సంచలనం రేపుతున్న పాప్‌స్టార్ వీడియో
తొలిపాటతోనే పాప్ లవర్స్‌ను ఆకట్టుకున్న ప్రముఖ పాప్ స్టార్, హాలీవుడ్ సింగర్ బియాన్స్ నోల్స్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఒక పాపకు తల్లి అయిన ఈ హాలీవుడ్ సింగర్ ఇపుడు ఇన్ స్టాగ్రాం లో స్టన్నింగ్ వీడియోనొకదాన్ని పోస్ట్ చేసి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది. పాటల రచయిత్రి కూడా అయిన ఈమె తాను త్వరలోనే కవలలకు జన్మనివ్వబోతున్నట్టు ప్రకటించింది. ‘నాకు మూడు గుండెలు’ అనే టైటిల్ తో వీడియోను షేర్ చేసింది. అంతేకాదు పాప్ సంస్కృతిలో ప్రతిరూపమైన 1480 నాటి అద్భుతమైన చిత్రం సాన్డ్రో బొట్టిసేల్లి (ఐకానిక్ బర్త్ ఆఫ్ వీనస్) పెయింటింగ్‌ను పోలిన ఫోటోకు పోజిచ్చింది.
తనకు ట్విన్స్ పుట్టబోతున్నారని , ప్రేమను అభిమానాన్ని పంచాల్సిందిగా కోరింది. తన కూతురు బేబీ బంప్ ను మురిపెంగా ముద్దుపెట్టుకున్న ఫోటోతో పాటు కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను కూడా జతచేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇన్స్టాగ్రామ్ క్వీన్ సెలెనా గోమెజ్ రికార్డులను బద్దలు కొడుతూ సుమారు 6.33మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. 3, 34,000 కమెంట్లతో దూసుకుపోతోంది. ట్విట్టర్ లో కూడా ఈ వీడియో 45 నిమిషాల్లో 500,000 ట్వీట్స్‌తో సునామీ సృష్టిస్తోంది.
కాగా తన ప్రియుడు, ర్యాపర్ జేజెడ్ను రహస్యంగా పెళ్లి చేసుకుని అప్పట్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ప్రపంచంలోని శక్తిమంతులైన వందమంది సెలబ్రిటీల జాబితాలో ఫోర్బ్స మ్యాగజీన్ టాప ప్లేస్ ను దక్కించుకుంది. ప్రపంచం మెచ్చిన ఈ సెలబ్రిటీ సింగర్ 20 గ్రామీ అవార్డులతోపాటు ఆస్కార్ కూడా అందుకుంది.