honoured
-
ఆపిల్ సాగును దేశవ్యాప్తం చేసి, పద్మశ్రీ అందుకున్న హారిమన్
ఆపిల్ పండ్ల తోటలను హారిమన్ శర్మ మంచు కొండల మీద నుంచి మైదాన ప్రాతాల్లోకి తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లోని గల్లసిన్ గ్రామంలో 1956లో ఆయన పుట్టారు. మూడేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన ఆయన వ్యవసాయ పనులు చేస్తూ పెరిగారు. కష్టాల్లో పెరిగినప్పటికీ వ్యవసాయంలో కొత్త΄ోకడలను కనిపెట్టాలన్న తపన ఆయనలో ఉండేది. 1992లో విపరీతమైన మంచు వల్ల ఆ ప్రాంతంలో మామిడి చెట్లు నాశనమైనప్పుడు ఆపిల్ సాగు గురించి ఆలోచించారు. చల్లని కొండ ప్రాతాల్లో మాత్రమే ఆపిల్ చెట్లు పెరుగుతాయని మనకు తెలుసు. అయినా, తమ ్ర΄ాంతంలో వాటిని ఎందుకు పెంచకూడదన్న ఆలోచనతో హారిమన్ ప్రయోగాలు చేయటం ప్రాంభించారు.పట్టువిడవకుండా కృషి చేసి సముద్రతలం నుంచి 700 మీటర్ల ఎత్తులోని మైదాన ్ర΄ాంతాల్లో, వేసవిలో 40–45 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వాతవరణంలో కూడా, ఆపిల్ పండ్లను సాగు చేయవచ్చని రుజువు చేశారు. 2007లో హెఆర్‌ఎంఎన్–99 అనే గ్రాఫ్టెడ్ ఆపిల్ వంగడాన్ని రూపొందించారు. అప్పటి ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమల్ దృష్టికి వెళ్లటంతో ప్రాచుర్యంలోకి వచ్చారు. ఈ రకం ఆపిల్ పండ్లను ఇప్పుడు దేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 29 రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, జర్మనీలోనూ సాగు చేస్తున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రైతులకు శిక్షణ ఇవ్వటంతో పాటు లక్ష గ్రాఫ్టెడ్ ఆపిల్ మొక్కలను అందించిన ఘనత ఆయనది. -
గిన్నిస్‌బుక్‌లో చిరంజీవి.. ఎందుకో తెలుసా? (ఫొటోలు)
-
అంతర్జాతీయ అవార్డు అందుకున్న ఆర్బీఐ గవర్నర్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును లండన్‌లో అందుకున్నారు. సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2023 విజేతలను ఈ ఏడాది మార్చి చివరిలో ప్రకటించారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఉక్రెయిన్‌కు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వచ్చాయి. సెంట్రల్ బ్యాంకింగ్, లండన్ జూన్ 13న నిర్వహించిన వేసవి సమావేశాల ప్రారంభ ప్లీనరీ సమావేశంలో శక్తికాంత దాస్ పాల్గొని ప్రసంగించారు. గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్వీకరించారు. కోవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణ కట్టడికి చేసిన కృషికి గానూ ఆయనకు గుర్తింపు లభించింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండి, వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత దాస్ రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. 2018లో ఆర్బీఐ 25వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన 15వ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా G20 షెర్పా ఆఫ్ ఇండియాగా ఉన్నారు. Governor @DasShaktikanta received the ‘Governor of the Year’ award from @CentralBanking_ as part of the Central Banking Awards 2023 in London yesterday. #RBI #RBIGovernor #Governor #shaktikantadas #centralbanking pic.twitter.com/zh5E1VRGsi — ReserveBankOfIndia (@RBI) June 14, 2023 ఇదీ చదవండి: ఆస్తి పత్రాలు బ్యాంకుల్లో ఉన్నాయా..? ఆర్బీఐకి కీలక ప్రతిపాదనలు! -
కళాతపస్వి కె. విశ్వనాథ్‌కు ఆత్మీయ సత్కారం..
K Viswanath Honoured For Swati Mutyam Movie Completing 36 Years: కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం ‘స్వాతిముత్యం’ విడుదలై నేటికి (ఆదివారం) 36 ఏళ్లు. కమల్‌హాసన్, రాధిక, సోమయాజులు, గొల్లపూడి మారుతీరావు ముఖ్య తారలుగా ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో అమాయకుడు శివయ్య పాత్రలో కమల్, లలిత పాత్రలో రాధిక కనబర్చిన అభినయాన్ని అంత సులువుగా మరచిపోలేం. ఈ చిత్రానికి తోటపల్లి సాయినాథ్ అందించిన మాటలు, ఇళయరాజా సంగీతం, ఆత్రేయ, సినారె, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిల సాహిత్యం అదనపు ఆకర్షణలు. అంతేకాకుండా ‘స్వాతిముత్యం’ ఆస్కార్ ఎంట్రీ సైతం దక్కించుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాలకు నంది అవార్డులు వచ్చాయి. ఈ చిత్రానికి 36 ఏళ్లవుతున్న సందర్భంగా కె. విశ్వనాథ్ నివాసంలో శుభోదయం మీడియా శనివారం ఆత్మీయ వేడుకను నిర్వహించి, ఆయన్ను సత్కరించింది. తోటపల్లి సాయినాథ్, శుభోదయం గ్రూప్ అధినేత కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్, నృత్యకళాకారిణి స్వర్ణ శ్రీ పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి: సీఎస్ సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా పనిచేయాలని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఉద్యోగులను కోరారు. 122 మంది సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి నందుకు తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురువారం బీఆర్కేఆర్ భవన్లో సోమేశ్‌కుమార్‌ను సన్మానించింది. రాష్ట్రంలోని పేద ప్రజలకు సహాయం చేయడానికి పారద ర్శకంగా సేవలను సమర్థవంతంగా అందించాలని ఆయన ఉద్యోగులను కోరారు. సీఎం ఆదేశాల మేర కు ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా పదోన్నతులు కల్పించామ న్నారు. ఉద్యోగులందరికీ డ్రాఫ్టింగ్, నోట్స్, కంప్యూ టర్ స్కిల్స్‌పై శిక్షణను ఏర్పాటు చేయడం ద్వారా మానవ వనరులను అభివృద్ధి చేయాలని సాధారణ పరిపాలనశాఖకు సూచించారు. కార్యక్రమంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రావు పాల్గొన్నారు. -
సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్
-
సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్
సాక్షి, ముంబై: అత్యంత సాహసంతో బాలుడి ప్రాణాలను కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల జల్లుకురవడమే కాదు విలువైన బహుమతులు కూడా లభిస్తున్నాయి. ప్రమాదవశాత్తూ రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన బాలుడిని రక్షించిన మయూర్ షెల్కేని స్వయంగా రైల్వే శాఖమంత్రి పియూష్ గోయల్ అభినందించారు. రైల్వే మంత్రిత్వ శాఖ బహుమతిని కూడా ప్రకటించింది. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ఈ కోవలో నిలిచింది. సమయానుకూలంగా స్పందించి, ప్రాణాలను పణంగా పెట్టి మరీ బాలుడిని కాపాడి హీరోగా నిలిచిన షెల్కేకు జావా మోటార్ సైకిల్‌ను గిఫ్ట్‌గా ప్రకటించింది. మయూర్ షెల్కే ధైర్యసాహసాలు ప్రశంసనీయమంటూ క్లాసిక్ లెజెండ్స్ చీఫ్ అనుపమ్ థరేజా అభినందించారు. మొత్తం జావా కుటుంబం ఆయనను అభినందిస్తోందన్నారు. రైలు దూసుకొస్తున్నప్పటికీ బాలుడిని సురక్షితంగా కాపాడిన తీరు తమను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందని థరేజా పేర్కొన్నారు. జావా హీరోస్ ఇనీషియేషన్‌లో భాగంగా ఈ అవార్డు ఇస్తున్నామన్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఇలాంటి హీరోలను గుర్తించి జావా హీరోస్ పేరుతో సత్కరించనున్నామని వెల్లడించారు. దీనిపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. మూవీల్లోని సూపర్ హీరోలను మించిన హీరోగా మెరుగైన ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ ట్వీట్ చేశారు. జావా కుటుంబంలో మనమందరం అతనికి సెల్యూట్ చేద్దామన్నారు. అలాగే క్లిష్ట సమయాల్లో ఎలా ప్రవర్తించాలో షెల్కే మనకు చూపించారంటూ ఆయన ప్రశంసించారు.(పట్టాలపై చిన్నారి..దూసుకొస్తున్న రైలు.. ఇంతలో) కాగా ఏప్రిల్ 17న వంగని రైల్వే స్టేషన్లో మయూర్ షెల్కే అత్యంత సాహసంతో బాలుడిన కాపాడిన వైనం చోటు చేసుకుంది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాలను రైల్వే శాఖ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. సెంట్రల్ రైల్వేలో పాయింట్స్‌మన్‌గా పని చేస్తున్నమయూర్ షెల్కేకు రైల్వే మంత్రిత్వ శాఖ రూ.50 వేలు బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సింధుకు హైదరాబాద్ హంటర్స్ ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్ : బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును పీబీఎల్ హైదరాబాద్ హంటర్స్ టీమ్ ఘనంగా సన్మానించింది. పూలమాలతో సింధును సత్కరించి.. పద్మభూషణ్ అవార్డు పొందినందుకు అభినందనలు తెలిపింది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో హంటర్స్ టీమ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ అభిమానులు తమ టీమ్‌కు ఎంతగానో సపోర్ట్ చేశారని చెప్పారు. ఈ సీజన్లో సింధు సారథ్యంలో హంటర్స్ టీమ్ పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కేటీఆర్ తమకు ఎంతగానో సపోర్టుగా నిలిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. హంటర్స్ తరఫున ఆడటం సంతోషంగా ఉందన్నారు. రాబోయే మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలుస్తామని చెప్పారు. అభిమానులు భారీగా తరలివచ్చి హంటర్స్‌కు మద్దతుగా నిలవాలని కోరారు. మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి మాట్లాడుతూ.. హంటర్స్‌కు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కాగా, 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సింధుకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలసిందే. -
నిజాయితీ చాటుకున్న ఆటోవాలా
ఎస్ఆర్నగర్(హైదరాబాద్): నిజాయితీ కరవైన ఈ రోజుల్లో ఓ ఆటోవాలా తన నిజాయితీని చాటుకున్నాడు. తాను నడుపుతున్న ఆటోలో ప్రయాణించిన వారి బంగారు ఆభరణాలు ఆటోలో జారిపోయాయి. ఇది గమనించని వారు ఆటో దిగి వెళ్లిపోయారు. తర్వాత వాటిని గమనించిన ఆటో డ్రైవర్ మీర్జా మహమూద్ ఆరున్నర తులాల బరువున్న ఆ ఆభరణాలను ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించాడు. నిజాయితీ ప్రదర్శించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అభినందించారు. సీఐ వహిదుద్దీన్ ఆయన్నుసన్మానించారు. -
ఎన్సీసీ క్యాడెట్లు అభినందన
నెల్లూరు(బృందావనం): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్తంగా విశాఖపట్టణంలో ఎన్సీసీ నావల్ వింగ్ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్‌లో ప్రతిభచాటిన నెల్లూరు కేడెట్లకు అభినందనసభ నిర్వహించారు. స్ధానిక వీఆర్ కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీవీఎస్ భాస్కర్ హాజరయ్యారు. తొమ్మిదేళ్ల తరువాత 10(ఎ) నావల్యూనిట్ నుంచి తొమ్మిదిమంది కేడెట్స్ అఖిలభారత స్థాయిలో నవసైనిక్ క్యాంప్‌కు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. వీరికి రెండు నెలలపాటు శిక్షణ అందించిన స్థానిక పీఐ స్టాఫ్, ఏఎన్ఓలను డాక్టర్ భాస్కర్ ప్రశంసించారు. లెఫ్ట్‌నెంట్ కమాండర్ డాక్టర్ సీవీ సురేష్, లెఫ్ట్‌నెంట్ ఎన్.ప్రభాకర్, ఎస్ఎంఐ ఎస్.వి.రమణ్, పీఐ స్టాఫ్ పీఓ ఎస్.దుర్గాప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ విశాఖపట్టణంలో ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 7వ తేదీ వరకు జరిగిన సీమెన్షిప్ ప్రాక్టికల్స్‌లో కె.యుగేష్ బంగారు పతకం, ఏవీ సుబ్బారెడ్డి, ఎ.శేఖర్, ఆర్.మహేష్, ఎన్.సాయిశంకరి, ఏ.కామాక్షీ, పి.అనూష సంయుక్తంగా సంయుక్తంగా 10(ఎ) నావల్ యూనిట్ ఎన్సీసీ తరుపున ప్రధమస్థానంలో నిలవడం హర్షణీయమన్నారు. షిప్ మోడలింగ్‌లో పాల్గొన్న జి.మహేంద్ర, కె.సుందర్‌సాయి, ఐ.శ్రీకళ, ఎ.సునంద ద్వితీయ స్ధానం సాధించడం ప్రశంసనీయమన్నారు. బెస్ట్ కాడెట్‌గా జి.అజిత్ పూర్తిస్థాయిలో ప్రతిభచాటి తృతీయస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. -
హవల్దార్ హంగ్‌పాన్‌కు అశోక చక్ర
►82 మందికి సాహస పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: అక్రమంగా భారత్‌లోకి చొరబడాలని చూసిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టి, దేశం కోసం ప్రాణాలర్పించిన హవల్దార్ హంగ్‌పాన్‌కు ఆర్మీ అత్యున్నత పీస్‌టైమ్ అవార్డు అశోక చక్ర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పఠాన్‌కోట్ వీరులు లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్, కార్పోరల్ గురుసేవక్ సింగ్ తదితర 82 మంది రక్షణ, పారామిలిటరీ సిబ్బందికి సాహస పురస్కారాలు ఇచ్చేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్రం ఆదివారం ప్రకటించింది. ఒక అశోక చక్ర, 14 శౌర్య చక్ర, 63 సేన పతకాలు, రెండు నావికా సేన, రెండు వాయు సేన పతకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలు అందజేయనున్నారు. హంగ్‌పాన్‌కు సముచిత గౌరవం అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరుడైన హవల్దార్ హంగ్పాన్ దాదాకు ప్రతిష్టాత్మక అశోక చక్ర పురస్కారం లభించింది. ఆయన గత మే 27న కశ్మీర్లో 13 వేల అడుగుల ఎత్తులో శత్రువులతో వీరోచితంగా పోరాడారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారీగా ఆయుధాలతో భారత్‌లోకి చొరబడాలని చూసిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆ తర్వాత శత్రుమూకల బుల్లెట్లకు నేలకొరిగారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల బోడురియా గ్రామానికి చెందిన హంగ్పాన్ను ఆయన టీమ్ సభ్యులు దాదా అని పిలుచుకునేవారు. కిందటేడాది చివర్లోనే ఆయన కశ్మీర్‌కు వెళ్లారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 35 రైఫిల్ టీమ్స్‌లో హంగ్పాన్ విధులు నిర్వర్తించేవారు. హంగ్‌పాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పఠాన్‌కోట్ అమరవీరుడికి శౌర్య చక్ర పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో మరణించిన ఎన్ఎస్ జీ బాంబు నిర్వీర్య దళం చీఫ్ లెఫ్టినెంట్ కల్నల్ నిరంజన్‌కు శౌర్య చక్ర పురస్కారం లభిం చింది. బాంబులను కనుగొనడంలో, నిర్వీర్యం చేయడంలో నిష్ణాతుడైన నిరంజన్ గత జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌లో గ్రనేడ్లను నిర్వీర్యం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది, ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఐటీబీపీ కమాండోలకు పురస్కారాలు అఫ్గానిస్తాన్‌లోని భారత్ కాన్సులేట్ల వద్ద ఉగ్రదాడులను ఎదుర్కొన్న పదిమంది ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) కమాండోలకు అత్యున్నత పోలీసు సాహస పతకాలను ఇవ్వనున్నారు. వీరిలో క్షురకుడిగా విధులు నిర్వహిస్తున్న సతీశ్ కుమార్ కూడా ఉన్నారు. ఈ దాడులు జనవరి 3న మజారే షరీఫ్ వద్ద, మార్చి 3న జలాలాబాద్ వద్ద ఉన్న భారత కాన్సులేట్ల వద్ద జరిగాయి. మజారే షరీఫ్ కాన్సులేట్ వద్ద జరిగిన దాడుల్లో సతీశ్ రైఫిల్‌ను అందిపుచ్చుకుని అద్భుతంగా ఎదురు కాల్పులు జరిపారు. అలాగే 948 మంది కేంద్ర, రాష్ట్ర పోలీసులకూ సాహస పురస్కారాలు, సేవా పతకాలు ఇవ్వనున్నారు. -
గూగుల్ సీఈవోకు ఇమ్మిగ్రెంట్ అవార్డ్!
న్యూయార్క్ః నలుగురు ప్రవాస భారతీయులకు అమెరికా ప్రత్యేక గౌరవం దక్కింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో పాటు మరో ముగ్గుర్ని ఈప్రత్యేక పురస్కారం వరించింది. జూన్ 30న జరిగే కార్యక్రమంలో ఎంపికైన వారిని అమెరికాలోని కార్నీజియా కార్పొరేషన్ సత్కరించనుంది. అమెరికాకు గర్వకారణమైన నలుగురు ప్రవాస భారతీయులకు ఆదేశం ప్రత్యేక గౌరవాన్ని అందించనుంది. 'గ్రేట్ ఇమ్మిగ్రెంట్ః ప్రైడ్ ఆఫ్ అమెరికా' పేరిట కార్నెగీ కార్పొరేషన్ ఈ అవార్డులను ప్రతి యేటా అందిస్తుంది. 2016 సంవత్సరానికి గానూ విదేశీ మూలాలు కలిగిన మొత్తం 30 దేశాలకు చెందిన 42 మందిని పురస్కారాలకు ఎంపిక చేయగా.. వారిలో ప్రవాస భారతీయులు నలుగుర్ని ఈ ప్రత్యేక పురస్కారం వరించింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో పాటు పీబీఎస్ న్యూస్ అవర్ కు చెందిన ప్రఖ్యాత వ్యాఖ్యాత, సినియర్ కరస్పాండెంట్ హరి శ్రీనివాసన్, మెకన్సీ అండ్ కంపెనీ ఛైర్మన్ విక్రమ్ మల్హోత్రా, నేషనల్ బుక్ క్రిటిక్ సర్కిల్ అవార్డు విజేత, రచయిత భారతీ ముఖర్జీలకు ప్రైడ్ ఆఫ్ అమెరికా అవార్డును అందించనున్నారు. జూన్ 30న న్యూయార్క్ లో నిర్వహించే కార్యక్రమంలో ఎంపికైన వారికి కార్నీజియా కార్పొరేషన్ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. అవార్డుకు ఎంపికైన వారంతా చదువు, ఆర్థికావకాశాలు, మతపరమైన శరణార్థులు, భద్రత వంటి అనేక అవసరాలతో అమెరికా వచ్చి స్థిరపడినవారని కార్నీజియా కార్పొరేషన్ ఛైర్మన్ గ్రెగోరియన్ తెలిపారు. -
వారెవ్వా.. టాయిలెట్ కోసం ఎంతపని చేశారు
ఉదయ్‌పూర్: ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆలస్యంగానైనా నలుగురిలో మంచి మార్పునే తీసుకొస్తుంది. పట్టణాలు గ్రామాలే కాకుండా గిరిజన ప్రాంతాల్లో సైతం ఈ పథకం గట్టి మార్పును తీసుకొస్తుంది. రాజస్థాన్‌లో ఓ గిరిజన దంపతులు తమ ఇంట్లో మరుగు దొడ్డి నిర్మించుకునేందుకు ఇంట్లో మేకలు అమ్ముకోవడంతోపాటు గృహిణి కాలి వెండి కడియాన్ని తాకట్టుపెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరుగుదొడ్డి ఆవశ్యకతను కొంతమంది సామాజిక కార్యకర్తలు రాజస్థాన్‌లోని దంగార్ పూర్ గ్రామంలో ప్రచారం చేశారు. వారి ప్రచారం నుంచి స్ఫూర్తిపొందిన గీతా, సునీల్ పిళ్లై అనే గిరిజన దంపతులు వారు చేసుకునేది రోజువారి కూలిపనే అయినా.. గడ్డు పరిస్థితుల మధ్య ఉంటూనే రూ.9000తో టాయిలెట్ నిర్మించుకునేందుకు మేకలు అమ్మి, కాలి వెండి కడియం తాకట్టు పెట్టుకున్నారు. వాస్తవానికి తొలుత ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో టాయిలెట్లు నిర్మించుకోవచ్చని.. 12 వేలు ప్రభుత్వం నుంచి వస్తాయని చెప్పడంతో నిర్మాణం ప్రారంభించారు. కానీ, అన్నట్లుగానే రెండు దఫాల్లో రూ.8000 మాత్రమే వచ్చింది. అయితే, టాయిలెట్ పూర్తయ్యేందుకు అంతకంటే ఎక్కువ అవసరం కావడంతో వారు ఈ పని చేశారు. తమ మేకల్ని అమ్ముకొని మరీ వారు టాయిలెట్ నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దుంగార్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కేకే గుప్తా వారిని సన్మానించారు. అనంతరం అతడికి విడుదల కావాల్సిన మరో రూ.4వేలు కూడా మంజూరుకావడంతో తిరిగి తన భార్య కడియాన్ని విడిపించుకున్నాడు. -
'సెక్రటరీ 'నవల స్వర్ణోత్సవం
-
దిలీప్‌కుమార్‌కు 'పద్మవిభూషణ్' ప్రదానం
-
ఉత్తమ విద్యాసేవలకు అత్యుత్తమ పురస్కారం
-
మాలతీచందూర్ పురస్కారం అందుకున్న యద్దనపూడి