రూ.వెయ్యి నోట్లు రావట్లేదు: కేంద్రం | central government react on thousend note release | Sakshi
Sakshi News home page

రూ.వెయ్యి నోట్లు రావట్లేదు: కేంద్రం

Published Thu, Feb 23 2017 3:28 AM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

రూ.వెయ్యి నోట్లు రావట్లేదు: కేంద్రం

రూ.వెయ్యి నోట్లు రావట్లేదు: కేంద్రం

న్యూఢిల్లీ: వెయ్యి రూపాయల నోట్లను తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న వార్తలను కేంద్రప్రభుత్వం తోసిపుచ్చింది. రూ.వెయ్యి నోట్లను తిరిగి చెలామణిలోకి తెచ్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్‌దాస్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం రూ.500, అంతకంటే తక్కువ విలువ గల నోట్లను సరిపడినంత ముద్రించి, సరఫరా చేయడంపైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు. కొన్ని ఏటీఎంలలో నగదు కొరతపై ఫిర్యాదులు వస్తున్న దృష్ట్యా ప్రజలు తమకు అవసరమైనంత మేర మాత్రమే నగదు విత్‌డ్రా చేసుకోవాలని కోరారు. అవసరానికి మించి విత్‌డ్రా చేయడం వల్ల మరికొందరికి నగదు అందకుండా పోతోందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement