గువహటి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గువహటిలో జరిగిన 612వ సెంట్రల్ బోర్డ్ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించింది. కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో జరిగిన మొదటి బోర్డ్ సమావేశమిది. సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత్ దాస్ ఆరేళ్లు అందించిన విశేష సేవలను బోర్డ్ ప్రశంసించింది.
ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై పన్ను మినహాయించేనా?
‘ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితిని, అవుట్‌లుక్‌ను బోర్డ్ సమీక్షించింది. ఎంపిక చేసిన సెంట్రల్ బ్యాంక్ శాఖల కార్యకలాపాలతో పాటు దేశంలో ‘బ్యాంకింగ్ ధోరణి, పురోగతి–2023–24’పై ముసాయిదా నివేదికపై చర్చించింది’ అని ఆర్‌బీఐ ప్రకటన ఒకటి పేర్కొంది. సెంట్రల్ బోర్డు ఇతర డైరెక్టర్లు సతీష్ కె మరాఠే, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది, వేణు శ్రీనివాసన్, రవీంద్ర హెచ్ ధోలాకియాలు సమావేశానికి హాజరయ్యారు. డిప్యూటీ గవర్నర్లు మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు, టీ రబీ శంకర్, స్వామినాథన్ జే కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి నాగరాజు మద్దిరాల సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment