తొలిపాటతోనే పాప్ లవర్స్‌ను ఆకట్టుకున్న ప్రముఖ పాప్ స్టార్ బెయోన్సు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఒక పాపకు తల్లి అయిన ఈ హాలీవుడ్ సింగర్ ఇపుడు ఇన్ స్టాగ్రాం లో స్టన్నింగ్ వీడియోనొకదాన్ని పోస్ట్ చేసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. గర్భవతి అయిన ఈమె ’నాకు మూడు గుండెలు’ అనే టైటిల్ తో వీడియోను షేర్ చేసింది. తనకు ట్విన్స్ పుట్టబోతున్నారని , ప్రేమను అభిమానాన్ని పంచాల్సిందిగా కోరింది. తన కూతురు తన బేబీ బంప్ ను మురిపెంగా ముద్దుపెట్టుకున్న ఫోటోలతో పాటు కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ క్వీన్ సెలెనా గోమెజ్ రికార్డులను బద్దలు కొడుతూ సుమారు 6.33మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. 3, 34,000 కమెంట్లతో దూసుకుపోతోంది. ట్విట్టర్ లో కూడా ఈ వీడియో 45 నిమిషాల్లో 500,000 ట్వీట్స్‌తో సునామీ సృష‍్టిస్తోంది.
Published Thu, Feb 2 2017 7:11 PM | Last Updated on Wed, Mar 20 2024 1:23 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement