అమెరికన్ పాప్ స్టార్ సింగర్స్ బియాన్స్, జే-జెడ్ జంట తాజాగా ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. కాలిఫోర్నియాలోని మలిబులో ఉన్న విలాసవంతమైన ఆ భవనం విలువ దాదాపు 200 మిలియన్ల డాలర్స్ అని తెలుస్తోంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1656 కోట్ల రూపాయలు అన్నమాట. కాలిఫోర్నియా రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన భవనం ఇదేనట. జపాన్‌కు చెందిన టడావో ఆండో అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన ఈ భవంతిలో సకల సౌకర్యాలు ఉన్నాయాట.
సినిమా గది... నాలుగు బహిరంగ స్విమ్మింగ్ పూల్స్ .. బాస్కెట్ బాల్ కోర్ట్ పాటు గాజు గోడలు .. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలతో ఈ భవనాన్ని నిర్మించారట. ఈ భవంతి నుంచే అదే ప్రాంతంలో ఉన్న పసిఫిక్ మహా సముద్ర బీచ్ అందాలను కూడా వీక్షించవచ్చునట. 20 ఏళ్ల కింద 14.5 మిలియన్ల డాలర్లకు విలియం బెల్ అనే వ్యక్తి ఈ భవనాన్ని కొనుగోలు చేశాడు.
ఆ తర్వాత ఆర్కిటెక్ట్ టడావోతో దీనిని డిజైన్ చేయించారు. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ భవనం ఎల్ ఆకారంలో ఉంటుంది. 15 ఏళ్ల పాటు భవనంలో మార్పులు, చేర్పులు చేయించి మరింత అద్భుతంగా తీర్చి దిద్దారు. అందుకే బియాన్స్-జే జెడ్ జంట దాదాపు 200 మిలియన్ల డాలర్స్ పెట్టి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఇదే కాకుండా మరో ఖరీదైన బంగ్లా కూడా ఈ జంటకు ఉంది. 2017లో లాస్ ఏంజెలెస్‌లో 88 మిలియన్ల డాలర్లతో ఓ భారీ బంగ్లాను కొనుగోలు చేశారు.
(చదవండి: బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి.. ఘనంగా కొడుకు నిశ్చితార్థం)
Comments
Please login to add a commentAdd a comment