ప్రధాన వార్తలు

ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. టీడీపీ నేతలకు పోలీసుల వత్తాసు: సజ్జల
సాక్షి, గుంటూరు: ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని ఆరోపించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో పోలీసు రాజ్యాంగం నడుస్తోందన్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారని విమర్శించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో చంద్రబాబు డైరెక్షన్లో పోలీసు రాజ్యాంగం నడుస్తోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ప్రభుత్వం పెద్దలకు వత్తాసు పలుకుతున్నారు. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ఏపీలో ప్రజాస్వామ్యం లేదు. టీడీపీ నేతలు దాడులు చేస్తే పోలీసులే ప్రొటెక్ట్ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేశారు. నాగమల్లేశ్వరరావు ప్రాణాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. సర్పంచ్ నాగమల్లేశ్వరావు కోలుకుంటారని ఆశిస్తున్నాను. మృత్యుంజయుడిగా బయటకు వస్తాడని భావిస్తున్నాను. నాగమల్లేశ్వరరావు పైన జరిగిన దాడి రాజకీయపరమైన హత్యాయత్నం. దాడికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ భయానకంగా ఉన్నాయి. అంబటి మురళి పైనే కేసు నమోదు చేశారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది. దాడికి రెచ్చగొట్టేలా మాట్లాడిన ధూళిపాళ్లపై కేసు పెట్టలేదు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది. వైఎస్సార్సీపీ నేతల పైనే దాడులు చేయమని నేరుగా చెబుతున్నారు. నాగమల్లేశ్వరావుపై దాడి చేసిన నిందితులకు సన్మానం చేసినా చేస్తారు.పెదకూరపాడు మాజీ ఎంపీపీని ఏడాది క్రితం దారుణంగా కొట్టారు. నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై దాడి చేస్తే చర్యలేవి?. గుడివాడలో జడ్పీ చైర్‌పర్సన్‌పైన దాడి జరుగుతుంటే పోలీసులు అక్కడే ఉన్నాడు అడ్డుకోలేదు. ప్రజాస్వామ్యయుతమైన హక్కులను వైఎస్సార్సీపీ నేతల్ని వినియోగించుకోనివ్వడం లేదు. రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిపోయింది. వైఎస్ జగన్ ఇప్పటివరకూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల్లో కేసులు నమోదు చేస్తున్నారు. మామిడి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తే మామిడి యార్డు మూసివేశారు.చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీసు రాజ్యం ఇది. ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే. అందుకే ప్రజలకు చెబుతున్నాం. వైఎస్సార్సీపీని చంద్రబాబు దుర్మార్గంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని మానసికంగా వేధిస్తున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే జగన్ ఎందుకు బయటకొస్తారు. మిర్చి రైతుల కంట కన్నీరు కారుతుంది. ప్రైవేటు కేసు వేసేందుకు ప్రయత్నిస్తున్నాం.రైతులు పైన రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని ఎస్పీ అంటున్నాడు. ఆయన పోలీసా లేక రాజకీయనాయకుడా?. ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఏమైనా విధించారా అంటే అది లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన కొద్దీ మేము రాటు తేలేలా చంద్రబాబు చేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను పట్టించుకోలేదు. అందుకే ఆయనొస్తే పది మంది బయటకు రావటం లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటు. ప్రజల గురించి ఆలోచించడం జగన్‌కు అలవాటు. అందుకే జగన్ పర్యటనలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. టీడీపీ నేతలు బరితెగించి దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదు. దాడులపై వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు. మామిడి, పొగాకు, మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు’ అని చెప్పుకొచ్చారు.

Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం?
కంటిచూపుతో భయపెట్టారు. వెటకారంతో వెక్కిరించేవారు. తెలంగాణ యాసలో డైలాగులు చెప్తూ నవ్వించారు. రోజుకు 20 గంటలు పనిచేసేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ దునియాల కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) వంటి నటుడే లేడు అని నిరూపించుకున్నారు. ఊహించినదానికంటే వెయ్యి రెట్ల అభిమానం, వందలాది సినిమాలు చేసి సంపాదించిన కోట్లాది ఆస్తి.. అయినా కోట మనసు సంతోషించలేదు. పైగా గుండెలోని దుఃఖం తనను వెంటాడుతూనే ఉండేది. కారణం కొడుకును కోల్పోవడం!ఎలా మర్చిపోతాను?2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోటా కుమారుడు ఆంజనేయ ప్రసాద్ మరణించాడు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి.. తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో తల్లడిల్లిపోయారు. ఆ బాధ నుంచి బయటపడ్డారా? అని అడిగినప్పుడు మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా? జీవితం.. ఎలా మర్చిపోతాను? ఓ నిట్టూర్పు విడిచారు. కానీ నటనలో బిజీగా ఉండటం వల్ల ఆ బాధను ఎంతో కొంత తట్టుకోగలిగాను అని అనేవారు.పెళ్లయ్యాక కష్టాలుఇదొక్కటే కాదు.. ఆయన జీవితంలో కష్టాలకు కొదవలేదని కోట మాటల్లోనే తెలిసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాకు 1968లో రుక్మిణితో పెళ్లయింది. 1973లో నా భార్య డెలివరీ అయినప్పుడు ఓ విషాదం జరిగింది. ఆమె తల్లి చనిపోయారు. అప్పుడు నా భార్యకు చిన్నగా షాక్‌లాంటిది వచ్చింది. దాన్ని నేను గమనించలేకపోయాను. తర్వాత తను సైకియాట్రిక్ పేషెంట్‌గా మారిపోయింది. 30 ఏళ్లపాటు నేనెవరో కూడా గుర్తుపట్టలేదు. తను తిట్టినా ఓర్పుగా సహించాను. ఎందుకంటే తను నా భార్య. ఈ విషయం నాకు క్లోజ్‌గా ఉండేవారికి మాత్రమే తెలుసు. ఎవరికీ చెప్పలేదు.ఒంటరిగా కన్నీళ్లునా రెండో కూతురు ఎంకాం చదివింది. ఎప్పుడూ రిక్షా ఎక్కలేదు అని విజయవాడలో బంధువులతో కలిసి రిక్షా ఎక్కింది. ఎదురుగా బ్రేకులు ఫెయిలైన లారీ రిక్షాను గుద్దింది. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా నా కూతురు కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. బ్యాంకులో ఎవరిదగ్గరైతే గుమాస్తాగా పనిచేశానో ఆయనే నాకు వియ్యంకుడయ్యాడు. నా కూతురు జీవితం బాగుపడిందని సంతోషించేలోపే నా కుమారుడు చనిపోయాడు. ఆ భగవంతుడు ఎంత పేరిచ్చాడో అన్ని కష్టాలిచ్చాడు. ఇవన్నీ గుర్తుచేసుకుని అప్పుడప్పుడు ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటాను అని కోట ఎమోషనలయ్యారు. కాగా కోట శ్రీనివాసరావు జూలై 13న అనారోగ్యంతో కన్నుమూశారు.కోట ఎప్పుడూ చెప్తూ ఉండే మాట.. "నేను చచ్చేదాకా నటించాలి. చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి"(చదవండి: అందరి గుండెల్లో 'కోట'.. తనదీ చార్మినార్‌కున్నంత హిస్టరీ 'తమ్మీ')

తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని ఆయన ఆఫీస్‌పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కార్యకర్తలు దాడి చేశారు. ఆఫీస్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.మలన్న కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాలను ఆఫీస్ నుంచి పంపించివేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేశారంటూ ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు.

నా వల్లే అలా జరిగింది.. పంత్‌ను ఏమి అనొద్దు: కేఎల్ రాహుల్
లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌కు టీమిండియా ధీటైన జవాబు ఇచ్చింది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. అయితే మూడో రోజు తొలి సెషన్లో ఇంగ్లండ్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించింది.కానీ లంచ్ విరామానికి ముందు పంత్ వికెట్‌ను కోల్పోవడంతో కథ తారుమారైంది. అనవసరంగా రనౌట్ అయ్యి ఇంగ్లండ్‌కు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. కేఎల్ రాహుల్, పంత్ మధ్య సమన్వయలోపం వల్ల భారత్ వికెట్ కోల్పోవల్సి వచ్చింది.అయితే లేని పరుగు కోసం పంత్ ప్రయత్నించి రనౌటయ్యాడు అని చాలా మంది విమర్శించారు. కానీ ఈ పూర్తి బాధ్యతను రాహుల్ తీసుకున్నాడు. లంచ్ బ్రేక్‌కు ముందు సెంచరీ సాధించాలనే తన ఆత్రుత అనవసర రనౌట్‌కు అవుట్‌కు దారితీసిందని వెల్లడించాడు."ఈ మ్యాచ్‌లో మా ఇద్దరి మధ్య చాలా సంభాషణలు జరిగాయి. వీలైతే లంచ్ విరామానికి ముందే సెంచరీ సాధిస్తానని నేను పంత్‌తో చెప్పాను. బషీర్ లంచ్ బ్రేక్‌కు ముందు చివరి ఓవర్ వేయడంతో సెంచరీ చేయడానికి మంచి అవకాశం భావించాను.అందుకే పంత్ నాకు సింగిల్ తీసి స్ట్రైక్ ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టవ శాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే ఆ ఓవర్లో తొలి బంతికి బౌండరీ బాదే అవకాశముండేది. కానీ నేను మిస్ చేసుకున్నాను. ఆ బంతికి కేవలం సింగిల్ మాత్రమే లభించింది. దీంతో పంత్ మళ్లీ నన్ను స్ట్రైక్‌లోకి తీసుకురావాలనకున్నాడు. అందుకే క్విక్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో అతడు రనౌట్ అవ్వాల్సి వచ్చింది. ఇది మా ఇద్దరికీ నిరాశ కలిగించింది. కానీ ఏ బ్యాటర్ కూడా ఈ విధంగా ఔట్ అవ్వాలని అనుకోరు. ఏదేమైనా ఆ రనౌట్ మా మూమెంటమ్‌ను దెబ్బతీసింది. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇంగ్లండ్ తిరిగి గేమ్‌లోకి వచ్చింది"అని రాహుల్ మూడో రోజు ఆట అనంతరం విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ఆ తర్వాత షోయబ్ బషీర్ బౌలింగ్‌లోనే రాహుల్ 177 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసిఔటయ్యాడు. ఈ కర్ణాటక ఆటగాడు రిషబ్ పంత్‌తో కలిసి నాలగో వికెట్‌కు 140 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ సూపర్ సెంచరీ.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్

రాధిక చేసిన మిస్టేక్ అదే.. హిమాన్షిక సంచలన వ్యాఖ్యలు
గురుగ్రామ్: టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో రాధిక ప్రాణ స్నేహితురాలు స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తల్లిదండ్రులు.. రాధికను నియంత్రించారని పేర్కొంది. రాధికను తనకు నచ్చిన విధంగా జీవించనివ్వలేదని తెలిపారు.రాధిక ప్రాణ స్నేహితురాలు హిమాన్షిక సింగ్ తాజాగా మాట్లాడుతూ.. రాధిక నాకు 2012 నుంచి తెలుసు. రాధిక ఎంతో సున్నితమైన మనసు కలిగి ఉంది. రాధిక కుటుంబ సభ్యులు.. ఆమెను నియంత్రించే వారు. ఆమె నాతో వీడియో కాల్లో ఉన్నప్పుడు, ఆమె ఎవరితో మాట్లాడుతుందో తల్లిదండ్రులకు చూపించాల్సి వచ్చింది. టెన్నిస్ అకాడమీ తన ఇంటి నుంచి కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్నప్పటికీ, ఆమె ఎప్పుడు తిరిగి రావాలన్న దానిపై డెడ్‌లైన్ ఉండేది. రాధికది సంప్రదాయ కుటుంబమని, దాదాపు ప్రతి దానితోనూ సమస్యలు ఉండేవని తెలిపింది. ప్రతి విషయంలోనూ నియంత్రణ విధిస్తూ రాధిక జీవితాన్ని ఆమె తండ్రి దుర్భరం చేశాడు.బయటకు వెళ్లాక పలానా సమయంలో తిరిగి ఇంటికి రావాలని ఆంక్షలు విధించేవారు. రాధిక కదలికలను ఇంట్లోవారు నియంత్రించారు. అతను తన నియంత్రణ, ప్రవర్తన, నిరంతర విమర్శలతో కుమార్తె జీవితాన్ని సంవత్సరాలుగా దుర్భరంగా మార్చాడు. షార్ట్స్ ధరించినందుకు, అబ్బాయిలతో మాట్లాడినందుకు, తన సొంత నిబంధనల ప్రకారం జీవించినందుకు వారు ఆమెను అవమానించారు. క్రమంగా వీడియోలు చిత్రీకరించడం వంటి ఆమె అభిరుచులన్నీ కనుమరుగయ్యాయి. ఆమె ఇంట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. కుటుంబంపై సామాజిక ఒత్తిడి ఉంది. ప్రజలు ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆందోళన చెందేవారు. ఇంట్లోని ఆంక్షలతో ఆమె ఊపిరాడనట్టు ఉండేది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ రాధిక హత్యకు కారణమని తెలిపారు. రాధిక.. తన పేరెంట్స్‌కు నచ్చని కొని పనుల కారణంగానే హత్యకు గురైందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. రాధికా యాదవ్ టెన్నిస్ కోచ్‌లలో ఒకరైన అజయ్ యాదవ్ కూడా ఆమె హత్యపై స్పందించారు. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ..‘ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధిక సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్ చాట్ టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ చాట్లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను జాతీయ మీడియాకు చూపించారు. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

బంగారం ధరలు తగ్గనున్నాయా?
రోజురోజుకూ పెరిగిపోతున్న బంగారం ధరలతో కొనుగోలుదారులు బేజారవుతున్నారు. తులం (10 గ్రాములు) పసిడి ఇప్పటికే లక్ష రూపాయాలకు అటు ఇటుగా ధర పలుకుతోంది. ఈ క్రమంలో పసిడి ప్రియులకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చల్లని కబురు చెప్పింది. రానున్న నెలల్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ, వాణిజ్య ప్రమాదాలు తగ్గితే బంగారం ధర మధ్యంతర బలహీనతను అనుభవించవచ్చు లేదా యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ పెరిగితే అధిక అవకాశాల వ్యయాలను అనుభవించవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ బంగారం కొనుగోలు, రిటైల్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ మందగించడం కూడా మధ్యకాలిక బంగారం ధర సర్దుబాటుకు దారితీస్తుందని డబ్ల్యూజీసీ తెలిపింది.రూ.లక్షకు అంచున బంగారందేశంలో ప్రస్తుతం బంగారం 10 గ్రాముల ధర (24 క్యారెట్లు) రూ.99,860 వద్ద కొనసాగుతోంది. ఇటీవలి గోల్డ్ బుల్ రన్ విపరీతమైన దృష్టిని ఆకర్షించింది. 2022 నవంబర్ 3న పడిపోయిన తరువాత నుండి బంగారం ధర రెట్టింపు అయింది. ఔన్సుకు 1,429 డాలర్ల నుండి 3,287 డాలర్లకు ఎగిసింది. అంటే ఏడాదికి 30% చొప్పున పెరుగుతూ వచ్చింది. ఓ వైపు కేంద్ర బ్యాంకు కొనుగోళ్లతో పాటు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి వాణిజ్య అనిశ్చితులు దీనికి కారణమవుతున్నాయి.బంగారం ధర ఎప్పకప్పుడు కొత్త గరిష్టాలను తాకుతుండటంతో ఇన్వెస్టర్లు రిస్క్ ల పట్ల అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో బంగారం ధరల్లో మునుపటి ఒడిదుడుకులను అధ్యయనం చేసిన మీదట మధ్య లేదా ధీర్ఘకాలిక క్షీణతకు దారితీసిన సందర్భాలు కనిపించాయి. అయితే "మేము వీటిని పరిగణనలోకి తీసుకోనప్పటికీ, దీర్ఘకాలిక ఉపసంహరణలు మరింత స్థిరమైన, నిర్మాణాత్మక డిమాండ్ మార్పుల నుండి రావచ్చు. ఇది సంస్థలు, రిటైల్ పెట్టుబడిదారుల నుండి బంగారం పెట్టుబడి డిమాండ్‌లో గణనీయమైన క్షీణతకు, సరఫరాలో వేగవంతమైన పెరుగుదలకు దారితీస్తుంది" అని డబ్ల్యూజీసీ తన నివేదికలో పేర్కొంది.

ఎమ్మెల్యేగా గెలిచిన కోట.. రాజకీయాలను ఎందుకు వదిలేశాడో తెలుసా?
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. చాలా మంది సినిమా రంగం నుంచి వచ్చి ఇప్పుడు రాజకీయంగా మంచి స్థానంలో ఉన్నారు. అలా కోట శ్రీనివాసరావు కూడా సినిమాలతో బీజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చాడు. ఎమ్యెల్యే కూడా అయ్యాడు. కానీ సడెన్‌గా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు.(చదవండి: కోట శ్రీనివాసరావు మరణం.. బోరున విలపించిన బాబు మోహన్)అలా రాజకీయాల్లోకి..కోట శ్రీనివాసరావుకి బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్‌పేయి అంటే చాలా ఇష్టం. అందుకే అప్పట్లో సీనీ నటులు ఎక్కువగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరితే.. కోట మాత్రం బీజేపీలో చేరారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ప్రోత్సాహంతో బీజేపీ తరపున 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కోట ఓటమి చవిచూశాడు. అయినా బీజేపీ నాయకత్వం కోటని కీలక నేతగానే పరిగణించింది. కానీ కొన్నాళ్ల తర్వాత కోటనే రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమయ్యాడు.(చదవండి: 30 ఏళ్లపాటు కోటను గుర్తుపట్టని భార్య.. కూతురిని రిక్షా గుద్ది, కొడుకేమో.. ఒంటరిగా కన్నీళ్లు!)అందుకే రాజకీయాలు వదిలేశా: కోటఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోట ఇక రాజకీయంగానే స్థిరపడతారని, సినిమాలకు దూరమైనట్లేనని అంతా భావించారు. కానీ కోట మాత్రం సినిమాలను వదులుకోలేదు. రాజకీయంగా సేవ చేయాలని తనకు ఉన్నా..అక్కడ పరిస్థితులు నచ్చకపోవడంతో ఇక జీవితంలో రాజకీయాల్లోకి రావద్దని ఫిక్స్ అయ్యారట. ఈ విషయాన్ని గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా కోట శ్రీనివాసరావే చెప్పారు.‘1999లో ఎమ్మెల్యేగా చేశాను. అప్పుడు వాతావరణం వేరు. అప్పటి రాజకీయ నాయకుల్లో ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉండేది. మంచి పని చేశాడు అనిపించుకోవాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే కోట్లు కావాలి. 20-30 కోట్లు ఖర్చుపెట్టాలి అనే మాటలు వినబడుతున్నాయి. నా ప్రశ్న ఒక్కటే. అంత మొత్తం ఎవరు ఖర్చు పెట్టమన్నారు? అందుకే రాజకీయాలు డబ్బుమయం అవుతున్నాయని గ్రహించే నా తత్వానికి ఇక పడవు అనుకుని రాజకీయాలు వదిలేశాను’ అని కోట అన్నారు.

విద్యారంగంపై విషపు చూపు!
ఆయనో గాడిదను చూపెడతారు. దాన్ని గుర్రం అనాలంటారు. ఔనౌను అది గుర్రమేనని పెంపుడు మీడియా నమ్మ బలుకుతుంది. తామేది చెబితే జనం దాన్నే నమ్మాలనే నియ మావళిని ఆయన అమల్లోకి తెచ్చారు. అయ్యయ్యో, అది గుర్రం కాదు గాడిదని అమాయకంగా ఎవరైనా అరిస్తే వారి మీద పెంపుడు మీడియా దండుపాళ్యం బ్యాచ్ అనే ముద్రను వేస్తుంది. ఆ దండుపాళ్యం బ్యాచ్‌ను దండించడానికి ఖాకీ మూక కదులుతుంది. దేశంలో ఉన్న అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ఆయనొకరు. ముఖ్యమంత్రి కుర్చీతో నాలుగు విడ తలుగా పదిహేనేళ్ల సావాసముంది. అయినా పచ్చి అబద్ధాలను పబ్లిగ్గా వల్లెవేయడానికి ఇప్పటికీ వెనకాడటం లేదు.ఎందుకంటే, ఆయనకది అచ్చొచ్చిన విద్య. ఆ విద్యతోనే రాజకీయంగా తనను తాను ప్రమోట్ చేసుకున్నారు. పెంపుడు మీడియా అండదండగా నిలబడింది. ఇతరులకు దక్కవలసిన ఘనతను లాఘవంగా లాగేసుకోవడంలో, ఇతరుల మెడలో వేయాల్సిన వీరతాళ్లను తన మెడలో వేసుకోవడంలో ఆయన ప్రదర్శించే దిగ్భ్రాంతికరమైన చొరవ జగమెరిగిన సత్యమే. ఆయన వయసు డెబ్బై ఐదు దాటింది. ఇంకో పదిహేనేళ్లు ఆయన నాయకత్వంలోనే పని చేస్తానని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ శిరోధార్యంగా తలపోసే సనాతన ధర్మంపై సర్వహక్కులున్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ మాత్రం మరోరకంగా ఆలోచిస్తున్నారు. సెవెంటీ ఫైవ్ దాటిందంటే శాలువా కప్పుకొని తప్పుకోవలసిందేనని ఆయన కుండబద్దలు కొడుతున్నారు.ఆరెస్సెస్ బాస్ విధిస్తున్న ఈ సెవెంటీ ఫైవ్ డెడ్‌లైన్‌పై భారత రాజకీయాల్లో ఈ సంవత్సరం పెద్ద చర్చే జరిగే అవ కాశముంది. ఈ నేపథ్యంలో మన సెవెంటీ ఫైవ్ ప్లస్ బాబు కూడా తననింతటి వాడిని చేసిన గోబెల్స్ వ్యూహాన్ని తన వారసుడి కోసం కూడా అమలు చేయడం మొదలుపెట్టాడు. అమెరికా వాళ్లు ఇటీవల ఇరాన్ మీద ప్రయోగించిన బంకర్ బస్టర్ లాంటి బాంబునొకదాన్ని సత్యసాయి జిల్లా కొత్తచెరువు స్కూల్లో చంద్రబాబు జారవిడిచారు. అడపాదడపా ఇలా బాంబులేయడం రివాజే కనుక పెద్దగా గగ్గోలు పుట్టలేదు కానీ, ఈ రకమైన క్షుద్ర రాజకీయాలను ఇంకో తరం కూడా భరించ వలసిందేనా అనే ఆందోళన మాత్రం మొదలైంది.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన విప్లవాత్మక కార్యాచరణలో ‘అమ్మఒడి’ అనే పథకం అతి ముఖ్యమైనఅంశం. 2014 ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో లోనే ఆయనీ వాగ్దానం చేశారు. 2019లో గెలిచిన తర్వాత అమలు చేయడం, దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురవడం తెలిసిన విషయాలే. చంద్రబాబు ఈ పథకం పేరు ‘తల్లికి వందనం’గా మార్చి మరింత గొప్పగా చేస్తానంటూ తన సూపర్ సిక్స్ ఎన్నికల హామీల్లో చేర్చారు. ఏడాది ఎగనామం తర్వాత ఆంక్షల వర్తింపుతో అమల్లోకి తెచ్చి ఆ వీరతాడును మీడియా కెమెరాల సాక్షిగా తన కుమారుడి మెడలో వేశారు. పాఠశాల పిల్లలతో మాట్లాడుతూ ‘‘విద్యామంత్రి బాగా చదువుకున్నారు. మంత్రయ్యారు. ఇప్పుడు మీకోసం ‘తల్లికి వందనం’ అనే ఆలోచన ఆయనే చేశార’’ని నిస్సంకోచంగా చెప్పుకొచ్చారు. ఆ విధంగా తన గోబెల్స్ బాటన్‌ను మరుసటి తరం చేతికి అందజేశారు.‘మెగా పేరెంట్స్ – టీచర్స్ మీట్’ అనే మరో గిన్నీస్ బుక్ కార్యక్రమం ఈ వేడుకకు వేదికైంది. విద్యార్థుల డేటాబేస్‌ను నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 87 లక్షలమంది విద్యార్థులుండాలి. ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ స్కీమును వర్తింపజేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 67 లక్షలమందినే లెక్క తేల్చింది. అందులో తల్లికి వందనం నిధులు 60 లక్షల లోపు విద్యార్థులకే అందినట్టు లెక్కలున్నాయి. మెగా పీటీఎమ్ రికార్డు బ్రేకింగ్ కార్యక్రమానికి 61 వేల పాఠ శాలల్లోని 74 లక్షలమంది విద్యార్థులు పాల్గొన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వారి తల్లిదండ్రులతో సహా 2 కోట్ల 30 లక్షల మంది హాజరై రికార్డు సృష్టించినట్టు చెప్పారు. 67 లక్షల మంది పిల్లల లెక్క తీసుకున్నప్పుడు తల్లుల సంఖ్యను 42 లక్షలుగా చూపెట్టారు. 74 లక్షలకు అదే నిష్పత్తితో లెక్కిస్తే తల్లుల సంఖ్య 46 లక్షలవుతుంది. అదే సంఖ్యలో తండ్రులు కూడా హాజరై ఉంటారు. 3 లక్షల పైచిలుకు టీచర్లు హాజరయ్యారు. అంతా కలిపి 1 కోటీ 69 లక్షలు. ఇంకో 60 లక్షలమంది పరిశీలకులూ, దాతలని పేర్కొన్నారు. సగటున ప్రతి పాఠశాలకు వందమంది వీరే. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థుల సంఖ్య కంటే దాతల సంఖ్యే ఎక్కువ కనిపించడం గిన్నిస్ బుక్‌లో చేర్చాల్సిన అసలు విషయం.విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్ సంస్థలే చూసుకోవాలన్న చంద్రబాబు కొటేషన్ మరీ పాతదేం కాదు. ఆరేడేళ్ల కిందటిదే. ఇంతలోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం ఆయన తన ఫిలాసఫీని వదిలేసు కున్నారా? ఎంతమాత్రమూ కాదు. ఇది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అనే డబుల్ యాక్షన్ ప్లాన్. ఈ పథ కాన్ని అమలు చేసే నాటికే ప్రభుత్వ బడుల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేటు స్కూళ్లకు దీటుగా సౌకర్యాలు మెరుగుపరిచే ‘నాడు–నేడు’ కార్యక్రమం ఆగిపోయింది. విద్యార్థుల పౌష్టికాహారం కోసం 16 రకాల పదార్ధాలతో జగన్మోహన్రెడ్డి స్వయంగా పరిశీలించిన ‘గోరుముద్ద’ పథకం స్థానంలో బొద్దింకల భోజనం స్వయంగా మంత్రుల అనుభవంలోకే వచ్చింది. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రాథమిక స్థాయిలోనే జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్జెక్ట్ టీచర్ బోధన ఎగిరిపోయింది. విద్యార్థులు లేక 4,700 పాఠశాలలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి.పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం వైసీపీ సర్కార్ వెయ్యి స్కూళ్లలో ప్రారంభించిన సీబీఎస్ఈ బోధనను చంద్రబాబు – లోకేశ్‌ల సర్కార్ తొలగించింది. వారి నైపుణ్యానికి పదును పెట్టే టోఫెల్ శిక్షణను మాయం చేశారు. నగరాల్లో ఉన్నత వర్గాల వారు వారి పిల్లలకోసం లక్షలు గుమ్మ రించి చెప్పించే ఐబీ సిలబస్‌ను పేద పిల్లలకు ఉచితంగా నేర్పించాలన్న జగన్ సంకల్పానికి గండికొట్టారు. పేద విద్యార్థులు కూడా డిజిటల్ ప్రపంచంలో ముందడుగు వేయాలన్న లక్ష్యంతో ఎనిమిదో క్లాసు విద్యార్థులకు ట్యాబ్‌లను అందజేయడం ప్రారంభించింది జగన్ ప్రభుత్వం. ఆయన హయాంలో సుమారు పది లక్షలమంది చేతుల్లోకి ట్యాబ్‌లు వచ్చాయి. ఈ కార్య క్రమాన్ని నిర్దాక్షిణ్యంగా ఆపేసి, పేద బిడ్డల్ని డిజిటల్ ప్రపంచానికి దూరం చేసే కుట్రను అమలుచేశారు. పేద ప్రజల పిల్లల్ని ఐక్యరాజ్యసమితి వేదికపై నిలబెట్టిన ఇంగ్లిష్ మీడియం బోధనకు వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు చేశారో, ఎంతమంది కుహనా సాంస్కృతిక రాబందుల్ని రంగంలోకి దింపారో, పేద పిల్లల నోటి దగ్గరి ‘నాణ్యతా’ ముద్దను తన్నేయడానికి ఎన్ని గద్దలు ఎగిరాయో ఈ సమాజం జ్ఞాపకాల్లోంచి అంత త్వరగా చెరిగిపోయేవి కావు.పేదల విద్యాసాధికారత మీద ఇన్ని కుట్రలు చేసిన తెలుగుదేశం పెద్దల పుర్రెల్లో ‘తల్లికి వందనం’ ఆలోచన పుట్టిందని చెప్పడం కంటే హాస్యాస్పద విషయం ఇంకేముంటుంది? ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని నిలిపివేయడం, జగన్ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను క్రమంగా ఉపసంహరించడం, మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చడం వంటివన్నీ ఉద్దేశ పూర్వక చర్యలేనని అభిజ్ఞవర్గాల సమాచారం. ఈ చర్యలు ఇంకా చురుగ్గా సాగుతాయట! రెండో దశలో ఇంకో ప్రచారం మొదల వుతుంది. ప్రైవేట్ స్కూళ్లలో చదివినా తల్లికి వందనం వస్తున్న ప్పుడు సౌకర్యాలు లేని ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదవాలని టముకు వేస్తారు. చేరగలిగిన వాళ్లంతా ప్రైవేట్‌కు మారిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ప్రైవేట్ స్కూళ్లలో చదివించే స్థోమత కలిగిన వారికి ప్రభుత్వ సాయమెందుకని పెంపుడు మీడియానే ప్రశ్నిస్తుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. విద్య ప్రభుత్వం బాధ్యత కాదనే చంద్రబాబు మాట నెగ్గి ప్రైవేట్ విద్య వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. నాణ్యమైన విద్యకు దూరమైన శ్రామిక వర్గాల పిల్లలు చౌక శ్రామికులుగానే మిగిలిపోతారు.బాల్యంలో వేగంగా నేర్చుకునే వయసులో ఉన్నప్పుడు వారికి అందే విద్యా ప్రమాణాలే వారి ఐక్యూ స్థాయులను నిర్ధారిస్తాయని అనేక సర్వేలు వెల్లడించాయి. పోషకాహార లేమి వేగంగా నేర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని కూడా చాలాకాలంగా నిపుణులు చెబుతున్నారు. ఉన్నత స్థాయి బోధనా పద్ధతులు, డిజిటల్ పరిజ్ఞానం. పౌష్టికాహారం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండి ఎక్కువమంది బాలలకు అందని ద్రాక్షలుగా ఉన్న దేశాలు ఐక్యూ ర్యాంకుల్లో వెనుకబడి ఉండటానికి కారణం అదే. విద్యా వ్యవస్థపై శాస్త్రీయమైన మదింపు చేసిన తర్వాతనే జగన్ మోహన్‌రెడ్డి మన పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని తన ప్రసంగాల్లో, సందేశాల్లో పదేపదే ప్రస్తావించేవారు. జగన్,చంద్రబాబుల దృక్పథంలో ఉన్న మౌలికమైన తేడా ఇదే! పేద, ధనిక, కులం, మతం, ప్రాంతం, ఆడ, మగ తేడాల్లేకుండా చదువు అనే ఆస్తి అందరికీ సమకూరాలనేది జగన్మోహన్ రెడ్డి తాత్విక భూమిక. చదువు అనే ఆస్తి కూడా కొనుగోలు చేయగలిగినవాడికే చెందాలనేది చంద్రబాబు విచార ధార.అందుకే దాన్ని ప్రభుత్వ బాధ్యతగా కాకుండా కార్పొరేట్ బాధ్యతగా వర్గీకరించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో కాకుండా ఒక ఎరగా వేశారని నిపుణులు అభిప్రా యపడుతున్నది కూడా అందుకే!ఈ మౌలికమైన తేడా ఇప్పుడు ఉపాధ్యాయుల అనుభవంలోకి కూడా వచ్చినట్టుంది. మొన్నటి మెగా పీటీఎమ్ కార్య క్రమాన్ని ఒక ఈవెంట్‌లా నిర్వహిస్తున్నారంటూ వారి సామాజిక మాధ్యమ గ్రూపుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందులో ఒక్క పోస్టును క్లుప్తంగా గమనిస్తే వారి అభిప్రాయం ఏమిటో తేటతెల్లమవుతుంది. ‘‘బాబుగారూ, లోకేశ్‌గారూ... మీరు ఈ సమావేశంలో కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కావు. మీ ఎదురుగా వున్న ఐఎఫ్‌పీ ప్యానెళ్లు మీరు ఏర్పాటు చేయలేదు. పైన తిరుగుతున్న ఫ్యాను, వెలుగుతున్న లైటూ కూడా మీరిచ్చినవి కావు. మిగిలిన నాలుగేళ్లయినా ఈ పనికి మాలిన సమావేశాలు మానేయండి. టీచర్ల కాలాన్ని వృథా చేయకండి. పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి. ఉపాధ్యా యుల్ని మీ కూటమి ప్రభుత్వం ఈవెంటు మేనేజర్లుగా మార్చేస్తున్నది. పిల్లల తల్లిదండ్రులతో టీచర్ల సమావేశాలు ప్రతినెలా జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దు. ముఖ్య విషయం: పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు పాఠశాలలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా ఉన్నదా?... చెప్పండి సీ.ఎం. సారూ!’’వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

రాజ్యసభకు ప్రముఖుల నామినేట్.. జాబితా ఇదే..
న్యూఢిల్లీ: రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. రాజ్యాంగంలోని క్లాజ్ త్రీలో గల ఆర్టికల్ 80(1)(ఎ) ద్వారా మంజూరయిన అధికారాల ప్రకారం భారత రాష్ట్రపతి రాజ్యసభకు నలుగురు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేశారు. గతంలో నామినేట్ చేసిన సభ్యుల పదవీ విరమణ కారణంగా ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నామినేషన్లు దాఖలు చేశారు. The President of India has nominated Ujjwal Deorao Nikam, a renowned public prosecutor known for handling high-profile criminal cases; C. Sadanandan Maste, a veteran social worker and educationist from Kerala; Harsh Vardhan Shringla, former Foreign Secretary of India; and… pic.twitter.com/eN6ga5CsPw— ANI (@ANI) July 13, 2025రాజ్యసభకు నామినేట్ అయిన కొత్త అభ్యర్థులు వీరే..1. ఉజ్వల్ దేవరావు నికమ్: 26/11 ముంబై ఉగ్ర దాడులతో సహా అనేక ఉన్నత స్థాయి క్రిమినల్ కేసులను విచారించిన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్.2. సి. సదానందన్ మాస్తే: దశాబ్దాలుగా అట్టడుగు వర్గాలకు సేవలు అందిస్తున్న కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, విద్యావేత్త.3. హర్షవర్ధన్ శ్రింగ్లా: భారత మాజీ విదేశాంగ కార్యదర్శి, కీలక ప్రపంచస్థాయి పదవులలో పనిచేసిన అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త.4. డాక్టర్ మీనాక్షి జైన్: ప్రముఖ విద్యావేత్త, భారతీయ చారిత్రక విజ్ఞానానికి విశేష కృషి చేశారు.న్యాయవాది, బీజేపీ నేత ఉజ్వల్ నికమ్ 1993 ముంబై వరుస పేలుళ్లు, 26/11 ఉగ్రదాడి తదితర కేసులలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఏ) కింద ఈ నామినేషన్లు దాఖలయ్యాయి. సాహిత్యం, సైన్స్, కళలు, సామాజిక సేవ తదితర రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని రాజ్యసభకు నామినేట్ చేయడానికి రాష్ట్రపతికి ప్రత్యేక అధికారం ఉంది.

గంటలో 14 కేజీలు లాగించేశారు!
ప్రభుత్వ అధికారుల అవినీతి కథలు కొత్తేమీ కాదు కానీ.. మధ్యప్రదేశ్‌లోని ఈ తాజా ఘటన మాత్రం కొంచెం విచిత్రమైందే. గంట సమయంలో కొందరు అధికారులు ఎకాఎకిన 14 కిలోల డ్రైఫ్రూట్స్ లాగించేశారట. దీనికి సంబంధించి రూ.85 వేల బిల్లు పెడితే.. పై అధికారులకు డౌటొచ్చింది. విచారణ జరగడంతో పాపం చిక్కిపోయారు! వివరాలు...మధ్యప్రదేశ్‌లోని శాధోల్ జిల్లాలో ఉండే చిన్న గ్రామం భడ్‌వాహీ. వాన నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘జల్ గంగ సంవర్ధన్’ పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, ఎస్డీఎం, పంచాయతీ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. అంతా కలిపి 24 మంది మాత్రమే. కానీ బిల్లు మాత్రం రూ..85 వేలు అయినట్లు పెట్టారు.వీళ్లంతా కలిసి ప్రజాధనం దోచేస్తున్నారు అనుకున్నారో ఏమో.. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బిల్లును కాస్తా సోషల్ మీడియాలో పడేశారు. ఇంకేముంది.. ఒక్కపట్టున వైరల్ అయిపోయింది అది. గంట టైమ్‌లో ఈ 24 మంది అధికారులు కూర్చుని 14 కిలోల బాదాం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తిన్నారట. ఇది చాలదన్నట్టు 30 కిలోల స్నాక్స్, కాఫీ/టీల కోసం ఆరు లీటర్ల పాలు.. ఐదు కిలోల చక్కెర వాడామని బిల్లులో పెట్టారు.వీటికి రకరకాల పండ్లు అదనం! విచిత్రమైన విషయం ఇంకోటి ఉంది. సమావేశానికి హాజరైన గ్రామస్తులకు కిచిడీ మాత్రమే వడ్డించి వీరు మాత్రం పంచభక్ష్య పరమాన్నాల టైపులో డ్రైఫ్రూట్స్‌తో ‘బ్రేవ్’ మని తేన్చడం!గంట సమావేశంలో రూ.85 వేల బిల్లు ఏమిటా? అన్న అనుమానం పై అధికారులకు రావడంతో విషయం బయటకొచ్చింది. విచారణ మొదలైంది. ‘‘అబ్బే.. మేం అసలు డ్రైఫ్రూట్స్ ముట్టుకోలేదు’’ అని కొందరు అధికారులు సన్నాయి నొక్కులు నొక్కడం కొసమెరుపు!-గిళియారు గోపాలకృష్ణ మయ్యా
‘జట్టు కడదాం... హిట్టు కొడదాం’ అంటున్న స్టార్స్
ఇంటికే అందం.. ఇలాంటి ఫ్లోరింగ్..
గిల్ నీ ప్రవర్తన బాగోలేదు.. విరాట్ కోహ్లిలా చేయొద్దు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
కృష్ణా జిల్లా ఎస్పీని కలిసిన జడ్పీటీసీలు
రోజూ ఇంటికెళ్లేటపుడు తనతోనే తేసుకెళ్తున్నారు!
మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత
బాండ్లు.. బాబు, పవన్ మోసం ప్రజలకు తెలియాలి: పెద్దిరెడ్డి
ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా..!
మరాఠీ మాట్లాడని ఆటో డ్రైవర్‌పై దాడి
Mivi AI Buds: భాష ఏదైనా ‘హాయ్ మివి’ అంటే చాలు..
49వేల కోట్ల కుంభకోణం.. వెలుగులోకి దేశంలో అతిపెద్ద స్కాం
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
రూ.వెయ్యి కోట్లతో శంకర్ కొత్త సినిమా!
తెలంగాణలో ఈ అద్భుత ఆలయాన్ని దర్శించారా? (ఫొటోలు)
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
'పెద్ది'లో చరణ్ కోచ్‌గా స్టార్ హీరో.. ఫస్ట్‌లుక్ విడుదల
టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా
వల్లభనేని వంశీకి ఆగని వేధింపులు
IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభవ్.. నిన్నే నమ్ముకున్నాముగా
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు!
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్
వైభవ్ ఫెయిల్.. టీమిండియా కెప్టెన్ విధ్వంసకర సెంచరీ
కన్నప్ప సినిమాలో మసాలా.. అది లేకుంటే రెండోసారి చూసేవాళ్లం!
సార్! ఇప్పుడిక్కడున్నది మన ప్రభుత్వమే! కేజ్రీవాల్‌ది కాదు!!
'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?
టీమిండియా కొంపముంచిన కేఎల్ రాహుల్..
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
..మనం ఇక ముందుకు పోలేం సార్! మీరు ప్రారంభించాల్సిన రోడ్డు ఇదే!
సవరణపై వివరణ ఇస్తే నమ్ముతారంటారా?
‘జట్టు కడదాం... హిట్టు కొడదాం’ అంటున్న స్టార్స్
ఇంటికే అందం.. ఇలాంటి ఫ్లోరింగ్..
గిల్ నీ ప్రవర్తన బాగోలేదు.. విరాట్ కోహ్లిలా చేయొద్దు: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్
కృష్ణా జిల్లా ఎస్పీని కలిసిన జడ్పీటీసీలు
రోజూ ఇంటికెళ్లేటపుడు తనతోనే తేసుకెళ్తున్నారు!
మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత
బాండ్లు.. బాబు, పవన్ మోసం ప్రజలకు తెలియాలి: పెద్దిరెడ్డి
ఆ సినిమాతో కోటకు చేదు అనుభవం.. ఎన్టీఆర్ అలా.. బాలకృష్ణ ఇలా..!
మరాఠీ మాట్లాడని ఆటో డ్రైవర్‌పై దాడి
Mivi AI Buds: భాష ఏదైనా ‘హాయ్ మివి’ అంటే చాలు..
49వేల కోట్ల కుంభకోణం.. వెలుగులోకి దేశంలో అతిపెద్ద స్కాం
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
రూ.వెయ్యి కోట్లతో శంకర్ కొత్త సినిమా!
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
'పెద్ది'లో చరణ్ కోచ్‌గా స్టార్ హీరో.. ఫస్ట్‌లుక్ విడుదల
టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా
వల్లభనేని వంశీకి ఆగని వేధింపులు
IND vs ENG 1st Test: ఎంత పనిచేశావు వైభవ్.. నిన్నే నమ్ముకున్నాముగా
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు!
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్
వైభవ్ ఫెయిల్.. టీమిండియా కెప్టెన్ విధ్వంసకర సెంచరీ
కన్నప్ప సినిమాలో మసాలా.. అది లేకుంటే రెండోసారి చూసేవాళ్లం!
సార్! ఇప్పుడిక్కడున్నది మన ప్రభుత్వమే! కేజ్రీవాల్‌ది కాదు!!
'బాహుబలి' రీ యూనియన్.. అనుష్క అందుకే కనిపించలేదా?
టీమిండియా కొంపముంచిన కేఎల్ రాహుల్..
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
..మనం ఇక ముందుకు పోలేం సార్! మీరు ప్రారంభించాల్సిన రోడ్డు ఇదే!
సవరణపై వివరణ ఇస్తే నమ్ముతారంటారా?
ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.
సినిమా

ఎమ్మెల్యేగా గెలిచిన కోట.. రాజకీయాలను ఎందుకు వదిలేశాడో తెలుసా?
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాదు. చాలా మంది సినిమా రంగం నుంచి వచ్చి ఇప్పుడు రాజకీయంగా మంచి స్థానంలో ఉన్నారు. అలా కోట శ్రీనివాసరావు కూడా సినిమాలతో బీజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చాడు. ఎమ్యెల్యే కూడా అయ్యాడు. కానీ సడెన్‌గా రాజకీయాల నుంచి తప్పుకున్నాడు.(చదవండి: కోట శ్రీనివాసరావు మరణం.. బోరున విలపించిన బాబు మోహన్)అలా రాజకీయాల్లోకి..కోట శ్రీనివాసరావుకి బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్‌పేయి అంటే చాలా ఇష్టం. అందుకే అప్పట్లో సీనీ నటులు ఎక్కువగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరితే.. కోట మాత్రం బీజేపీలో చేరారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ ప్రోత్సాహంతో బీజేపీ తరపున 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కోట ఓటమి చవిచూశాడు. అయినా బీజేపీ నాయకత్వం కోటని కీలక నేతగానే పరిగణించింది. కానీ కొన్నాళ్ల తర్వాత కోటనే రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరమయ్యాడు.(చదవండి: 30 ఏళ్లపాటు కోటను గుర్తుపట్టని భార్య.. కూతురిని రిక్షా గుద్ది, కొడుకేమో.. ఒంటరిగా కన్నీళ్లు!)అందుకే రాజకీయాలు వదిలేశా: కోటఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోట ఇక రాజకీయంగానే స్థిరపడతారని, సినిమాలకు దూరమైనట్లేనని అంతా భావించారు. కానీ కోట మాత్రం సినిమాలను వదులుకోలేదు. రాజకీయంగా సేవ చేయాలని తనకు ఉన్నా..అక్కడ పరిస్థితులు నచ్చకపోవడంతో ఇక జీవితంలో రాజకీయాల్లోకి రావద్దని ఫిక్స్ అయ్యారట. ఈ విషయాన్ని గతంలో సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా కోట శ్రీనివాసరావే చెప్పారు.‘1999లో ఎమ్మెల్యేగా చేశాను. అప్పుడు వాతావరణం వేరు. అప్పటి రాజకీయ నాయకుల్లో ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే తపన ఉండేది. మంచి పని చేశాడు అనిపించుకోవాలనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కావాలంటే కోట్లు కావాలి. 20-30 కోట్లు ఖర్చుపెట్టాలి అనే మాటలు వినబడుతున్నాయి. నా ప్రశ్న ఒక్కటే. అంత మొత్తం ఎవరు ఖర్చు పెట్టమన్నారు? అందుకే రాజకీయాలు డబ్బుమయం అవుతున్నాయని గ్రహించే నా తత్వానికి ఇక పడవు అనుకుని రాజకీయాలు వదిలేశాను’ అని కోట అన్నారు.

మా కోటన్న ఇక లేడు.. బోరున విలపించిన బాబు మోహన్
కోట శ్రీనివాసరావు, బాబుమోహన్..తెలుగు తెరపై వీరిద్దరు చేసిన కామెడీ ఎప్పటికీ మరచిపోలేనిది. ఈ ఇద్దరు దిగ్గజ నటులు వెండితెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకునేవారు. బయట కూడా వీరిద్దరు చాలా అనోన్యంగా ఉండేవాళ్లు. కోట తనకు అన్నలాంటి వాడని బాబు మోహన్, బాబు మోహన్ నాకు తమ్ముడి కంటే ఎక్కువ అని కోట.. ప్రతిసారి చెప్పేవారు. ఆదివారం తెల్లవారుజామున కోట శ్రీనివాసరావు మరణించారనే వార్త తెలియగానే బాబు మోహన్ బోరున విలపించారు. తనకు అన్నం తినిపించే అన్న ఇక లేడంటూ ఎమోషనల్ అయ్యాడు. (చదవండి: అందరి గుండెల్లో 'కోట'.. తనదీ చార్మినార్‌కున్నంత హిస్టరీ 'తమ్మీ')తాజాగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కోటన్న మరణం తనకు తీరని లోటు అన్నారు. ‘మొన్ననే ఆయనకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడాను. ఓ సినిమా షూటింగ్ గురించి ఆయనతో చెప్పాను. నిన్ననే ఆయనను కలవానుకున్నాను కానీ కుదరలేదు. ఈ రోజు ఆయన ఇంటికి వస్తానని చెప్పా. ఉదయం 10 గంటలకు వెళ్లాల్సి ఉండే. కానీ ఈలోపే ఆయన మరణించారనే వార్త తెలిసింది. (చదవండి : ఒక గొప్ప నటుడిని కోల్పోయాం.. కోట శ్రీనివాసరావు మృతిపై ప్రముఖుల సంతాపం)సినిమాలో కనిపించినట్లుగానే బయట కూడా చాలా సరదగా ఉండేవాళ్లం. నన్ను సొంత తమ్ముడిలా చూసుకునేవాడు. ఒకే ప్లేటులో కలిసి తిన్నాం. నాకు అన్నం ముద్దలు తినిపించిన అన్న ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను’ అంటూ బాబు మోహన్ బోరున విలపించాడు.

ఒక గొప్ప నటుడిని కోల్పోయాం.. కోట మరణంపై ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని సీఎం రేవంత్ అన్నారు. కోట శ్రీనివాసరావుకు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.విభిన్న పాత్రలను పోషించి, ప్రేక్షక హృదయాల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్న విలక్షణ వెండితెర నటుడు కోటా శ్రీనివాసరావు .వారి మరణంతో సినీమా రంగం ఒక గొప్ప నటున్ని కోల్పోయింది.స్వర్గస్తులైన కోటా శ్రీనివాసరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భవంతున్ని ప్రారిస్తున్నాను.కోట కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రభాగ సానుభూతి తెలియజేస్తున్నాను- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. 'ప్రాణం ఖరీదు' చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట .కామెడీ విలన్, అయినా సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్ గా ఆయన కుటుంబం లో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగదీసింది. శ్రీ కోట శ్రీనివాస రావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమ కి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది.ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి , నా ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నా- మెగాస్టార్ చిరంజీవిభారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు సినీ నటులు కోట శ్రీనివాసరావు మరణించారు అన్న వార్త తీవ్రంగా బాధించింది. అనేక సినిమాలలో విలక్షణ నటుడగా, అనేక పాత్రలు పోషించి ప్రజా జీవితంలో శాసనసభ్యుడిగా పని చేసిన వ్యక్తి.వారి మరణం భారతీయ జనతా పార్టీకి వారి అభిమానులకు తీరని లోటు. అనారోగ్యంతో ఉన్న పార్టీ కార్యక్రమాలకు వచ్చేవారు . కోట శ్రీనివాసరావు మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం-ఎన్ రాంచందర్ రావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుతెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, అసాధారణ పాత్రధారిగా తనదైన ముద్ర వేసిన శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం ఆవేదన కలిగించింది - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విలక్షణ నటుడు, మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు కోటా శ్రీనివాస రావు గారు పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వారు అనేక అంశాలపై లోతైనా అవగాహనా కలిగిన వ్యక్తి వారితో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. సనాతన ధర్మం, సామాజిక విలువలు, భాషా పరిరక్షణ తదితర విషయలపై సమాజంలో మరి ముఖ్యంగా యువతలో చైతన్యం నింపేందుకు ఎంతో కృషి చేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించి తెలుగు సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును చాటుకున్నారు. 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారువారి సేవలను గుర్తించి 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించుకుంది. వారి మృతి సినీ రంగానికి తెలుగు సమాజానికి తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను- కేంద్రమంత్రి కిషన్ రెడ్డికోట శ్రీనివాసరావు మహా నటుడు రోజుకి 18 , 20 గంటలు పని చేసే వాళ్ళం .అరేయ్ ఒరేయ్ అంటూ పిలుచుకునే వాళ్ళము .కోట లేదని అంటే నమ్మలేకపోతున్నాను. నటన ఉన్నంత వరకు కోట ఉంటారు.- బ్రహ్మానందంఅహనా పెళ్ళంట సినిమా చూడని తెలుగు వారు వుంటారని నేను అనుకోను .నా సినిమా సూపర్ హిట్స్ లో కోట మామ ఉన్నారు. తెలుగు సినిమాలో కోట మామ గారు ప్రత్యేకం .ఆయన మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నారు .రాజకీయాల్లో కూడా కోట ఉన్నారు. కోట మామ ఎక్కడున్నా స్వర్గంలో కూడా మీరు అలాగే ఉండాలి- నటుడు రాజేంద్రప్రసాద్ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు గారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను- హీరో నందమూరి బాలకృష్ణకోట శ్రీనివాసరావు ఎంతో మంచి వ్యక్తి .తెలుగు లో తన సహా నటులకు అవకాశాలు కోసం ఎంతో పోరాడేవారు. తెలుగు నటి నటులకు అవకాశాలు ఇవ్వాలని నిర్మాతలకు చెప్పేవారు .ఆయన మరణన్ని జీర్ణించుకోలేకపోతున్నాం-నిర్మాత అచ్చిరెడ్డిచిరస్మరణీయమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన కోటా గారి మృతి సినీ లోకానికి, అభిమానులకు తీరని లోటు. కోటా శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను- మాజీ మంత్రి హరీశ్ రావుA Legend Beyond Words.My heart is heavy with the loss of Sri. Kota Srinivas garu. A phenomenal actor, an unmatched talent, and a man whose presence lit up every frame he was in. Whether it was a serious role, a villain, or comedy- he brought life into every character with a… pic.twitter.com/bMfLFwLEe3— Vishnu Manchu (@iVishnuManchu) July 13, 2025Dear Kota,You will be missed. Deeply.Your talent, your presence, your soul- unforgettable.At a loss for words. Praying for his family. Om Shanti!— Mohan Babu M (@themohanbabu) July 13, 2025Deeply saddened to hear about the passing of Kota Srinivasa Rao garu. A master of his craft, a legend who breathed life into every character he portrayed. His presence on screen was truly irreplaceable. My heartfelt condolences to his family. Om Shanti.— rajamouli ss (@ssrajamouli) July 13, 2025కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు.నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ…— Jr NTR (@tarak9999) July 13, 2025

అందరి గుండెల్లో 'కోట'.. తనదీ చార్మినార్‌కున్నంత హిస్టరీ 'తమ్మీ'
ఆయన ఏ వేషం వేసినా.. దానికో ప్రత్యేక గుర్తింపు. తన చుట్టూ ‘కోటన్నా..’ అని ముద్దుగా పిలుచుకునే సహచర నటులు.. ‘తంబీ, వారీ..’ అని ఆయన తెరపై పిలిచే పిలుపు.. ఆడియొన్స్కి వినసొంపు. నైజాం యాస అయినా.. మిగతా భాషలైనా తన నటనకు తగ్గట్లుగా మార్చుకోవడం ఆయన తరీఖా. కడుపుబ్బా నవ్వించడంలో.. క్రూరత్వంతో భయపెట్టించడంలో ఆయనదో ప్రత్యేకమైన మార్క్. నటనకు పెట్టని ‘కోట’గా తెలుగు సినీ పరిశ్రమలో వెలుగొందిన కోటా శ్రీనివాసరావు నేడు (జులై 13) ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. ఆయన గురించి కొన్ని విషయాలు..కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన డాక్టర్ కోట సీతారామాంజనేయులు సంతానమే కోటా శ్రీనివాసరావు. కోట 1945, జులై 10న జన్మించాడు. తండ్రిలా డాక్టర్ కాలేకపోయాడు. నటనపై ఇష్టంతో బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. నాటకాల నుంచి సినిమాలకు చేరుకున్నాడు. ‘ప్రాణం ఖరీదు’తో మొదలైన ఆయన నటన.. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అప్రతిహితంగా కొనసాగింది. క్యారెక్టర్ ఏదైనా సరే దానికొక మేనరిజం తగిలించి ఆకట్టుకోవడం ఆయనకున్న ప్రత్యేకత. ఇప్పటిదాకా దాదాపు 750 సినిమాల దాకా నటించిన(అంతకు మించి) కోట.. ప్రతీ సినిమాలో వేరియేషన్ కనబరుస్తూ నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ వచ్చారు..'గణేష్'తో అసలు సిసలైన విలనిజంనాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరున్నది! సాంబశివుడికి నాన్చడం ఇష్టం ఉండదు. డొంక తిరుగుడుగా మాట్లాడడం ఇష్టం ఉండదు. సూటిగా విషయంలోకి వస్తాడు.'తమ్మీ... ఇస్టేటుగా పాయింట్లకు వస్తున్న.నీ ఫైళ్ల ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ కరెక్టే.నేను యాభై కోట్ల కుంభకోణం చేసిన... కాదంటలే!మరి నాకైతే చార్మినార్‌కున్నంత హిస్టరున్నది'.హీరో డైలాగులు కొడితే చప్పట్లు కొట్టడం అనేది సాధారణమే కావచ్చుగానీ, తమ డైలాగులతో కూడా ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోగలిగే విలన్లలో కోట శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు. 'గణేష్' సినిమాలో హెల్త్ మినిస్టర్ సాంబశివుడిగా ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ గుర్తుండిపోతాయి. విలనిజంలో అసలు సిసలు 'స్థానికత'ను తీసుకువచ్చారు కోట.విలన్ మాత్రమే కాదు..తొలినాళ్లలో సైడ్‌కిక్ వేషాలేసిన కోట.. క్రమంగా విలన్ వేషాల వైపు మళ్లాడు. ప్రతిఘటన ‘యాదగిరి’ కోట నటనను ఆడియెన్స్‌కు దగ్గర చేయడంతో పాటు మొదటి నంది అవార్డును ఇప్పించింది. అయితే ఆయన మరుసటి సినిమానే ఆయన నుంచి ఊహించని ‘కామెడీ’ అనే కోణాన్ని పరిచయం చేసి ఆ టైంకి లక్షల మందిని.. తర్వాతి కాలంలో కోట్లమందిని కోటకు అభిమానులు చేసింది. ఆ సినిమా పేరు ‘ఆహానా పెళ్లంట’. పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఆయన నటన మార్వెలెస్. ఇక ఆ తర్వాత వరుసగా విలన్ పాత్రల్లోనే మెప్పించిన ఆయన.. మధ్యమధ్యలో కామెడీ మిక్స్ చేసిన విలనిజంతోనే అలరించాడు. కొన్ని పాత్రలకైతే ఆయన తప్ప మరెవరూ సరిపోరని అప్పటి దర్శకులు ఫిక్స్ అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. అంతెందుకు ‘గణేశ్’ హోం మినిస్టర్ సాంబ శివుడు లాంటి పాత్రల్లోనైతే కోటను తప్ప మరొకరిని ఊహించుకోవడం మనకైనా కొంచెం కష్టమే!.అన్నాయ్.. అంటూతొంభై దశకంలో కోట సినీ ప్రయాణం ప్రయాణం జెట్ స్పీడ్‌తో సాగింది. మెయిన్ విలన్, కామెడీ విలన్‌గానే కాకుండా.. విలన్ పక్కన ఉంటూ ‘గోడ మీద పిల్లి’ తరహా క్యారెక్టర్లతో అలరించారాయన. ఆ టైంలో వచ్చిన బాబు మోహన్-కోట శ్రీనివాసరావు కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అన్న.. అన్నాయ్..’ అంటూ కోటను బాబు మోహన్ బురిడీ కొట్టించడాలు, వెనక్కి తిరిగి తన్నడాలు.. సన్నివేశాల్ని రిపీట్ మోడ్‌లో చూసి నవ్వుకునే వాళ్లూ ఇప్పటికీ ఉంటారు. మిగిలిన దర్శకుల మాటేమోగానీ.. కోటలోని కామెడీ కోణాన్ని దర్శకుడు ఇవీవీ వాడుకున్నంతగా ఇంకెవరూ వాడుకోలేకపోయారు. ఇక బ్రహ్మీ, ఎమ్మెస్ నారాయణ కాంబోలోనూ కోట నుంచి హెల్తీ హ్యూమరే జనాలకు అందింది.మందు పడితేనే ఆ సీన్ పండిందటకోటకు వివాదాలు కొత్తేం కాదు. పరభాష నటులను విలన్లుగా తీసుకోవడంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఆయన కూడా ఇతర భాషల్లో నటించిన ప్రస్తావనతో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే నటన రానీ వాళ్లను తీసుకోవడం గురించే తాను మాట్లాడానని తర్వాత క్లారిటీ ఇచ్చారు కోట. ఇక కోటకు మద్యం బలహీనత ఉందని, తాగి సెట్‌కి వస్తారని, దీంతో కొందరు ఆర్టిస్టులు ఇబ్బందిగా ఫీలయ్యేవారన్న అపవాదు కోట మీద ఉంది. అయితే సిచ్యుయేషన్‌కి తగ్గట్లు కొన్నిసార్లు అది తప్పదనే కోట సమర్థనను బలపరిచిన వాళ్లూ లేకపోలేదు. అందుకు ఉదాహరణగా శుత్రువు టైంలో జరిగిన ఓ ఘటను గుర్తు చేస్తారు. విలన్ క్యారెక్టర్ కోసం.. అప్పటికే ఇద్దరు యాక్టర్లను మార్చేసిన కోడిరామకృష్ణ చివరికి కోట దగ్గర ఆగిపోయాడు. అయితే ఒక సీన్ తీస్తున్న టైంలో కోట పదే పదే టేకులు తీసుకుంటుండడంతో అంతా విసిగిపోయారట. చివరికి పక్కకు వెళ్లి మందేసి వచ్చిన కోట.. తర్వాత ఆ సీన్లో చెలరేగిపోయాడు. ఆ సీన్‌కు ఆడియొన్స్ నుంచి మంచి రియాక్షన్ వచ్చిందని దర్శకుడు కోడిరామకృష్ణ సైతం కొన్ని సందర్భాల్లో ప్రస్తావించడం విశేషం.గదైతే ఖండిస్తంగాయం సినిమాలో 'గదైతే నేను ఖండిస్తున్న' అంటూ గురు నారాయణ్‌గా కోట పాత్ర ఎవరూ మరిచిపోలేరు. తెలంగాణ యాసలో జర్నలిస్ట్‌గా ఉన్న రేవతి అడిగే ప్రశ్నలకు కొట పలికిన సంభాషణలకు చాలామంది ఫిదా అయ్యారు. 'ఈ డెవడ్రా బాబూ..', 'నాకేంటి .. మరి నాకేంటి', 'మరదేనమ్మా నా స్పెషల్' వంటి కోట నుంచి వెలువడే డైలాగులు చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. రాజకీయ నేపథ్యాల్లోని సినిమాల్లో కోట నటన గురించి ప్రత్యేకంగా చెప్పకోవాలి. పొలిటీషియన్‌గా ఆయన నటన మరింత ప్రత్యేకంగా తెరపై కనిపిస్తుంటుంది. ప్రతిఘటన నుంచి మొదలై శత్రువు, గాయం, గణేశ్, లీడర్, ఛత్రపతి, మున్నా, ప్రతినిధి, తమిళ్ సామి, కో(రంగం), సర్కార్(హిందీ) సినిమాల్లో మరీ ముఖ్యంగా రాజకీయాలపై ఆయన నోటి నుంచి వెలువడే డైలాగులు ఎప్పటికీ గుర్తిండిపోతాయి.గొంతుతోనూ మ్యాజిక్90 దశకంలో, 2000 సంవత్సరాల్లోనూ తన డబ్బింగ్ వాయిస్‌తో కోట అలరించాడు. ముఖ్యంగా తమిళ కమెడియన్ గౌండ్రమణి(అవతల సెంథిల్‌కు బాబు మోహన్)కి ఆయన అరువిచ్చిన గొంతు తెలుగు ప్రేక్షకులకు మైమరిపించింది. అంతేకాదు సీనియర్ నటుడు మణివణ్ణన్‌కు సైతం ఆయన కోట కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పారు.బాబు మోహన్‌తో ఎనలేని బంధంకోటశ్రీనివాసరావు, బాబు మోహన్‌లు 'అన్నదమ్ములు'గా కనిపించేవారు. అన్నయ్యా అంటే చాలు కోట తనకోసం ఏమైనా చేస్తారని బాబు మోహన్ పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు. పరిశ్రమలో వీళ్లిద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్. ఒక సినిమాలు వీళ్లు ఇద్దరూ ఉంటే చాలు అది దాదాపు సగం విజయం సాధించినట్లే అనుకునేవారు. ముత్యాల సుబ్బయ్య తీసిన ‘మామగారు’ ఎవర్గ్రీన్ అని చెప్పవచ్చు. అందులో వారిద్దరు చేసిన కామెడీకి పొట్టచెక్కలయ్యేలా ఎవరైనా నవ్వాల్సిందే.. ఈ సినిమా భారీ విజయం వెనుక వీళ్లిద్దరి కామెడీ చాలా కీలకంగా పనిచేసిందని దర్శకులు కూడా చెప్పారు. కోటశ్రీనివాసరావు, బాబు మోహన్‌లు ఇద్దరు కలిసి దాదాపు 65కు పైగా సినిమాల్లో నటించారు.కోట జీవితంలో మరికొన్ని ముఖ్యమైన విషయాలు2015లో అప్పటి కేంద్ర ప్రభుత్వం 'పద్మశ్రీ' అవార్డ్‌తో కోటను సత్కరించింది.9 నంది అవార్డులను కోట శ్రీనివాసరావు అందుకున్నారు.కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాకు గాను సైమా అవార్డ్అల్లు రామలింగయ్య పురష్కారంవిజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయిన కోటాదాదాపు 750 పైగా చిత్రాల్లో నటించిన కోటాఎస్వీ రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును భర్తీ చేసిన నటుడిగా గుర్తింపు2003లో సామితో తమిళ పరిశ్రమలో విలన్‌గా అరంగేట్రం చేశారు. కోట నటించిన చివరి చిత్రం సువర్ణ సుందరి (2023) 1968లో రుక్మిణితో వివాహము.. కోటాకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. 2010 జూన్ 21లో రోడ్డు ప్రమాదంలో మరణించిన కోటా కుమారుడు ప్రసాద్
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

ఐదో టీ20లో భారత్ ఓటమి.. అయినా సిరీస్ మనదే
ఇంగ్లండ్ మహిళలతో జరిగిన ఐదో టీ20లో 5 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది.41 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 75 పరుగులు చేసింది. ఆమెతో పాటు రిచా ఘోష్(24) రాణించాడు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(8), ఫస్ట్ డౌన్ బ్యాటర్ రోడ్రిగ్స్(1), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(15) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో చార్లీ డీన్ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ఎకిలిస్టోన్ రెండు, స్మిత్, ఆర్లాట్ తలా వికెట్ సాధించారు.ఓపెనర్ల విధ్వంసం..అనంతరం 168 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు సోఫియా డంక్లీ(46), డేనియల్ వ్యాట్-హాడ్జ్(56) అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరితో పాటు టామీ బ్యూమాంట్(30) రాణించింది.భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి తలా రెండు వికెట్లు సాధించారు. అయితే ఆఖరి టీ20లో భారత్ ఓటమిపాలైనప్పటికి.. తొలుత మూడు మ్యాచ్‌లు గెలవడంతో సిరీస్‌ను 2-3 తేడాతో ఉమెన్ ఇన్ బ్లూ సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 16 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: IND vs ENG: ఆఖరి ఓవర్లో గొడవ.. ఇంగ్లండ్ ఓపెనర్‌కు ఇచ్చిపడేసిన గిల్! వీడియో

ఆఖరి ఓవర్లో గొడవ.. ఇంగ్లండ్ ఓపెనర్‌కు ఇచ్చిపడేసిన గిల్! వీడియో
లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేయగా.. టీమిండియా సైతం సరిగ్గా 387 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (177 బంతుల్లో 100; 13 ఫోర్లు) అద్బుతమైన సెంచరీ సాధించాడు.అతడితో రిషభ్ పంత్ (112 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (131 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ చెరో 2 వికెట్లు తీశారు.గిల్-క్రాలీ వాగ్వాదం..కాగా మూడో రోజు ఆట ఆఖరి ఓవర్లో హ్రైడ్రామా చోటు చేసుకుంది. భారత్ ఆలౌటైనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ ఆరంభించింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ ఎటాక్‌ను జస్ప్రీత్ బుమ్రా ఆరంభించాడు. మూడో రోజు మరిన్ని ఓవర్లు ఆడేందుకు ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే,బెన్ డకెట్‌లు ఏమాత్రం ఇష్టపడలేదు.ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్‌కు జాక్ క్రాలే పదేపదే అంతరాయం కలిగించి సమయాన్ని వృథా చేశాడు. మూడో బంతిని బుమ్రా డెలివరీ చేసే సమయంలో క్రాలీ ఒక్కసారిగా పక్కకు తప్పుకొన్నాడు. దీంతో బుమ్రా అసహనానికి లోనయ్యాడు. టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సైతం క్రాలీపై కోపంతో ఊగిపోయాడు. అతడి దగ్గరకు వెళ్లి వేలు చూపిస్తూ ఆడేందుకు ధైర్యం తెచ్చుకో అన్నట్లు సైగ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆఖరి బంతి పడేముందు క్రాలీ గాయం పేరిట డ్రామా చేశాడు. ఫిజియె మైదానంలోకి రావడంతో ఆట కాసేపు నిలిచిపోయింది. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు జాక్ క్రాలీని చప్పట్లు కొడుతూ గేలి చేశారు. వెంటనే క్రాలీ కూడా వేలు చూపిస్తూ ఏదో అన్నాడు. ఆఖరికి అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా రెండు పరుగులు చేసింది.Shubman Gill & Co. didn’t come to be played around, 𝙠𝙮𝙪𝙣𝙠𝙞 𝙔𝙚 𝙨𝙚𝙚𝙠𝙝𝙣𝙚 𝙣𝙖𝙝𝙞, 𝙨𝙞𝙠𝙝𝙖𝙣𝙚 𝙖𝙖𝙮𝙚 𝙝𝙖𝙞𝙣!#ENGvIND 👉 3rd TEST, DAY 4 | SUN 13th JULY, 2:30 PM | Streaming on JioHotstar pic.twitter.com/ix13r7vtja— Star Sports (@StarSportsIndia) July 12, 2025 Always annoying when you can't get another over in before close 🙄 pic.twitter.com/3Goknoe2n5— England Cricket (@englandcricket) July 12, 2025

ఆయుశ్ మాత్రే సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత అండర్–19 జట్టు దుమ్మురేపుతోంది. వన్డే సిరీస్ గెలుచుకున్న యువ భారత జట్టు... యూత్ టెస్టులో శుభారంభం చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం బెకెన్హామ్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత అండర్–19 జట్టు 88 ఓవర్లలో 7 వికెట్లకు 450 పరుగులు చేసింది. కెప్టెన్ ఆయుశ్ మాత్రే (115 బంతుల్లో 102; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కగా... అభిజ్ఞ కుందు (95 బంతుల్లో 90; 10 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ కుమార్ (81 బంతుల్లో 85; 14 ఫోర్లు, 1 సిక్స్), విహాన్ మల్హోత్రా (99 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.వన్డే సిరీస్‌లో రికార్డు సెంచరీతో చెలరేగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (14) ఎక్కువసేపు నిలవలేకపోగా... అందులో పెద్దగా పరుగులు చేయలేకపోయిన ఆయుశ్ మాత్రే ‘శత’క్కొట్టాడు. అతడు రెండో వికెట్‌కు విహాన్‌తో కలిసి 173 పరుగులు జోడించాడు. టి20 తరహాలో ధనాధన్ ఆటతీరుతో రెచ్చిపోయిన అభిజ్ఞ, రాహుల్ నాలుగో వికెట్‌కు 27.4 ఓవర్లలోనే 179 పరుగులు జోడించడంతో యువభారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో అలెక్స్ గ్రీన్, జాక్ హోమ్, ఆర్చీ వాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. బ్యాటర్లంతా దూకుడు కనబర్చడంతో తొలి రోజు యంగ్‌ఇండియా 5కు పైగా రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. అంబ్రిష్ (31 బ్యాటింగ్), హెనిల్ పటేల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

నదీమ్‌తో నీరజ్ ఢీ
సిలేసియా (పోలాండ్): భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా... దాయాది పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌తో పోటీకి సిద్ధమవుతున్నాడు. వచ్చే నెల 16న పోలాండ్ వేదికగా జరగనున్న సిలేసియా డైమండ్ లీగ్‌లో వీరిద్దరూ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య శనివారం వివరాలు వెల్లడించింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో చివరిసారిగా ఈ ఇద్దరు తలపడగా... నదీమ్ జావెలిన్‌ను 92.97 మీటర్ల దూరం విసిరి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. నీరజ్ 89.45 మీటర్ల దూరంతో రజతం గెలుచుకున్నాడు. అంతకుముందు 2020 టోక్యో ఒలింపిక్స్‌లో చోప్రా పసిడి పతకం నెగ్గాడు. ఇటీవల భారత్ వేదికగా తొలిసారి జరిగిన అంతర్జాతీయ జావెలిన్ త్రో ఈవెంట్ ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టైటిల్ గెలిచిన 27 ఏళ్ల నీరజ్ చోప్రా జోరు మీదున్నాడు. ఈ సీజన్లో వరుసగా మూడు టైటిల్స్‌తో అతను ఇప్పటికే ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ‘నదీమ్, నీరజ్ మధ్య ఆసక్తికర పోరు ఖాయం. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఈ ఇద్దరు ఒకే టోర్నమెంట్లో పాల్గొంటుండటం ఇదే తొలిసారి. ఒకరు ప్రపంచ చాంపియన్, మరొకరు ఒలింపిక్ చాంపియన్. వారి మధ్య సమరాన్ని చూసేందుకు పోలాండ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్తాన్ అథ్లెట్ యూరోపియన్ లీగ్‌ల్లో పాల్గొనడం చాలా తక్కువ. మరి ఈ సారి అతడికి నీరజ్‌కు మధ్య పోటీ ఎలా సాగుతుందో చూడాలి’ అని లీగ్ నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఏడాది తొలిసారి 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్ చోప్రా... మే నెలలో జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో జావెలిన్‌ను 90.23 మీటర్ల దూరం విసిరి తన అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.పారిస్ ఒలింపిక్స్ తర్వాత వరుసగా టోర్నీల్లో పాల్గొంటున్న నీరజ్ దిగ్గజ కోచ్ జాన్ జెలెజ్నీ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాడు. మరోవైపు 28 ఏళ్ల నదీమ్... ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన అనంతరం కేవలం ఒక్క టోర్నీలో మాత్రమే పాల్గొన్నాడు. సెపె్టంబర్లో టోక్యో వేదికగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరగనున్న నేపథ్యంలో ఈ లీగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. 2023లో వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన నీరజ్ దాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
బిజినెస్

3 గిగావాట్లకు డేటా సెంటర్లు
ముంబై: దేశీయంగా డేటా సెంటర్ల రంగం భారీ స్థాయిలో విస్తరిస్తోంది. 2030 నాటికి ఏకంగా 3 గిగావాట్ల సామర్థ్యాన్ని సంతరించుకుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. ఎవెండస్ క్యాపిటల్ రూపొందించిన మల్టీ ఇయర్ గ్రోత్ ప్రాక్సీ ఆన్ ఇండియాస్ డేటా ఎక్స్ప్లోజన్ అండ్ లోకలైజేషన్ వేవ్ పేరిట ఎవెండస్ క్యాపిటల్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024లో దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 1.1 గిగావాట్లుగా ఉంది. డేటా, ఏఐ, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటం, డేటా లోకలైజేషన్ ప్రధాన లక్ష్యంగా తీసుకుంటున్న పాలసీపరమైన చర్యలు లాంటి అంశాలు డేటా సెంటర్లకు కీలక చోదకాలుగా ఉండనున్నాయి. దీనితో 2033 నాటికి డిమాండ్ 6 గిగావాట్ల స్థాయికి చేరే అవకాశం ఉంది. అయితే, సరఫరా మాత్రం 4.5 గిగావాట్ల స్థాయికే పరిమితం కానుంది. దీంతో 1.5 గిగావాట్ల మేర డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసం ఏర్పడనుంది. లార్జ్ ఫార్మాట్, హైపర్‌స్కేల్ రెడీ మౌలిక సదుపాయాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తక్కువ లేటెన్సీతో వర్క్‌లోడ్ భారాన్ని భరించగలిగే ఎడ్జ్–రెడీ సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా ఈ డిమాండ్‌ను తీర్చే అవకాశం ఉంది. దీంతో ఈ పరిశ్రమ వార్షికంగా 25–30 శాతం మేర వృద్ధి నమోదు చేయనుంది. భారీగా పెట్టుబడులు.. డేటా సెంటర్ల వృద్ధికి అపార అవకాశాలు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిశ్రమలోకి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. ప్రస్తుతం ఏటా 1–1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 12,870 కోట్లు) స్థాయిలో వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడులు రెట్టింపు కానున్నాయి. వివిధ రాష్ట్రాలు సబ్సిడీ రేటుకు స్థలాన్ని, విద్యుత్తును తక్కువ రేటుకు అందిస్తుండటం వంటి అంశాలు దేశవ్యాప్తంగా డేటా సెంటర్లు వేగంగా వృద్ధి చెందడానికి దోహదపడుతున్నాయి. ఇప్పటికే ఎస్టీటీ జీడీసీ, సిఫీలాంటి దిగ్గజాలుఈ రంగంలో స్థానాన్ని పటిష్టం చేసుకోగా, పెరుగుతున్న డిమాండ్‌ని తీర్చే దిశగా మరిన్ని కొత్త సంస్థలు కూడా వస్తున్నాయి. ఢిల్లీ–ఎన్సీఆర్కి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ సంస్థ అనంత్ రాజ్ భారీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. 2031–32 నాటికి నిర్వహణ సామర్థ్యాలను 307 మెగావాట్లకు పెంచుకునేందుకు 2.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 18,000 కోట్లు) వెచ్చించనుంది. 2025–26లో డేటా సెంటర్ సామర్థ్యం 28 మెగావాట్లుగా ఉండనుంది. డేటా సెంటర్ల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ విధానాల తోడ్పాటు, విద్యుత్ లభ్యత, కనెక్టివిటీ మొదలైన అంశాలన్నీ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ క్లయింట్ల నుంచి ఎంటర్ప్రైజ్, హైపర్‌స్కేలర్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ లాంటి వాటికి పెరుగుతున్న డిమాండ్‌ని తీర్చేందుకు పరిశ్రమ సన్నద్ధంగా ఉందని అనంత్ రాజ్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ సరీన్ తెలిపారు.

యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఆంథెమ్ బయోసైన్సెస్‌కు రూ.1,016 కోట్లు
ముంబై: ఫార్మా సంస్థలు, బయో టెక్నాలజీ సంస్థలకు ఔషధాల ఆవిష్కరణ, కాంట్రాక్ట్ రీసెర్చ్, అభివృద్ధి, తయారీ సేవలు(సీఆర్‌డీఎంఓ) అందించే ఆంథెమ్ బయోసైన్సెస్ తమ పబ్లిక్ ఇష్యూకు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.1,016 కోట్లు సమీకరించింది. ఈ సంస్థ ఐపీఓ సోమవారం(జూన్ 14న) ప్రారంభమై, బుధవారం ముగియనుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.540–570గా ఉంటుంది. ఇందులో భాగంగా గరిష్ట ధర రూ.570కి 60 ఫండ్లకు (యాంకర్ ఇన్వెస్టర్లు) 1.78 కోట్ల ఈక్విటీ కేటాయించినట్లు కంపెనీ బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉండటంతో కంపెనీకి ఎటువంటి నిధులు అందవు. మొత్తం 60 యాంకర్ ఇన్వెస్టర్లలో అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, ఈస్ట్ స్ప్రింగ్ ఇన్వెస్ట్మెంట్స్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, యాక్సిస్ ఎంఎఫ్, యూటీఐ ఎంఎఫ్, క్వాంట్ ఎంఎఫ్, మోతీలాల్ ఓస్వాల్ ఎంఎఫ్ తదితర ఫండ్ సంస్థలున్నాయి. ఇప్పటికే ఈ సీఆర్‌డీఎంఓ విభాగం నుంచి సాయి లైఫ్ సైన్సెస్, సింజీన్ ఇంటర్నేషనల్, సువెన్ లైఫ్ సైన్సెస్, దివీస్ ల్యాబోరేటన్స్ కంపెనీలు ఐపీఓ పూర్తి చేసుకొని ఎక్సే్చంజీల్లో లిస్టయ్యాయి. జేఎం ఫైనాన్సియల్, సిటిగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా, జేపీ మోర్గాన్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ కంపెనీలు ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

యూఎస్ఐఎస్పీఎఫ్ బోర్డ్లోకి కుమార మంగళం బిర్లా
న్యూయార్క్: దేశీ పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తాజాగా యూఎస్–ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్నర్షిప్ ఫోరం (యూఎస్ఐఎస్పీఎఫ్) డైరెక్టర్ల బోర్డులో చేరారు. వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలుస్తూ, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు కృషి చేస్తున్నందుకు గాను గత నెలలో వాషింగ్టన్ డీసీలో జరిగిన లీడర్షిప్ సదస్సు 2025లో ఆయన గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. స్వల్ప వ్యవధిలోనే భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, ఆర్థిక బంధాలను పటిష్టం చేయడంలో యూఎస్ఐఎస్పీఎఫ్ బలమైన శక్తిగా ఎదిగిందని బిర్లా తెలిపారు. తమ సంస్థ అమెరికాలో అతి పెద్ద భారతీయ ఇన్వెస్టరుగా కార్యకలాపాలు సాగిస్తోందని, మరింతగా పెట్టుబడులను పెంచే ప్రణాళికలు ఉన్నాయని ఆయన వివరించారు. అమెరికాలో ఆదిత్య బిర్లా గ్రూప్ 15 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. మెటల్స్, కార్బన్ బ్లాక్, రసాయనాలు తదితర రంగాల్లో 15 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. దాని అనుబంధ సంస్థ అయిన నోవెలిస్ ప్రపంచంలోనే అతి పెద్ద అల్యుమినియం రీసెక్లింగ్ కంపెనీ.

ఆయిల్ కంపెనీల ఎల్పీజీ నష్టాల భర్తీ!
న్యూఢిల్లీ: గత 15 నెలలుగా ద్రవీకృత గ్యాస్ (ఎల్పీజీ)ని తక్కువ రేట్లకు విక్రయించడం వల్ల ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు వాటిల్లిన నష్టాలను భర్తీ చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందుకోసం సుమారు రూ. 30,000–50,000 కోట్లు సబ్సిడీ ఇచ్చే అవకాశమున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎంత నష్టం (అండర్ రికవరీలు) వాటిల్లింది, దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి అనే అంశాలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. 2025–26 బడ్జెట్లో అండర్–రికవరీలకు కేటాయింపులు చేయలేదు. అయితే, ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలు పెంచడం ద్వారా అదనంగా రూ. 32,000 కోట్లు సమకూర్చుకుంది. ఇలా అదనంగా వచి్చన ఆదాయాన్నే ఎల్పీజీ అండర్ రికవరీలకి కేంద్రం సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)కు 2024–25లో ఎల్పీజీ విక్రయాలపై సుమారు రూ. 40,500 కోట్ల నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో అధిక రేట్ల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వమే వంట గ్యాస్ ధరలను నియంత్రిస్తోంది. దీనితో మార్కెట్ రేటు కన్నా తక్కువకి విక్రయించడం వల్ల కంపెనీలకు నష్టం వాటిల్లితే, దాన్ని ఇతరత్రా మార్గాల్లో భర్తీ చేస్తోంది. ఇలా 2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాల్లో రూ. 28,249 కోట్ల అండర్ రికవరీలకు గాను రూ. 22,000 కోట్లు సర్దుబాటు చేసింది.
ఫ్యామిలీ

‘టైమ్ 100 క్రియేటర్స్’ లిస్ట్‌లో ఏకైక భారతీయురాలు
‘టైమ్ 100 క్రియేటర్స్’ జాబితాలో చోటు సాధించిన ఏకైక భారతీయురాలిగా ప్రత్యేకత నిలుపుకుంది యూట్యూబర్ ప్రజక్త కోలి( Prajakta Koli ). డిజిటల్ మీడియాలో 2015 నుంచి కోలి విజయపరంపర కొనసాగుతోంది.‘టైమ్ 100 క్రియేటర్స్’లో చోటు సాధించిన నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌తో అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది కోలి. ‘నాలో ఎన్నో భావాలు పొంగి పొర్లుతున్నాయి. నేను మీతో చె΄్పాలి అనుకుంటున్న వాటి కంటే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం చెప్పడానికి రెండు మాటలే ఉన్నాయి... థ్యాంక్స్’ అని రాసింది. తల్లిదండ్రులు, స్నేహితులు, అభిమానులకే కాదు తన పేరుకు కూడా కృతజ్ఞతలు తెలియజేసింది. ‘థ్యాంక్ యూ ప్రజక్త. వ్యూహం, ప్లాన్, రోడ్ మ్యాప్... ఇలాంటివేమీ లేకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తనను తాను నమ్ముకుంది. తాను చేయాలనుకున్నది ధైర్యంగా చేసింది’ అని రాసింది. View this post on Instagram A post shared by Prajakta Koli (@mostlysane) 2015లో యూట్యూబ్ చానల్ లాంచ్ చేసింది కోలి. మొదట్లో కామెడీ స్కిట్లు షేర్ చేసేది. తక్కువ కాలంలోనే తన చానల్‌కు ఏడు మిలియన్ల సబ్స్క్రైబర్లు ఏర్పడ్డారు. ‘మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ యూట్యూబర్’గా పేరు తెచ్చుకున్న ప్రజక్త నెట్‌ఫ్లిక్స్ రొమాంటిక్ సిరీస్ ‘మిస్ మ్యాచ్డ్’లో నటించింది. ‘టు గుడ్ టు బి ట్రూ’ అనే నవల రాసింది. ఓన్లీ ఇండియన్

ప్రాణం లేకపోతేనేం బొమ్మలు నయం చేస్తాయి!
బొమ్మలు చిన్నపిల్లల కోసమే అనుకుంటారు చాలా మంది. బొమ్మలు పెద్దల్లో ఉన్న పిల్లల కోసం కూడా! బొమ్మలను చూడటం, వాటిని తాకడం, షెల్ఫ్‌లలో పెట్టుకుని దాచుకోవడంఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయని అంటారు నిపుణులు. ‘నా చిన్నప్పటి సంతోషాలను ఇప్పటికీ పొందుతున్నాను’ అంటుంది 34 ఏళ్ల శైలీ పాడ్వాల్ (Saylee Padwal). ముంబైలో ఉన్న శైలీ ఇంటికి వెళితే ఇంటి నిండా బొమ్మలే. వీటి సేకరణ కూడా ఒక ఇన్వెస్ట్‌మెంటే అంటున్న శైలీ పరిచయం. ‘కొత్త బొమ్మ కొన్నప్పుడల్లా నాకు ఉత్సాహంగా ఉంటుంది’ అంటుంది 34 ఏళ్ల శైలీ పాడ్వాల్. ఆమె ఇంటికి వెళితే గదులు, అరలు, అల్మారాలు, గోడలు... అన్నీ బొమ్మలతో నిండి ఉంటాయి. అయితే అవేవీ దేశీయమైన బొమ్మలు కాదు. ఈ కాలపు పిల్లలు కూడా తక్కువగా చూసే ఆధునిక బొమ్మలు. చాలా మటుకు చైనా బొమ్మల తయారీ దిగ్గజం పాప్ మార్ట్ తయారు చేసి వదిలేవే. హాట్సునే మికు, స్మిస్కిస్, క్రై బేబీస్... ‘వీటన్నింటి కంటే నాకు లబుడు బొమ్మలు ఇష్టం’ అంటుంది శైలీ పాడ్వాల్.ఫ్యాషన్ డిజైనర్‌గా దేశ విదేశాలు తిరిగే శైలీ తనకు స్నేహితులెవరైనా ఉన్నారంటే బొమ్మలనే అంటుంది. ‘కొత్త కొత్త బొమ్మలను చూడటం, తాకడం వాటిని ఇంట్లో అలంకరించుకోవడం థెరపీ అనే అనిపిస్తుంది నాకు. బొమ్మలు కేవలం పిల్లలవి కాదు. బొమ్మలకు ఆకారాలుంటాయి. ప్రాణం లేకపోయినా అవి మనల్ని ఆకర్షిస్తాయి. వాటితో అనుబంధం ఏర్పడుతుంది. బొమ్మలు తోడుంటే ఒంటరితనం బాధ ఉండదు’ అంటుంది శైలీ.ఈ బొమ్మల మీద ఆసక్తి ఆమెకు బార్బీ బొమ్మల నుంచి వచ్చింది. ‘నా చిన్నప్పుడు అమ్మ ప్యాకెట్ మనీ ఇచ్చేది. వాటిని దాచి దాచి మొదటిసారి బార్బీ రెయిన్, బార్బీ సన్డాల్ అనే రెండు బొమ్మలు కొన్నాను. నా చిన్నప్పుడు అవే పెద్ద ఫ్రెండ్స్‌గా ఉన్నాయి. బొమ్మలను నేను చూసే పద్ధతి, వాటిని అలంకరించే పద్దతి, ఆకర్షణీయమైన బొమ్మలను చూసే పద్ధతి గమనించిన మా అమ్మ నేను ఫ్యాషన్ రంగంలో రాణిస్తానని ఊహించింది. ఫ్యాషన్ డిజైనింగ్ చదవడం వల్ల బొమ్మల్లోని అంద చందాలు నాకు మరింత బాగా అర్థమయ్యాయి’ అంది శైలీ.అయితే ఇంటి నిండా బొమ్మల్ని చూసి ‘ఇన్ని ఎందుకు’ అని తెలియని వారు ఆశ్చర్యపోవచ్చు. ‘ఈ బొమ్మలు కొని పెట్టడం కూడా ఒక పెట్టుబడే. బొమ్మలు ఎప్పటికప్పుడు మారు తుంటాయి. ఒకసారి వచ్చిన బొమ్మలు మళ్లీ రావు. ఇలా కలెక్ట్ చేసి పెడితే కొన్నాళ్లకు అవి అరుదైనవిగా మారుతాయి. వాటిని భారీ రేటు ఇచ్చి కొనేవారూ ఉంటారు’ అంటుంది శైలీ.చదవండి: Lishalliny Kanaran : భారతీయ పూజారిపై మిస్ గ్రాండ్ మలేషియా సంచలన ఆరోపణలు!పసిపిల్లలు బొమ్మను పక్కన పెట్టుకుని నిద్రపోవడం అందరికీ తెలిసిందే. బొమ్మలు మానసిక ఓదార్పుని ఇస్తాయి. దేశీయ బొమ్మలు ఒకప్పుడు పిల్లలందరి దగ్గరా ఉండేవి. ఇప్పుడు ఏ బొమ్మలు లేకపోతే కనీసం టెడ్డీ బేర్‌ను అయినా పెట్టుకుంటున్నారు. ‘అది మంచిదే’ అంటుంది శైలీ.‘పిల్లలున్న ఇంట్లో బొమ్మలు లేవంటే వారు సరిగా పెరగడం లేదని అర్థం. మరొకటి పిల్లలకు బొమ్మలు ఇచ్చాక వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పద్దు. వాటితో ఎలా వ్యవహరించాలో పిల్లలకు తెలుసు. వాటిపై ప్రయోగాలు జరిపినా...విరగ్గొట్టినా అదంతా ఎదుగుదలలో భాగంగా చూడాలి’ అంటుంది శైలీ. అయితే మితిమీరిన బొమ్మలను కొనడం ఒక వ్యసనంగా చూసేవారు కూడా ఉన్నారు. ఆ విధంగా చూస్తే శైలిది సేకరణా... లేకుంటే వ్యసనమా... అనిపిస్తుంది. ఒకవేళ వ్యసనమైనా హాని లేని వ్యసనమే అనుకుని సరిపెట్టుకోవచ్చు. ‘మీరేమైనా అనుకుంటే నా బొమ్మల ప్రపంచం నాది’ అంటోంది శైలీ.ఇదీ చదవండి: Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!

అడవి నుంచి ఐరాస వరకు...
‘సంస్కృతం పలకడానికి నీకు నోరు తిరగదు. నేర్చుకోవడం నీ వల్ల కాదు’ అన్నారు సంస్కృతం టీచర్. ‘నీలాంటి మొద్దు బుర్రలకు లెక్కలు అర్థం కావు’ అన్నారు మ్యాథ్స్ టీచర్. బాగా చదువుకోవాలనే ఆశతో స్కూల్లోకి అడుగు పెట్టిన ఆదివాసీ అమ్మాయికి అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. ఆ అవమానాలకు తన ప్రతిభతో జవాబు చెప్పింది. యూనివర్శిటీ వైస్–చాన్స్‌లర్ స్థాయికి ఎదిగింది జార్ఖండ్‌కు చెందిన సోనాజ్ హరియ మింజ్. తాజాగా యునెస్కోలోని ఇండిజినస్ నాలెడ్జ్, రీసెర్చ్ అండ్ గవర్నెన్స్ (ఐకెఆర్జీ) కో–చైర్‌పర్సన్‌గా నియామకం అయిన తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించింది...సోనాజ్ మింజ్‌కు బాగా చదువుకోవాలని కోరిక. అడవిలో ఉండేవాళ్లకు చదువు ఎందుకు! అనే వాళ్లు చాలామంది. ‘సంస్కృతం అనేది ఆర్యుల భాష. నీలాంటి వాళ్లకు ఎలా వస్తుంది!’ అన్నారు సంస్కృతం టీచర్. ‘నీలాంటి వాళ్లకు లెక్కలు ఎలా వస్తాయి!’ అన్నారు మ్యాథ్స్ టీచర్.స్కూల్లో చేరిన కొత్తలో భాషాపరమైన సమస్యలను మింజ్ ఎదుర్కొంది. ఇంట్లో మాట్లాడే ఆదివాసీ భాష తప్ప మరే భాషా తనకు రాదు. అయితే మ్యాథ్స్ బాగా చేసేది.ఆదివాసీ అమ్మాయి అనే కారణంగా మింజ్‌ను చేర్చుకోవడానికి రాంచీలోని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిరాకరించింది.‘నన్నే ఎందుకు అవమానిస్తున్నారో మొదట్లో అర్థం కాలేదు. చాలా కాలానికి అర్థమైంది. నేను ఆదివాసీ అమ్మాయిని అనే కారణంగానే అవమానిస్తున్నారు అని’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మింజ్. అయితే అవమానాలు ఆమె చదువుకు అడ్డుగోడలు కాలేకపోయాయి. బాగా చదువుకోవాలి అనే కసిని పెంచాయి.మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ తరువాత దిల్లీలోని జవహర్లాల్ నెహ్రు యూనివర్శిటీలో ఎంఫిల్ చేసింది మింజ్. భోపాల్‌లోని బర్కతుల్లా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. కొన్ని సంవత్సరాల తరువాత తమిళనాడులోని మదురై కామరాజ్ యూనివర్శిటీలో పనిచేసింది. కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ చేసిన మింజ్ జేఎన్‌యూలో ప్రొఫెసర్‌గా పనిచేసింది.జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధనాత్మక వ్యాసాలు రాసింది. అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన వ్యాసాలు సమర్పించింది. జేఎన్‌యూలో ‘స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ సిస్టమ్స్ సైన్సెస్’ డీన్‌గా, జవహర్లాల్ నెహ్రు యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్స్ అధ్యక్షురాలిగా పనిచేసింది. ఎంత స్థాయికి ఎదిగినా తాను నడిచి వచ్చిన దారి మరవలేదు మింజ్. దళిత, ఆదివాసీ హక్కుల కోసం పనిచేసింది. జేఎన్‌యూలో ఈక్వల్ ఆపర్చునిటీ ఆఫీస్ (ఈవోవో) ప్రధాన సలహాదారుగా పనిచేసింది.జార్ఖండ్‌లోని ఎస్కేఎం యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఆమె ప్రస్థానం మరోస్థాయికి చేరింది. వైస్ చాన్సలర్ హోదాలో ఆదివాసీ కళలు, భాష కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. తాజాగా... యునెస్కోలోని ఇండిజినస్ నాలెడ్జ్, రిసెర్చ్. గవర్నెన్స్ (ఐకెఆర్జీ) కో– చైర్‌పర్సన్‌గా నియామకం అయింది. ‘నేను భవిష్యత్‌లో మ్యాథ్స్ టీచర్ అవుతాను’ అని స్కూల్ రోజుల్లో బలంగా అనుకునేది మింజ్. అయితే మింజ్ పడిన కష్టం, ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని పట్టుదల ఆమెను మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళ్లడమే కాదు ఎంతోమంది ఆదివాసీ అమ్మాయిలకు స్ఫూర్తినిచ్చేలా చేసింది.ఆ మాటను సవాలుగా తీసుకొని...స్కూల్లో హోంవర్క్ ఇచ్చినప్పుడు సింగిల్ మిస్టేక్ లేకుండా చేసేదాన్ని. ‘ఇది చాలదు. నువ్వు అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి’ అన్నారు ఒక టీచర్. ఆమె మాటలను సవాలుగా తీసుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను. ఇక అప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడూ నాతోనే ఉండిపోయింది. మొదట్లో వెటకారాలు, అవమానాల సంగతి ఎలా ఉన్నా స్కూల్ ఫస్ట్ రావడంతో ఉపాధ్యాయులు ఎంతో ప్రోత్సహించారు. చదువుతో పాటు ఆటలు అన్నా ఇష్టం. యూనివర్శిటీ లెవెల్లో హాకీ ఆడాను. అయితే చదువు మీదే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆటలకు దూరం అయ్యాను.– సోనాజ్ హరియ మింజ్

కిటికీలో కృష్ణుడు, సముద్రంలో సూర్యుడు
ఉడుపి: ఆహారం కాదు అంతకు మించి... ‘ఉడుపి’ (Udupi) అనే పదం వినగానే, నోట్లో కరిగిపోయే ఇడ్లీ, కరకరలాడే మసాలా దోస, ఇంట్లో రుచికరమైన పరిమళలాలు వెదజల్లే సాంబార్ గిన్నె గుర్తొస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఉడుపి హోటల్స్ దానికి కారణం కావచ్చు. కానీ ఉడుపి అంటే అంతర్జాతీయ ప్రాచుర్యం పొందిన ఆహారం వండే శైలి, పదార్ధాలు మాత్రమే కాదు. కర్ణాటకలోని ఈ మనోహరమైన తీరప్రాంత పట్టణం వైవిధ్య భరిత సంస్కృతి ఆధ్యాత్మికతతో నిండింది, దాని పురాతన దేవాలయాలు, నిశ్శబ్ద బీచ్‌లు, దట్టమైన అటవీ ప్రాంతాలు ఉత్సాహభరితమైన మార్కెట్లు అన్నింటికీ మించిన గొప్ప చరిత్రతో. ఇక్కడ భక్తి రోజువారీ జీవితాన్ని మేళవించుకుని ఉంటుంది. పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.అందుకే ఉడుపి అంటే కేవలం ఆహారం మాత్రమే కాదు మరెన్నో అందాలు, ప్రకృతి సౌందర్యాలకు చిరునామా కూడా. ఉడుపి పర్యాటకులు సందర్శించాల్సిన ప్రాంతాల్లో...కృష్ణ దేవాలయం..ఇక్కడి శ్రీ కృష్ణ దేవాలయం తప్పక సందర్శించాల్సిన 13వ శతాబ్ధపు ప్రాచీన దేవాలయం, ఆధ్యాత్మిక వేత్త గురు మాధవాచార్య దీనిని నిర్మించారు. ఈ ఆలయ ప్రధాన వైవిధ్యం నవగ్రహ కిటికీ,9 రంధ్రాలు కలిగిన వెండి పూత పూసిన కిటికీ ద్వారా మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడి వంటశాల ద్వారా వేల మందికి ఉచితంగా రోజూ అన్నదానం జరుగుతుంటుంది. అలాగే అనంతేశ్వర–చంద్రమౌలేశ్వర దేవాలయాలు కూడా ఈ మందిరం దగ్గరే ఉన్నాయి. అనంతేశ్వరేశ్వరాలయాన్ని 8వ శతాబ్దంలో ఆలుపా రాజవంశంలోనిర్మించారు. అంబల్పాడి మహాకాళి దేవాలయం జానార్దన స్వామి దేవాలయం ఎదురుగా, ఉండే ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉంది.తీరప్రాంత ఆస్వాదన కోసం ఉడుపి పట్టణం నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాల్పే బీచ్ బంగారు ఇసుక అంతులేని సముద్రపు మిశ్రమాన్ని అందిస్తుంది. చల్లని గాలులతో కూడిన ఉదయం నడక, సీఫుడ్ లేదా పారాసెయిలింగ్ జెట్ స్కీయింగ్ వంటివి ఆస్వాదించాలనుకుంటే, ఇది బెస్ట్ ప్లేస్. దీనికి కొద్ది దూరంలో ఉన్న సెయింట్ మేరీస్ ద్వీపం, అద్భుతమైన షడ్భుజాకార బసాల్ట్ రాతి నిర్మాణాలు మెరుపు జలాలతో కూడిన భౌగోళిక అద్భుతం. కాలికట్ చేరుకోవడానికి ముందు వాస్కోడగామా మొదట ఇక్కడ అడుగు పెట్టాడని పురాణాలు చెబుతున్నాయి.సూర్యుడు సముద్రంలో కలిసిపోయే అద్భుతమైన దృశ్యాలు లైట్‌హౌజ్‌లో నుంచి చూడాలంటే ఇక్కడి కౌప్ బీచ్ కి వెళ్లాలి. 1901లో నిర్మితమైన ఈ లైట్‌హౌజ్ ప్రధాన ఆకర్షణగా కలిగిన ఈ బీచ్‌కు ఉడుపి నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. ఇదే కాకుండా నదీ సముద్రాల అరుదైన సంగమాన్ని మనకు చూపించే డెల్టా బీచ్, దాదాపు 40 కి.మీ దూరంలో ఉన్న కుడ్లు తీర్థ వాటర్ ఫాల్స్ ప్రకృతి ప్రేమికులకు కనువిందే. దాదాపు 120 ఏళ్ల క్రితం హజీ అబ్ధుల్లా సాహెబ్ నిర్మించిన కాయిన్ మ్యూజియం మన దేశపు ఆర్ధిక మూలాలను విశేషాలను మనకు దర్శింపజేస్తుంది. ఇవే కాక మరెన్నో పూరాతన -దేవాలయాలు, , 8వ శతాబ్దపు శిల్ప సంపద వంటివి ఉడుపిని కేవలం ఒక ఆహార నగరంగా చూడడం ఎంత తప్పో మనకు తెలియజేస్తాయి.
ఫొటోలు
అంతర్జాతీయం

ఆరేళ్ల పాపను పెళ్లాడాడు.. మూడేళ్లు ఆగాలన్న సర్కారు!
తాలిబన్ల అఫ్గానిస్తాన్‌లో బాల్య వివాహాలు నానాటికీ విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఆ ఘోరాల పరంపరకు పరాకాష్ట వంటి ఉదంతం తాజాగా దక్షిణ అఫ్గాన్‌లో చోటుచేసుకుంది! 45 ఏళ్ల వయసున్న ఓ ప్రబుద్ధుడు ఆరేళ్ల పాపను పెళ్లాడాడు. కాసుల కక్కుర్తితో తండ్రే ఆ చిన్నారిని పెళ్లి పేరిట ఇలా సదరు కామాంధునికి కట్టబెట్టాడట. ఇదే ఘోరమంటే, దీనిపై తాలిబన్ సర్కారు మరీ అరాచకంగా స్పందించింది. ‘నువ్వు చేసిన పని మమ్మల్ని షాక్‌కు గురి చేసింది. అంత చిన్న వయసు పాపను పెళ్లాడకుండా ఉండాల్సింది. కనీసం తనకు తొమ్మిదేళ్లు వచ్చేదాకా, అంటే మరో మూడేళ్ల దాకా కాపురానికి తీసుకెళ్లడానికి వీల్లేదు’ అని సదరు నవ వరుడిని ఆదేశించింది. అతనితో పాటు పాప తండ్రిని లాంఛనంగా అరెస్టు చేసింది. అమెరికాకు చెందిన అఫ్గాన్ సంస్థ ఏఎంయూ.టివి ఈ మేరకు పేర్కొంది. మనవాడికి అప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయట. పాప ప్రస్తుతానికి తల్లి దగ్గరే ఉన్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఇదెక్కడి పాడు పని అంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. చిన్న పాప పక్కన పెళ్లి దుస్తుల్లో ఉన్న వరుని ఫొటోలు వైరల్‌గా మారాయి. మానవ హక్కుల సంఘాలు కూడా తాలిబన్ల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. రూపురేఖలను బట్టి రేటు! అఫ్గాన్‌లో అమల్లో ఉన్న దుర్మార్గమైన వాల్వార్ సంప్రదాయం మేరకు ఈ పెళ్లి జరిగింది. ఇందులో వధువు శరీరాకృతి, చదువు తదితరాల ఆధారంగా తనకు ధర నిర్ణయిస్తారు. అది చెల్లించిన వాడికిచ్చి పెళ్లి చేస్తారు. 2021లో తాలిబన్లు అఫ్తాన్ను హస్తగతం చేసుకున్న నాటినుంచీ బాల్య వివాహాలు పెచ్చరిల్లాయి. దుర్భర దారిద్య్రం దీనికి తోడైంది. పిల్లలను పెంచలేక తల్లిదండ్రులు ఇలా ఆడపిల్లలను పెళ్లి సాకుతో అయినకాడికి అమ్ముకుంటున్నారు. దేశంలో అమ్మాయిలకు అసలు కనీస వివాహ వయసు నిబంధనే లేదు. అమ్మాయిల చదువుపై నిషేధం విధించడంతో అఫ్గాన్‌లో కొన్నేళ్లుగా బాల్య వివాహాలు దేశంలో ఏకంగా 45 శాతానికి పెరిగినట్టు ఐరాస నివేదిక పేర్కొంది. – సాక్షి, నేషనల్ డెస్క్

రెచ్చిపోయిన హౌతీలు
దుబాయ్: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న గ్రీక్ దేశానికి చెందిన అంతర్జాతీయ సరకు రవాణా నౌక ‘ఎటరి్నటీ సి’పై హౌతీలు గ్రనేడ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడిచేశారు. దీంతో నౌకకు కిందవైపు భారీ రంధ్రం పడి సముద్రంలో మునిగిపోయింది. విషయం తెల్సుకున్న యురోపియన్ యూనియన్ నేవీ బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని 10 మంది నౌక సిబ్బందిని రక్షించాయి. అయితే ఆలోపే కొంతమంది సిబ్బందిని హౌతీలు కిడ్నాప్‌చేసి గుర్తుతెలియని చోటుకు తీసుకెళ్లారు. లైబీరియా జెండాతో ఉన్న ఈ నౌక మునిగిన ఘటనలో ముగ్గురు సజీవసమాధి అయ్యారు. ఎర్రసముద్రంలో ఈ వారం వ్యవధిలో హౌతీలు ఇలా వాణిజ్యనౌకపై దాడిచేయడం ఇది రెండోసారి. హమాస్‌ను అంతమొందించేందుకు సాహసించిన ఇజ్రాయెల్‌పై కక్షతో హౌతీలు ఇలా పశి్చమదేశాలకు చెందిన నౌకలపై తరచూ దాడులకు పాల్పడుతున్నారు. ఎటరి్నటీ సి నౌక ఇజ్రాయెల్‌లోని ఎలాట్ ఓడరేవుకు వెళ్తుండగా ఇలా దాడికి గురైంది. ‘‘ పాలస్తీనియన్లకు మద్దతుగా మేం దాడులను కొనసాగిస్తాం. గాజా ఆక్రమణను ఇజ్రాయెల్ ఆపాల్సిందే’’ అని హౌతీలు బుధవారం ఒక ప్రకటన విడుదలచేశారు.

భలే ఇంగ్లిష్ మీది!
వాషింగ్టన్: ఏదో ఒక వివాదం లేనిదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పొద్దుపోవడం లేదు. తాజాగా లైబీరియా అధ్యక్షుడు జోసెఫ్ బొవాకై ఇంగ్లిష్ చాలా బాగుందంటూ ఆయన ఇచి్చన కితాబు కూడా వివాదానికే దారితీసింది. బుధవారం వైట్‌హౌస్‌లో ఐదుగురు ఆఫ్రికా దేశాధినేతలతో భేటీ సందర్భంగా జోసెఫ్ ఇంగ్లిష్ కు ట్రంప్ ముగ్ధుడయ్యారు. ‘‘చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంత చక్కని ఇంగ్లిష్ ఎక్కడ నేర్చుకున్నారు?’’అంటూ ఆరా తీశారు. ఆయన ధోరణి తమను అవమానించేలా ఉందంటూ లైబీరియాలోనే గాక ఆఫ్రికావ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ఆఫ్రికా ప్రాంతాలవాళ్లు నిరక్షర కుక్షులనే ఉద్దేశంలోనే ట్రంప్ వ్యాఖ్యలున్నాయని మండిపడుతున్నారు. దీనిపై లైబీరియా దౌత్యవేత్తలు కూడా అభ్యంతరం వెలిబుచ్చారు. ట్రంప్ తీరుకు నిరసనగా తమ అధ్యక్షుడు వాకౌట్ చేయాల్సిందని లైబీరియన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే వైట్‌హౌస్ ప్రెస్ కరోలినా లెవిట్ ట్రంప్ వ్యాఖ్యలను సమరి్థంచారు. వాటిలో తప్పేమీ లేదని, తమ అధ్యక్షుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని లైబీరియా విదేశాంగ మంత్రి కూడా అన్నారు. ఆంగ్లమే అధికార భాష లైబీరియా అధికారిక భాష ఇంగ్లిష్. ఆఫ్రికాలో బానిసత్వం నుంచి విముక్తి పొందిన వారి పునరావాసం నిమిత్తం అమెరికా వలస సమాజం 1822లో ఆ దేశాన్ని ఏర్పాటు చేసింది. 1847లోనే అమెరికా నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది. ఆంగ్లంతో పాటు అక్కడ పలు భాషలు మాట్లాడతారు. గతంలో జర్మనీ చాన్సలర్ ఫ్రెడెరిక్ మెర్జ్ ఇంగ్లిష్ నుకూడా ట్రంప్ ఇలాగే మెచ్చుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ‘అమెరికా ఫస్ట్’నినాదంతో భాగంగా ఆంగ్లానికి ఆయన అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దాన్ని అమెరికా అధికార భాషగా గుర్తిస్తూ గత మార్చిలో ఉత్తర్వులు కూడా ఇచ్చారు!

యూరప్‌లో వడగాడ్పుల మరణ మృదంగం
లండన్: యూరప్ దేశాల్లో ఎండల తీవ్రతకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రధానమైన 12 యూరప్ నగరాల్లో కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 2,300 మరణాలు నమోదయ్యాయి. ఇందులో మూడింట రెండొంతుల మరణాలకు వాతావరణ మార్పులే కారణమని ఓ అధ్యయనం తేల్చింది. తాము వేసిన మరణాల అంచనాలు స్వతంత్ర సంస్థల నుంచి సేకరించినవని, ప్రభుత్వాల పరంగా గణాంకాలు అందేందుకు సమయం పట్టొచ్చని పరిశోధకులు తెలిపారు. జూన్ 23 నుంచి జూలై 2వ తేదీల మధ్యలో పశ్చిమ యూరప్‌తో అత్యంత తీవ్ర స్థాయిలో ఎండలు కాశాయి. స్పెయిన్‌లో ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. వడగాడ్పులు తోడవ్వడంతో ఫ్రాన్స్‌లో కార్చిచ్చు చెలరేగింది. యూరప్‌లోని ప్రధాన నగరాలైన బార్సిలోనా, మాడ్రిడ్, లండన్, మిలాన్ తదితర ప్రధానమైన 12 నగరాల జనాభా 3 కోట్లకు పైమాటే. ఈ నగరాల్లో సాధారణానికి మించి నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధ్యయనం గుర్తించింది. పది రోజుల సమయంలో ఎండలకు సంబంధించిన ఘటనలకు సంబంధించిన 2,300 మరణాల్లో కనీసం 1,500 మరణాలు అత్యంత తీవ్రమైన వడగాడ్పులు వంటి వాతావరణ మార్పుకు సంబంధించినవేనని తెలిపింది. యూకే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌లకు చెందిన ఐదు సంస్థలు, 12మందికి పైగా పరిశోధకులు అధ్యయనంలో భాగస్వాములయ్యారు. ‘వాతావరణ మార్పుల వల్లనే సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి మన్ముందు మరింత ప్రమాదకరంగా మారనుంది’అని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు బెన్ క్లార్క్ చెప్పారు. అప్పుడిక మనిషి శరీరం ఆ ఉష్ణోగ్రతలను తట్టుకునే పరిస్థితి ఏమాత్రం ఉండదన్నారు. ఈ ప్రభావం వృద్ధులు, చిన్నారులు, బయట పనిచేసే సిబ్బందిపై ఎక్కువగా ఉంటుందన్నారు. మానవ ప్రేరేపిత వాతావరణ మార్పు ప్రభావమే లేకుంటే ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందన్నారు. రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినా వేలాదిగా జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని మరో పరిశోధకుడు గ్యారీఫల్లోస్ అన్నారు. వడగాడ్పులు సైలెంట్ కిల్లర్స్‌గా ఆయన అభివరి్ణంచారు. మన ఇళ్లు, ఆస్పత్రుల్లో సంభవించే ఎండలకు సంబంధించిన మరణాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరని ఆయన పేర్కొన్నారు.
జాతీయం

ఇక ‘ఎప్స్టీన్ ఫైల్స్’ దాడి ఆపండి.. ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: అమెరికాకు చెందిన లైంగిక నేరస్తుడు ఎప్స్టీన్ ఫైల్స్‌పై దుమారం చెలరేగుతున్న వేళ అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో తన పరిపాలనా యంత్రాంగంపై దాడి చేయవద్దని హెచ్చరించారు.అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఎప్స్టీన్కు చెందిన క్లయింట్ జాబితాను దాచినట్లు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసిన అనంతరం కూడా ఆ అంశాన్ని పలువురు లేవనెత్తుతుండటంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఎప్స్టీన్ జైలులో హత్యకు గురయ్యాడనే వాదనను కూడా అమెరికా న్యాయశాఖ తోసిపుచ్చింది. 2019లో న్యూయార్క్ జైలులో అతను ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులోని సమాచారాన్ని వెల్లడించబోమని స్పష్టం చేసింది. అయితే ఈ చర్యను ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి.ముఖ్యంగా వారు అటార్నీ జనరల్ పామ్ బోండి, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వారు ట్రంప్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ తాముంతా ఒక బృందంగా ఉన్నామని, తమ పాలనపై వస్తున్న విమర్శలు అర్థరహితమైనవని, కొందరు స్వార్థపరులు ఇతరులను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ట్రంప్ తన అటార్నీ జనరల్ తరపున వాదిస్తూ ‘ఎప్స్టీన్ ఫైల్స్’ అనేది డెమొక్రాటిక్ పార్టీ తన రాజకీయ ప్రయోజనం కోసం ఆడుతున్న నాటకమని, వారు దీనితో ప్రయోజనాలను పొందాలని ఆశిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఎవరూ పట్టించుకోని ఎప్స్టీన్ గురించి సమయాన్ని, శక్తిని వ్యర్థం చేయవద్దని కోరారు. ఎప్స్టీన్ ఫైళ్లలో తన పేరు ఉందనే ఆరోపణలకు ఆయన ఖండించారు.

