shakti kanth das
-
రోజూ 50 కోట్ల లావాదేవీలు
దేశీయంగా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు దాదాపు 500 మిలియన్లు(50 కోట్లు) లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అంచనా వేస్తున్నట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. త్వరలో ఇది బిలియన్(100 కోట్లు) మార్కును చేరనున్నట్లు చెప్పారు. అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ‘గ్రూప్ ఆఫ్ థర్టీస్ వార్షిక అంతర్జాతీయ బ్యాంకింగ్ సెమినార్’లో పాల్గొని ఆయన మాట్లాడారు.‘భవిష్యత్తులో ఆన్లైన్ లావాదేవీలకు మరింత ఆదరణ పెరుగుతుంది. ఆమేరకు చెల్లింపులకు సంబంధించి ఎలాంటి భద్రతా లోపాలకు తావులేకుండా మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నాం. అందుకు ఆర్బీఐ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) అన్ని చర్యలు తీసుకుంటోంది. యూపీఐ విధానం ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. ప్రస్తుతం రోజుకు దాదాపు 50 కోట్ల యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. వీటిని మరింత పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో వీటి సంఖ్యను ఒక బిలియన్(100 కోట్లు)కు చేర్చాలని భావిస్తున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: క్విక్ కామర్స్‌లోకి టాటా గ్రూప్?‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) డేటా ప్రకారం, ఆగస్టులో యూపీఐ రోజువారీ లావాదేవీల సంఖ్య 483 మిలియన్లకు చేరింది. ఇది సెప్టెంబర్‌లో సుమారు 500 మిలియన్లుగా ఉంది. సెప్టెంబర్ 2024లో మొత్తం యూపీఐ చెల్లింపుల సంఖ్య 15.04 బిలియన్లు(1500 కోట్లు). ఫలితంగా వీటి విలువ రూ.20.64 లక్షల కోట్లకు చేరింది. ఆన్లైన్ చెల్లింపులు పెంచడానికి ఇతర దేశాల ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌లతో కూడా యూపీఐను లింక్ చేస్తున్నాం. ఇప్పటికే ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్, భూటాన్, శ్రీలంక, మారిషస్, నేపాల్ వంటి ఏడు దేశాల్లో యూపీఐ అందుబాటులో ఉంది’ అని దాస్ చెప్పారు. -
కీలక వడ్డీ రేట్లు యథాతథం
-
అనుకున్నదే జరిగింది.. వడ్డీలో మార్పు లేదు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను ఈసారీ యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా పదోసారి రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న 6.5 శాతం రెపోరేటునే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రధాన ద్రవ్యోల్బణం తగ్గుతున్నా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ తెలిపారు. మూడు రోజుల పాటు సాగిన మానిటరీ పాలసీ సమావేశంలోని ముఖ్యాంశాలను దాస్ వెల్లడించారు.రూపాయి విలువలో ఎక్కువ ఒడిదొడుకులు ఉండకుండా ఆర్బీఐ చర్యలు తీసుకుంది.ప్రధాన ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నాం.ఎన్బీఎఫ్సీలు రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా వృద్ధిని కొనసాగిస్తున్నాయి.సెప్టెంబరులో సీపీఐ గణనీయంగా పెరగవచ్చు.ద్రవ్యోల్బణం: > సీపీఐ ద్రవ్యోల్బణం క్యూ2లో 4.1%గా ఉంటుందని అంచనా.> క్యూ3లో 4.8 శాతానికి పెరగొచ్చు.> క్యూ4లో 4.2 శాతంగా ఉండవచ్చు.> క్యూ1 2026 ఆర్థిక సంవత్సరంలో 4.3 శాతంగా ఉండబోతుంది.2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుంది.జీడీపీ 7.2 శాతంగా ఉంటుందని అంచనా.ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో వాస్తవ జీడీపీ 6.7 శాతం పెరిగింది.కూ1లో జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 1.1 శాతంగా ఉంది.యూపీఐ లైట్ వాలెట్ లిమిట్‌ను రూ.2000 నుంచి రూ.5000కు పెంచారు.‘యూపీఐ 123పే’ ఐవీఆర్ ఆధారిత లావాదేవీలను రూ.5000 నుంచి రూ.10000కు పెంచారు.పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, దాంతో పొంచిఉన్న ద్రవ్యోల్బణం భయాలు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయానికి కారణాలు అయి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు సరళతర రేటు విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ దేశీయంగా ఆర్బీఐ ఆ తరహా నిర్ణయాలు తీసుకోకపోవడం కొంత నిరాశ కలిగించింది. ఆర్బీఐ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయదనే సంకేతాలు గతంలో గవర్నర్ పలు సమావేశాల్లో స్పష్టంగా అందించారు. 2023 ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ యథాతథంగా 6.5 శాతం రెపో రేటును కొనసాగిస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే, డిసెంబర్లో జరిగే ఎంపీసీ సమావేశంలో రేటు తగ్గింపు ఉండవచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు.ఇదీ చదవండి: కిక్కెక్కిస్తోన్న ‘క్విక్ కామర్స్’!2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. అందుకు అనువుగా ద్రవ్యోల్బణం తగ్గుతున్నా కీలక వడ్డీరేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పేర్కొన్నారు. అయితే సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని సూచిస్తోంది. కానీ దీనివల్ల ఆర్బీఐ పనితీరుపై ప్రజలకు విశ్వాసం కోల్పోతుందని ఇటీవల రఘురామ్‌రాజన్ తెలిపారు. -
ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకర్‌గా దాస్
ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకు గవర్నర్లలో భారతీయ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ అత్యుత్తమ బ్యాంకర్‌గా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో దాస్ ఈ గుర్తింపు పొందడం ఇది వరుసగా రెండోసారి. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజీన్ తాజాగా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు ర్యాంకులు ప్రకటించింది.ఈ ర్యాంకుల్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ‘గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్ 2024’లో దాస్‌కు ‘ఏ+’ రేటింగ్ లభించింది. గ్లోబర్ ర్యాంకుల్లో భాగంగా ద్రవ్యోల్బణ కట్టడి, ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు, కరెన్సీ స్థిరత్వం, వడ్డీ రేట్ల నిర్వహణ ఆధారంగా ‘ఏ’ నుంచి ‘ఎఫ్’ వరకు గ్రేడ్లను కేటాయిస్తారు. అద్భుతమైన పనితీరు కనబరిస్తే ఏ+ ర్యాంకు ఇస్తారు. అధ్వాన పనితీరుకు ‘ఎఫ్’ రేటింగ్ కేటాయిస్తారు. శక్తికాంత దాస్‌తో పాటు డెన్మార్క్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ క్రిస్టియన్ కెట్టల్, థాసన్, స్విట్జర్లాండ్(స్విస్ సెంట్రల్ బ్యాంక్)గవర్నర్ థామస్ జె.జోర్డాన్లకు ఏ+ రేటింగ్ దక్కింది.ఇదీ చదవండి: వాహనాలకు న‘కీ’లీ.. బీమా రెజెక్ట్! -
బ్యాంకులను హెచ్చరించిన ఆర్బీఐ గవర్నర్!
బ్యాంకులు వినూత్న మార్గాల్లో డిపాజిట్లను సేకరించకపోతే ప్రమాదంలో పడుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. చిన్న మొత్తాల్లో డిపాజిట్లను సేకరిస్తూ కొన్ని బ్యాంకులు పబ్బం గడుపుతున్నాయని చెప్పారు. దీని వల్ల బ్యాలెన్స్‌షీట్లలో అప్పులు-ఆస్తుల మధ్య తారతమ్యం(అసెట్ లయబిలిటీ డిఫరెన్స్) పెరుగుతుందన్నారు.ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో దాస్ మాట్లాడుతూ..‘బ్యాంకు కస్టమర్లు డిపాజిట్ల రూపంలో కాకుండా వివిధ మార్గాల్లో డబ్బు దాచుకుంటున్నారు. ఇతర పెట్టుబడి మార్గాలకు మళ్లిస్తున్నారు. బ్యాంకులు లోన్లు ఇవ్వాలన్నా, భారీగా కార్పొరేట్ రుణాలు జారీ చేయాలన్నా డిపాజిట్లు పెరగాలి. లేదంటే బ్యాలెన్స్ షీట్లలో అప్పులు-ఆస్తుల మధ్య తారతమ్యం ఎక్కువవుతుంది. అది బ్యాంకులకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి వినూత్న మార్గాల్లో కస్టమర్ల నుంచి డిపాజిట్లు రాబట్టే ప్రయత్నం చేయాలి. క్రెడిట్ వృద్ధికి అనుగుణంగా డిపాజిట్లను సేకరించేందుకు బ్యాంకులు భారీ బ్రాంచ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉండాలి. చిన్న మొత్తాల్లో డిపాజిట్లను సేకరిస్తూ కొన్ని బ్యాంకులు పబ్బం గడుపుతున్నాయి. ఇవి భవిష్యత్తులో ప్రమాదంలో పడుతాయి’ అన్నారు.ఇదీ చదవండి: రేపు మూడు గంటలు యూపీఐ సర్వీసు నిలిపివేత!ఇదిలాఉండగా, గురువారం జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచారు. ఇలా రెపో రేటును మార్చకపోవడం ఇది వరుసగా తొమ్మిదోసారి. మార్కెట్ వర్గాలు కూడా ఈసారి ఎలాంటి మార్పులుండవనే భావించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు సెప్టెంబర్‌లో జరిగే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గిస్తే, అందుకు అనువుగా ఆర్బీఐ వడ్డీరేట్లలో మార్పు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. -
RBI Monetary Policy 2024: ఆర్బీఐ ఏడోసారీ
ముంబై: ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా ఏడోసారీ కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. రెపో రేటును ప్రస్తుత 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ ఈ మేరకు పాలసీ నిర్ణయం తీసుకుంది. దీంతో గృహ, వాహన రుణాలపై ఈఎంఐలు మరికొన్నాళ్ల పాటు స్థిరంగా ప్రస్తుత స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది. 2023 ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును మార్చలేదు. అంటే ఏడు ద్వైమాసిక సమావేశాల నుంచి ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో రేటు యథాతథంగా కొనసాగింది. తాజాగా రెపో రేటును యథాతథంగా ఉంచాలన్న ప్రతిపాదనను మానిటరీ పాలసీ కమిటీలోని (ఎంపీసీ) ఆరుగురు సభ్యుల్లో ఒకరు వ్యతిరేకించగా అయిదుగురు సభ్యులు సానుకూలత వ్యక్తపర్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7 శాతం స్థాయిలోనూ (2023–24లో 7.6 శాతం), ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలోను (2023–24లో 5.4 శాతం) ఉంటుందన్న అంచనాలను ఆర్బీఐ కొనసాగించింది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.1 శాతంగా, ఆహార ధరల బాస్కెట్ ద్రవ్యోల్బణం 8.66 శాతంగా నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం క్యూ1లో 4.9 శాతం, క్యూ2లో 3.8 శాతం, క్యూ3లో 4.6 శాతం, క్యూ4లో 4.5 శాతం చొప్పున మొత్తం మీద సగటున 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. కాగా విదేశాల నుంచి స్వదేశానికి పంపించే డబ్బుకు (రెమిటెన్స్) సంబంధించి భారత్ తొలి స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ► యూపీఐని వినియోగించడం ద్వారా త్వరలో బ్యాంకుల్లో నగదు డిపాజిట్ సౌకర్యం ► ప్రభుత్వ బాండ్లలో రిటైల్ భాగస్వామ్యం సులభతరానికి మొబైల్ యాప్ ప్రారంభం ► ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ సెంటర్లో సావరిన్ గ్రీన్ బాండ్ల ట్రేడింగ్‌కు అనుమతి ► డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిర శ్రేణిలో కదలాడుతోంది. ఆందోళక అక్కర్లేదు ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు వ్యవస్థాగతంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు ► జూన్ 5 నుంచి 7 వరకూ 2024–25 ఆర్బీఐ రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష ► సీబీడీసీ వాలెట్లను అందించడానికి నాన్–బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు అనుమతి ► బ్యాంకింగ్ ద్రవ్య సంబంధ ఇబ్బందులు పడకుండా లిక్విడిటీ కవరేజ్ రేషియో సమీక్ష ► 2023–24లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 41.6 బిలియన్ డాలర్లు. 2014–15 తర్వాత అత్యధికం పసిడి నిల్వల పెంపు విదేశీ మారకద్రవ్య నిల్వల పటిష్టతలో భాగంగా పసిడి వాటాను భారత్ పెంచుకుంటుందని ఆర్బీఐ పేర్కొంది. మార్చి 29వ తేదీ నాటికి భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆల్ టైమ్ హై 645.6 బిలియన్ డాలర్లకు చేరితే, అందులో పసిడి వాటా 51.487 బిలియన్ డాలర్లుగా ఉంది. సాగుపై చల్లని అంచనాలు తీవ్ర వేసవి, నీటి ఎద్దడి భయాందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఎకానమీపై చల్లని అంచనాలను వెలువరించింది. తగిన వర్షపాతం అంచనాల నేపథ్యంలో వ్యవసాయ, గ్రామీణ క్రియాశీలతలో సానుకూలతలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఆశించిన స్థాయిలో సాధారణ రుతుపవనాల అంచనాలు, మంచి రబీ గోధుమ పంట, ఖరీఫ్ పంటల మెరుగైన అవకాశాలు దీనికి కారణంగా పేర్కొంది. బలమైన గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ– సేవల రంగంలో స్థిరమైన పురోగతి ప్రైవేట్ వినియోగాన్ని పెంచడానికి దోహదపడే అంశాలుగా పేర్కొంది. అయితే దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య మార్గాలలో పెరుగుతున్న అంతరాయాలు దేశ ఎకానమీకి ఆందోళన కలిగిస్తున్న అంశాలుగా పేర్కొంది. ఆహార ధరలపై అనిశ్చితి.. ఆహార ధరల్లో నెలకొన్ని అనిశ్చితి రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం తీరుతెన్నులపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది వేసవిలో కూరగాయల ధరల కదలికలపై మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు వృద్ధికి ఊతమిస్తూనే మరోవైపు లకి‡్ష్యంచుకున్న స్థాయికి (4 శాతం) ద్రవ్యోల్బణం దిగి వస్తే కీలక రేట్లను తగ్గించడంపైనే ఎంపీసీ ప్రధానంగా దృష్టి పెడుతుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ -
అధిక వడ్డీరేట్లు కొనసాగుతాయన్న ఆర్బీఐ గవర్నర్
ప్రస్తుత ఆర్థిక విధాన రూపకల్పన సంక్లిష్టంగా మారిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. 2023లో ఇప్పటివరకు పాలసీ రేట్లపై ఆర్బీఐ విరామం కొనసాగించిందన్నారు. ప్రస్తుతం వడ్డీరేట్లు అధికంగానే ఉన్నాయని, అవి ఇంకెంతకాలం కొనసాగుతాయో చెప్పలేమన్నారు. శుక్రవారం జరిగిన ఓ సదస్సులో ఆయన మాట్లాడారు. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు తోడవ్వడంతో ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్ర బ్యాంకులన్నీ వడ్డీ రేట్లు పెంచాయి. ఈ క్రమంలో ఆర్బీఐ సైతం గతేడాది మేనెల నుంచి దాదాపు 250 బేసిస్ పాయింట్ల మేర రెపోరేటును పెంచింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మాత్రం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలేదు. ఇప్పటికే రెపో రేటు 6.50 శాతానికి చేరింది. అయితే, ఈ రేట్లు ఎంతకాలం స్థిరంగా ఉంటాయో అప్పుడే చెప్పలేమని, కాలమే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని శక్తికాంత దాస్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.(వడ్డీరేట్ల పెంపు తప్పదు: ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్) ప్రపంచ వృద్ధిలో మందగమనం, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణంలో అనిశ్చితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్బీఐతో సహా సెంట్రల్ బ్యాంకులు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో బాధ్యత వహించాలని సూచించారు. క్రూడాయిల్ ధర పెరుగుదల, బాండ్ల రాబడి పెరగడం వంటి తాజా సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నాయని చెప్పారు. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా బ్యాంకులు కనీస మూలధన అవసరాలను తీర్చగలవన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఇంకా రూ.10వేల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు వెనక్కి రావాల్సి ఉందని చెప్పారు. -
డిపాజిటర్ల సొమ్ము: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం బ్యాంకుల ప్రధానవిధి అని రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. బ్యాంకులో వారి సొమ్మను కాపాడటం అనేది అది పవిత్రమైన విధి, మన కిష్ట దైవాన్ని సందర్శించడం కంటే చాలా ముఖ్యమైనదని ఆర్బిఐ గవర్నర్ వెల్లడించారు. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ చిన్న పొదుపుదారులు, మధ్యతరగతి, పదవీ విరమణ చేసిన వారి డిపాజిట్లపై ఆధారపడినందున ఇది చాలా ముఖ్యమైందని పేర్కొన్నారు. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల (యుసిబి) డైరెక్టర్లను ఉద్దేశించి ప్రసంగించిన శక్తి కాంత దాస్ బ్యాంకుల బాధ్యతను గుర్తు చేశారు. అయితే ఆగస్టు 30న గవర్నర్ ప్రసంగం చేయగా, ఆ వీడియోను ఆర్బీఐ సోమవారం యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ బ్యాంకు అతి ముఖ్యమైన బాధ్యత. ఇది పవిత్రమైన విధి. గుడి , మసీదు, గురుద్వారా మరే ఇతర మతపరమైన పవిత్ర ప్రదేశానికి వెళ్లి నమస్కరించడం లాంటివాటి కంటే కూడా పవిత్రమైందని తాను నమ్ముతానని చెప్పారు. అఆగే డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందా అనేది పర్యవేక్షిస్తూ, బ్యాంకులతో కలిసి పనిచేయడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యతఅని, దీనికి సంబంధించి ఎప్పటికపుడు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండాలని, ఈ రంగంలో యూసీబీలు ముఖ్యమైన భాగమని కూడా ఆయన గుర్తు చేశారు. ముఖం్యంగా సహకార బ్యాంకింగ్ స్థలంలో, ఎంటిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లు, డిపాజిటర్ సొమ్ము నిలిచిపోయిన సందర్భాలు ఎ క్కువవుతున్న తరుణంలో గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
నెమ్మదిగా దారిలోకి.. ద్రవ్యోల్బణం
ముంబై: భారత్‌లో ద్రవ్యోల్బణ నెమ్మదిగా అదుపులోనికి వస్తుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం అన్నారు. సమీప మధ్యకాలిక సమయంలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం మేరకు 4 శాతానికి తగ్గించడం జరుగుతుందని కూడా భరోసా ఇచ్చారు. లండన్‌లో సెంట్రల్ బ్యాంకింగ్ నిర్వహించిన ఒక సెమినార్లో ఆయన ప్రసంగించారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మేలో రెండేళ్ల కనిష్టస్థాయి 4.25 శాతానికి తగ్గిన నేపథ్యంలో శక్తికాంత్‌దాస్ తాజా ప్రసంగం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం 2 ప్లస్ లేదా 2 మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే 6 శాతం పైబడకూడదు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, చమురు ధరల తీవ్రత, వడ్డీరేట్ల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో 2022 నవంబర్, డిసెంబర్, 2023 మార్చి, ఏప్రిల్, మే మినహా మిగిలిన అన్ని నెలలూ 6 శాతం ఎగువనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగింది. తాజా సమీక్షా నెల మే నెల్లో 2021 ఏప్రిల్ కనిష్టాన్ని (4.23 శాతం) చూసింది. గడచిన నాలుగు నెలల నుంచీ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తుండగా, వరుసగా మూడవనెల నిర్దేశిత 6 శాతం దిగువన నమోదయ్యింది. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో గత మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటును ఆర్బీఐ 6.5 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం అదుపు నేపథ్యంలో గడచిన రెండు త్రైమాసికాల్లో యథాతథంగా కొనసాగించింది. తాజా గణాంకాల ధోరణి కొనసాగితే, ఆర్బీఐ 2023లో రెపో రేటును పెంచే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. జూన్ పాలసీ సమీక్ష సందర్భంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంచనాలను మొదటి ద్వైమాసిక సమీక్షతో పోల్చితే ఇటీవలి రెండవ ద్వైమాసిక సమావేశాల్లో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ తగ్గించింది. కిత్రం 5.2 శాతం అంచనాలను స్వల్పంగా 5.1 శాతానికి కుదించింది. జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని వరుసగా 4.6 శాతం, 5.2 శాతం, 5.4 శాతం, 5.2 శాతాలుగా ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనా వేసింది. ఎల్‌నినో, రుతుపవనాలపై అంచనాల్లో ఇంకా స్పష్టత లేదని కూడా ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. తాజాగా శక్తికాంత్ దాస్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ♦ దేశంలో ద్రవ్యోల్బణం లక్ష్యం మేరకు 4 శాతానికి క్రమంగా దిగివస్తుంది. ♦ ఇటీవలి నెలల్లో ద్రవ్యోల్బణం కొంత తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ♦ రేటు నిర్ణయం అంశాలపై ఏమీ చెప్పలేని అనిశ్చితి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. ♦వృద్ధి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అధిక జనాభా, వారి పురోగతిని అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ బ్యాంక్ వృద్ధిపై కూడా ఆర్బీఐ దృష్టిపెడుతుంది. ♦ ధరల స్థిరత్వం లేకుంటే ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని మేము గుర్తించాము. ద్రవ్య విధానం– దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వంపై పూర్తి దృష్టి కేటాయింపు ఉంటుంది. ♦ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి (4 శాతం ఎగువన) ఉన్నప్పటికీ మహమ్మారి సంవత్సరాలలో ఆర్బీఐ తన పాలసీ విధానంలో వృద్ధికి ప్రాధాన్యతనిచ్చిం ది. ♦ ఆర్థిక, ద్రవ్య విధానాల చురుకైన సమన్వయం, ప్రతిస్పందన వల్ల ఎకానమీ రికవరీ త్వరిత పునరుద్ధరణకు దోహదపడింది. ♦ బ్యాంకింగ్, డిజిటలైజేషన్, టాక్సేషన్, తయారీ అలాగే కార్మికులకు సంబంధించిన వివిధ నిర్మాణాత్మక సంస్కరణలు గత కొన్ని సంవత్సరాలుగా అమలయ్యాయి. తద్వారా మధ్యస్థ, దీర్ఘకాలంలో బలమైన– స్థిరమైన వృద్ధికి పునాదులు పడ్డాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో క్షీణత తర్వాత స్థూల దేశీయోత్పత్తి త్వరితగతిన మెరుగుపడ్డానికి ఆయా అంశాలు కారణం. ♦ 2023–24లో భారత్ 6.5 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందని భావిస్తున్నాం. ఇది 2023లో ప్రపంచ దేశాలకన్నా వేగవంతమైన వృద్ధి రేటు. ♦ మూలధన వ్యయాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత హర్షణీయం. ఇది ఎకానమీలో అదనపు సామర్థ్యాన్ని సృష్టిస్తోంది. అలాగే కార్పొరేట్ పెట్టుబడి చట్రంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తుంది. ♦ నియంత్రణ, పర్యవేక్షణ విభాగాలపై కూడా ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది. బ్యాంకుల వ్యాపార నిర్ణయాల విషయంలో నిరంతరం జోక్యం చేసుకోకుండా, బ్యాంకులు– ఇతర రుణ సంస్థల వ్యాపార నమూనాలను తరచూ లోతుగా పరిశీలిస్తూ, వాటి రుణాలు–డిపాజిట్ల అసమతుల్యతలు, నిధుల స్థిరత్వం నిశితంగా ఆర్బీఐ పరిశీలిస్తుంది. ♦ ఏదైనా అనిశ్చితి, సంక్షోభం తలెత్తే పరిస్థితి ఉంటే, ముందస్తు హెచ్చరిక సంకేతాల వ్యవస్థను మా బ్యాంకింగ్ కలిగి ఉంది. ఇవి ప్రమాదాన్ని పెంచడానికి దారితీసే సూచనలను, వాటిని కట్టడి చేసే చర్యలును సూచిస్తాయి. సవాళ్లను గుర్తించడానికి బ్యాంకింగ్ వెలుపలి ఆడిటర్ల సహాయసహకారాలనూ తీసుకుంటుంది. -
సజావుగా రూ. 2వేల నోట్లు వెనక్కి..
న్యూఢిల్లీ: రూ. 2,000 నోటు ఉపసంహరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియంతా సజావుగా పూర్తి కాగలదని ధీమా వ్యక్తం చేశారు. మార్పిడి, డిపాజిట్లకు తగినంత సమయం ఇచ్చినందున ఎక్కడా రద్దీ కనిపించడం లేదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. రూ. 2వేల నోట్ల జీవితకాలం, వాటిని ప్రవేశపెట్టిన లక్ష్యం పూర్తయింది కాబట్టి ఉపసంహరిస్తున్నట్లు దాస్ వివరించారు. డెడ్‌లైన్ విధించడాన్ని సమర్థించుకుంటూ గడువంటూ లేకపోతే ఉపసంహరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించలేమని ఆయన పేర్కొన్నారు. 4.7 శాతం లోపునకు ద్రవ్యోల్బణం.. ద్రవ్యోల్బణం నెమ్మదించిందని, తదుపరి గణాంకాల్లో ఇది తాజాగా నమోదైన 4.7 శాతం కన్నా మరింత తక్కువగా ఉండవచ్చని దాస్ తెలిపారు. అలాగని, అలసత్వం ప్రదర్శించడానికి లేదని.. ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కొన్నాళ్ల క్రితం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నట్లుగా అనిపించిన సమయంలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముంచుకొచ్చి అంతర్జాతీయంగా మొత్తం పరిస్థితి అంతా మారిపోయిందని దాస్ చెప్పారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగుతుందని, ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు తగినట్లుగా ఆర్బీఐ స్పందిస్తుందని పేర్కొన్నారు. రేట్ల పెంపునకు విరామం ఇవ్వడమనేది క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టే ఉంటుంది తప్ప తన చేతుల్లో ఏమీ లేదని దాస్ చెప్పారు. స్థూలఆర్థిక పరిస్థితులు స్థిరపడుతుండటంతో వృద్ధి పుంజుకోవడానికి తోడ్పా టు లభిస్తోందని దాస్ వివరించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బాకీల సమస్య గణనీయంగా తగ్గిందన్నారు. బ్యాంకుల రుణ వితరణ పెరుగుతోందని చెప్పారు. భారత ఆర్థిక సుస్థిరతను కొనసాగించేందుకు ఆర్బీఐ సదా క్రియాశీలకంగా, అప్రమత్తంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. 7 శాతం పైనే వృద్ధి.. గత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 7 శాతం కన్నా అధికంగానే ఉండవచ్చని దాస్ చెప్పారు. 2022–23కి సంబంధించిన ప్రొవిజనల్ అంచనాలు మే 31న వెలువడనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసినట్లు దాస్ వివరించారు. అంతర్జాతీయ సవాళ్లను భారత ఎకానమీ దీటుగా ఎదురు నిల్చిందని.. భౌగోళికరాజకీయ, అంతర్గత సమస్యలను అధిగమించేందుకు అవసరమైనంతగా విదేశీ మారక నిల్వలను సమకూర్చుకుందని శక్తికాంత దాస్ చెప్పారు. నగదు కొరత.. రూ. 2 వేల కరెన్సీ నోట్ల మార్పిడి రెండో రోజున కొన్ని బ్యాంకుల్లో నగదు నిల్వలు ఖాళీ అయిపోవడంతో తాత్కాలికంగా ప్రక్రియను ఆపివేయాల్సి వచ్చింది. తిరిగి కరెన్సీ చెస్ట్ నుంచి భర్తీ చేసేంత వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, మార్పిడి కోసం కరెన్సీ కొరత ఉందంటూ పెద్దగా ఫిర్యాదులేమీ రాలేదని వివిధ బ్యాంకుల సీనియర్ అధికారులు తెలిపారు. తమ శాఖలన్నింటికీ నిరంతరాయంగా రూ. 500, రూ. 200, రూ. 100 నోట్లను సరఫరా చేస్తూనే ఉన్నామని వివరించారు. -
ఎకానమీపై ప్రభావం.. చాలా స్వల్పం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రభావం ‘‘చాలా చాలా స్వల్పం’’గానే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. చలామణీలో ఉన్న కరెన్సీలో వీటి వాటా 10.8 శాతమేనని (విలువపరంగా రూ. 3.6 లక్షల కోట్లు) వెల్లడించారు. కరెన్సీ నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగానే ఉపసంహరణ ప్రక్రియను చేపట్టినట్లు సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇంతకు ముందు 2013–14లో కూడా ఈ తరహా ప్రక్రియ నిర్వహించినట్లు, అప్పట్లో 2005కు పూర్వం ముద్రించిన నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించినట్లు ఆయన వివరించారు. స్వచ్ఛ నోట్ల విధానంలో భాగంగానే తాజాగా రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు చెప్పారు. ‘‘చలామణీలో ఉన్న కరెన్సీలో రూ. 2,000 నోట్ల వాటా కేవలం 10.8 శాతమే కాబట్టి ఎకానమీపై దీని ప్రభావం చాలా చాలా తక్కువగానే ఉంటుంది. పైగా ఈ నోట్లను లావాదేవీల్లో ఎక్కువగా ఉపయోగించడం లేదని మా పరిశీలనలో తేలింది. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావమేమీ ఉండదు’’ అని ఆయన వివరించారు. ప్రస్తుతానికి రూ. 2,000 నోట్ల చెల్లుబాటు యథాప్రకారంగానే కొనసాగుతుందన్న దాస్.. డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు నిర్దేశించిన సెప్టెంబర్ 30 తర్వాత కూడా చెల్లుబాటవడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దానిపై అప్పుడు తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. 10 నోట్లను మాత్రమే మార్చుకునేందుకు అవకాశం కల్పించడం వెనుక హేతుబద్ధతపై స్పందిస్తూ 2014 జనవరిలో కూడా దాదాపు ఇదే విధానం పాటించినట్లు దాస్ చెప్పారు. ఇక రూ. 1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టడంపై బదులిస్తూ.. అది ఊహాజనిత ప్రశ్న అని, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. పుష్కలంగా నిధులు.. ద్రవ్య నిర్వహణపై ఉపసంహరణ ప్రభావాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజల నుంచి నిధులకు ఉండే డిమాండ్‌ను బట్టి ఇది ఉంటుందన్నారు. ‘‘కొంత మొత్తం బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ అవుతుంది. మరికొంత మొత్తాన్ని మార్చుకుంటారు. మార్చుకున్న కరెన్సీ అంతా తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఖాతాల్లో డిపాజిట్ అయిన మొత్తాలను మాత్రం కస్టమర్లు బ్యాంకులోనే అట్టే పెట్టుకోవడమో లేదా తమ అవసరాల కోసం వెనక్కి తీసుకోవడమో జరగొచ్చు. ఏదైనా బ్యాంకింగ్ వ్యవస్థలో పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నాయి’’ అని దాస్ చెప్పారు. ప్రస్తుత నిబంధనలే కొనసాగింపు... వ్యవస్థలోకి నల్లధనం వచ్చే అవకాశాలపై స్పందిస్తూ.. ఖాతాలో డిపాజిట్ చేయాలన్నా, నోట్లను మార్చుకోవాలన్నా ప్రస్తుతం నిర్దిష్ట ప్రక్రియ ఉందని దాస్ చెప్పారు. దాన్నే కొనసాగించాలని బ్యాంకులకు సూచించామని, అదనంగా కొత్త నిబంధనలేమీ పెట్టలేదని తెలిపారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం రూ. 50,000 దాటి నగదు డిపాజిట్ చేస్తే పాన్ తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందన్నారు. ఇక ఈ కసరత్తుతో కరెన్సీ నిర్వహణ వ్యవస్థపై పడే ప్రభావాలకు సంబంధించిన ప్రశ్నలకు స్పందిస్తూ.. మన వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. తోటి దేశాలతో పోలిస్తే డాలరుతో భారత కరెన్సీ మారకం ఒడిదుడుకులకు లోనవడం చాలా తక్కువేనని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం, సంపన్న దేశాల్లో కొన్ని బ్యాంకుల మూసివేతతో అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సంక్షోభాలు తలెత్తినప్పటికీ భారతీయ కరెన్సీ స్థిరంగా నిల్చుందని దాస్ తెలిపారు. అప్పుడేం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను ప్రస్తుతం రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటవడం కొనసాగుతుందని దాస్ చెప్పారు. ఎన్ని నోట్లు తిరిగి వస్తాయో వేచిచూడాల్సి ఉంటుందన్నారు. ‘‘ఇప్పటికైతే చాలా మటుకు నోట్లు తిరిగి వచ్చేస్తాయనే అనుకుంటున్నాం. ఎన్ని వస్తాయన్నది చూడాలి. సెప్టెంబర్ 30 (మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు ఆఖరు తేది) దగ్గరయ్యే కొద్దీ తగిన నిర్ణయాలు తీసుకుంటాం. దాని గురించి ఇప్పుడే నేను ఊహాజనిత సమాధానాలు ఇవ్వలేను’’ అని దాస్ వ్యాఖ్యానించారు. నోట్ల మార్పిడికి, బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు బోలెడంత సమయం ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విదేశీ పర్యటనల్లో ఉన్న వారు, వర్క్ వీసాలతో విదేశాల్లో ఉన్న వారు ఎదుర్కొనే సమస్యలను కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని, ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలుగకుండా ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటమే తమ ప్రధాన ఉద్దేశమని దాస్ వివరించారు. నీరు, నీడ కల్పించండి.. రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు వచ్చే కస్టమర్లకు తగు సౌకర్యాలు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎండలో పడిగాపులు కాసే పరిస్థితి రాకుండా తగు నీడ, తాగడానికి నీరు వంటి సదుపాయాలు అందించాలని పేర్కొంది. నోట్ల మార్పిడి, డిపాజిట్ల డేటాను రోజువారీ రికార్డులను నిర్వహించాలని ఒక నోటిఫికేషన్లో సూచించింది. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు నోట్లను మార్చుకునేందుకు చాంతాడంత లైన్లలో నిలబడి పలువురు మరణించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పీఎస్బీ చీఫ్‌లతో భేటీ.. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) చైర్మన్లు, డైరెక్టర్లతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం సమావేశమయ్యారు. బ్యాంకుల్లో గవర్నెన్స్, నైతిక విలువలు తదితర అంశాలపై చర్చించారు. -
ఆర్బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక మూడు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. 3, 5, 6 తేదీల్లో సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ మçహావీర్ జయంతి సందర్భంగా సెలవు. ఈ సమావేశాల్లో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. -
ఎకానమీకి ‘యుద్ధం’ సెగ!
ముంబై: భారత్ ఎకానమీపై ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, ఈ నేపథ్యంలో తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావం తీవ్రంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎకానమీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో ఈ అంచనా 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. ఇక పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అప్పర్ బ్యాండ్ దిశలో ద్రవ్యోల్బణం అంచనా పెరగడం కొంత ఆందోళనకరమైన అంశం. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచుతూ వృద్ధికి ఊతం ఇవ్వడం తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని ఆర్బీఐ ప్రకటించింది. ద్రవ్యోల్బణం కట్టడి దిశలో వ్యవస్థలో ఒకపక్క అదనంగా ఉన్న లిక్విడిటీ (ద్రవ్య లభ్యతను) వెనక్కు తీసుకుంటూనే మరో వైపు వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించాలని సమీక్షా సమావేశం నిర్ణయించింది. దీనితో ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లోనూ ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా కొనసాగించినట్లయ్యింది. వృద్ధికి–ఎకానమీ సమతౌల్యతకు అనుగుణమైన (అకామిడేటివ్) పాలసీ విధానాన్ని కొనసాగిస్తామని సమీక్షా సమావేశం పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక సమీక్షా సమావేశం తీసుకున్న మరికొన్ని కీలక నిర్ణయాలు పరిశీలిస్తే... ► బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీకి (ద్రవ్య లభ్యత)కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా మార్జినల్ స్టాడింగ్ ఫెసిలిటీ రేటును (ఎంఎస్ఎఫ్) కూడా యథాపూర్వ 4.25 శాతం వద్ద కొనసాగనుంది. ద్రవ్య కొరతను ఎదుర్కొంటున్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బును అందించి వసూలు చేసే వడ్డీరేటు ఇది. స్వల్పకాలిక (ఓవర్‌నైట్) నిధుల అవసరాలకు బ్యాంకింగ్ ఈ విండోను వినియోగించుకుంటుంది. ► లిక్విడిటీ సమస్యల నివారణకు బ్యాంక్ రేటు కూడా యథాతథంగా 4.25%గా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, రెపో రేటు అనేది బాం డ్ల కొనుగోలు ప్రక్రియ ద్వారా వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇచ్చే రేటు. అయితే బ్యాంక్ రేటు అనేది వాణిజ్య బ్యాం కులు ఎటువంటి పూచీకత్తు లేకుండా ఆర్బీఐ నుండి రుణం పొంది, అందుకు చెల్లించే వడ్డీరేటు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ (ఇండియన్ బాస్కెట్) బ్యారల్ ధర 100 డాలర్లుగా అంచనావేసింది. ఈ ప్రాతిపదికన వృద్ధి అంచనాలను కుదించింది. ► గ్రామీణ ప్రాంతంలో డిమాండ్ రికవరీకి రబీ ఉత్పత్తి దోహదపడుతుంది. ► కాంటాక్ట్–ఇంటెన్సివ్ సేవలు పుంజుకునే అవ కాశాలు కనిపిస్తున్నాయి. హోటల్లు, రెస్టారెంట్లు, టూరిజం–ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, అడ్వెంచర్/హెరిటేజ్ సౌకర్యాలు, విమానయాన అనుబంధ సేవలు ఈ విభాగం కిందకు వస్తాయి. ► ప్రభుత్వ పెట్టుబడుల ప్రణాళిక, బ్యాంకింగ్ రుణ వృద్ధి, వ్యాపార విశ్వాసం మెరుగుపడ్డంతో దేశంలో పెట్టుబడుల క్రియాశీలత పుంజుకుంటుంది. ► ఆర్బీఐ నియంత్రణలోని ఫైనాన్షియల్ మార్కెట్ల ప్రారంభ సమయం ఏప్రిల్ 18 నుండి ఉదయం 9. ఈ మేరకు మహమ్మారి ముందస్తు సమయాన్ని పునరుద్ధరించడం జరిగింది. ► హేతుబద్ధీకరించబడిన గృహ రుణ నిబంధన లు 2023 మార్చి 31వ తేదీ వరకు పొడిగింపు. ► వాతావరణానికి సంబంధించి సమస్యలు, నివారణకు తగిన నిధుల కల్పనపై త్వరలో ఒక చర్చా పత్రం విడుదల ► ఆర్బీఐ నియంత్రిత సంస్థల్లో వినియోగదారుల సేవల ప్రమాణాల సమీక్ష కోసం కమిటీ. ఇక కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్స్... యూపీఐ వినియోగం ద్వారా కార్డ్ లెస్ నగదు ఉపసంహరణ సౌలభ్యతను అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్‌లకు విస్తరించాలని ఆర్బీఐ నిర్ణయించింది. మోసాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ, ఏటీఎంల ద్వారా కార్డ్–లెస్ నగదు ఉపసంహరణకు దేశంలోని కొన్ని బ్యాంకులకు అనుమతి ఉంది. అదనపు లిక్విడిటీకి ‘ఎస్డీఎఫ్’ మందు వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) ఉపసంహరణ ప్రక్రియకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. రానున్న కొన్ని సంవత్సరాల్లో క్రమంగా మహమ్మారి ముందస్తు సాధారణ స్థాయిలకు ద్రవ్యతను తీసుకువెళ్లాలన్న లక్ష్య సాధనకు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) ఇన్స్ట్రమెంట్ను ప్రవేశపెట్టింది. తద్వారా లిక్విడిటీ అడ్జెస్ట్మెంట్ ఫెసిలిటీ (ఎల్ఏఎఫ్)ను ప్రస్తుత 0.9 శాతం నుంచి 0.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. ఈ రేటు 3.75 శాతంగా ఉంటుంది. గృహ విక్రయాలకు ఊతం గృహ విక్రయాలు పెరగడానికి పాలసీ దోహదపడుతుంది. కోవి డ్–19 అనంతరం కీలక సమస్యల్లో ఉన్న పలు రంగాల పురోగతికి, ఆర్థికాభివృద్ధికి విధాన నిర్ణయాలు బలం చేకూర్చుతాయి. అదనపు లిక్విడిటీని వెనక్కు తీసుకునేందుకు చర్యలతోపాటు వ్యవస్థలో ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందీ లేకుండా తీసుకున్న చర్యలు హర్షణీయం. – హర్ష వర్థన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్ ఆచరణాత్మక విధానం ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి వాతావరణంలో ఆచరణాత్మక విధాన నిర్ణయాలను ఆర్బీఐ తీసుకుంది. ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలు సరిగ్గా మదింపు చేసింది. వృద్ధికి విఘాతం కలగని రీతిలో లిక్విడిటీ సర్దుబాటు చర్యలు తీసుకుంది. ప్రభుత్వ రుణ సమీకరణ విధానానికి మద్దతుగా పలు చర్యలు ఉన్నాయి. దీర్ఘకాలంలో పటిష్ట వృద్ధికి దోహదపడే విధానమిది. –దినేష్ ఖారా, ఎస్బీఐ చీఫ్ చదవండి: చదవండి: డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లకు లైన్ క్లియర్, ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు! -
డిపాజిట్ బీమాతో బ్యాంకులపై ధీమా
న్యూఢిల్లీ: ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిపాజిట్ బీమా సంస్కరణలు .. బ్యాంకింగ్ వ్యవస్థపై ఖాతాదారుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో బ్యాంకు విఫలమైనా, డిపాజిటర్ల సొమ్ము భద్రంగా ఉంటుందనే భరోసా ఈ సంస్కరణలతో లభించిందని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా పరిమితిని ప్రభుత్వం ఇటీవల రూ. 5 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. సంక్షోభంలో ఉన్న బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన పక్షంలో ఈ స్థాయి వరకూ డిపాజిట్లు ఉన్న వారు.. 90 రోజుల్లోగా తమ డబ్బు పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. సంబంధిత చట్టాన్ని అమల్లోకి తెచ్చాక గత కొద్ది రోజుల్లో సుమారు 1 లక్ష మంది పైగా ఖాతాదారులకు రూ. 1,300 కోట్ల పైచిలుకు అందిందని ప్రధాని చెప్పారు. ఆర్బీఐ మారటోరియం ఆంక్షలు ఎదుర్కొంటున్న మిగతా బ్యాంకుల్లోని మరో 3 లక్షల మంది ఖాతాదారులకు కూడా త్వరలో వారి డిపాజిట్ మొత్తం లభించగలదని ఆయన తెలిపారు. 16 పట్టణ సహకార బ్యాంకుల డిపాజిట్‌దారుల నుంచి వచ్చిన క్లెయిమ్స్‌కు సంబంధించి తొలి విడత చెల్లింపులను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇటీవలే విడుదల చేసిందని మోదీ చెప్పారు. రెండో విడత డిసెంబర్ 31న విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. డిపాజిటర్ల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి..: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశ పురోగతిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తాయని, బ్యాంకులు బాగుండాలంటే డిపాజిటర్ల సొమ్ము సురక్షితంగా ఉండటం కూడా చాలా ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. అటు మధ్యతరగతి గృహ కొనుగోలుదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని .. ఆర్థిక సమస్యలతో నిల్చిపోయిన పలు హౌసింగ్ ప్రాజెక్టులకు నిధులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. అధిక వడ్డీలకు ఆశపడితే రిస్కు: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధిక వడ్డీ రాబడుల కోసం ఆశపడితే అసలుకే ఎసరు వచ్చే ముప్పు ఉంటుందని డిపాజిట్‌దారులను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు. అధిక రాబడులు లేదా అధిక వడ్డీ రేట్లతో రిస్కులు కూడా ఎక్కువగానే ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలని ’డిపాజిటర్స్ ఫస్ట్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సూచించారు. -
ప్రైవేటు బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ గవర్నర్...!
ముంబై: బ్యాలెన్స్ షీట్ల పటిష్టతపై దృష్టి సారించి, ఇందుకు సంబంధించి తగిన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాలని ప్రైవేటు రంగ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ ఆదేశించారు. ఒడిదుడుకులు తట్టుకునేలా బ్యాలెన్స్ షీట్స్ ఉండాలని సూచించారు. వ్యక్తులు, వ్యాపార సంస్థలకు ఇచ్చే రుణాలుసహా వివిధ ఫైనాన్షియల్ సేవలు అన్నింటికీ తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్) కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటురంగ బ్యాంకర్లతో గవర్నర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం సమావేశ వివరాలపై ఒక ప్రకటన వెలువడింది. ప్రకటన ప్రకారం, మహమ్మారి కరోనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనడంలో భాగంగా ఆర్బీఐ ఇటీవల ప్రకటించిన చర్యలను సత్వరం అమలు చేయాలని సూచించారు. దేశ ప్రస్తుత ద్రవ్య– ఆర్థిక పరిస్థితులు, చిన్న రుణ గ్రహీతలు అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)సహా వివిధ రంగాలకు రుణ లభ్యత, కోవిడ్ రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ వంటి అంశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. ద్రవ్య పరపతి విధాన నిర్ణయ ఫలాల బదలాయింపు, కోవిడ్ సవాళ్లను ఎదుర్కొనడానికి ఆర్బీఐ తీసుకున్న విధాన నిర్ణయాల అమలుపైనా చర్చ జరిగింది. ప్రస్తుత సవాళ్లలో బ్యాంకులు పోషిస్తున్న క్రియాశీల పాత్రను గవర్నర్ ప్రశంసించారు. సమావేశంలో డిప్యూటీ గవర్నర్లు ఎంకే జైన్, ఎం రాజేశ్వర రావు, మైఖేల్ డీ పాత్ర, టీ రబి శంకర్ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొనే క్రమంలో వ్యక్తులు, చిన్న సంస్థలకు రుణాల పునరుద్ధరణ, రుణ పునర్ వ్యవస్థీకరణ, వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50,000 కోట్లు, టీకాల తయారీ, ఆస్పత్రులు, ల్యాబ్‌లకు రుణాలు, రాష్ట్రాల ఓవర్‌డ్రాఫ్ట్ నిబంధనలు సరళతరం, రూ.35వేల కోట్లతో జీ–సెక్‌ల కొనుగోలు వంటి పలు చర్యలను ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ వృద్ధి మంత్రం!
ముంబై: వృద్ధికి మద్దతుగా కీలకమైన వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకూడదని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. దీంతో ప్రస్తుత రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా కొనసాగనున్నాయి. అదే విధంగా ఇప్పటి వరకు అనుసరిస్తున్న సర్దుబాటు విధానాన్నే ఇక ముందూ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పరిస్థితులకు తగ్గట్టు అవసరమైతే రేట్ల కోతకు అవకాశం ఉంటుందని సంకేతమిచ్చింది. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకునేందుకు గాను గతేడాది 1.15 శాతం మేర ఆర్బీఐ రేట్లను తగ్గించిన విషయం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ బాండ్లను రూ.లక్ష కోట్ల మేర ప్రస్తుత త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) కొనుగోలు చేస్తామని ఆర్బీఐ ఎంపీసీ ప్రకటించింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ రుణ వ్యయాలను తగ్గించడంతోపాటు, బాండ్ ఈల్డ్స్‌ను అదుపులో ఉంచేలా వ్యవహరించనుంది. వృద్ధికి ఎంతో ప్రాముఖ్యత వృద్ధికి ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. ఎంపీసీ సమావేశం తర్వాత నిర్ణయాలను వెల్లడిస్తూ మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకుని పరుగు అందుకునే వరకు ఆర్బీఐ అన్ని విధాలుగా (కనిష్ట వడ్డీ రేట్లు, తగినంత ద్రవ్య లభ్యత చర్యలు) మద్దతుగా నిలుస్తుందన్నారు. కనిష్ట రివర్స్ రెపో విధానం నుంచి ఆర్బీఐ ఎప్పుడు బయటకు వస్తుందన్న ప్రశ్నకు.. కాలమే నిర్ణయిస్తుందని బదులిచ్చారు. వ్యవస్థలో ద్రవ్య లభ్యతను దృష్టిలో పెట్టుకుని.. తటస్థ చర్యలను తీసుకోవడంపై అవగాహన కలిగి ఉన్నామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ డీ పాత్ర పేర్కొన్నారు. వృద్ధి 10.5 శాతం... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021–22) జీడీపీ 10.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న గత సమీక్ష సందర్భంగా వేసిన అంచనాలను ఆర్బీఐ ఎంపీసీ కొనసాగించింది. అదే సమయంలో పెరుగుతున్న కరోనా కేసులు దీనిపై అనిశ్చితికి దారితీసినట్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘క్యూ1లో (ఏప్రిల్–జూన్) 26.2 శాతం, క్యూ2లో (జూలై–సెప్టెంబర్) 8.3 శాతం, క్యూ3లో (అక్టోబర్–డిసెంబర్) 5.4 శాతం, క్యూ4లో (2022 జనవరి–మార్చి) 6.2 శాతం చొప్పున వృద్ధి నమోదు కావచ్చు’’ అని ఆర్బీఐ ఎంపీసీ పేర్కొంది. అంతర్జాతీయంగా ఫిబ్రవరి నుంచి కమోడిటీ ధరలు పెరగడం, ఆర్థిక మార్కెట్లలో పెరిగిన అనిశ్చితి వృద్ధి రేటును కిందకు తీసుకెళ్లే రిస్క్‌లుగా దాస్ పేర్కొన్నారు. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, మరిన్ని వర్గాలకు విస్తరించడం, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పెట్టుబడులను పెంచే చర్యలు వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా చెప్పారు. 2021–22 బడ్జెట్లో ప్రకటించిన పెట్టుబడి చర్యలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్ఐ), సామర్థ్య విస్తరణ అన్నవి ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు సాయపడతాయని ఆర్బీఐ గవర్నర్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే.. రిటైల్ ద్రవ్యోల్బణం 4.4–5.2 శాతం మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. ఆహార ధాన్యాల భారీ దిగుబడి.. ధరలు తగ్గేందుకు సాయపడతుందని పేర్కొంది. అదే సమయంలో నైరుతి రుతుపవనాల పురోగతిపైనా ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది. వచ్చే ఐదేళ్లపాటు ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో.. ఎగువవైపు 6 శాతం.. దిగువ వైపు 2 శాతం దాటిపోకుండా చూడాలన్నది ఆర్బీఐ లక్ష్యంగా ఉంది. అవసరమైనంత కాలం అండగా... వృద్ధి రేటు నిలకడగా, స్థిరంగా కొనసాగేందుకు అవసరమైనంత కాలం, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తొలగిపోయేంత వరకు సర్దుబాటు ధోరణిని కొనసాగించాలని ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. రానున్న రోజుల్లోనూ ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్య పరిధిలోనే ఉంటుంది. ఇటీవల కరోనా ఇన్ఫెక్షన్ కేసులు భారీగా పెరగడం భవిష్యత్తు వృద్ధి అంచనాలపై అనిశ్చితికి దారితీసింది. ముఖ్యంగా స్థానిక, ప్రాంతీయ లాక్డౌన్లు ఇటీవలే మెరుగుపడిన డిమాండ్ పరిస్థితులను దెబ్బతీస్తాయా? సాధారణ పరిస్థితులు ఏర్పడడాన్ని ఆలస్యం చేస్తాయా? అన్నది చూడాల్సి ఉంది. అయితే, ఇన్ఫెక్షన్లు పెరిగిపోవడం వల్ల తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పుడు మరింత మెరుగైన సన్నద్ధతతో ఉన్నాం. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పెద్దగా పడకుండా చూసేందుకు ద్రవ్య, పరపతి యంత్రాంగాలు సమన్వయంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. సర్దుబాటు ధోరణికి తగినట్టు వ్యవస్థలో ద్రవ్య లభ్యత పుష్కలంగా ఉండేలా ఆర్బీఐ చూస్తుంది. అంటే ఫైనాన్షియల్ మార్కెట్, ఉత్పత్తి రంగాల అవసరాలకు మించి నగదు లభ్యత ఉండేలా చూడడం. ఆర్థిక స్థిరత్వం కోసం చేయాల్సినదంతా ఆర్బీఐ చేస్తుంది. అంతర్జాతీయ ప్రభావాలు, అస్థిరతలను దేశీ ఫైనాన్షియల్ మార్కెట్లు తట్టుకునేలా తగిన చర్యలతో రక్షణ కల్పిస్తాం. నేటి పరిస్థితుల్లో మారటోరియం (రుణ చెల్లింపులపై కొంత కాలం విరామం) అవసరం లేదు. ప్రైవేటు రంగం తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు తగిన సన్నద్ధతతో ఉంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను తొలగించేందుకు హామీతో కూడిన, నిరంతర ద్రవ్య లభ్యతకు కట్టుబడి ఉన్నట్టు ఆర్బీఐ ప్రకటన స్పష్టం చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో సవాళ్లను అధిగమించేందుకు స్పష్టమైన మార్గదర్శనం చూపించింది. వృద్ధిపై స్పష్టమైన ముద్ర వేసింది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ రెపో రేటును యథాతథంగా కొనసాగించడంతోపాటు ఆర్బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగించింది. పుష్కలంగా ద్రవ్య లభ్యత ఉండేలా చూస్తామని ఆర్బీఐ గవర్నర్ ప్రకటించడం.. ఎన్‌హెచ్‌బీకి అదనంగా రూ.10,000 కోట్లు సమకూర్చడం అన్నది.. ప్రాజెక్టుల పూర్తికి నిధుల కొరతను ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ పరిశ్రమకు సాయపడేవి. – హర్షవర్ధన్ పటోడియా, క్రెడాయ్ జాతీయ ప్రెసిడెంట్ రూ.లక్ష కోట్లతో ప్రభుత్వ సెక్యూరిటీలు సెకండరీ మార్కెట్ ప్రభుత్వ సెక్యూరిటీల (జీసెక్‌లు) కొనుగోలు కార్యక్రమాన్ని (జీ–ఎస్ఏపీ) ఆర్బీఐ ప్రకటించింది. దీని ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.3లక్షల కోట్ల మేరకు ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. బాండ్‌ఈల్డ్స్ గమనా న్ని గాడిలో పెట్టేందుకు (బాండ్ ఈల్డ్స్‌లో క్రమబద్ధత) ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘మానిటరీ పాలసీకి అనుగుణంగా బ్యాలన్స్ షీటును కొసాగించేందుకు ఆర్బీఐ మొదటిసారి నిర్ణయించింది. ప్రతీ త్రైమాసికంలో రూ.లక్ష కోట్ల మేర (ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3లక్షల కోట్లు) మార్కెట్‌కు అందించనున్నాం’ అని మేఖేల్ డి పాత్ర తెలిపారు. బాండ్ల కొనుగోలు అన్నది ఇతర ప్రధాన సెంట్రల్ బ్యాంకులు అనుసరించిన విధానం మాదిరేనన్నారు. మొదటగా ఏప్రిల్ 15న రూ. 25,000 కోట్ల వరకు ప్రభుత్వ సెక్యూరిటీలను ఆర్బీఐ కొనుగోలు చేయనుంది. రాష్ట్రాలకు నిధుల సాయం కొనసాగింపు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మధ్యంతర వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏఎస్) కింద రూ.51,560 కోట్ల సాయాన్ని పొందే గడువును వచ్చే సెప్టెంబర్ వరకు పొడిగిస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. కరోనా రెండో విడత ప్రభావాలను ఎదుర్కొనేందుకు గాను రాష్ట్రాలకు ఈ మేరకు సాయం అందించనున్నట్టు ప్రకటించింది. ఆదాయాలు, వ్యయాల మధ్య అంతరాలను గట్టేందుకు గాను రాష్ట్రాలకు అందించే తాత్కాలిక రుణ సదుపాయమే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెన్స్. అలాగే, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రస్తుతం ఒక ఆర్థిక సంవత్సరంలో అందించే అగ్రిగేట్ డబ్ల్యూఎంఏ సాయం రూ.32,225 కోట్లుగా ఉండగా.. దీన్ని 46% పెంపుతో రూ.47,010 కోట్లు చేస్తూ ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. నాబార్డ్, సిడ్బి, ఎన్‌హెచ్‌బీలకు రూ.50వేల కోట్లు ఆర్థిక వ్యవస్థలోని వివిధ విభాగాలకు రుణ వితరణ సక్రమంగా అందేలా చూసేందుకు జాతీయ ఆర్థిక సంస్థలకు అదనంగా రూ.50వేల కోట్లను ఆర్బీఐ అందించనుంది. నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)కు రూ.25,000 కోట్లు, నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ)కు రూ.10,000 కోట్లు, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు (సిడ్బి)కు రూ.15,000 కోట్లు లభిస్తాయి. వ్యాలెట్ల మధ్య నగదు బదిలీలు చెల్లింపుల సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఆర్బీఐ పలు చర్యలను తాజా సమీక్షలో ప్రకటించింది. ఎన్బీఎఫ్సీలు, ఇతర చెల్లింపుల సేవల సంస్థలు, పేమెంట్ బ్యాంకులు ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు వీలు కల్పించింది. ఆర్బీఐ నిర్వహణలోని కేంద్రీకృత చెల్లింపుల సేవలైన (సీపీఎస్) ఆర్టీజీఎస్, నెఫ్ట్లను ఆర్బీఐ నియంత్రణ పరిధిలోని పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దాస్ ప్రకటించారు. ఆపరేటర్లు ఇందుకు గాను సీపీఎస్ సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుందని.. డిజిటల్ ఆర్థిక సేవలు మరింత మందికి చేరుకునేందుకు ఇది సాయపడుతుందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పారు. ప్రీపెయిడ్ చెల్లింపుల సేవలను అందించే సంస్థలు (ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్/పీపీఐ).. తమ కస్టమర్లు ఇతర సంస్థల పరిధిలోని కస్టమర్లతో లావాదేవీలు నిర్వహించుకునేలా ఇంటర్ ఆపరేబులిటీని అమలు చేసే చర్యలను చేపట్టనున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. ఈ సేవలను అందించే ఎంపికను పీపీఐలకు ఇచ్చామని.. ఒక పీపీఐ పరిధిలోని కస్టమర్ మరో పీపీఐ/బ్యాంకు పరిధిలోని కస్టమర్‌కు నగదు బదిలీలు చేసుకోవచ్చని దాస్ చెప్పారు. పీపీఐ పరిధిలో ఒక కస్టమర్‌కు సంబంధించి బ్యాలన్స్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు పెంచింది. పూర్తి స్థాయి కేవైసీ కస్టమర్లకే ఇది వర్తిస్తుంది. -
కరోనా ఉధృతి: ఆర్బీఐ కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థికసంవత్సరంలో మొదటి పాలసీ సమీక్ష ఇది. తాజా నిర్ణయంతో రెపో రేటు 4శాతం వద్ద,రివర్స్ రెపో రేటు 3.5 శాతం వద్ద కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం వెల్లడించారు. రేట్లను యధాతథంగా ఉంచేందుకు మానిటరీ పాలసి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ తన ద్వి-నెలవారీ ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను ఈ రోజు ప్రకటించింది. రెండో దశలో కరోనా వైరస్ కేసులు పెరగడం, తాజా ఆంక్షలునేపథ్యంలో బెంచ్‌మార్క్ రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించిందని శక్తి కాంత్‌దాస్ వివరించారు. వృద్ధికి తోడ్పడటానికి , ద్రవ్యోల్బణ టార్గెట్‌ను సాధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండో దశలో విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి ఆర్థికవృద్ధి, రికవరీపై అనిశ్చితిని సృష్టించిందని గవర్నర్ చెప్పారు. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 10.5 శాతంగా, సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగానూ అంచనా వేసిందన్నారు. -
వడ్డీ రేట్లలో ఆర్బీఐ కీలక మార్పులు
-
వినియోగదారులకు ఆర్బీఐ ఊరట
న్యూఢిల్లీ : కేంద్ర రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను చేసింది. వడ్డీరేట్లు 40 బేసిస్ పాయింట్లను ఆర్బీఐ తగ్గించింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా సమావేశంలో ప్రకటించారు. రెండు నెలల్లో 3 సార్లు వడ్డీరేట్లపై ఆర్బీఐ సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంది. రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటు 3.35 శాతానికి తగ్గించింది. ‘భారత విదేశీ మారక నిల్వలు 487 బిలియన్ యూఎస్ డాలర్లు ఉన్నాయి. మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గింది. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడింది. ముడి పదార్థాల ఇన్పుట్ ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోంది. తక్కువ ధరలో రుణాలు, వడ్డీరేట్లు తగ్గడంతో సామాన్యుడికి ఊరట లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పెట్టుబడులపై తీవ్ర పరిణామం చూపిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా కట్టడి చేస్తాం. 13 నుంచి 32 శాతం మేర ప్రపంచ వాణిజ్యం తగ్గింది. 4 కేటగిరిలుగా ఎగుమతులు, దిగుమతులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వర్కింగ్ కేపిటల్ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సిడ్బీ రుణాలపై మారటోరియం మరో 90 రోజులు పెంపు ఉంటుంది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగింపు ఉంటుంది. టర్మ్‌లోన్లకు వర్తించేలా మారటోరియం పొడిగింపు ఉంటుంది’ అని శక్తికాంత్ దాస్ అన్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ విధింపు నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్‌కు ఇది మూడో ప్రతికా సమావేశం. ఇప్పటికే మార్చి 27న మొదటిసారి, ఏప్రిల్ 17న రెండోసారి కోవిడ్ -19 సంబంధిత సమావేశాలు నిర్వహించారు. మొదటి రెండు సమావేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటి ఒత్తిడిని తగ్గించడానికి, కోవిడ్-19 వ్యాధి నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలను ప్రకటించారు. అందులో భాగంగా మార్చిలో ఏకంగా 75బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు, రూ.5 లక్షల కోట్ల విలువైన ద్రవ్య చర్యలు ఉన్నాయి. వీటితో పాటు మార్చి 1 మరియు మే 31 మధ్య అన్ని కాల వ్యవధి రుణాల చెల్లింపులపై 3నెలల తాత్కలిక నిషేధాన్ని ప్రకటించారు. -
ఉదయం 10గంటలకు ఆర్బీఐ గవర్నర్ మీడియా సమావేశం
కేంద్ర రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ ఇవాళ ఉదయం 10:00గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం లాక్డౌన్ విధింపు మే 31వరకు వరకు పొడగించిన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ పత్రికా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అన్ని రకాల టర్మ్లోన్ల చెల్లింపులపై మారిటోరియంను మరికొన్ని నెలలపాటు పొడిగించే అవకాశం ఉంది. బ్యాంకింగ్ నాన్ ఫైనాన్స్ కంపెనీలకు, చిన్న పారిశ్రామిక కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ద్రవ్య మద్దతు చర్యల కొనసాగింపును గవర్నర్ ప్రకటించవచ్చు. లాక్డౌన్ కారణంగా ఇప్పటికే నష్టపోయినా పరిశ్రమలకు మరింత వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. కేంద్రం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, రాయితీలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశవ్యాప్త లాక్డౌన్ విధింపు నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్‌కు ఇది మూడో ప్రతికా సమావేశం. ఇప్పటికే మార్చి 27న మొదటిసారి, ఏప్రిల్ 17న రెండోసారి కోవిద్1-9 సంబంధిత సమావేశాలు నిర్వహించారు. మొదటి రెండు సమావేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటి ఒత్తిడిని తగ్గించడానికి, కోవిద్-19 వ్యాధి నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలను ప్రకటించారు. అందులో భాగంగా మార్చిలో ఏకంగా 75బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు, రూ.5 లక్షల కోట్ల విలువైన ద్రవ్య చర్యలు ఉన్నాయి. వీటితో పాటు మార్చి 1 మరియు మే 31 మధ్య అన్ని కాల వ్యవధి రుణాల చెల్లింపులపై 3నెలల తాత్కలిక నిషేధాన్ని ప్రకటించారు. -
విదేశీ ఎక్సే్చంజీల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్!
న్యూఢిల్లీ: విదేశీ సంస్థల నుంచి దేశానికి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే కీలక చర్యలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శ్రీకారం చుడుతోంది. విదేశీ ఎక్సే్చంజ్‌ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్‌కు తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ‘‘గ్లోబల్ ఇండెక్స్‌లను నిర్వహించే పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు పురోగతిలో ఉన్నాయి. అయితే ఎప్పటిలోగా ప్రభుత్వ బాండ్లు విదేశీ ఎక్సే్చంజ్‌ల్లో లిస్టవుతాయన్న విషయాన్ని మాత్రం నేను చెప్పలేను’’ అని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. విదేశీ ఎక్సే్చంజ్‌ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్‌కు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సుదీర్ఘకాలంగా సూచనలు అందుతున్నాయి. అయితే దీనికి 2020–21 బడ్జెట్లోనే సూత్రప్రాయ ఆమోదముద్ర పడింది. ‘‘కొన్ని నిర్దిష్ట కేటగిరీల ప్రభుత్వ బాండ్లను నాన్–రెసిడెంట్ ఇన్వెస్టర్లకు ఉద్దేశించడం జరుగుతోంది. దేశీయ ఇన్వెస్టర్లతోపాటు విదేశీ ఇన్వెస్టర్లకూ ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయి’’ అని తన ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా ద్రవ్య స్థిరత్వానికి ఆర్బీఐ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, 50 ఎన్‌బీఎఫ్‌సీల పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోందని గవర్నర్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బ్యాంకులుసహా ఫైనాన్షియల్ విభాగం మొత్తం ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందనీ ఆయన పేర్కొన్నారు. -
పడిపోతున్న ఆదాయంతో సవాలే..
ముంబై: పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం ద్రవ్య గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పన్ను, పన్నేతర ఆదాయం లక్ష్యాలకు దూరంగా ఉండడంతోపాటు, ప్రైవేటు పెట్టుబడులు, వినియోగం బలహీనపడడం సవాలుగా పేర్కొంది. శుక్రవారం ముంబైలో విడుదల చేసిన 25వ ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’లో ఈ అంశాలను ప్రస్తావించింది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడింది. బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు తమ బ్యాలన్స్ షీట్ల ప్రక్షాళనకు తీసుకున్న చర్యల వల్ల బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడుతున్నట్టు తెలిపింది. నవంబర్ నాటికే ద్రవ్యలోటు నిర్ణీత లక్ష్యంలో 107 శాతానికి చేరిపోవడంతో.. జీడీపీలో ద్రవ్యలోటును 3.3 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంపై సందేహాలు వ్యక్తమవుతుండడం ఆర్బీఐ వ్యాఖ్యల్లోనూ కనిపించింది. అలాగే, జీఎస్టీ వసూళ్లు కూడా ఆశించిన మేర లేవు. మరోవైపు కార్పొరేట్ పన్ను కోత కారణంగా ప్రభుత్వానికి రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోనుంది. ‘‘ద్రవ్యలోటు గణాంకాలు గత కొన్నేళ్లలో మెరుగుపడ్డాయి. కానీ, ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలహీన పడడం కారణంగా తగ్గిపోతున్న ఆదాయంతో ద్రవ్యలోటు సవాలు కాగలదు’’ అని ఆర్బీఐ స్థిరత్వ నివేదిక పేర్కొంది. స్థూల ఎన్పీఏలు పెరగొచ్చు స్థూల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు కారణంగా బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2020 సెప్టెంబర్ నాటికి 9.9 శాతానికి పెరగొచ్చని ఈ నివేదిక పేర్కొంది. 2019 సెప్టెంబర్ నాటికి ఇవి 9.3 శాతంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న 9.3 శాతం స్థాయిలోనే స్థిరంగా ఉండడం గమనార్హం. ప్రభుత్వరంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 12.7 శాతం నుంచి 13.2 శాతానికి, ప్రైవేటు బ్యాంకుల్లో ఇది 3.9 శాతం నుంచి 4.2 శాతానికి.. అదే విధంగా దేశంలో పనిచేసే విదేశీ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు 2.9% నుంచి 3.1 శాతానికి పెరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఎన్‌బీఎఫ్‌సీల్లోనూ ఇదే పరిస్థితి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆస్తుల నాణ్యత ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ఎన్బీఎఫ్సీ రంగంలో స్థూల ఎన్పీఏలు 6.1 శాతం నుంచి 6.3 శాతానికి పెరిగాయని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో నికర ఎన్పీఏలు మాత్రం స్థిరంగా 3.4 శాతం వద్దే ఉన్నాయని తెలిపింది. క్యాపిటల్ టు రిస్క్ అసెట్స్ రేషియో (సీఆర్ఏఆర్) నిర్దేశిత 20% కంటే తక్కువగా 19.5 శాతం వద్ద ఉంది. రూ.5 కోట్లు దాటితే చెప్పాలి.. రూ.5 కోట్లు, అంతకుమించి రుణాల సమాచారాన్ని.. భారీ రుణాల కేంద్ర సమాచార కేంద్రానికి (సీఆర్‌ఐఎల్‌సీ) తెలియజేయాలని పెద్దసైజు కోపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. రూ.500 కోట్లు, అంతకుమించి ఆస్తులున్న అన్ని అర్బన్ కోపరేటివ్ బ్యాంకులను సీఆర్‌ఐఎల్‌సీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాలనను మెరుగుపరిచి వృద్ధికి తోడ్పడాలి: దాస్ కంపెనీలు, బ్యాంకులు పాలనా ప్రమాణాలను మెరుగుపరుచుకుని, దేశ ఆర్థిక వ్యవస్థ తన పూర్తి సామర్థ్యాల మేరకు రాణించేందుకు తోడ్పడాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు. దేశ ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5%కి సెప్టెంబర్ త్రైమాసికంలో పడిపోయిన విషయం విదితమే. అలాగే, చాలా కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో దాస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం నెలకొంది. వినియోగం, పెట్టుబడులను పునరుద్ధరించడం అన్నవి ప్రధాన సవాళ్లుగా దాస్ పేర్కొన్నారు. బోర్డుల్లో మంచి కార్పొరేట్ పరిపాలన అన్నది మన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేందుకు ముఖ్యమైన అంశమనేది తన అభిప్రాయంగా చెప్పారు. ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల సందర్భంగా దాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఈసారికి ఏమీ లేదు.. ‘ధరా’ఘాతం!
ముంబై: విశ్లేషకులు, బ్యాంకర్ల అంచనాలకు భిన్నంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మరోసారి రేట్ల కోతకు వెళ్లకుండా యథాతథ పరిస్థితికి మొగ్గు చూపించింది. ప్రస్తుతమున్న రెపో రేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ) 5.15 శాతం, రివర్స్ రెపో రేటు (బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే నిధులపై చెల్లించే వడ్డీ) 4.90 శాతాన్ని అలాగే కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దేశ జీడీపీ వృద్ధిరేటు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో 4.5 శాతానికి పడిపోవడంతో (ఆరేళ్ల కనిష్ట స్థాయి), ఒకవైపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆర్బీఐ ఎంపీసీ.. కనీసం పావు శాతం వరకు రెపో రేటును తగ్గిస్తుందని విశ్లేషకులు, నిపుణులు ఊహించారు. అయితే, ద్రవ్యోల్బణం పెరిగిపోతుండటం, రానున్న కాలంలో మరింతగా పెరిగే అవకాశాలుండటం రేట్ల కోతకు వెళ్లకుండా అడ్డుపడ్డాయి. అంతేకాదు, తాజా స్థూల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న ఎంపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019–20) జీడీపీ వృద్ధి అంచనాలను ఏకంగా 5%కి తగ్గించేసింది. అక్టోబర్ సమీక్షలో వృద్ధి అంచనాను 6.1%గా పేర్కొనటం గమనార్హం. తన సర్దుబాటు విధానాన్ని ఎంపీసీ కొనసాగించడం ఒక్కటే తాజా భేటీలో సానుకూలత. వృద్ధికి మద్దతుగా అవసరమైనంత వరకు ఇదే విధానం కొనసాగుతుందని పేర్కొంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే తదుపరి సమావేశాల్లో రేట్ల కోతకు అవకాశం ఉంటుందని సంకేతం పంపింది. అంటే భవిష్యత్తులో ద్రవ్యోల్బణమే వడ్డీ రేట్లను నిర్ణయించగలదని స్పష్టం చేసింది. అంతేకాదు, తదుపరి రేట్ల కోత రానున్న బడ్జెట్‌పైనా ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు. కాగా, తదుపరి ఆర్బీఐ పాలసీ సమీక్ష ఫిబ్రవరి 4–6 మధ్య జరగనుంది. ద్రవ్యోల్బణం పెరగొచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.7–5.1 శాతం మధ్య.. 2020–21 మొదటి అర్ధభాగంలో 4.3–4.8 శాతం మధ్య ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ‘‘నాలుగో త్రైమాసికంలో (వచ్చే జనవరి–మార్చి) ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిల్లో ఉండొచ్చు. రానున్న నెలల్లో ఇది నియంత్రణలోకి రావడం అన్నది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంది. కూరగాయల ధరల పెరుగుదల ఒకటి, రెండు నెలలు కొనసాగొచ్చు. ఖరీఫ్‌లో ఆలస్యంగా వేసిన పంటల దిగుబడులు, సరఫరా దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో 2020 ఫిబ్రవరికి కూరగాయల ధరలు శాంతించొచ్చు. టెలికం చార్జీలు పెంచడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. అయితే, టోకు ద్రవ్యోల్బణం మాత్రం ప్రస్తుత స్థాయి 4 శాతం లోపే కొనసాగొచ్చు’’ అని ఆర్బీఐ ఎంపీసీ పేర్కొంది. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.6 శాతానికి చేరిన విషయం తెలిసిందే. 4 శాతానికి కట్టడి చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. వృద్ధి 5 శాతం 2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 5 శాతం మేరే ఉండొచ్చని ఎంపీసీ పేర్కొంది. 6.1 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాలను సవరించింది. 2019–20 రెండో అర్ధభాగంలో (2019 అక్టోబర్– 2020 మార్చి) వృద్ధి రేటు 4.9–5.5 శాతం మధ్య.. 2020–21 మొదటి ఆరు నెలల కాలంలో 5.9–6.3 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ ఎంపీసీ అంచనా వేసింది. రానున్న కేంద్ర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, వృద్ధిపై వాటి ప్రభావం విషయమై స్పష్టత వస్తుందని పేర్కొంది. డిమాండ్ పరిస్థితులు బలహీనంగా ఉన్నట్టు ఎన్నో అంశాలు స్పష్టం చేస్తున్నాయని అభిప్రాయపడింది. విరామం తాత్కాలికమే... వడ్డీ రేట్ల సవరణకు విరామం తాత్కాలికమే. ఈ ఏడాది ఐదు సమీక్షా సమావేశాల్లో (ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు) 135 బేసిస్ పాయింట్ల వరకు (1.35%) రేట్లను తగ్గించాం. దీని ప్రభావం ఏ మేర ఉందో చూడాలంటే కొంత సమయం ఇవ్వాలి. బ్యాంకులు ఇంత వరకు 44 బేసిస్ పాయింట్ల వరకే రేట్ల తగ్గింపును రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. రేట్ల తగ్గింపు ప్రయోజనం గరిష్ట స్థాయిలో నెరవేరాల్సి ఉంది. అప్పుడే తదుపరి రేట్ల కోతకు అవకాశం ఉంటుంది. వృద్ధి– ద్రవ్యోల్బణం∙పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతానికి విరామమే మేలని ఎంపీసీ భావించింది. ఒక యంత్రం మాదిరిగా ప్రతీసారి ఆర్బీఐ రేట్లను తగ్గించదు. గడిచిన కొన్ని నెలల్లో వృద్ధికి ఊతమిచ్చేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం సంయుక్తంగా కొన్ని చర్యలు తీసుకున్నాయి. వాటి ప్రభావాన్ని చూశాక గానీ రేట్లపై నిర్ణయం తీసుకోలేం. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నట్లు ముందస్తు సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ, వాటి స్థిరత్వంపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటే. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.6%గా నమోదవడం అంచనాల కంటే చాలా ఎక్కువ. ఇటీవలి ప్రభుత్వ చర్యల తో సెంటిమెంట్ మెరుగుపడి డిమాండ్ ఊపందుకుంటుంది. ప్రభుత్వం ద్రవ్యలోటుపై ఆందోళన చెందడం లేదు. వృద్ధి కోసం ప్రభుత్వం, ఆర్బీఐ సమన్వయంతో పనిచేస్తాయి. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ కొత్తగా ప్రీపెయిడ్ కార్డు కొత్తగా ఒక ప్రీపెయిడ్ కార్డు(ముందస్తు చెల్లింపుల సాధనం/పీపీఐ)ను తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. రూ.10,000 వరకు వస్తు, సేవల కొనుగోళ్లకు మాత్రమే దీన్ని వాడొచ్చని పేర్కొంది. డిజిటల్ చెల్లింపులను పెంచే విషయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను ఈ నెలాఖరుకు విడుదల చేస్తామని పేర్కొంది. ఒక్క ఎన్బీఎఫ్సీనీ కూలిపోనివ్వం సమస్యల్లో ఉన్న బ్యాంకింగేతర ఆర్థిక రంగాన్ని (ఎన్బీఎఫ్సీ) నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ఏ ఒక్క ఎన్బీఎఫ్సీ కుప్పకూలకుండా చూస్తామని ఆర్బీఐ గవర్నర్ దాస్ అభయమిచ్చారు. నిర్వహణ బాగున్న ఎన్‌బీఎఫ్‌సీలకు ఇటీవల నిధుల సరఫరా పెరిగిందన్నారు. సెంట్రల్ బ్యాంకు బృందం అగ్రస్థాయి 50 ఎన్బీఎఫ్సీలను (మార్కెట్ వాటాలో 70 శాతం వీటిదే) చాలా నిశితంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. వ్యవస్థాపరంగా ముఖ్యమైన ఏ ఒక్క ఎన్బీఎఫ్సీ కూలిపోకుండా, సకాలంలో స్పందించి చర్యలు తీసుకుంటామని వివరించారు. వీటికి సంబంధించిన పుస్తకాలను లోతుగా పరిశీలించి ఒత్లిళ్లను గుర్తించినట్టు చెప్పారు. కంపెనీల యాజమాన్యాలతో ఎప్పటికప్పుడు సమావేశమై, బలోపేతానికి చర్యలు కూడా సూచిస్తున్నట్టు వెల్లడించారు. పీ2పీ వ్యాపారానికి బూస్ట్ పీ2పీ ప్లాట్‌ఫామ్‌ల పురోగతి దిశగా ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకుంది. పీ2పీ అనేవి.. వ్యక్తుల మధ్య రుణాల మంజూరు, రుణాల స్వీకరణకు వీలు కల్పించే ఆన్లైన్ వేదికలు. ప్రస్తుతం ఒక రుణదాత అన్ని పీ2పీ ప్లాట్‌ఫామ్‌ల పరిధిలో గరిష్టంగా రూ.10 లక్షల వరకే రుణాల పంపిణీకి, అదే విధంగా ఒక రుణ గ్రహీత కూడా గరిష్టంగా రూ.10లక్షల వరకే రుణం పొందే అవకాశం ఉండగా.. దీన్ని రూ.50లక్షలకు ఆర్బీఐ తాజాగా పెంచింది. అలాగే, ఒక రుణదాత, ఒక వ్యక్తికి గరిష్టంగా రూ.50వేలకే రుణం సమకూర్చే పరిమితి కూడా అమల్లో ఉంది. ఆశ్చర్యకర నిర్ణయం... ఊహించని పాలసీ ఆశ్చర్యపరిచింది. అయినా ఎంతో సముచితమైనది. వృద్ధి అంచనాలను ఈ ఆర్థిక సంవత్సరానికి 5%కి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా తగ్గించడం అన్నది రికవరీ(పుంజుకోవడం) నిదానంగా ఉంటుందని తెలియజేస్తోంది. – రజనీష్ కుమార్, ఎస్బీఐ చైర్మన్ అధిక ధరలే కారణం... ద్రవ్యోల్బణం కఠినంగా మారడం, పెరిగి పోయే అంచనాలకు ఆర్బీఐ స్పందించినట్టు అర్థమవుతుంది. 135 బేసిస్ పాయింట్ల తగ్గింపు ప్రయోజనం పూర్తిగా నెరవేరే వరకు వేచి చూడాలని భావిస్తోంది. – అభిషేక్ బారువా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త నిరాశ పరిచింది... ఆర్బీఐ రెపో రేటు ను మార్చకపోవడంపై నిరాశ చెందాం. వృద్ధి బలహీనత పరిస్థితుల్లో రేట్ల కోత అవసరం అన్న ఫిక్కీ విధానానికి విరుద్ధంగా ఉంది. గతంలో రేట్ల కోత ప్రయోజనం కూడా పూర్తిగా అమలు కాలేదు. మార్కెట్, ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ మెరుగుదలకు చర్యలు చేపట్టాలి. – సందీప్ సోమాని, ఫిక్కీ ప్రెసిడెంట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుంది.. ఆర్బీఐ వేచిచూసే ధోరణి రియల్టీ రంగంలో సెంటిమెంట్‌ను దెబ్బ తీస్తుంది. స్వల్ప మొత్తాల్లో పావు శాతం చొప్పున కాకుండా 100 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోతను మేం అంచనా వేశాం. – నిరంజన్ హిరనందాని, నారెడ్కో ప్రెసిడెంట్ -
ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూ¯Œ ) కేవలం 5 శాతం వృద్ధి నమోదుచేసుకోవడం ‘ఆశ్చర్యకరం’ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ‘‘క్యూ1లో కనీసం 5.8 శాతం వృద్ధి ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. 5.5 శాతం ఎంతమాత్రం తగ్గదన్న విశ్లేషణలూ వచ్చాయి. అయితే అంతకన్నా తక్కువకు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని గవర్నర్ ఇక్కడ ఒక చానెల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలు వృద్ధిని తిరిగి పుంజుకునేలా చేస్తాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే గడచిన నాలుగు ద్వైమాసికాల్లో ఆర్బీఐ 1.1 శాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.4 శాతం) కోతకూడా ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవస్థాగత సంస్కరణల విషయాన్ని ఇప్పటికే తన వార్షిక నివేదికలో ఆర్బీఐ ప్రస్తావించిన విషయాన్ని గవర్నర్ ప్రస్తావించారు. ‘‘ఇందులో ప్రధానమైనది వ్యవసాయ మార్కెటింగ్. ఈ విభాగంలో ప్రభుత్వం నుంచి కీలక చర్యలు ఉంటాయని భావిస్తున్నా’’ అని గవర్నర్ అన్నారు. ‘‘వృద్ధి మందగమనానికి కేవలంఅంతర్జాతీయ అంశాలే కారణమని నేను చెప్పను. ఇందుకు దేశీయ అంశాలూ కొన్ని కారణమే’’ అని కూడా గవర్నర్ వ్యాఖ్యానించడం విశేషం. సౌదీ ఆయిల్ సంక్షోభం పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయం ఊహించలేమని గవర్నర్ అన్నారు. అలాగే వాణిజ్య యుద్ధ అనిశి్చతిపైనా ఏదీ చెప్పలేమన్నారు. ఆయా అంశాలన్నీ వృద్ధితీరుపై ప్రభావం చూపుతాయని తెలిపారు. రెపో రేటు కోతతో సరిపోదు: ఎస్బీఐ ఇదిలావుండగా, కేవలం రెపో రేటు కోత వృద్ధికి దోహదపడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. వ్యవస్థలో డిమాండ్ మెరుగుదల చర్యలు అవసరమని తెలిపింది. -
రూ.వెయ్యి నోట్లు రావట్లేదు: కేంద్రం
న్యూఢిల్లీ: వెయ్యి రూపాయల నోట్లను తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న వార్తలను కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. రూ.వెయ్యి నోట్లను తిరిగి చెలామణిలోకి తెచ్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్‌దాస్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.500, అంతకంటే తక్కువ విలువ గల నోట్లను సరిపడినంత ముద్రించి, సరఫరా చేయడంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు. కొన్ని ఏటీఎంలలో నగదు కొరతపై ఫిర్యాదులు వస్తున్న దృష్ట్యా ప్రజలు తమకు అవసరమైనంత మేర మాత్రమే నగదు విత్‌డ్రా చేసుకోవాలని కోరారు. అవసరానికి మించి విత్‌డ్రా చేయడం వల్ల మరికొందరికి నగదు అందకుండా పోతోందని పేర్కొన్నారు.