లాస్‌ఎంజిల్స్: ఎట్టకేలకు ప్రఖ్యాత హాలీవుడ్ 63వ గ్రామీ అవార్డ్స్ అవార్డు ఫంక్షన్ మార్చి 14న లాస్‌ఎంజిల్స్‌లో జరిగాయి. మ్యూజిక్ ఇండస్ట్రీలో జరిగే పాపులర్ అవార్డుల వేడుక గ్రామీ. ఈ వేడుకలతో అత్యధికంగా ట్రోఫీలను గెలుచుకున్న మహిళగా బెయోన్స్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బెయాన్స్ 28 ట్రోఫీలను గెలిచింది. ప్రముఖ సింగర్ అలిసన్ క్రాస్‌ను దాటింది.కోవిడ్-19 నేపథ్యంలో జనవరి 31న జరగాల్సిన ఈ వేడుకను మార్చి 14కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణులతో, అవార్డు నామినీలతో, ఆర్టిస్టులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ వేడుకను వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ ఏడాది గ్రామీ విజేతలు వీరే..
రికార్డ్ ఆఫ్ ది ఇయర్: ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ బై బిల్లీ ఎలిష్
ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్: ఫోక్‌లోర్ బై టేలర్ స్విఫ్ట్
సాంగ్ ఆఫ్ ది ఇయర్: ఐ కాంట్ బ్రీత్ బై హెచ్.ఈ.ఆర్
ఉత్తమ నూతన ఆర్టిస్ట్: మేగాన్ దీ స్టాలియన్
ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన: వాటర్‌మెలాన్ బై హ్యారీ స్టైల్స్
ఉత్తమ రాక్ సాంగ్: స్టే హై బై బ్రిటనీ హోవార్డ్
ఉత్తమ రాక్ ఆల్బమ్: ది న్యూ ఆబ్‌నార్మల్ బై ది స్ట్రోక్స్
ఉత్తమ ర్యాప్ సాంగ్: సావేజ్ బై మేగాన్ తీ స్టాలియన్
ఉత్తమ ర్యాప్ ఆల్బమ్: కింగ్స్ డిసీజ్ బై నాస్(చదవండి: ఒక వేడుక.. రెండు వేదికలు)
గ్రామీ అవార్డు విజేతలు వీరే...
Published Mon, Mar 15 2021 10:31 AM | Last Updated on Mon, Mar 15 2021 10:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment