీపంలో 1.84 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ద్వీపం బిస్కేన్ బే శివార్లలో ఒక కోటగా నిలుస్తోంది. దీనికి సొంత మునిసిపాలిటీ, మేయర్, పోలీసు బలగాలు ఉన్నాయి. జిల్లో లిస్టింగ్ ప్రకారం.. ఈ భవంతిలో కొలను, థియేటర్, లైబ్రరీ, వైన్ సెల్లార్, మెయిడ్స్ క్వార్టర్స్, ఆవిరి స్నానాలు, ఆరు గ్యారేజ్ స్పేస్‌లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ప్లాన్ అదేనా? 12 ఇండియన్ క్రీక్ ఐలాండ్ రోడ్ వద్ద నిర్పించిన ఈ విశాలమైన ఎస్టేట్.. గత ఆగస్ట్‌లో బెజోస్ కొనుగోలు చేసిన 68 మిలియన్ డాలర్ల ప్రాపర్టీకి పక్కనే ఉంది. ఈ ట్రిపుల్ బెడ్రూమ్ మాన్షన్‌ను తన గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ కోసం కొన్నారు. బెజోస్ ఈ భవంతిని కూల్చివేసి మెగామాన్షన్ను నిర్మించాలని భావిస్తున్నాడు. అయితే తాజాగా కొన్న భవంతిని కూడా ఇలాగే చేస్తారా అన్నది తెలియరాలేదు. జనాభా 81 ఇండియన్ క్రీక్ ఐలాండ్ దాదాపు 40 వాటర్ ఫ్రంట్ ప్రాపర్టీలకు నిలయం. ఈ ఐలాండ్‌లో 294 ఎకరాల విస్తీర్ణంలో గోల్ఫ్ కోర్సు ఉంది. విలాసవంతమైన ఓడల కోసం బ్రెజిలియన్ టేకు రేవులు ఇక్కడ ఉన్నాయి. బెజోస్ వద్ద ఉన్న 500 మిలియన్ డాలర్ల విలువైన సూపర్‌యాచ్ ‘కోరు’కు ఇది అనువైనది. అంతేకాకుండా ఇందులో హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయి. 2021 జనాభా లెక్కల ప్రకారం, ఈ ద్వీపం జనాభా కేవలం 81. ఇందులో సొంత భవంతులు ఉన్న ప్రముఖులలో టామ్ బ్రాడీ, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్, ఫిలడెల్ఫియా ఈగల్స్ మాజీ యజమాని నార్మన్ బ్రమన్ ఉన్నారు. -
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మాన్షన్ 24. అవికా గోర్, సత్యరాజ్, బిందు మాధవి, రాజీవ్ కనకాల, రావు రమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ప్రముఖ యాంకర్ కమ్ డైరెక్టర్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. 'జాతీయ సంపదను దోచుకున్న కాళిదాసు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు' అన్న హెడ్‌లైన్‌తో ట్రైలర్ మొదలైంది. అయితే తాను దేశద్రోహి కూతుర్ని కాదని, నిజాయితీపరుడైన కాళిదాసు కూతుర్ని, దాన్ని నిరూపిస్తానంటూ సీన్లోకి ఎంటరైంది వరలక్ష్మి శరత్‌కుమార్. కనిపించకుండా పోయిన తండ్రి కోసం, అతడి మీద వేసిన దేశద్రోహి అనే నిందను తొలగించేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగుతుంది. తండ్రి కోసం వెతుకులాట మొదలుపెడుతుంది. ఈ క్రమంలో అతడి తండ్రి చివరిసారిగా ఓ కోటకు వెళ్లినట్లు తెలుసుకుంటుంది. అక్కడికి వెళ్లినవారెవరూ తిరిగి రాలేదని అందరూ చెప్తూ ఉంటారు. అయినా సరే, తన తండ్రి ఏమయ్యాడో తెలుసుకోవాలని పాడుబడ్డ మాన్షన్‌లోకి అడుగుపెడుతుంది. అక్కడ వరలక్ష్మికి ఎదురైన పరిణామాలేంటి? తన తండ్రి నిజాయితీపరుడా? దేశద్రోహా? వరలక్ష్మి అక్కడి నుంచి తిరిగి ప్రాణాలతో బయటపడిందా? వంటి విషయాలు తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 17 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. చదవండి: సీక్రెట్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్? ఎవరా మిస్టరీ మ్యాన్? -
లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్
యూకే రాజధాని నగరంలో అతిపెద్ద రెసిడెన్షియల్ డీల్‌ను భారత దేశానికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ సొంతం చేసుకున్నారు.ఎస్సార్ గ్రూప్‌కు సహ-యజమాని రవి రుయా ఇంద్ర భవనం లాంటి ఇంటిని కొనుగోలు చేశారు. రష్యన్ ప్రాపర్టీ ఇన్వెస్టర్ ఆండ్రీ గోంచరెంకోకు సంబంధించిన ఈ ప్రాపర్టీ విలువ దాదాపు రూ. 1200 కోట్లు. (145 మిలియన్ డాలర్లు) . 150 పార్క్ రోడ్‌లోని రీజెంట్స్ పార్క్‌కి ఎదురుగా ఉన్న హనోవర్ లాడ్జ్ మాన్షన్‌ను ఇంటిలోని జిబ్రాల్టర్-ఇన్కార్పొరేటెడ్ హోల్డింగ్ కంపెనీ విక్రయం ద్వారా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ భవనం ఇటీవలి రెండేళ్ల క్రితం రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంధన సంస్థ అనుబంధ సంస్థ గాజ్ప్రోమ్ ఇన్వెస్ట్ యుగ్ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోంచరెంకో యాజమాన్యంలో ఉంది. 2012లో కన్జర్వేటివ్ పార్టీ పీర్ రాజ్‌కుమార్ బగ్రీ లీజుకు తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ నిర్మాణంలో ఉందనీ, ఇది కుటుంబ కార్యాలయానికి ఆకర్షణీయమైన పెట్టుబడిగా చేసే ధరకు అందుబాటులోకి వచ్చింద ని రుయా ఫ్యామిలీ ఆఫీస్ ప్రతినిధి విలియం రెగో ఒక ప్రకటనలో తెలిపారని పలు మీడియా సంస్థలు నివేదించాయి. గత ఏడాది లండన్‌లో విదేశీ సంస్థల రిజిస్టర్ విధానంలో పారదర్శకతను తీసుకు రావడానికి ప్రయత్నించిన తర్వాత కూడా లండన్ అల్ట్రా-ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్లో ఇప్పటికీ గోప్యంగానే ఉండటం విశేషం. అయితే ఈ ఆంక్షల ఫలితంగా ఇప్పటిదాకా చాలా రహస్యంగా జరిగే విలాస వంత గృహాలు క్రయ విక్రయాల్లో కాస్త మార్పు వచ్చింది. బ్రోకర్ హాంప్టన్స్ ఇంటర్నేషనల్ ప్రకారం, గత ఏడాది చివరి మూడు నెలల్లో లండన్ ఇళ్ల విక్రయాలు భారీగానే నమోదైనాయి. -
విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ జూనియర్ నెయ్మర్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బ్రెజిల్ రాజధాని రియో డి జెనిరోలో నెయ్మర్ నిర్మించిన మాన్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన అధికారులు అతనికి భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరోసారి నెయ్మర్కు పర్యావరణ అధికారులు బిగ్‌షాక్ ఇచ్చారు. నెయ్మర్ కొత్తగా నిర్మించిన తన మాన్షన్ హౌస్ వెలుపల ఒక కృత్రిమ సరస్సును నిర్మించాడు. అతని చర్యపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. పర్యావరణానికి హానీ కలిగించేలా నిబంధనలు ఉల్లఘించి మాన్షన్ బయట కృత్రిమ సరస్సు నిర్మించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లఘించినందుకు గానూ నెయ్మర్కు 3.3 మిలియన్ యూఎస్ డాలర్స్(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.27.1 కోట్లు) జరిమానా విధించారు. ఈ విషయాన్ని అధికారులు ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు. ''నిబంధనల ప్రకారం మాన్షన్‌లో స్విమ్మింగ్ పూల్స్ నిర్మించుకోవచ్చు. కానీ నెయ్మర్ తన విలాసాల కోసం పర్యావరణానికి హానీ కలిగిస్తూ కృత్రిమ సరస్సు నిర్మించడం ఏంటి?. రూల్స్‌కు విరుద్దంగా నదీ ప్రవాహాన్ని సంగ్రహించడం చట్టరిత్యా నేరం. అనుమతి లేకుండా నదీ ప్రవాహాన్నిమళ్లించడం.. కృత్రిమ సరస్సు నిర్మాణం కోసం రాళ్లు, ఇసుకను అక్రమంగా తరలించడం.. పర్యావరణ బోర్డు అనుమతి లేకుండానే వృక్షసంపదను అణచివేయడమనేది నేరం కిందే లెక్క. ప్రభుత్వ చట్టాలను పాటించకుండా నిషేధాజ్ఞలను ఉల్లఘించినందుకు గానూ నెయ్‌మర్‌పై చర్యలు తీసుకుంటున్నాం. ''అంటూ ప్రకటనలో తెలిపింది. ఇక నెయ్మర్ కుటుంబసభ్యులు మాన్షన్‌లో ఉన్నప్పుడే అధికారులు, పోలీసులు ఎంటరయ్యారు. దీంతో నెయ్మర్ తండ్రి అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అధికారులు చుట్టూ కొలతలు తీసుకొని ఎంతమేర పర్యావరణానికి నష్టం కలిగించాడనే దానిపై రిపోర్టు తయారు చేశారు. అనంతరం నోటీసులు అంటించి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోను రాయిటర్స్ సంస్థ తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. Neymar has been fined nearly $3.5 million after Brazilian authorities said that the soccer star’s luxury coastal mansion in southeastern Brazil violated rules in the 'construction of an artificial lake' https://t.co/VE5RVJYSxJ pic.twitter.com/T5rdztMMER — Reuters (@Reuters) July 5, 2023 ఇదిలా ఉంటే.. 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు.ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. చదవండి: #Wimbledon2023: 'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు' #PoojaTomar: ఆ గేమ్ అంటేనే చావుతో చెలగాటం.. నిజంగా 'ఆడ'పులే! -
పాప్ స్టార్ బ్రిట్నీస్పియర్స్ అమ్మేసిన ఇల్లు ఇదే.. ఎంత బాగుందో..
-
బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు ఊహించని షాక్! మిలియన్ డాలర్ ఫైన్
Neymar Could Be Fined $1 Million: బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ నేమార్‌కు భారీ షాక్ తగిలింది. దేశంలోని ప్రధాన పట్టణం రియో డి జెనిరోలో అతడు చేపట్టిన మాన్షన్ నిర్మాణాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగించే రీతిలో వ్యవహరించినందుకు పెద్ద మొత్తంలో జరిమానా విధించేందుకు సిద్ధమయ్యారు. పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా విలాసవంతమైన భవనం నిర్మిస్తున్న నేమార్‌కు మిలియన్ డాలర్ మేర ఫైన్ వేయనున్నారు. ఈ విషయం గురించి స్థానిక మేయర్ కార్యాలయం.. ‘‘సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. భవనం నిర్మిస్తున్న క్రమంలో అతడు పెద్ద ఎత్తున పర్యావరణానికి నష్టం చేకూర్చాడు. కాబట్టి మిలియన్ డాలర్ల మేర జరిమానా విధించే అవకాశం ఉంది’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. నేమార్ చేపట్టిన నిర్మాణాన్ని ప్రస్తుతానికి నిలిపివేసినట్లు తెలిపింది. రెండున్నర ఎకరాలు కాగా నేమార్ మాన్షన్ వద్దకు వచ్చి అధికారులు భవన నిర్మాణాన్ని ఆపాలని చెప్పగా.. అతడి తండ్రి వారితో గొడవతో దిగినట్లు సమాచారం. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే.. 2016లో నేమార్ రియో డి జెనిరోకు దాదాపు 80 మైళ్ల దూరంలో ఉన్న మంగారతిబా ఏరియాలో రెండున్నర ఎకరాలు కొనుగోలు చేశాడు. ఇక్కడ హెలిప్యాడ్, స్పా, జిమ్ తదితర సౌకర్యాలతో మాన్షన్ నిర్మాణం చేపట్టాడు. కాగా 31 ఏళ్ల పారిస్ సెయింట్- జర్మేన్(పీఎస్జీ) ఫుట్‌బాలర్ చీలమండ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక నేమార్ వ్యక్తిగత జీవితంలో ప్రస్తుతం ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నాడు. అతడి భాగస్వామి బ్రూనా బియాంకార్డి త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. చదవండి: 'మెక్కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా' -
సుందర్ పిచాయ్: 32 ఎకరాల్లో లగ్జరీ భవనం, ఖరీదెంతో తెలుసా?
సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్,ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. గ్లోబల్ టాప్ సీఈవోలలో ఒకరిగా చాలా మందికి ఆయన రోల్ మోడల్. తమిళనాడుకు చెందిన ఐఐటి గ్రాడ్యుయేట్ చెన్నైలోని అశోక్ నగర్లో ఉన్న పూర్వీకుల భవనాన్ని ఇటీవల విక్రయించిన సుందర్ పిచాయ్ నివాసముంటున్న ఇల్లు ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఐటీ నిపుణుల్లో,బిలియన్ల మందికి రోల్ మోడల్ సుందర్ పిచాయ్ ఉంటున్న ఇల్లు ఖరీదు రూ. 10వేల కోట్లు అంటే నమ్ముతారా. సుందర్ పిచాయ్ అద్భుతమైన భవనం కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీలోని లాస్ ఆల్టోస్‌లోని కొండపై 31.17 ఎకరాల్లో ఉంది. సుందర్ పిచాయ్ భార్య అంజలి పిచాయ్ ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ కోసం రూ. 49 కోట్లు ఖర్చు చేశారట.. కొన్నేళ్ల క్రితం ఈ భవనాన్ని సుందర్ పిచాయ్ 40 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. (అంబానీ,అదానీ కాదు: తొలి 100 కోట్ల ఎయిర్‌బస్ హెలికాప్టర్, ఇంకా విశేషాలు) విశాలమైన బెడ్ రూమ్స్ ఇన్ఫినిటీ పూల్, జిమ్నాసియం, స్పా, వైన్ సెల్లార్ సోలార్ ప్యానెల్స్ , లిఫ్టులు , నానీ క్వార్టర్ లాంటి హంగులతో ఉన్న అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ హోమ్ విలువ ఇపుడు రూ. 10,000 కోట్లకు పైమాటే. 2022లో రూ.1852 కోట్లు జీతం అందుకున్న సుందర్ పిచాయ్ నికర విలువ 1,310 మిలియన్ల డాలర్లుగా ఉంది. సుందర్ పిచాయ్ 2015లో గూగుల్ సీఈఓగా, 2019లో ఆల్ఫాబెట్ ఇంక్ సీఈవోగా ఎంపికయ్యారు. జూన్ 10, 1972న తమిళనాడులోని మధురైలో జన్మించారు.1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ఇం జనీరింగ్ పట్టాపొందారు. (అలియా హాలీవుడ్ ఎంట్రీ:ఆమె గ్రీన్ డ్రెస్ ధర ఎంతో తెలుసా?) స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో మెటీరియల్ సైన్స్ లో ఎంఎస్చేశారు. ఈ తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేశారు. పిచాయ్ 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ హెడ్‌గా చేరారు. కాలేజీ ఫ్రెండ్‌ను అంజలి పిచాయ్ని వివాహం చేసుకున్న పిచాయ్‌కు కిరణ్, కావ్య అనే ఇద్దరు పిల్లలున్నారు. 2022నలో ఇండియా మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. -
ఇంద్ర భవనం! బ్రిట్నీ స్పియర్స్ భారీ నష్టానికి అమ్మేసిన ఇల్లు ఇదే..
పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ లాస్ ఏంజిల్స్‌లోని విలాసవంతమైన బంగళాను ఏడాది కూడా కాకుండానే భారీ నష్టానికి అమ్మేసింది. ఈ ఇంటిని చూస్తే ఇంద్ర భవనం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. లాస్ ఏంజిల్స్ నగరంలోని కాలాబాసాస్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న బ్రిట్నీ స్పియర్స్ నివాసం కొన్ని నెలల క్రితం 10.1 మిలియన్ డాలర్లకు చేతులు మారింది. ఏడాది క్రితం ఆమె దాన్ని 11.8 మిలియన్ డాలర్లకు కొనుక్కున్నారు. 2022 జూన్‌లో ఈ ఇంటిని కొనుగోలు చేసింది బ్రిట్నీ స్పియర్స్ భర్త సామ్ అస్గారితో కలిసి కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండేది. అయితే ఇది అందరికీ తెలిసిపోయి తమ ఏకాంతానికి అనుకూలంగా లేకపోవడంతో వారు దీన్ని వదిలి వేరే ఇంటికి మారిపోయారు. 2008లో నిర్మించిన ఈ భవనంలో ఆరు బెడ్రూమ్లు, తొమ్మిది స్నానపు గదులు 11,600 చదరపు అడుగుల సింగిల్-లెవల్ లివింగ్ స్పేస్‌లో విస్తరించి ఉన్నాయి. వంపు హాలులు, కాఫర్డ్ సీలింగ్‌లు, చెక్కతో చేసిన యాక్సెంట్లు ఇంటి అంతటా ఉన్నాయి. విలాసవంతమైన గౌర్మెట్ కిచెన్, లెదర్ రిక్లైనింగ్ సీట్లు కలిగిన హోమ్ థియేటర్, వాక్-ఇన్ సేఫ్, గేమ్ రూమ్, పెట్ వాష్ బేసిన్ వంటివి చూస్తే కళ్లు చెదరకతప్పదు. వీటితోపాటు వాటర్ ఫౌంటైన్లు, మొజాయిక్ టైల్డ్ పూల్, హాట్ టబ్, వాటర్ ఫాల్స్, బార్బెక్యూ పెవిలియన్, గెస్ట్ హౌస్ వంటివి కూడా ఉన్నాయి. -
రూ.1656 కోట్లతో భవంతిని కొన్న స్టార్ సింగర్స్.. స్పెషల్ ఏంటంటే..
అమెరికన్ పాప్ స్టార్ సింగర్స్ బియాన్స్, జే-జెడ్ జంట తాజాగా ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. కాలిఫోర్నియాలోని మలిబులో ఉన్న విలాసవంతమైన ఆ భవనం విలువ దాదాపు 200 మిలియన్ల డాలర్స్ అని తెలుస్తోంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1656 కోట్ల రూపాయలు అన్నమాట. కాలిఫోర్నియా రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన భవనం ఇదేనట. జపాన్‌కు చెందిన టడావో ఆండో అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన ఈ భవంతిలో సకల సౌకర్యాలు ఉన్నాయాట. సినిమా గది... నాలుగు బహిరంగ స్విమ్మింగ్ పూల్స్ .. బాస్కెట్ బాల్ కోర్ట్ పాటు గాజు గోడలు .. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలతో ఈ భవనాన్ని నిర్మించారట. ఈ భవంతి నుంచే అదే ప్రాంతంలో ఉన్న పసిఫిక్ మహా సముద్ర బీచ్ అందాలను కూడా వీక్షించవచ్చునట. 20 ఏళ్ల కింద 14.5 మిలియన్ల డాలర్లకు విలియం బెల్ అనే వ్యక్తి ఈ భవనాన్ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆర్కిటెక్ట్ టడావోతో దీనిని డిజైన్ చేయించారు. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ భవనం ఎల్ ఆకారంలో ఉంటుంది. 15 ఏళ్ల పాటు భవనంలో మార్పులు, చేర్పులు చేయించి మరింత అద్భుతంగా తీర్చి దిద్దారు. అందుకే బియాన్స్-జే జెడ్ జంట దాదాపు 200 మిలియన్ల డాలర్స్ పెట్టి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఇదే కాకుండా మరో ఖరీదైన బంగ్లా కూడా ఈ జంటకు ఉంది. 2017లో లాస్ ఏంజెలెస్‌లో 88 మిలియన్ల డాలర్లతో ఓ భారీ బంగ్లాను కొనుగోలు చేశారు. (చదవండి: బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి.. ఘనంగా కొడుకు నిశ్చితార్థం) -
రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..
ఫొటోలో కనిపిస్తున్న ఈ భవంతి విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ‘ది హోల్మ్’ అని పిలిచే దీని ప్రస్తుత ధర రూ. 2,500 కోట్లు పలికి, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవంతిగా నిలిచింది. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) లండన్‌లో 1818లో జార్జియన్ ప్రాపర్టీ డెవలపర్ జేమ్స్ బర్టన్ అనే వ్యక్తి దీనిని నిర్మించాడు. ముందు బర్టన్ వంశస్థులే ఇందులో నివాసం ఉండేవారు. కొద్ది రోజులు బర్టన్ కళశాలగా మార్చారు. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితుల కారణంగా 1980లో ప్రైవేటు నివాసంగా మార్చారు. ఇక అప్పటి నుంచి అనేక సార్లు, అనేకమంది దీనిని మార్కెట్లో అమ్మకానికి ఉంచారు. ప్రతిసారి అనుకున్నదాని కంటే ఎక్కువ ధర పలుకుతూనే ఉంది. (నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్) గత సంవత్సరం సౌదీ రాజకుటుంబ సభ్యుల్లో ఒకరు దీనిని రూ.1500 కోట్లకు కొనుగోలు చేశారు. వారే ఇప్పుడు రూ.2,500 కోట్ల ధరకు అమ్మకానికి ఉంచారు. ఈ వేలం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. చూడాలి ఈసారి హోల్మ్ను దక్కించుకునే ఆ యజమాని ఎవరో! -
ఖరీదైన 6 బెడ్ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్.. ధర ఎంతో తెలుసా..?
ఆస్ట్రేలియా మాజీ సారధి, టూ టైమ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ శివారు ప్రాంతమైన టూరక్లో అత్యంత విలాసవంతమైన 6 బెడ్ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేశాడు. లగ్జరీ స్విమ్మింగ్ పూల్తో పాటు టెన్నిస్ కోర్ట్ కలిగిన ఈ మాన్షన్ ఖరీదు 20 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని ఆస్ట్రేలియా మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. 1400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పాలరాతిచే నిర్మించబడ్డ ఈ అత్యధునిక విల్లాలో ఇండోర్-అవుట్డోర్ లివింగ్ స్పేస్‌లతో పాటు ఆధునిక వంటగది సమకూర్చబడింది. పాంటింగ్ ఇంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేయడం ఇది మొదటిసారి కాదు. 2013లో ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ 9.2 మిలియన్ డాలర్లు వెచ్చించి బ్రైటన్‌లోని బీచ్‌సైడ్ శివారులో ఓ లగ్జరీ మ్యాన్షన్‌ను కొన్నాడు. ప్రస్తుతం పాంటింగ్ కుటంబంతో కలిసి అందులోనే నివాసం ఉంటున్నాడు. బ్రైటన్ గోల్డెన్ మైల్గా పిలవబడే ఆ సుందర భవనంలో 7 పడక గదులు, ఎనిమిది స్నానపు గదులు, అంతర్గత థియేటర్ మరియు బీచ్‌కి ప్రైవేట్ లేన్వే ఉన్నాయి. ఈ రెండు భవనాలే కాక పాంటింగ్ 2019లో మరో భవనాన్ని కూడా కొనుగోలు చేశాడు. దాని ఖరీదు 3.5 మిలియన్ డాలర్లు. ఇందులో నాలుగు పడక గదులు, మూడు బాత్రూమ్లు ఉన్నాయి. ఈ విల్లా పోర్ట్ వ్యూ కలిగి ఉంటుంది. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న పాంటింగ్.. ఆస్ట్రేలియా తరఫున 168 టెస్ట్ మ్యాచ్‌ల్లో 51.85 సగటున 41 సెంచరీల సాయంతో 13,378 పరుగులు చేశాడు. 374 వన్డేల్లో 41.81 సగటున 29 సెంచరీల సాయంతో 13,589 పరుగులు చేశాడు. -
జాక్‌పాట్ అంటే ఇదే! నిమిషాల్లో రతన్ టాటాను మించిపోయాడు!
న్యూఢిల్లీ: అదృష్టాన్ని నమ్మొద్దు, కష్టపడి పనిచేయాలని సాధారణంగా మనం అందరమూ నమ్ముతాం. కానీ ప్రపంచంలో ఎక్కువమందిని హార్డ్ వర్క్ కంటే అదృష్టమే ఎక్కువగా పలకరిస్తుంది. అలాంటి వారిలో కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తి కూడా ఒకరు. చరిత్రలో ఏన్నడూ లేని విధంగా రికార్డ్ లాటరీ గెల్చుకుని బిలియనీర్‌గా అవతరించాడు. ఏకంగా వేల కోట్ల రూపాయల జాక్‌పాట్ తగలడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇల్లు సొంతం చేసుకుని మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు బ్రిటిష్ పత్రిక ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం కాలిఫోర్నియాకు చెందిన ఎడ్విన్ కాస్ట్రో అమెరికా చరిత్రలోనే విలువైన పవర్‌బాల్ మెగా లాటరీని గెలుచుకున్నాడు. 2022, నవంబర్ నెలలో 2 బిలియన్ డాలర్ల (రూ.16,407 కోట్లు) ఏకైక వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అఅమెరికాలో ఇప్పటివరకు నలుగురు మాత్రమే ఒక బిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. కాగా తాజా లాటరీలో పన్ను, ఇతర తగ్గింపుల తరువాత, మొత్తం రూ .8,180 కోట్లు కాస్ట్రో చేతికి వచ్చాయట. ఈ జాక్పాట్తో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. హాలీవుడ్ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు నివాసముండే ఏరియాలో అతి ఖరీదైన 200 కోట్ల విలువైన భవనాన్ని కొనుగోలు చేశాడు. అలా అరియానా గ్రాండే, డకోటా జాన్సన్ జిమ్మీ కిమ్మెల్ వారికి పొరుగువాడిగా చేరిపోయాడు. ఈ విషయంలో భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలలో ఒకరైన రతన్ టాటా వ్యక్తిగత ఆస్తుల కంటే నాలుగు రెట్లు ఎక్కువని ఇండిపెండెంట్ తెలిపింది. రతన్ టాటా వ్యక్తిగత ఆస్తి దాదాపు 4 వేల కోట్ల రూపాయలని పేర్కొంది. ఈ భవనం ప్రత్యేకతలు 13,500 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం, ఐదు లగ్జరీ బెడ్ రూములు, అధునాతన సదుపాయాలతో ఏడు బాత్రూమ్లు. ఇంకా ఇన్ఫినిటీ పూల్, రెండు ఫైర్ పిట్స్, అవుట్డోర్ కిచెన్, స్పా అండ్ సౌరా, సినిమా థియేటర్ ఫిట్నెస్ స్టూడియో, రూఫ్ టాప్ డెక్, ఫైవ్ కార్ షోరూం, రెండు కారు గ్యారేజీలు లాంటి విలాసవంతమైన సౌకర్యాలున్నాయి. -
కిటికీల్లేవు.. గదుల్లేవ్.. దీనికి రూ. 7 కోట్లా
టెక్సాస్/వాషింగ్టన్: అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని చిత్ర విచిత్రమైన ఇళ్లు కనిపిస్తుంటాయి. అందులో ప్రవేశిస్తే తిరిగి బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే.. ఆ ఇంటిలోపల అంతా గందరగోళంగా.. అస్తవ్యస్తంగా ఉంటుంది. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. మొత్తంగా చెప్పాలంటే మహాభారతంలోని మయ సభను పోలి ఉంటుంది. ఇలాంటి ఇంట్లో నివాసం ఉంటే ఖచ్చితంగా పిచ్చి పడుతుంది. మరి ఇలాంటి వింత ఇల్లు ఉంటుందా అంటే.. ఉంది.. అది కూడా ఇప్పుడు అమ్మకానికి వచ్చిది. ఖరీదు ఏకంగా 7 కోట్ల రూపాయల పైమాటే. ఇంతకు ఆ ఇల్లు ఎక్కడ ఉంది.. దాని విశేషాలు తెలియాలంటే ఇది చదవండి అమెరికా టెక్సాస్ డల్లాస్ పట్టణంలోని ఓ ఇల్లు అమ్మకానికి వచ్చింది. దాని ఖరీదు ఏకంగా 1 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. 7,43,79,300 రూపాయలు. ఇంత ఖరీదు ఉందంటే.. తప్పకుండా సకల హంగులతో ఇంద్ర భవనంలా ఉంటుందని భావిస్తే మాత్రం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇంటి లోపలికి వెళ్తే బుర్ర తిరుగుతుంది. ఎందుకంటే ఇంట్లో బెడ్రూంలుండవు.. కిటికీల స్థానంలో నకిలీవి ఉంటాయి. బయట నుంచి చూస్తే.. పెద్ద పెద్ద గాజు కిటికీలున్నట్లు కనిపిస్తుంది కానీ అలా లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అవేం కనిపించవు. ఇక ఈ ఇంటి మొత్తం మీద ఓ గ్లాస్ సెక్యూరిటీ విండో ఉంటుంది. అది ఎలా కనిపిస్తుంది అంటే పోలీస్ స్టేషన్, నిర్బంధ కేంద్రాల ప్రవేశ ద్వారం వద్ద ఉండే కిటికీని పోలి ఉంటుంది. ప్రతి గది బూడిద రంగు కార్పెట్‌తో కవర్ చేసి ఉంటుంది. ఇల్లు ఓ గోడౌన్‌లాగా కనిపిస్తుంది. దాదాపు 21 ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో నిర్మించిన ఈ ఇంటిని ఈ ఏడాది జిల్లోలో అమ్మకానికి పెట్టారు. ఇక ‘‘ఈ ఇల్లు పెద్ద మొత్తంలో వైన్ దాచుకోవడానికి.. ఎక్కువ సంఖ్యలో కార్లను, ఆర్ట్ కలెక్షన్‌ను దాచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది’’ అని రాసుకొచ్చారు. ఈ ఇంటిని అనుసంధానిస్తూ రెండు విద్యుత్ గ్రిడ్లు, రెండు డీజిల్ ఇంధన ట్యాంకుల ద్వారా నడిచే సహజ వాయువు జనరేటర్ కూడా ఉన్నాయి. ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇది ఇల్లా.. లేక దెయ్యాల కొంపా’’.. ‘‘నాలుగు గోడలు.. పైన కప్పు.. అంతకు మించి ఈ ఇంటిలో ఎలాంటి ఆకర్షణ లేదు’’... ‘‘ఇలాంటి ఇళ్లల్లో ఉంటే లేనిపోని మానసకి సమస్యలు తలెత్తుతాయి’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
అలా వైకుంఠపురంలోకి.. కేటి దంపతులు
కాలిఫోర్నియా: కేటి పెర్రీ, ఓర్లాండో బ్లూమ్ దంపతులు ఇటీవల కాలిఫోర్నియాలోని మాంటెసిటీలో అత్యంత ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారు. కుబేరులు నివసించే ప్రాంతంలోనే వారో భవనాన్ని 14.2 మిలియన్ డాలర్లకు (దాదాపు 105 కోట్ల రూపాయలు) కొనుగోలు చేశారు. చుట్టూ పచ్చని కొండలు, లోయలు ఓ పక్కన సముద్ర తీరం మరో పక్కన కనిపించేంత దూరంలో సుందర వనం, స్విమ్మింగ్ కలిగిన విలాసవంతమైన భవనాన్ని డ్యూరాసెల్ మాజీ సీఈవో సీ. రాబర్ట్ కిడ్డర్ నుంచి కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త కిడ్డర్ 20 ఏళ్ల పాటు ఆ భవనంలో ఉన్నారు. ప్రిన్స్ హారి, మేఘన్ మార్కెలే కొనుగోసిన విలాస భవనానికి సమీపంలోనే పెర్రీ దంపతులు ఈ భవనాన్ని కొనుగోలు చేయడం విశేషం. అమెరికా పాప్ సింగర్‌గా, గేయ రచయితగా ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకొంటున్న కేటి పెర్రీ, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సీరియల్ చిత్రాల ద్వారా హాలివుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఓర్లాండో బ్లూమ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటూ ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. గత ఆగస్టు నెలలోనే వారికి జన్మించిన పాపకు వారు డైజీ డోవ్ అని పేరు పెట్టారు. రెండు పడక గదులు, రెండు బాత్ రూమ్‌లు కిచెన్, డైనింగ్, లైబ్రరీ, సిట్టింగ్ హాళ్లతో పాటు ఇంటి చుట్టూ విస్తరించిన ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చొని సేదతీరేందుకు ఎన్నో సిట్ అవుట్లు ఉన్నాయి. నౌకర్లు, చాకర్లను పక్కన పెడితే ఆ విలాస భవనంలో వారండేది ముగ్గురే. (చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న జాన్సేన) -
ఒబామా కొత్త ప్యాలెస్ చూశారా?
న్యూఢిల్లీ: చుట్టూ ఆవహించిన సముద్ర తరంగాల మీదుగా చల్లటి గాలులు వీస్తుంటే అందమైన దీవిపై వెలిసిన సువిశాల సుందర భవనంలో శాశ్వత నివాసం ఏర్పరుచుకొని, శేష జీవితం గడపాలనుకుంటే అది అందరికి స్వప్నం అవుతుందేమోగానీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు మాత్రం సాకారమవుతుంది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని మార్తాస్ వినియార్డ్ దీవిపై 29 ఎకరాల విస్తీర్ణ ప్రాంగణంలో 6,900 చదరపు అడుగుల్లో నిర్మించిన సువిశాల సుందర భవనాన్ని ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ఏడు పడక గదులు, తొమ్మిది బాత్ రూమ్‌లు, రెండు అతిథుల చావడీలు, అధునాతన కిచెన్ కలిగిన ఈ భవనాన్ని 11.75 మిలియన్ల డాలర్ల(దాదాపు 85 కోట్ల రూపాయలు)కు ఒబామా దంపతులు కొనుగోలు చేశారు. ‘బోస్టన్ సెల్టిక్స్ (అమెరికా ఫ్రొఫెషనల్ ఫుట్‌బాల్ జట్టు)’ యజమాని విక్ గ్రౌస్‌బెక్ గత వేసవి కాలంలోనే అమ్మకానికి పెట్టగా ఒబామా వేసవి దంపతులు వేసవి విడిదిగా ఆ సుందర భవనంలో దిగారు. ఆ మైదానంలో ఒబామా తన మిత్రులతో గోల్ఫ్ కూడా ఆడుతూ వచ్చారు. చివరకు ఆ భవనాన్ని కొనుగోలు చేయాలని ఒబామ దంపతులు ధరను ఖరారు చేసుకున్నట్లు అభిజ్ఞవర్గాల ద్వారా తెల్సింది. 2001లో నిర్మించిన ఆ భవనాన్ని వాస్తవానికి 14.50 మిలియన్ డాలర్లకు యజామని గ్రౌస్‌బెక్ అమ్మకానికి పెట్టగా, ఒబామా గీచి గీచి బేరం పెట్టి యజమానిని ఒప్పించారట. ఆ భవనం ఆవరణలో ఓ స్విమ్మింగ్ పూల్‌తోపాటు అవుట్డోర్ ఫైర్ పిట్, సన్‌బాత్ కోసం అద్భుతమైన బాల్కనీ ఉన్నాయి. అన్నింటికంటే ప్రైవేట్ బీచ్, బోట్ హౌజ్ కూడా ఉన్నాయి. అమ్మకానికి ఆ భవనం ప్రాంగణానికి అనుకొని కొన్ని వందల ఎకరాల స్థలం ఉందట. క్రమంగా పక్కనున్న ఎకరాలను కూడా కొనుగోలు చేయవచ్చనే ముందు చూపుతోనే ఒబామా ప్యాలెస్ లాంటి ఆ భవనాన్ని కొనుగోలు చేశారట. మసాచుసెట్స్ నుంచి వినియార్డ్ దీవిపైకి రావాలన్నా, పోవాలన్నా గగన, జల మార్గాలే శరణ్యం. ఆ దీవిపై ప్రైవేటు ప్రాపర్టీ కొనుగోలు చేసిన మొదటి మాజీ దేశాధ్యక్షుడు ఒబామానే అనుకుంటే పొరపాటు జాకీ కెన్నడీకి అక్కడ సొంతిల్లుంది. 1994లో ఆయన చనిపోయే వరకు ఆయన అక్కడే ఉన్నారు. ఆయన వంశానికి చెందిన వారు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు. ఒబామా అదే దీవిపైనున్న తమ సమ్మర్ హోమ్‌ను గతేడాది 15 మిలియన్ డాలర్లకు విక్రయించారు. -
ఇషా అంబానీ ఉండబోయే ఇంటిని చూశారా..?!
ముంబై : ఇషా అంబానీ - ఆనంద్ పిరమాల్‌ల వివాహం దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహంగా నిలిచింది. భారతదేశ కుబేరుడైన ముఖేష్ అంబానీ తన కూతురు పెళ్లి కోసం ఏకంగా రూ. 700 కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. అంగరంగ వైభవంగా జరిగిన ఇషా పెళ్లి వేడుకకు దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు హజరయ్యారు. వారం రోజుల పాటు జరిగిన పెళ్లి తంతు పూర్తయ్యింది. ఇషా - ఆనంద్‌లు నివసింసచేబోయే ఇంటి గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇంద్రభవనాన్ని తలపించేలా ఉన్న ఈ సౌధం విస్తీర్ణం దాదాపు 50 వేల చదరపు అడుగులు. దక్షిణ ముంబైలోని వర్లీ ప్రాంతంలో అరేబియా సముద్ర ప్రాంత సమీపంలో ఉంది. ఆనంద్ పిరమాల్ తల్లిదండ్రులు ఈ ఇంటిని నూతన దంపతులకు కానుకగా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటిదగ్గర రిన్నోవేషన్ పనులు జరుగుతున్నాయి. దీనితో పోలిస్తే, ముఖేష్ అంబానీ ఇళ్లు యాంటిలియా దాదాపు 8 రేట్ల పెద్దదిగా ఉంటుంది. -
రూ.63 కోట్లతో ఇల్లు కొనుక్కుంది
లాస్ ఏంజెలెస్: హాలీవుడ్ లో ఇళ్ల అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. నిన్నకాక మొన్న పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ దాదాపు 1800 కోట్ల రూపాయలు పెట్టి విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసింది. తాజాగా పాప్ సింగర్ అడిలె కూడా లగ్జరీ సౌధాన్ని సొంతం చేసుకుంది. లాస్ ఏంజెలెస్ లోని బెవెర్లీ హిల్స్ గేగెట్ కమ్యూనిటీలో ఉన్న భవంతిని సుమారు రూ.63 కోట్లు (9.5 మిలియన్ డాలర్లు) పెట్టి కొనుక్కుంది. 6,600 చదరపు విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంటిలో నాలుగు బెడ్రూములు, ఆరు బాత్రూములు, స్విమ్మింగ్ పూల్ ఉంది. త్వరలోనే కొత్త ఇంట్లోకి మారాలని అడిలె భావిస్తోంది. ఆమెకు జెన్నిఫర్ లారెన్స్, అస్టన్ కుచర్, మిలా కునిస్, కెమెరాన్ డియాజ్ వంటి సెలబ్రిటీలో ఇరుగుపొరుగుగా ఉన్నారు. మరోవైపు సింగర్ పింక్, కేరె హర్ట్ దంపతులు కాలిఫోర్నియాలోని తమ విలాసవంతమైన భవనాన్ని సుమారు రూ. 86 కోట్లకు అమ్మకానికి పెట్టారు.