ప్రధాన వార్తలు

‘అమ్మఒడి’ దొంగలు!
మొన్నటి నిజం..‘‘అమ్మ ఒడి పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశాం.’’ – ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తూ చంద్రబాబు చెప్పిన మాటనేటి అబద్ధం..‘తల్లికి వందనం’ పథకం లోకేశ్ ఆలోచనే..!! – కొత్తచెరువు జెడ్పీ స్కూల్లో చంద్రబాబుసాక్షి, అమరావతి: పిల్లల ఎదుటే పచ్చి అబద్ధాలు..! ఓ రాష్ట్రానికి పెద్దరికం వహించే బాధ్యతలో ఉన్నాననే స్పృహలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు.. బడాయిలు!! రాష్ట్రంలో ఇప్పటిదాకా అసలు ‘‘అమ్మ ఒడి’’ లేనే లేదు..! ఈ పథకాన్ని తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవటాన్ని చూసి యావత్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి నివ్వెరపోతోంది. ఇంత దివాళాకోరుతనమా? అబద్ధం అనే పదానికి డిక్షనరీ చూడాల్సిన అవసరం లేదు.. బాబు పేరు చెబితే చాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కూడా.. ఏకంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాడు – నేడుతో తీర్చిదిద్దిన పాఠశాలలోనే కూర్చుని.. గత ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్ తరగతి సాక్షిగా చంద్రబాబు అబద్ధాలాడటంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘పీటీఎం’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ‘అమ్మ ఒడి’ రూపశిల్పి తన తనయుడు నారా లోకేశ్‌నని కళ్లార్పకుండా బుకాయించారు. అయితే లోకేశ్ కూర్చున్న టేబుల్ మొదలుకుని చంద్రబాబు ఏ పుస్తకంలో చూసి పిల్లలకు పాఠాలు చెప్పారో... ఆ బైలింగ్యువల్ టెక్ట్స్‌బుక్స్‌ను కూడా తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని గుర్తు చేస్తున్నారు. మొన్న విశాఖలో యోగా పేరుతో డ్రామా నడపగా తాజాగా పీటీఎం.. గిన్నిస్ రికార్డులు అంటూ నాటకాన్ని రక్తి కట్టించారని వ్యాఖ్యానిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ చంద్రబాబు ఊహకు కూడా తట్టని విప్లవాత్మక సంస్కరణలను వైఎస్ జగన్ విద్యారంగంలో తెచ్చారని పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో నాడు – నేడు, సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్‌ఈ, ఐబీ, టోఫెల్, పిల్లలకు ట్యాబ్‌లు, డిజిటల్ తరగతులు, పౌష్టికాహారంతో నాణ్యమైన గోరుముద్ద లాంటివన్నీ గత ప్రభుత్వం కృషి వల్లే ప్రభుత్వ విద్యా రంగంలో సాకారమయ్యాయని పేర్కొంటున్నారు. చంద్రబాబు సర్కారు చేసిందల్లా.. స్కూళ్లను మూసివేయడం.. బొద్దింకల భోజనం.. ఇంగ్లీషు మీడియం ఎత్తివేత.. సీబీఎస్‌ఈ, ఐబీ రద్దు.. నాడు – నేడు నిలిపివేతతోపాటు టెన్త్ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించకలేకపోవడం.. మూల్యాకనంలో తప్పిదాలు దొర్లటం.. ప్రభుత్వ స్కూళ్లకు ఏడాదిలో ఏకంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు దూరం చేయడం అని విద్యావేత్తలు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రపంచంలో అబద్ధానికి బాబే బ్రాండ్ అంబాసిడర్ అనేందుకు ఇదో మరో తార్కాణమని పేర్కొంటున్నారు. నాడు ‘అమ్మ ఒడి’ మార్గదర్శకాల ప్రకారమేనన్న బాబు శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘పీటీఎం’ కార్యక్రమానికి తన తనయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో కలసి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటిస్తూ.. ‘‘తల్లికి వందనం’’ పథకం మంత్రి నారా లోకేశ్ ఆలోచనల నుంచే పుట్టిందని చెప్పడంతో పిల్లలతోపాటు తల్లితండ్రులు, ఉపాధ్యాయులు నిర్ఘాంతపోయారు. ఇదే చంద్రబాబు ‘తల్లికి వందనం’ పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తూ.. ‘అమ్మ ఒడి’ పథకం మార్గదర్శకాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేశామని చెప్పడాన్ని వారంతా గుర్తు చేసుకున్నారు. తల్లికి వందనం.. అమ్మ ఒడి పథకాలు రెండూ ఒకటేనని వల్లె వేయడాన్ని ప్రస్తావిస్తున్నారు. పేదరికం వల్ల పిల్లలను బడికి పంపకుండా పనులకు పంపుతున్నారని, ఆ పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక రీతిలో ‘అమ్మ ఒడి’ పథకానికి రూపకల్పన చేయడం అందరికీ తెలిసిందే. వైఎస్ జగన్ ఆ పథకాన్ని నవరత్నాల్లో చేర్చి 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారు. నోరు తెరిస్తే చాలు.. తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవమని బడాయి చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ అమ్మ ఒడి లాంటి విప్లవాత్మక పథకాన్ని అమలు చేయాలనే కనీస ఆలోచన కూడా చేయలేదని విద్యార్థుల తల్లితండ్రులు, ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. సదుపాయాలన్నీ జగన్ సర్కారు సమకూర్చినవే..వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నాడు–నేడు పథకం కింద వైఎస్ జగన్ అభివృద్ధి చేశారు. కొత్తచెరువు జెడ్పీ పాఠశాలనూ అదే రీతిలో తీర్చిదిద్దారు. స్వయంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలసి కూర్చున్న కుర్చీలు, డబుల్ డెస్క్ బెంచీలు వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చినవే. అది బహిర్గతమవుతుందనే భయంతో నాడు–నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయ చేశారు. అసలు ఆ పాఠశాలలో అమర్చిన ఫ్యాన్‌లు, లైట్లు, అధునాతన ఐఎఫ్‌పీలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవే కావడం గమనార్హం. వైఎస్ జగన్ హయాంలో కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌కు సమకూర్చిన కుర్చీలపై కూర్చొని.. గత ప్రభుత్వం అందచేసిన అధునాతన ఐఎఫ్‌పీ స్క్రీన్ ముందు నిలబడి.. తల్లికి వందనం పథకం లోకేశ్ ఆలోచనల నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పడంతో విద్యార్థులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. సీఎం చంద్రబాబు ఇలా అబద్ధాలాడటం ఇదే మొదలు కాదు.. చివర కాదు అంటూ నెట్టింట, సోషల్ మీడియాలో చలోక్తులు విసురుతున్న పోస్టులు వైరల్ అయ్యాయి. హైదరాబాద్‌ను తానే నిరి్మంచానని.. సెల్‌ఫోన్, కంప్యూటర్ కనిపెట్టిందీ తానేనని తరచూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవటాన్ని ప్రస్తావిస్తున్నారు.విద్యా విప్లవాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్‌రాష్ట్రంలో విప్లవాత్మక సంస్కరణలతో విద్యా విప్లవాన్ని 2019లో నాటి సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసే పనులకు నడుం బిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనను ప్రారంభించారు. సీబీఎస్‌ఈ సిలబస్ నుంచి ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణాన్ని ఆరంభించారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానాన్ని అమలు చేసి బోధన, విద్యా ప్రమాణాలను సమున్నత స్థాయికి చేర్చారు. టోఫెల్ శిక్షణతో విద్యార్థులను ఆంగ్ల భాషా నైపుణ్యాలతో తీర్చిదిద్దారు. ప్రతి తరగతి గదికి ఐఎఫ్‌పీ స్క్రీన్లు, అధునాతన టీవీలు అందించి.. డిజిటల్ బోధనను చేరువ చేశారు. బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలు సమకూర్చారు. విద్యార్థులకు మూడు జతల నాణ్యమైన యూనిఫాం, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, టై, బెల్ట్, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలతోపాటు బ్యాగ్‌ను స్కూలు ప్రారంభించిన మొదటి రోజే జగనన్న విద్యా కానుకగా అందించి తల్లితండ్రులకు చదువుల భారం లేకుండా చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ ఐరాస వరకు వినిపించేలా వెన్నుతట్టి పిల్లలను ప్రోత్సహించారు. వైఎస్ జగన్ ఆవిష్కరించిన విద్యా సంస్కరణలను చంద్రబాబు సర్కారు కక్షపూరితంగా అడ్డుకుని అంధకారంలోకి నెట్టేసిందని ఉపాధ్యాయవర్గాలే బాహాటంగా విమర్శిస్తుండటం గమనార్హం. ఈ విద్యా ప్రగతి మీది కాదు..కూటమి పాలనలో ఈవెంట్ ఆర్గనైజర్లుగా ఉపాధ్యాయులుమెగా పీటీఎంపై సోషల్ మీడియాలో విమర్శలు కూటమి పాలనలో ఉపాధ్యాయులు ఈవెంట్ ఆర్గనైజర్లుగా మారిపోయారని టీచర్లు వాపోతున్నారు. విద్యార్థులకు చదువు చెప్పడం కంటే ఈవెంట్ల నిర్వహణలోనే గడుపుతున్నట్టు వాట్సాప్ గ్రూపుల్లో గురువారం మెసేజ్‌లు చక్కర్లు కొట్టాయి. ఏడాది పాలనలో విద్యకు సంబంధించి ఒక్క మంచి పని చేయకుండా గొప్పలు చెప్పుకోవడం వీరికే చెల్లించదని, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అభివృద్ధి చేసిన పాఠశాలలోనే ఇప్పుడు సీఎం చంద్రబాబు, లోకేశ్ కూర్చుని వేడుకలు చేసుకున్నారని సెటైర్లు వేశారు. ‘సీఎం గారూ.. మీరు కూర్చున్న బెంచీలు మీ ప్రభుత్వం ఇచ్చినవి కాదు. మీకు ఎదురుగా ఉన్న ఐఎఫ్‌పీ ప్యానల్ మీరు ఇచ్చినది కాదు. తరగతి గదిలో ఉన్న ఫ్యాన్లు, లైట్లు మీరు అమర్చినవి కావు. ఆ గ్రీన్ చాక్ బోర్డ్స్ కూడా మీరు ఇచ్చినవి అంతకంటే కాదు. దయచేసి మీ మిగిలిన నాలుగేళ్లలో ఇకనైనా మా పాఠశాలలకు మంచి చేయండి. రికార్డుల కోసం ఇలాంటి ఆర్భాటపు పనికిమాలిన కార్యక్రమాలతో పిల్లలు, టీచర్ల కాలాన్ని వృధా చేయొద్దు. ఉపాధ్యాయులను ఈవెంట్ ఆర్గనైజర్లుగా మార్చేశారు. 16 ఏళ్లు సీఎంగా ఉన్న మీరు స్కూళ్లకు చేసిందేమిటో సెలవిస్తారా?’ అంటూ నిలదీశారు. మీ ‘పేరెంట్ టీచర్ మీటింగ్’ ఆదేశాలకు జడిసి బోధన, అడ్మిషన్లను పక్కనపెట్టాం. ఫలితంగా ఏ స్వీట్ షాప్‌లో, బుక్ షాప్‌లో, ఫ్లెక్సీ షాప్‌లో చూసినా అయ్యవార్లే.. తుదకు మామిడాకుల కోసం, రంగు కాగితాలు, బ్యానర్లు, అట్టముక్కలు చింపడం, అతికించడం, అధికారుల బాగోగులు చూడటం వల్ల మా జేబుకు చిల్లు పడింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు అసాంఘిక శక్తులా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రైతుల పక్షాన మేం నిలబడితే ఎల్లో మీడియా దౌర్భాగ్యపు రాతలు రాయడం ఏమిటి? అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. మామిడి రైతులకు కష్టాలే లేనట్లుగా... వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్లు, సంబరాలు చేసుకుంటున్నట్టు రాతలు రాయడానికి, మాట్లాడటానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ‘చంద్రబాబూ ..! రైతులకు మీరు నిజంగానే మేలు చేస్తే మంత్రి అచ్చెన్నాయుడిని ఢిల్లీ ఎందుకు పంపారు’ అని ప్రశ్నించారు. బంగారుపాళ్యంలో పర్యటించి మామిడి రైతులను ఓదార్చి భరోసా కల్పించడంపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ గురువారం స్పందించారు. చంద్రబాబు సర్కారుకు సూటిగా పలు ప్రశ్నలు సంధించారు. మామిడి రైతులపై పిచ్చి రాతలు రాసిన పచ్చ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ ఏమన్నారంటే...పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలిసీఎం చంద్రబాబూ...! మీరు, మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 సహా మీకు కొమ్ము కాస్తున్న ఎల్లో మీడియా మరింతగా దిగజారిపోయాయి. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా.. వందల మందిని నోటీసులతో నిర్బంధించినా.. అణచివేతలకు దిగినా.. చివరకు లాఠీఛార్జీ చేసినా వెరవకుండా తమ గోడు చాటుతూ బుధవారం బంగారుపాళ్యంలో రైతులకు సంఘీభావంగా నేను నిర్వహించిన పర్యటనకు స్వచ్ఛందంగా హాజరయ్యారు. ఈ ప్రభుత్వం తీరుపట్ల రైతుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం చూసింది. ఇదే సందర్భంలో కొంతమంది రైతులు తమకు తీవ్ర నష్టం వచ్చినా, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని దేశం దృష్టికి తేవాలనే ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇది నేరమన్నట్లుగా.. తమ కష్టాలు చెబుతున్న రైతులను, వారి తరఫున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకుని రౌడీషీటర్లుగా, అసాంఘిక శక్తులుగా, దొంగలుగా చిత్రీకరిస్తూ, వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడులో, మీ ఎల్లో మీడియాలో రాయించడం మీకే చెల్లింది. తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడటం వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల మీకు, మీ ప్రభుత్వానికి, మిమ్మల్ని భుజాన మోస్తున్న మీ ఎల్లోమీడియాకు ఉన్న చులకన భావానికి, బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. మామిడి రైతులకు కష్టాలే లేనట్టుగా, వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా, సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు, మాట్లాడుతున్నారు! ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా? చంద్రబాబూ..! పాలకుడని చెప్పుకోవడానికి మీకు సిగ్గు ఉండాలి! పత్రికలు, టీవీలు అని చెప్పుకోవడానికి మీ ఎల్లో మీడియాకు సిగ్గు ఉండాలి!సమాధానం చెప్పలేక తప్పుడు రాతలావైఎస్సార్‌సీపీ హయాంలో రైతులకు ఏరోజూ ఇలాంటి కష్టం రాలేదు. గతేడాది కూడా కిలో మామిడికి రూ.25 – 29 మధ్య ధర లభించింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు ఎందుకు పడిపోయాయి? ఏటా మే 10 – 15 మధ్య తెరవాల్సిన పల్ప్ ఫ్యాక్టరీలను ఈ ఏడాది ఎందుకు తెరవలేదు? నెల రోజులు ఆలస్యంగా ఎందుకు తెరిచారు? అవి కూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు? సకాలంలో ఫ్యాక్టరీలు తెరవకపోయినా మీరు ఎందుకు పట్టించుకోలేదు చంద్రబాబూ? ఒకేసారి సరుకు వచ్చేలా చేయడం ద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్లు కాదా?మీ గల్లా ఫ్యాక్టరీ, శ్రీని ఫుడ్స్.. ఇలా మీవాళ్లకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా? అసలు మీరు ఇస్తానన్న కిలోకి రూ.4 ఎంతమంది రైతులకు ఇచ్చారు? ఎంతమంది రైతులకు రూ.8 చొప్పున ఫ్యాక్టరీలు చెల్లించాయి? నిరుడు వైఎస్సార్‌సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ రూ.29 రేటు? ఈరోజు అమ్ముకుంటున్న కిలోకి రూ.2.5 – రూ.3 ఎక్కడ? ప్రతిపక్ష నేతగా, రైతుల పక్షాన బుధవారం బంగారుపాళ్యంలో దీన్ని నిలదీసే కార్యక్రమం నిర్వహిస్తే మీ దగ్గర సమాధానం లేక రైతుల మీద, మామీద తప్పుడు మాటలు మాట్లాడతారా? తప్పుడు వక్రీకరణ రాతలు రాస్తారా?రైతులు నష్టపోయినట్లు ఒప్పుకుంటూనే దౌర్భాగ్యపు మాటలు, రాతలా?నిజంగానే మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే.. రైతులు పంటను తెగనమ్ముకోకపోతే.. మీరు ఎంతమేర అమలు చేశారన్న విషయాన్ని పక్కనపెడితే.. కిలోకు రూ.4 చొప్పున ప్రభుత్వం నుంచి ఇస్తామన్న ప్రకటన ఎందుకు చేశారు? పల్ప్ ఫ్యాక్టరీలు కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేయాలని దొంగ ఆదేశాలు ఎందుకు జారీ చేశారు? కర్ణాటకలో కిలో రూ.16 చొప్పున కనీస ధరకు కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మీ ఎన్డీయేలోనే ఉన్న జేడీఎస్ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది? బంగారుపాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారు కాగానే మీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని ఎందుకు ఢిల్లీకి పంపారు? దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా? మరి రైతులు నష్టపోయినట్లు ఒకవైపు మీరు అంగీకరిస్తూనే ఆ నష్టాన్ని రైతుల పక్షంగా మేం ఎలుగెత్తితే మళ్లీ ఈ దౌర్భాగ్యపు మాటలు, రాతలు ఏమిటి? ఈ ఆంక్షలు ఎందుకు?గల్లా, శ్రీని ఫుడ్స్‌కు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేయడం లేదంటారా..?రైతాంగానికి అండగా నిలిస్తే రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలా..మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే... రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతూ, ప్రతి యువకుడూ, ప్రతి నిరుద్యోగీ, ప్రతి మహిళా, ప్రతి ఉద్యోగీ, వారికి అండగా నిలబడేవాళ్లంతా మీ దృష్టిలో రౌడీలు, అసాంఘిక శక్తులు, దొంగలు...!! అంతేకదా చంద్రబాబూ...? వీరికి ఏ సమస్యా లేదని, అన్ని హామీలను మీరు తీర్చేశారని, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అందుకుని వీరంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్రభాష్యం! కనీస మద్దతు ధర దక్కడం లేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు, ధాన్యం రైతులు, కోకో రైతులు, పొగాకు రైతులు.. వీళ్లందరూ బాగున్నారని, మంచి రేట్లు వచ్చినా వీళ్లంతా అసాంఘిక శక్తులు కాబట్టి రోడ్లు ఎక్కారనేగా మీ ఉద్దేశం? ఇదేం పద్ధతి? ఇదేం విధానం చంద్రబాబూ..?ఒక్క కిలో అయినా కొన్నారాగిట్టుబాటు ధరలు రావడం లేదని మిర్చి రైతులు గగ్గోలు పెట్టినా ఒక్క కిలో అయినా కొన్నారా చంద్రబాబూ..? మీరు వచ్చిన తర్వాత వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, అరటి, ఉల్లి, చీనీ, కోకో, పొగాకు, చివరకు మామిడి... ఇలా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడం లేదన్నది వాస్తవం కాదా? గట్టిగా ప్రశ్నిస్తే డ్రామాలతో రైతులను, ప్రజలను మభ్యపెట్టే యత్నాలు చేస్తున్నారు. మిర్చి రైతులు ధరలు రావడం లేదని ఆక్రోశిస్తే కేంద్రం చేత కొనిపిస్తానంటూ డ్రామా చేశారు. చివరకు ఒక్క కిలో అయినా కొన్నారా? ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? పొగాకు రైతులు ఆందోళన చేస్తే ఇంకో డ్రామా చేస్తూ ప్రకటనలు చేయిస్తున్నారు. రైతుల సంక్షేమంపై మీరు ఏనాడైనా చిత్తశుద్ధితో వ్యవహరించారా?మీరు ఇస్తానన్న రైతు భరోసా రూ.20 వేలు ఇవ్వలేదుమీరు ఇస్తానన్న రైతు భరోసా (అన్నదాతా సుఖీభవ) రూ.20 వేలు ఇంతవరకూఇవ్వలేదు. గతేడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాదీ ఇప్పటివరకు దిక్కులేదు. ఈ ఏడాది జూన్ 21కి ఇస్తానని చెప్పి, జూలై రెండోవారం అవుతున్నా ఇప్పటికీ దాని గురించి ప్రస్తావించడం లేదు. సీజన్ మొదలై వారాలు గడుస్తున్నా పరిస్థితి అగమ్య గోచరమే. మా హయాంలో మే నెల చివరికల్లా రైతులకు పెట్టుబడి సహాయం వారి చేతికి అందేది.రైతులు నష్టపోతున్నా ఆ పని ఎందుకు చేయడం లేదుమా ప్రభుత్వం ఉన్నప్పుడు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. రైతులు నష్టపోతున్నా మీరెందుకు ఆ పని చేయడం లేదు? ఏ పంటకు ఏ ధర ఉందనే విషయంపై ఆర్బీకేల్లో రియల్ టైం మానిటరింగ్ చేసే సీఎం యాప్ ఏమైంది?ఇన్‌పుట్ సబ్సిడీ గాలికి వదిలేశారువరదలు వచ్చినా, కరువులు వచ్చినా సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీని ఇచ్చే మా విధానాన్ని మీరు గాలికి వదిలేశారు. ఉచిత పంటల బీమాను పూర్తిగా ఎత్తేశారు. ఆర్బీకేలు, ఈ–క్రాప్ విధానం, గ్రామంలోనే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు సప్లై చేసే వ్యవస్థను, విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకూ రైతును చేయిపట్టుకుని నడిపించే వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. టెస్టింగ్ ల్యాబ్స్‌ను నాశనం చేస్తున్నారు. రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు. వీటిని ప్రశ్నిస్తే, మీ వైఫల్యాలను ఎండగడితే మాపైన, ఆందోళన చేస్తున్న రైతులపైనా అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి చంద్రబాబూ..! రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి.

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణకు త్వరలో ఆర్డినెన్స్ తీసుకురావాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన కేబినెట్.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ అనంతరం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీతో పాటు కామారెడ్డి సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో కుల గణన నిర్వహించడాన్ని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసనసభలో ఆమోదించి, గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం గుర్తు చేశారు. సీఎం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఇతర మంత్రులు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ పలువురు కేంద్రమంత్రులు, సంబంధిత అధికారులతో దీనిపై అనేకసార్లు చర్చించినా కొర్రీలు వేస్తూ కాలయాపన చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ భేటీకి అడ్వొకేట్ జనరల్‌ను కూడా ఆహ్వానించి ఆయన సలహాలు తీసుకుని, న్యాయపరమైన చిక్కులు రాకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్నికలకు ఇబ్బందులు ఎదురవకుండా రాజకీయ పార్టీలు కూడా చిత్తశుద్ధితో సహకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి ఇప్పటికే రాష్ట్రంలో 62 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్ నిబంధన దేశంలో ఎప్పుడో పోయిందని అన్నారు. కేబినెట్ నిర్ణయాలు 96% అమలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక దీనికి ముందు వరకు జరిగిన 18 మంత్రివర్గ సమావేశాల్లో 327 అంశాలపై చర్చించి 321 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. తాజాగా జరిగిన 19వ సమావేశంలో ఆ నిర్ణయాల అమలులో పురోగతిపై విస్తృతంగా చర్చించామని, 96 శాతం అంశాలకు సంబంధించి జీవోలు జారీ చేసి అమలు దశకు తీసుకెళ్లినట్టు తేలిందని చెప్పారు. కాగా ప్రతి రెండు వారాలకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచన మేరకు మళ్లీ ఈ నెల 25న మంత్రివర్గ భేటీ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి 3 నెలలకోసారి ఆ కాల వ్యవధిలో జరిగే ఆరు కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును సమీక్షించాలని కూడా నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు చేరవేసే వ్యవస్థ పనితీరును మళ్లీ కేబినెట్‌లోనే ఇలా సమీక్షించడం దేశంలోనే తొలిసారి అని అన్నారు. ఈ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50% సీట్లు రాష్ట్రంలోని అమిటీ, సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ విద్యా సంస్థలకు వర్సిటీలుగా గుర్తింపు కల్పించాలని కేబినెట్ నిర్ణయించినట్టు పొంగులేటి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 15 ఉత్తమ వర్సిటీల్లో అమిటీ 11/12వ స్థానంలో ఉందన్నారు. సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ సైతం అన్ని రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వనుందని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్ చొరవతో ఈ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించడానికి ఆ సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయని తెలిపారు. మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాల భర్తీ ఈ ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, వీటితో పాటు మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని పొన్నం చెప్పారు. ఇక కొత్తగా 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు జాబ్ కేలెండర్ సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. వచ్చే మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించామన్నారు. ఎస్సీల వర్గీకరణ సమస్యతో నోటిఫికేషన్ల జారీలో కొంత జాప్యం జరిగిందని ఆయన వివరించారు. ⇒ రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన మిగులు భూసేకరణను సత్వరం పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అనంతరం ఆ ప్రాజెక్టుల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు పొంగులేటి వెల్లడించారు. ⇒ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్‌గా, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్‌గా, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్‌గా పరిగణించి బీసీ రిజర్వేషన్లు కల్పిస్తారు. ⇒ సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 4 చోట్ల అత్యాధునిక గోశాలలు రాష్ట్రంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిటీ వచ్చే కేబినేట్ సమావేశంలోపు తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు పశు సంవర్థక శాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను, కొత్తగా నిర్మించే గోశాల డిజైన్లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించారు. రాష్ట్రంలో 306 గోశాలలున్నాయి. కగా హైదరాబాద్‌లో ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజి్రస్టేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మత్స్యకార సొసైటీలకు పర్సన్ ఇన్‌చార్జిలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెరువులు, కుంటల్లో 80–110 మి.మీ. సైజు గల 82 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్‌ను రూ.19 కోట్ల నుంచి రూ.122 కోట్లకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపునకు సంస్కరణలు ⇒ వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది. ⇒ ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమరి్పంచాలని కమిటీని ఆదేశించింది.

ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.పాడ్యమి రా.2.13 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పూర్వాషాఢ ఉ.6.33 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.2.50 నుండి 4.30 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.23 వరకు, అమృత ఘడియలు: రా.12.51 నుండి 2.30 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 5.35, సూర్యాస్తమయం: 6.35. మేషం.. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా కొంత నిరుత్సాహం. శారీరక రుగ్మతలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బందిపరుస్తాయి.వృషభం.... కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. ఆదాయం తగినంత లేక అప్పులు చేస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి,వ్యాపారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.మిథునం... కార్యక్రమాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవారాధనలో పాల్గొంటారు. వృత్తి,వ్యాపారాలలో మీరు అనుకున్నట్లే జరుగుతుంది. కళాకారులకు ప్రయత్నాలు సఫలం.కర్కాటకం.... రాబడికి లోటు లేదు. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు. వృత్తి, వ్యాపారాలలో మీ ఊహలు నిజం కాగలవు. వస్తులాభాలు.సింహం... కార్యక్రమాలలో తొందరపాటు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. కళాకారులకు చికాకులు.కన్య... కష్టానికి ఫలితం కనిపించదు. ముఖ్య కార్యాలలో తొందరపాటు. ఆస్తి వివాదాలు. రాబడికి మించిన ఖర్చులతో సతమతమవుతారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దేవాలయ దర్శనాలు.తుల... సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. అదనపు రాబడితో అవసరాలు తీరతాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. దేవాలయ దర్శనాలు.వృశ్చికం... ఆదాయం అంతగా కనిపించదు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. శారీరక రుగ్మతలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ధనుస్సు.... కార్యక్రమాలు సకాలంలో చకచకా సాగుతాయి. అదనపు ఆదాయంతో ఉత్సాహంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.మకరం..... కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ఆదాయం ఉన్నా ఖర్చులు సైతం పెరుగుతాయి. ప్రతి విషయానికి కలత చెందుతారు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు..కుంభం... సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలలో విజయం. ఆదాయం మరింత సంతృప్తినిస్తుంది. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి,వ్యాపారాలు అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవేత్తలు కాస్త ఉపశమనం పొందుతారు.మీనం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సోదరుల నుంచి ముఖ్య సమాచారం. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపార, ఉద్యోగాలు అవాంతరాలు తొలగుతాయి.

అధిక జనాభాకు ‘సుస్థిర’ విరుగుడు
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 1990 జూలై 11 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో, జనాభా పెరుగుదల సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 2025 ప్రపంచ జనాభా దినోత్సవం థీమ్‌గా ‘న్యాయమైన, ఆశాజనకమైన ప్రపంచంలో వారు కోరుకొనే కుటుంబాలను సృష్టించడానికి యువతను సాధికారం చేయడం’ను ఎంచు కొన్నారు. మనిషే మూలధనంప్రపంచ జనాభా 2011లో 700 కోట్ల నుండి 2022లో 800 కోట్లకు పెరిగింది. 2025లో 820 కోట్లకు చేరుకుంది. వనరుల కొరత, పర్యావరణ క్షీణత, వలసలు, పట్టణీకరణ, అధిక వృద్ధాప్య జనాభా, బాల కార్మికులు, సామాజిక అసమానతలు లాంటి సమస్యలకు జనాభా పెరుగుదల దారి తీసింది. సుస్థిరతపై జనాభా ప్రభావం ముఖ్యాంశంగా నిలుస్తున్నందువల్ల ప్రపంచ దేశాలు ఈ సమస్యను అధిగమించవలసి ఉంది. సీఎమ్‌ఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) 2023 నివేదిక ప్రకారం, భారత్‌లో యువతలో నిరుద్యోగిత 23 శాతం కాగా, గ్రామీణ యువత అల్ప ఉద్యోగిత, ఉపాధి లేకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటోంది. భారత్ జనాభా 2001లో 102.87 కోట్ల నుండి 2011లో 121.09 కోట్లకు, 2025లో 146.39 కోట్లకు పెరిగింది. అయితే, సంతానోత్పత్తి రేటు (1.9), రీప్లేస్‌మెంట్ స్థాయికన్నా (2.1) తక్కువగా నమోద యింది. ఈ స్థితిని ఐక్యరాజ్యసమితి జనాభా సంక్షోభంగా అభివర్ణించింది. కాకపోతే ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్’ రిపోర్ట్– 2025 ప్రకారం, మొత్తం జనాభాలో 15–64 వయోవర్గ జనాభా 68 శాతంగా ఉండటాన్ని బట్టి భవిష్యత్తులో భారత్ ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ పొందుతుంది. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ద్వారా భారత్ సుస్థిరవృద్ధి సాధించాలంటే వ్యూహాత్మక పెట్టుబడులు, అభిలషణీయ విధానాల అమలుపై దృష్టి సారించాలి. మానవ మూల ధనంపై పెట్టుబడులు ఉపాధి అవకాశాలను పెంపొందించి, సమ్మిళిత వృద్ధి, పర్యావరణ సుస్థిరతతోపాటు దీర్ఘకాల ఆర్థిక శ్రేయస్సు, సామాజిక ప్రగతికి దారితీస్తాయి.సుస్థిర వృద్ధి సాధనకు సవాళ్ళుభారత్‌లో పట్టణ జనాభా 2036 నాటికి 60 కోట్లకు చేరుతుందని అంచనా. భూగర్భ జలాలు 2030 నాటికి 21 నగరాలలో అడుగంటుతాయని అంచనా. దాంతో ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటారు. భూమి, నీరు, శక్తి, జీవ వైవిధ్యంపై ఒత్తిడి అధికమవుతుంది. మితిమీరిన సాగు, అడవుల నరికివేత, పట్టణాలలో భూముల ఆక్ర మణ కారణంగా భారత్ మొత్తం భూవిస్తీర్ణంలో 29.7 శాతం డీగ్రేడెడ్ భూమిగా వర్గీకరింపబడింది. భారత్‌లో సాంవత్సరిక ఘన వ్యర్థాలు 6.2 కోట్ల టన్నులు కాగా, ఈ మొత్తంలో 70 శాతాన్ని సేకరిస్తున్నప్పటికీ, దీనిలో 20 శాతంకన్నా తక్కువే ప్రాసెస్ అవుతోంది. వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో ప్రతి సంవత్సరం 16 లక్షల అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్షణ పరిమితుల కన్నా ఢిల్లీ, ముంబై నగ రాల్లో పీఎం 2.5 స్థాయులు ఎక్కువున్నాయి.రాష్ట్రాల మధ్య జనాభా వైవిధ్యాలు భారత్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మానవా భివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు సామాజిక సేవలపై అధికంగా పెట్టు బడులు పెడుతున్న కారణంగా ఆ యా రాష్ట్రాలలో సంతానోత్పత్తి రేటు తగ్గి వృద్ధాప్య వయోవర్గ జనాభా పెరుగుతున్నది. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ బల హీనంగా ఉండటంతోపాటు, అందరికీ విద్య అందుబాటు తక్కు వగా, లింగ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 (2019–21) ప్రకారం, పాఠశాల విద్యకు నోచుకోని మహిళలు సగటున 3.1 పిల్లలకు జన్మ నివ్వగా, 12వ తరగతి మరియు ఆ పైన విద్యాధికులైన మహిళలు సగటున 1.7 పిల్లలకు జన్మనిచ్చారు. విద్యకు సంబంధించి బిహార్, రాజస్థాన్‌లలో లింగ అసమానతలు అధికం.పర్యావరణ హితంగా సమాజ సంక్షేమంవనరుల యాజమాన్యం, పర్యావరణ పరిరక్షణతో జనాభా వృద్ధిని సంతుల్యం (బ్యాలెన్స్) చేయడం సుస్థిరాభివృద్ధికి ప్రధానం. ఆర్థిక విధానాలలో పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానతను సంఘటిత పరచడం ద్వారా భవిష్యత్ తరాల అవసరాలతో రాజీ పడకుండా, ప్రస్తుత అవసరాలను తీర్చవచ్చు. ఈ మూడు అంశాల మధ్య ఉన్న పరస్పర అనుసంధానాన్ని అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలు కనుగొన్నట్లయితే అన్ని అంశాల్లోనూ ఒకేసారి ప్రయోజనం కలుగుతుంది.పర్యావరణ పరిరక్షణతో ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేయడానికి బహుముఖ విధానం అవసరం. ఈ లక్ష్య సాధనకు సుస్థిర పద్ధతులు అవలంబించడం, పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు పెట్టడం అవ సరం. ఈ చర్యలు పర్యావరణ ప్రభావాన్ని కనిష్ఠం చేసి, ఆర్థిక వృద్ధి పెంపునకు దోహదపడతాయి. బాధ్యతాయుత పర్యాటక పద్ధతులు పాటించినప్పుడు పర్యావరణ వ్యవస్థ పరిరక్షించబడి, స్థానిక ప్రజలు ప్రయోజనం పొందుతారు.గత దశాబ్ద కాలంలో అనేక ప్రభుత్వాలు సంప్రదాయ ఆర్థిక నమూనాకు బదులుగా గ్రీన్ ఎకానమీని ప్రత్యామ్నాయంగా ఎంచు కోవడం జరిగింది. గ్రీన్ టెక్నాలజీని సమర్థవంతంగా ప్రోత్సహించాలంటే ఆర్థిక ప్రోత్సాహకాలు, నియంత్రణ సంస్థల మద్దతు, ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యం అవసరం. అంతర్జాతీయ సహ కారం ద్వారా నవ కల్పనలను ప్రోత్సహించాలి. ఆర్థిక ప్రోత్సాహ కాలలో భాగంగా టాక్స్ క్రెడిట్, గ్రాంటు ఇస్తూ, సోలార్ ప్యానల్స్, విండ్ టర్బైన్స్ లాంటి పునరుత్పాదక శక్తి ఏర్పాట్లకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం కల్పించాలి. పరిశోధన–అభివృద్ధికి (ఆర్ అండ్ డీ) ఆర్థిక మద్దతునందించాలి. విద్య, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి అవకాశాలను అందరికీ అందించటం ద్వారా సామాజిక సమ్మిళితం సాధించాలి. పర్యావరణ కార్యక్రమాలయిన రీఫారెస్టేషన్, వృథా యాజమాన్య కార్యక్రమా లలో వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా, సామాజిక, పర్యావరణ అంశాలను సంఘటితపరచవచ్చు. అసంఘటిత రంగంలోని సంస్థల యాజమాన్యానికి సుస్థిరాభివృద్ధి పద్ధ తులు అవలంబించే విషయంలో సరైన పరిజ్ఞానం లేకపోవచ్చు. సుస్థిరాభివృద్ధి విధానాల అమలు, వనరుల యాజమాన్యం, అంద రికీ సమాన అవకాశాల కల్పనకు పటిష్ఠమైన సంస్థలు, సమర్థవంత మైన గవర్నెన్స్ అవసరం. వినియోగదారులను కూడా సుస్థిర ఉత్పత్తుల వినియోగం వైపు మొగ్గు చూపే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. వనరుల విని యోగం తగ్గుదలకు, తక్కువ వృథాకు సుస్థిర పద్ధతులు తోడ్పడు తాయి. తద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. సామాజిక ప్రాధాన్య తలో భాగంగా న్యాయమైన వేతనాలు, సురక్షిత పని పరిస్థితులు, విద్య – ఆరోగ్య సంరక్షణ, సంస్కృతిని కాపాడుకోవడం అవసరం. పర్యావరణ సుస్థిరత, సామాజిక ప్రాధాన్యతలు దీర్ఘకాలంలో సమ్మి ళిత వృద్ధి సాధనకు దోహదపడతాయి. మానవ మూలధనంపై పెట్టు బడులు ఆర్థిక వృద్ధి పెంపునకు అత్యవసరం.డా‘‘ తమ్మా కోటిరెడ్డి వ్యాసకర్త ప్రొఫెసర్ – డీన్, ఇక్ఫాయ్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఐ.ఎఫ్.హెచ్.ఈ, హైదరాబాద్

చిత్తశుద్ధి లేని నిషేధం!
రాజ్యాంగంలోని మూడు వ్యవస్థల తాలూకు సమస్త యంత్రాంగం కొలువు తీరిన దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం మన విధాన నిర్ణేతల వైఫల్యాలకు నిదర్శనం. ఈ నెల 1 నుంచి కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై తిరగనివ్వబోమని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) ఉత్తర్వులిచ్చింది. డీజిల్ వాహనాలు పదేళ్లకు మించి తిరుగుతున్నా, పెట్రోల్ వాహనాలు పదిహేనేళ్లకు మించి వినియోగిస్తున్నా వాటికి బంకుల్లో ఇంధన విక్ర యాన్ని కమిషన్ నిషేధించింది. మొదట దీన్ని ఢిల్లీలో అమలుచేసి, దశలవారీగా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్‌సీఆర్) అంతటికీ విస్తరిస్తామని తెలిపింది. అందుకనుగుణంగా ఈ నెల 1న చర్యలు మొదలయ్యాయి కూడా. తొలిరోజు కాలం చెల్లిన 80 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 450 వాహనాలకు పెట్రోల్, డీజిల్ అమ్మకాలను నిరాకరించారు. అసలు ఆ బాపతు వాహనాలు బంకుల్లో ప్రవేశించిన క్షణాల్లోనే ‘మీది కాలం చెల్లిన వాహనం. ఇక్కడ ఇంధన విక్రయాలు జరపరు’ అంటూ మైకులు ఉరమటంతో జనం విస్తుపోయారు. కానీ రెండో రోజుకల్లా నిషేధం నీరుగారింది. కేవలం ఏడంటే ఏడే వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మూడోరోజుకల్లా అదీ లేదు. మొదటి రెండు రోజులూ నిషేధం అమలు చేసినా ఇప్పటికీ చాలామంది వాహన యజమానులకు దానిపై అవగాహన లేదంటే ప్రభుత్వ ప్రచారం ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. నిబంధన అమలును నిలిపేయాలని ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం సీఏక్యూఎంను కోరటంతో అది అంగీకరించింది. వచ్చే నవంబర్ 1 నుంచి ఈ నిషేధం అమలవుతుందని తాజాగా ప్రకటించింది. ఎన్నేళ్ల నుంచి వాహనం వాడుతున్నారో తేల్చటానికి అనువైన డిజిటల్ ఆధారిత కెమెరాలు, సెన్సర్లు, స్పీకర్లు చాలాచోట్ల సరిగా లేవనీ, అందువల్లే ఈ వాయిదా అత్యవసరమనీ సీఏక్యూఎంకు రాసిన లేఖలో ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీ కాలుష్యానికి కేవలం కాలం చెల్లిన వాహనాలే కారణమా... కాలుష్యంలో వాటి వాటాయే అధికమా అని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. ఆ విచికిత్స మాట అటుంచి, ఏ చట్టమైనా మన దేశంలో ఎలా విఫలమవుతుందో చెప్పటానికి కేవలం ఈ రెండు రోజుల నిషేధమే రుజువు. నిషేధం మొదలయ్యాక పెద్దయెత్తున నిరసనలు పెల్లుబికాయి. ఇక చేసేది లేక ఆదరా బాదరాగా ఢిల్లీ ప్రభుత్వం సీఏక్యూఎంను ఆశ్రయించటం, అది వెంటనే అంగీకరించటం పూర్తయింది. కాలం చెల్లిన వాహనాలను నిలిపేయాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. 2018లో సుప్రీంకోర్టే ఒక తీర్పులో ఈ సూచన చేసింది. దాన్ని అమలు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారిక అంచనా ప్రకారం, ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాల సంఖ్య 60 లక్షలు! ఢిల్లీలోని అయిదు ప్రాంతాలు– గురుగ్రాం, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతంబుద్ధ నగర్, సోనిపట్‌లలో వాహనాల తాకిడి అధికమని ఆ అంచనా చెబుతోంది. రాజధాని నగరంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఇంతవరకూ అమలు చేసిన ఏ విధా నమూ విజయవంతమైన దాఖలా కనబడలేదు సరిగదా... మొన్న మార్చిలో విడుదలైన గత ఏడాది ప్రపంచ వాయు కాలుష్య నివేదిక ప్రపంచంలోని కాలుష్య నగరాల్లో ఢిల్లీది రెండో స్థానమని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన మార్గదర్శకాల ఆధారంగా రూపొందిన ఈ నివేదిక ఢిల్లీ వాతావరణంలో సాధారణ స్థాయికన్నా 21 రెట్లు అధికంగా సూక్ష్మ ధూళి కణాలున్నాయని తేల్చింది. ఇంకా విషాదమేమంటే, అంతకు ముందు ఏడాది కన్నా 2024లో ఈ కాలుష్యం 6 శాతం పెరిగింది. ఢిల్లీలో సాధారణంగా ప్రతి యేటా నవంబర్ నెలకల్లా వాయు కాలుష్యం గురించిన చర్చ మొదలవుతుంది. అప్పటికల్లా శీతగాలుల తాకిడి మొదలై వాతావరణంలో కాలుష్యం నిలకడగా ఉండిపోతుంది. ఈసారి రెండు రోజుల నిషేధం ప్రహసనం వల్ల ముందే ఆ చర్చ ప్రారంభమైంది. ఏ విధానమైనా అమలు చేసేముందు దాని అమలుకు సంబంధించిన మౌలిక సదుపాయా లెలా ఉన్నాయో ప్రభుత్వాలు సమీక్షించుకోవాలి. ఒక్క మానెసర్ ప్రాంతంలోని ఒక కేంద్రం తప్ప ఢిల్లీ మొత్తంలో ఎక్కడా ప్రామాణికమైన కేంద్రాలు లేవని నిపుణులు చెబుతున్నారు. కేవలం ప్రైవేటు కార్లకే నిబంధనలు వర్తిస్తాయన్నట్టు రవాణా విభాగం ప్రవర్తించింది. ప్రజారవాణా బస్సులు మొదలుకొని వాణిజ్య వాహనాల వరకూ అనేకం ఢిల్లీ కాలుష్యాన్ని అపారంగా పెంచు తున్నాయి. తాజా నిషేధం వాటి జోలికి పోలేదు. ఇక కాలుష్యంలో టూవీలర్‌ల వాటా దాదాపు 25 శాతం. అసలు వాహనం మోడల్‌ని బట్టి దాన్ని కాలం చెల్లిన వాహనంగా వర్గీకరించటం అశాస్త్రీయం. వాహనాన్ని అరుదుగా వాడేవారుండొచ్చు, అతి జాగ్రత్తలు తీసుకునే వారుండొచ్చు. అటువంటివి కాలం చెల్లినవి ఎలా అవుతాయి? వాహనం సాంకేతికంగా తగిన ఫిట్‌నెస్ కలిగివుందా లేదా అనేది చూస్తే వేరుగా వుండేది. అన్నిటికన్నా ముఖ్యం – ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చటం, నగరంలోని నలు మూలలకూ అన్ని సమయాల్లో విస్తృతంగా బస్సు సదుపాయం కల్పించటం. బస్సు కోసం రోడ్లపై గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకపోతే ఎవరైనా తడిసి మోపెడయ్యే సొంత వాహనం కోసం ఎందుకు ఎగబడతారు? వాహనాలు నానాటికీ పెరుగుతున్నాయంటే అది పాలకుల వైఫల్య పర్యవసానం. ఆ సంగతలా ఉంచి అసలు కాలం చెల్లిన వాహనాలను ఏం చేయదల్చుకున్నారు? వాటిని వదిలించుకోవటానికి ఏం ఆలోచించారు? సమస్యలు ఇన్నివున్నప్పుడు ఈ మొక్కుబడి నిషేధాల వల్ల ప్రయోజనం ఏమిటి?

రోగులు, బోధకులు లేకున్నా అనుమతులా?
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అదీనంలోని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తీరు కంచె చేనును మేసిన చందంగా తయారైందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా సాగుతున్న ప్రైవేటు మెడికల్ కాలేజీల దందాకు అడ్డుకట్ట వేసి, విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించేలా చూడాల్సిన ఎన్‌ఎంసీ అధికారులు లంచాలకు కక్కుర్తి పడుతూ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత, మాజీ వైద్యాధికారులతో కుమ్మక్కై ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి రూ.కోట్లలో లంచాలుగా తీసుకున్నట్లు గుర్తించిన సీబీఐ.. ఓవైపు దేశ వ్యాప్తంగా దర్యాప్తు సాగిస్తుండగా, మరోవైపు ఇదేమీ పట్టనట్లు వైద్య కమిషన్ అధికారులు తమ లాలూచీని కొనసాగిస్తూ అధ్వాన స్థితిలో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలలకు సైతం వందశాతం మార్కులు వేస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు ఆమోదముద్ర వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి, ఏ మాత్రం వసతులు లేకున్నా.. కాలేజీలకు అనుమతులు కట్టబెడుతున్నారని తెలుస్తోంది. వర్సిటీ అలా..ఎన్‌ఎంసీ ఇలా రాష్ట్రంలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇటీవల నాలుగు ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు జరిపి వైద్య విద్యకు అనువైన కనీస మౌలిక వనరులు లేవని, రోగులు, బోధనా సిబ్బంది లేకుండా ఏదో ‘సాంఘిక శాస్త్రం’బోధించినట్లుగా వైద్య విద్య అందిస్తున్నట్లు గుర్తించింది. ఈ మేరకు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది. విచిత్రమేంటంటే హెల్త్ యూనివర్సిటీ తనిఖీలు చేసిన కళాశాలల్లో ఒకటైన పటాన్‌చెరులోని రాజ రాజేశ్వరి మెడికల్ కాలేజీని బుధవారం సాయంత్రం సందర్శించిన ఎన్‌ఎంసీ అధికారులు 100 శాతం మార్కులు వేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆకస్మిక పర్యటన చేసినప్పుడు ఈ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలోని వార్డుల్లోని బెడ్లన్నీ రోగులు, సిబ్బందితో పాటు కనీసం స్టూడెంట్లు కూడా లేక వెలవెలబోతున్నట్లు అధికారులు తీసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తుండగా, ఎన్‌ఎంసీ అధికారుల తనిఖీల సమయంలో ఇంతలోనే ఎలాంటి లోటుపాట్లు లేకుండా విద్యార్థులకు అనుగుణంగా రోగులు, ఫ్యాకల్టీ, మౌలిక వనరులు ఎలా సమకూరాయో ఎన్‌ఎంసీ అధికారులే చెప్పాలని అంటున్నారు. మరో 3 కాలేజీలకు కూడా.. రాజ రాజేశ్వరి మెడికల్ కాలేజీతో పాటు హైదరాబాద్ శివార్లలోని నోవా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజీ, సీఎంఆర్ మెడికల్ కాలేజీలలో ఎన్‌ఎంసీ అధికారులు తనిఖీలు జరిపి, వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఉన్నట్లుగా తేల్చినట్లు తెలిసింది. ఈ మేరకు కమిషన్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి చెందిన ఆరోగ్య విశ్వవిద్యాలయం ఓవైపు ప్రైవేటు కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతూ, వసతులు లేని కళాశాలలను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంటే.. మరోవైపు ఎన్‌ఎంసీ అధికారులు మాత్రం ఆయా కళాశాలలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాక్ట్రికల్స్ కోసం శవాలు కూడా సమకూర్చుకోలేని దుస్థితిరాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీలలో చాలావరకు కాలేజీల్లో విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు అవసరమైన రోగులు లేరు. ప్రాక్టికల్స్ కోసం కనీసం శవాలు కూడా సమకూర్చుకోలేని పరిస్థితి ఉంది. వార్డుల్లో పడకలు ఉన్నా, ఏ ఒక్క పడక మీద పేషెంట్ లేని పరిస్థితిని సాక్షాత్తూ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ స్వయంగా చూశారు. మరోవైపు హౌస్ సర్జన్‌గా సేవలు అందించే విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వకపోగా, నాలుగున్నరేళ్ల కోర్సుకు గాను ఐదేళ్ల కాలానికి ఫీజు తీసుకోవడం, ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌తో డాక్టర్ల హాజరు, ప్రాక్టికల్స్ కోసం ఫీజులు వసూలు చేయడం వంటి నిర్వాకాలను గుర్తించారు. అయినా ఎన్‌ఎంసీ అధికారులు వీటిని పట్టించుకోకుండా అన్నింటికీ ఆమోదముద్ర వేసి రావడానికి రూ.కోట్లు లంచాలుగా ముట్టడమే కారణమని ప్రభుత్వ వైద్యాధికారులే ఆరోపిస్తున్నారు. ఎన్‌ఎంసీ సమావేశాలకు మాజీ అధికారులేంటి? నీట్ అడ్మిషన్లు, కాలేజీలకు అనుమతులు, రెన్యువల్, మెడికల్ కాలేజీలకు రేటింగ్ ఇవ్వడం వంటి అంశాలపై చర్చించేందుకు గాను ఎన్‌ఎంసీ నిర్వహించే సమావేశాలకు ఆయా రాష్ట్రాల హెల్త్ వర్సిటీల వీసీలను, వర్సిటీల్లో కీలక హోదాల్లో పనిచేసి రిటైర్ అయిన వారిని ఆహ్వానిస్తారు. అయితే కాళోజీ నారాయణరావు వర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డికి బదులుగా మాజీ వీసీ కరుణాకర్ రెడ్డిని ఎన్‌ఎంసీ సమావేశాలకు ఆహ్వానిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఎన్‌ఎంసీలో జరిగిన సమావేశానికి కూడా నందకుమార్ రెడ్డికి ఆహ్వానం వెళ్లలేదని సమాచారం. గతంలో ఎంఏఆర్‌బీ (మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు)లో ఉన్న ఓ అధికారి కాలేజీలకు ర్యాంకుల కేటాయింపులో అవకతకవకలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ కాగా, సదరు అధికారిని కూడా ఎన్‌ఎంసీ సమావేశాలకు ఆహ్వానిస్తుండడం గమనార్హం. ఒడిశాకు చెందిన మరో రిటైర్డ్ వీసీ కూడా ఎన్‌ఎంసీలో జరిగే అవకతవకల్లో కీలక వ్యక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వసతుల్లేని ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి కోట్లాది రూపాయలు దండుకుంటున్న అధికారులు, వాటికి అనుమతులివ్వడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

IND vs ENG 3rd Test: ఇంగ్లండ్ ఆచితూచి...
ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ ఆటకు చెల్లుచీటో... లేదంటే భారత బౌలింగ్ దళమంటే వణుకో... తెలీదు కానీ లార్డ్స్ టెస్టుతో ఆతిథ్య జట్టు ఆట మొదటికొచ్చింది. కొన్నాళ్లుగా ఓడినా... గెలిచినా ఇలా ఫలితాలతో సంబంధం లేకుండా దూకుడు, దంచుడుతో గ్రేటెస్టు ఫార్మాట్‌ను లేటెస్ట్‌గా మార్చేసిన జట్టే... ఇప్పుడు ఆ పాత మధురమంటూ క్లాసిక్‌కు తిరిగొచ్చింది. గంటల తరబడి క్రీజులో నిలిచేందుకు... బంతుల్ని అదేపనిగా డిఫెన్స్ చేసేందుకు తెగ ప్రాధాన్యమిచ్చింది. మొత్తానికి భారత బౌలింగ్ అంటే ఆషామాషీ కాదని తెలుసుకొని స్టోక్స్ బృందం తెలివిగా మూడో టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించింది. లండన్: భారత బౌలర్లు కొత్త బంతితో చెలరేగకపోయినా... ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించకపోయినా... తొలిరోజు పట్టుబిగించకపోయినా... భారత్‌దే ఓ రకంగా పైచేయి అని చెప్పాలి. గత టెస్టు ఫలితంతో ఈ టెస్టులో ఇంగ్లండ్‌ను ఆచితూచి ఆడేలా చేసింది. ఓవరాల్‌గా బ్యాటింగ్‌నే మార్చేసింది. దీంతో గురువారం మొదలైన మూడో టెస్టులో రోజంతా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులే చేసింది. జో రూట్ (191 బంతుల్లో 99 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీ ముంగిట నిలిచాడు. ఓలీ పోప్ (44; 4 ఫోర్లు), బెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్; 3 ఫోర్లు) రాణించారు. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా... బుమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ప్రసిధ్ కృష్ణ స్థానంలో బుమ్రా రావడం మినహా భారత జట్టులో మరో మార్పు చేయలేదు. బాగుందిరా... మామ! ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (18; 4 ఫోర్లు), బెన్ డకెట్ (23; 3 ఫోర్లు) తమ స్వభావానికి విరుద్ధంగా లార్డ్స్ టెస్టును మొదలుపెట్టారు. బ్యాటింగ్‌లో దూకుడు, పరుగుల్లో వేగం ఈ రెండు లేనేలేవు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల పడినా... బ్యాట్‌కు రవ్వంత దూరంగా వెళ్లినా... అలాంటి బంతుల్ని వికెట్ కీపర్‌కే వదిలేశారు. బుమ్రా బౌలింగ్‌లో మరింత జాగ్రత్త పడ్డారు. ఆకాశ్ దీప్, సిరాజ్‌లు బౌలింగ్‌కు వచ్చినా అనవసర షాట్ల జోలికి వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 14వ ఓవర్ వేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో బంతికి డకెట్‌ను, ఆరో బంతికి క్రాలీని అవుట్ చేయడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తెలుగు ఆటగాడ్ని తెలుగు మాటలతోనే అభినందించాడు. గిల్ నోట ‘బాగుందిరా మామ’ మాట వికెట్లలో అమర్చిన మైక్‌లో రికార్డు కావడంతో ‘ఎక్స్’లో ఈ క్లిప్ బాగా వైరలైంది. తర్వాత వచ్చిన పోప్, రూట్‌లు మరింత ఆచితూచి ఆడటంతో ఈ సెషన్‌లో ఇంకో వికెట్‌కు ఆస్కారం లేకపోయింది. ‘నీరు’గార్చిన రెండో సెషన్ భారత బౌలర్లను రెండో సెషన్ పూర్తిగా నీరుగార్చింది. నితీశ్ ఇచ్చిన వికెట్ల ఊపుతో రెండో సెషన్‌లో వికెట్లను తీద్దామనుకున్న పేసర్లకు నిరాశే ఎదురైంది. రూట్, పోప్ కుదురుగా ఆడుతూ స్కోరుబోర్డు నింపాదిగా నడిపించారు. ఈ సెషన్‌లో 24 ఓవర్లపాటు క్రీజులో ఉన్న బ్యాటర్లు 70 పరుగులు చేయడం చూసిన ప్రేక్షకులకు ఆడుతోంది ఇంగ్లండేనా అనే అనుమానం కలుగకమానదు. ఇంత జిడ్డుగా ఆడుతుండటంతో భారత పేస్ తురుపుముక్క బుమ్రా ఏమీ చేయలేకపోయాడు. షాట్లు ఆడే ప్రయత్నం, పరుగులు తీసే క్రమం ఏమాత్రం పుంజుకోలేకపోవడంతో వికెట్లు తీసే అవకాశమే చిక్కలేదు. పైగా పిచ్ కూడా నిర్జీవంగా మారడంతో భారత బౌలర్లకు, ఫీల్డర్లకు చెమటలే తప్ప సాఫల్యం దక్కనేలేదు. 36వ ఓవర్లో ఇంగ్లండ్ స్కోరు వందకు చేరగా, డ్రింక్స్ విరామం తర్వాతే రూట్ అర్ధసెంచరీ పూర్తయ్యింది. రూట్‌తోపాటు పోప్ మొండిగా నిలబడటంతో ఇంగ్లండ్ వికెట్ నష్టపోలేదు. నింపాదిగా 150 స్కోరును దాటింది. రూట్ 99 బ్యాటింగ్ మూడో సెషన్ మొదలైన బంతికే పోప్ వికెట్‌ను చేజార్చుకున్న ఇంగ్లండ్‌కు కాసేపటికే బుమ్రా కూడా షాకిచ్చాడు. హ్యారీ బ్రూక్ (11)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరానికి ఈ సెషన్ టర్నింగ్ అవుతుందని అంతా భావించారు. కానీ ఈ పైచేయి అక్కడితే ఆగిపోయింది. రూట్ తన జిడ్డు ఆటతీరును కొనసాగించి బాగా విసిగించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా దీటుగా ఎదుర్కోవడంతో పట్టుబిగించే అవకాశం లేకపోయింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు రూట్, స్టోక్స్ 79 పరుగులు జోడించారు. రూట్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడు.పంత్‌కు గాయం... జురేల్ కీపింగ్! భారత డాషింగ్ వికెట్‌కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడ్డాడు. దీంతో రెండో సెషన్ నుంచి ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్లో బంతిని ఆపేందుకు డైవ్ చేయగా అతని ఎడమ చేతికి గాయమైంది. నొప్పితో బాధపడుతున్న పంత్‌కు కాసేపు ఫిజియో వచ్చి సపర్యలు చేశాడు. నొప్పినివారణ స్ప్రే చేసిన అతని నొప్పి తగ్గకపోవడంతో మైదానం వీడాల్సివచ్చింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 23; ఒలీ పోప్ (సి) (సబ్) జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బ్యాటింగ్) 99; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బ్యాటింగ్) 39; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172. బౌలింగ్: బుమ్రా 18–3–35–1, ఆకాశ్‌దీప్ 17–2–75–0, సిరాజ్ 14–5–33–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–0–46–2, రవీంద్ర జడేజా 10–1–26–1, వాషింగ్టన్ సుందర్ 10–1–21–0.

ఇన్ స్టాల్ రీల్స్ చేసిన టెన్నిస్ ప్లేయర్.. హత్య చేసిన తండ్రి!
గురుగ్రామ్: హర్యానా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్ స్టా రీల్స్ చేసిందని కన్న కూతురి జీవితాన్ని చిదిమేశాడు తండ్రి. టెన్నిస్‌లో ఎంతో భవిష్యత్ ఉన్న 25 ఏళ్ల రాధికా యాదవ్‌ను తండ్రి హత్య చేశాడు. గురుగ్రామ్ సుశాంక్ లోక్ ఫేజ్-2లో నివాసముంటున్న రాధికా యాదవ్‌ను.. తండ్రి గన్‌తో కాల్చి చంపాడు. ఇన్ స్టా రీల్‌కు సంబంధించి తండ్రీ కూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇన్ స్టా రీల్ ఎందుకు చేశావని ఆగ్రహించిన తండ్రి.. కూతుర్ని నిలదీశాడు. ఈ విషయంపై కూతురు ఎదురు తిరిగింది. దాంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని తండ్రి తన వద్ద ఉన్న గన్‌తో కాల్చి హత్య చేశాడు.తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కూతుర్ని తన ఇంటి వద్దే కాల్చి చంపాడు. కూతుర్ని చంపడమే లక్ష్యంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దాంతో తీవ్ర గాయాల పాలై రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కూతుర్ని హత్య చేసిన విషయాన్ని తండ్రి అంగీకరించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టెన్నిస్ ఖేలో డాట్ కామ్ ప్రకారం అంతర్జాతీయ టెన్నిస్ ఫెడరేషన్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె 113వ స్థానంలో ఉంది. 2020, మార్చి 23వ తేదీన జన్మించిన రాధికా యాదవ్.. టెన్నిస్‌లో తన ఢవిష్యత్‌ను ఎతుక్కుంటూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చింది. ఈ క్రమంలో ఎన్నో పోటీల్లో విజేతగా నిలిచింది. తన భవిష్యత్‌ను మరింత మెరుగులు దిద్దుకునే క్రమంలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

రూ.70 కోట్లు పలికిన హ్యాండ్ బ్యాగ్
పారిస్: అక్కడక్కడా చిరిగిపోయి, మరకలు పడి, బాగా వాడేసిన నల్లని బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్. కానీ అది అలాంటిలాంటి బ్యాగ్ కాదు. అలనాటి అందాల హాలీవుడ్ నటి వాడిన బ్యాగ్. ఆ క్రేజ్ వల్లేనేమో, ప్రఖ్యాత ఫ్రెంచ్ నటి దివంగత జేన్ బిర్కిన్ వాడిన హ్యాండ్ బ్యాగ్ ఏకంగా 82 లక్షల డాలర్లకు, అంటే దాదాపు రూ.70 కోట్లకు అమ్ముడుపోయి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక హ్యాండ్ బ్యాగ్‌కు ఇంతటి ధర పలకడం వేలంపాటల చరిత్రలో ఇదే తొలిసారి. ప్రఖ్యాత సోత్‌బీ వేలం సంస్థ దీనిని గురువారం ఆన్‌లైన్‌లో విక్రయించింది. 10 లక్షల డాలర్ల బిడ్డింగ్‌తో మొదలైన వేలం పాట క్షణాల్లో కోట్లు దాటేసి కొత్త రికార్డ్‌ను కొట్టేసింది. ఎట్టకేలకు జపాన్‌కు చెందిన ఒక అజ్ఞాత వ్యక్తి ఈ బ్యాగును సొంతం చేసుకున్నారు. ఎవరీ బిర్కిన్? తన అందం, అభినయంతో ఫ్రెంచ్ సినిమాలను ఒక ఊపు ఊపిన అలనాటి ప్రఖ్యాత బ్రిటిష్ నటి జేన్ బిర్కిన్. నేపథ్య గాయనిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా, సామాజిక కార్యకర్తగా... ఇలా పనిచేసిన ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేశారామె. నాటి సినీ, ఫ్యాషన్ ప్రపంచ ఐకాన్‌గా వెలిగిపోయారు. 1946 డిసెంబర్ 14న లండన్‌లోని మేరీలీబాన్‌లో జన్మించారు. 76వ ఏట పారిస్‌లో తుదిశ్వాస విడిచారు. హెర్మ్స్ లగ్జరీ వస్తువుల సంస్థ ప్రత్యేకంగా బిర్కిన్ కోసమే 1984లో ఈ బ్యాగును తయారుచేసింది. పారిస్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో బిర్కిన్ పక్క సీటులో హెర్మ్స్ సంస్థ చైర్మన్ జీన్ లూయిస్ డ్యూమస్ ప్రయాణించారు. ‘‘విమానం ఎక్కినప్పుడు వస్తువులు పెట్టుకోవాలంటే వాంతి చేసుకునే కవర్‌లో పెట్టుకోవాల్సి వస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యాండ్ బ్యాగులన్నీ చిన్నగా ఉన్నాయి. అల్లిన బుట్టను వాడడం ఇబ్బందిగా ఉంది. కాస్తంత పెద్ద బ్యాగు తయారు చేయొచ్చుగా!’’ అని అతడిని బిర్కిన్ కోరింది. అడిగిందే తడవుగా సంస్థలోని నిష్ణాతులను పురమాయించి అత్యంత నాణ్యమైన తోలుతో, ప్రత్యేకతలతో పెద్ద బ్యాగ్‌ను తయారు చేయించి 1985లో ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ బ్యాగులను ఇకపై మీ పేరుతో అమ్ముకోవచ్చా అని అడిగితే ఆమె సరేనన్నారు. ఆమె చాన్నాళ్లపాటు అంటే 1985 నుంచి 1994 దాకా రోజూ ఆ బ్యాగును వెంట తీసుకెళ్లేది. అందాల నటి చేతిలో మరింత అందంగా కనిపించిన ఆ బ్యాగుకు ఫ్యాషన్ ప్రపంచం ఫిదా అయింది. తర్వాత మరో నాలుగు బ్యాగులను కూడా కంపెనీ నుంచి ఆమె బహుమతిగా అందుకున్నారు. కానీ ఈ బిర్కిన్ బ్యాగు మాత్రం ఫ్యాషన్ చిహ్నంగా స్ధిరపడింది. దాంతో హెర్మ్స్ తయారీ బిర్కిన్ బ్యాగుల ధర సైతం అమాంతం పెరిగిపోయింది. కేవలం అత్యంత సంపన్నులు మాత్రమే కొనగలిగే బ్యాగ్‌గా మారిపోయింది.బ్యాగుతో పాటు గోళ్ల కత్తెర బిర్కిన్‌కు గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం అలవాటు. అందుకే ఆమెకు బహూకరించిన బ్యాగుకు కంపెనీ వెండి గోళ్ల కత్తెరనూ జతచేసింది. జిప్ లాక్ చేయడానికి బుల్లి తాళం కూడా ఇచ్చింది. బ్యాగుకు యూనిసెఫ్, మెడిసిన్స్ డ్యూ మోండే వంటి మానవీయ సంస్థల గుండ్రని స్టిక్కర్లను అతికించారామె. బిర్కిన్ 2023లో చనిపోయారు. అంతకు కొద్ది రోజుల ముందు మీడియాతో మాట్లాడుతూ, ‘నా నటన, గానం, ఫ్యాషన్, సమాజసేవతో పాటు నేను చనిపోయాక నా బ్యాగ్ గురించి కూడా జనం మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో!’ అని అన్నారు. ఆమె ఊహించినట్లే లగ్జరీ వస్తువుల ప్రపంచంలో ఇప్పుడా బ్యాగు ప్రత్యేక స్థానం ఆక్రమించుకుందని సోత్‌బీ హ్యాండ్‌బ్యాగులు, యాక్సెసరీల గ్లోబల్ హెడ్ మోర్గాన్ హ్యాలిమీ వ్యాఖ్యానించారు. ఒరిజినల్ బ్యాగును ఎయిడ్స్ ఛారిటీ నిధి కోసం వేలం పాట సంస్థకు ఆమె 1994లోనే ఇచ్చేశారు. 2000లో అది మరోసారి వేలానికి వచి్చంది. తర్వాత పాతికేళ్లుగా ఎవరికీ కనిపించలేదు. ఇన్నాళ్లకు సోత్‌బీ దాన్ని దక్కించుకుని గురువారం ఇలా రికార్డు స్థాయిలో విక్రయించింది. ఈ బ్యాగు మోడల్ అంటే తమకెంతో ఇష్టమని పలువురు సెలెబ్రిటీలు, ఆరి్టస్టులు, స్టైలిస్టులు గతంలో చెప్పారు.
‘స్వ’యంకృతం
చందమామను గ్రహశకలం ఢీకొట్టిన వేళ
నిజమే.. మేం జాగీరుదారులం కాదు
లార్డ్స్‌లో సచిన్ అపు‘రూపం’
ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, పర్ణీత్
ఆరు స్థానాలు పడిపోయి...
మూడో రౌండ్లో హారిక, హంపి
ఇంగ్లండ్ ఆచితూచి...
అనిసిమోవా అదరహో
డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్!
Telangana: నంబర్ ప్లేట్లు మార్చాల్సిందే
Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
పొలిటికల్ రిటైర్మెంట్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
టెక్సాస్‌లో వరదలొచ్చాయని, పుతిన్ మాట వినడం లేదనే కోపంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం కరెక్ట్ కాదేమో సార్!
పెట్రోబాదుడులో ఇండియా టాప్
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
ఆ సినిమా చేయడమే తప్పు.. రంగస్థలం రిజెక్ట్ చేశా: ఆర్కే సాగర్
వరల్డ్ నెం1 బ్యాటర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు.. టాప్-10లోకి గిల్
రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం చకచకా
ఏం గుండె సామీ నీది..? కింగ్ కోబ్రా రియల్‌గా..
ట్రంప్ తిరుగుబాట!
అందుకే ఒవైసీ ఫాతిమా కాలేజీ కూల్చివేయడం లేదు.. హైడ్రా క్లారిటీ
రైతులపై రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తారా : వైఎస్ జగన్
‘ది 100’ మూవీ రివ్యూ
రెండేళ్లగా జట్టుకు దూరం.. కట్ చేస్తే! సడన్‌గా భారత జట్టుతో ప్రాక్టీస్
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ సంతోషం..!
‘స్వ’యంకృతం
చందమామను గ్రహశకలం ఢీకొట్టిన వేళ
నిజమే.. మేం జాగీరుదారులం కాదు
లార్డ్స్‌లో సచిన్ అపు‘రూపం’
ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
సెమీఫైనల్లో జ్యోతి సురేఖ, పర్ణీత్
ఆరు స్థానాలు పడిపోయి...
మూడో రౌండ్లో హారిక, హంపి
ఇంగ్లండ్ ఆచితూచి...
అనిసిమోవా అదరహో
డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్!
Telangana: నంబర్ ప్లేట్లు మార్చాల్సిందే
Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..!
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
పొలిటికల్ రిటైర్మెంట్.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
టెక్సాస్‌లో వరదలొచ్చాయని, పుతిన్ మాట వినడం లేదనే కోపంతో ఇతర దేశాలపై సుంకాలు విధించడం కరెక్ట్ కాదేమో సార్!
పెట్రోబాదుడులో ఇండియా టాప్
ఈ రాశి వారికి నూతన ఉద్యోగప్రాప్తి.. భూలాభాలు
ఆ సినిమా చేయడమే తప్పు.. రంగస్థలం రిజెక్ట్ చేశా: ఆర్కే సాగర్
వరల్డ్ నెం1 బ్యాటర్‌గా ఇంగ్లండ్ ఆటగాడు.. టాప్-10లోకి గిల్
రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం చకచకా
ఏం గుండె సామీ నీది..? కింగ్ కోబ్రా రియల్‌గా..
ట్రంప్ తిరుగుబాట!
అందుకే ఒవైసీ ఫాతిమా కాలేజీ కూల్చివేయడం లేదు.. హైడ్రా క్లారిటీ
‘ది 100’ మూవీ రివ్యూ
రైతులపై రౌడీషీట్లు తెరుస్తామని బెదిరిస్తారా : వైఎస్ జగన్
రెండేళ్లగా జట్టుకు దూరం.. కట్ చేస్తే! సడన్‌గా భారత జట్టుతో ప్రాక్టీస్
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ సంతోషం..!
సినిమా

ఆగస్టులో యూనివర్సిటీ
ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ‘పేపర్ లీక్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్లతో పాటు దేశపతి శ్రీనివాస్, అందెశ్రీ, జయరాజ్, నందినీ సిద్ధారెడ్డి, ప్రోఫెసర్ ఖాసీం, పలువురు విద్యార్థి సంఘాల నాయకులుపాల్గొని, ‘‘యూనివర్సిటీ’ సినిమా కేవలం విద్యార్థులే కాదు... ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ చూడదగిన మంచి చిత్రం’’ అని కొనియాడారు.ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘గత కొన్నేళ్లుగా మన విద్యారంగంలో జరుగుతున్న పేపర్ లీక్స్, గ్రూపు 1, 2 లాంటి ఉద్యోగ ప్రశ్నా పత్రాల లీక్స్ చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? వాళ్లకుపాఠాలు బోధించిన గురువులు ఏం కావాలి? అని మా సినిమా ద్వారా ప్రశ్నిస్తున్నాం. కాపీయింగ్ అనేది చాలా ప్రమాదకరమైనది.చూసి రాసినవాళ్లు డాక్టర్లు అయితే రోగులు బతుకుతారా? అలాంటివాళ్లు ఇంజినీర్ అయితే బ్రిడ్జిలు నిలబడతాయా? అందుకే విద్యను ప్రైవేటు మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి, విద్యను జాతీయం చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని చాటి చెప్పేదే మా చిత్రం. ఈ సినిమాలో 5పాటలు ఉన్నాయి. స్వర్గీయ గద్దర్గారితోపాటు జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేశ్ గొప్పగా రాశారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాబూరావు దాస్, కథ–స్క్రీన్ ప్లే–మాటలు–సంగీతం–దర్శకత్వం–నిర్మాణం: ఆర్. నారాయణ మూర్తి.

ఈ వీకెండ్లో ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్!
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ ఫ్రైడే ఇప్పటికే థియేటర్లలో సందడి చేసేందుకు సినిమాలు సిద్ధమైపోయాయి. తెలుగులో సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించనుంది. ఈ మూవీపైనే అభిమానుల్లో అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు తెలుగులో వర్జిన్ బాయ్స్, ద 100 సినిమాలు సందడి చేయనున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ నుంచి మాలిక్.. హాలీవుడ్ నుంచి సూపర్ మ్యాన్ బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో సుహాస్ మూవీ కోసమే ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీల్లోనూ చాలా సినిమాలు వచ్చేస్తుంటాయి. ఈ వీకెండ్లో కూడా మిమ్మల్ని అలరించేందుకు చిత్రాలు రెడీ అయిపోయాయి. వాటిలో ఇటీవలే విడుదలైన 8 వసంతాలు, ఆర్జీవీ తెరకెక్కించిన శారీ లాంటి తెలుగు మూవీస్ స్ట్రీమింగ్కు సిద్ధమైపోయాయి. వీటితో పాటు కలియుగం, డిటెక్టివ్ ఉజ్వలన్ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తిగా ఉన్నాయి. జూలై 11న ఒక్కరోజే దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు రానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఫ్యామిలీతో కలిసి మీకు నచ్చిన సినిమాను చూసి ఈ వీకెండ్లో ఎంజాయ్ చేయండి.జియో హాట్‌స్టార్..ద రియల్ హౌస్‌వైఫ్స్ ఆఫ్ ఆరెంజ్ కంట్రీ (సీజన్ 9) - జూలై 11జాస్ ది డిఫినేటివ్ ఇన్సైడ్ వెడ్డింగ్- జూలై 11బరీడ్ ఇన్ ద బ్యాక్‌యార్డ్ (సీజన్ 6) - జూలై 13నెట్‌ఫ్లిక్స్8 వసంతాలు (తెలుగు సినిమా) -జులై 11ఆప్ జైసే కోయ్ - జూలై 11మడియాస్ డెస్టినేషన్ వెడ్డింగ్ - జూలై 11ఎమోస్ట్ కాప్స్ - జూలై 11డిటెక్టివ్ ఉజ్వలన్(మలయాళ సినిమా) -జులై 11ఆహాశారీ(తెలుగు సినిమా)- జూలై 11కలియుగం(తెలుగులో)- జూలై 11సన్నెక్స్ట్కలియుగం(తమిళంలో) - జూలై 11కర్కి(కన్నడ సినిమా)- జూలై 11మనోరమ మాక్స్మిస్టర్ అండ్ మిసెస్ బ్యాచిలర్ - జూలై 11సోనీలివ్నరివెట్ట(మలయాళ సినిమా)- జూలై 11(స్ట్రీమింగ్ అవుతోంది)ఆపిల్ టీవీ ప్లస్ఫౌండేషన్ (సీజన్ ) - జూలై 11లయన్స్‌గేట్ ప్లేఫోర్ ఇయర్స్ లేటర్ - జూలై 11జాస్ @ 50: ద డెఫినిటివ్ ఇన్సైడ్ స్టోరీ (డాక్యుమెంటరీ)- జూలై 11మిస్టర్ రాణి - జూలై 11ద సైలెంట్ అవర్ - జూలై 11బుక్ మై షోపాల్ అండ్ పాలెట్ టేక్ ఎ బాత్ - జూలై 11

యాంకరింగ్‌లో సిండికేట్.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభాను
ఉదయభాను (Udaya Bhanu).. ఒకప్పుడు తెలుగులో టాప్ యాంకర్. ఏ షో చూసినా ఆమె గొంతే వినిపించేది. ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఆవిడ హడావుడే కనిపించేది. బుల్లితెరపై సెటిలవ్వడానికి ముందు సినిమాలు కూడా చేసింది. అప్పట్లో టాలీవుడ్లో తోపు యాంకర్‌గా వెలుగొందిన ఉదయభాను తర్వాత సడన్‌గా తెరపై కనుమరుగైపోయింది.తొక్కేశారంటూ భావోద్వేగంగతేడాది ఓ సభలో తన కెరీర్‌ను తొక్కేశారని ఎమోషనలైంది. టీవీలో కనిపించి ఐదు సంవత్సరాలైందని పేర్కొంది. అయినా అలుపెరగని ప్రయత్నాలు చేయడం వల్లే ఇంకా నిలబడ్డానంది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసులో నుంచి తనను తుడిపేయలేరని చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది ఉదయభాను. సుహాస్ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించింది. టీవీ ఇండస్ట్రీలో సిండికేట్ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు విజయ్ కనకమేడల.. యాంకర్‌ను చూసి సర్ప్రైజ్ అయ్యాడు. అదే విషయం మైక్ అందుకుని మాట్లాడుతూ.. చాలారోజుల తర్వాత ఉదయభాను మళ్లీ ఈవెంట్స్ చేస్తున్నారు. థాంక్యూ అన్నాడు. వెంటనే ఉదయభాను కలగజేసుకుంటూ.. ఇదొక్కటే చేశానండి. మళ్లీ చేస్తానన్న గ్యారెంటీ లేదు. రేపే ఈవెంట్ ఉంది, చేయాలనుకుంటాం. కానీ, ఆరోజు వచ్చాక ఈవెంట్ మన చేతిలో ఉండదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది.ఉన్నదున్నట్లు చెప్తా..నా మనసులో ఉన్న నిజమే చెప్పాను. సుహాస్ మా బంగారం కాబట్టి చేయగలిగాను అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉదయభానుకు యాంకరింగ్ చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ తనకు ఈవెంట్లు ఇవ్వడం లేదా? తనవరకు అవకాశాలను వెళ్లనివ్వడం లేదా? అని నెటిజన్లు రకరకాలుగా చర్చిస్తున్నారు. సిండికేట్ అన్న పెద్ద పదం వాడిందంటే తనను కావాలనే టీవీ ఇండస్ట్రీ నుంచి సైడ్ చేశారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: మాజీ డిప్యూటీ కలెక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న నటి

ప్రభాస్ ది రాజాసాబ్తో బాక్సాఫీస్ క్లాష్.. ఆ పని చేయరనుకుంటున్నా: కేజీఎఫ్ నటుడు
ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం ది రాజాసాబ్. ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సలార్, కల్కి వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుందని వెల్లడించారు.అయితే తాజాగా రణ్వీర్ సింగ్ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ మూవీ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ సినిమాను కూడా ది రాజాసాబ్ రిలీజ్ రోజునే రానుందని మేకర్స్ ప్రకటించారు. ఫస్ట్ లుక్ వీడియోతో పాటు విడుదల తేదీని కూడా వెల్లడించారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ది రాజాసాబ్తో రణ్వీర్ సింగ్ పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ క్లాష్‌పై కేజీఎఫ్ నటుడు సంజయ్ దత్ స్పందించారు. తాజాగా తాను నటించిన కేడీ ది ముంబయి డెవిల్ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్లో ఎదురైన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దురంధర్, ది రాజాసాబ్ అదే రోజు రిలీజ్ కావడంపై సంజయ్ దత్ మాట్లాడారు.సంజయ్ దత్ మాట్లాడుతూ..' ఈ రెండు సినిమాలు చాలా డిఫరెంట్. ది రాజాసాబ్, దురంధర్ చిత్రాల్లో నా రోల్స్ చాలా భిన్నమైనవి. ఈ రెండు సినిమాలు ఓకే రోజు విడుదల అవ్వడం నాకు ఇష్టం లేదు. వాళ్లు కూడా ఈ పని చేయరని అనుకుంటున్నా' అని పంచుకున్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

మూడో రౌండ్లో హారిక, హంపి
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్లు, తెలుగు తేజాలు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. నందిత (భారత్)తో జరిగిన రెండో రౌండ్లో హారిక 1.5–0.5తో... హంపి 1.5–0.5తో అఫ్రూజా ఖామ్దమోవా (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందారు. గురువారం జరిగిన రెండో రౌండ్ రెండో గేమ్‌లో హారిక 37 ఎత్తుల్లో నందితను ఓడించగా... అఫ్రూజాతో గేమ్‌ను హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బుధవారం జరిగిన తొలి గేమ్‌లో అఫ్రూజాపై హంపి నెగ్గగా... నందితతో గేమ్‌ను హారిక ‘డ్రా’ చేసుకుంది. భారత్‌కే చెందిన వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. మరో ముగ్గురు భారత ప్లేయర్లు వంతిక అగర్వాల్, పద్మిని రౌత్ మూడో రౌండ్లో చోటు కోసం నేడు టైబ్రేక్ గేమ్‌లు ఆడనున్నారు.

ఇంగ్లండ్ ఆచితూచి...
ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ ఆటకు చెల్లుచీటో... లేదంటే భారత బౌలింగ్ దళమంటే వణుకో... తెలీదు కానీ లార్డ్స్ టెస్టుతో ఆతిథ్య జట్టు ఆట మొదటికొచ్చింది. కొన్నాళ్లుగా ఓడినా... గెలిచినా ఇలా ఫలితాలతో సంబంధం లేకుండా దూకుడు, దంచుడుతో గ్రేటెస్టు ఫార్మాట్‌ను లేటెస్ట్‌గా మార్చేసిన జట్టే... ఇప్పుడు ఆ పాత మధురమంటూ క్లాసిక్‌కు తిరిగొచ్చింది. గంటల తరబడి క్రీజులో నిలిచేందుకు... బంతుల్ని అదేపనిగా డిఫెన్స్ చేసేందుకు తెగ ప్రాధాన్యమిచ్చింది. మొత్తానికి భారత బౌలింగ్ అంటే ఆషామాషీ కాదని తెలుసుకొని స్టోక్స్ బృందం తెలివిగా మూడో టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించింది. లండన్: భారత బౌలర్లు కొత్త బంతితో చెలరేగకపోయినా... ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించకపోయినా... తొలిరోజు పట్టుబిగించకపోయినా... భారత్‌దే ఓ రకంగా పైచేయి అని చెప్పాలి. గత టెస్టు ఫలితంతో ఈ టెస్టులో ఇంగ్లండ్‌ను ఆచితూచి ఆడేలా చేసింది. ఓవరాల్‌గా బ్యాటింగ్‌నే మార్చేసింది. దీంతో గురువారం మొదలైన మూడో టెస్టులో రోజంతా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులే చేసింది. జో రూట్ (191 బంతుల్లో 99 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీ ముంగిట నిలిచాడు. ఓలీ పోప్ (44; 4 ఫోర్లు), బెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్; 3 ఫోర్లు) రాణించారు. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా... బుమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ప్రసిధ్ కృష్ణ స్థానంలో బుమ్రా రావడం మినహా భారత జట్టులో మరో మార్పు చేయలేదు. బాగుందిరా... మామ! ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (18; 4 ఫోర్లు), బెన్ డకెట్ (23; 3 ఫోర్లు) తమ స్వభావానికి విరుద్ధంగా లార్డ్స్ టెస్టును మొదలుపెట్టారు. బ్యాటింగ్‌లో దూకుడు, పరుగుల్లో వేగం ఈ రెండు లేనేలేవు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల పడినా... బ్యాట్‌కు రవ్వంత దూరంగా వెళ్లినా... అలాంటి బంతుల్ని వికెట్ కీపర్‌కే వదిలేశారు. బుమ్రా బౌలింగ్‌లో మరింత జాగ్రత్త పడ్డారు. ఆకాశ్ దీప్, సిరాజ్‌లు బౌలింగ్‌కు వచ్చినా అనవసర షాట్ల జోలికి వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 14వ ఓవర్ వేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో బంతికి డకెట్‌ను, ఆరో బంతికి క్రాలీని అవుట్ చేయడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తెలుగు ఆటగాడ్ని తెలుగు మాటలతోనే అభినందించాడు. గిల్ నోట ‘బాగుందిరా మామ’ మాట వికెట్లలో అమర్చిన మైక్‌లో రికార్డు కావడంతో ‘ఎక్స్’లో ఈ క్లిప్ బాగా వైరలైంది. తర్వాత వచ్చిన పోప్, రూట్‌లు మరింత ఆచితూచి ఆడటంతో ఈ సెషన్‌లో ఇంకో వికెట్‌కు ఆస్కారం లేకపోయింది. ‘నీరు’గార్చిన రెండో సెషన్ భారత బౌలర్లను రెండో సెషన్ పూర్తిగా నీరుగార్చింది. నితీశ్ ఇచ్చిన వికెట్ల ఊపుతో రెండో సెషన్‌లో వికెట్లను తీద్దామనుకున్న పేసర్లకు నిరాశే ఎదురైంది. రూట్, పోప్ కుదురుగా ఆడుతూ స్కోరుబోర్డు నింపాదిగా నడిపించారు. ఈ సెషన్‌లో 24 ఓవర్లపాటు క్రీజులో ఉన్న బ్యాటర్లు 70 పరుగులు చేయడం చూసిన ప్రేక్షకులకు ఆడుతోంది ఇంగ్లండేనా అనే అనుమానం కలుగకమానదు. ఇంత జిడ్డుగా ఆడుతుండటంతో భారత పేస్ తురుపుముక్క బుమ్రా ఏమీ చేయలేకపోయాడు. షాట్లు ఆడే ప్రయత్నం, పరుగులు తీసే క్రమం ఏమాత్రం పుంజుకోలేకపోవడంతో వికెట్లు తీసే అవకాశమే చిక్కలేదు. పైగా పిచ్ కూడా నిర్జీవంగా మారడంతో భారత బౌలర్లకు, ఫీల్డర్లకు చెమటలే తప్ప సాఫల్యం దక్కనేలేదు. 36వ ఓవర్లో ఇంగ్లండ్ స్కోరు వందకు చేరగా, డ్రింక్స్ విరామం తర్వాతే రూట్ అర్ధసెంచరీ పూర్తయ్యింది. రూట్‌తోపాటు పోప్ మొండిగా నిలబడటంతో ఇంగ్లండ్ వికెట్ నష్టపోలేదు. నింపాదిగా 150 స్కోరును దాటింది. రూట్ 99 బ్యాటింగ్ మూడో సెషన్ మొదలైన బంతికే పోప్ వికెట్‌ను చేజార్చుకున్న ఇంగ్లండ్‌కు కాసేపటికే బుమ్రా కూడా షాకిచ్చాడు. హ్యారీ బ్రూక్ (11)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరానికి ఈ సెషన్ టర్నింగ్ అవుతుందని అంతా భావించారు. కానీ ఈ పైచేయి అక్కడితే ఆగిపోయింది. రూట్ తన జిడ్డు ఆటతీరును కొనసాగించి బాగా విసిగించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా దీటుగా ఎదుర్కోవడంతో పట్టుబిగించే అవకాశం లేకపోయింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు రూట్, స్టోక్స్ 79 పరుగులు జోడించారు. రూట్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడు.పంత్‌కు గాయం... జురేల్ కీపింగ్! భారత డాషింగ్ వికెట్‌కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడ్డాడు. దీంతో రెండో సెషన్ నుంచి ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్లో బంతిని ఆపేందుకు డైవ్ చేయగా అతని ఎడమ చేతికి గాయమైంది. నొప్పితో బాధపడుతున్న పంత్‌కు కాసేపు ఫిజియో వచ్చి సపర్యలు చేశాడు. నొప్పినివారణ స్ప్రే చేసిన అతని నొప్పి తగ్గకపోవడంతో మైదానం వీడాల్సివచ్చింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 23; ఒలీ పోప్ (సి) (సబ్) జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బ్యాటింగ్) 99; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బ్యాటింగ్) 39; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172. బౌలింగ్: బుమ్రా 18–3–35–1, ఆకాశ్‌దీప్ 17–2–75–0, సిరాజ్ 14–5–33–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–0–46–2, రవీంద్ర జడేజా 10–1–26–1, వాషింగ్టన్ సుందర్ 10–1–21–0.

అనిసిమోవా అదరహో
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్) వరుసగా మూడోసారి సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. అమెరికా ప్లేయర్ అమండ అనిసిమోవా అద్భుత ఆటతీరు కనబరిచి టాప్ సీడ్ సబలెంకాను బోల్తా కొట్టించింది. 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ అనిసిమోవా 6–4, 4–6, 6–4తో సబలెంకాను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 30 విన్నర్స్ కొట్టిన అనిసిమోవా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు సబలెంకా 37 అనవసర తప్పిదాలు చేసింది. కెరీర్లో 22వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలోకి దిగిన 23 ఏళ్ల అనిసిమోవా గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. రేపు జరిగే ఫైనల్లో ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్)తో అనిసిమోవా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్వియాటెక్ కేవలం 72 నిమిషాల్లో 6–2, 6–0తో బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది.

IND vs ENG 3rd Test: ఇంగ్లండ్ ఆచితూచి...
ఇంగ్లండ్ ‘బజ్‌బాల్’ ఆటకు చెల్లుచీటో... లేదంటే భారత బౌలింగ్ దళమంటే వణుకో... తెలీదు కానీ లార్డ్స్ టెస్టుతో ఆతిథ్య జట్టు ఆట మొదటికొచ్చింది. కొన్నాళ్లుగా ఓడినా... గెలిచినా ఇలా ఫలితాలతో సంబంధం లేకుండా దూకుడు, దంచుడుతో గ్రేటెస్టు ఫార్మాట్‌ను లేటెస్ట్‌గా మార్చేసిన జట్టే... ఇప్పుడు ఆ పాత మధురమంటూ క్లాసిక్‌కు తిరిగొచ్చింది. గంటల తరబడి క్రీజులో నిలిచేందుకు... బంతుల్ని అదేపనిగా డిఫెన్స్ చేసేందుకు తెగ ప్రాధాన్యమిచ్చింది. మొత్తానికి భారత బౌలింగ్ అంటే ఆషామాషీ కాదని తెలుసుకొని స్టోక్స్ బృందం తెలివిగా మూడో టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించింది. లండన్: భారత బౌలర్లు కొత్త బంతితో చెలరేగకపోయినా... ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించకపోయినా... తొలిరోజు పట్టుబిగించకపోయినా... భారత్‌దే ఓ రకంగా పైచేయి అని చెప్పాలి. గత టెస్టు ఫలితంతో ఈ టెస్టులో ఇంగ్లండ్‌ను ఆచితూచి ఆడేలా చేసింది. ఓవరాల్‌గా బ్యాటింగ్‌నే మార్చేసింది. దీంతో గురువారం మొదలైన మూడో టెస్టులో రోజంతా బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 251 పరుగులే చేసింది. జో రూట్ (191 బంతుల్లో 99 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీ ముంగిట నిలిచాడు. ఓలీ పోప్ (44; 4 ఫోర్లు), బెన్ స్టోక్స్ (39 బ్యాటింగ్; 3 ఫోర్లు) రాణించారు. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 2 వికెట్లు తీయగా... బుమ్రా, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. ప్రసిధ్ కృష్ణ స్థానంలో బుమ్రా రావడం మినహా భారత జట్టులో మరో మార్పు చేయలేదు. బాగుందిరా... మామ! ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (18; 4 ఫోర్లు), బెన్ డకెట్ (23; 3 ఫోర్లు) తమ స్వభావానికి విరుద్ధంగా లార్డ్స్ టెస్టును మొదలుపెట్టారు. బ్యాటింగ్‌లో దూకుడు, పరుగుల్లో వేగం ఈ రెండు లేనేలేవు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల పడినా... బ్యాట్‌కు రవ్వంత దూరంగా వెళ్లినా... అలాంటి బంతుల్ని వికెట్ కీపర్‌కే వదిలేశారు. బుమ్రా బౌలింగ్‌లో మరింత జాగ్రత్త పడ్డారు. ఆకాశ్ దీప్, సిరాజ్‌లు బౌలింగ్‌కు వచ్చినా అనవసర షాట్ల జోలికి వెళ్లలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 14వ ఓవర్ వేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మూడో బంతికి డకెట్‌ను, ఆరో బంతికి క్రాలీని అవుట్ చేయడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తెలుగు ఆటగాడ్ని తెలుగు మాటలతోనే అభినందించాడు. గిల్ నోట ‘బాగుందిరా మామ’ మాట వికెట్లలో అమర్చిన మైక్‌లో రికార్డు కావడంతో ‘ఎక్స్’లో ఈ క్లిప్ బాగా వైరలైంది. తర్వాత వచ్చిన పోప్, రూట్‌లు మరింత ఆచితూచి ఆడటంతో ఈ సెషన్‌లో ఇంకో వికెట్‌కు ఆస్కారం లేకపోయింది. ‘నీరు’గార్చిన రెండో సెషన్ భారత బౌలర్లను రెండో సెషన్ పూర్తిగా నీరుగార్చింది. నితీశ్ ఇచ్చిన వికెట్ల ఊపుతో రెండో సెషన్‌లో వికెట్లను తీద్దామనుకున్న పేసర్లకు నిరాశే ఎదురైంది. రూట్, పోప్ కుదురుగా ఆడుతూ స్కోరుబోర్డు నింపాదిగా నడిపించారు. ఈ సెషన్‌లో 24 ఓవర్లపాటు క్రీజులో ఉన్న బ్యాటర్లు 70 పరుగులు చేయడం చూసిన ప్రేక్షకులకు ఆడుతోంది ఇంగ్లండేనా అనే అనుమానం కలుగకమానదు. ఇంత జిడ్డుగా ఆడుతుండటంతో భారత పేస్ తురుపుముక్క బుమ్రా ఏమీ చేయలేకపోయాడు. షాట్లు ఆడే ప్రయత్నం, పరుగులు తీసే క్రమం ఏమాత్రం పుంజుకోలేకపోవడంతో వికెట్లు తీసే అవకాశమే చిక్కలేదు. పైగా పిచ్ కూడా నిర్జీవంగా మారడంతో భారత బౌలర్లకు, ఫీల్డర్లకు చెమటలే తప్ప సాఫల్యం దక్కనేలేదు. 36వ ఓవర్లో ఇంగ్లండ్ స్కోరు వందకు చేరగా, డ్రింక్స్ విరామం తర్వాతే రూట్ అర్ధసెంచరీ పూర్తయ్యింది. రూట్‌తోపాటు పోప్ మొండిగా నిలబడటంతో ఇంగ్లండ్ వికెట్ నష్టపోలేదు. నింపాదిగా 150 స్కోరును దాటింది. రూట్ 99 బ్యాటింగ్ మూడో సెషన్ మొదలైన బంతికే పోప్ వికెట్‌ను చేజార్చుకున్న ఇంగ్లండ్‌కు కాసేపటికే బుమ్రా కూడా షాకిచ్చాడు. హ్యారీ బ్రూక్ (11)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే 2 వికెట్లు కోల్పోవడంతో భారత శిబిరానికి ఈ సెషన్ టర్నింగ్ అవుతుందని అంతా భావించారు. కానీ ఈ పైచేయి అక్కడితే ఆగిపోయింది. రూట్ తన జిడ్డు ఆటతీరును కొనసాగించి బాగా విసిగించాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా దీటుగా ఎదుర్కోవడంతో పట్టుబిగించే అవకాశం లేకపోయింది. అబేధ్యమైన ఐదో వికెట్‌కు రూట్, స్టోక్స్ 79 పరుగులు జోడించారు. రూట్ సెంచరీకి పరుగు దూరంలో ఉన్నాడు.పంత్‌కు గాయం... జురేల్ కీపింగ్! భారత డాషింగ్ వికెట్‌కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడ్డాడు. దీంతో రెండో సెషన్ నుంచి ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ చేశాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 34వ ఓవర్లో బంతిని ఆపేందుకు డైవ్ చేయగా అతని ఎడమ చేతికి గాయమైంది. నొప్పితో బాధపడుతున్న పంత్‌కు కాసేపు ఫిజియో వచ్చి సపర్యలు చేశాడు. నొప్పినివారణ స్ప్రే చేసిన అతని నొప్పి తగ్గకపోవడంతో మైదానం వీడాల్సివచ్చింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 18; డకెట్ (సి) పంత్ (బి) నితీశ్ రెడ్డి 23; ఒలీ పోప్ (సి) (సబ్) జురేల్ (బి) జడేజా 44; జో రూట్ (బ్యాటింగ్) 99; బ్రూక్ (బి) బుమ్రా 11; స్టోక్స్ (బ్యాటింగ్) 39; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (83 ఓవర్లలో 4 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–43, 2–44, 3–153, 4–172. బౌలింగ్: బుమ్రా 18–3–35–1, ఆకాశ్‌దీప్ 17–2–75–0, సిరాజ్ 14–5–33–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–0–46–2, రవీంద్ర జడేజా 10–1–26–1, వాషింగ్టన్ సుందర్ 10–1–21–0.
బిజినెస్

శాంసంగ్ నుంచి 3 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు
శాంసంగ్ ఎల్రక్టానిక్స్ సంస్థ ప్రీమియం ఫోల్డబుల్ గెలాక్సీ సిరీస్‌లో మూడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్7, ఫ్లిప్ 7, ఫ్లిప్7 ఎఫ్ఈ వీటిలో ఉన్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్‌లో ఇవి ఏడో జనరేషన్ ఫోన్లు. మరింత వెడల్పాటి స్క్రీన్, తక్కువ బరువు, 200 మెగాపిక్సెల్ వైడ్–యాంగిల్ కెమెరా, కృత్రిమ మేథపరంగా కొత్త ఫీచర్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఫోన్‌ను బట్టి స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్లు, 8.5 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ మెయిన్ డిస్ప్లే, 16 జీబీ వరకు మెమరీ, 1 టీబీ స్టోరేజీ మొదలైన ప్రత్యేకతలు ఉంటాయి.శాంసంగ్ ఈసారి స్లిమ్ ఫోల్డబుల్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇది ఫ్లాగ్షిప్ మార్కెట్లో ఎక్కువ దృష్టిని ఆకర్షించింది. జెమినీ లైవ్, నౌ బార్, నౌ బ్రీఫ్ వంటి మరెన్నో కొత్త ఏఐ సామర్థ్యాలను తీసుకువస్తున్నందున శాంసంగ్ ఈ ఫోన్లను "గెలాక్సీ ఏఐ ఫోన్లు" అని పిలుస్తోంది. వీటి ధరలను ప్రకటించిన కొరియన్ స్మార్ట్‌ఫోన్ మేకర్ ప్రీ బుకింగ్‌లను ప్రారంభించింది.శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 బ్లూ షాడో, సిల్వర్ షాడో, జెట్‌బ్లాక్, మింట్ (Samsung.com మాత్రమే) అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది.12జీబీ+256జీబీ ధర రూ.1,74,99912జీబీ+512జీబీ ధర రూ.1,86,99916జీబీ+1టీబీ ధర రూ.2,10,999శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 బ్లూ షాడో, జెట్‌బ్లాక్, కోరల్ రెడ్, మింట్ (Samsung.comలో మాత్రమే) రంగుల్లో లభిస్తుంది.12జీబీ+256జీబీ ధర రూ.1,09,99912జీబీ+512జీబీ ధర రూ.1,21,999శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈగెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ఎఫ్ఈ బ్లాక్ లేదా వైట్ కలర్లలో లభిస్తుంది.8జీబీ+128జీబీ: రూ.89,9998జీబీ+256జీబీ: రూ.95,999ఈ స్మార్ట్ ఫోన్లు భారత్‌లో శాంసంగ్ (Samsung.com), అమెజాన్ (Amazon.in), ఫ్లిప్‌కార్ట్ (Flipkart.com)లలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ప్రీ ఆర్డర్లకు ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 ప్రీ-ఆర్డర్ చేస్తే రూ.12,000 విలువైన ఉచిత స్టోరేజ్ అప్ గ్రేడ్ లభిస్తుంది. మరోవైపు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్7 ఎఫ్ఈ ప్రీ ఆర్డర్‌పై రూ.6,000 విలువైన స్టోరేజ్ అప్‌గ్రేడ్ ఉచితంగా అందిస్తోంది. అదనంగా, కొనుగోలుదారులు ఈ మూడు మోడళ్లపై 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా ఎంచుకోవచ్చు. కొత్త ఫోల్డబుల్ అధికారిక సేల్ జూలై 25న మొదలుకానుంది.

మస్క్ కంపెనీకి భారత్‌లో అనుమతులు
ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని అడ్డంకులను అధిగమించింది. భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఈ సంస్థకు అనుమతులు ఇచ్చింది. దాంతో దేశంలో స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అడ్డంకులు తొలగినట్లయింది.2022 నుంచి భారతదేశంలో స్టార్‌లింక్ తన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) నుంచి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కూడా పొందింది. ఇప్పుడు, ఇన్-స్పేస్ ఆమోదంతో స్టార్‌లింక్ భారత్‌లోని కంపెనీ ప్రణాళికలకు లైన్ క్లియర్ అయింది.ఐఎన్-స్పేస్ స్టార్‌లింక్ తన జెన్ 1 ఉపగ్రహ సమూహాన్ని భారతదేశంపై నిలిపేందుకు అనుమతిస్తుంది. ఈ అనుమతులు జులై 7, 2030 వరకు చెల్లుబాటు అవుతాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ ఆమోదంలో భాగంగా IN-SPACe యూజర్లు ఉపయోచించేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కూడా ఖరారు చేస్తుంది. గేట్ వే బీమ్ల కోసం స్టార్‌లింక్ 27.5–29.1 గిగాహెర్జ్ట్, 29.5–30 గిగాహెర్జ్ట్ అప్‌లింక్ బ్యాండ్లను, 17.8–18.6 గిగాహెర్జ్ట్, 18.8–19.3 గిగాహెర్జ్ట్ డౌన్‌లింక్ బ్యాండ్లను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. సరళంగా చెప్పాలంటే స్టార్‌లింక్ దాని వినియోగదారులు, గ్రౌండ్ స్టేషన్ల నుంచి భారతదేశం అంతటా ఇంటర్నెట్ డేటాను పంపించేందుకు నిర్దిష్ట ఉపగ్రహ సంకేతాలను ఉపయోగించేలా అధికారిక అనుమతులు పొందింది.ఇదీ చదవండి: పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!గేట్‌వే స్టేషన్లు నిర్మాణం..ఇదిలాఉండగా, ఈ ఆమోదం పొందడం వల్ల స్టార్‌లింక్ వెంటనే భారత్‌లో సర్వీసులు ప్రారంభిస్తుందని కాదు. సంస్థ ఇంకా భారత ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్‌ను పొందాల్సి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, భద్రతా అవసరాలను తీర్చడానికి పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కనీసం మూడు గేట్‌వే స్టేషన్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ వ్యవస్థ పూర్తయితే స్టార్‌లింక్ కూడా త్వరలో ట్రయల్స్ ప్రారంభించే అవకాశం ఉంది. కంపెనీ భారతదేశ సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిరూపించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం ట్రయల్ స్పెక్ట్రమ్‌ను మంజూరు చేయబోతున్నట్లు సమాచారం.

‘మెటాలో పని.. క్యాన్సర్ అంత ప్రమాదం’
ప్రముఖ టెక్ కంపెనీ మెటా సూపర్ ఇంటలిజెన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ముందుకుసాగుతున్న తరుణంలో కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారుతున్నాయి. కంపెనీలో ఉద్యోగం మానేసి బయటకు వస్తున్న సమయంలో అంతర్గతంగా ఆ ఉద్యోగి ఈమెయిల్ పంపించాడు. దీనిలో కంపెనీ కృత్రిమమేధ విభాగం గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తాడు.ది ఇన్ఫర్మేషన్లో టిజ్మెన్ బ్లాంకెవర్ట్ రాసిన కథనంలో మెటాలోని సంస్కృతిని సంస్థ అంతటా వ్యాపిస్తున్న ‘మెటాస్టాటిక్ క్యాన్సర్’తో పోల్చాడు. మెటా ఎల్ఎల్ఏఎంఏ మోడళ్లపై పనిచేసే బృందంలో బ్లాంకెవర్ట్ కూడా కొంతకాలం పని చేశాడు. ఉద్యోగం నుంచి నిష్క్రమించే ముందు అతడు మెటా నాయకత్వాన్ని, అక్కడి పని విధానాన్ని విమర్శిస్తూ ఒక సుదీర్ఘ లేఖ రాశాడు.‘మెటాలో పని చేస్తున్నన్ని రోజులు చాలా మంది ఉద్యోగులు ఎంతో నష్టపోయారు. అక్కడ భయంతో కూడిన సంస్కృతి ఉంది. తరచుగా పనితీరు సమీక్షలు, తొలగింపులు ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని, సృజనాత్మకతను దెబ్బతీశాయి. ప్రస్తుతం 2 వేల మందికిపైగా బలంగా ఉన్న ఏఐ విభాగానికి దిశానిర్దేశం కొరవడింది. చాలా మందికి మెటాలో పని చేయడం ఇష్టం లేదు. తమ మిషన్ ఏమిటో కూడా వారికి తెలియదు. పదేపదే అంతర్గత విభేదాలు, అస్పష్టమైన లక్ష్యాలు నిర్దేషిస్తారు. ఇది జట్టు నూతన ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో పనిచేయకపోవడం మాత్రమే కాదు. మెటాస్టాటిక్ క్యాన్సర్‌లా ఇది సంస్థను ప్రభావితం చేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..ఓపెన్ఏఐ, గూగుల్ డీప్మైట్ వంటి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మెటా తన ఏఐ కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) నిర్మాణంపై దృష్టి సారించే సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనే కొత్త విభాగాన్ని కంపెనీ ఇటీవల సృష్టించింది. మెటా పరిశ్రమ అంతటా అగ్రశ్రేణి ప్రతిభావంతులను నియమించుకుంటోంది. అందుకు కంపెనీ ఎంతైనా ఇచ్చేందుకు వెనకాడడంలేదు.

తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate)లు ఊగిసలాడుతున్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం పసిడి ధరలు చాలా స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఫ్యామిలీ

‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ : పిల్ల గుంపు వీడియో వైరల్
ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సోషల్ మీడియాలో క్షణాల్లో మన ముందుంటుంది. కింగ్ కోబ్రా అయినా పులులు, సింహాలైనా, ఏనుగులైనా ఆకర్షణీయమైన వీడియోలు హల్ చల్ చేస్తూ ఉంటాయి. వర్షాలకు పరవశంతో ఆటుకుంటున్న పిల్ల ఏనుగుల వీడియో ఒకటి నెట్టింట సందడిగా మారింది."మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే" అని శ్రీశ్రీ అన్నట్టు పిల్లలు ప్రకృతిలోని అందాలను స్వచ్ఛమైన మనసుతో ఆస్వాదిస్తారు. ఆడిపాడతారు. పసితనం అనేది మనుషులకైనా.. జంతువులకైనా ఒకటే నిరూపించే ఘటన ఇది. ఒక జోరు వాన పడుతోంది. దీంతో గజరాజులతో కలిసి పిల్ల ఏనుగుల గుంపు బురదలో ఆడుకుంటూ సందడి చేశాయి. ‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ అన్నట్టు, ఒకదానిపై ఒకటి బురద జల్లుకుంటూ తొండంతో కొట్టుకుంటూ అల్లరి చేశాయి. బురదలో ఆడుకుంటున్న ఏనుగుల గుంపును రాయ్‌గఢ్ అటవీ శాఖ డ్రోన్ కెమెరా బంధించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ లోని ధరమ్‌జైగఢ్ ఫారెస్ట్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. ఇదీ చదవండి: వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం! #WATCH | Chhattisgarh: Raigarh Forest Department's drone captured a herd of elephants with their calves playing in the mud in the monsoon season. Visuals from Dharamjaigarh Forest Division. (08.07.2025)(Video Source: Chhattisgarh Forest Department) pic.twitter.com/BheMJESyxs— ANI (@ANI) July 9, 2025కాగా వర్షాకాలంలో ఏనుగులు బురదలో ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. అవి గుంపులుగా చేరి, ఒకదానితో ఒకటి బురదను చల్లుకుంటూ, ఆడుతూ, గంతులేస్తూ ఆనందిస్తాయి. ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతూనే ఉంటాయి.

వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి లేదా? విజయం కోసం... జయ శ్లోకం!
వృత్తి ఉద్యోగాల్లోని అవరోధాల వల్ల చాలామంది నిరాశా నిస్పృహలకు లోనవుతుంటారు. పనికి తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కకపోవడం ఎవరికైనా మనస్తాపం కలిగిస్తుంది. పనిచేసే చోట రాజకీయాల వల్ల తరచుగా నష్ట΄ోతూ ఉన్నట్లయితే విరక్తిలో కూరుకుపోతారు. ఇలాంటి దుస్థితిని ఎలా అధిగమించాలంటే... అసూయాపరుల కారణంగా ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించాలంటే, శుక్రవారం రాత్రివేళ కిలో మినుములను నీట్లో నానబెట్టండి. శనివారం ఉదయం స్నానాదికాల తర్వాత ముందురోజు నానబెట్టిన మినుములను ఒక పళ్లెంలోకి తీసుకోండి. ఆ మినుములను మూడు సమ భాగాలుగా చేయండి. ఒక భాగాన్ని గుర్రానికి, ఒక భాగాన్ని గేదెకు, ఒక భాగాన్ని ఆవుకు తినిపించండి.ప్రభుత్వోద్యోగాల్లో కొనసాగుతున్న వారు ఉద్యోగ జీవితంలో అవరోధాలు తొలగిపోవాలంటే సూర్య ఆరాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఆదిత్య హృదయం పఠించండి. ప్రతి ఆదివారం ఒక చిన్న బెల్లంముక్కను ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి. ఉద్యోగ జీవితంలో కుట్రలు కుతంత్రాలకు బాధితులు బలి కాకుండా ఉండాలంటే, ప్రతి శుక్రవారం ఉపవాసం చేయండి. శుక్రవారం ఉదయం స్నానాదికాల తర్వాత దేవీ ఆర్గళ స్తోత్రాన్ని మూడుసార్లు ఏకాగ్రతతో పఠించండి. అనాథ బాలికలకు కొత్త దుస్తులు ఇవ్వండి.ఉద్యోగ జీవితంలో పురోగతికి ఏర్పడుతున్న అవరోధాలు తొలగిపోవాలంటే ప్రతి శనివారం ఉదయం స్నానాదికాలు, నిత్యపూజ తర్వాత రావిచెట్టు మొదట్లో గుప్పెడు నానబెట్టిన మినుములు, ఒక చిన్న బెల్లం ముక్క నివేదనగా ఉంచి, నీలిరంగు పూలతో పూజించాలి. గాయత్రీ హోమం చేయడం ద్వారా కూడా ఫలితం ఉంటుంది.– సాంఖ్యాయన విజయం కోసం... జయ శ్లోకంజయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలఃరాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితఃదాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్టకర్మణఃహనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజఃన రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీంసమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్జయశ్లోకం అనే పేరుగల ఈ శ్లోకాన్ని మన కోరికను లేదా సమస్యను బట్టి శుచిగా ఉండి 5/11/21/40 రోజులపాటు నిత్యం భక్తిశ్రద్ధలతో చదువుకుంటూ హనుమంతుడికి అరటిపండ్లు నివేదించడం వల్ల ఎంతటి క్లిష్ట సమస్యలైనా తీరిపోతాయని ప్రతీతి. మంచి మాటలు మనం చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు. అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచిపని చేసేటపుడు మనం కనపడాల్సిన అవసరం లేదు. మంచితనం కనపడితే చాలు.చిరునవ్వును మించిన అలంకరణ లేదు. వినయాన్ని మించిన ఆభరణం లేదు. డబ్బు ఆస్తులను సంపాదించి పెడుతుంది. కానీ మంచితనం మనుషుల్ని సంపాదించి పెడుతుంది.మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావొచ్చేమో కానీ ఒంటరితనం ఎప్పటికీ రాదు’.చెడుని ప్రశ్నించడం, మంచిని ప్రశంసించడం నేర్చుకున్నప్పుడు అది మనలో మంచిని పెంచి చెడుని తొలగిస్తుంది’.

ఆ సినిమా నేర్పిన పాఠం..! సరికొత్త మార్పుకి శ్రీకారం..
క్లాస్‌లో బెంచీలుంటాయి. ఫ్రంట్ బెంచ్‌లపై కూచునేవారు...బ్యాక్బెంచ్లకు పరిమితమయ్యేవారు... బ్యాక్‌బెంచ్ స్టూడెంట్లపై అందరికీ చిన్నచూపే.వారు గొడవ చేస్తారని సరిగా చదవరని...అసలు బ్యాక్బెంచ్లు లేకుండా చేస్తే బ్యాక్‌బెంచ్ స్టూడెంట్లు ఉండరు కదా అనిచెప్పిన సినిమా ఇప్పుడు కేరళ స్కూళ్లను మార్చింది. ‘శనార్థి శ్రీకుట్టన్’ అనే సినిమా చూసిస్కూళ్లలో బెంచీలను సర్కిల్‌గా వేస్తున్నారు. ఇది అందరూ మెచ్చుకుంటున్నారు. దేశమంతా రావాల్సిన మార్పు ఇది. కొల్లం జిల్లాలోని ఆర్.వి.వి. సెకండరీ హయ్యర్స్కూల్కు ఆ రోజు విద్యార్థులు వెళ్లి క్లాస్‌రూమ్‌లోకి అడుగు పెట్టి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. రౌండ్‌గా వేసి ఉన్నాయి. పాపినిశ్శేరిలోని స్కూల్, అదూర్‌లోని స్కూల్, తూర్పు మంగడ్‌లోని స్కూల్, పాలక్కాడ్‌లోని స్కూల్... ఈ స్కూళ్లన్నింటిలోనూ విద్యార్థులకు ఇదే ఆశ్చర్యం. కారణం... అక్కడ కూడా క్లాస్‌లలో బెంచీలు ఒకదాని వెనుక ఒకటి లేవు. చుట్టూ వేసి ఉన్నాయి. గత నెల రోజులుగా కేరళలోని ఒక్కోబడి ఒక్కోబడి ఈ మార్పు చేసుకుంటూ వస్తోంది. దానికి కారణం రిలీజైనప్పుడు ఎవరూ పట్టించుకోని ఒక సినిమా నెల క్రితం ఓటీటీలోకి వచ్చాక అందరూ చూస్తూ ఉండటమే. ఆ చూసే వారిలో విద్యార్థులు, టీచర్లు, పాఠశాల కరెస్పాండెంట్లు, తల్లిదండ్రులు ఉన్నారు... వారందరినీ ఆ సినిమా కదిలించింది. అందుకే వారందరూ క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్ ఉండకూడదని నిశ్చయించుకున్నారు. నిజమే. క్లాస్‌రూమ్‌లో బ్యాక్‌బెంచ్ ఎందుకు?ఆ సినిమా కథ ఏమిటి?కె.ఆర్.నారాయణన్ అప్పర్ ప్రైమరీ స్కూల్, కారెట్టు, తిరువనంతపురం. ఈ పల్లెటూరు స్కూల్లోని సెవన్త్ సి సెక్షన్లో జరిగే సినిమా కథే ‘శనార్థి శ్రీకుట్టన్’. శ్రీకుట్టన్ అనే కుర్రవాడు ఇంటి పరిస్థితుల వల్ల రోజూ స్కూల్‌కి లేట్‌గా వస్తుంటాడు. బ్యాక్‌బెంచ్‌లో కూచుంటుంటాడు. వాడికి ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్లంతా అల్లరి గ్యాంగ్ అని క్లాస్‌లో ఫ్రంట్ బెంచ్‌లో కూచునేవారి అభిప్రాయం. క్లాస్‌కు వచ్చే ఒక ఉపాధ్యాయుడైతే వీరి మీద పగపడతాడు. వీరు దేనికీ పనికి రారన్నది టీచర్ల అభిప్రాయం. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. శ్రీకుట్టన్ స్కూల్ ఎలక్షన్లో నిలబడాలనుకుంటాడు. వీడి మీద పోటీగా ఫ్రంట్ బెంచ్‌లో కూచునే అంబడి అనే కుర్రవాడు నిలబడతాడు. ఎవరు గెలుస్తారు అనేది కథ. పైకి ఇదే కథ అనిపించినా ఇది కాదు దర్శకుడు వినేష్ విశ్వనాథ్ చెప్పాలనుకున్నది. క్లాసురూముల్లో వివక్ష ఎన్ని రూపాల్లో ఉంటుంది... వివక్షకు కారణమైన నిర్మాణం ఎలా ఉంటుంది... క్లాస్‌రూమ్‌లోనే వివక్ష పాటించిన విద్యార్థి బయటకు వెళ్లాక పాటించడని గ్యారంటీ ఏమిటీ... దీనిని ముందు నుంచే మార్చాలి అని చెప్పదలుచుకున్నాడు దర్శకుడు.1996లో కేంద్రం చెప్పినా...క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల సీటింగ్ వారిలో వివక్షకు కారణం కాకూడదని, పిల్లల తెలివితేటలు... ఆర్థిక స్థితి... ప్రవర్తనను ఆధారంగా ముందు బెంచీలకు కొందరిని, వెనుక బెంచీలకు కొందరిని పరిమితం చేయకూడదని 1996లో కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలను మోడల్‌గా తీసుకుని మార్పులకై ప్రతి΄ాదించింది. అయితే ఆ మార్పులను ఎవరూ పట్టించుకోలేదు. మన దేశంలో స్కూళ్లు మొదలైనప్పటి నుంచి ‘మొద్దు’లుగా భావించే పిల్లలను వెనుక కూచోబెట్టడం ఆనవాయితీ. వెనుక కూచుని వెనుకబడితే మళ్లీ వారిదే తప్పుగా నిలబెట్టడం కూడా ఆనవాయితీనే. విద్యార్థిగా పొందే గౌరవం వెనుక బెంచీ విద్యార్థులకు చాలామందికి ఉండదు. ఈ పరిస్థితి మారాలని ఒక వెనుకబెంచీ కుర్రాడిని హీరోగా చేసి అతనిలోని తెలివితేటలను, చురుకుదనాన్ని చూపుతూ నిరూపించాడు దర్శకుడు ఈ సినిమాలో. అందుకే అది కేరళ బడుల్లో కదలిక తెచ్చింది. ఇక దేశం మొత్తం ఇలాంటి సినిమాలో ఆలోచనలు వచ్చి మార్పు తేవాల్సి ఉంటుంది. (చదవండి: Fake weddings: పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు! )

ఆకర్షణ అశాశ్వతం... కుటుంబ బంధమే శాశ్వతం!
డాక్టరు గారు! నేను కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉన్నాను. అతనికి కూడా వివాహం అయింది. పిల్లలు ఉన్నారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు సంవత్సరాలనుండి మా ఈ బంధం కొనసాగుతోంది.. శారీరకంగా కన్నా మానసికంగా మేము ఎక్కువ దగ్గర అయ్యాము. కానీ ఈ మధ్య కాలంలో అతను వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉండటం, నన్ను అంతగా పట్టించుకోకపోవటం నన్ను చాలా మానసిక వేదనకు గురిచేస్తోంది. ఆకలి, నిద్ర బాగా తగ్గిపోయాయి. మనసంతా చికాకుగా, ఏడుపు వస్తుంది. అశాంతితో నరకం అనుభవిస్తున్నాను. అతను నాకు ఏమీ కాడు అని తెలిసినా తట్టుకోలేకపోతున్నాను! ఆఖరికి ఆత్మహత్మ ఆలోచనలు కూడా వస్తున్నాయి. దయచేసి ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాను! – ఒక సోదరి, గుంటూరుమీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే మీరు తీవ్రమైన మనోవేదన (డిప్రెషన్)కు లోనయినట్లుగా అర్థం అవుతోంది. జీవితంలో ఒక్కోసారి తప్పటడుగులు వేయడం సహజం. మీకు మంచి భర్త, పిల్లలు ఉన్నా, ఆ వ్యక్తికి భార్య పిల్లలున్నారని తెలిసి కూడా సంబంధం పెట్టుకున్నారు! ఒక్కొక్కసారి భార్యా భర్తల మధ్య ఏదైనా గ్యాప్ వచ్చి అసంతృప్తికి లోనయినవారు, ఇలాంటి వివాహేతర సంబంధం పెట్టుకునే అవకాశ ముంటుంది! ఇప్పుడా వ్యక్తి తన భార్యను, మిమ్మల్ని కాదని ఇంకా మూడోవ్యక్తితో, కొత్తగా రిలేషన్ షిప్ పెట్టుకున్నాడంటే అతని వ్యక్తిత్వమేంటో మీకీపాటికి తెలిసే ఉంటుంది. ఇప్పటికైనా మించియిందేం లేదు, చేసిన పొరపాటును సరిదిద్దుకోవడంలోనే మనిషి ఔన్నత్యం బయటపడుతుంది. ఒక వేళ మీ విషయం మీ భర్తకు తెలిస్తే మీ కుటుంబ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. అంతా ‘మన మంచికే ’ అని ‘ఆత్రేయ’ గారు అన్నట్లు, ఆ మూడో వ్యక్తి వల్ల ఒక విధంగా మీకు, మీ కుటుంబానికి, మంచి జరిగినట్లయింది. మీరు మీ మనోవేదనలోంచి త్వరగా బయటపడేందుకు మీ దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ని కలిసి మీ కుంగుబాటును తగ్గించేందుకు కొన్ని మందులు అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’, మీ భార్య భర్తల మధ్య ఏదైనా అంతరాలుంటే సరిదిద్దుకునేందుకు ‘కపుల్ థెరపీ’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా మీ సమస్యలోంచి త్వరగా బయటపడి మీలో మానసిక ప్రశాంతత, సమస్యను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వచ్చేలా చేయవచ్చు. కాలమే మనసుకు తగిలిన గాయాలను మాన్పుతుంది! మనసైనా, మనిషైనా, మనది కానిది, ఎన్నటికీ మనది కాబోదనే జీవిత సత్యాన్ని గుర్తుంచుకోవాలి! ఆల్ ది బెస్ట్.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: 'వాటర్ ఫాస్టింగ్' ఆరోగ్యానికి మంచిదేనా..? నటి నర్గీస్ ఫక్రీ..)
ఫొటోలు
అంతర్జాతీయం

అమెరికా కోవిడ్ డేటా చోరీ.. ఇటలీలో చైనీస్ హ్యాకర్ అరెస్ట్
రోమ్: కోవిడ్ మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్న 2020లో చైనా నిఘా సంస్థ తరపున అమెరికాకు సంబంధించిన కోవిడ్-19 వ్యాక్సిన్ రహస్యాలను దొంగిలించిన హ్యాకర్, చైనా పౌరుడు జు జెవే(33)ను ఇటాలియన్ అధికారులు అరెస్టు చేశారు. ఇతనిపై అమెరికా.. అంతర్జాతీయ వారెంట్ జారీ చేసిన దరిమిలా, మిలన్లోని మాల్పెన్సా విమానాశ్రయంలో అతనిని అరెస్టు చేసినట్లు ఇటాలియన్ అధికారులు మీడియాకు తెలిపారు.కోవిడ్-19 వ్యాక్సిన్లు, చికిత్స, పరీక్షలపై పరిశోధనలు నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు, రోగనిరోధక శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులను లక్ష్యంగా చేసుకుని చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జెవే పనిచేశారని అమెరికా ఆరోపిస్తోంది. చైనాలో తలదాచుకుంటున్న జాంగ్ యు అనే మరో హ్యాకర్ కూడా ఈ కార్యకలాపాల్లో పాల్గొన్నాడనే ఆరోపణలున్నాయి. హ్యాకింగ్‌కు సంబంధించిన అభియోగాలను ఎదుర్కొంటున్న జెవేను అమెరికా న్యాయ శాఖ మిలాన్ కోర్టులో హాజరుపరిచింది.వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం, జెవే కేసు గురించి తమకు తెలియదని, అయితే గతంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయని, దీనిపై చైనా ఇప్పటికే ఈ తన వైఖరిని ప్రకటించిందని పేర్కొంది. వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధికి ప్రపంచంలోనే చైనా పేరొందింది. దొంగతనంగా వ్యాక్సిన్ల డేటాను పొందే అవసరం చైనాకు లేదని చైనా ఎంబసీ ప్రతినిధి లియు పెంగ్యు ఒక ప్రకటనలో తెలిపారు.

‘మాజీ అధ్యక్షుణ్ణి అవమానిస్తారా?’.. బ్రెజిల్‌కు ట్రంప్ సుంకాల షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు మద్దతు పలుకుతూ, ఆ దేశానికి 50 శాతం భారీ సుంకాన్ని ప్రకటించారు. బోల్సోనారోపై కొనసాగుతున్న అవినీతి కేసుపై విమర్శలు గుప్పించారు. ఇది అంతర్జాతీయ అవమానంగా అభివర్ణించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు ట్రంప్ రాసిన లేఖలో ఈ కేసును కొనసాగించవద్దని కోరారు. బ్రెజిల్ వాణిజ్య విధానాలపై వాషింగ్టన్ దర్యాప్తు ప్రారంభిస్తుందని హెచ్చరించారు. భారత్ మాదిరిగానే బ్రెజిల్ ‘బ్రిక్స్’ భాగస్వామ్య దేశం.బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో తనకు బాగా తెలుసని, ఆయనతో కలిసి తాను పనిచేశానని ట్రంప్ పేర్కొన్నారు. ఆయన పదవీకాలంలో ప్రపంచ నేతలు ఆయనను ఎంతో గౌరవంగా చూశారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అతని విషయంలో ప్రస్తుతం బ్రెజిల్ అనుసరిస్తున్న విధానం అవమానకరమని ట్రంప్ ఆ లేఖలో పేర్కొన్నారు. బోల్సోనారో తిరుగుబాటు కేసుపై ట్రంప్ గతంలో చేసిన విమర్శలపై బ్రెజిల్ ఇటీవల ఘాటుగా స్పందించిన దరిమిలా ట్రంప్ భారీ సుంకాలతో బ్రెజిల్‌కు షాకిచ్చారు.బ్రెజిల్ ప్రస్తుత అధ్యక్షుడు లూలా నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బోల్సోనారో కుట్ర పన్నారనే ఆరోపణలున్నాయి. అయితే సైన్యం నుంచి ఆయనకు మద్దతు అందకపోవడంతో ఆ కుట్ర విఫలమైందని చెబుతారు. అయితే బోల్సోనారో ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. కాగా ఆగస్టు ఒకటి నుంచి బ్రెజిలియన్ వస్తువులపై 50 శాతం అమెరికా సుంకం అమల్లోకి వస్తుందని, ఇతర ఆర్థిక వ్యవస్థల గడువుకు ఇది సమానమని ట్రంప్ ఆ లేఖలో పేర్కొన్నారు. ట్రంప్ ప్రస్తుతం తమ దేశ వాణిజ్య భాగస్వాములకు లేఖలు జారీ చేస్తున్నారు. అధిక సుంకాల జాబితాలో గతంలో బ్రెజిల్ లేదు.

నిమిషా ప్రియకు ఉరిశిక్ష ఆగేనా?
సనా: అరబ్ దేశం యెమెన్‌లో మాజీ వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నాలు ఉపందుకున్నాయి. ఆమెకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇప్పటికే జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ‘సేవ్ నిమిషా ప్రియ కౌన్సిల్’పేరిట స్వచ్ఛంద, సామాజిక కార్యకర్తలు ఆమెను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ఉద్యమిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. హత్యకు గురైన మెహదీ కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే శిక్ష నుంచి ఆమె బయటపడే అవకాశం ఉంది. బాధిత కుటుంబానికి బ్లడ్‌మనీ కింద చెల్లించడానికి నిమిషా ప్రియ బంధువులు, మిత్రులు, మద్దతుదారులు రూ.7,35,000 సేకరించారు. మెహదీ కుటుంబం స్పందన కోసం ఎదురు చూస్తున్నామని ‘సేవ్ నిమిషా ప్రియ కౌన్సిల్’సభ్యుడు, సామాజిక కార్యకర్త బాబు జాన్ చెప్పారు. ఆమెను ఎలాగైనా రక్షించాలన్నదే తశ ఆశయమని అన్నారు. ఇప్పటికైనా క్షమాభిక్ష ప్రసాదించాలని, ఒక మహిళ ప్రాణాలు కాపాడాలని మెహదీ కుటుంబాన్ని కోరారు. నిమిషా ప్రియకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు చేస్తున్నారు. ఉరిశిక్ష నుంచి బయటపడి ఆమె క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. నర్సుకు ఎందుకు ఉరిశిక్ష? కేరళ రాష్ట్రం పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్‌కు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ విద్య అభ్యసించింది. మెరుగైన జీవితం కోసం 2008లో యెమెన్ చేరుకుంది. వేర్వేరు ఆసుపత్రుల్లో పని చేసింది. కొంత అనుభవం గడించిన తర్వాత సొంతంగా ఆసుపత్రి నిర్వహించాలన్న ఆలోచనతో 2014లో తలాల్ అబ్దో మెహదీ అనే యెమెన్ పౌరుడిని వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంది. సొంత క్లినిక్ ఏర్పాటు చేసింది. యెమెన్ చట్టాల ప్రకారం.. విదేశీయులు వ్యాపారం చేయాలంటే స్థానికులు అందులో తప్పనిసరిగా భాగస్వామిగా ఉండాలి. కొంతకాలం తర్వాత నిమిషా ప్రియ, మెహదీ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు 2016లో మెహదీని పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. ఆమె పాస్‌పోర్టు లాక్కున్నాడు. చంపేస్తానని పలుమార్లు హెచ్చరించాడు. 2017లో మెహదీ నీళ్ల ట్యాంక్‌లో శవమై కనిపించాడు. అతడి శరీరం ముక్కలు ముక్కలుగా నరికేసి ఉంది. విషపు ఇంజెక్షన్లు ఇచ్చిన మెహదీని హత్య చేసినట్లు నిమిషా ప్రియాపై పోలీసులు అభియోగాలు మోపారు. అరెస్టు చేసి యెమెన్ రాజధాని సనా సిటీలోని సెంట్రల్ జైలుకు తరలించారు. 2018లో ట్రయల్ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఉరిశిక్ష ఖరారు చేసింది. సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సైతం 2023 నవంబర్‌లో ట్రయల్ కోర్టు తీర్పును సమరి్థంచింది. హౌతీ తిరుగుబాలుదారులు ఆమెకు ఉరిశిక్ష అమలు చేసేందుకు ఈ ఏడాది జనవరిలో అనుమతి ఇచ్చారు. యెమెన్‌లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తమ పౌరుడిని హత్య చేస్తే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి. శిక్ష తప్పే మార్గం ఉందా? బాధిత కుటుంబ సభ్యులు బ్లడ్‌మనీ(నష్టపరిహారం కింద నగదు) స్వీకరించి, క్షమాభిక్ష ప్రసాదిస్తే నిమిషా ప్రియకు ఉరిశిక్ష తప్పుతుంది. బ్లడ్‌మనీ ఎంత అనేది బాధిత కుటుంబమే నిర్ణయాల్సి ఉంటుంది. నిమిషా ప్రియ తల్లి కేరళలో ఉంటున్నారు. పనిమనిషిగా జీవనం సాగిస్తున్నారు. తన బిడ్డ ప్రాణాలు కాపాడుకొనేందుకు ఆమె ఇప్పటికే తన ఇల్లు అమ్మేశారు. మెహదీ కుటుంబాన్ని ఒప్పించేందుకు నిమిషా ప్రియ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఉరిశిక్ష తప్పించేలా భారత ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని కోరుతూ సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ బుధవారం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు. సనా సిటీ ప్రస్తుతం హౌతీ తిరుగుబాటుదారుల ఆ«దీనంలో ఉంది. వీరికి ఇరాన్ అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌ను ఒప్పించి హౌతీ తిరుగుబాటుదారులపై ఒత్తిడి పెంచితే ఉరిశిక్ష ఆగిపోయే అవకాశం ఉందని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు.

3,500 ఏళ్లనాటి పురాతన నగరం
పెరూ పురాతన నాగరికతకు నిలయం. ముఖ్యంగా మచుపిచు వంటి ప్రదేశాలకు ప్రసిద్ధి చెందింది. ఇది వివిధ జాతుల సమూహాల మిశ్రమం. అలాంటి పెరూలో మరో ప్రాముఖ్యత వెలుగులోకి వచ్చింది. పురావస్తు శాస్త్రవేత్తలు.. పెరూలోని ఉత్తర బరాంకా ప్రావిన్స్‌లో ఒక పురాతన నగరాన్ని కనుగొన్నారు. ఇది 3,500 సంవత్సరాల పురాతనమైన పెనికో అనే నగరంగా గుర్తించారు. పసిఫిక్ తీరప్రాంతంలో ఆదిమ సమాజాలను ఆండీస్ పర్వతాలు, అమెజాన్ బేసిన్లో నివసించే వారితో అనుసంధానించే కీలక వాణిజ్య కేంద్రంగా ఇది పనిచేసిందని నమ్ముతున్నారు. లిమాకు ఉత్తరాన 200 కి.మీ దూ రంలో ఉన్న ఈ ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపు 600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది మధ్యప్రాచ్యం, ఆసియాలో ఆదిమ నాగరికతలు అభివృద్ధి చెందుతున్న సమయంలో క్రీస్తుపూర్వం 1,800–1,500 మధ్య స్థాపించిందై ఉంటుందని భావిస్తున్నారు. ఈ నగరానికి సంబంధించిన డ్రోన్ ఫుటేజ్‌ను కూడా పరిశోధకులు విడుదల చేశారు. ఇందులో నగర కేంద్రంలోని కొండవాలు టెర్రస్‌పై వృత్తాకార నిర్మాణం కనిపిస్తోంది. దాని చుట్టూ రాతి, మట్టి భవనాల అవశేషాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఎనిమిదేళ్లపాటు పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు 18 నిర్మాణాలను వెలికితీశారు. వాటిలో దేవాలయాలు, ఇళ్లు కూడా ఉన్నాయి. భవనాల్లో పండుగలకు ఉపయోగించే వస్తువులు, మనుషులు, జంతువుల బొమ్మ లు, మట్టి శిల్పాలు, పూసలు, సముద్రపు గవ్వలతో తయారు చేసిన హారాలు ఉన్నాయి. పెరూలోని సూప్ లోయలో 5వేల ఏళ్లకిందటి అమెరికా ఖండాల్లో అత్యంత పురాతనమైన నాగరికతగా గుర్తింపు పొందిన కారల్ ఉన్న ప్రదేశానికి సమీపంలో పెనికో ఉంది. ఇక, కారల్లో 32 స్మారక చిహ్నాలు ఉన్నా యి. వాటిలో పెద్ద పిరమిడ్ నిర్మాణాలు, అధునాతన నీటిపారుదల పద్ధతులు, వ్యవసాయం, పట్టణ స్థావరాలు ఉన్నాయి. ఇది భారత్, ఈజిప్ట్, సుమేరియా, చైనాలోని ఇతర ఆదిమ నాగరికతల సమ యంలోనే విడిగా అభివృద్ధి చెందిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. వాతావరణ మార్పుల వల్ల కారల్ నాగరికత క్షీణించిన తర్వాత దాని పరిస్థితి ఏమిటనేది అర్థం చేసుకోవడానికి పెనికో ఆవిష్కరణ పనికొస్తుందని 1990లలో పెనికోపై ఇటీవలి పరిశోధనలు, కారల్ తవ్వకాలకు నాయకత్వం వహించిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ రూత్ షాడీ తెలిపారు. సముద్ర తీరంలో, ఎత్తైన ప్రాంతంలో ఉన్న పెనికో.. ఆ కాలంలో అడవుల్లో జీవిస్తున్న సమాజాల ప్రజల వాణిజ్యానికి, వస్తు మారి్పడికి ఉపయోగించే విధంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉందని చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

ఎన్నికల ముందే ‘సవరణ’ ఎందుకు?
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను యథాతథంగా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని వెల్లడించింది. ప్రత్యేక సవరణను సవాలు చేస్తూ వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. బిహార్‌లో 60 శాతం ఓటర్ల తనిఖీ పూర్తయ్యిందని చెప్పారు. ఓటర్లను సంప్రదించకుండా వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల సంఘం ఉద్దేశం, నిజాయతీని తాము శంకించడం లేదని, ప్రత్యేక సవరణ చేపట్టకుండా ఎన్నికల సంఘాన్ని అడ్డుకోవాలని భావించడం లేదని తెలిపింది. ప్రత్యేక సవరణతో సమస్య లేదని, చేపట్టిన సమయమే అసలు సమస్య అని పేర్కొంది. తీరా అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించాల్సిన అవసరం ఏమిటని ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను ఆమోదిస్తున్నామని.. కానీ, ఎన్నికల ముందే ఈ ప్రక్రియ ఎందుకు మొదలుపెట్టారో చెప్పాలని పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానికి లేదన్న పిటిషనర్ల వాదనను తిరస్కరించింది. ఎన్నికలతో సంబంధం లేకుండా చేపట్టలేమా? ఓటర్ల జాబితా సవరణ అనేది చాలా ముఖ్యమైన విషయమని చెప్పడంలో సందేహం లేదని, ఇది ప్రజాస్వామ్య మూలాలు, ఓటుకు ఉన్న శక్తికి సంబంధించిన అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషనర్లు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని సూచించింది. ‘‘నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బిహార్‌లో ఈ సవరణ ప్రక్రియ ఇప్పుడే ఎందుకు ప్రారంభించారు? ఎన్నికలతో సంబంధం లేకుండా ఎందుకు చేపట్టకూడదు? ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందే ప్రారంభించడం వెనుక ఔచిత్యం ఏమిటి?’’ అని ప్రశ్నించింది. ప్రత్యేక సవరణపై మధ్యంతర స్టే విధించాలని పిటిషనర్లు కోరలేదని వెల్లడించింది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నెల 21వ తేదీ నాటికి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. పౌరసత్వం నిర్ధారణ మీ పనికాదు ప్రత్యేక సవరణలో ఓటర్ల అర్హతను నిర్ధారించడానికి ఆధార్ కార్డును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 326 ప్రకారం ప్రతి ఓటర్ తప్పనిసరిగా భారతీయుడై ఉండాలని, ఆధార్ కార్డు అనేది ప్రజల పౌరసత్వానికి ధ్రువీకరణ కాదని రాజేశ్ ద్వివేది బదులిచ్చారు. ఓటర్ల పౌరసత్వాన్ని ధ్రువీకరించడం ఎన్నికల సంఘం బాధ్యత కాదని, అది కేంద్ర హోంశాఖ పరిధిలోని అంశమని ధర్మాసనం స్పష్టంచేసింది. నిజంగా పౌరసత్వాన్ని తేల్చాలని అనుకుంటే ఆ ప్రక్రియను గతంలోనే ప్రారంభిస్తే బాగుండేదని, ఇప్పటికే చాలా ఆలస్యమైందని పేర్కొంది. అందుకే అర్హులైన ఓటర్లను నిర్ధారించడానికి ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డుతోపాటు ఆధార్ కార్డును సైతం పరిగణనలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది.

విద్యార్థిని వింత ప్రవర్తన.. నాకు సారా, బీడీ ఇవ్వండి..!
ఒడిశా: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి చంద్రపొడ గ్రామం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు పాఠ్యం బోధిస్తున్న సమయంలో హటాత్తుగా 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనూహ్యంగా, వింతగా ప్రవర్తించింది. నాకు సారా ఇవ్వండి, బీడీ ఇవ్వండి అని పట్టుబట్టింది. తాను ఇక్కడ నుంచి వెళ్లను, నేను వారిని చంపుతాను అని పిచ్చిగా మాట్లాడుతూ వింతగా ప్రవర్తించింది. ఆ సమయంలో రాష్ట్ర విద్యావిభాగ డైరెక్టర్, జిల్లా విద్యాధికారులు పాఠశాలకు వచ్చారు. వింతగా ప్రవర్తిస్తున్న బాలికను చూసిన అధికారులు వెంటనే హాస్పిటల్‌కు తీసుకుళ్లాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆ సమయంలో విషయం తెలిసిన బాలిక సోదరుడు వచ్చి తన చెల్లెను హాస్పిటల్‌కు కాకుండా నేరుగా ఇంటికి తీసుకువెళ్లాడు. బాలిక పరిస్థితిని చూసిన తోటి విద్యార్థులు ఆమెకు దెయ్యమో, భూతమో ఆవహించిందని భయంతో వణికిపోయారు. బాలికను ఆదివాసీ వైద్యుడు దిశారీ వద్దకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. మారుమూల ఆదివాసీ గ్రామీణ ప్రజలలో మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయని, వారిని చైతన్యవంతులను చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయురాలు రాజలక్ష్మీ మిశ్ర అభిప్రాయపడ్డారు. బాలికకు భూతం పట్టిందని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఇటువంటి సంఘటనలకు మానసిక వ్యాధులే కారణమని, హాస్పిటల్లో వైద్యం చేయించటం మంచిదని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు.

ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: అవకాశం వచ్చినప్పుడల్లా తన సొంత పార్టీపై విరుచుకుపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ మరోసారి తన మాటలకు పదును పెట్టారు. 1975లో కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)పై విమర్శలు గుప్పించారు. అప్పట్లో క్రమశిక్షణ, శాంతి పేరుతో ఎన్నో దారుణాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం మలయాళ పత్రిక ‘దీపిక’లో రాసిన వ్యాసంలో కాంగ్రెస్ పార్టీపై శశి థరూర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో క్రమశిక్షణ పేరిట చేపట్టిన చర్యలు ఎన్నో దారుణాలకు దారితీశాయని, అవి క్షమించరాని తప్పులని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం అని తేల్చిచెప్పారు. ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ చేపట్టిన బలవంతపు కుటుంబ నియంత్రణ కార్యక్రమం అత్యవసర పరిస్థితి కాలంలో జరిగిన దారుణాలకు పెద్ద ఉదాహరణగా నిలిచిందని స్పష్టంచేశారు. గ్రామాల్లో నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడం కోసం హింస, బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు. ఢిల్లీ వంటి నగరాల్లో పేదల గుడిసెలను నేలమట్టం చేసి వేలాది మంది ప్రజలను నిరాశ్రయులుగా మార్చారని ఆక్షేపించారు. ఇళ్లు కోల్పోయిన పేదల పునరావాసం, సంక్షేమం గురించి అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఆసక్తి చూపలేదని వెల్లడించారు. అప్పటి దురాగతాలకు ప్రధాని ఇందిరా గాంధీ మద్దతు పలికారని ఆరోపించారు. ప్రత్యర్థులను జైల్లో పెట్టడం, ప్రజల ప్రాథమిక హక్కులను హరించడం, పత్రికలపై ఆంక్షలు విధించడం, చట్టాలను ఉల్లంఘించడం వంటివి మన రాజకీయాల్లో ఒక మచ్చగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమర్జెన్సీని దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తుచేశారు. My column for a global audience on the lessons for India and the world of the Emergency, on its 50th anniversary @ProSyn https://t.co/QZBBidl0Zt— Shashi Tharoor (@ShashiTharoor) July 9, 2025ప్రజాస్వామ్య పరిరక్షకులు అప్రమత్తంగా ఉండాలి ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ తక్కువ చేసి చూడరాదని, ఇది మనకు దక్కిన విలువైన సంపద అని శశి థరూర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మనదేశం 1975లోని భారత్ కాదన్న విషయం గుర్తుంచుకోవాలని... మనం ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నామని, మరింత అభివృద్ధి సాధించామని, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగి ఉన్నామని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థే మన బలమని ఉద్ఘాటించారు. అత్యవసర పరిస్థితి నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఉన్నాయని వివరించారు. అధికారాన్ని ఒకచోటే కేంద్రీకరించడం, విరుద్ధ స్వరాలను అణచివేయడం, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడం వంటి దుష్పరిణామాలు మళ్లీ వేరే రూపాల్లో ప్రత్యక్షం అవుతూనే ఉంటాయన్నారు. దేశ ప్రయోజనాలు, సుస్థిరత అనే సాకులతో అలాంటి వాటిని సమర్థించడానికి ప్రయత్నిస్తారని చెప్పారు. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షకులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు. అత్యవసర పరిస్థితి మనకు ఎప్పటికీ ఒక పెద్ద హెచ్చరిక అని శశి థరూర్ తేల్చిచెప్పారు. మరోవైపు ఎమర్జెన్సీ పట్ల శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.డి.సతీశన్, కె.మురళీధరన్ స్పందించారు. ఎప్పుడో విధించిన ఎమర్జెన్సీపై ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. శశి థరూర్ వ్యవహార శైలిపై తమ పార్టీ నాయకత్వం తగిన సమయంలో స్పందిస్తుందని పేర్కొన్నారు.

అమ్మాయిల ఫొటోలు, వీడియోలతో పోకిరి హల్చల్.. తర్వాత ఏమైందంటే?
బెంగళూరు: అమ్మాయిలను సీక్రెట్‌గా ఫొటోలు, వీడియోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్న ఓ పోకిరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి.. రోడ్డుపై వెళ్తున్న అమ్మాయిలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో వీడియోలను అప్లోడ్ చేస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.వివరాల ప్రకారం.. గురుదీప్ సింగ్ (26) అనే వ్యక్తి బెంగళూరులోని చర్చి స్ట్రీట్, కోరమంగళ సహా పలు ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. ఈ సమయంలో రోడ్లపై వెళ్తున్న అమ్మాయిలను వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. అనంతరం, వాటిని ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్నాడు. అయితే, ఓ యువతికి చెందిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా షాకైంది. ఈ వీడియోలకు అసభ్యకరంగా కామెంట్స్ రావడంతో ఆవేదన చెందింది. అనంతరం, తన వీడియోలను వెంటనే డిలీట్ చేయాలని సదరు యువతి.. గురుదీప్ సింగ్‌కు మెసేజ్ పెట్టింది. ఈ క్రమంలో నిందితుడు.. దురుసుగా ప్రవర్తించాడు. ఆమె ఫొటోలు, వీడియోలు తొలగించకపోగా.. అసభ్య పదజాలంతో ఆమెను దూషించాడు.దీంతో, గురుప్రీత్ సింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సహాయం కోసం @blrcitypolice, @cybercrimecid పోలీసులకు ఈ పోస్టులను ట్యాగ్ చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. గురుప్రీత్‌ను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితురాలు స్పందిస్తూ.. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి వ్యక్తులు ఇంకా బెంగళూరులో తిరుగుతున్నారన చెప్పుకొచ్చింది. వారిపై కూడా చర్చలు తీసుకోవాలని పోలీసులను కోరింది.
ఎన్ఆర్ఐ

న్యూజిలాండ్‌లో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు
న్యూజిలాండ్‌లోని ప్రధాన నగరాల్లో కూడా ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి జయంతి వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఆక్లాండ్‌లోని పిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ న్యూజిలాండ్ కమిటీ కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరి, కో–కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, డేగపూడి సమంత్, సభ్యులు బాలశౌర్య, రాజారెడ్డి, పిళ్లా పార్థ, జిమ్మి, గీతారెడ్డి, ఆళ్ల విజయ్, రమేష్ పనటి, సంకీర్త్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.భారతదేశం నుండి గౌరవ అతిథులుగా అలూరు సంబ శివ రెడ్డి , ఆరే శ్యామల రెడ్డి, జి. శాంత మూర్తి , నందమూరి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూజిలాండ్ మాజీ మంత్రి మైకేల్ ఉడ్ హాజయ్యారు. ఎన్నారైలు బీరం బాల, కళ్యాణ్‌రావు, కోడూరి చంద్రశేఖర్, అర్జున్‌రెడ్డి, మల్లెల గోవర్ధన్, జగదీష్ రెడ్డి, ఇందిర సిరిగిరి తదితరులు పాల్గొన్నారు.

లండన్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వైఎస్సార్‌సీపీ యూకే కమిటీ ఆధ్వర్యంలో లండన్లోనిని ఈస్టమ్లో దివంగత నేత వైఎస్ రాజశే ఖరరెడ్డి 76వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.యూకే నలుమూలల నుంచి వైఎస్సార్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆన్ లైన్ లో పాల్గొని వేడుకల్లో భాగస్వాములైన వారిని అభినందించారు. వైఎస్సార్‌సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా మాట్లాడుతూ.. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని రాజశేఖరరెడ్డి జీవి తాన్ని, వారు సాధించిన విజయాలను స్మరించుకో వడం సంతోషంగా ఉందన్నారు. మహానేత ఆశయ సాధనకు వైఎస్ జగన్ శ్రమిస్తున్నార న్నారు. నేతలందరూ వైఎస్ జగన్ వెంట నడవాలని, ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ ఓబుల్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ యూకే కో-కన్వీనర్ మలిరెడ్డి కిశోర్‌రెడ్డి, కీలక కమిటీ సభ్యులు శ్రీనివాస్ దొంతిబోయిన, ఎస్ఆర్ నందివెలుగు, సురేందర్ రెడ్డి అలవల, బీవీ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ కల్చరల్ సొసైటీ 12వ సర్వ సభ్య సమావేశం
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) / TCSS పన్నెండవ వార్షిక సర్వ సభ్య సమావేశం జూన్ 29వ తేదీన స్థానిక ఆర్య సమాజం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుమారు 30 మందికిపైగా సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పదకొండవ సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2024-2025 ఆర్థిక సంవత్సరపు రాబడి, ఖర్చుల వివరాలను సభ్యులకు వివరించిన తరువాత పద్దులను ఉపాధ్యక్షులు భాస్కర్ గుప్త నల్ల ఆమోదించారు. ఈ సమావేశం సందర్భంగా సభ్యులు ముద్దం విజ్జేందర్ , గర్రెపల్లి శ్రీనివాస్, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల కోశాధికారి నంగునూరి వెంకట రమణ వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి మోడరేటర్‌గా ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల వ్యవహరించారు.2024‐2025 ఆర్థిక సంవత్సరానికి గానూ పద్దుల తనిఖీ దారులుగా సేవలు అందించిన కైలాసపు కిరణ్, తెల్లదేవరపల్లి కిషన్ రావు గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. సొసైటీ రాజ్యాంగానికి ప్రతిపాదించిన కొన్ని ముఖ్యమైన సవరణలకు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేశారు. 2025 నుంచి 2026 గాను పద్దుల తనిఖీ దారులుగా నీలం సుఖేందర్, కిరణ్ కుమార్ ఎర్రబోయిన గార్లను ప్రతిపాదించి ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు సాయశక్తుల ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీ ని ఆస్వాదించారు. ఈ సమావేశంలో అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ గార్ల తోపాటు ఇతర జీవితకాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: మోదీకి 'హలో' చెప్పేందుకు వచ్చా..! భారత సంతతి వ్యక్తి)

ఆస్ట్రేలియాలో ఘనంగా వైఎస్సార్ జయంతి
ఆస్ట్రేలియాలో అన్ని ప్రధాన నగరాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ వైయస్సార్ ఒక మరణం లేని మహనీయుడని తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. తమలో చాలామంది వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యామని తమ జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు వైఎస్సార్ అని కొనియాడారు.ఆస్ట్రేలియాలోని అన్ని ప్రధాన నగరాల్లో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కటింగ్, పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. బ్రిస్ బేన్‌లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ తెలుగు ప్రజలకు అందించిన సేవలు ఎన్నటికీ మరచిపోమని అలాగే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న వైఎస్ జగన్ బాటను విడవబోమని పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమాలలో పాల్గొన్న వారికి జూమ్ కాల్ ద్వారా వైఎస్సార్‌సీపీ నాయకులు, ఆలూరు సాంబశివారెడ్డి , సోషల్ మీడియా ఇన్‌ఛార్జి యశ్వంత్, చల్లా మధుసూదన్ రెడ్డి, అబ్బయ్య చౌదరి, అరే శ్యామల, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కారుమూరి వెంకట్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ, బియ్యపు మధుసూదన్ రెడ్డి, అభినందనలు తెలియజేశారు.
క్రైమ్

నైట్ డ్యూటీకి వెళ్లి.. మిస్టరీగా నర్స్ మృతి
అనంతపురం: నగరంలోని సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు దివ్య (22) బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ గ్రామానికి చెందిన వడ్డె దివ్య.. మూడేళ్లుగా సవేరా ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అదే ఆస్పత్రికి చెందిన హాస్టల్లోనే ఉంటున్నారు. ఆరోగ్యం బాగోలేదని మంగళవారం రాత్రి తోటి నర్సులకు తెలిపి ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రించారు. బుధవారం మధ్యాహ్నమైనా ఆమె లేవలేదు. మధ్యాహ్నం షిఫ్ట్ నర్సులు వచ్చి పలుకరించినా స్పందన లేకపోవడంతో పల్స్ పరిశీలించారు. నాడి చిన్నగా కొట్టుకుంటుండడంతో వెంటనే సవేరా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, దివ్య మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

తండ్రిని చంపేసి.. సెకండ్ షో సినిమాకు వెళ్లి..
మల్కాజ్గిరి జిల్లా: భర్త దగ్గరికి వెళ్లాలని మందలించాడని, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ వివాహిత తన తండ్రినే హత్య చేయించింది. తల్లి, ప్రియుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా నమ్మించాలని యతి్నంచి కటకటాలపాలైంది. ఈ సంఘటన ఘట్కేసర్ పీఎస్ పరి«ధిలో జరిగింది. హత్య వివరాలను బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలి్పన మేరకు..ముషిరాబాద్ పరిధిలోని ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతులు. లింగం సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తుండగా, శారద జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికురాలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ నెల 6న లింగం విధులు నిర్వహించడానికి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు సెక్యూరిటీ ఏజెన్సీని సంప్రదించగా ఆ రోజు విధులకు రాలేదని తెలిపారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 7న మధ్యాహ్నం పెద్ద కుమార్తె మనీషాకు పోలీసులు వాట్సాప్‌లో ఓ ఫోటో పంపి గుర్తించాలని కోరారు. మృతుడ్ని తండ్రిగా గుర్తించి..తల్లి శారదతో కలిసి ఘట్కేసర్ పరిధి ఏదులాబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువు వద్దకు వెళ్లారు. లింగం శవాన్ని చూసి బోరున విలపించారు. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు గొంతకోసి చంపారని శారద పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ముగ్గురూ కలిసి ... లింగం పెద్ద కూతురు మనీషా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో వీరి ఇంటి సమీపంలో ఉంటుంది. మహ్మద్ జావీద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిపై లింగం కోపగించి..అతనితో సంబంధం మానేయాలని హెచ్చరించాడు. భర్త దగ్గరకు కాపురానికి వెళ్లిపోవాలని మనీషాను ఒత్తిడిచేశాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా తండ్రిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె తల్లి శారద, మహ్మద్ జావీద్ సహకరించారు. ఈమేరకు హత్య చేసిన తర్వాత శవాన్ని ఎక్కడ వేయాలో అని చర్చించి 15 రోజుల క్రితమే ఏదులాబాద్ చెరువును పరిశీలించి వెళ్లారు.కల్లులో నిద్ర మాత్రలు కలిపి... లింగంకు కల్లు తాగే అలవాటు ఉండడంతో అందులో నిద్రమాత్రలు కలపాలని జావీద్ ఈ నెల 5న శారదకు టాబ్లెట్లు అందించాడు. లింగం కల్లు తాగి ఇంట్లో పడుకోగా.. విషయాన్ని శారద..కుమార్తె మనీషా, జావీద్‌లకు సమాచారం ఇచి్చంది. మనీషా సమీపంలోని వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి వచి్చ..మరోసారి లింగంకు తాగించారు. అనంతరం శారద, మనీషాల సహకారంతో లింగం కాళ్లు చేతులు కట్టేసిన జావీద్..అతడి ముఖంపై దిండుతో అదిమి..పిడికిలితో గుండెపై మోది, గొంతు కోసి చంపేశారు. శవాన్ని ఇంట్లో వేలాడదీశారు. సినిమాకు వెళ్లి..క్యాబ్‌లో శవాన్ని తరలించి.. హత్య అనంతరం ముగ్గురు జావీద్ ఉండే ఇంటికి బైక్‌పై వెళ్లి.. అటునుంచి సెకెండ్ షో సినిమాకు వెళ్లారు. తిరిగొచ్చి శవాన్ని ఎదులాబాద్ చెరువులో పడేయడానికి క్యాబ్ బుక్ చేసుకున్నారు. లింగం అపస్మారక స్థితిలో ఉండడంతో డ్రైవర్ అనుమానించి కారు బుకింగ్ రద్దు చేసుకున్నాడు. మద్యం సేవించాడని, ఎదులాబాద్‌లో కుటుంబ సభ్యులకు అప్పగించాలని డ్రైవర్‌కు నచ్చజెప్పి ఒప్పించారు. కారులో శవంతో మనీషా, శారద ఉండగా..జావీద్ బైక్‌పై వెనుక అనుసరించి.. శవాన్ని చెరువు కట్టపై దించారు. క్యాబ్ వెళ్లగానే శవాన్ని చెరువులో పడేసి ముగ్గురు బైక్‌పై ఇంటికి వెళ్లిపోయారు. ఏమీ తెలియనట్లు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి కుటుంబ సభ్యుల పైనే అనుమానం కలగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచి్చంది. ఈ మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

850 కిలోల గంజాయి స్వాధీనం
అనకాపల్లి/సూళ్లూరుపేట: రాష్ట్రంలోని రెండు వేర్వేరు జిల్లాల్లో 850 కిలోల గంజాయిను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. పదిమందిని అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిపోలీస్ స్టేషన్ పరిధి వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒడిశా నుంచి కర్ణాటకకు బొలేరో వాహనంలో తరలిస్తున్న 840 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నక్కపల్లి పోలీస్‌స్టేషన్ సీఐ కె.కుమారస్వామి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీచేస్తుండగా, ఒక బొలెరో వాహనంలో 20 బ్యాగుల్లో 840 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దాని విలువ రూ.42 లక్షలు ఉంటుందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మామిడిపాలేనికి చెందిన సుక్రీ అర్జున్, డేగలపాలేనికి చెందిన వంతల సురేశ్, పెద్దపేటకు చెందిన కొదమ నాగరాజు, పాంగి అర్జునరావు కలిసి ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా అటవీప్రాంతాల్లో గంజాయి కొనుగోలుచేసి «డౌనూరు చెక్ పోస్ట్ వద్ద పోలీసులను తప్పించుకుని నర్సీపట్నం తీసుకొచ్చారని తెలిపారు. అక్కడ నుంచి కర్ణాటకకు తరలించేందుకు పెద్దపేటకు చెందిన పాంగి అర్జునరావు, చింతపల్లికి చెందిన వంతల సురేశ్, రోలుగుంటకు చెందిన కైసర్ల దివాకర్, నక్కపల్లికి చెందిన యలమంచిలి రమణ సిద్ధమవుతుండగా పట్టుకున్నట్టు తెలిపారు. సుక్రీ అర్జున, కొదమ నాగరాజులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. సూళ్లూరుపేటలో ఆరుగురు అరెస్ట్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న ఆరుగురిని బుధవారం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 10 కిలోల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ షార్కు వెళ్లే మార్గంలోని చెంగాళమ్మ లేఅవుట్‌కు చెందిన కంపా చంద్రకాంత్ (28), విజయవాడ ఆర్ఆర్ పేటకు చెందిన అంకాల భరత్ కౌశల్ అలియాస్ కౌశిక్ (28), తడమండలం వెండ్లూరుపాడుకు చెందిన బూరగ తేజ (23), సూళ్లూరుకు చెందిన మొండెం శైలేష్ (21), తడమండలం అనపగుంటకు చెందిన పరింగి నరేంద్ర (30), సూళ్లూరు నాగరాజపురానికి చెందిన వేనాటి శ్రీ (20)ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. గంజాయి విలువ రూ.2 లక్షలు ఉంటుందన్నారు.

KPHB: కల్తీ కల్లు ఘటనలో ఐదుకి చేరిన మృతులు
హైదరాబాద్: కూకట్పల్లి పరిధిలో కలకలం రేపిన కల్తీ కల్లు మహమ్మారి ఊహించని విషాదంగా మారింది. కల్తీ కల్లుతాగి అస్వస్థతకు గురైన ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి పెరిగింది. కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు తాగి మొత్తంగా 31మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వీరిలో పలువురు నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా.. కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తొలుత దీని ప్రభావం సాధారణంగానే భావించినా అనూహ్యంగా మృతులు, బాధితుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.