భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఛాతీ నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇది అత్యవసర పరిస్థితి కాదని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. ఈరోజు ఉదయం దాస్‌కు ఛాతీ నొప్పి రావడంతో పరిస్థితి విషమించి ఆసుప్రతిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వైద్యులు తన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి.
‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అసిడిటీ ద్వారా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం దాస్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. మరో 2-3 గంటల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఆందోళన చెందాల్సిన పనిలేదు’ అని ఆర్‌బీఐ ప్రతినిధి తెలిపారు.
The Reserve Bank Governor, Shaktikanta Das IAS, has been admitted to #Chennai Apollo Hospital due to chest pain. He is currently under the close supervision of medical professionals: sources #RBI pic.twitter.com/P0Z26uq8Dl
— Mahalingam Ponnusamy (@mahajournalist) November 26, 2024
ఇదీ చదవండి: అంతా ఓకే.. కేవలం వ్యక్తులపైనే ఆరోపణలు..
శక్తికాంత దాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 25వ గవర్నర్‌గా 2018లో నియమితులయ్యారు. ఆయన అంతకుముందు పదిహేనో ఆర్థిక సంఘం సభ్యుడిగా పని చేశారు. దాస్ తమిళనాడు కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన కేంద్ర ప్రభుత్వ, తమిళనాడు ప్రభుత్వాలకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పని చేశారు. రెవెన్యూ కార్యదర్శిగా, ఫెర్టిలైజర్స్ సెక్రటరీగా వివిధ కేంద్ర ప్రభుత్వ హోదాల్లో పనిచేశారు. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, ఎన్‌డీబీ, ఏఐఐబీలలో ప్రత్యామ్నాయ గవర్నర్‌గా కూడా పనిచేశారు. భారత్ తరఫున ఐఎంఎప్, జీ20, బ్రిక్స్, సార్క్ మొదలైన అనేక అంతర్జాతీయ ఫోరమ్‌ల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment