![The Telangana Secretariat Employees Association Honored Somesh Kumar - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/3/somesh-kumar.jpg.webp?itok=GJgg7bH1)
సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎస్ సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా పనిచేయాలని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఉద్యోగులను కోరారు. 122 మంది సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి నందుకు తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురువారం బీఆర్‌కేఆర్ భవన్‌లో సోమేశ్‌కుమార్‌ను సన్మానించింది.
రాష్ట్రంలోని పేద ప్రజలకు సహాయం చేయడానికి పారద ర్శకంగా సేవలను సమర్థవంతంగా అందించాలని ఆయన ఉద్యోగులను కోరారు. సీఎం ఆదేశాల మేర కు ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా పదోన్నతులు కల్పించామ న్నారు. ఉద్యోగులందరికీ డ్రాఫ్టింగ్, నోట్స్, కంప్యూ టర్ స్కిల్స్‌పై శిక్షణను ఏర్పాటు చేయడం ద్వారా మానవ వనరులను అభివృద్ధి చేయాలని సాధారణ పరిపాలనశాఖకు సూచించారు. కార్యక్రమంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment