ఎన్‌సీసీ క్యాడెట్లు అభినందన
నెల్లూరు(బృందావనం):
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంయుక్తంగా విశాఖపట్టణంలో ఎన్‌సీసీ నావల్ వింగ్ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్స్‌లో ప్రతిభచాటిన నెల్లూరు కేడెట్లకు అభినందనసభ నిర్వహించారు. స్ధానిక వీఆర్ కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీవీఎస్ భాస్కర్ హాజరయ్యారు. తొమ్మిదేళ్ల తరువాత 10(ఎ) నావల్‌యూనిట్ నుంచి తొమ్మిదిమంది కేడెట్స్ అఖిలభారత స్థాయిలో నవసైనిక్ క్యాంప్‌కు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. వీరికి రెండు నెలలపాటు శిక్షణ అందించిన స్థానిక పీఐ స్టాఫ్, ఏఎన్‌ఓలను డాక్టర్ భాస్కర్ ప్రశంసించారు. లెఫ్ట్‌నెంట్ కమాండర్ డాక్టర్ సీవీ సురేష్, లెఫ్ట్‌నెంట్ ఎన్.ప్రభాకర్, ఎస్‌ఎంఐ ఎస్.వి.రమణ్, పీఐ స్టాఫ్ పీఓ ఎస్.దుర్గాప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ విశాఖపట్టణంలో ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 7వ తేదీ వరకు జరిగిన సీమెన్‌షిప్ ప్రాక్టికల్స్‌లో కె.యుగేష్ బంగారు పతకం, ఏవీ సుబ్బారెడ్డి, ఎ.శేఖర్, ఆర్.మహేష్, ఎన్.సాయిశంకరి, ఏ.కామాక్షీ, పి.అనూష సంయుక్తంగా సంయుక్తంగా 10(ఎ) నావల్ యూనిట్ ఎన్‌సీసీ తరుపున ప్రధమస్థానంలో నిలవడం హర్షణీయమన్నారు. షిప్ మోడలింగ్‌లో పాల్గొన్న జి.మహేంద్ర, కె.సుందర్‌సాయి, ఐ.శ్రీకళ, ఎ.సునంద ద్వితీయ స్ధానం సాధించడం ప్రశంసనీయమన్నారు. బెస్ట్ కాడెట్‌గా జి.అజిత్ పూర్తిస్థాయిలో ప్రతిభచాటి తృతీయస్థానంలో నిలవడం అభినందనీయమన్నారు.