
ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యంలోని ఎక్స్(ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు డౌన్ అయింది. ఈ విషయాన్ని మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
ఎక్స్ సైబర్ దాడిని ఎదుర్కొంటోందని.. హ్యాకర్లను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని ట్వీట్ చేశారు. దీని వెనుక ఒక పెద్ద సమూహం లేదా ఒక దేశం హస్తం ఉండొచ్చు అని మస్క్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతంలోని ఐపీ చిరునామాల నుంచి సైబర్ దాడి జరిగిందని అన్నారు. ఈ కారణంగానే రోజంతా అంతరాయం ఏర్పడిందని అన్నారు.

డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. ఎక్స్ ప్లాట్‌ఫామ్ రోజంతా మూడు అంతరాయాలను ఎదుర్కొంది. మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ అంతరాయాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. రాత్రి 9 గంటలకు కూడా ఈ అంతరాయాలు కొనసాగాయి.

ట్రాకింగ్ వెబ్‌సైట్ దాదాపు 52 శాతం సమస్యలు వెబ్‌సైట్‌కు సంబంధించినవని, 41 శాతం యాప్‌కు సంబంధించినవని, 8 శాతం సర్వర్ కనెక్షన్ సమస్యలతో సంబంధం కలిగి ఉన్నాయని చూపించింది. ఇప్పుడు కూడా అంతరాయం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఎలాన్ మస్క్ 2022లో 44 బిలియన్ డాలర్లకు (రూ. 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ) Xని కొనుగోలు చేశారు. 2023లో అతని ఫాలోవర్స్ సంఖ్య 200 మిలియన్స్ దాటేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment