భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును లండన్‌లో అందుకున్నారు. సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2023 విజేతలను ఈ ఏడాది మార్చి చివరిలో ప్రకటించారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఉక్రెయిన్‌కు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వచ్చాయి.
సెంట్రల్ బ్యాంకింగ్, లండన్ జూన్ 13న నిర్వహించిన వేసవి సమావేశాల ప్రారంభ ప్లీనరీ సమావేశంలో శక్తికాంత దాస్ పాల్గొని ప్రసంగించారు. గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్వీకరించారు. కోవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణ కట్టడికి చేసిన కృషికి గానూ ఆయనకు గుర్తింపు లభించింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండి, వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత దాస్ రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. 2018లో ఆర్బీఐ 25వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన 15వ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా G20 షెర్పా ఆఫ్ ఇండియాగా ఉన్నారు.
Governor @DasShaktikanta received the ‘Governor of the Year’ award from @CentralBanking_ as part of the Central Banking Awards 2023 in London yesterday. #RBI #RBIGovernor #Governor #shaktikantadas #centralbanking pic.twitter.com/zh5E1VRGsi
— ReserveBankOfIndia (@RBI) June 14, 2023
ఇదీ చదవండి: ఆస్తి పత్రాలు బ్యాంకుల్లో ఉన్నాయా..? ఆర్బీఐకి కీలక ప్రతిపాదనలు!
Comments
Please login to add a commentAdd a comment