నా కోరిక తీరుస్తావా? లేదా.. బీఈడీ కాలేజీలో లెక్చరర్ వేధింపులు
బాలసోర్: తనను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఎలాంటి చర్యలూ లేకపోవడంతో మనస్తాపం చెంది శనివారం కళాశాల ఆవరణలోనే ఒంటికి నిప్పంటించుకుంది. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ దారుణం ఒడిశాలోని బాలసోర్‌లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. బాధితురాలు బాలసోర్‌లోని ఫకిర్ మోహన్ అటానమస్ కాలేజీలో బీఈడీ సెకండ్ ఇయర్ చదువుకుంటోంది. కాలేజీలో తన విభాగం హెచ్‌వోడీ, లెక్చరర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ జూన్ 30వ తేదీన ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు అందించింది. ఆ లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలంటూ కాలేజీ క్యాంపస్‌లో వారం రోజులపాటు నిరసన కూడా కొనసాగించింది. శనివారం ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్‌ను కలిసింది. అనంతరం కాలేజీ ఆవరణలోనే నిప్పంటించుకుంది. మంటలు ఆర్పి, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థి సైతం గాయపడ్డాడు. దాదాపు 90 శాతం కాలిన గాయాలైన బాధితురాలు ప్రస్తుతం భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది.Had strict action been taken in this case 👇🏼 FM College Authorities would have been more afraid to remain silent for so long. #fakirmohancollege #Balasore pic.twitter.com/e7T48orQOC— Arunabh Mohanty ।। 🇮🇳 ।। (@arunabh_m) July 13, 2025ఈ ఘటన అనంతరం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వేధింపులకు పాల్పడిన లెక్చరర్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ స్పందిస్తూ.. సదరు లెక్చరర్, కాలేజీ ప్రిన్సిపాల్‌లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @grok explainA second-year integrated B.Ed student at Fakir Mohan Autonomous College in Balasore, Odisha, self-immolated today July 12, after alleging repeated sexual harassment by HoD Samir Kumar Sahu, who demanded favors and threatened her grade#Balasore #arrest #odisha #fm pic.twitter.com/kFapuntvWx— Sweettt (@sweett145) July 12, 2025

వీసా వచ్చిందని మురిసిపోకండి.. ట్రంప్ సర్కార్ కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ: వీసా కష్టాల కడలిని ఈది అమెరికాలో అడుగుపెట్టాక సైతం వీసాదారులపై ‘స్క్రీనింగ్’ కత్తి వేలాడుతూనే ఉంటుందని ట్రంప్ సర్కార్ స్పష్టంచేసింది. ఏ చట్టాలు, నిబంధనల ప్రకారం విదేశీయులకు వీసా మంజూరు చేశామో అవే చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను ఇక్కడికొచ్చాక అతిక్రమిస్తున్నట్లు తేలితే వెంటనే బహిష్కరించి దేశం నుంచి వెళ్లగొడతామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం శనివారం ఒక అడ్వైజరీని విడుదలచేసింది.‘‘అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎక్స్, ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, టెలిగ్రామ్, లింక్డ్ఇన్ వంటి మీ సామాజిక మాధ్యమ ఖాతాల వివరాలు ఇచ్చారు. అమెరికా వ్యతిరేక, హమాస్ ప్రతికూల సోషల్‌మీడియా పోస్ట్‌లు, వీడియోలు, వ్యాఖ్యానాలు ఉంటే ఆయా దరఖాస్తుదారులకు వీసాలను తిరస్కరించాం. అంతా సక్రమంగా ఉండి వీసాలు పొందిన విదేశీయులు ఆనందపడాల్సిన పనిలేదు. వీసాలు మంజూరైనా సరే మీపై సోషల్‌మీడియా ‘స్క్రీనింగ్’ప్రక్రియ ఇక మీదటా కొనసాగుతుంది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్ట్‌లపై ఓ కన్నేస్తాం. అమెరికా గడ్డపై ఉంటూ మా చట్టాలు, ఇమిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే వెంటనే వీసాను రద్దుచేస్తాం. అలాంటి వ్యక్తులను బహిష్కరించి దేశం నుంచి వెళ్లగొడతాం’’అని అడ్వైజరీ ద్వారా అమెరికా హెచ్చరించింది.‘అమెరికాలో ఉన్నంతకాలం ఇక్కడి చట్టాల ప్రకారం నడుచుకోవాలి. వీసా స్క్రీనింగ్‌లో భాగంగా మీ సోషల్‌మీడియా అకౌంట్లలోని పోస్ట్‌లు, వీడియోలు, వ్యాఖ్యానాలను ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలించేందుకు వీలుగా అందరికీ కనిపించేలా సెట్టింగ్‌లను ‘పబ్లిక్’మోడ్‌లోనే కొనసాగించండి. జాతీయ భద్రతకు లోబడే వీసా జారీ అనేది ఉంటుంది. అందుకే ఎఫ్,ఎం,జే ఇలా ప్రతీ వీసాదారుడు ఈ నిబంధనలను అనుసరించాలి’ అని సూచించింది.

Air India Crash: అర్ధరాత్రి హఠాత్తుగా మేల్కొంటూ... ‘ఏకైక’ ప్రయాణికుని దుస్థితి
అహ్మదాబాద్: విశ్వాస్ కుమార్ రమేష్... జూన్ 12న జరిగిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు. ఈయన ప్రస్తుతం తీవ్ర గాయాలతో పోరాడుతున్నాడు. ఈ ప్రమాదంలో అతని సోదరుడు అజయ్ సహా 270 మంది మరణించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి బయటకు వచ్చిన ఫుటేజ్‌లో రమేష్ రక్తంతో తడిసి, అంబులెన్స్ వైపు కుంటుకుంటూ వస్తున్నట్లు కనిపించింది. ప్రమాదం జరిగి, నెల రోజులు గడిచిన దరిమిలా విశ్వాస్ కుమార్ రమేష్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు?అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పటికీ ఆ విషాదాన్ని మరువలేకపోతున్నాడు. ఈ ఘటన రమేష్‌ను మానసికంగా ఎంతగానో కుంగదీసింది. అతని బంధువు సన్నీ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రమాదం నాటి దృశ్యాలు రమేష్‌ను వెంటాడుతున్నాయి. అతను ఊహించని రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకోవడం, అతని సోదరుని మరణం మొదలైన జ్ఞాపకాలు అతనిని వెంటాడుతున్నాయి. విదేశాలలో ఉంటున్న మా బంధువులు.. రమేష్ తాజా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. అయితే రమేష్ ఎవరితోనూ మాట్లాడటం లేదు. విమాన ప్రమాదం, అతని సోదరుని మరణం దరిమిలా అతనికి అయిన గాయం ఇంకా మానలేదు. రమేశ్ కొన్నిసార్లు హఠాత్తుగా అర్ధరాత్రి మేల్కొంటున్నాడు. తరువాత నిద్రపోవడం లేదు. చికిత్స కోసం మేము అతనిని రెండు రోజుల క్రితం మానసిక వైద్యనిపుణుని వద్దకు తీసుకెళ్లాం. అతనికి ఇప్పుడే చికిత్స ప్రారంభమైనందున, లండన్ వెళ్లేందుకు ఎటువంటి ప్లాన్ వేసుకోలేదు’ అని తెలిపారు.జూన్ 17న రమేష్ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన దూరదర్శన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయిందని వివరించాడు. తన సీటు, 11ఏ.. ఎడమ వైపున ఉన్న అత్యవసర తలుపుకు దగ్గరగా ఉందని తెలిపారు. జూన్ 12న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని మెడికల్ కాలేజీ కాంప్లెక్స్‌లోకి కూలిపోయింది.
ఎన్ఆర్ఐ

విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి,అమరావతి/కడప కార్పొరేషన్/తిరుపతి గాంధీ రోడ్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ జయంతి (జూలై 8)ని పురస్కరించుకుని వివిధ దేశాల్లో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్‌లో సోమవారం వైఎస్సార్ అభిమానులు మహ్మద్ జిలానీ బాషా, అక్రమ్ బాషా, కోటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి యాత్ర–2 చిత్ర నిర్మాత శివ మేక ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం 500 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ జయంతిని నిర్వహించేందుకు తన స్థలాన్ని కేటాయించిన సోనాపూర్ లేబర్ క్యాంప్ యజమాని మసూద్ అహ్మద్‌కు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రసన్న సోమిరెడ్డి, పవన్ కుమార్, కరుణాకర్, లోకనాథ్ రెడ్డి, రెడ్డయ్య రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, షేక్ అబ్దుల్లా, ఫహీమ్, ఖాజా ముతాలిబ్, చక్రి, కర్ణ, పవన్ కుమార్, హనుమంత్ రెడ్డి, మహేశ్వర రెడ్డి, క్రాంతి కుమార్ రెడ్డి, గోపాల్, రమణా రెడ్డి, షోయబ్, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సౌదీ అరేబియాలో..సౌదీ అరేబియాలోని జుబైల్ ప్రాంతంలో వైఎస్సార్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. అకియాకునో కంపెనీ క్యాంపులో కడపకు చెందిన షేక్ ఇలాహి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కంపెనీలో పని చేసే సుమారు 100 మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.సింగపూర్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి..వైఎస్సార్ జయంతిని సింగపూర్‌లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగపూర్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం కేక్‌ను కట్ చేశారు. తెలుగు జాతి ఈ నేల మీద నడయాడుతున్నంత కాలం.. జనానికి, జగతికి గుర్తుండి పోయే పేరు వైఎస్సార్ అని.. ఇప్పటికి ఆయన పేరు తలుచుకుంటే.. ఒక ఉద్వేగం.. ఓ పులకింత.. ఓ సంక్షేమ భావన గుర్తుకు వస్తాయని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ ఎ. సాంబశివారెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా వీడియో కాన్ఫరెన్స్(జూమ్)ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ వైఎస్సార్సీపీ విభాగం సలహాదారు కోటి రెడ్డి, కన్వీనర్ దువ్వూరు మురళీకృష్ణారెడ్డి, కో కన్వీనర్స్ – ప్రకాష్ , సంతోష్ తో పాటు పవన్, రామిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, దొరబాబు, ప్రసాద్, శ్రీనేహారెడ్డి, స్వాతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్సార్ ఆప్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.సౌత్ ఆఫ్రికాలో ఘనంగా వైఎస్సార్ జయంతివైఎస్సార్సీపీ ఎన్నారై సౌత్ ఆఫ్రికా విభాగం ఆధ్వర్యంలో జోహన్స్‌బర్గ్‌లోని మిడ్ రాండ్లోలో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే చదువుకుని విదేశాల్లో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డామన్నారు. అనంతరంచిల్డ్రన్స్ హోమ్‌లో పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు నరసింహారెడ్డి కళ్ల, సూర్యరామిరెడ్డి, శివ రాజవరపు, విక్రం రెడ్డి పెట్లూరు, కృష్ణారెడ్డి, అంజలి రెడ్డి, మనోజ రాజవరపు, సూర్య రామిరెడ్డి, శ్రావణి రెడ్డి పెట్లూరు, వాసు సింగారెడ్డి, మధు పల్లె, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, అంజి రెడ్డి సానికొమ్ము, నవీన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు

అక్కడ అంతటి గౌరవమా..! భారత సంతతి మహిళ అనుభవం
అగ్నిమాక సిబ్బందికి ఇంత గౌరవ మర్యాదలిస్తారా అని అబ్బురపడింది ఓ భారత సంతతి మహిళ. అస్సలు ఇది ఊహించలేదు. సరదాగా మా నాన్నని లండన్ తీసుకువస్తే..ఇంతలా గౌరవ మన్ననలను అందుకుంటాడని అనుకోలేదంటూ ఖుషీ అవుతోంది ఆ మహిళ. అసలేం జరిగిందంటే..UKలో నివసిస్తున్న భారత సంతతి మహిళ పూజా ఖర్బ్ తన నాన్నను లండన్ పర్యటనకు తీసుకువచ్చినప్పడు ఎదురైన అనుభవాన్ని నెట్టింట షేర్ చేసుకున్నారు. నిజానికి ఆమె తండ్రి ఢిల్లీలో అగ్నిమాపక సిబ్బందిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన తన కూతురితో కలిసి లండన్ వెళ్లారు. అక్కడకు ఆ తండ్రి తనవెంట ఐడీ కార్డుని కూడా తీసుకుని వెళ్లాడు. అక్కడ తన అగ్నిమాపక దళం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఇలా లండన్‌కి తన ఐడీ కార్డుని తెచ్చుకున్నాడు. తన కూతురు పూజాతో లండన్‌కి వచ్చిన అతడు..నేరుగా తన వృత్తికి సంబంధించిన అగ్నిమాపక స్టేషన్‌ని సందర్శించేందుకు వెళ్లాడు. అక్కడ తన ఐడీ కార్డుని చూపించగానే అక్కడి అధికారులు అతనికి అగ్నిమాపక కేంద్రాన్ని ఎలా నిర్వహిస్తున్నారో చూసే అవకాశం లభించడమే గాక, అక్కడ అతనికి మంచి గౌరవ మర్యాదలు కూడా లభించాయి. పైగా అక్కడ అగ్నిమాపక సిబ్బంది జాకెట్ ధరించి ఓ ఫోటో కూడా దిగాడు. అంత దూరం నుంచి కూతురు కారణంగా లండన్ వచ్చిన ఆ తండ్రికి అక్కడి అగ్నిమాపకదళం అందించిన గౌరవమర్యాదలకు ఎంతో సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అది చూసి కూతురు పూజా ఈ లండన్ పర్యటనకు తీసుకువచ్చి మంచి పనిచేశా, ఆయన ఎంతో సంతోషంగా ఉన్నారంటూ తెగ సంబరపడింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా పంచుకుంది. అయితే నెటిజన్లు ఇక్కడ భారతీయ అగ్నిమాపక సిబ్బందికి అంతటి గుర్తింపు లభించడం లేదని వాపోవడమే గాక, ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది ఉద్యోగాలను లేదా అగ్నిమాపక సిబ్బందిని ఎవరూ అభినందించరు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. అలాగే లండన్ అగ్నిమాపక శాఖ కూడా పూజా షేర్ చేసిన వీడియోపై స్పందించింది. ఇలా మా అగ్నిమాపక దళాన్ని సందర్శించినందుకు చాలా సంతోషం అని లండన్ ఫైర్ స్టేషన్ బదులివ్వడం విశేషం. View this post on Instagram A post shared by pooja kharb (@learnerforlifetime) (చదవండి: మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి)

డాలస్‌లో అత్తలూరి విజయలక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం : "నేనెవరిని" నవలావిష్కరణ
డాలస్, టెక్సస్: ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి యాభై ఏళ్ల సాహితీ ప్రస్థానాన్ని పురస్కరించు కుని తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహించిన "అత్తలూరి సాహితీ స్వర్ణోత్సవం" సాహిత్యసభ పెద్ద సంఖ్యలో హాజరయిన సాహితీప్రియులు సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించిన తానా పూర్వాధ్యక్షులు, ప్రస్తుత తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహాకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “అత్తలూరి కలంనుండి వివిధ అంశాలమీద ఇప్పటివరకు వెలువడ్డ 300 కథలు, 25 నవలలు, 100 రేడియో నాటికలు, 30 రంగస్థల నాటకాలు గత ఐదు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయన్నారు. ఆమె రచనలు సమాజంలోని వాస్తవపరిస్థితులకు అద్దం పడతాయని, పాఠకులను ఆలోచింపజేస్తాయని అన్నారు”.ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. సత్యం ఉపద్రష్ట మాట్లాడుతూ “విజయలక్ష్మి జీవనప్రస్థానాన్ని సాహిత్యవిజయాలతో మేళవించి, కుటుంబ విలువలను ప్రతిబింబిస్తూ ఆమె రచనలు ఎలా సాగుతాయో, తన తల్లిదండ్రుల ప్రతిభ ఎలా తనను తీర్దిదిద్దినదో, తన విజయంతోబాటు తన కుమార్తె రాజేశ్వరి విజయానికి కూడా ఎలా దారితీసిందో సోదాహరణంగా వివరించారు.”విశిష్టఅతిథులుగా హాజరైన ప్రముఖ రచయిత కన్నెగంటి చంద్ర తన ప్రసంగంలో విజయలక్ష్మి రచించిన "నేనెవరిని" నవలలోని ముఖ్యఅంశాలను విశ్లేషిస్తూ ఈ నవల కేవలం ఒక పుస్తకం కాదని, ఇది సమాజపు అంతరాత్మను ప్రశ్నించే ఒక శక్తివంతమైన ఆయుధమని అభివర్ణించారు. ఒక స్త్రీ తన అస్తిత్వం కోసం చేసే పోరాటాన్ని ఇంత హృద్యంగా చిత్రించడం రచయిత ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.విజయలక్ష్మి వ్రాసిన 300 కథలనుండి కొన్ని కధలను ప్రస్తావిస్తూ రచయిత్రి ఎంచుకున్న కథా వస్తువును, శిల్పాన్ని, కథా గమనాన్ని ప్రముఖ రచయిత్రి సుజన పాలూరి వివరించగా, మొత్తం 130 నాటికలలో కొన్ని నాటికల ఇతివృత్తాలను, అవి సాగిన తీరును నాటకరంగ ప్రముఖులు డా. కందిమళ్ళ సాంబశివరావు విశ్లేషణ చేయగా, సాహితీవేత్త విజయ భాస్కర్ రాయవరం మరికొన్ని నాటకాలను, ముఖ్యంగా “ద్రౌపది” నాటకంలో ఆ పాత్రను మలచిన తీరు, రచనలోని లోతును, సామాజిక స్పృహను స్ప్రుశించారు.ముఖ్యఅతిథి డా. సత్యం ఉపద్రష్ట రచయిత్రి విజయలక్ష్మి వ్రాసిన “నేనెవరిని” నవలను ఆవిష్కరించి తొలి ప్రతిని సభాధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూరకు అందజేశారు. సుప్రసిద్ధ రచయిత్రి సాహితీ స్వర్ణోత్సవం అమెరికాలో జరుపుకోవడం విశేషమంటూ డా. ప్రసాద్ తోటకూర హాజరైన సాహితీప్రియులందరితో కలసి అత్తలూరి విజయలక్ష్మికి “సాహితీ స్వర్ణోత్సవ విద్వన్మణి” అనే బిరుదు ప్రదానంచేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ “తన సాహితీ ప్రయాణంలో తన పాఠకులే తన బలమని, వారి అభిమానమే తనను ముందుకు నడిపిస్తుందని, ఈ 50 ఏళ్ళ సాహిత్య ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. "నేనెవరిని" నవల వ్రాయడానికి ప్రేరేపించిన సామాజిక పరిస్థితులను వివరిస్తూ, తన రచనల ద్వారా సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు”.ఈ సాహిత్యసభకు కావలసిన అన్ని ఏర్పాట్లును, విందుభోజనంతో సహా, మరియు సమర్దవంతంగా సభానిర్వహణలో ముఖ్యపాత్ర వహించిన “రేడియో సురభి” బృందానికి, హాజరైన అతిథులకు, సాహితీప్రియులకు డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

వియత్నాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు వియత్నాం రాజధాని హనోయి నగరంలో మంగళవారం ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గత వారం రోజులుగా వియత్నాంలో పర్యటిస్తున్న కరుణాకర రెడ్డి.. దివంగత రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఏ ప్రాంతంలో ఉన్నా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులున్నారని సంక్షేమం అంటేనే మొదట గుర్తుకు వచ్చేది రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు పేదరిక నిర్మూలనకు కృషి చేసి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా వైఎస్ నిలిచి పోవడం జరిగిందని, అనేక రాష్ట్రాలలో ప్రస్తుత ముఖ్యమంతులు వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నితిన్ రెడ్డి, చరణ్ రెడ్డి, జివి లక్ష్మీ, వాణి రెడ్డి, నీహారిక, డేనియల్, ప్రశాంత్, పీటర్సన్, డాంగ్ జాన్, తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
క్రైమ్

బీమా చేయించి.. ఆపై చంపించి..
సాక్షి, సిద్దిపేట/సిద్దిపేట కమాన్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను హత్య చేయించి..దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా పెద్దమాసాన్‌పల్లి శివారులో చోటుచేసుకుంది. శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ డాక్టర్ బి.అనురాధ ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన తొగుట పీఎస్ పరిధిలో దివ్యాంగురాలైన తాటికొండ రామవ్వ(60)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందని.. ఆమె అల్లుడు తాళ్ల వెంకటేశ్ డయల్ 100కు కాల్ చేశాడు. దీంతో గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందినట్టు తొగుట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైట్ కారు ఢీ కొట్టి..ఇప్పుడే వెళ్లిందని ఫిర్యాదులో భాగంగా వెంకటేశ్ పోలీసులకు చెప్పాడు. పోలీసులు వైట్ కారు డ్రైవర్‌ను విచారించగా, తన కంటే ముందు బ్లాక్ కలర్ తార్జీపు వెళ్లిందని చెప్పాడు. సీసీ ఫుటేజీని పరిశీలించగా ఈ తార్ జీపు తుక్కాపూర్ వరకు నంబర్ ప్లేట్ ఉన్నట్టు, తర్వాత దానిని తొలగించి టీఆర్ స్టిక్కర్ వేసినట్టు గుర్తించారు. ఎందుకు నంబర్ ప్లేట్ తొలగించారని ఆరా తీశారు. ఆ తార్ జీపు నంబరు ఆధారంగా వాహన యజమాని దగ్గరకు వెళ్లి పోలీసులు విచారించారు. పెద్దమాసాన్‌పల్లికి చెందిన కరుణాకర్ సెల్ఫ్ డ్రైవింగ్ నిమిత్తం సిద్దిపేటలో రూ 2,500 చెల్లించి ఆధార్ కార్డు, వివరాలు ఇచ్చి అద్దెకు తీసుకున్నాడు. దీంతో పోలీసులు కరుణాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. కరుణాకర్ చెప్పిన వివరాల ఆధారంగా మృతురాలి అల్లుడైన వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. తానే ఈ దారుణానికి ఒడికట్టానని పోలీసులకు చెప్పాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే...సిద్దిపేట కేసీఆర్‌నగర్‌కు చెందిన తాటికొండ రామవ్వ–రంగయ్య దంపతుల కుమార్తెను తొగుట మండలం పెద్దమాసాన్‌పల్లికి చెందిన తాళ్ల వెంకటేశ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అయితే వెంకటేశ్ తన అత్తను హత్య చేసి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి... ఆమె పేరుపై ఇన్సూరెన్స్ చేయించి డబ్బు కాజేయాలనుకున్నాడు. అందులో భాగంగానే ఈ ఏడాది మార్చిలో తాటికొండ రామవ్వ పేరుపై పోస్టాఫీసులో ఏడాదికి రూ.755 చెల్లించి రూ.15 లక్షల ఇన్సూరెన్స్, ఎస్బీఐలో రూ.2 వేలు చెల్లించి రూ 40 లక్షల ఇన్సూరెన్స్ చేయించాడు. రైతుబీమా డబ్బు లు వస్తాయని రంగయ్య (మృతురాలి భర్త) పేరు పైన ఉన్న 28 గుంటల వ్యవసాయ భూమిని రామవ్వ పేరు మీద పట్టా మారి్పడి చేయించాడు. ఆపై తన ప్లాన్‌కు వరుసకు తమ్ముడయ్యే తాళ్ల కరుణాకర్‌కు చెప్పాడు. వెంకటేశ్ గతంలోనే తాళ్ల కరుణాకర్‌కు రూ.1.30 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అయితే కరుణాకర్ పౌల్ట్రీఫామ్ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయాడు. తన అత్త హత్యకు సహకరిస్తే అప్పు ఇవ్వాల్సిన అవసరం లేదని, వచ్చే ఇన్సూరెన్స్‌లో ఇద్దరం చెరి సగం పంచుకుందామని వెంకటేశ్ కరుణాకర్‌ను ఒప్పించాడు. ప్లాన్‌లో భాగంగానే ఈ నెల 7న కారు తీసుకొని రావాలంటూ వెంకటేశ్ కరుణాకర్‌కు ఫోన్ చేశా డు. ఇదే సమయంలో విద్యుత్ అధికారులు వస్తున్నారని నీ సంతకం కావాలని చెప్పి వెంకటేశ్ తన అత్త రామవ్వను ఎక్స్ఎల్ వాహనంపై పెద్దమాసాన్‌పల్లి శివారులోని వ్యవసాయ భూమి వద్దకు తీసుకొచ్చాడు. కరుణాకర్ సిద్దిపేటలోని కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ ఇచ్చే వారి వద్దకు వెళ్లి ఓ తార్ జీపు (టీఎస్ 18జీ 2277)ను అద్దెకు తీసుకున్నాడు. నంబర్ ప్లేట్ కనిపించకుండా టీఆర్ పేపర్ అతికించి పెద్దమాసాన్‌పల్లి శివారుకు వచ్చాడు. రోడ్డుపైన రామవ్వను ఉంచి వెంకటేశ్ పొలంలోకి వెళ్లాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం...రామవ్వను జీపుతో కరుణాకర్ ఢీకొట్టాడు. ఆపై కొద్ది దూరం వెళ్లాక వెంకటేశ్‌కు వాట్సాప్ కాల్ చేసి మీ అత్తను చంపిన వెళ్లి చూసుకో అన్నాడు. అనంతరం జీపునకు టీఆర్ పేపర్ తీసేసి దానిని సిద్దిపేటలో ఇచ్చేశాడు. సాంకేతిక సాయంతో పోలీసులు వెంకటేశ్‌ను అదుపులోకి తీసు కొని విచారించగా ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే తన అత్త ను చంపించినట్టు ఒప్పుకున్నాడు. ఆధారాలు దొరక్కుండా చేసేందుకు వారు దృశ్యం సినిమా చూశారని పోలీసు లు తెలిపారు. నార్మల్ ఫోన్ కాల్ చేస్తే పోలీసులకు దొరికే ప్రమాదముందని నిందితులిద్దరూ వాట్సాప్ కాల్స్ మా ట్లాడుకున్నట్టు విచారణలో తేలింది. వెంకటేశ్, కరుణాకర్లను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన తార్ జీప్ ఎక్స్ఎల్ వాహనాన్ని స్వా«దీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. గజ్వేల్ ఏసీపీ నరసింహులు ఆధ్వర్యంలో కేసును ఛేదించిన తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ రవికాంతరావు, సిబ్బందిని సీపీ అభినందించి రివార్డు అందజేశారు.

పోలీసులు చంపేసి.. చెరువులో వేశారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి పోలీసుల రెడ్‌బుక్ రాజ్యాంగంలో మాతంగి భరత్ అనే యువకుడి ప్రాణం పోయింది. కోర్టు వాయిదాకు హాజరు కాకపోవడంతో ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో అతడిని పొట్టన పెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెరువుగట్టు వద్ద నివాసం ఉంటున్న భరత్ ఇంటికి బుధవారం రాత్రి త్రీ టౌన్ ఐడీ పార్టీ కానిస్టేబుల్ మురళీ, మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో భరత్, అతడి తమ్ముడు నవీన్, మరో ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఆటోలోంచి దిగిన ముగ్గురు పోలీసులు.. భరత్ అనుకుని మరొకరిని గట్టిగా పట్టుకున్నారు. దీంతో భరత్ పరిగెత్తుకుంటూ వెళ్లి చెరువులో దూకాడు. పోలీసులు కూడా చెరువులోకి దిగి వెంబడించారు. భరత్ ఈదుకుంటూ మరోవైపు వెళ్లగా అక్కడ మాటువేసిన మరికొందరు పోలీసులు పట్టుకుని బైక్ మీద తీసుకువెళ్లారని స్థానికులు చెబుతున్నారు.ప్యాంట్ లేకుండా.. తీవ్ర గాయాలతో విగతజీవిగా రెండు రోజుల తర్వాత శుక్రవారం ఉదయం భరత్ అదే చెరువులో విగతజీవిగా కనిపించాడు. అయితే, అతడు చెరువులో దూకే సమయంలో నల్ల ప్యాంట్, టి షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహంపైన మాత్రం ప్యాంట్ లేదు. కట్ డ్రాయర్, టి షర్ట్ మాత్రమే ఉన్నాయి. భరత్ తొడలు వాచిపోయాయి. తల, ముఖంపై తీవ్రంగా, శరీరంపై గాయాలున్నాయి. దీంతో పోలీసులే కొట్టి చంపి, చెరువులో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తీవ్రస్థాయిలో బెదిరింపుల మధ్య అంత్యక్రియలు భరత్ మృతి తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాలను మరింత బలపరుస్తోంది. పోస్టుమార్టం నుంచి అంత్యక్రియల వరకు 5 పోలీస్ జీప్‌లు, ఒక స్పెషల్ పార్టీ బస్సు అనుసరించాయి. గతంలో తెనాలిలో పనిచేసి, ప్రస్తుతం జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులు వచ్చి.. భరత్ కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేయడం గమనార్హం. పోలీసుల తప్పు లేకపోతే ఎందుకు ఈ తతంగం నడుపుతున్నారన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వచ్చాయి. అంతేకాదు.. ‘‘ఎలాంటి హడావుడి చేయకుండా అంత్యక్రియలు జరిపించండి. తేడా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని కుటుంబసభ్యులను బెదిరించినట్లు తెలిసింది. భరత్ శరీరంపై లాఠీదెబ్బలుంటే విచారించి న్యాయం చేస్తామని ఎలాంటి ఆందోళనలు చేయొద్దని కూడా కోరినట్లు సమాచారం. » భరత్‌పై గత నవంబరులో త్రీ టౌన్ స్టేషనులో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో విచారణకు గైర్హాజరయ్యాడు. ఈ నెల 14న వాయిదా కోసం తెనాలిలోని పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో 9వ తేదీ రాత్రి పొద్దుపోయాక పోలీసులు భరత్ ఇంటికి వెళ్లారు. కాగా, భరత్ తో పాటు ఇద్దరు పోలీసులు చెరువులో దూకినా కొంతసేపటి తర్వాత అతడు దొరకలేదంటూ తిరిగివెళ్లారని చెబుతున్నారు. అయితే, భరత్ విగతజీవిగా తేలేవరకు పోలీసులు చెరువు వైపు చూడకపోవడం అనుమానాలను మరింత తీవ్రం చేస్తోంది. భరత్ వారి వద్ద ఉన్నందునే పోలీసులు చెరువు వద్దకు మళ్లీ రాలేదని అంటున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సీరియస్ అయ్యారు. శనివారం సెట్ కాన్ఫరెన్స్‌లో తెనాలి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెనాలిలో వరుస ఘటనలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని డీఎస్పీపైనా నిప్పులు చెరిగినట్లు సమాచారం.పోలీసులు చిత్రహింసలు పెట్టి నా బిడ్డను చంపేశారు మావాడు ఎంతసేపైనా ఈదగలడు. అలాంటివాడు చెరువులో మునిగి ఎలా చనిపోతాడు? పోలీసులే పట్టుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపి చెరువులో వేసి తొక్కేశారు. పోలీసులను ఏమార్చి పారిపోయి ఉంటాడని అనుకున్నాం. శవమై తేలతాడని ఊహించలేదు. భరత్‌పై పోక్సో కేసు కూడా బూటకమే. పోలీసులకు ఎప్పుడేది అనిపిస్తే ఆ కేసు పెట్టడం, లోపల వేయడం అలవాటైంది. అబ్బాయిని తీసుకుని స్టేషన్‌కు రమ్మంటే తీసుకెళ్లేదాన్ని. చంపేయడం ఎందుకు? –భరత్ తల్లి సుశీల బీర్జాల మీద కొట్టారు.. ఒంటిపైన లాఠీదెబ్బలు ఉన్నాయి మా అన్నను ఐడీ పార్టీ కానిస్టేబుల్ మురళీ మరో పదిమంది కానిస్టేబుళ్లు కలిసి పట్టుకుని తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేశారు. అతడి ఒంటిపై లాఠీ దెబ్బలు ఉన్నాయి. బీర్జాల మీద కొట్టడంతోనే మరణించాడు. తర్వాత తెచ్చి చెరువులో వేసి తొక్కేశారు. పోలీసులు వెళ్లాక రాత్రంతా చెరువు చుట్టూ వెదికాం. కానీ, విగతజీవిగా కనిపించాడు. ఇది పోలీసులు చేసిన హత్యే. ఫిర్యాదు చేసినా కేసు పెట్టలేదు. తెనాలిలో పనిచేసిన నరసింహారావు అనే పోలీసు వచ్చి రాజీ ప్రయత్నాలు చేశారు. –భరత్ తమ్ముడు నవీన్ పోలీసులు చేసిన హత్యగా కనిపిస్తోంది భరత్ మృతి పోలీసులు చేసిన హత్య అని స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోపణలు బలమైనవే. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్చాలి. పోలీసుల ప్రమేయం ఉన్నందున, స్థానిక అధికారులు విచారిస్తే న్యాయం జరగదు. బయటి పోలీసులు లేదా సీఐడీతో విచారణ చేయించాలి. –జి.శాంతకుమార్, అధ్యక్షుడు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్

సిద్ధిపేటలో దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపి..
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో దారుణం జరిగింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ అల్లుడు.. తన అత్తనే చంపించేశాడు.. ఈ నెల జులై 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అల్లుడు వెంకటేష్.. రూ. లక్షా 50 వేలు సుపారీ ఇచ్చి.. కారుతో ఢీకొట్టించి అత్తను హత్య చేయించాడు. తోగుట మండలం తుక్కాపూర్ దర్గా వద్ద ఈ ఘటన జరిగింది. పక్కా ప్లాన్ ప్రకారం అత్తను హత్య చేయించిన అల్లుడు గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయిందంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు.సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయగా అల్లుడి బాగోతం బయటపడింది. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్య చేసినట్టు అల్లుడు వెంకటేష్ తన నేరాన్ని అంగీకరించాడు. అత్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన అల్లుడు వెంకటేష్.. ముందుగానే పోస్టాఫీసు ఇన్సూరెన్స్, ఎస్బీఐ ఇన్సూరెన్స్, రైతు బీమా చేయించినట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.పౌల్ట్రీ ఫామ్ పెట్టి రూ.22 లక్షల వరకు నష్టపోయిన వెంకటేష్.. నష్టాల నుంచి బయటపడేందుకు అత్త హత్యకు ప్లాన్ చేశాడు. అత్త పేరుపై రూ.60 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేసిన అల్లుడు.. పొలం పని ఉందని చెప్పి..అత్తను తీసుకెళ్లాడు. దృశ్యం-2 సినిమా చూసి అత్తను హత్య చేయించాడు. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు.

అన్నను అతికిరాతకంగా చంపిన తమ్ముడు
మెదక్: సొంత అన్ననే తమ్ము డు కిరాతకంగా హతమార్చిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... వసురాంతండాకు చెందిన రామావత్ మంత్యా (48)కు తండా పక్కనే పొలం ఉంది. ఇతని సొంత తమ్ముడు మోహన్ కూడా ఇదే తండాలో నివాసం ఉంటున్నాడు. గత యాసంగి సీజన్లో మోహన్ ట్రాక్టర్‌తో మంత్యా తన పొలాన్ని దున్నించాడు. కిరాయి డబ్బు చెల్లించలేదు. ఈ విషయమై అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోహన్ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతుండటం, నెల క్రితం అతడి మనవరాలు అనారోగ్యంతో చనిపోయింది. అన్న మంత్యా మంత్రాలు చేయడం కారణంగానే ఇలా జరిగిందని భావించాడు. రెండు రోజుల క్రితం పొలం దున్నడానికి అదే తండాకు చెందిన భిక్షపతి ట్రాక్టర్‌ను మంత్యా మాట్లాడాడు. విషయం తెలుసుకున్న మోహన్ తన డబ్బులు ఇవ్వకుండా ఎవరూ పొలం దున్నేది లేదంటూ గొడవపడ్డాడు. ఉద యం కల్లు దుకాణంలో మోహన్, భిక్షపతి కల్లు తాగారు. దున్నకం విషయమై మాట్లాడాలంటూ భిక్షపతి మంత్యాకు ఫోన్ చేయగా అక్కడకు వచ్చాడు. డబ్బుల విషయమై అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మోహన్ పక్కనే ఉన్న కల్లు సీసాను పగలగొట్టి మంత్యా గొంతులో ఇతర శరీర భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. ఆపై బండరాయితో తలపై, మర్మాంగాలపై మోదాడు. చేతి రుమాలుతో మెడకు బిగించి నేలపై తలను కొట్టి, కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. విషయం తెలుసుకున్న మంత్యా భార్య లక్ష్మి , కుమారుడు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న మంత్యాను కొల్చారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు తెలిపారు. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటన మొత్తాన్ని కల్లు దుకాణంలో ఉన్న కొందరు ఫోన్లో చిత్రీకరిస్తూ నిలుచున్నారే తప్ప ఘోరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.