సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పరస్పర బదిలీకి ఈనెల 15లోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ (సీఎస్) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లో జరిగే పరస్పర బదిలీల్లో సీనియారిటీకి రక్షణ కల్పిస్తామన్నారు. ఈ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసినట్లు చెప్పారు.
ఉమ్మడి జిల్లా కేడర్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లయితే, వారి సీనియారిటీకి కొత్త లోకల్ కేడర్‌లో కూడా రక్షణ ఉంటుందని వివరించారు. ఈ బదిలీల కోసం దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులు ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్ ద్వారా సమర్పించాలని సూచించారు. ఇప్పటి వరకు పరస్పర బదిలీలకు 31 దరఖాస్తులు అందాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment