rbi policy
-
దేశీయ, అంతర్జాతీయ అంశాలపై ఆర్బీఐ సమీక్ష
గువహటి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గువహటిలో జరిగిన 612వ సెంట్రల్ బోర్డ్ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించింది. కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన మొదటి బోర్డ్ సమావేశమిది. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ ఆరేళ్లు అందించిన విశేష సేవలను బోర్డ్ ప్రశంసించింది.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?‘ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితిని, అవుట్‌లుక్‌ను బోర్డ్ సమీక్షించింది. ఎంపిక చేసిన సెంట్రల్ బ్యాంక్ శాఖల కార్యకలాపాలతో పాటు దేశంలో ‘బ్యాంకింగ్ ధోరణి, పురోగతి–2023–24’పై ముసాయిదా నివేదికపై చర్చించింది’ అని ఆర్బీఐ ప్రకటన ఒకటి పేర్కొంది. సెంట్రల్ బోర్డు ఇతర డైరెక్టర్లు సతీష్ కె మరాఠే, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది, వేణు శ్రీనివాసన్, రవీంద్ర హెచ్ ధోలాకియాలు సమావేశానికి హాజరయ్యారు. డిప్యూటీ గవర్నర్లు మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు, టీ రబీ శంకర్, స్వామినాథన్ జే కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాల సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. -
తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!
దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న భారతీయ రిజర్వ్ బ్యాంకు సుదీర్ఘ ప్రయాణానికి సంబంధించి స్టార్ ఇండియా వెబ్ సిరీస్ రూపొందించనుంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్ ముందుంది. దేశ ఆర్థిక వృద్ధిలో ఆర్బీఐ పాత్ర కీలకం. 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆర్బీఐ ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. వీటికి సంబంధించిన అంశాలను స్టార్ ఇండియా వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించనుంది.1935లో ఏర్పాటైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ప్రస్థానాన్ని తెలియజేసేలా వెబ్ సిరీస్ రూపొందించాలని ప్రముఖ కంపెనీలకు జులైలో సెంట్రల్ బ్యాంక్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) కింద బిడ్ ఆఫర్ చేసింది. ఇందులో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ లిమిటెడ్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా వంటి సంస్థలు పాల్గొన్నాయి. వీటిలో జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా టెక్నికల్ ఎవాల్యుయేషన్ రౌండ్లో అర్హత సాధించలేదు. దాంతో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వయాకామ్ 18 చివరి రౌండ్లోకి ప్రవేశించాయి. తాజాగా ఈ బిడ్‌ను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గెలుచుకుంది. వెబ్ సిరీస్ నిర్మించడానికి స్టార్ ఇండియాకు రూ.6.5 కోట్లు టెండర్ లభించినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలుఆర్ఎఫ్పీ పత్రం ప్రకారం, ఆర్బీఐ 90 ఏళ్ల ప్రయాణాన్ని గుర్తు చేస్తూ జాతీయ టీవీ ఛానెళ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో ప్రసారమయ్యేలా దాదాపు 25-30 నిమిషాల నిడివితో ఐదు ఎపిసోడ్లు రూపొందించాలి. ఈ ఎపిసోడ్లు ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ బ్యాంక్ కీలక పాత్రను తెలియజేసేలా ఉండాలి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ పనితీరుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా ఉండాలి. ఆర్బీఐ కార్యకలాపాలు, విధానాలపై విశ్వాసం కలిగేలా రూపొందించాలి. -
వడ్డీరేట్లపై తేల్చి చెప్పిన ఆర్బీఐ!
వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే ఆలోచనేమీ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తేల్చి చెప్పారు. ఈ ఏడాది వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే రూమర్స్‌పై ఆయన స్పందించారు. ద్రవ్యోల్బణంను 4 శాతం దిగువకు తీసుకురావడంపై దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. రేట్ల తగ్గింపుపై చర్చ కూడా జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్‌లో ద్రవ్యోల్బణం 7.8 శాతానికి పెరిగిందన్నారు. క్రమంగా దాన్ని తగ్గించేందుకు నిత్యం ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎలాగైనా ఇన్ఫ్లోషన్ను 4 శాతం దిగువకు తీసుకువచ్చేలా పనిచేస్తున్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5గా నమోదుకావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 2024-25లో ద్రవ్యోల్బణం కొంత ఒడుదొడుకులకు లోనవుతుందని అంచనా వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ రానున్న ఏడాదిలో (2024-25)లో 7 శాతం వృద్ధిరేటును నమోదుచేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదీ చదవండి: రికార్డు స్ధాయి దిశగా ఫారెక్స్ నిల్వలు ఇటీవలి కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, భారత ఆర్థిక వ్యవస్థకు మధ్య, దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రతికూల అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో కూడా మనదేశ వృద్ధి మెరుగ్గా ఉందని, స్థిరత్వం కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. -
పక్షి కన్ను చూస్తున్న అర్జునుడి పాత్రలో ఆర్బీఐ: దాస్
దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరుగుతోంది. నిత్యావసర వస్తువులు మరింత ప్రియంగా మారుతున్నాయి. దానికితోడు అంతర్జాతీయ యుద్ధాలతో దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందేమోనని ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఫిక్కీ సమావేశంలో మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతం లేదా అంతకంటే తగ్గించాలనే లక్ష్యంతో ఆర్బీఐ పనిచేస్తోందని ఆయన అన్నారు. ద్రోణాచార్యుడి పరీక్షలో చెట్టుపై ఉన్న పక్షి కన్నును చూస్తున్న అర్జునుడితో ఆర్బీఐ పనితీరును పోల్చారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. భౌగోళిక రాజకీయ సవాళ్ల మధ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు కొత్త నిబంధనలు తీసుకొచ్చిన నేపథ్యంలో వాటి పనితీరును ఉద్దేశించి ‘సుదీర్ఘ ఆట ఆడండి. రాహుల్ ద్రావిడ్ లాగా ఆడండి’ అని అన్నారు. తాను ఇటీవల ఓ విమానాశ్రయానికి వెళితే అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ బృందం ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు ప్రభావంపై ప్రశ్నలడిగినట్లు దాస్ ఫిక్కీ సమావేశంలో తెలిపారు. ప్రజలకు ఆర్థిక అంశాలపై ఎంతో అవగాహన ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. -
బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఫెడరల్ బ్యాంకుకు ఆర్బీఐ షాక్!
ముంబై: నియంత్రణపరమైన నిబంధనల అమలులో లోపాలు ఉన్నట్టు గుర్తించిన ఆర్బీఐ ఫెడరల్బ్యాంక్కు రూ.5.72 కోట్ల జరిమానా విధించింది. అలాగే, కేవైసీ నిబంధనలు కొన్ని పాటించనందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.70 లక్షల జరిమానాను విధిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. బీమా బ్రోకింగ్, కార్పొరేట్ ఏజెన్సీ సర్వీసెస్ కోసం ఉద్యోగులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా నిబంధనలను అమలు చేయడంలో ఫెడరల్ బ్యాంక్ విఫలమైనట్టు ఆర్బీఐ తెలిపింది. కేవైసీ నిబంధనలను అమలు చేయనందుకు గురుగ్రామ్‌కు చెందిన ధనిలోన్స్ అండ్ సర్వీసెస్‌కు సైతం ఆర్బీఐ 7.6 లక్షల జరిమానా విధించింది. -
ఆర్బీఐ కీలక నిర్ణయం, ఆశ్చర్యపోయిన నిర్మలా సీతారామన్!
ముంబై: పాలసీ రేట్లను పెంచాలన్న ఆర్బీఐ నిర్ణయం కన్నా..అందుకోసం ఎంచుకున్న సమయమే ఆశ్చర్యపర్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వడ్డీ రేట్ల పెంపు వల్ల నిధుల సమీకరణ వ్యయాలు పెరిగినా.. ప్రభుత్వం తలపెట్టిన ఇన్ఫ్రా పెట్టుబడుల ప్రణాళికలపై ఎటువంటి ప్రభావం ఉండబోదని ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచిన తర్వాత తొలిసారిగా స్పందించిన మంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘ఆర్బీఐ రేట్లను పెంచుతుంది అన్నది అందరూ ఊహిస్తున్నదే. కాకపోతే అందుకోసం ఎంచుకున్న సమయమే ఆశ్చర్యపర్చింది. రెండు ఎంపీసీ (ద్రవ్య పరపతి విధాన కమిటీ) సమావేశాలకు మధ్య ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యపర్చింది‘ అని ఆమె తెలిపారు. రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ గత ఎంపీసీ సమావేశంలోనే సంకేతాలు ఇచ్చిందని, అంతర్జాతీయంగా ఇతర ప్రధాన సెంట్రల్ బ్యాంకుల తీసుకుంటున్న చర్యల్లో ఇది కూడా భాగమని మంత్రి వివరించారు. ‘ఇటీవలి కాలంలో సెంట్రల్ బ్యాంకుల మధ్య అవగాహన మరింతగా పెరిగింది. ఒక రకంగా అవన్నీ ఒకదానితో మరొకటి కలిసికట్టుగా పని చేస్తున్నాయి. ఆస్ట్రేలియా వడ్డీ రేట్లు పెంచింది. ఆర్బీఐ పెంచిన రోజు రాత్రే అమెరికా కూడా పెంచింది. అయితే, మహమ్మారి ప్రభావం నుంచి కోలుకునే ప్రక్రియను ఎలా నిర్వహించాలన్న అంశం అర్థం కావడం లేదు. ఈ సమస్య కేవలం భారత్‌కు మాత్రమే ప్రత్యేకం కాదు. అంతర్జాతీయంగా అన్ని చోట్లా ఇలాగే ఉంది‘ అని ఆమె చెప్పారు. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ తొలిసారిగా ఈ ఏడాది మే 4న పాలసీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని 50 బేసిస్ పాయింట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే. దీనితో రెపో రేటు (బ్యాంకులకు తాను ఇచ్చే నిధులపై ఆర్బీఐ విధించే వడ్డీ రేటు) 4.40 శాతానికి చేరింది. -
భారత్ ఎకానమీ వృద్ధి 18.5 శాతం!
ముంబై: భారత్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో 18.5 శాతం వృద్ధి సాధిస్తుందని ఎస్బీఐ రిసెర్చ్ రిపోర్ట్– ఎకోరాప్ అంచనావేసింది. అయితే దీనికి ప్రధాన కారణం బేస్ ఎఫెక్ట్ అని (2020 ఇదే కాలంలో 24 శాతంపైగా క్షీణత) కూడా నివేదిక పేర్కొనడం గమనార్హం. ఈ నెలాఖరున మొదటి త్రైమాసికం జీడీపీ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎకోరాప్ తన తాజా అంచనాలను తెలిపింది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►పరిశ్రమలు, సేవల రంగాల క్రియాశీలత, అంత ర్జాతీయ ఆర్థిక పరిస్థితులుసహా 41 కీలక రంగా లు ప్రాతిపదికగా రూపొందించిన ‘నౌకాస్టింగ్ నమూనా’ ప్రాతిపదికన ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ భారత్ ఎకానమీ తాజా అంచనాలను వెలువరించింది. ►తుది ప్రొడక్ట్‌తో సంబంధం లేకుండా ఉత్పత్తి స్థాయి వరకూ పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ) ప్రకారం వృద్ధి రేటు క్యూ1లో 15 శాతంగా ఉంటుంది. ►మొదటి త్రైమాసికంలో కార్పొరేట్ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. స్థూల ఆదాయాల్లో మంచి రికవరీ కనిపించింది. ►4,069 కంపెనీలను చూస్తే, క్యూ1లో జీవీఏ వృద్ధి 28.4 శాతంగా ఉంది. అయితే 2020–21 చివరి త్రైమాసికం (2021 జనవరి–మార్చి) కన్నా ఈ వృద్ధి రేటు తక్కువ. ►కరోనా సెకండ్‌వేవ్‌తో ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ప్రతికూలతలకు గురయిన ఆర్థిక వ్యవస్థ జూన్‌లో పుంజుకుంది. ►బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఆగస్టు 16తో ముగిసిన వారంలో 103.3 వద్ద ఉంది. ►ప్రాంతీయ రవాణా కార్యాలయాల ఆదాయాలు, విద్యుత్ వినియోగం, రవాణా ఇండికేటర్లు రెండవ త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ►కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో కుటుంబాలపై రుణ భారాలు తీవ్రమయ్యాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కుటుంబాల రుణ భారం 32.5 శాతం అయితే, ఇది తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో 37.3 శాతానికి పెరిగింది. నిజానికి దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టిన తర్వాత జీడీపీలో కుటుంబ రుణ భారాలు పెరుగుతూ వస్తుండడం గమనార్హం. 2017– 18లో ఇది 30.1 శాతంగా ఉంది. తరువాతి రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 31.7 శాతం, 32.5 శాతంగా నమోదయ్యాయి. అంటే నాలుగేళ్లలో పెరిగిన రుణ భారం 7.2 శాతం. ►2020 లాక్డౌన్ ప్రారంభంలో వ్యయాలు ఏవీ లేక అన్ని వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు భారీ గా పెరిగాయి. అయితే పండుగల కాలంలో క్రమంగా తగ్గాయి. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. ►2021–22 మొదటి త్రైమాసికంపై ఆర్బీఐ అంచనా 21.4 శాతంకాగా, ఇక్రా అంచనా 20 శాతంగా ఉంది. చదవండి : ఎలక్ట్రిక్ వాహనాలకు మద్దతుగా నిలవాలి -
డీసీబీ బ్యాంకులోనూ ఇకపై ప్రభుత్వ లావాదేవీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ లావాదేవీల నిర్వహణకు (వ్యాపారం) ఆర్బీఐ నుంచి ఆమోదం లభించినట్టు డీసీబీ బ్యాంకు ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి చెల్లింపులు, బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణకు వీలుగా డీసీబీ బ్యాంకును ఏజెన్సీ బ్యాంకుగా నియమించినట్టు తెలిపింది. ప్రైవేటురంగ బ్యాంకులనూ ప్రభుత్వ లావాదేవీల నిర్వహణకు అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఏడాది మే నెలలో నిర్ణయాన్ని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అందులో భాగంగానే డీసీబీ బ్యాంకుకు ఈ ఆమోదం లభించింది. -
ఆర్బీఐ ఎఫెక్ట్- 38,000కు సెన్సెక్స్
పలువురి అంచనాలను నిజం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ యథాతథ పాలసీ అమలుకే కట్టుబడిన నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 350 పాయింట్లు ఎగసి 38,013 కు చేరగా.. నిఫ్టీ 86 పాయింట్లు బలపడి 11,188 వద్ద ట్రేడవుతోంది. వెరసి సెన్సెక్స్ మరోసారి 38,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. కోవిడ్-19 కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా అవసరమైతే తగిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తాజాగా పేర్కొన్నారు. దీంతో మార్కెట్లకు జోష్ వచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆటో డీలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, ఫార్మా, ఐటీ, మెటల్ రంగాలు 1 శాతం స్థాయిలో లాభపడ్డాయి. అయితే ఆటో, బ్యాంకింగ్ రంగాలు నామమాత్ర నష్టాలతో కదులుతున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, గెయిల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, సిప్లా, గ్రాసిమ్, హెచ్‌యూఎల్ 3.3-1.4 శాతం మధ్య బలపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఐషర్, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ 1-0.5 శాతం మధ్య డీలా పడ్డాయి. ఫార్మా జోరు ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో టాటా కన్జూమర్, నిట్ టెక్, ఆర్ఈసీ, అపోలో హాస్పిటల్స్, అరబిందో, టొరంట్ ఫార్మా, గ్లెన్‌మార్క్, దివీస్ 5.5-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే బాటా, ఎస్కార్ట్స్, భెల్, మ్యాక్స్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, ఐజీఎల్, ఇండిగో, పేజ్, ఎంజీఎల్, నౌకరీ 3.7-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున బలపడ్డాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1459 లాభపడగా.. 910 మాత్రమే నష్టాలతో కదులుతున్నాయి. -
పెట్రో షాక్, ఆర్బీఐ రివ్యూ : 35వేల కిందికి సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం నాటి భారీ పతనంనుంచి ఎక్కడా కోలుకున్న లక్షణాలు కనిపించ లేదు. సెన్సెక్స్ దాదాపు 300పాయింట్లు పతనమై 35వేల కిందికి దిగజారింది. ప్రస్తుతం సెన్సెక్స్ 218 పాయింట్లు క్షీణించి 34,950 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు కోల్పోయి 10,491వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రధానంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఓఎన్జీసీ, గెయిల్, రిలయన్స్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ, కోల్ ఇండియా ఎంఆర్‌పిఎల్ ఇలా అన్నీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. వీటితోపాటు ఐటీసీ, బజాజ్ ఆటో, అదానీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. మరోవైపు ఎస్‌బ్యాంకు, టాటా స్టీల్, హీరో మోటో, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, భారతి ఎయిర్టెల్ లాభపడుతున్నాయి. ఆర్బీఐ పాలసీ రివ్యూపై ఇన్వెస్టర్లు ప్రధానంగా వేచి చూస్తున్నారు. అటు దేశీయ కరెన్సీ రూపాయి బలహీనత కొనసాగుతోంది. డాలరు మారకంలో నిన్నటి ముగింపుతో పోలిస్తే శుక్రవారం రూపాయి 22 పైసలు నష్టపోయి 73.56 వద్ద వుంది. -
వడ్డీరేట్లు పైపైకే..?
న్యూఢిల్లీ: ఆహార వస్తువులు, ఇతరత్రా నిత్యావసరాల ధరలు చుక్కలు చూపుతున్న తరుణంలో... రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఏంచేస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. నేడు(బుధవారం) చేపట్టనున్న మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్షలో ధరల కట్టడిపైనే ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పూర్తిగా దృష్టిపెట్టే అవకాశం ఉందని నిపుణులు అం టున్నారు. పాలసీ వడ్డీరేట్లు మరోవిడత పెంచడం ఖాయమనేది వారి అభిప్రాయం. ఇదే జరిగితే ఆర్బీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి రాజన్ వరుసగా మూడోవిడత రేట్లను పెంచినట్లవుతుంది. సెప్టెంబర్, అక్టోబర్ సమీక్షల్లో పావు శాతం చొప్పున రెపో రేటును పెంచడం తెలిసిందే. ధరల పెరుగుదల ఒత్తిడి అంతకంతకూ తీవ్రతరమవుతుండటంతో నేటి పాలసీ సమీక్షలో మరో పావు శాతం రెపో పెంపు తప్పకపోవచ్చని క్రిసిల్ పేర్కొంది. ప్రస్తుతం రెపో రేటు 7.75%, రివర్స్ రెపో 6.75%, నగదు నిల్వల నిష్పతి(సీఆర్ఆర్) 4% చొప్పున కొనసాగుతున్నాయి. వణికిస్తున్న ధరలు... నవంబర్ నెలలో టోకు ధరల సూచీ(డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ఏకంగా 14 నెలల గరిష్టానికి(7.52%) ఎగబాకడం తెలిసిందే. ప్రధానంగా ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఇతరత్రా కూరగాయల రేట్లు దూసుకెళ్లడమే దీనికి ప్రధాన కారణంగా నిలిచింది. ఇదే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 9 నెలల గరిష్టమైన 11.24 శాతానికి ఎగబాకింది. ఇదిలాఉండగా... పారిశ్రామిక రంగం మాత్రం కుదేలవుతోంది. అక్టోబర్ నెలలో పారిశ్రామికోత్పత్తి ఉత్పాదకత తిరోగమనంలోకి జారిపోయి మైనస్ 1.8% క్షీణించింది. దీనంతటికీ అధిక వడ్డీరేట్ల భారమే కారణమని, ఇప్పటికైనా ఆర్బీఐ రేట్లను తగ్గించి ఉపశమనం కల్పించాలంటూ కార్పొరేట్ వర్గాలు లబోదిబోమంటున్నాయి. అయితే, పరిశ్రమలు అల్లాడుతున్నా.. ఆర్బీఐ మాత్రం ప్రస్తుతానికి ధరలకు కళ్లెం వేసేందుకే మొగ్గుచూపుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంటోంది. అర శాతం పెంపునకూ అవకాశం...! బ్యాంకింగ్ వర్గాల్లో సైతం మెజారిటీ అభిప్రాయం రేట్ల పెంపు ఖామమనే వ్యక్తమవుతోంది. పావు శాతం పాలసీ రేట్ల పెంపునకు అత్యధికంగా అవకాశాలున్నాయని.. అయితే, అర శాతం పెంపునూ కొట్టిపారేయలేమని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ సౌగత భట్టాచార్య పేర్కొన్నారు. కాగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) సీఎండీ ఎం. నరేంద్ర మాత్రం ఆర్బీఐ ప్రస్తుత పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని అంచనా వేస్తున్నారు. హెచ్ఎస్బీసీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ సైతం పావు శాతం రెపో రేటు పెంపు ఉంటుందని పేర్కొన్నాయి.