హ్యాకథాన్ విజేతలను ప్రకటించిన ఆర్‌బీఐ
ఆర్థిక సేవల్లో మరింత భద్రతను పెంచడం, దివ్యాంగులు సులువుగా ఆర్థిక లావాదేవీలను వినియోగించేలా విభిన్న పరిష్కారాలు అందించిన కంపెనీలను భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మూడో హ్యాకథాన్ విజేతలుగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాకథాన్(Hackathon)లో పాల్గొనేందుకు మొత్తం 534 ప్రతిపాదనలు వచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది.
‘జీరో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్’, ‘బీయింగ్ దివ్యాంగ్ ఫ్రెండ్లీ’ థీమ్‌లతో గ్లోబల్ హ్యాకథాన్ మూడో ఎడిషన్‌ను ఆర్‌బీఐ ఇటీవల నిర్వహించింది. ఈ హ్యాక్‌థాన్‌కు వచ్చిన మొత్తం ప్రతిపాదనల్లో యునైటెడ్ స్టేట్స్(USA), యూకే, హాంకాంగ్, సింగపూర్, బ్రెజిల్, మొరాకోతో సహా దేశంలోని చాలా కంపెనీలు ప్రతిపాదనలు పంపించాయి. వీటిలో 28 సంస్థలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. వాటిని ఫైనల్ లిస్ట్ కోసం స్వతంత్ర జ్యూరీకి పంపించినట్లు పేర్కొంది. అందులో కింది కంపెనీలను విజేతలుగా నిలిచినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.
ఎఫ్‌పీఎల్ టెక్నాలజీస్
క్సాల్స్ టెక్నాలజీస్
ఎపిఫై టెక్నాలజీస్
న్యాప్ఐటీ సైబర్‌సెక్
హెచ్‌విజన్ ఇండియా
రూప్య దర్శిని
విస్‌ఆస్ట్
ఇదీ చదవండి: రత్నాభరణాలపై జీఎస్టీ తగ్గింపు?
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఆర్థిక మోసాలను కట్టడి చేయడంతోపాటు, దివ్యాంగులు సులభంగా వీటిని వినియోగించేలా ఈ కంపెనీలు పరిష్కారాలు అందించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుత నిబంధనలకు లోబడి ఈ కంపెనీల టెక్నాలజీలు పటిష్ఠ భద్రతతో, సులువుగా ఆర్థిక సేవలను అందుబాటులో ఉంచేందుకు దోహదం చేస్తాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment