ప్రఖ్యాత 65వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 6న లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. భారత్‌కు చెందిన రిక్కీ కేజ్ 'డివైన్ టైడ్స్' ఆల్బమ్‌కు గానూ బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ అవార్డు అందుకున్నారు. 2015, 2022లోనూ కేజ్‌కు గ్రామీ అవార్డులు వరించాయి. దీంతో మూడు గ్రామీ అవార్డులు అందుకున్న ఏకైక భారతీయుడుగా కేజ్ నిలిచారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అత్యధికంగా 31 గ్రామీ అవార్డులు పొందిన సెలబ్రిటీగా జార్జ్ సాల్టి ఉండేది. తాజాగా అమెరికన్ సింగర్, డ్యాన్సర్ బియాన్స్ 32 అవార్డులతో ఆ రికార్డును బద్ధలు కొట్టింది.
ఈ ఏడాది గ్రామీ విజేతలు వీరే..
బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్: రిక్కీ కేజ్
బెస్ట్ పాప్ డ్యుయో పర్ఫామెన్స్ - సామ్ స్మిత్, కిమ్ పెట్రాస్
సాంగ్ ఆఫ్ ద ఇయర్ : బోనీ రైట్
బెస్ట్ డ్యాన్స్/ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఆల్బమ్: రెనిసాన్స్(బియాన్స్)
బెస్ట్ పాప్ సోలో పర్ఫామెన్స్: అదెలె
బెస్ట్ ర్యాప్ ఆల్బమ్: కెన్‌డ్రిక్ లామర్ (మిస్టర్ మొరాలే, బిగ్ స్టెప్పర్స్)
బెస్ట్ మ్యూజిక్ అర్బన్ ఆల్బమ్: బ్యాడ్ బన్నీస్ అన్ వెరానో సిన్‌టి
బెస్ట్ కంట్రీ ఆల్బమ్ విన్నర్: ఎ బ్యూటిఫుల్ టైమ్
బెస్ట్ ఆర్ అండ్ బి సాంగ్: కఫ్ ఇట్ (బియాన్స్)
బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్: హ్యారీ స్టైల్స్
Comments
Please login to add a commentAdd a comment