rbi governor
-
త్వరలో ఆర్బీఐ కొత్త మొబైల్ యాప్.. ఎందుకంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కొత్తగా ఓ మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ యాప్‌తో ప్రభుత్వ బాండ్లు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం మరింత సులువు కానున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్‌ను 2021 నవంబర్‌లో ప్రారంభించింది. ఆర్బీఐ డైరెక్ట్ పోర్టల్ ద్వారా ప్రస్తుతం ప్రైమరీ, సెకండరీ మార్కెట్ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయొచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు వేలంలో ఈ సెక్యూరిటీలను అమ్మడం/ కొనడం చేసే వీలుంది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడులను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో రిటైల్ డైరెక్ట్ పోర్టల్‌కు సంబంధించిన మొబైల్ యాప్‌ను తీసుకురానున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఇదీ చదవండి: హోమ్ రోబోటిక్స్ విభాగంలోకి ప్రపంచ నం.1 కంపెనీ..? ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలను తెలియజేసే క్రమంలో యాప్‌కు సంబంధించిన అంశాన్ని దాస్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాప్ సిద్ధమవుతోందని, త్వరలోనే అందుబాటులోకి రానుందని చెప్పారు. ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ నుంచి రూ.14.13 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో తొలి అర్ధభాగంలోనే రూ.7.5 లక్షల కోట్లు సేకరించాలనుకుంటోంది. -
వడ్డీరేట్లపై తేల్చి చెప్పిన ఆర్బీఐ!
వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించే ఆలోచనేమీ లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తేల్చి చెప్పారు. ఈ ఏడాది వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే రూమర్స్‌పై ఆయన స్పందించారు. ద్రవ్యోల్బణంను 4 శాతం దిగువకు తీసుకురావడంపై దృష్టిసారిస్తున్నట్లు చెప్పారు. రేట్ల తగ్గింపుపై చర్చ కూడా జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్‌లో ద్రవ్యోల్బణం 7.8 శాతానికి పెరిగిందన్నారు. క్రమంగా దాన్ని తగ్గించేందుకు నిత్యం ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎలాగైనా ఇన్ఫ్లోషన్ను 4 శాతం దిగువకు తీసుకువచ్చేలా పనిచేస్తున్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5గా నమోదుకావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే 2024-25లో ద్రవ్యోల్బణం కొంత ఒడుదొడుకులకు లోనవుతుందని అంచనా వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ రానున్న ఏడాదిలో (2024-25)లో 7 శాతం వృద్ధిరేటును నమోదుచేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదీ చదవండి: రికార్డు స్ధాయి దిశగా ఫారెక్స్ నిల్వలు ఇటీవలి కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని, భారత ఆర్థిక వ్యవస్థకు మధ్య, దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రతికూల అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో కూడా మనదేశ వృద్ధి మెరుగ్గా ఉందని, స్థిరత్వం కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. -
పక్షి కన్ను చూస్తున్న అర్జునుడి పాత్రలో ఆర్బీఐ: దాస్
దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరుగుతోంది. నిత్యావసర వస్తువులు మరింత ప్రియంగా మారుతున్నాయి. దానికితోడు అంతర్జాతీయ యుద్ధాలతో దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందేమోనని ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఫిక్కీ సమావేశంలో మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతం లేదా అంతకంటే తగ్గించాలనే లక్ష్యంతో ఆర్బీఐ పనిచేస్తోందని ఆయన అన్నారు. ద్రోణాచార్యుడి పరీక్షలో చెట్టుపై ఉన్న పక్షి కన్నును చూస్తున్న అర్జునుడితో ఆర్బీఐ పనితీరును పోల్చారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. భౌగోళిక రాజకీయ సవాళ్ల మధ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు కొత్త నిబంధనలు తీసుకొచ్చిన నేపథ్యంలో వాటి పనితీరును ఉద్దేశించి ‘సుదీర్ఘ ఆట ఆడండి. రాహుల్ ద్రావిడ్ లాగా ఆడండి’ అని అన్నారు. తాను ఇటీవల ఓ విమానాశ్రయానికి వెళితే అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ బృందం ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు ప్రభావంపై ప్రశ్నలడిగినట్లు దాస్ ఫిక్కీ సమావేశంలో తెలిపారు. ప్రజలకు ఆర్థిక అంశాలపై ఎంతో అవగాహన ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. -
బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్బీఐ ఆదేశాలు
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు సంబంధించి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలను విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఆర్బీఐ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) గవర్నెన్స్ నియంత్రణలకు సంబంధించిన మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. రిస్క్ మేనేజ్మెంట్, రిసోర్స్ మేనేజ్మెంట్, పనితీరు నిర్వహణ వంటి కీలకమైన అంశాల్లో ఐటీ గవర్నెన్స్ పాత్ర కీలకం. ఐటీ గవర్నెన్స్‌కు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ ఆదేశాల ప్రకారం.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఐటీ కార్యాకలాపాల్లో ఎలాంటి అవరోధం రాకుండా ఉండేందుకు పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన సమగ్ర ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేసుకోవాలి. డేటా మార్పులున్నపుడు మైగ్రేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకమైన డాక్యుమెంట్ పాలసీని కలిగి ఉండాలి. సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేసే ప్రతి ఐటీ అప్లికేషన్ ఆడిట్ ట్రయల్స్, ఆడిట్‌ను అందించాలి. క్రిప్టోగ్రాఫిక్ నియంత్రణలపై ట్రాన్స్మిషన్ ఛానెల్‌లలో ఉపయోగించే అల్గారిథమ్‌లు, ప్రోటోకాల్‌లు పకడ్బందీగా ఉండాలని పేర్కొంది. -
డిపాజిటర్ల సొమ్ము: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం బ్యాంకుల ప్రధానవిధి అని రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బ్యాంకులో వారి సొమ్మను కాపాడటం అనేది అది పవిత్రమైన విధి, మన కిష్ట దైవాన్ని సందర్శించడం కంటే చాలా ముఖ్యమైనదని ఆర్బిఐ గవర్నర్ వెల్లడించారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ చిన్న పొదుపుదారులు, మధ్యతరగతి, పదవీ విరమణ చేసిన వారి డిపాజిట్లపై ఆధారపడినందున ఇది చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల (యుసిబి) డైరెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించిన శక్తి కాంత దాస్ బ్యాంకుల బాధ్యతను గుర్తు చేశారు. అయితే ఆగస్టు 30న గవర్నర్ ప్రసంగం చేయగా, ఆ వీడియోను ఆర్బీఐ సోమవారం యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ బ్యాంకు అతి ముఖ్యమైన బాధ్యత. ఇది పవిత్రమైన విధి. గుడి , మసీదు, గురుద్వారా మరే ఇతర మతపరమైన పవిత్ర ప్రదేశానికి వెళ్లి నమస్కరించడం లాంటివాటి కంటే కూడా పవిత్రమైందని తాను నమ్ముతానని చెప్పారు. అఆగే డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందా అనేది పర్యవేక్షిస్తూ, బ్యాంకులతో కలిసి పనిచేయడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యతఅని, దీనికి సంబంధించి ఎప్పటికపుడు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండాలని, ఈ రంగంలో యూసీబీలు ముఖ్యమైన భాగమని కూడా ఆయన గుర్తు చేశారు. ముఖం్యంగా సహకార బ్యాంకింగ్ స్థలంలో, ఎంటిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, డిపాజిటర్ సొమ్ము నిలిచిపోయిన సందర్భాలు ఎ క్కువవుతున్న తరుణంలో గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
మరోసారి వడ్డీరేట్లు పెంచిన RBI
-
ఆ పని చేయండంటున్న స్వర్ణ పతక వీరుడు నీరజ్ చౌప్రా
సుదీర్ఘ కాలం తరువాత ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి జావలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కంగారు పడకండి . నీరజ్ చోప్రో ఏంటీ? ప్రజలకు వార్నింగ్ ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. ట్రాన్సాక్షన్ల పేరుతో సైబర్ నేరగాళ్లు బాధితులకు పెద్ద ఎత్తున కుచ్చిటోపీ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కొత్త క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. ఒలింపిక్ వీరుడు నీరజ్ చోప్రోతో కలిసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై అవగాహన పెంచేందుక ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. .@RBI Kehta Hai... Along with @Neeraj_chopra1 A little caution takes care of a lot of trouble. Never respond to requests to share PIN, OTP or bank account details. Block your card if stolen, lost or compromised.#rbikehtahai #StaySafe #BeAware #BeSecure #Tokyo2020 pic.twitter.com/v9aeOG7ZMP — RBI Says (@RBIsays) August 10, 2021 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటూ నీరజ్ చోప్రో వీడియోలో మాట్లాడారు. అంతేకాదు పిన్, ఓటీపీ, బ్యాంక్ అకౌంట్లను జాగ్రత్త ఉంచుకోవాలని కోరారు. ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని ఏటీఎం,క్రెడిట్ కార్డ్ల్‌లను పోగొట్టుకుంటే వెంటనే బ్లాక్ చేయాలని కోరుతూ ముగించాడు. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లతో పాటు మిగిలిన బ్యాంక్‌లు ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల గురించి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. -
క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ విలువ రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ(భారత్)లో ఆర్థిక స్థిరత్వాన్ని క్రిప్టో కరెన్సీలు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని ఆర్బిఐ ఆందోళన చెందుతోంది అని అన్నారు. ఈ విషయాన్నీ ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించి, ప్రభుత్వమే అధికారికంగా డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీల ద్వారా మోసానికి పాల్పడుతున్నారని తెలిసిన తర్వాత 2018లో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ వినియోగం శ్రేయస్కరం కాదని భావించిన ఆర్బీఐ వాటిని నిషేధించింది. కానీ, క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీల పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఆర్బీఐ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు 2020లో కొట్టివేసింది. ప్రైవేటు క్రిప్టో కరెన్సీకి ముకుతాడు వేసి, దేశంలో సొంతంగా డిజిటల్ కరెన్సీని తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం వాటికి సంబంధించిన బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమయ్యింది. ఇప్పటికే చైనాలో ఉన్న ఎలక్ట్రానిక్ యువాన్‌తో పాటు డిజిటల్ కరెన్సీ ఉన్న ఇతర దేశాల జాబితాలో భారత్ చేరనున్నట్లు తెలిపారు. దీనికి కావాల్సిన సాంకేతికపై పనిచేతున్నట్లు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలోన్ మస్క్ ఇటీవలి ట్వీట్లలో బిట్ కాయిన్ ధరలు "అధికంగా కనిపిస్తున్నాయి" అని చెప్పారు. దీనితో ఒక్కసారిగా టెస్లా షేర్ ధరలు విపరీతంగా పడిపోయాయి. ఒక్కరోజులో ఎలోన్ మస్క్ 15.2 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: ఒక్క ట్వీట్‌తో లక్ష కోట్ల నష్టం..! ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ -
మారటోరియంతో మీకేంటి లాభం...?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మరో మూడు నెలల పాటు మారటోరియంను పొడిగించింది. శుక్రవారం ఉదయం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..లోన్ ఈఎంఐలపై మరో మూడు నెలలు అంటే ఆగస్టు 31 వరకు మారటోరియాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. లాక్ డౌన్ కారణంగా మార్చి1వ తేదీ నుంచి మే 31 వరకు మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పొడిగించిన తాజా మారటోరియంతో మొత్తం లోన్ల ఈఎంఐలపై ఆరు నెలలపాటు మారటోరియం లభించింది. దీనిప్రకారం టర్మ్‌లోన్లపై ఈఎంఐ (వాయిదాలు) కట్టాల్సిన వారు ఆగస్టు 31 వరకు ఈఎంఐలు చెల్లించనవసరం లేదు. తాజా మారటోరియంతో కార్‌లోన్స్, గృహ రుణాలు వంటివి తీసుకున్నవారికి కొంత వెసులుబాటు లభిస్తుంది. లాక్డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయిన వారు ఈ మారటోరియం ఉపయోగించుకోవడం వల్ల ఆర్థిక ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రమ పద్ధతిలో వాయిదా చెల్లించాల్సిందే. ఒక వేళ ఏదైనా కారణంతో వాయిదా చెల్లింపు జరగకపోతే సదరు ఖాతాదారుపై బ్యాంక్‌లు,రుణదాతలు చర్యలు చేపడతాయి. అంతేగాక ఖాతాదారు, క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో బ్యాంకులు అందించే రుణసదుపాయాలు పొందలేరు. అందువల్ల మారటోరియం ఇటువంటి వారికి ఎంతో ఉపకరిస్తుంది. ఇటువంటి వారు మారటోరియం తీసుకుంటే పై సమస్యలేవీ ఎదుర్కొనే అవసరం ఉండదు. బుల్లెట్ రిపేమెంట్స్, ఈక్వెటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, క్రెడిట్ కార్డ్ డ్యూలు వంటి వాటిపై తాజాగా పొడిగించిన మారటోరియం తీసుకోవచ్చు. వడ్డీమాత్రం తప్పదు.. మారటోరియంలో ఈఎంఐలు చెల్లించకపోయినప్పుడు ఆ నెల ఈఎంఐలో కట్టాల్సిన వడ్డీ మాత్రం తరువాతి నెలలో మొత్తం రుణంపై పడుతుంది. అంటే మనం మారటోరియం తీసుకున్న సదరు నెలల్లో ప్రతినెలా ప్రిన్స్‌పల్ మొత్తంపై వడ్డీ పడుతుంది.తద్వారా మారటోరియం కాలపరిమితి ముగిసాక చెల్లించే ఈఎంఐలో ఈ వడ్డీ అదనంగా చేరుతుంది. అందువల్ల అత్యవసరమైతే తప్ప, మారటోరియం తీసుకోవాలేగానీ, నగదు ఉన్న వారు, ఆర్థిక ఇబ్బందులు లేనివారు ఈఎంఐలు చెల్లించడమే మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ వెసులుబాటులేని వారు మారటోరియం తీసుకుని క్రెడిట్,సిబిల్ స్కోరులను కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. -
ఆర్బిఐ గవర్నర్‌కు సమాచార కమిషన్ షోకాజ్ నోటీసు
-
ఎక్కడి ‘రేట్లు’ అక్కడే..!
ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో నిర్ణయం రెపో రేటు 6.75 శాతం, రివర్స్ రెపో 5.75 శాతం, సీఆర్ఆర్ 4 శాతంగా కొనసాగింపు ద్రవ్యోల్బణం పెరుగుదల అంచనాలే కారణం... అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు కూడా.. ముంబై: ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈసారి అందరి అంచనాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నిర్వహించిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకుతుండటం.. ఈ నెలలో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలో దశాబ్దకాలం తర్వాత వడ్డీరేట్లను పెంచవచ్చన్న వాదనలు బలపడుతుండటం ఆర్బీఐ తాజా నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. అయితే, పరిస్థితులనుబట్టి తగిన సమయంలో రేట్ల తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్నంతవరకూ తాము సరళ విధానాన్నే అనుసరిస్తామని గవర్నర్ రాజన్ చెప్పారు. అంతేకాకుండా.. ఆర్బీఐ ఇప్పటివరకూ అందించిన రెపో రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు ఇంకా పూర్తిగా తమ ఖాతాదారులకు బదలాయించాల్సి ఉందని కూడా ఆయన బ్యాంకర్లకు తేల్చిచెప్పారు. బ్యాంకుల వడ్డీరేట్ల మార్పులకు ప్రామాణికమైన రెపో రేటు 6.75 శాతంలో ఆర్బీఐ ఈసారి ఎలాంటీ మార్పూ చేయలేదు. దీంతో ముడిపడిన రివర్స్ రెపో రేటు ఇప్పుడ్నున్నట్లే 5.75 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతంగానే కొనసాగనుంది. ఈ ఏడాదిలో ఆర్బీఐ రెపో రేటును 1.25 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో జరిగిన సమీక్షలో అనూహ్యంగా అర శాతం రెపో కోతతో రాజన్ అందరినీ ఆశ్చర్యపరిచారు కూడా. ఇక ఫెడ్ పాలసీపైనే దృష్టి... ఆర్బీఐ తాజా సమీక్షలో తీసుకున్న నిర్ణయం సరైన దిశలోనే ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే, ఈ నెల 16న అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ఆధారంగానే వడ్డీరేట్లపై ఆర్బీఐ తదుపరి చర్యలు ఆధారపడిఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం, మెరుగైన ఉద్యోగ గణాంకాల నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్ల పెంపు మొదలవుతుందన్న వాదనలు బలంగా వినబడుతున్నాయి. దీంతో మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కివెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. మరోపక్క, అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి(5 శాతం) ఎగబాకిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం గణాంకాలను కూడా ఇకపై ఆర్బీఐ నిశితంగా గమనిస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు పెరగడం ఆర్బీఐని ఆందోళనకు గురిచేస్తోందనేది వారి అభిప్రాయం. పాలసీలో ఇతర ముఖ్యాంశాలు... ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.4 శాతంగా ఉండొచ్చు. వ్యవసాయ రంగంలో మందగమన ధోరణి ఉంది. రుతుపవన వర్షపాతంలో కొరత కారణంగా ఖరీఫ్, రబీ దిగుబడి అంచనాలపై ప్రభావం ఉంటుంది. రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది జనవరినాటికి 6 శాతంగా, 2017 జనవరినాటికి 5 శాతంగా ఉండొచ్చు. గత రెండు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది(అక్టోబర్‌లో 5 శాతం). బ్యాంకుల మొండిబకాయిల సమస్య తగ్గుముఖం పడితే తాజా రుణాలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. చిన్న మొత్తాల పొదుపు రేట్లను మార్కెట్ వడ్డీరేట్ల (డిపాజిట్ రేట్లు)తో అనుసంధానించడంపై సమాలోచనలు జరుగుతున్నాయి. తదుపరి పాలసీ సమీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న జరుగుతుంది. రుణ రేట్లు మరింత తగ్గాల్సిందే.. బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ రాజన్ స్పష్టీకరణ ఈ ఏడాదిలో ఆర్బీఐ రెపో రేటును 1.25 శాతం తగ్గిస్తే.. బ్యాంకులు మాత్రం ఇందులో సగాన్ని(0.6 శాతం) మాత్రమే బదలాయించాయని ఆర్బీఐ గవర్నర్ మరోసారి బ్యాంకర్లకు హెచ్చరిక స్వరాన్ని వినిపించారు. బ్యాంకులు తమ రుణ రేట్లను మరింత తగ్గించేందుకు ఆస్కారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో కొనసాగుతోందన్న స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయని కూడా రాజన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రికవరీ ఇంకా ప్రారంభస్థాయిలోనే ఉన్నందున.. ఈ ఏడాది తమ జీడీపీ అంచనా(7.4 శాతం)లో మార్పులు చేయడం లేదని రాజన్ చెప్పారు. తొలి త్రైమాసికంలో వృద్ధి 7 శాతంగా ఉంది. బ్యాంకుల మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యను తగ్గించేందుకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయని... 2017కల్లా బ్యాంకుల ఎన్పీఏలు దిగొచ్చేందుకు ఆస్కారం ఉందన్నారు. ఎన్పీఏల కట్టడికి బ్యాంకులకు మరిన్ని అధికారాలను ఇస్తున్న విషయాన్ని రాజన్ గుర్తు చేశారు. ఇక ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయడం ప్రభుత్వానికి కష్టతరమైన అంశమేనని, అయితే, అసాధ్యమేమీ కాదన్నారు. దీనివల్ల ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యానికి ఇబ్బందులేవీ ఉండబోవన్నారు. ఆదాయాలను పెంచుకోవడం లేదా, వ్యయాల కోత ద్వారా ఈ అదనపు వ్యయాన్ని ప్రభుత్వం సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని రాజన్ పేర్కొన్నారు. బ్యాంకర్ల ‘తగ్గింపు’ స్వరం... బేస్ రేటు లెక్కింపునకు కొత్త విధానం తీసుకొస్తుండటం... రెపో కోత ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదలాయించాల్సిందేనంటూ రాజన్ హెచ్చరికల నేపథ్యంలో బ్యాంకర్లు స్వరం మార్చారు. ఈ దిశగా అడుగులు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. రానున్న రోజుల్లో రుణ రేట్ల కోత ఉంటుందన్న సంకేతాలిచ్చారు. ఆర్బీఐ పాలసీ నిర్ణయం తమ అంచనాల మేరకే ఉందని పేర్కొన్నారు. తాజా పాలసీ నిర్ణయం, వ్యాఖ్యలు చూస్తుంటే ఆర్బీఐ సరళ పాలసీ విధానానికి అద్దంపడుతున్నాయి. అవసరమైన సమయంలో రేట్లు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామన్న గవర్నర్ రఘురామ్ రాజన్ సంకేతాలు ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశం. ఆర్బీఐ ప్రవేశపెట్టనున్న కొత్త బేస్ రేటు విధానాన్ని పూర్తిగా పరిశీలించి తగిన చర్యలు చేపడతాం’. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ మా అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ పాలసీ నిర్ణయం వెలువడింది. ఇప్పటివరకూ తీసుకున్న పాలసీపరమైన చర్యల ప్రభావం డిపాజిట్ రేట్ల(బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయం)లో ప్రతిబింబించింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లు మరింతగా తగ్గుతాయని భావిస్తున్నా. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చిన్న మొత్తాల పొదుపు రేట్లు మార్కెట్ వడ్డీరేట్లతో సమాన స్థాయికి వస్తే... బ్యాంకుల డిపాజిట్ రేట్లను మరింతగా తగ్గించేందుకు దోహదం చేస్తుంది. దీనివల్ల నిధుల సమీకరణ వ్యయం తగ్గుతుంది. అంతిమంగా రుణాలపై వడ్డీరేట్లను కూడా ఇంకా తగ్గుముఖం పడతాయి. - చంద్రశేఖర్ ఘోష్, బంధన్ బ్యాంక్ సీఎండీ ఇర బ్యాంకులే తగ్గించాలి: కార్పొరేట్ ఇండియా ఆర్బీఐ రెపో కోత పూర్తి ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాల్సిందేనని... రుణాలపై వడ్డీరేట్లను మరింతగా తగ్గించాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. ‘ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేలా చేయాలంటే.. అటు ఇన్వెస్టర్లు, ఇటు వినియోగదార్లు అందరికీ రుణ రేట్లను మరింతగా తగ్గించాల్సి ఉందని ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఎ.దీదార్ సింగ్ వ్యాఖ్యానించారు. రుతుపవన వర్షాలు తగినంతగా లేకపోవడంతో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బలహీనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన చెప్పారు. ‘ఇప్పుడు ఆర్బీఐ పాలసీ రేట్ల కోతను రుణాలపై రేట్ల తగ్గింపునకు బదలాయించడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాల్సి ఉంది. పుంజుకుంటున్న రుణ వృద్ధికి అనుగుణంగా నిధులను అందించడానికి బ్యాంకులు సిద్ధంగా ఉండాలి. అధిక మొండిబకాయిల ప్రభావంతో రుణాలివ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేయకుండా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి’ అని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని అసోచామ్ ప్రెసిడెంట్ సునిల్ కనోరియా అభిప్రాయపడ్డారు. బేస్ రేటుకు కొత్త మార్గదర్శకాలు వస్తున్నాయ్... బ్యాంకుల కనీస రుణ రేటు(బేస్ రేటు) లెక్కింపు విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈ వారంలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఇప్పుడున్న యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ స్థానంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారంగా బేస్ రేటును నిర్ణయించే విధంగా కొత్త విధానం ఉంటుందన్నారు. దీనివల్ల పాలసీ రేట్ల మార్పులకు అనుగుణంగా బ్యాంకులు తమ వడ్డీరేట్లలో వెంటనే దీన్ని అమలు చేయడానికి వీలవుతుందని చెప్పారు. ఇటీవలి కాలంలో రెపో రేటును భారీగానే తగ్గించినప్పటికీ.. ఈ ప్రయోజనంలో సగాన్ని మాత్రమే బ్యాంకులు కస్టమర్లకు బదలాయించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ కొత్త విధానానికి తెరతీస్తోంది. అయితే, దేశీ మార్కెట్లో డిపాజిట్ల సమీకరణ వ్యయం ఇంకా అధికంగానే ఉన్న తరుణంలో ఇది తగిన విధానం కాదని బ్యాంకర్లు వాదిస్తున్నారు. మరోపక్క, 1-3 ఏళ్ల వ్యవధిగల డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీరేట్లను భారీగా తగ్గించాయని.. ఈ స్థాయిలో బేస్ రేటును మాత్రం తగ్గించలేదంటూ రాజన్ గుర్తుచేశారు. రుణ రేట్లను మరింత తగ్గించాల్సిందేనని తేల్చిచెప్పారు. -
రఘురామ్ రాజన్ కమిటీ సూచనలు, పరిశీలన..
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో ఆర్థిక వ్యవస్థ బాగా వెనుకబడి ఉంది. ప్రాంతాల మధ్య ఆదాయ పంపిణీలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం భారత్ ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అధిక వృద్ధి సాధన, ఆదాయ అసమానతల తొలగింపు వంటి అంశాలు దేశానికి సవాలుగా నిలిచాయి. అర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ద్వారా మూల ధన పెట్టుబడులను ఉత్పాదక రంగాలకు మరల్చినప్పుడే అసమానతలు తొలగించవచ్చని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ రాబడిని ఆయా ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు వనరుల పంపిణీ చేశారు. డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. ఇప్పటి వరకు అమలు చేసిన 11 పంచవర్ష ప్రణాళికలు ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి, ఆర్థిక వృద్ధి రేటు పెంపు, పేదరిక నిర్మూలన, రాష్ట్రాల మధ్య అసమానతల తొలగింపు వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. ఆయా లక్ష్యాల సాధనకు కృషి చేశాయి. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం ఆయా ప్రాంతాల్లో నీటి పారుదల, గ్రామీణ సౌకర్యాల కల్పనపై అధిక పెట్టుబడులు వెచ్చించారు. ఆర్థిక సంఘం, ప్రణాళికా సంఘం ద్వారా జరిగిన వనరుల పంపిణీలో పేద రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వనరుల సమీకరణ పేద రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అందించే గ్రాంట్లపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. రాష్ట్రాల నుంచి డిమాండ్: ప్రత్యేక కేటగిరీ హోదా పొందే విషయంలో రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు అదనపు సహాయాన్ని గ్రాంటుగా కల్పించే క్రమంలో అవసరమైన చర్యలను సూచించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్‌రాజన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. రాష్ట్రాలకు ఆర్థిక సహాయం విషయంలో మల్టీ డెవలప్మెంట్ ఇండెక్స్ (కఠ్టజీ ఈ్ఛఠిౌ్ఛఞఝ్ఛ్ట ఐఛ్ఛ్ఠీ) ఫార్ములాను రాజన్ కమిటీ సూచించింది. రాష్ట్రాల వెనకబాటుతనాన్ని కొలవడానికి ఒక అభివృద్ధి సూచీని రూపొందించింది. అభివృద్ధిని ప్రోత్సహించడమే దీని వెనక ఉన్న ఉద్దేశమని రాజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పేద రాష్ట్రాలకు అదనపు ఆర్థిక సహాయం అందించే విషయంలో ఇప్పటి వరకు అమల్లో ఉన్న ప్రత్యేక కేటగిరీ హోదా పద్ధతిని విడనాడాలని ఆయన సూచించారు. చలాంకాలు: నూతన పద్ధతి అవలంబించడం ద్వారా వెనకబడిన రాష్ట్రాలను గుర్తించడంతోపాటు భవిష్యత్ ప్రణాళిక రూపకల్పన, కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీ విషయంలో రూపొందించిన నూతన పద్ధతి ప్రభావం ఏమేరకు ఉంటుంది అనే విషయాలకు సంబంధించి అవసరమైన సిఫార్సుల కోసం రాజన్ కమిటీని ఏర్పాటు చేశారు. అభివృద్ధి సూచీ రూపకల్పనలో కమిటీ పది చలాంకాలను వినియోగించింది. అవి.. నెలవారీ త లసరి వినియోగ వ్యయం విద్య ఆరోగ్యం కుటుంబ రంగ సౌకర్యాల సూచీ (అఝ్ఛజ్టీజ్ఛీట ఐఛ్ఛ్ఠీ) పేదరిక నిష్పత్తి మహిళా అక్షరాస్యతా రేటు ఎస్సీ, ఎస్టీ ప్రజల శాతం పట్టణీకరణ శాతం ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (ఊజ్చీఛిజ్చీ జీఛిఠటజీౌ) కనెక్టివిటీ సూచీ. నేషనల్ శాంపిల్ సర్వే తలసరి వినియోగ వ్యయ అంచనా, పేదరిక నిష్పత్తి, పేదరికాన్ని నిర్వచించడానికి 12వ ప్రణాళికలో పేర్కొన్న విధంగా మల్టీ డెమైన్షనల్ అప్రోచ్‌ను కమిటీ పరిగణనలోకి తీసుకుంది. కమిటీ అభిప్రాయంలో రాష్ట్రాల స్కోర్ 0.6, అంతకంటే ఎక్కువగా ఉంటే వాటిని లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్‌గా (ఔ్ఛ్చట్ట ఛ్ఛీఠిౌ్ఛఞ్ఛఛీ ట్ట్చ్ట్ఛట), 0.6 కంటే తక్కువ-0.4 కంటే ఎక్కువగా ఉంటే లెస్ డెవలప్డ్ స్టేట్స్‌గా (ఔ్ఛటట ఛ్ఛీఠిౌ్ఛఞ్ఛఛీ ట్ట్చ్ట్ఛట), 0.45 కంటే తక్కువగా ఉంటే రిలేటివ్‌లీ (ఖ్ఛ్చ్టజీఠ్ఛిడ ఛ్ఛీఠిౌ్ఛఞ్ఛఛీ ట్ట్చ్ట్ఛట-అభివృద్ధి దశలో ఉన్నా రాష్ట్రాలు) డెవలప్డ్ రాష్ట్రాలుగాను వర్గీకరించారు. వ్యతిరేకత: రాష్ట్రాలకు వనరుల కేటాయింపు విషయంలో గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములాకు ప్రత్యామ్నాయంగా రాజన్ ప్రతిపాదించిన మల్టీ డెమైన్షనల్ ఇండెక్స్ పట్ల ప్రణాళికా సంఘ సభ్యుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా ప్రకారం రాష్ట్ర ప్రణాళికలకు కేంద్ర సహాయంలో భాగంగా మొత్తం నిధుల నుంచి 30 శాతం నిధులను ప్రత్యేక కేటగిరీ హోదా పొందిన రాష్ట్రాలకు కేటాయిస్తున్నారు. పెద్ద రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో 30 శాతాన్ని గ్రాంట్లుగాను, మిగిలిన 70 శాతాన్ని రుణంగానూ పొందుతున్నాయి. ప్రత్యేక కేటగిరీ హోదా పొందిన రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికా సహాయంలో 90 శాతాన్ని గ్రాంటుగా, మిగిలిన 10 శాతాన్ని రుణంగా పొందుతున్నాయి. ఆర్థిక సంఘం నుంచి కేంద్ర పన్ను రాబడి పంపకంలోనూ ప్రత్యేక కేటగిరీ హోదా పొందిన రాష్ట్రాలు లబ్ధి పొందుతాయి. జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా కల్పనకు అవలంబించే విధానంలో భాగంగా కింది అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. కొండ ప్రాంతాలు తక్కువ జన సాంద్రత లేదా గిరిజన (ట్రైబల్) జనాభా వాటా ఎక్కువగా ఉండడం ఆర్థిక-మౌలిక సౌకర్యాల వెనకబాటుతనం రాష్ట్ర ఫైనాన్స్ స్థితిగతులు సక్రమంగా లేకపోవడం ఈ అంశాల ప్రాతిపదికన అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, సిక్కిం రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా కేటాయించారు. పరిశీలన: రాజన్ కమిటీ రూపొందించిన సూచీ ప్రకారం రాష్ట్రాలకు ప్రణాళికా పరంగా వనరుల బదిలీని నిర్ణయించలేం. నేషనల్ శాంపిల్ సర్వే నుంచి సమీకరించిన నెలవారీ తలసరి వ్యయం దత్తాంశాన్ని ఈ సూచీ రూపకల్పనలో వినియోగించారు. రాజన్ కమిటీలో సభ్యుడైన శైబాల్ గుప్తా ఈ సూచీ రూపకల్పనలో నెలవారీ తలసరి వ్యయం ప్రామాణిక సూచికగా ఉపకరించదని అభిప్రాయపడ్డారు. కుటుంబ శ్రేయస్సు నిర్ణయించడానికి నెలవారీ తలసరి వ్యయం సూచికను తీసుకోవడంపై ఆర్థికవేత్త హసీబ్ ద్రాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సూచికకు బదులుగా తలసరి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి సరైన కొలమానంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమలు చేస్తే: ఈ నివేదికలోని సిఫార్సులను అమలు చేస్తే జమ్ము-కాశ్మీర్ ప్రత్యేక కేటగిరీ హోదాను కోల్పోతుంది. తద్వారా కేంద్రానికి, జమ్మూ-కాశ్మీర్‌కు ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంబంధాలు తదుపరి కాలంలో కొనసాగే సూచనలు ఉండవు. మహరాష్ట్ర, గుజరాత్‌లలో పన్ను రాబడి పెరుగుతున్నప్పటికీ.. ఈ సూచీ ప్రకారం మహారాష్ట్రను అధిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను, గుజరాత్‌ను అల్పాభివృద్ధి రాష్ట్రంగానూ వర్గీకరించారు. 2011-12లో ఇతర రాష్ట్రాలతో పోల్చితే బీహార్‌లో అధిక వృద్ధి నమోదు కాగా మల్టీ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం లీస్ట్ డెవలప్డ్ స్టేట్‌గా గుర్తింపు పొందింది. భారత్ సగటు అక్షరాస్యత రేటు గుజరాత్ కంటే 1991-2001 మధ్య కాలంలో ఎక్కువకాగా 2001-11 మధ్య గుజరాత్ కంటే తక్కువగా నమోదయింది. మహిళా అక్షరాస్యతలోనూ ఇదే స్థితి స్పష్టమవుతోంది. బీహార్, ఒడిశా ముఖ్యమంత్రులు రాజన్ నివేదికను స్వాగతించగా, తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రం తప్పుపట్టారు. సందేహాస్పదమే: ఆర్థిక క్రమశిక్షణ లోపించడం, పన్ను రాబడిలో సరైన ప్రగతి కనబరచకపోవడం వంటి అంశాలను రాష్ట్రాల వెనకబాటు తనాన్ని గుర్తించే క్రమంలో ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకుంది. దీనికి విరుద్ధంగా రాజన్ కమిటీ మరో పది చలాంకాలను అభివృద్ధి సూచీ కొలమానానికి ఉపయోగించింది. ఒడిశా తలసరి ఆదాయంలో బీహార్ తలసరి ఆదాయం సగ భాగం మాత్రమే అయినప్పటికీ బీహార్‌ను లెస్ బ్యాక్వర్డ్ రాష్ట్రంగా గుర్తించారు. తలసరి ఆదాయం విషయంలో గుజరాత్ మూడో స్థానాన్ని ఆక్రమించినప్పటికీ రాజన్ కమిటీ ఆ రాష్ట్రాన్ని లెస్ డెవలప్డ్ స్టేట్‌గా గుర్తించింది. 14వ ఆర్థిక సంఘం విత్త బదిలీలో రాష్ట్ర వాటా పెంచిన క్రమంలోనూ, జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో మొత్తం 28 రాష్ట్రాలలో అధిక శాతం మంది రాష్ట్రాధినేతలు అభ్యంతరం వ్యక్తం చేసే సూచనల నేపథ్యంలో రాజన్ కమిటీ సిఫార్సుల అమలు సందేహాస్పదమే. సులభమైన, అందరి సమ్మతి పొందే అండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ (్ఖఛ్ఛీట ఛ్ఛీఠిౌ్ఛఞఝ్ఛ్ట ఐఛ్ఛ్ఠీ) రూపకల్పనకు ఎంపిక చేసిన చలాంకాలు ఉపకరిస్తాయి. అవి.. తలసరి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఆరోగ్యం (శిశు మరణాల రేటు) విద్య (మహిళా అక్షరాస్యత రేటు, పాఠశాల హాజరు నిష్పత్తి) పేదరిక నిష్పత్తి (టెండూల్కర్ నివేదిక ప్రకారం) పట్టణీకరణ రేటు తలసరి విద్యుచ్ఛక్తి లభ్యత/వినియోగం కుటుంబ సౌకర్యాలు (తాగునీరు, పారిశుధ్యం, బ్యాంకింగ్, టెలిఫోన్ సౌకర్యం) కనెక్టివిటీ సూచీ (రైల్, రోడ్డు) ముఖ్యాంశాలు కమిటీ మొత్తం 28 రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించింది. మల్టీ డెమైన్షనల్ ఇండెక్స్‌లోని స్కోర్స్ ఆధారంగా రాష్ట్రాలను లీస్ట్ డెవలప్డ్, లెస్ డెవలప్డ్, రిలేటివ్‌లీ డెవలప్డ్ స్టేట్స్‌గా వర్గీకరించారు. గోవా, కేరళ, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హర్యానాలను అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రాలు (మోస్ట్ డెవలప్డ్ స్టేట్స్)గా గుర్తించారు. మణిపూర్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, మిజోరం, గుజరాత్, త్రిపురలను లెస్ డెవలప్డ్ స్టేట్స్‌గా గుర్తించారు. ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లను లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్‌గా గుర్తించారు. గోవా, కేరళలు అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగాను, ఒడిశా, బీహార్ వెనకబడిన రాష్ట్రాలుగాను అంచనా వేశారు. ఎండీఐ స్కోర్స్ ప్రకారం మొదటి పది స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను ధనిక రాష్ట్రాలుగాను, చివరి పది స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను పేద రాష్ట్రాలుగాను పరిగణించరాదు. తక్కువ స్కోర్ సాధించిన రాష్ట్రాలు కేంద్రం నుంచి పంపిణీ చేసే వనరులలో ప్రాధాన్యత పొందుతాయి. అభివృద్ధి సూచీలో వనరుల ఫార్ములాను 10 సంవత్సరాల తర్వాత సమీక్షించాలి. అనుభవాల దృష్ట్యా ఫార్ములాను సవరించాలి. ఈ నివేదికలో పేర్కొన్న ప్రక్రియకనుగుణంగా రాష్ట్రాలకు కేంద్రం అభివృద్ధి నిధులను పంపిణీ చేయాలి. అభివృద్ధి సూచీ ద్వారా లీస్ట్ డెవలప్డ్ స్టేట్స్‌గా పేర్కొన్న రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం వివిధ రుపాల్లో ఇచ్చే మద్దతుకు సంబంధించి అర్హత కలిగి ఉంటాయి. ప్రతి రాష్ట్రం కేంద్రం పంపిణీ చేసే నిధులలో స్థిర వాటా కలిగి ఉండడంతోపాటు అభివృద్ధి అవసరాలు, ప్రగతి అనే రెండు అంశాల ప్రాతిపదికన అదనపు వనరుల పంపిణీలో ప్రాధాన్యత పొందుతాయి.