Beyonce
-
USA Presidential Elections 2024: కమలా హారిస్‌కు గాయని బియాన్స్ మద్దతు
హూస్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీకి దిగుతున్న కమలా హారిస్‌కు ప్రఖ్యాత గాయని బియాన్స్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం రాత్రి హూస్టన్‌లో జరిగిన డెమొక్రటిక్ ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘‘ఒక సెలబ్రిటీకి ఇక్కడికి రాలేదు. ఒక రాజకీయ నాయకురాలిగా రాలేదు. ఒక తల్లిగా వచ్చాను. మన బిడ్డలు ప్రతిబంధకాలు, పరిమితులు లేకుండా పెరగాలంటే కమలా హారిస్‌కు ఓటు వేయాలి’’అని పిలుపునిచ్చారు. హూస్టన్ బియాన్స్ సొంత నగరం కావడం విశేషం. 2016లోనూ ఆమె అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతు పలికారు. క్లీవ్‌లాండ్‌లో ప్రచార సభలో హిల్లరీకి మద్దుతుగా ఒక పాట కూడా పాడారు. ఈసారి మాత్రం పాడలేదు. కమలా హారిస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. హూస్టన్ సభలో కమలా హారిస్ మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. మహిళల పునరుత్పత్తి హక్కుల విషయంలో గత 50 ఏళ్లలో సాధించిన ప్రగతిని ట్రంప్ నాశనం చేశారని మండిపడ్డారు. మహిళలకు హక్కులు నిరాకరించారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ను చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
రూ.1656 కోట్లతో భవంతిని కొన్న స్టార్ సింగర్స్.. స్పెషల్ ఏంటంటే..
అమెరికన్ పాప్ స్టార్ సింగర్స్ బియాన్స్, జే-జెడ్ జంట తాజాగా ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. కాలిఫోర్నియాలోని మలిబులో ఉన్న విలాసవంతమైన ఆ భవనం విలువ దాదాపు 200 మిలియన్ల డాలర్స్ అని తెలుస్తోంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 1656 కోట్ల రూపాయలు అన్నమాట. కాలిఫోర్నియా రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన భవనం ఇదేనట. జపాన్‌కు చెందిన టడావో ఆండో అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన ఈ భవంతిలో సకల సౌకర్యాలు ఉన్నాయాట. సినిమా గది... నాలుగు బహిరంగ స్విమ్మింగ్ పూల్స్ .. బాస్కెట్ బాల్ కోర్ట్ పాటు గాజు గోడలు .. బుల్లెట్ ప్రూఫ్ కిటికీలతో ఈ భవనాన్ని నిర్మించారట. ఈ భవంతి నుంచే అదే ప్రాంతంలో ఉన్న పసిఫిక్ మహా సముద్ర బీచ్ అందాలను కూడా వీక్షించవచ్చునట. 20 ఏళ్ల కింద 14.5 మిలియన్ల డాలర్లకు విలియం బెల్ అనే వ్యక్తి ఈ భవనాన్ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆర్కిటెక్ట్ టడావోతో దీనిని డిజైన్ చేయించారు. దాదాపు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ భవనం ఎల్ ఆకారంలో ఉంటుంది. 15 ఏళ్ల పాటు భవనంలో మార్పులు, చేర్పులు చేయించి మరింత అద్భుతంగా తీర్చి దిద్దారు. అందుకే బియాన్స్-జే జెడ్ జంట దాదాపు 200 మిలియన్ల డాలర్స్ పెట్టి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఇదే కాకుండా మరో ఖరీదైన బంగ్లా కూడా ఈ జంటకు ఉంది. 2017లో లాస్ ఏంజెలెస్‌లో 88 మిలియన్ల డాలర్లతో ఓ భారీ బంగ్లాను కొనుగోలు చేశారు. (చదవండి: బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి.. ఘనంగా కొడుకు నిశ్చితార్థం) -
గ్రామీ అవార్డ్స్: అత్యధిక అవార్డులతో ఆ సింగర్ రికార్డు
ప్రఖ్యాత 65వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 6న లాస్ ఏంజెల్స్‌లో జరిగింది. భారత్‌కు చెందిన రిక్కీ కేజ్ 'డివైన్ టైడ్స్' ఆల్బమ్‌కు గానూ బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ అవార్డు అందుకున్నారు. 2015, 2022లోనూ కేజ్‌కు గ్రామీ అవార్డులు వరించాయి. దీంతో మూడు గ్రామీ అవార్డులు అందుకున్న ఏకైక భారతీయుడుగా కేజ్ నిలిచారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అత్యధికంగా 31 గ్రామీ అవార్డులు పొందిన సెలబ్రిటీగా జార్జ్ సాల్టి ఉండేది. తాజాగా అమెరికన్ సింగర్, డ్యాన్సర్ బియాన్స్ 32 అవార్డులతో ఆ రికార్డును బద్ధలు కొట్టింది. ఈ ఏడాది గ్రామీ విజేతలు వీరే.. బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్: రిక్కీ కేజ్ బెస్ట్ పాప్ డ్యుయో పర్ఫామెన్స్ - సామ్ స్మిత్, కిమ్ పెట్రాస్ సాంగ్ ఆఫ్ ద ఇయర్ : బోనీ రైట్ బెస్ట్ డ్యాన్స్/ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఆల్బమ్: రెనిసాన్స్(బియాన్స్) బెస్ట్ పాప్ సోలో పర్ఫామెన్స్: అదెలె బెస్ట్ ర్యాప్ ఆల్బమ్: కెన్‌డ్రిక్ లామర్ (మిస్టర్ మొరాలే, బిగ్ స్టెప్పర్స్) బెస్ట్ మ్యూజిక్ అర్బన్ ఆల్బమ్: బ్యాడ్ బన్నీస్ అన్ వెరానో సిన్టి బెస్ట్ కంట్రీ ఆల్బమ్ విన్నర్: ఎ బ్యూటిఫుల్ టైమ్ బెస్ట్ ఆర్ అండ్ బి సాంగ్: కఫ్ ఇట్ (బియాన్స్) బెస్ట్ పాప్ వోకల్ ఆల్బమ్: హ్యారీ స్టైల్స్ -
గ్రామీ అవార్డు విజేతలు వీరే...
లాస్ఎంజిల్స్: ఎట్టకేలకు ప్రఖ్యాత హాలీవుడ్ 63వ గ్రామీ అవార్డ్స్ అవార్డు ఫంక్షన్ మార్చి 14న లాస్ఎంజిల్స్లో జరిగాయి. మ్యూజిక్ ఇండస్ట్రీలో జరిగే పాపులర్ అవార్డుల వేడుక గ్రామీ. ఈ వేడుకలతో అత్యధికంగా ట్రోఫీలను గెలుచుకున్న మహిళగా బెయోన్స్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బెయాన్స్ 28 ట్రోఫీలను గెలిచింది. ప్రముఖ సింగర్ అలిసన్ క్రాస్‌ను దాటింది.కోవిడ్-19 నేపథ్యంలో జనవరి 31న జరగాల్సిన ఈ వేడుకను మార్చి 14కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణులతో, అవార్డు నామినీలతో, ఆర్టిస్టులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ వేడుకను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఏడాది గ్రామీ విజేతలు వీరే.. రికార్డ్ ఆఫ్ ది ఇయర్: ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ బై బిల్లీ ఎలిష్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్: ఫోక్లోర్ బై టేలర్ స్విఫ్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్: ఐ కాంట్ బ్రీత్ బై హెచ్.ఈ.ఆర్ ఉత్తమ నూతన ఆర్టిస్ట్: మేగాన్ దీ స్టాలియన్ ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన: వాటర్మెలాన్ బై హ్యారీ స్టైల్స్ ఉత్తమ రాక్ సాంగ్: స్టే హై బై బ్రిటనీ హోవార్డ్ ఉత్తమ రాక్ ఆల్బమ్: ది న్యూ ఆబ్నార్మల్ బై ది స్ట్రోక్స్ ఉత్తమ ర్యాప్ సాంగ్: సావేజ్ బై మేగాన్ తీ స్టాలియన్ ఉత్తమ ర్యాప్ ఆల్బమ్: కింగ్స్ డిసీజ్ బై నాస్(చదవండి: ఒక వేడుక.. రెండు వేదికలు) -
డాక్టర్ బాబు
మనమిలా అనకూడదు. అర్థం కావడానికంతే..! ‘డాక్టరమ్మ’ అనే అనాలి. అదే అతడికి గౌరవం. తనలోని స్త్రీని గౌరవించిన వ్యక్తిని.. పురుషుడిగా చూడ్డం అగౌరవం. అతడి స్త్రీత్వానికే అవమానం. బెయాన్సి అమ్మాయి కాదు. అబ్బాయి! అబ్బాయి కాబట్టి తల్లిదండ్రులు అబ్బాయి పేరే పెట్టారు.. బొబొయ్ అని. టీనేజ్‌లోకి వచ్చాక, ఇంట్లోంచి వెళ్లిపోయాక తనకై తను బెయాన్సీగా పేరు మార్చుకున్నాడు బొబొయ్. (ఇక ఇక్కడి నుంచి మనం ‘డు’ అనే మాట వాడకూడదు. బొబొయ్ తనను తను పరిపూర్ణ స్త్రీగా మలచుకున్నారు కనుక). బెయాన్సి ప్రసుతం ఇంఫాల్‌లోని షిజా హాస్పిటల్స్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్‌గా చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ పేషెంట్లకు వైద్యసేవలను అందించడం కోసం బెయాన్సిని ఎంపిక చేసుకున్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్. పేషెంట్ల దగ్గర తప్ప బెయాన్సి ఎప్పుడూ నవ్వుతూ కనిపించరు. ఎవరితోనూ మాట్లాడరు. ఏదో విషాదం ఆమె అందమైన ముఖంలో! అయితే తొందరపడి విషాదం అనుకోనక్కర్లేదు మనం. బాల్యం నుంచీ తనంతే. టీనేజ్‌లోకి వచ్చాక ఆమె అందంలోకి ఆమె మౌనం మిళితం అయి, మెరుపును తెచ్చింది. ఉరమని మెరుపు.. బెయాన్సి. ‘‘నువ్విలాగే ఉంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను’’ అని తండ్రి బెదరించినప్పుడు కూడా ఆమె మౌనంగానే ఇంట్లోంచి బయటికి వచ్చేసింది. అప్పుడు ఆమె వయసు ఇరవై. ‘నువ్విలాగే ఉంటే..’ అని అనడంలోని ఆయన ఉద్దేశం.. ‘నువ్విలాగే అమ్మాయిలా ఉంటే..’ అని. ‘‘నేనిలాగే ఉంటాను నాన్నా.. ఇలా ఉండటమే నాకు బాగుంటోంది..’ అని తండ్రికి చెప్పి ఇంట్లోంచి వచ్చేసిన బెయాన్సి ఆ కొన్ని రోజులకే ఆయనపై ఇంకో పెద్ద బండను ఎత్తిపడేసింది. అందాలపోటీలో పాల్గొని ‘మిస్ ట్రాన్స్ క్వీన్ నార్త్ఈస్ట్’గా టైటిల్ గెలుచుకుంది. అధికారికంగా తను పేరు మార్చుకుంది కూడా అప్పుడే. అప్పటికి ఆమె రిమ్స్ స్టూడెంట్. రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనెస్! మంచి కాలేజ్. డాక్టర్ అవ్వాలని ఆమె ఆశయం. ఇంఫాల్‌లోని రిమ్స్‌లో నాలుగున్నరేళ్ల ఎంబీబిఎస్ పూర్తి చేసి, తర్వాత రెండేళ్లు డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసి ఈమధ్యే షిజా ఇన్స్టిట్యూట్లో చేరారు. ఈశాన్య భారతదేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ లేడీ డాక్టర్ బెయాన్సి ఇప్పుడు. ‘‘బెయాన్సిని మనం స్త్రీ అని గానీ, పురుషుడు అని గానీ తీసుకోలేదు. మనకు ఆమె నైపుణ్యం గల ఒక డాక్టర్ మాత్రమే’’ అని అన్నారు ఆసుపత్రి సూరింటెండెంట్ జుగింద్ర తొలిరోజు ఆమెను మిగతా వైద్యసిబ్బందికి పరిచయం చేస్తున్నప్పుడు. ఇప్పుడామె వైద్యురాలిగా పనిచేస్తూనే రిమ్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షకు సిద్ధం అవుతున్నారు. ఎంబీబిఎస్ మూడో సంవత్సరంలో ఉన్నప్పుడే తనను తను అమ్మాయిగా ప్రపంచానికి వెల్లడించుకున్నారు బెయాన్సి. అయితే తన గురించి తనకు వెల్లడయింది మాత్రం తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు. తను అబ్బాయే కానీ, మిగతా అబ్బాయిల్లా ఉండటం లేదు. పైగా అమ్మాయిలా ఉంటున్నాడు. తనకూ అమ్మాయిలానే ఉండాలని అనిపిస్తోంది! ఒక్కో ఏడాది కాదు.. ఒక్కోరోజు గడుస్తున్న కొద్దీ ‘ఆమె’ తనను తను ఇష్టపడటం మొదలైంది. స్కూల్లో తనకు అమ్మాయిల పక్కన కూర్చోవాలనిపించేది. వాళ్ల బట్టల్ని ఇష్టపడుతుండేది. వాళ్ల నడకను, నవ్వును చాటుగా అనుకరిస్తుండేది. ఇదంతా ఇంట్లో వాళ్లు గమనించడానికి ముందు టీచర్ గమనించింది. స్కూల్లోనూ, ఇంట్లోనూ తెలిశాక దాచడానికి ఏముంటుంది. ‘నేనిలా అవుతున్నాను..’ అని ఇంట్లో చెప్పేసింది. ‘నుపీ మాన్బీ!!’ అని పెద్దగా అరిచేశాడు తండ్రి. నుపీ మాన్బీ అంటే ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలోని స్త్రీ. మౌనం అక్కడ మొదలైంది బెయాన్సి జీవితంలో. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. అదలా ఉంచితే, సాధారణ రోగులకే కాదు, నుపీ మాన్బీ స్త్రీల ఆరోగ్యం కోసం కూడా తనేదైనా చేయాలని ఆలోచిస్తున్నారిప్పుడు బెయాన్సి. ఇప్పుడిప్పుడు ఇంటికి రాకపోకలు కూడా మొదలయ్యాయి. అంటే.. తల్లిదండ్రులు ఆమెను ఆమెగా స్వీకరించేశారు! ఎవరి జీవితం వాళ్ల ఇష్టం అని అనుకోగలిగిన మనోబలాన్ని చేకూర్చుకున్నారు. ఇరవై ఏళ్ల వయసులో ‘మిస్ ట్రాన్స్ క్వీన్ నార్త్ ఈజ్’గా బెయాన్సి -
బియాన్స్... బడ్జెట్ అదుర్స్
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూతురి పెళ్లి సంబరాలు ఇటీవల జరిగిన విషయాన్ని వినే ఉంటారు. ఇండియన్ సెలబ్రిటీలను మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ సెలబ్రిటీలను కూడా ఆహ్వానించారు అంబానీ. కేవలం వెడ్డింగ్ పార్టీల కోసమే సుమారు వంద మిలియన్ డాలర్లను కార్లో పెట్రోల్లా ఖర్చు పెట్టారట ఆయన. ఈ ఫంక్షన్లో హాలీవుడ్ సింగర్ బియాన్స్ కనిపించడం విశేషం. ఎందుకంటే బియాన్స్ ఒక్క ప్రైవేట్ పార్టీకి సుమారు 3–4 మిలియన్ డాలర్స్ (దాదాపు 20 కోట్ల రూపాయలు) అందుకుంటారట. 2017లో మ్యూజిక్ ఇండస్ట్రీలో అత్యధికంగా సంపాదించిన సింగర్‌గా బియాన్స్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఆమె అంబానీ పార్టీ కోసం ఎంత తీసుకున్నారంటే.. సుమారు 28 కోట్లు పుచ్చుకున్నారని టాక్. -
హ్యాపీ బర్త్‌డే ఇషా : ‘సంగీత్’ పై ఆసక్తికర వార్త
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతాల ముద్దుల తనయ ఇషా అంబానీ వివాహం వేడుక అంశం మరోసారి వార్తల్లో కిచ్చింది. త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనున్న ఇషా, ఆనంద్ పిరామల్ (ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ పిరామల్ ఇండస్ట్రీస్ చైర్మన్ అజయ్ పిరామల్ తనయుడు)మూడుముళ్ల సంబరానికి ముందస్తు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఈ కార్పొరేట్ కుటుంబాలు ప్లాన్ చేశాయి. పెళ్లిలో ప్రధాన ఘట్టమైన సంగీత్ ను స్పెషల్ ఎట్రాక్షన్‌తో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయనున్నాయని మీడియాలో పలు అంచనాలు గుప్పుమన్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించనున్న సంగీత్ కార్యక్రమానికి ప్రముఖ పాప్ సింగర్ ప్రదర్శన ఇవ్వనున్నారట. అంతేకాదు ఇందుకు ఆమె భారీగా పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రీ రాయల్ వెడ్డింగ్ బాష్‌ను ఉదయపూర్‌లో ప్లాన్ చేశారట. ప్రముఖ ఇంటర్నేషనల్ పాప్ స్టార్ బియాన్సే ఈ సంగీత్ కార్యక్రమంలో తన ప్రదర్శనతో హల్ చల్ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఆమెకు రూ.15 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారని తెలుస్తోంది. కాగా డిసెంబర్10న ముంబైలో వీరు పెళ్లి పీటలెక్కనున్నారట. ఈ లవ్‌బర్డ్స్ నిశ్చితార్థ కార్యక్రమాన్ని గత నెలలో ఇటలీలో అధికారికంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు అక్టోబర్ 23 ఇషా అంబానీ 27వ పుట్టిన రోజు. -
గ్రామీ అవార్డుల్లో అడెలె హవా
లాస్ఏంజిల్స్: సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘గ్రామీ’ పురస్కారాల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. 59వ ‘గ్రామీ’ అవార్డుల్లో పాప్ సింగర్ అడెలె ఐదు అవార్డులు గెలుపొంది సత్తాచాటారు. ఆమెకు ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్(25), రికార్డ్ ఆఫ్ ద ఇయర్(హలో), సాంగ్ ఆఫ్ ద ఇయర్(హలో) అవార్డులతో పాటు.. బెస్ట్ పాప్ సోలో పర్ఫామెన్స్, బెస్ట్ పాప్ ఓకల్ ఆల్బమ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 9 విభాగాల్లో నామినేషన్ పొందిన బియోన్స్.. బెస్ట్ మ్యూజిక్ వీడియో, కాంటెంపరరీ ఆల్బమ్ అవార్డులను గెలుచుకున్నారు. డేవిడ్ బొవీకి నాలుగు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ రాక్ సాంగ్(బ్లాక్‌స్టార్), ఉత్తమ రాక్ పర్ఫామెన్స్(బ్లాక్‌స్టార్) అవార్డులు డేవిడ్ బొవీకి దక్కాయి. -
సంచలనం రేపుతున్న పాప్‌స్టార్ వీడియో
తొలిపాటతోనే పాప్ లవర్స్‌ను ఆకట్టుకున్న ప్రముఖ పాప్ స్టార్, హాలీవుడ్ సింగర్ బియాన్స్ నోల్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఒక పాపకు తల్లి అయిన ఈ హాలీవుడ్ సింగర్ ఇపుడు ఇన్ స్టాగ్రాం లో స్టన్నింగ్ వీడియోనొకదాన్ని పోస్ట్ చేసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. పాటల రచయిత్రి కూడా అయిన ఈమె తాను త్వరలోనే కవలలకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించింది. ‘నాకు మూడు గుండెలు’ అనే టైటిల్ తో వీడియోను షేర్ చేసింది. అంతేకాదు పాప్ సంస్కృతిలో ప్రతిరూపమైన 1480 నాటి అద్భుతమైన చిత్రం సాన్డ్రో బొట్టిసేల్లి (ఐకానిక్ బర్త్ ఆఫ్ వీనస్) పెయింటింగ్‌ను పోలిన ఫోటోకు పోజిచ్చింది. తనకు ట్విన్స్ పుట్టబోతున్నారని , ప్రేమను అభిమానాన్ని పంచాల్సిందిగా కోరింది. తన కూతురు బేబీ బంప్ ను మురిపెంగా ముద్దుపెట్టుకున్న ఫోటోతో పాటు కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను కూడా జతచేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇన్స్టాగ్రామ్ క్వీన్ సెలెనా గోమెజ్ రికార్డులను బద్దలు కొడుతూ సుమారు 6.33మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. 3, 34,000 కమెంట్లతో దూసుకుపోతోంది. ట్విట్టర్ లో కూడా ఈ వీడియో 45 నిమిషాల్లో 500,000 ట్వీట్స్‌తో సునామీ సృష్టిస్తోంది. కాగా తన ప్రియుడు, ర్యాపర్ జేజెడ్ను రహస్యంగా పెళ్లి చేసుకుని అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ప్రపంచంలోని శక్తిమంతులైన వందమంది సెలబ్రిటీల జాబితాలో ఫోర్బ్స మ్యాగజీన్ టాప ప్లేస్ ను దక్కించుకుంది. ప్రపంచం మెచ్చిన ఈ సెలబ్రిటీ సింగర్ 20 గ్రామీ అవార్డులతోపాటు ఆస్కార్ కూడా అందుకుంది. -
సంచలనం రేపుతున్న పాప్‌స్టార్ వీడియో
-
పొడవాటి గౌన్లు.. హొయలొలికించిన భామలు
అమెరికాః ఫ్యాషన్ ప్రపంచం రోజురోజుకూ విస్తరిస్తోంది. డిజైనర్లు విభిన్న రీతులను ప్రదర్శించడంలో తమ ప్రతిభను అత్యద్భుతంగా చాటుతున్నారు. ఇటీవల ప్రారంభమైన మెట్ గాలా ఫ్యాషన్ పెరేడ్ అందుకు తార్కాణంగా నిలిచింది. అందమైన పొడవాటి గౌన్లు ధరించి, ఎర్రతివాచీపై ఒయ్యారాలొలికించిన మోడల్స్ సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఫ్యాషన్ కు మరోపేరైన మెట్ గాలా 2016 సంబరాలు అమెరికాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి హాలీవుడ్ నటీనటులు, ఫ్యాషన్ డిజైనర్లు అనేకమంది హాజరయ్యారు. విలక్షణమైన డిజైన్లతో కూడిన విభిన్న దుస్తులు ధరించిన సెలబ్రిటీలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నారు. ప్రతియేటా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ సంస్థకు నిధులు సేకరించేందుకు ఈ మెట్ గాలా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఫ్యాషన్ ప్రముఖ మోడల్స్ తో పాటు, నటీనటులు కూడ స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకొస్తారు. ఈసారి కార్యక్రమం ప్రారంభోత్సవంలో హాలీవుడ్ తారలు ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఫ్యాషన్ పెరేడ్ లో పాల్గొన్న మోడల్స్... తమ దుస్తుల డిజైన్లలో ఒక్కోరు ఒక్కో ప్రత్యేకతను ప్రదర్శించారు. మినీలూయిస్ విట్టన్, మెటాలిక్ రబ్బరు గివెన్సీ గౌన్లు, అద్దకాలతో కూడిన లేజర్ కట్ యాక్రిలిక్స్, షిఫాన్ బుర్బెర్రీ దుస్తులతోపాటు... గొలుసులతో అల్లినట్లుగా కనిపించే చెయిన్ మెయిల్ బాల్మెయిన్ వంటి అనేక రకాల అదరగొట్టే డిజైన్లను ధరించిన మోడల్స్ ర్యాంప్ పై హొయలొలికించారు. ఫ్యాషన్ షోలో తన ఫేరీ టేల్ దుస్తులతో విభిన్నతను చాటిన క్లారీ డేన్స్ ప్రత్యేకతగా నిలువగా, కెన్డాల్ జెన్నర్ ఫ్యాషన్ ప్రపంచాన్ని తన దుస్తులతో విభిన్నంగా చూపారు. జిగి, జాయిన్ లు రోబో కాప్ లుక్ తో మెట్ గాలా బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందారు. -
'షో' ముందు భార్యకు 10వేల రోజాలు పంపాడు!
లాస్ఏంజిల్స్: అర్ధాంగి మీద ప్రేమ అంటే ఇలా ఉండాలి అని నిరూపించాడు ర్యాపర్ జే జెడ్. ప్రాణప్రదమైన తన భార్య బియాన్సే 'సూపర్ బోల్-50'లో ప్రదర్శన ఇస్తున్న సందర్భంగా ఊహించని ఆశ్చర్యంలో ఆమెను ముంచేత్తాడు. షోకు ముందు ఏకంగా తన భార్యకు పదివేల గులాబీపూలు కానుకగా పంపాడు. సాంట్ కార్లాలో లెవిస్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన 'సూపర్ బోల్ -50'లో పాప్ స్టార్ బియాన్సే తన ప్రదర్శనతో దుమ్మురేపింది. ప్రతిష్టాత్మకమైన ఈ షోకు ముందు తన భార్యపై ప్రేమను చాటుతూ ఆమెకు పదివేల గులాబీలతో జే జెడ్ శుభాభినందనలు తెలిపాడు. మరోవైపు 'సూపర్ బోల్' మ్యూజిక్ షోలో ఆద్యంతం తన సంగీత, నృత్య విన్యాసాలతో అదరగొట్టిన పాప్ సింగర్ బియాన్సే ఆకట్టుకుంది. బ్లాక్ పాంథర్స్ పార్టీకి మద్దతుగా ఆమె ఈ షోలో ఓ ప్రదర్శన ఇవ్వడం సంచలనం సృష్టించింది. -
ప్రియాంకకు అభిమానుల ఝలక్...
తనను ఏ ప్రశ్న అయినా అడగొచ్చంటూ సోషల్ మీడియాలో సవాలు విసిరిన ప్రియాంకా చోప్రాకు అభిమానులు ఝలక్ ఇచ్చారు. మీడియాలో ఆమెపై వచ్చిన వదంతులన్నింటిపైనా ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న వార్తలు మొదలుకొని, షారూఖ్‌తో ప్రేమాయణంపై వచ్చిన కథనాల వరకు పలు ఇబ్బందికరమైన అంశాలపై గుచ్చి గుచ్చి ప్రశ్నించి ఇరకాటంలో పెట్టడంతో ప్రియాంక కంగుతింది. ఇళ్లులేని వారిపై బియాన్స్ ఔదార్యం పాప్‌స్టార్ బియాన్స్ ఇళ్లులేని వారి కోసం 7 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చి, ఔదార్యాన్ని చాటుకుంది. హూస్టన్ చర్చి పాస్టర్ రూడీ రాస్మస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇళ్లులేని 42 కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఆమె ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చిందని పాస్టర్ రాస్మస్ ఒక స్థానిక న్యూస్ చానల్‌కు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాల కోసం బియాన్స చాలా ఔదార్యాన్ని చూపుతోందని ఆయన అన్నారు.