Winners Announced
-
గూగుల్‌ను మెప్పించి.. విజేతగా నిలిచిన శ్లోక్
దేశవ్యాప్తంగా వందకిపైగా నగరాలు.. లక్షా పదిహేను ఎంట్రీలు.. ఆ మొత్తంలో గూగుల్‌ను మెప్పించి విజేతగా నిలిచాడు ఓ కుర్రాడు. ఆ డూడుల్ ఇప్పుడు బాలల దినోత్సవం సందర్భంగా.. గూగుల్ హోం పేజీలో దర్శనమిస్తోంది. గూగుల్ సోమవారం ఉదయం డూడుల్ ఫర్ గూగుల్ 2022 పోటీల ఫలితాలను ప్రకటించింది. ఈ పోటీలో పశ్చిమ బెంగాల్ కోల్‌కతాకు చెందిన శ్లోక్ ముఖర్జీగా విజేతగా నిలిచాడు. ఇండియా ఆన్ ది సెంటర్ స్టేజ్ అనే డూడుల్‌ను రూపొందించాడు శ్లోక్. అది స్ఫూర్తిదాయకంగా ఉందని ప్రకటించింది గూగుల్. సోమవారం ఆ డూడుల్ Google.co.inలో ప్రదర్శితమవుతోంది. న్యూటౌన్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు శ్లోక్. ‘‘రాబోయే పాతికేళ్లలో.. మానవాళి అభివృద్ధికి నా దేశ శాస్త్రవేత్తలు తమ సొంత పర్యావరణ అనుకూల రోబోట్‌ను అభివృద్ధి చేస్తారు. భారతదేశం భూమి నుంచి అంతరిక్షానికి క్రమం తప్పకుండా ఇంటర్ గెలాక్టిక్ ప్రయాణాలను చేస్తుంటుంది. యోగా, ఆయుర్వేదంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో దేశం మరింత బలపడుతుంది’’ అంటూ తన డూడుల్ సందేశంలో పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా మొత్తం వంద నగరాల నుంచి లక్షా 15వేల ఎంట్రీలు వచ్చాయి ఈ పోటీకి. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులు ఈ పోటీకి అర్హులు. మొత్తం ఎంట్రీల నుంచి చివరగా 20 మందిని ఎంపిక చేశారు. చివరికి శ్లోక్‌ను విజేతగా ప్రకటించారు. గూగుల్ డూడుల్ టీంతో పాటు న్యాయనిర్ణేతల ప్యానెల్లో ప్రముఖ నటి, ఫిల్మ్ మేకర్ నీనా గుప్తాతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. డూడుల్ ఫర్ గూగుల్ పోటీలు.. యువతరంలో సృజనాత్మకతను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
‘తెలుగు ఇండియన్ ఐడల్’ విజేత వాగ్దేవి ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలే ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. శుక్రవారం రాత్రి స్ట్రీమింగ్ అయిన ఈ ఫైనల్ ఎపిసోడ్‌కు మెగాస్టార్ చిరు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కంటెస్టెంట్స్ చేసిన సందడి బాగా ఆకట్టుకుంది. చిరుతో పాటు రానా, సాయిపల్లవిలు ‘విరాటపర్వం’ ప్రమోషన్లో భాగంగా ఈ షోలో సందడి చేశారు. చదవండి: ‘ఆ బుక్ ఆధారంగా కెఫె కాఫీ డే వీజీ సిద్ధార్థ బయోపిక్ తీస్తున్నాం’ కాగా ఈ సింగింగ్ రియాలిటీ షోకు శ్రీరామ్‌చంద్ర హోస్ట్‌గా.. సంగీత దర్శకుడు తమన్, నటి నిత్యామీనన్, సింగర్ కార్తీక్‌లు జడ్జ్‌లుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఫినాలే ఎపిసోడ్లో వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాస్‌లు ఫైనల్‌కు రాగా.. వాగ్దేవి విన్నర్‌గా నిలిచింది. శ్రీనివాస్, వైష్ణవిలు 2, 3 స్థానాల్లో నిలిచి రన్నర్లుగా నిలిచారు. విజేతగా నిలిచిన వాగ్దేవికి చిరంజీవి ట్రోఫీని అందించాడు. అలాగే ట్రోఫీతో పాటు రూ.10 లక్షల ప్రైజ్‌మనీని కూడా ఆమె గెలుచుకుంది. అంతేకాదు ఇకపై గీతా ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో ఓ పాట పాడే అవకాశం కూడా ఆమె అందుకుంది. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య మొదటి రన్నరప్‌గా నిలిచిన శ్రీనివాస్‌కు రూ. 3 లక్షలు ప్రైజ్‌మని, రెండవ రన్నరప్‌గా నిలిచిన వైష్ణవికి 2 లక్షల రూపాయలు బహుమాతిగా అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి తన తదుపరి సినిమా ‘గాడ్‌ఫాదర్’లో వైష్ణవికి పాట పాడే అవకాశం ఇచ్చాడు. అలాగే సింగర్ కార్తీక్ తను సంగీతం అందించనున్న నెక్స్ట్ సినిమాలో విన్నర్ వాగ్దేవికి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలిపాడు. ఆనంతరం చిరుతో ముందుగానే వాగ్ధేవికి చెక్‌ను కూడా అందించాడు. ఇక ఈ ఎపిసోడ్లో నిత్యా మీనన్ పాట పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. థమన్, కార్తిక్ పాటల ప్రదర్శన, శ్రీరామ్ చంద్ర నృత్య ప్రదర్శనతో షోను మరింత వినోదంగా సాగింది. -
సంచలనాల 'లాకప్' షో విన్నర్ గెలుచుకుంది ఎంతో తెలుసా ?
Lock Up Show Winner Munawar Faruqui Got 20 Lakh Prize Money: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఓ పక్క సినిమాలతో మరోవైపు హోస్ట్‌గా సక్సేస్ఫుల్గా ముందుకు సాగుతోంది. ఆమె వ్యాఖ్యతగా వ్యవహరించిన విభిన్నమైన రియాల్టీ షో 'లాకప్' గురించి తెలిసిందే. ఇందులో పార్టిస్పేట్ చేసిన కంటెస్టెంట్ నుంచి వారు చెప్పిన సీక్రెట్స్ వరకు అన్ని హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఈ షో చివరిదశకు చేరుకుంది. ఈ షోలో ఫైనల్ విన్నర్‌ను శనివారం (మే 7) ప్రకటించింది హోస్ట్ కంగనా రనౌత్. కాంట్రవర్సీ రియాల్టీ షో లాకప్ సీజన్ 1 బాడ్యాస్ విన్నర్ మునావర్ ఫరూఖీ అని కంగనా ప్రకటించింది. మరోవైపు రన్నరప్‌గా నటి పాయల్ రోహత్గీ నిలిచింది. 'లాకప్' షో విజేత మునావర్ ఫరూఖీ ట్రోఫీని గెలుచుకోవడంతోపాటు రూ. 20 లక్షల చెక్కు, మారుతీ సుజుకి ఎర్టిగా కారు, ఇటలీకి ఫ్రీ ట్రిప్‌ను అందుకున్నాడు. ఈ గ్రాండ్ ఫినాలేలో మునావర్ ఫరూఖీ ఇతర నలుగురు ఫైనలిస్టులైన పాయల్ రోహత్గి, అంజలి అరోరా, అజ్మా ఫల్లా, శివమ్ శర్మలను ఓడించాడు. ఈ ట్రోఫీ గెలవడంపై మునావర్ ఫరూఖీ సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ మే 7న ఎమ్ఎక్స్ ప్లేయర్, ఆల్ట్ బాలాజీలో ప్రసారమైంది. చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ MUNAWAR FARUQUI IS 'LOCK UPP' WINNER... And the winner of the first season of #LockUpp is #MunawarFaruqui... The show - which debuted in Feb 2022 - was aired on #MXPlayer and #ALTBalaji... #KanganaRanaut hosted the first season.@MXPlayer @altbalaji pic.twitter.com/ONxIaR9VZZ — taran adarsh (@taran_adarsh) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గ్రామీ అవార్డు విజేతలు వీరే...
లాస్ఎంజిల్స్: ఎట్టకేలకు ప్రఖ్యాత హాలీవుడ్ 63వ గ్రామీ అవార్డ్స్ అవార్డు ఫంక్షన్ మార్చి 14న లాస్ఎంజిల్స్లో జరిగాయి. మ్యూజిక్ ఇండస్ట్రీలో జరిగే పాపులర్ అవార్డుల వేడుక గ్రామీ. ఈ వేడుకలతో అత్యధికంగా ట్రోఫీలను గెలుచుకున్న మహిళగా బెయోన్స్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బెయాన్స్ 28 ట్రోఫీలను గెలిచింది. ప్రముఖ సింగర్ అలిసన్ క్రాస్‌ను దాటింది.కోవిడ్-19 నేపథ్యంలో జనవరి 31న జరగాల్సిన ఈ వేడుకను మార్చి 14కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణులతో, అవార్డు నామినీలతో, ఆర్టిస్టులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఈ వేడుకను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఏడాది గ్రామీ విజేతలు వీరే.. రికార్డ్ ఆఫ్ ది ఇయర్: ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్ బై బిల్లీ ఎలిష్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్: ఫోక్లోర్ బై టేలర్ స్విఫ్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్: ఐ కాంట్ బ్రీత్ బై హెచ్.ఈ.ఆర్ ఉత్తమ నూతన ఆర్టిస్ట్: మేగాన్ దీ స్టాలియన్ ఉత్తమ పాప్ సోలో ప్రదర్శన: వాటర్మెలాన్ బై హ్యారీ స్టైల్స్ ఉత్తమ రాక్ సాంగ్: స్టే హై బై బ్రిటనీ హోవార్డ్ ఉత్తమ రాక్ ఆల్బమ్: ది న్యూ ఆబ్నార్మల్ బై ది స్ట్రోక్స్ ఉత్తమ ర్యాప్ సాంగ్: సావేజ్ బై మేగాన్ తీ స్టాలియన్ ఉత్తమ ర్యాప్ ఆల్బమ్: కింగ్స్ డిసీజ్ బై నాస్(చదవండి: ఒక వేడుక.. రెండు వేదికలు) -
స్పెయిన్‌లో 17 వేల కోట్ల లాటరీ
బార్సిలోనా: క్రిస్మస్ను పురస్కరించుకొని స్పెయిన్‌లో నిర్వహించిన భారీ లాటరీలో 26590 నంబర్ టికెట్ గెలుపొందింది. లాటరీలో విజేతల ఎంపిక కార్యక్రమాన్ని ఆదివారం ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఎల్ గొర్డోగా పిలిచే ఈ లాటరీలో 26590 టికెట్ నంబర్ కలిగిన వారందరికీ రూ. 3 కోట్లు చొప్పున లభించనున్నాయి. విజేతలు దాదాపు రూ. 60 లక్షలు పన్నుల రూపంలో చెల్లించాలి. ఈ లాటరీ మొత్తం విలువ రూ. 17 వేల కోట్లు. లాటరీ మొత్తంపరంగా చూస్తే ప్రపంచంలో ఇదే అత్యంత విలువైనది. ఈ లాటరీని 1763లో కింగ్ కార్లోస్–3 ప్రారంభించారు. ఇందులో వచ్చే డబ్బును కొందరు దానధర్మాలకు కూడా వినియోగిస్తారు. ఏటా డిసెంబర్ 22వ తేదీన ఈ లాటరీ డ్రా తీస్తారు. -
బిగ్ బాస్-11 విజేత.. శిల్పా షిండే
సాక్షి, ముంబై : 105 రోజులు, 19 మంది అభ్యర్థులు, వివాదాలు-విమర్శలు.. ఇలా కొనసాగిన బిగ్‌బాస్ 11వ సీజన్ ముగిసింది. బుల్లితెర నటి శిల్పా షిండే(40) విజేతగా నిలిచారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ రియాలిటీ షో ఫైనల్ ఎపిసోడ్ ఆదివారం రాత్రి వేడుకగా జరిగింది. ఫైనల్లో మొత్తం శిల్ఫా షిండే, వికాస్ గుప్తా, హీనా ఖాన్, పునీష్ శర్మలు నిలిచారు. విజేతగా శిల్పా పేరు ప్రకటించటంతో ఒక్కసారిగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం బిగ్ బాస్ 11వ సీజన్ విజేత శిల్పా షిండేకు సల్మాన్ ట్రోఫీ అందించాడు. నిజానికి ఫైనల్లో నటి హీనాఖాన్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ, గత కొన్ని ఎపిసోడ్లుగా హీనా ప్రవర్తన సరిగ్గా లేకపోవటంతో విమర్శలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే మొదటి నుంచి షోలో మంచి ఫెర్ఫార్మెన్స్ కనబరుస్తున్న శిల్పాను అభిమానులు తమ ఓట్లతో గెలిపించారు. హీనా రన్నరప్ తో సరిపెట్టుకుంది. చివరి ఎపిసోడ్లో మరో బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ అతిథిగా విచ్చేసి ఎపిసోడ్‌కు అదనపు ఆకర్షణగా నిలిచారు. అభ్యర్థులందరి రాక.. వారి స్టేజ్ ఫెర్ ఫార్మెన్స్‌లు, చివరికి సల్మాన్ చిందులతో కార్యక్రమం తారాస్థాయికి చేరింది. యూట్యూబ్ సింగింగ్ సెన్సేషన్ ఢించక్ పూజతో కలిసి సల్మాన్-అక్కీలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక 40 ఏళ్ల శిల్పా షిండే 1999లో బుల్లితెరకు పరిచయం అయ్యారు. స్టార్ ఫ్లస్‌లో వచ్చిన సోప్ ఒపేరా భాభి సీరియల్లో నెగటివ్ రోల్‌తో ఆమె ఆకట్టుకున్నారు. సంజీవని, అమ్రపాలి సీరియళ్లతో మంచి పేరు సంపాదించుకున్న శిల్పా బిగ్ బాస్ విజేతగా నిలిచి ట్రోఫీతోపాటు శిల్పా 44లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నారు. షో వివరాలు... మహారాష్ట్రలోని లోనావాలో 19,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో బిగ్‌బాస్ హౌస్‌ను ఏర్పాటు చేసి చుట్టూ 90 కెమెరాలు అమర్చారు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ షో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. -
సాక్షి ఇండియా స్పెల్‌బీ కేటగిరి–1 విజేతలు వీరే
హైదరాబాద్: ‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సాక్షి ఇండియా స్పెల్ బీ–2016 (కేటగిరీ–1, తెలంగాణ రాష్టం) విజేతలను ప్రకటించారు. వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగాయి. చివరగా నిర్వహించిన ఫైనల్స్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సాక్షి ఇండియా స్పెల్‌బీ సీఈవో శంకర్‌నారాయణ, బీ మాస్టర్ విక్రమ్ బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విజేతలు, వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషపై అంతర్గతంగా ఉన్న భయాలు పోగొట్టి, వారికి ఇంగ్లిష్‌లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు గొప్ప ఆత్మ విశ్వాసాన్ని ఈ పోటీలు కలిగించాయని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. విజేతలు వీరే: ‘సాక్షి’ ఇండియా స్పెల్‌బీ పోటీల్లో ప్రథమ బహుమతిని హైదరాబాద్ క్యూట్ ఐలాండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతువున్న అక్షత్నాయక్ కైవసం చేసుకున్నారు. అక్షత్‌కు బంగారు పతకంతో పాటు రూ.15 వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ ప్యాక్ అందజేశారు. ⇔ ద్వితీయ బహుమతిని హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ స్కూల్లో చదువుతున్న అనిమేష్.పి సాధించారు. అనిమేష్‌కు రజత పతకంతో పాటు రూ.10 వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్ ప్యాక్ అందజేశారు. ⇔ తృతీయ బహుమతిని హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న నక్షత్ర శంకర్ సాధించారు. విజేతకు కాంస్య పతకంతో పాటు రూ.5 వేలు, సర్టిఫికెట్, డ్యూక్ గిఫ్ట్‌ప్యాక్ అందజేశారు.