డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం బ్యాంకుల ప్రధానవిధి అని రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బ్యాంకులో వారి సొమ్మను కాపాడటం అనేది అది పవిత్రమైన విధి, మన కిష్ట దైవాన్ని సందర్శించడం కంటే చాలా ముఖ్యమైనదని ఆర్‌బిఐ గవర్నర్ వెల్లడించారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ చిన్న పొదుపుదారులు, మధ్యతరగతి, పదవీ విరమణ చేసిన వారి డిపాజిట్లపై ఆధారపడినందున ఇది చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు.
అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల (యుసిబి) డైరెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించిన శక్తి కాంత దాస్ బ్యాంకుల బాధ్యతను గుర్తు చేశారు. అయితే ఆగస్టు 30న గవర్నర్ ప్రసంగం చేయగా, ఆ వీడియోను ఆర్‌బీఐ సోమవారం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.
డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ బ్యాంకు అతి ముఖ్యమైన బాధ్యత. ఇది పవిత్రమైన విధి. గుడి , మసీదు, గురుద్వారా మరే ఇతర మతపరమైన పవిత్ర ప్రదేశానికి వెళ్లి నమస్కరించడం లాంటివాటి కంటే కూడా పవిత్రమైందని తాను నమ్ముతానని చెప్పారు. అఆగే డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందా అనేది పర్యవేక్షిస్తూ, బ్యాంకులతో కలిసి పనిచేయడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యతఅని, దీనికి సంబంధించి ఎప్పటికపుడు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండాలని, ఈ రంగంలో యూసీబీలు ముఖ్యమైన భాగమని కూడా ఆయన గుర్తు చేశారు. ముఖం‍్యంగా సహకార బ్యాంకింగ్ స్థలంలో, ఎంటిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, డిపాజిటర్ సొమ్ము నిలిచిపోయిన సందర్భాలు ఎ క్కువవుతున్న తరుణంలో గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment