Somesh Kumar
-
మాజీ CS సోమేశ్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ సీరియస్
-
మీరేం డిబేట్‌కు రాలేదు.. సోమేష్ కుమార్‌పై జస్టిస్ పీపీ ఘోష్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆలస్యంగా లోపలికి రావడంతో పాటు ఆయన సమాధానాలిచ్చిన తీరుపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.కాళేశ్వరం అవకతకవలకు సంబంధించిన అభియోగాలపై ప్రస్తుతం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌తో పాటు సోమేష్ కుమార్‌ను, మరికొందరిని ఇవాళ విచారించారు. అయితే విచారణ నిమిత్తం పీసీ ఘోష్.. కోర్టు హాల్లోకి సోమేష్‌ను పిలిచారు.అయినా కూడా చాలాసేపు దాకా ఆయన లోపలికి వెళ్లలేదు. దీంతో.. ఆయన కోసం ఎంతసేపు ఎదురు చూడాలని పీసీ ఘోష్ ఆగ్రహం ప్రదర్శించారు. విషయం తెలిసి సోమేష్ హడావిడిగా లోపలికి వెళ్లినట్లు సమాచారం.సూటిగా సమాధానాలివ్వండికమిషన్ ముందర చాలా సమాధానాలకు ‘గుర్తు లేదు’ అనే మాజీ సీఎస్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. ‘‘మీరేం డిబేట్‌కు రాలేదు.. స్ట్రయిట్‌గా ఆనర్సివ్వండి’’ అని చెప్పారాయన. అదే సమయంలో.. విచారణకు హాజరైన మరో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సైతం ఇదే రీతిలో పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. దీంతో.. సూటిగా సమాధానాలివ్వని ఈ ఇద్దరిపైనా పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మాజీ సీఎస్ సోమేష్‌కుమార్‌కు సీఐడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో దర్యాప్తును సీఐడి ముమ్మరం చేసింది. రూ.1400 కోట్ల స్కామ్ జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు తెలంగాణ సీఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వస్తువులు సరఫరా చేయక పోయిన చేసినట్లు, బోగస్ ఇన్వాయిస్ లు సృష్టించారని గుర్తించారు.ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు అధికారులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. త్వరలోనే అధికారులను విచారించి స్టేట్మెంట్ను నమోదు చేయనుంది.ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్‌లో సినీ నటి అరెస్ట్తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా భారీ మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం పేర్కొంది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి. -
జీఎస్టీ స్కాంలో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన జీఎస్టీ కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు మరికొందరు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి లేఖతో జీఎస్టీ స్కాం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, జీఎస్టీ సబ్సిడీ చెల్లింపు వ్యవహారంలో అక్రమాలపై ఆమె ఆరా తీశారు. కుంభకోణం ఎలా జరిగిందనే దానిపై టీకే శ్రీదేవి నివేదిక ఇచ్చారు. ఇక, సీఎస్ శాంతకుమారికి సైతం ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోమేష్ కుమార్‌తో పాటుగా పలువురు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా రూ.1000 కోట్ల మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం తెలిపింది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి.ఇక, ఈ కుంభకోణంపై వాణిజ్య పన్నుల శాఖ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ (సెంట్రల్ క్రైం స్టేషన్) పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
జీఎస్టీ స్కామ్ సీఐడీకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వెలుగులోకి వచ్చిన రూ.1,000 కోట్ల జీఎస్టీ స్కామ్ కేసును సీఐడీకి బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ తదితరాలకు సంబంధించి చోటు చేసుకున్న ఈ గోల్‌మాల్‌లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిందితులుగా ఉన్న విషయమూ విదితమే.వాణిజ్య పన్నుల శాఖ కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ–హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ స్రూ్కట్నీ మాడ్యూల్లో పని చేస్తూ వాణిజ్య పన్నుల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసే రిటర్న్స్‌ను పరిశీలించి లోటుపాట్లను గుర్తిస్తుంది. ఇందులో మార్పు చేయడం ద్వారా దాదాపు 75 సంస్థలకు అక్రమ లబ్ధి కూరేలా చేశారు.ఈ వ్యవహారం మొత్తం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ 75 సంస్థలు ఎవరివి? వాటికి, సోమేశ్‌కుమార్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది ప్రస్తుతం కీలకంగా మారిందని అంటున్నారు. ఈ స్కామ్ ద్వారా లబి్ధపొందిన వాటిలో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉండటంపై సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ జీఎస్టీ పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సేవలు అందించే సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా ట్యాక్స్‌ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్‌ను సంబంధిత విభాగానికి చెల్లించాలి. ఈ పన్నుతో పాటు సెస్సు కూడా ఉంటుంది.మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేయడం ద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ వాణిజ్య సర్వీసు చేస్తున్నట్లు లెక్క. దీంతో ఈ విభాగం సైతం కచి్చతంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. అయితే గోల్‌మాల్‌కు పాల్పడినట్లు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం వెనుక మరో స్కామ్ ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీయనున్నారు. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను పర్యవేక్షించడానికి ప్రత్యేక స్క్రూట్నీ మాడ్యూల్‌ను రూపొందించిన ఐఐటీ–హైదరాబాద్..దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎలాంటి సిబ్బందిని నియమించుకోలేదు.పిలాంటో టెక్నాలజీస్ సిబ్బందినే దీనికోసం వినియోగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్ ప్రాంగణం చిరునామాతో పని చేస్తున్న ఐఐటీ–హైదరాబాద్ పిలాంటో టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తుంటుంది. దీన్ని 2010 జనవరిలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శోభన్‌బాబు ఏర్పాటు చేశారని సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. బిగ్ లీప్ నిర్వాకంతోనే వెలుగులోకి స్కామ్దేశ వ్యాప్తంగా ఐదు మెట్రో నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్‌కు సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తోంది. ఇది ప్రస్తుతం మానవవనరుల సరఫరా రంగంలో ఉందని తేలింది. ఇది ఎగ్గొట్టిన రూ.25.51 కోట్ల వ్యవహారంతోనే ఈ స్కామ్ మొత్తం వెలుగులోకి వచి్చంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో పాటు ఐజీఎస్టీ, సెస్‌లను చెల్లించని కొన్ని సంస్థలు అక్రమ లబ్ధి పొందాయి.ఆయా సంస్థలకు లబ్ధి చేకూర్చడం కోసం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఎ.శివరామ ప్రసాద్ వాటి పరిధులను మార్చి చూపించినట్లు గుర్తించారు. తమ పరిధిలోకి రానప్పటికీ... బోగస్ చిరునామాలతో తమ పరిధుల్లో రిజిస్ట్రేషన్లు చేయించారని తేల్చారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో సోమేశ్‌కుమార్ సహా మరికొందరికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. -
తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ శాఖలో భారీ కుంభకోణం
-
తెలంగాణలో మరో భారీ స్కాం.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై కేసు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. కమర్షియల్ ట్యాక్స్‌లో కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో భారీ కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. దాదాపు రూ.1000 కోట్ల అవకతవకలు జరిగినట్టు అధికారులు తెలిపారు. కాగా, 75 కంపెనీలు ఈ కుంభకోణానికి పాల్పడ్డినట్టు చెప్పారు. ఇక, ఈ స్కాంలో లబ్ధి పొందిన జాబితాలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉంది. అయితే, ఈ మొత్తం వ్యవహారం ఫోరెన్సిక్ అడిట్‌తో వెలుగు వచ్చింది.ఇక, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనలతో ట్యాక్స్ పేమెంట్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌తో పాటు ఐఐటీ హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, పిలాంటో టెక్నాలజీస్లపై కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో, స్కామ్‌కు పాల్పడిన నిందితులపై ఐపీసీ 406,409,120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. -
వెయ్యి కోట్ల స్కామ్
-
రూ.1,000 కోట్ల ట్యాక్స్ స్కాం
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్‌ల చెల్లింపు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగినట్లు బయటపడింది. వివిధ సంస్థలు దాదాపు రూ. 1,000 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను ఎగవేసినట్లు నిగ్గుతేలింది. ఆయా సంస్థల అక్రమాలకు కొందరు ప్రస్తుత, మాజీ ఉన్నతాధికారులే సహకరించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.అక్రమంగా లబ్ధి పొందిన సంస్థల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సైతం నిలవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. దీనిపై వాణిజ్య పన్నుల శాఖ ఫిర్యాదుతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబు తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. సోమేశ్ మౌఖిక ఆదేశాలతో.. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ హైదరాబాద్ నిర్వహిస్తోంది. స్రూ్కటినీ మాడ్యూల్లో పనిచేస్తూ వివిధ సంస్థలు దాఖలు చేసే ట్యాక్స్ రిటర్న్‌లలో లోపాలను గుర్తించి వాణిజ్య పన్నుల శాఖను అప్రమత్తం చేస్తోంది. ఈ సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంశాన్నీ పర్యవేక్షించాలి. కానీ సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు స్రూటినీ మాడ్యూల్లో మార్పుచేర్పులు చేశారు.ఈ కార్యకలాపాల కోసం సోమేశ్ కుమార్, శోభన్బాబులతోపాటు వాణిజ్య పన్నుల శాఖలో అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరాంప్రసాద్ తదితరులతో వాట్సాప్‌లో ‘స్పెషల్ ఇనీíÙయేటివ్స్’ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశారు. దీని ద్వారానే సోమేశ్ అటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు, ఇటు ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్‌కు మౌఖికంగా ఆదేశాలు జారీ చేస్తూ పోయారు. ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా (రెవెన్యూ) ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యవహారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసినప్పుడూ కొనసాగింది.వాట్సాప్ గ్రూప్ ద్వారా శోభన్ బాబుకు ఆదేశాలు ఇచి్చన సోమేశ్ తాము చెప్పిన సంస్థలకు సంబంధించిన రిటర్న్‌లలో ఐజీఎస్టీ, సెస్‌లో ఉన్న లోపాలు బయటపడకుండా చేయాలని స్పష్టం చేశారు. స్రూ్కటినీ మాడ్యూల్లో మార్పులు చేసిన శోభన్‌బాబు కొన్ని సంస్థలు చేసిన స్కామ్‌లు బయటపడకుండా చేశారు. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా అనేక సంస్థలు రూ.1000 కోట్ల వరకు స్కామ్‌కు పాల్పడ్డా బయటపెట్టలేదు. ఎట్టకేలకు బట్టబయలు.. ఇటీవల బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు సంబంధించి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంశంలో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆ సంస్థ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో రూ. 25.51 కోట్లు స్వాహా చేసినట్లు తేల్చారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ.. సెంటర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్) సహకారం కోరింది. డేటాను ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన సీ–డాక్... జరిగిన గోల్మాల్ను గుర్తించింది.దీని ఆధారంగా అధికారులు సైతం అంతర్గత విచారణ చేపట్టారు. ఐఐటీ–హైదరాబాద్ సహా వివిధ సంస్థల నుంచి వివరాలు కోరారు. సోమేశ్ కుమార్‌తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల అభ్యర్థన మేరకే తాము స్రూ్కటినీ మాడ్యూ ల్లో మార్పులు చేశామన్న ఐఐటీ–హైదరా బాద్.. ఆ మేరకు వివరాలను సమరి్పంచింది. బయటి సిబ్బందితోనే ఐఐటీ–హైదరాబాద్ పర్యవేక్షణ సీ–డాక్ నివేదిక ప్రకారం దాదాపు 75 సంస్థలకు సంబం«ధించిన రిటర్న్‌లు పూర్తిస్థాయిలో స్క్రూటినీ కాకుండా సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేర్పులు జరిగినట్లు వెలుగులోకి వచి్చంది. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్‌లో మార్పులు చేసేందుకు వాడిన ఐపీ అడ్రస్‌లలో ఒకటి ఏపీలోని హిందూపూర్ నుంచి పనిచేసిందని, ఈ డేటాను యాక్సెస్ చేసిన వ్యక్తులు.. వారి పాస్‌వర్డ్‌గా పిలాంటో అనే పేరును వినియోగించినట్లు కూడా సీ–డాక్ బయటపెట్టింది. వాణిజ్య పన్నుల శాఖ డేటాబేస్‌ను నిర్వహించే బాధ్యతలు చేపట్టిన ఐఐటీ–హైదరాబాద్ దీనికోసం కనీసం ఒక్క ఉద్యోగిని కూడా నియమించుకోలేదని బయటపడింది.సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఐఐటీ–హైదరాబాద్ చిరునామాతోనే రిజిస్టరై ఉన్న పిలాంటో టెక్నాలజీస్‌లో పనిచేసే వారినే ఈ పని కోసం వినియోగించుకుంది. సీ–డాక్ నివేదికతోపాటు అంతర్గత విచారణ నేపథ్యంలో కేవలం 11 సంస్థలు చేసిన స్కామ్ విలువే రూ. 400 కోట్ల వరకు ఉన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తేల్చారు. మొత్తమ్మీద దాదాపు 75 సంస్థలు రూ. 1,000 కో ట్ల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు ఆధారాలు సేకరించారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీని ఆధారంగా కేసు నమోదు చేసిన అధి కారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సోమేశ్ కుమార్‌తోపాటు వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, ఐఐటీ–హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, పి లాంటో టెక్నాలజీస్ తదితరులను నిందితులుగా చేర్చారు. -
రీజనల్ రింగురోడ్డుపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగురోడ్డు( ఆర్ఆర్ఆర్)పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రీజినల్ రింగురోడ్డు పనులు నిలిచిపోయాయన్నారు. రూ. 300 కోట్ల డ్యూటీ ఛార్జెస్ కట్టనందువల్లే పనులు ఆగిపోయాయని తెలిపారు. అవినీతిపరుడైన సోమేష్ కుమార్ వల్లే ఇలా జరిగిందని కోమటిరెడ్డి మండిపడ్డారు. ‘కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టారు. ఇప్పటికే 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారు. మూసీనదీ ప్రక్షాళన చేస్తాం. సిగ్గులేకుండా జలయాత్ర పేరుతో కేసీఆర్ మళ్లీ మోసం చేయాలనుకుంటున్నారు. ... కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టారు. అది అప్పుడే బీటలు వారింది. రీజినల్ రింగ్ రోడ్డు త్వరలో నిర్మాణం చేస్తాం. కాంగ్రేస్ పార్టీ చాలా రోజులుండదని చెబుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలలు కంటున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి రూ. 100 తెచ్చుకోలేని చేతగానివాడు కిషన్‌రెడ్డి’ అని వెంకటరెడ్డి అన్నారు. -
సోమేశ్ కుమార్ భూముల వ్యవహారం.. రేవంత్ సర్కార్ ప్లానేంటి?
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ భూ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది?. ఫార్మా సిటీ వస్తుందని తెలిసి ముందుగానే భూములు కొనుగోలు చేశారా?. ఆయనతో పాటు భూములు కొనుగోలు చేసిన ఇతర అధికారుల వివరాలను ప్రభుత్వం ఆరా తీస్తోందా? అక్కడ భూములు అమ్ముకున్న రైతులు ఏమనుకుంటున్నారు? ఫార్మా సిటీ భూసేకరణ లోపభూయిష్టంగా జరిగిందా?. రేవంత్ రెడ్డి సర్కార్ ఫార్మా సిటీపై ఎలాంటి అడుగులు వేయబోతున్నారు.. హైదరాబాద్ మహానగర శివారులో రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు 2017లో శ్రీకారం చుట్టారు. యాచారం, కందుకూరు, కడ్తల్, ఆమనగల్లు మండలాల్లో 20వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 12వేల ఎకరాలకు పైగా భూసేకరణ పూర్తి చేశారు. దాదాపుగా 500కు పైగా విదేశీ ఫార్మా కంపెనీలు ఇక్కడ తమ ప్రొడక్ట్స్ తయారీకి ముందుకొచ్చాయి. అయితే, దీనికి దగ్గరలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ 25ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఫార్మాసిటీ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో యాచారం మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలో 25ఎకరాల 19గుంటల భూమి తీసుకున్నారు. ఇక్కడ ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు మూడు కోట్లకు పైగానే ఉంది. ధరణి పోర్టల్‌లో ఖాతా నెంబర్ 5237 ద్వారా సర్వే నెంబర్ 249/అ1లో 8 ఎకరాల భూమి, 249/ఆ2లో 10 ఎకరాల భూమి, 260/అ/1/1లో 7.19 ఎకరాల భూమి మొత్తం 25ఎకరాల 19 గుంటల భూమిని సోమేశ్ కుమార్ తన భార్య జ్ఞానముద్ర పేరుతో కొనుగోలు చేశారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి నుంచి సెల్ డీడ్ ద్వారా భూమిని జ్ఞానముద్ర కొన్నట్లు రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2018లో తన సతీమణి జ్ఞానముద్ర పేరుతో నిబంధనల మేరకే కొనుగోలు చేసినట్లు అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సాక్షి టీవీకి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రశాసన్ నగర్లో కేటాయించిన నివాసస్థలంలోని ఇంటిని విక్రయించి.. కొత్తపల్లిలో ఆరు సంవత్సరాల క్రితమే భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. భూమి కొనుగోలుపై ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు సోమేశ్ కుమార్ వివరించారు. ఫార్మా సిటీ సమాచారం ముందుగానే తెలుసుకుని ఈ భూములు తక్కువ ధరకే కొనుగోలు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సాగుకు పనికిరాకుండా ఉన్న ఈ భూమికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు 14 లక్షల రూపాయలకు పైగా సోమేశ్ కుమార్ లబ్ధిపొందారు. ఈ భూమి కొనుగోలు చేసిన విధానంపై ఈడీ, విజిలెన్స్ విభాగాలకు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన సోమేశ్ కుమార్ అక్రమాస్తులు కూడకట్టుకున్నారని, ఆయనపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి సోమేశ్ కుమార్‌పై వస్తున్న భూ ఆరోపణలు.. ఎటువైపు టర్న్ తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ భూములు కొన్న అధికారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ చుట్టూ భూ కొనుగోళ్లపై విచారణ చేయిస్తే తమ పరిస్థితి ఏంటనే దానిపై అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఓ ఐపీఎస్ అధికారి ఫార్మా సిటీ దగ్గర్లో మూడు వందల ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. యాచారం మండలం కొత్తపల్లి, నక్కర్తిమేడిపల్లి గ్రామాల రైతులను భయాందోళనకు గురి చేశారట. అడ్డగోలు ధరకే రైతుల నుంచి భూములు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. ►సదరు ఐపీఎస్ అధికారి తమపై అక్రమంగా కేసులు పెట్టించి కోర్టు చుట్టు తిప్పుతున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కంటతడి పెట్టుకుంటున్నారు అన్నదాతలు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవాలని కొందరు చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ►ఫార్మా సిటీ భూ సేకరణ లోపభూయిష్టంగా ఉందని మండిపడుతున్నారు తాడిపర్తి గ్రామస్తులు, భూదాన్ ట్రస్టులో ఉన్న భూమిని కొందరు రియాల్టర్లు ఫార్మా సిటీకి అమ్ముకుని వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే భూమి కోసం చాలా ఏళ్లుగా ఆ ఊరి ప్రజలంతా న్యాయపోరాటం చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. ►ఫార్మాసిటీలో భూ సేకరణ వ్యవహారంలో ఓ వైపు గందరగోళం నెలకొనగా.. మరోవైపు ఉన్నతస్థాయి అధికారులు ముందుగానే సమాచారం తెలుసుకుని రైతుల నుంచి అడ్డగోలుగా భూములు కొనుగోలు చేశారు. మొత్తంగా ఫార్మాసిటీ చుట్టూ భూములు కొన్నవాళ్ల వివరాలు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎటువంటి చర్యలు చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
Somesh Kumar: క్విడ్ ప్రోకోతో భూముల కొనుగోలు!
హైదరాబాద్: మాజీ సీఎస్, ధరణి రూపకర్తగా పేరున్న సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాతిక ఎకరాల భూమిని తక్కువ ధరలకు చెల్లించి ఆయన కొనుగోలు చేయడం.. అదీ ఫార్మా సిటీ ప్రాంతంలోనే కావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో క్విడ్ ప్రోకో అంశంపై తెరపైకి వచ్చింది. ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని.. ప్లాన్ప్రకారమే యాచారంలో భూములు కొన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. 2018లో ఫార్మాసిటీ ప్రాంతం అయిన కొత్తపల్లిలో 25 ఎకరాల్ని నలుగురి దగ్గరి నుంచి ఆయన కొన్నారు. అందుకుగానూ ఎకరానికి రూ.2 లక్షలు చెల్లించారు. అయితే అది సోమేష్ భార్య పేరిట ఉన్నట్లు ధరణి రికార్డుల్లోనూ ఇది నమోదు అయ్యింది. లక్షల్లో రైతుబంధు సొమ్ము తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ భూముల ద్వారా సోమేశ్ కుమార్ లక్షల్లో రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తపల్లి విలేజ్‌లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటివరకు 14 లక్షల 5 వేల 550 రూపాయల రైతుబంధు తీసుకున్నట్లు సమాచారం. భూమి సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. 25 ఎకరాల 19 గుంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉన్నాయి. కానీ, సోమేశ్ కుటుంబం.. సాగు చెయ్యకుండానే రైతుబంధు పొందినట్లు తెలుస్తోంది. అదేకాకుండా ఆయన బంధువులు మొత్తం 150 ఎకరాలకు సంబంధించి భూమిపై రైతుబంధు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇక.. ఏడాదికి రెండు దఫాల్లో 2 లక్షల 52,750 రూపాయల రైతుబంధు డబ్బును సోమేశ్ కుమార్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే రెరా సెక్రటరీగా పని చేసిన శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో సోమేష్‌కుమార్ కూడా రెరాలో పని చేయడంతో ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. -
తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై భూ వివాదం ఆరోపణలు
-
సోమేష్ కుమార్ నియామకంపై భట్టి సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ తన ముఖ్య సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమేష్ కుమార్ నియామకంపై తెలంగాణ ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రిటైర్ అయిన వాళ్లను ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్నించారు. కాగా, ఈ వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. తాజాగా భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఐఏఎస్‌లు ఏ రాష్ట్రానికి కేటాయిస్తే గౌరవంగా ఆ రాష్ట్రానికి వెళ్లి పనిచేసుకోవాలి. కానీ, సోమేష్ కుమార్ లాంటి వ్యక్తి ఏపీకి వెళ్లకుండా ప్రభుత్వ అడ్వయిజర్‌గా నియమికమయ్యారు. రైటర్ అయిన వాళ్లను ఎందుకు నియమిస్తున్నారు. వీళ్లపై చాలా అపోహలు ఉన్నాయి. భూ భకాసురులు భూములను ఆక్రమించుకునేందుకు సోమేష్ సహాయపడ్డారు. ధరణితో తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి భూములను ధరణి పేరుతో లాక్కున్నారు. ప్రభుత్వం పేదల భూమిని లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5లక్షల కోట్ల విలువైన భూములు లాక్కున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునే ప్లాన్‌లో సూత్రదారి సోమేశ్ కుమార్. అలాంటి వ్యక్తిని మళ్ళీ సలహాదారుగా నియమించుకున్నారు. ఓఆర్ఆర్ లీజ్ వెనుక సోమేష్ కుమార్, అరవింద్ ఉన్నారు. 30 సంవ్సతరాలు లీజుకు ఇవ్వడం ఏంటి?. ఇంత మంది సలహాదారులు ఎందుకు?. రిటైర్డ్ అధికారులతో ప్రభుత్వం నడపాలనుకుంటున్నారా?. లక్షల కోట్లు ఖర్చు పెట్టే ఇరిగేషన్ శాఖకు రిటైర్డ్ అయిన వ్యక్తిని ఎలా కొనసాగిస్తారు. సోమేష్ కుమార్‌ను సలహాదారుగా నియమించడం అంటే.. మళ్లీ దోపిడీని ప్రారంభించినట్టే. వెంటనే సోమేష్ సలహాదారు పదవిని రద్దు చేయాలి. ఆయనపై ఎంక్వరీ వేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసీఆర్ లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేస్తాం. సోమేస్ కనుసన్నల్లోనే హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల భూములు చేతులు మారాయి. ఇంధిరా గాంధీ, ప్రియాంక గాంధీల గురించి మాట్లాడే అర్హత తలసానికి లేదు. ఉస్మానియా యూనివర్సిటీకి, కాకతీయ యూనివర్సిటీకి వెల్లి వచ్చే దమ్ము కేటీఆర్‌కు తలసానికి ఉందా?. ఫార్మాసిటీ కట్టాలంటే పేదల భూములు లాక్కోవడం ఎందుకు?. గజ్వేల్, సిరిసిల్లలో భూములు లేవా?. ప్రభుత్వం బెదిరింపులతో ఎంతకాలం నడుస్తుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్.. కేటీఆర్ అనుచరుడికి సీటు! -
కేసీఆర్ కీలక నిర్ణయం.. సీఎం సలహాదారుగా సోమేష్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ (రిటైర్డ్ ఐఎఎస్)కు కీలక బాధ్యతలు అప్పగించారు. సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, సోమేష్ కుమార్ మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేష్ కుమార్‌ను కేంద్రం రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, ఆయన ఏపీలో రిపోర్ట్ చేశారు. ఇక, ఇటీవలే సోమేష్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారు. దీంతో, సీఎం కేసీఆర్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో సోమేశ్ ‘ముద్ర’.. అనేక రాజకీయ విమర్శలను ఎదుర్కొని -
ప్రజల పక్షాన గళమెత్తిన ‘సాక్షి’: సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ‘సాక్షి’ ఆధ్వర్యంలో కమిషనర్‌తో గతంలో ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులకు స్పందిస్తూ అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రజలందరికీ తేలిగ్గా గుర్తుండిపోయేలా 24 గంటలు పనిచేసే కాల్‌సెంటర్ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అలా అందుబాటులోకి వచ్చిందే జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నంబర్ 040–21 11 11 11. అంతేకాదు.. ఆ రోజు ప్రజల నుంచి వచ్చిన పలు ఫిర్యాదులతో పాటు కొన్ని సూచనలూ ఉన్నాయి. అలా అందిన సూచనల్లోంచి అమలు చేస్తున్నవే తడి–పొడి చెత్త వేరు చేయడం, కొన్ని మొక్కలైనా పెంచాలని ఇంటి నిర్మాణ అనుమతుల నిబంధనల్లో పొందుపరచడం తదితరమైనవి. ఏయే ప్రాంతంలో పారిశుద్ధ్య బాధ్యతలెవరివో ప్రజలందరికీ తెలిసేలా స్థానికంగా బోర్డులు ఏర్పాటు చేస్తామనీ అప్పుడే ప్రకటించారు. నగరంలోని శ్మశాన వాటికల్లో దశలవారీగా మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలా ఏర్పాటైందే నగరంలోని మొదటి ‘మహాప్రస్థానం’. ఇప్పుడు అన్ని జోన్లలోనూ మహా ప్రస్థానాలు అందుబాటులోకి వస్తున్నాయి. కోవిడ్ తరుణంలో కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన వారికి ఇళ్లవద్దకే అన్నపూర్ణ భోజనాలు పంపిణీ చేశారు. అలా ఆపత్కాలంలో లక్షల మందికి ఆకలి బాధ తీరింది. నిర్మొహమాటంగా.. పారిశుద్ధ్యం తదితర అంశాల్లో అధికారుల పనితీరు బాగాలేదని సైతం ఆనాటి కార్యక్రమంలో ప్రజలు నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టారు. ఆయా సమస్యలపై గళమెత్తారు. అన్నింటినీ సావధానంగా విన్న అప్పటి కమిషనర్ ‘నేను సోమేశ్‌కుమార్‌ను మాట్లాడుతున్నాను’ అంటూ ప్రజలతో కలిసిపోయారు. ఇలాంటి వేదికల ద్వారానే ప్రజాభిప్రాయం తెలుస్తుందని, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. ఫిర్యాదులతో పాటు సూచనలు కూడా రావడం ముదావహమన్నారు. ప్రజాభిప్రాయానికనుగుణంగా తగిన చర్యలు చేపట్టారు. ఆనాడే వినియోగంలోకి.. ప్రస్తుతం గ్రేటర్ నగరంలో ఏ సమస్యకైనా, ఫిర్యాదుకైనా ప్రజలు ఫోన్ చేస్తున్న నెంబర్ ఆనాడు వినియోగంలోకి తెచ్చిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోడ్లపై చెత్త నుంచి వెలగని వీధి దీపాలు, ఆహార కల్తీ, రోడ్లపై గుంతలు, దోమలు, వరద ముంపులు.. ఇలా సమస్య ఏదైనా కార్యాలయాల దాకా వెళ్లకుండా ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు అందుబాటులో ఉన్న నెంబర్. ఫిర్యాదును స్వీకరించే సిబ్బంది సంబంధిత అధికారులకు సమస్య చేరవేస్తారు. వివరాలన్నీ ఆన్లైన్లో నమోదవుతాయి. ప్రజలు తమ గోడు తెలిపేందుకు ఒక మార్గం లభించింది. అనంతరం మొబైల్ యాప్ వంటివి సైతం తీసుకొచ్చారు. -
‘రెరా’ చైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇదివరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సోమేశ్‌కుమార్ కూడా రెరా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆయన్ను జనవరి 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయింపు సబబేనని, అక్కడకు వెళ్లిపోవాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. రెరా చైర్మన్ పదవి ఖాళీ అయింది. రెరా చైర్మన్‌తోపాటు సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. చైర్మన్, సభ్యుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 3 (శుక్రవారం)తో గడువు ముగిసింది. ఇప్పటికే పలువురు మాజీ సీఎస్‌లు, రిటైర్డ్ ఐఏఎస్‌లు, టౌన్‌ప్లానింగ్‌లో విశేష అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి రావడానికి కనీసం నెలరోజులు పడుతుందని భావిస్తున్నారు. కొత్త వారిని నియమించే ప్రక్రియ పూర్తయ్యే వరకు రెరా చైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతికుమారిని నియమిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. -
మాజీ సీఎస్ సోమేశ్కు బెయిలబుల్ వారెంట్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఒక ప్లాట్‌కు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టుకు హాజరుకావాలని పలుమార్లు ఆదేశించినా.. రాకపోవడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది. హౌసింగ్ సొసైటీ వ్యవహారంలో కోర్టు తీర్పు అమలు చేయనందుకు సోమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖపట్నంకు చెందిన జయరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ గురువారం విచారణ చేపట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మాజీ సీఎస్‌కు బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. -
సీఎంను కలిసిన సోమేశ్‌కుమార్
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/గన్నవరం: హైకోర్టు తీర్పుతోపాటు డీఓపీటీ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి రిలీవ్ అయిన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ కేడర్‌కు చెందిన సోమేశ్‌కుమార్ తెలంగాణలో పనిచేయడం కుదరదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో డీఓపీటీ కూడా సోమేశ్‌కుమార్ వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆయన గురువారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డిని విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో కలిసి రిపోర్ట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సోమేశ్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. అనంతరం.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందచేయగా, ఆలయ ఈఓ భ్రమరాంబ అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు. ఏ బాధ్యతలిచ్చినా ఓకే.. ఇక ఏపీ ప్రభుత్వం ఎటువంటి బాధ్యతలు అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ గన్నవరం విమానాశ్రయంలో మీడియాకు తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి వచ్చాను..
-
ఏపీలో ఏ బాధ్యతలు ఇచ్చినా ఓకే: సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించినందు వల్ల అక్కడే విధులు నిర్వహించాలని కోర్టు పేర్కొంటూ తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. ఈ క్రమంలో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ ఏపీలో రిపోర్ట్ చేయనున్నారు. దీనిలో భాగంగా గురువారం ఉదయం విజయవాడకు చేరుకున్న సోమేష్ కుమార్.. ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిని కలిశారు. విజయవాడలో సోమేశ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీకి వచ్చాను. నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తాను. ఒక అధికారిగా డీవోపీటీ ఆదేశాలు పాటిస్తున్నాను. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడానికి వచ్చాను. వీఆర్ఎస్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కుటుంబ సభ్యులతో చర్చించాక చెబుతాను’ అని స్పష్టం చేశారు. ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిని కలిసిన అనంతరం సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు సోమేష్ కుమార్. -
Somesh Kumar: తెలంగాణలో సోమేశ్ ‘ముద్ర’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్.సోమేశ్‌కుమార్ తనదైన ముద్ర వేసుకున్నారు. మూడేళ్ల క్రితం సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.జోషి నుంచి ప్రభుత్వ శాఖల పాలన పగ్గాలు తీసుకున్న ఆయన.. అనేక రాజకీయ విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా తనదైన శైలిలో ప్రభుత్వ వ్యవస్థను ముందుకు నడిపిన ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులను సృష్టించడంలో దిట్టగా పేరొందారు. ఎక్సైజ్, రిజిస్టేషన్లు, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా ఆదాయాన్ని రెండు, మూడింతలు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఆయా శాఖల్లో కీలక సంస్కరణలు చేపట్టారు. రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీల ఇష్టారాజ్యాన్ని నియంత్రించేలా మార్పులు తెచ్చారు. ఆబ్కారీ శాఖలో హోలోగ్రామ్ విధానాన్ని తెచ్చి కల్తీ, నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని నియంత్రించడంతోపాటు ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు తెచ్చారు. వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించి పన్ను ఎగవేతలను సమర్థవంతంగా అడ్డుకున్నారు. ఆదాయ శాఖలన్నింటిలో తనదైన ముద్ర వేసిన సోమేశ్.. ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో పారదర్శకతను తెచ్చారు. అయితే, ఈ పోర్టల్ అమల్లో అనేక విమర్శలు కూడా వచ్చాయి. రైతుల భూములకు సంబంధించిన సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ల్యాండ్ బ్యాంక్ రూపకల్పన నిరర్ధక ఆస్తులు, భూములను అమ్మి ప్రభుత్వ ఖజానా నింపడం, టీఎస్ఐఐసీ లాంటి సర్వీస్ ప్రొవైడర్ ద్వారా భూములను విక్రయించే పద్ధతిని సోమేశ్‌కుమార్ తీసుకొచ్చారు. లెక్కాపత్రం లేని ప్రభుత్వ భూముల వివరాలను పక్కాగా తయారు చేసి భవిష్యత్తు అవసరాల కోసం ల్యాండ్ బ్యాంక్‌ను రూపొందించడం లాంటి పనులు కూడా ఆయన హయాంలోనే జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగులకు సంబంధించిన పైరవీలకు సోమేశ్ చెక్ పెట్టారనే వాదన కూడా ఉంది. ఏటా అన్ని శాఖల్లో ఆడిటింగ్‌ను క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా జవాబుదారీతనం పెంపు కోసం యత్నించారు. ఇక జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో డోర్ టు డోర్ సర్వే, రూ.ఐదుకే భోజనం, ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం) కింద ఫ్లైఓవర్ల నిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జీహెచ్ఎంసీలో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలు సులవుగా ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించింది కూడా ఈయన హయాంలోనే. ఈ కాల్‌సెంటర్ కోవిడ్ సమయంలో చాలా ఉపయోగపడిందనే పేరుంది. -
Telangana: సీఎం కేసీఆర్‌తో శాంతికుమారి భేటీ
సాక్షి, హైదరాబాద్: సోమేశ్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో.. తెలంగాణకు కొత్త చీఫ్ సెక్రటరీ ఎంపిక అనివార్యమైంది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆసక్తికరంగా.. సీనియర్ అధికారిణి శాంతికుమారి బుధవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. సీఎస్ రేసులో ఈమె పేరు కూడా ప్రముఖంగా వినిపించడం విశేషం. దీంతో సీఎస్‌గా శాంతకుమారి పేరును ఫైనలైజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి పేరు.. సీఎస్ రేసు లిస్ట్‌లో ప్రముఖంగా ఉంది. ఇదిలా ఉంటే.. విభజన సమయంలో కేంద్రం సోమేశ్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించినందున అక్కడికే వెళ్లి విధులు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. దీంతో ఆయన గురువారం ఏపీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా.. రాజీనామా చేస్తారనే ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వెంటనే ఆయన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సీఎం కేసీఆర్ నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎస్ రేసులో.. ఆ ముగ్గురు! -
తెలంగాణ కొత్త సిఎస్ ఎవరు ?
-
తెలంగాణ సీఎస్ రేసులో ముగ్గురు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఏపీ కేడర్‌కు వెళ్లిపోవాలని హైకోర్టు తీర్పు చెప్పగా, ఆ వెంటనే ఆయన్ను తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12లోగా ఏపీ ప్రభుత్వంలో రిపోర్టు చేయాలని కేంద్రం సోమేశ్ కుమార్‌ను ఆదేశించింది. దీంతో తక్షణమే కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం అనివార్యంగా మారింది. హైకోర్టు తీర్పు అనంతరం సోమేశ్ కుమార్ సీఎం కేసీఆర్‌ను కలిశారు. కాగా, మంగళవారం అర్ధరాత్రి వరకు ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త సీఎస్ నియామకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీతో సంబంధం లేకుండా.. కొత్త సీఎస్ రేసులో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీనియారిటీ ప్రకారం పరిశీలిస్తే సీఎస్ రేసులో 1987 బ్యాచ్ ఐఏఎస్ వసుధ మిశ్రా ముందంజలో ఉంటారు. అయితే, డెప్యూటేషన్‌పై యూపీఎస్సీ సెక్రటరీగా మంచి పదవిలో ఉండటం, మరో నెల రోజుల్లో పదవీ విరమణ చేయనుండడంతో ఆమె పోటీలో లేనట్టే. రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాణికుముదిని (1988 బ్యాచ్)కి సైతం ఆరు నెలలకు మించి సర్వీసు లేదు. వీరిద్దరి తర్వాత సీనియారిటీ ప్రకారం 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి, 1990 బ్యాచ్ అధికారులైన శశాంక్ గోయల్ (ప్రస్తుతం డెప్యూటేషన్‌పై కేంద్రంలో ఉన్నారు), రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, 1991 బ్యాచ్ అధికారులైన రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, కేంద్ర జలవనరుల శాఖ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ పేర్లను పరిశీలించాల్సి ఉండనుంది. సీనియారిటీతో సంబంధం లేకుండా తమకు నచ్చిన అధికారులను సీఎస్‌గా నియమించుకునే సంప్రదాయం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్ కుమార్‌ల్లో ఒకరిని సీఎస్‌గా నియమించవచ్చనే చర్చ జరుగుతోంది. కీలకమైన రాష్ట్ర ఆర్థిక శాఖ బాధ్యతలను సుదర్ఘీకాలంగా నిర్వహిస్తున్న కె.రామకృష్ణారావు పనితీరు పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరున్న అరవింద్ కుమార్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పెషల్ సీఎస్‌లుగా ఉన్న శాంతికుమారి, రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌లలో ఒకరిని నియమిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇన్చార్జి సీఎస్ నియామకం? పూర్తి స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించాలా? లేదా ఇన్చార్జి సీఎస్‌ను నియమించాలా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్టు సమాచారం. సోమేశ్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీ కేడర్‌కు కేటాయించడాన్ని సమర్థిస్తూ హైకోర్టు జారీ చేసిన తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు తెలిసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తే మళ్లీ ఆయన్నే సీఎస్‌గా పునరి్నయమించే అవకాశముంది. సుప్రీంకోర్టు స్టే విధించడానికి నిరాకరిస్తే మాత్రం పూర్తిస్థాయి సీఎస్‌ను నియమించక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. అలాంటి పరిస్థితుల్లో స్టేపై సుప్రీం కోర్టు నిర్ణయం వచ్చే వరకు రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌లలో ఒకరిని ఇన్చార్జి సీఎస్‌గా నియమించవచ్చని తెలుస్తోంది. -
సోమేశ్‌ను బాధ్యతల నుంచి తప్పించాలి: బండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును శిరసావహిస్తూ సోమేశ్ కుమార్‌ను సీఎస్ బాధ్యతల నుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయా లని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచి్చనందున ఆ పదవికి ఆయన రాజీనామా చేయాలన్నారు. తెలంగాణ వ్యక్తిని లేదా తెలంగాణకు కేటాయించిన వ్యక్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని సూచించారు. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండగా సోమేశ్ కుమార్‌ను సీఎస్‌గా నియమించడం సీఎం కేసీఆర్ అనైతిక రాజకీయాలకు నిదర్శనమని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. కేంద్రం ఆదేశాల మేరకు ఏపీకి కేటాయించిన అధికారులను అక్కడకు, తెలంగాణకు కేటాయించిన అధికారులను స్వ రాష్ట్రానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి అధికారులను పావుగా వాడుకుంటున్నారని, 317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారన్నారు. -
ఏపీకి వెళ్లాల్సిందే.. సోమేశ్ కుమార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఆయనను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించినందున అక్కడికే వెళ్లి విధులు నిర్వహించాలని తేలి్చచెప్పింది. తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ 2016లో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఆ పరిధి క్యాట్‌కు లేదని స్పష్టం చేసింది. కేంద్రం జారీ చేసిన కేటాయింపులను సమర్థించింది. అఖిల భారత సరీ్వసు అధికారుల కేటాయింపులు, కేడర్ నియంత్రణ, నిర్ణయాధికారం కేంద్రానిదేనన్న వాదనలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. చట్టపరమైన వాటితో పాటు ఇతర అన్ని అంశాలను క్యాట్ పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నందాతో కూడిన ధర్మాసనం 89 పేజీల తీర్పును వెలువరించింది. కాగా అప్పీల్ కోసం తీర్పు అమలును మూడు వారాలు నిలిపేయాలన్న సోమేశ్‌కుమార్ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అన్ని అంశాలను వివరంగా పరిశీలించిన తర్వాతే తీర్పు ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీకి సంబంధించిన వివాదాలపై గతంలో క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను.. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ హైకోర్టులో సవాల్ చేసింది. సుదీర్ఘ కాలం ఇరుపక్షాల వాదనలు విని, గత జూలైలో తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది. మాకెలాంటి పక్షపాతం కనిపించడం లేదు.. ‘కేంద్రానికి క్యాట్ అప్పిలేట్ అధికారిగా వ్యవహరించలేదు. అది చట్టప్రకారం సమర్ధనీయం కాదు. ఆలిండియా కేడర్ ఉద్యోగులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి. ఫలానా రాష్ట్రంలోనే పని చేస్తానని చెప్పడం సుప్రీంకోర్టు గత తీర్పులకు విరుద్ధం. సోమేశ్‌ను ఏపీకి కేటాయించడంలో మాకు ఎలాంటి పక్షపాతం కనిపించడం లేదు. సీరియారిటీ, కేడర్ దెబ్బతింటుందన్న వాదనలో వాస్తవం లేదు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే కేంద్రం కేడర్ విభజన చేసింది. పరస్పర బదిలీకి సంబంధించి సోమేశ్ చేసిన అభ్యర్థనను మార్గదర్శకాల మేరకు కేంద్రం తిరస్కరించింది. 1989 బ్యాచ్ అధికారి సోమేశ్కు, 1990 బ్యాచ్ అధికారి రజత్భార్గవ్తో పరస్పర బదిలీ సాధ్యం కాదంది. విభజన సమయంలో సీఎస్‌గా ఉన్న మొహంతి.. ప్రత్యూష్ సిన్హా కమిటీలో సభ్యుడిగా ఉండటం సరికాదని, కుమార్తె, అల్లుడికి ప్రయోజనం కలుగుతున్నందున కమిటీలో ఆయన ఉండొద్దన్న క్యాట్ నిర్ణయం సమర్ధనీయం కాదు. కేంద్రాన్ని ఆయన ఎలా ప్రభావితం చేశారో ఎవరూ చెప్పలేదు. 60 ఏళ్లు నిండటంతో 2014 ఫిబ్రవరిలో మొహంతి పదవీకాలం ముగిసింది. అయినా విభజన దృష్ట్యా 4 నెలలు పదవీ కాలాన్ని పొడిగించారు. జూన్ 1న పదవీ విరమణకు అనుమతించాలన్న ఆయన అభ్యర్థనను నాటి సర్కార్ అంగీకరించింది. విరమణ రోజును పని దినంగా పేర్కొనరాదని నిబంధనలున్నా.. క్యాట్ ఆ రోజును కూడా పరిగణనలోకి తీసుకోవడాన్ని తప్పుబట్టాల్సిందే. ఈ కేసులో సోమేశ్ తరఫున నాటి జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ కౌంటర్ దాఖలు చేశారు. సోమేశ్ అఫిడవిట్ ఎందుకు వేయలేదన్నది సందిగ్ధం..’ అని తీర్పులో ధర్మాసనం పేర్కొంది. క్యాట్‌లో ఒకలా..హైకోర్టులో మరోలా.. సివిల్ సర్వీస్ అధికారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే కేడర్ కంట్రోలింగ్ అథారిటీ. ఇష్టం వచి్చన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకునే హక్కు సదరు అధికారులకు లేదు. రాష్ట్ర ప్రభుత్వ వాదన సరికాదు. తెలంగాణలో సోమేశ్ కొనసాగింపు చట్ట వ్యతిరేకం. ఆయన కంటే సమర్థులు లేరని తెలంగాణ భావిస్తే ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి డెప్యుటేషన్ మీద మళ్లీ రప్పించుకోవచ్చు. ఈ కేసుపై క్యాట్‌లో విచారణ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపులపై నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. హైకోర్టు ఎదుట మాత్రం వైఖరిని మార్చుకుంది. రాష్ట్ర విభజనకు అపాయింటెడ్ డే అయిన జూన్ 2, 2014కు ఒకరోజు ముందు పీకే మొహంతి రిటైరయ్యారు. అందుకే ఆయనను ఇరు రాష్ట్రాల మధ్య విభజన అధికారుల జాబితాలో చేర్చలేదు. అలా చేర్చి ఉంటే తనకు తెలంగాణ వచ్చేదన్న సోమేశ్‌కుమార్ వాదన సరికాదు. అధికారుల విభజనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీలో పీకే మొహంతి ఎక్స్‌అఫీíÙయో మెంబర్ మాత్రమే. మిగతా సభ్యులు ఉండగా ఆయన వివక్ష చూపడానికి అవకాశం లేదు. క్యాట్ ఉత్తర్వులను కొట్టేయాలి. సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే. – ఏఎస్జే టి.సూర్యకరణ్‌రెడ్డి సోమేశ్ అవకాశాలను మొహంతి దెబ్బతీశారు రాష్ట్ర విభజన సమయంలో అఖిల భారత సర్వీస్ అధికారుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీలో సమైక్యాంధ్ర చివరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మొహంతి రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించలేదు. ఆయన తన కుమార్తె, అల్లుడికి లబ్ధి చేకూరేలా వ్యవహరించారు. రాష్ట్ర విభజనకు ఒక్కరోజు ముందు పదవీ విరమణ చేసిన మొహంతి పేరిట 2014, జూన్ 1న కూడా ప్రభుత్వ జీవోలు జారీ అయ్యాయి. దీని ప్రకారం అప్పటివరకు సరీ్వస్‌లో ఉన్న మొహంతిని ఏపీ లేదా తెలంగాణకు కేటాయించక పోవడం చట్ట వ్యతిరేకం. చివరిరోజు వరకు విధుల్లో ఉండి ఆపై రాజీనామా చేయడం ద్వారా కావాలని సోమేశ్‌కుమార్ అవకాశాలను దెబ్బతీశారు. లబి్ధదారుడైన మొహంతి కమిటీలో సభ్యుడిగా ఉండటం చెల్లదు. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి. – సోమేశ్‌కుమార్ తరఫు న్యాయవాదులు రాష్ట్ర ఏర్పాటు నుంచే వివాదం.. రాష్ట్ర విభజన (2014) నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఆలిండియా సరీ్వస్ ఉద్యోగుల విభజనలో భాగంగా సోమేశ్‌ను ఏపీకి కేటాయించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా, తెలంగాణకు కేటాయిస్తూ 2016లో ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి సోమేశ్ తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు. క్యాట్ జారీ చేసిన ఉత్తర్వులను 2017లో కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. సోమేశ్కు సంబంధించి క్యాట్ ఇచి్చన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జే) టి.సూర్యకరణ్‌రెడ్డి, సోమేశ్‌కుమార్ తరఫున సీనియర్ న్యాయవాది డీవీ సీతారాంమూర్తి, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్, ఏపీ తరఫున పి.గోవింద్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా సోమేశ్‌కుమార్‌తో పాటు మరో 14 మంది ఆలిండియా కేడర్ సరీ్వస్ అధికారులు కాŠయ్‌ట్ ద్వారా అనుమతి పొంది తెలంగాణలో పనిచేస్తుండటం గమనార్హం. వీరందరికీ సంబంధించి కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. -
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను రిలీవ్ చేసింది కేంద్రం. గురువారంలోగా ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సీఎస్‌గా సోమేష్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసిన మరునాడే కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. రాష్ట్ర విభజనప్పుడు సోమేష్ కుమార్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో సోమేష్‌కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పునిచ్చింది. చదవండి: సీఎస్ సోమేష్‌కుమార్ క్యాడర్ కేటాయింపు రద్దు.. టీఎస్ హైకోర్టు కీలక ఆదేశాలు -
16,940 పోస్టులకు త్వరలో మరో నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని, మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకూ సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. బీఆర్కేఆర్ భవన్లో మంగళవారం ఉద్యోగ నియామకాలపై టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డితో కలసి ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో ఖాళీల భర్తీ ప్రక్రియ.. టీఎస్పీఎస్సీ, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డు తదితర ఏజెన్సీల ద్వారా జరుగుతుందని తెలిపారు. నియామకాల ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతోపాటు, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టీఎస్పీఎస్సీకి అందించాలని కోరారు. దీని ఆధారంగా టీఎస్పీఎస్సీ వచ్చే నెల్లో నోటిఫికేషన్లు జారీ చేస్తుందన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గురుకులాల కాలేజీలు, పాఠశాలల్లో భర్తీకి... కొత్తగా అనుమతి ఇవ్వనున్న పోస్టుల్లో 3వేల వరకు గురుకుల సంస్థల్లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గురుకుల నియామక బోర్డు ద్వారా గురుకుల డిగ్రీ, ఇంటర్ కళాశాలలతోపాటు పాఠశాలల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సైతం అనుమతులు రానున్నాయని తెలిసింది. ఇప్పటి వరకు 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినా.. కొన్ని పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు వచ్చాయి. సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ఆయా పోస్టుల భర్తీకి ఇండెంట్లు అందకపోవడంతో టీఎస్పీఎస్సీతోపాటు ఇతర నియామక సంస్థల నుంచి నోటిఫికేషన్ల జారీలో ఆలస్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా శాఖలతో ఇండెంట్ల కోసం వరుసగా సమావేశాలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇండెంట్లు అందిన తర్వాత రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు సరిగ్గా ఉన్నాయా? లేదా ? అని పరిశీలించి చూడనుంది. అంతా సవ్యంగా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి నోటిఫికేషన్ల ప్రకటన ప్రారంభం కానుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. -
తెలంగాణ: మరో 16 వేలకు పైగా ఖాళీ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా వున్న పోస్టుల్లో 60 వేల ఖాళీల భర్తీకి విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ కాగా.. మరో గుడ్‌న్యూస్ ప్రకటించింది. మరో 16 వేలకు పైగా ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 16,940 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 90 వేల ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని, అందులో భాగంగా విడతలవారీగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్ ఇంతకు ముందు ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఇఫ్పటికే చాలా శాఖలకు చెందిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. -
లారీలపై తగ్గనున్న గ్రీన్‌ట్యాక్స్
సాక్షి, హైదరాబాద్: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మునుగోడు ఉప ఎన్నికలో పోటీకి దిగుతామని లారీ యజమానుల సంఘం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టి సారించింది. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ వారితో భేటీ అయ్యారు. తాజాగా ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రవాణాశాఖ కమిషనర్ శ్రీనివాసరాజులతో కలసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ లారీ యజమానుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన గ్రీన్‌ట్యాక్స్‌ను తగ్గించి అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఏడు నుంచి 12 ఏళ్ల మధ్య వాహనాలకు ప్రస్తుతం రూ.6 వేల వరకు విధిస్తున్న గ్రీన్‌ట్యాక్స్‌ను రూ.1,500, 12 ఏళ్లు దాటిన వాహనాలకు గరిష్టంగా రూ.25 వేల వరకు ఉన్న మొత్తాన్ని రూ.3 వేలకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం తెలిసింది. ఇది తమకు భారంగా ఉన్నందున ఆ పన్నును ఎత్తేయాలని లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ పన్నును గరిష్టస్థాయిలో తగ్గిస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్‌ను అమలు చేసేందుకు కూడా హామీ ఇచ్చా రు. లారీలు ఏపీలోకి ప్రవేశించిన ప్రతీసారీ రూ.2 వేలు పన్ను చెల్లించాల్సి వస్తోంది. దానికి బదులు ఏడాదికి ఒకేసారి కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ వసూలు చేసి ఎన్నిసార్లయినా వెళ్లివచ్చేందుకు అవకాశం కల్పించాలని ఏళ్లుగా లారీ యజమానులు కోరుతున్న దానిని కొలిక్కి తెస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. లైసెన్సుల సస్పెన్షన్‌పై ఉపశమనం.. నిబంధనలకు విరుద్ధంగా ఓవర్‌లోడ్‌తో వెళ్లే లారీలను పట్టుకున్నప్పుడు డ్రైవర్ల లైసెన్సులను నిర్ధారిత కాలానికి సస్పెండ్ చేస్తున్నారు. ఆ సస్పెన్షన్‌ను రద్దు చేయాలన్న డిమాండ్‌కు కూడా సానుకూలత లభించింది. సస్పెన్షన్ బదులు పెనాల్టీ విధించనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. తైబజార్లలో లారీవాలాలనుంచి కాంట్రాక్టర్లు వసూలు చేస్తున్న మొత్తం తమకు భారంగా ఉందని, వ్యాపారుల నుంచి వసూలు చేసుకోవాల్సిన మొత్తాన్ని లారీల నుంచి వసూలు చేయటం ఏంటని సంఘం నేతలు ప్రశ్నించారు. ఇసుక క్వారీల్లోని ఇబ్బందులనూ వారి దృష్టికి తెచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు వారికి హామీ ఇచ్చారు. త్వరలో ఉత్తర్వులు విడుదల చేస్తామని కూడా పేర్కొన్నారు. సమావేశంలో తెలంగాణ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సందారెడ్డి, ఉపాధ్యక్షుడు యాదయ్య, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Telangana: వీఆర్ఏల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: 83 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించాలని వీఆర్ఏలు నిర్ణయించారు. వీఆర్ ఏల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందని, ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల నియమావళి ఎత్తివేయగానే వారి డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. వీఆర్ఏలందరూ తక్షణమే విధులకు హాజరు కావాలని సూచించారు. దీంతో గురువారం నుంచి విధులకు హాజరవుతామని వీఆర్ఏలు చెప్పారు. వీఆర్ఏల ప్రతినిధులు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నాయకులతో సోమేశ్‌కుమార్ బుధవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు తమ డిమాండ్లను సీఎస్‌కు విన్నవించారు. పే స్కేల్ వర్తింపు, సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు, సమ్మె కాలానికి వేతనం, కేసుల ఎత్తివేత, సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించడం, సమ్మెకాలంలో మరణించిన వీఆర్ఏల కుటుంబాలకు పరిహారం చెల్లింపు, వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం తదితర డిమాండ్లను వివరించారు. ఈ సమావేశంలో ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్, వీఆర్ఏ జేఏసీ సెక్రెటరీ జనరల్ దాదే మియా, కన్వీనర్ డి.సాయన్న తదితరులు పాల్గొన్నారు. హామీ ఇచ్చారు: ట్రెసా అధ్యక్షులు రవీందర్ రెడ్డి ‘వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా నవంబరు 7 తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వీఆర్ఏలు గురువారం నుంచి విధులకు హాజరవుతారు’అని సీఎస్‌తో చర్చల అనంతరం ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తెలిపారు. చదవండి: Munugode Bypoll: తగ్గేదేలే..!.. ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు -
Telangana: రాష్ట్రంలో కొత్తగా మరో 13 మండలాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో 13 కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసింది. గతంలోనే వీటికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది. తాజాగా ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం ఈ మండలాలను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మండలాలన్నీ సెప్టెంబర్ 26, 2022 నుంచి ఉనికిలోకి వస్తాయి. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఫైనల్ గెజిట్‌లో పేర్కొంటున్నట్టు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించారు. జగిత్యాల, సంగారెడ్డి, నల్లగొండ, మహబూబాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 607 మండలాలు ఉండగా, ఇప్పుడు మరో 13 కొత్తగా ఏర్పాటు కావడంతో రెవెన్యూ మండలాల సంఖ్య 620కి చేరింది. -
వారం వారం.. ప్రగతి లక్ష్యం.. కొత్త విధానానికి శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలన యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించి, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలను సత్వరంగా అమలు చేయడంలో భాగంగా జిల్లా కలెక్టర్లకు వారం వారం లక్ష్యాలను నిర్దేశించే కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శ్రీకారం చుట్టారు. ప్రతి ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్లకు వాట్సాప్ ద్వారా.. సోమవారం నుంచి వారం రోజుల పాటు దృష్టి సారించాల్సిన అంశాలు, సాధించాల్సిన పురోగతిపై స్పష్టమైన లక్ష్యాలను విధిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కుంటి నడకతో.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయికి వెళ్లే సరికి ముందుకు పురోగమించడం లేదు. క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యం, నిర్లిప్తతతో కొన్ని ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో తలెత్తుతున్న సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో ప్రగతిభవన్‌లో ప్రాధాన్యత పథకాలు, కార్యక్రమాలపై విస్తృత రీతిలో సమీక్షలు జరుపుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో కొంతకాలం అధికార యంత్రాంగం హడావుడి చేసినా సమస్యలు కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్ చర్యలు చేపట్టారు. ప్రాధాన్యత అంశాల అమలుపై ప్రతివారం లక్ష్యాలను నిర్దేశించి పురోగతిని సమీక్షించాలని నిర్ణయించారు. తాజాగా ఈ వారం ఐదు అంశాలపై దృష్టి సారించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు రాసిన లేఖలో ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలని సూచించారు. 1. పోడుపై సమన్వయ కమిటీ సమావేశాలు గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల సమస్యకు పరిష్కారం కల్పించడంలో భాగంగా ఈ వారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలి. గ్రామ స్థాయిలో దరఖాస్తుల పరిశీలన, పరిష్కారానికి గడువు నిర్దేశించుకోవాలి. ఎప్పటిలోగా ఈ పనిని పూర్తి చేస్తారో తెలియజేయాలి. 2. పెన్షన్ కార్డుల పంపిణీ పూర్తి చేయాలి ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ వారంలోగా పూర్తి చేయాలి. గ్రామ పంచాయతీ స్థాయిలో పంపిణీ చేపట్టాలి. ఒక్కో ఎమ్మెల్యే రోజుకు 8 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి. కార్యక్రమం పూర్తికి లక్షిత తేదీని తెలియజేయాలి. 3. క్రమబద్ధీకరణ దరఖాస్తులు పరిశీలించాలి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదలు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించడానికి జారీ చేసిన జీవో 59 కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలను ప్రారంభించి రెండు వారాల్లోగా పూర్తి చేయాలి. ఇందుకు సరిపడ సంఖ్యలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తుల పరిశీలన జరపాలి. 4. ధరణి సమస్యలకు సత్వర పరిష్కారం ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా టీఎం33 కింద ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పట్టాదారు పేరు, విస్తీర్ణం, భూమి స్వభావం, మిస్సింగ్ సర్వే నంబర్ల నమోదు గురించి వచ్చే దరఖాస్తులను పరిష్కరించాలి. ఎన్ని దరఖాస్తులు ఆమోదించారో, ఎన్ని తిరస్కరించాలో ఎప్పటికప్పుడు వివరాలు పంపాలి. ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగించాలని కోరుతూ వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలి. 5. విషాహార ఘటనలు పునరావృతం కావొద్దు రాష్ట్రంలోని గురుకుల, కేజీబీవీ వసతి గృహాల్లో విషాహార ఘటనలు పునరావృతం కాకూడదు. ఈ విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో వ్యహరించాలి. పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. ఇదీ చదవండి: ఎన్ఐఏ పంజా.. నిజామాబాద్ కేంద్రంగా ఉగ్రవాద శిక్షణపై ఫోకస్ -
వజ్రోత్సవాల ముగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాలుగా ఘనంగా నిర్వహిస్తున్న భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఎల్బీ స్టేడియంలో జరిగే ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిధిగా హాజరు కాను న్నారు. ఈ వేడుకల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులను, ఇటీవల అంతర్జాతీయ వేదికపై ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారులను సీఎం సన్మానించనున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ సంగీత విభావరి, వాయిద్య కళాకారుడు శివమణి సంగీత వాయిద్య విన్యాసం, పద్మశ్రీ పద్మజారెడ్డి బృందం శాస్త్రీయ నృత్య ప్రదర్శన, వార్సీ బ్రదర్స్ ఖవ్వాలి, కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. వజ్రోత్స వాల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను తెలిపే లఘు వీడియో ప్రదర్శిస్తారు. అనంతరం లేజర్ షో, ఆ తర్వాత బాణాసంచా కార్యక్రమా లుంటాయని అధికారులు తెలిపారు. వజ్రోత్స వాల్లో భాగంగా థియేటర్లలో ప్రదర్శించిన గాంధీ సినిమాను దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు తిలకించినట్టు అధికారులు పేర్కొన్నారు. -
స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వజ్రోత్సవాల ప్రారంభోత్సవాన్ని హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఆయన సందేశానికి ముందు 75 మంది వీణ వాయిద్య కళాకారులతో దేశభక్తి గీతాల వాయిద్య ప్రదర్శన, స్వాతంత్య్ర సమరయోధులను స్మరిస్తూ శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఇతర నృత్యాలు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సుల్తానియా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్, సమాచార శాఖ డైరక్టర్ రాజమౌళి, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరక్టర్ హరికృష్ణ తదితరులతో కలిసి హెచ్ఐసీసీ వేదికను పరిశీలించారు. ఈనెల 8న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ఆహ్వానితులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
వీఆర్వోల ఆందోళనను పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఆరు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోలు విధులకు దూరంగా ఉన్నా ప్రభుత్వంలో చలనంలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కనీసం ఐదు నిమిషాల పాటు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమని గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. వీఆర్వోలు 14 ఏళ్లుగా ఒకే క్యాడర్లో ఉద్యోగం నిర్వహించడం బాధాకరమని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యోగుల మనోభావాలు సీఎస్‌కు తెలియవని, సీఎం కేసీఆర్‌ను ఆయన తప్పదోవ పట్టిస్తున్నారని జేఏసీ ఆరోపించింది. శనివారం సీసీఎల్ఏలో వీఆర్వోల జేఏసీ సమావేశం అయింది. జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీశ్, అదనపు సెక్రెటరీ జనరల్ పల్లెపాటి నరేశ్, కో చైర్మన్ రవి నాయక్, వైస్ చైర్మన్లు మౌలానా, నూకల శంకర్, రవీందర్, ప్రతిభ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కృష్ణాగౌడ్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖను రద్దు చేయాలని ప్రయత్నం జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ ఏకం కావాలని కోరారు. పెద్ద సంఖ్యలో ఉన్న వీఆర్వోలు, వీఆర్ఏలు విధులకు దూరంగా ఉండడం వల్ల పాలన కుంటుపడిపోయిందని అన్నారు. ప్రభుత్వం వీఆర్వోల సర్వీసును గుర్తించి రెవె న్యూ శాఖలోనే మరో పేరుతో కొనసాగించాలని కోరుతున్నామన్నారు. వీఆర్ ఏలకు స్కేలు మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
Telangana: ఊరూరా గోదారే!.. కనీవినీ ఎరుగని జలవిలయం
►బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 29.48, కరీంనగర్ జిల్లా అర్ణకొండలో 23 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. ►ఏటా నైరుతి సీజన్లో 72.58 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. ఈసారి జూలై రెండో వారం నాటికే 52.49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ►గోదావరిలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ ప్రవాహాలు నమోదవుతున్నాయి. పరీవాహక ప్రాంతం వెంట 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 19,071 మందిని తరలించారు. ►భద్రాచలంలో 1986లో 76 అడుగులతో గోదావరి ప్రవహించగా.. 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో వరద పోటెత్తే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ►శ్రీరాంసాగర్‌లోకి వరద తగ్గుముఖం పట్టింది. ►కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ బ్యారేజీ కంట్రోల్ రూమ్‌లో 12 మంది ఇరిగేషన్ ఇంజనీర్లు వరదలో చిక్కుకున్నారు. ►లక్ష్మీ బ్యారేజీ వద్ద ఉన్న పలిమెల పోలీస్‌స్టేషన్‌ను వరద చుట్టుముట్టింది. దీంతో 70 మంది సీఆర్పీఎఫ్, 20 మంది టీఎస్ఎస్పీ సిబ్బంది ఇంజనీర్ల క్వార్టర్ల వద్ద తలదాచుకున్నారు. ►అల్పపీడనం బలహీనపడటంతో గురువారం మధ్యాహ్నం నుంచి వానలు తగ్గాయి. ►రాష్ట్రం రెడ్ అలర్ట్ నుంచి బయటపడింది. ►9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ►రుతుపవనాలు చురుగ్గా ఉండటం, ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటం వల్ల మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రాన్ని గోదావరి వరద వణికిస్తోంది. ఎగువన మహారాష్ట్ర నుంచి కింద ఆంధ్రా వరకు ఉప్పొంగి ప్రవహిస్తూ ఊళ్లకు ఊళ్లను నీట ముంచుతోంది. నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లో గోదావరి, ఉప నదుల బీభత్సంతో జన జీవనం అతలాకుతలమైంది. చాలాచోట్ల రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జూలై నెలలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం చరిత్రలోనే తొలిసారికాగా.. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఏకంగా 13 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దానికి ప్రాణహిత, ఇతర ఉప నదులు, వాగుల నీరుకలిసి.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టులు సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎల్లంపల్లి నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి. అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌లు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల నుంచి 19 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు వెల్లడించారు. గోదావరి పరీవాహక ప్రాంతమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు తెలిపారు. 25 గ్రామాలు జల దిగ్బంధం: గోదావరి మహోగ్ర రూపంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమెల మండలాల్లో 25 గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాళేశ్వరం వద్ద నీటిమట్టం 16.80 మీటర్ల ఎత్తుకు చేరడంతో.. పుష్కర ఘాట్లు మునిగిపోయి సంగమేశ్వర ఆలయం దాకా నీరు వచ్చింది. ముంపు ప్రాంతాల వారిని బోట్లలో బయటికి తీసుకువస్తున్నారు. అంధకారంలో ఏజెన్సీ: గోదావరి వరద పోటెత్తడంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గోదావరిలో ఇన్‌టేక్ వెల్స్ మునిగిపోవడంతో మంచి నీటి సరఫరా కూడా లేకుండా పోయింది. వరద ప్రమాదం నేపథ్యంలో ప్రజల కదలికలపై అధికారులు ఆంక్షలు విధించారు. భద్రాచలం పట్టణంతోపాటు బూర్గంపాడు మండలంలో గురువారం మధ్యాహ్నం నుంచి 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చారు. అత్యవసరమైతేనే తప్ప ఎవరూ ఇళ్లలోంచి బయటికి రావొద్దని హెచ్చరించారు. చర్ల– దుమ్ముగూడెం– భద్రాచలం, బూర్గంపాడు– సారపాక దారిలో చాలా చోట్ల గోదావరి వరద రోడ్లపైకి చేరి.. రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో మంత్రి పువ్వాడ అజయ్ దుమ్ముగూడెం పర్యటనను రద్దు చేసుకున్నారు. గంగమ్మ శాంతించాలని కోడి కోసి మొక్కు తీర్చుకుంటున్న ముంపు బాధితులు ఎస్సారెస్పీలోకి తగ్గిన వరద గోదావరి దిగువన పోటెత్తుతుంటే.. ఎగువన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టుకు బుధవారం గరిష్టంగా 4.2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. గురువారం సాయంత్రానికి 2.5 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు నుంచి 36 గేట్ల ద్వారా అదే మొత్తంలో నీటిని వదులుతున్నారు. కాల్వల ద్వారా మరింత నీటిని విడుదల చేస్తున్నారు. నీట మునిగినరామగుండం, మంథని.. గోదావరి ఉగ్రరూపంతో పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్, మంథని మున్సిపాలిటీ జలమయం కాగా.. గోదావరి పరీవాహక గ్రామాలు నీటమునిగాయి. బాధితులను పునరావాస శిబిరాలకు తరలించారు. గోదావరిఖని వద్ద బ్రిడ్జి నీట మునగడంతో మంచిర్యాల–పెద్దపల్లి మధ్య రాకపోకలు నిలిపివేశారు. మంథని పట్టణం మీదుగా ప్రవహించి గోదావరిలో కలిసే బొక్కలవాగులో వరద వెనక్కి తన్నడంతో మంథని పట్టణంలోని చాలా భాగం జలమయమైంది. 36 ఏళ్ల తర్వాత... చివరిసారిగా 1986లో భద్రాచలం వద్ద 76 అడుగుల ఎత్తుతో అత్యంత భారీ వరద వచ్చింది. ఆ సమయంలో భద్రాచలంతోపాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరిపై భద్రాచలం–సారపాక వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ సుమారు 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఆ వంతెనపై రాకపోకలు ఆగిపోయాయి. ఎగువన మేడిగడ్డ నుంచి వస్తున్న 28 లక్షల క్యూసెక్కుల వరద శుక్రవారం ఉదయం సమయానికి భద్రాచలం చేరుకోనుంది. దానికితోడు శబరి ఎగువ ప్రాంతంలో వర్షాలతో ఆ వరద కూడా వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా. దీనితో ముంపుపై ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే.. 2002 గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రాచలంలో కరకట్టను నిర్మించారు. 1986 నాటి వరదను దృష్టిలో పెట్టుకుని, అంతకన్నా ఎక్కువగా 83 అడుగుల వరదనూ తట్టుకునేలా డిజైన్ తయారు చేశారు. అది రక్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. కాగా అసాధారణ వరద నుంచి ప్రజలను కాపాడాలంటూ గురువారం మంత్రి పువ్వాడ అజయ్ భద్రాద్రి సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఏటూరు నాగారంలో నీట మునిగిన ఓడవాడ గ్రామం సమీక్షించిన సీఎస్ భారీ వర్షాలు, గోదావరి వరద, సహాయ కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 19,071 మందికి పునరావాసం కల్పించామన్నారు. వరదపై కేసీఆర్ ఆరా భద్రాచలం వద్ద గోదావరి ఉధృతిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి పువ్వాడ అజయ్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. మంచిర్యాల విలవిల గోదావరి వరదతో మంచిర్యాల జిల్లా కేంద్రం విలవిల్లాడిపోతోంది. రాళ్లవాగు మీదుగా గోదావరి నీళ్లు పైకి ఎగబాకడంతో.. కాలేజీ రోడ్డు, ఎన్టీఆర్ కాలనీ, ఎల్ఐసీ, పద్మశాలీ, గణేశ్ నగర్, బైపాస్ రోడ్డు, తెలంగాణ తల్లి చౌక్ వరకు వరద నీరు వచ్చింది. అధికారులు ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరిఖని–మంచిర్యాల, మంచిర్యాల–లక్సెట్టిపేట మధ్య రహదారులపై వరద పోటెత్తడంతో రాకపోకలను నిలిపివేశారు. వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మంచిర్యాల ఎల్ఐసీ కాలనీలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసాన్ని వరద చుట్టుముట్టింది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. నిర్మల్ జిల్లాలో బాసర, భైంసా, నిర్మల్ పట్టణాలు నీట మునిగాయి. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నర్సింహస్వామి దేవాలయం సమీపం వరకు నీరు రావడంతో.. సమీప కాలనీల వారిని పునరావాస శిబిరాలకు తరలించారు. జలదిగ్బంధంలో భద్రాద్రి గట్టు తెగిన గోదావరి తీర ప్రాంతాలను ముంచెత్తుతూ భద్రాచలం పట్టణాన్ని చుట్టుముట్టింది. రహదారులను ముంచేస్తూ ఇళ్లదాకా వరద పోటెత్తింది. పట్టణానికి తూర్పున కూనవరం రోడ్డు, పశ్చిమాన చర్ల రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి బ్రిడ్జిపై రాకపోకలను గురువారం సాయంత్రం నుంచి 48 గంటలపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీనితో హైదరాబాద్‌తోపాటు ఒడిశా, ఏపీ, ఛత్తీస్‌గఢ్ వైపు రాకపోకలు నిలిచిపోయి.. భద్రాచలం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఏజెన్సీ, ముంపు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు ఎప్పుడేం అవుతుందోనన్న ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ముంపు గ్రామాల నుంచి 8,984 మందిని సహాయ శిబిరాలకు తరలించారు. 64 అడుగుల వరద అంచనాతో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాల్లోకీ వరద నీరు చేరుకుంది. దీంతో అప్పటికప్పుడు కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను తరలించారు. -
రాకేశ్ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనల సమయంలో పోలీసు కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ సోదరునికి ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియా మకాల కింద మృతుని సోదరునికి ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం తెలిసిందే. ఈ మేరకు రాకేశ్ సోదరుడు దామెర రామ్రాజుకు అతని విద్యార్హతల ఆధారంగా వరంగల్ జిల్లాలో ఉద్యోగం ఇవ్వాలని సీఎస్ సోమేశ్‌కుమార్ వరంగల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. (క్లిక్: సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు!) -
సీసీఎల్ఏ డైరెక్టర్‌గా రజత్‌కుమార్ సైనీ
సాక్షి, హైదరాబాద్: వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ సైనీని భూపరి పాలన విభాగం ముఖ్య కమిషనర్ కార్యాలయం డైరెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
28 నుంచి ‘రైతుబంధు’ జమ
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు కింద అన్నదాత లకు ఈ నెల 28 నుంచి పెట్టుబడి సాయం అందనుంది. ఈ అంశంపై బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో చర్చించిన సీఎం కేసీఆర్... వర్షాలు బాగా కురుస్తున్నందున రైతులకు రైతు బంధు సొమ్ము అందించాలని ఆదేశించారు. ఈ వానాకాలం సీజన్‌కు 65 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. ముందుగా ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఒకటి నుంచి రెండెక రాల రైతులకు.. ఇలా రైతుబంధు సొమ్మును దశల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలి పారు. వచ్చే నెల 15 నాటికి అందరి ఖాతాల్లో పెట్టు బడి సాయం జమ అయ్యే అవకాశం ఉంది. అంతే గాకుండా బుధవారం రాత్రి వరకు క్రయవిక్ర యాలు జరిగిన భూములకు చెందిన రైతులకు కూడా రైతుబంధు సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. గతేడాది వానాకాలంలో 60.84 లక్షల మంది రైతులకు రూ. 7,360.41 కోట్ల రైతు బంధు సాయం అందగా గత యాసంగిలో 63 లక్షల మంది రైతులకు రూ.7,412.53కోట్ల సాయం అందింది. 2022–23 సంవత్సరానికి బడ్జెట్లో రైతుబంధు కోసం ప్రభుత్వం రూ. 14,800 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు ఎనిమిది విడతల్లో రూ. 50,447.33 కోట్ల సాయం అందించింది. కేంద్రం కొర్రీలు పెట్టినా రైతుబంధు ఆగదు: మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్రం ఆర్థిక నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి ఇరికించాలని చూసినా రైతుబంధు పథకం ఆగదని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి 9వ విడత రైతుబంధు సాయం జమ చేస్తామన్నారు. సీఎం కేసీ ఆర్కు నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ధన్యవాదాలు తెలిపారు. చదవండి: (సీఎం కేసీఆర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్) -
సోమేశ్‌ను తెలంగాణలోనే ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను తెలంగాణలోనే ఉంచాలని ప్రభుత్వం హైకోర్టు కు విజ్ఞప్తి చేసింది. దీనికి ఏపీ కూడా అభ్యంతరం లేదని తెలిపిందని వెల్లడించింది. 2014 రాష్ట్ర విభజన సమ యంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులపై కేంద్రం ప్రత్యూష్ సిన్హా కమిటీని నియమించింది. ఈ కమిటీ కేటాయింపులపై అభ్యంతరం తెలుపుతూ కొందరు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించి ఉపశమనం పొందారు. ఈ క్రమంలో ఏపీకి కేటాయించిన సోమేశ్‌కుమార్ కూడా తెలంగాణలోనే విధులు నిర్వహిస్తు న్నారు. అధికారుల విభజనకు వ్యతిరేకంగా వీరు క్యాట్ నుంచి ఉత్తర్వులు పొందడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఇష్టం వచ్చిన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకునే హక్కు సదరు అధికారులకు లేదంది. క్యాట్ ఉత్తర్వులను కొట్టేయాలని పేర్కొంది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్‌భూయాన్, జస్టిస్ ఎస్.నంద ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఎవరికీ ఏ సమస్యా లేదు... ‘సోమేశ్‌కుమార్ తెలంగాణలో ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి సమస్యా లేదు. కేంద్రం కూడా వారి వాదనకు కారణాలను చూపడం లేదు. ప్రత్యూష్ సిన్హా కమిటీ రూపొందించిన మార్గ దర్శకాలు ఆమోదయోగ్యంగా లేవు. అఖిల భారత సర్వీసు ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీలో సభ్యుడిగా వ్యవహరించిన పీకే మహంతి పక్షపాతంతో వ్యవహరించారు. తన కుమార్తె, అల్లుడికి లబ్ధి చేకూర్చేలా ఆయన వ్యవహరించారు. అంతేగాక, రాష్ట్ర విభజనకు ముందే 2014 ఫిబ్రవరి 28న మహంతి ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం నాలుగు మాసాలు ఆయన సర్వీసును పొడిగించింది. జూన్ 30 వరకు సర్వీస్ ఉండగా, 2014 జూన్ 1న అంటే రాష్ట్ర విభజనకు ఒక్క రోజు ముందు మహంతి తన రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే, సోమేశ్‌కుమార్ ఫిర్యాదుకు కేంద్రం ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. కేంద్రం వేసిన పిటిషన్‌కు విచారణ అర్హతలేదు’అని ఏజీ నివేదించారు. తదుపరి విచారణను ధర్మాసనం జూన్ 20కి వాయిదా వేసింది. -
ఆస్తులపై డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: అగ్రకుల పేదలకు శుభ వార్త. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆర్థికంగా వెనక బడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ల కోసం దరఖాస్తు చేసుకొనే వారి నుంచి ఆస్తుల వివరాలు, వాటిపై స్వీయ ధ్రువీకరణ (డిక్లరేషన్) స్వీకరించకుండానే ధ్రువపత్రం జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు నమూనా నుంచి ఈ స్వీయ ధ్రువీకరణను తొలగించాలని మీ–సేవను ఆదేశించింది. ఆస్తుల వివరాల విభాగం కింద వ్యవసాయ భూములు, నివాస గృహాలు, నివాస స్థలాలకు సంబంధించిన సమగ్ర వివ రాలను ఇవ్వాల్సి ఉండగా దరఖాస్తు నమూ నా నుంచి ఈ విభాగాన్ని సైతం తొలగిం చాలని సూచించింది. ప్రస్తుత దరఖాస్తు విధా నంలో ఐదెకరాలు, ఆపై పొలం.. 1,000 చద రపు అడుగులు, ఆపై విస్తీర్ణంలో నివాస స్థలం... పురపాలికల్లో 100 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస గృహం... గ్రామాల్లో 200 చదరపు గజాలు, ఆపై విస్తీర్ణంలో నివాస గృహంలో ఏదీ లేదని దరఖాస్తుదారులు స్వీయ ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక పై కుటుంబ ఆదాయం రూ. 8 లక్షల్లోపు ఉం దని స్వీయ ధ్రువీకరణ ఇస్తే సరిపోనుంది. ఐదెకరాలు, ఆపై పొలం, నివాస గృహం, నివాస స్థలాలేవి లేవని డిక్లరేషన్ ఇచ్చినట్లు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లో ప్రస్తుతం పొందు పరుస్తుండగా ఇకపై దీన్ని కూడా తొలగిం చనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్ సోమేశ్ కుమార్ గురువారం మీ– సేవ విభాగం కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. గతేడాది జారీ చేసిన జీవో నంబర్ 33 అమలు కోసం ఈ మేరకు మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వ కొలువులతోపాటు రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో 10 శాతం ఈడ బ్ల్యూఎస్ కోటా కోసం దరఖాస్తు చేసుకొనే వారికి ఈ నిర్ణయంతో లబ్ధి కలగనుంది. కేంద్రంలో కోటాకు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. కేంద్ర ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకొనే వారు మాత్రం ఆస్తుల వివరాలతోపాటు వాటిపై స్వీయ ధ్రువీకరణను యథావిధిగా ఇవ్వాల్సి ఉండనుంది. సీఎస్ సోమేశ్ కుమార్ తాజా ఆదేశాల ప్రకారం ఈడబ్ల్యూఎస్ ఉద్దేశం (పర్పస్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్) అనే కొత్త కాలమ్‌ను మీ–సేవా దరఖాస్తులో చేర్చనున్నారు. కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారా లేక రాష్ట్ర ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారా? అనే రెండు ఐచ్ఛికాలు ఈ కాలమ్‌లో ఉండనున్నాయి. వాటిలో ఒక దాన్ని దరఖాస్తుదారులు ఎంపిక చేసుకోవాల్సి ఉండనుంది. ఒకవేళ కేంద్ర ఈడబ్ల్యూఎస్ కోటా కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుత దరఖాస్తు, సర్టిఫికెట్ నమూనాల్లో ఎలాంటి మార్పులుండవు. రాష్ట్ర ప్రభుత్వంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు దరఖాస్తు చేసుకుంటే మాత్రం దరఖాస్తు, సర్టిఫికెట్ నమూనాలో పైన పేర్కొన్న మార్పులు అమల్లోకి రానున్నాయి. కేంద్రంలో ఈడబ్ల్యూఎస్ కోటాకు జారీ చేసే సర్టిఫికెట్లలో మాత్రం ఈ మేరకు డిక్లరేషన్ ఇచ్చారన్న విషయాన్ని యథాతధంగా పొందుపర్చనున్నారు. -
అమ్నీషియా పబ్ కేసు: సీఎస్, డీజీపీకి మహిళా కమిషన్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో రాజకీయ నేతల కొడుకులు ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో లైంగిక దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. కేసులో భాగంగా మంగళవారం.. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే, సికింద్రాబాద్ లైంగిక దాడి కేసుపై కూడా జాతీయ మహిళా కమిషన్ విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. ఇది కూడా చదవండి: రఘనందన్ రావు.. ఇన్నోవా వీడియో ఎందుకు చూపించలేదు: రేణుకా చౌదరి -
120 ఎగ్జిబిటర్లు..500 బ్రాండ్లు, ప్రారంభమైన ఇంటీరియర్ ఎక్స్పో!
సాక్షి, హైదరాబాద్: ప్రస్థుతం ఇంటీరియర్ డిజైనింగ్ విభాగం ఎంతో అభివృద్ధి చెందినదని, ఇందులో భాగం గా స్థానిక కళాకారుల నుంచి సేకరించిన కళాఖండాలతో డిజైన్లను రూపొందిస్తే అన్ని రకాల కళలు ప్రయోజనం పొందుతాయని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడి) హైదరాబాద్ ప్రాంతీయ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ‘‘ఐఐఐడి షోకేస్ ఇన్సైడర్ ఎక్స్ 2022’’ నాల్గవ ఎడిషన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇతివృత్తంతో 3 రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ మాట్లాడుతూ., ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ఆసక్తికరంగా ఉందని, ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మరింత తెలుసుకోవాలనే కుతూహలాన్ని పెంచిందని అన్నారు. ఈ ఎగ్జిబిషన్లో కళారూపాల్లో భాగంగా స్థానికంగా ప్రాచూర్యం పొందిన కళలను చేరదీయడం, ఇక్కడి ముడిసరుకు, కళాకారులను చేర్చుకోవడం అభినందనీయమని అన్నారు. హస్తకళాకారులు ఇతర కళలకు మరింత గుర్తింపు తీసుకురావడానికి ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు మరింత చొరవ చూపాలని సూచించారు. గతంలో తాను అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ జిల్లాలో తోలుబొమ్మలాటలో నిమగ్నమైన హస్తకళాకారుల అభివృద్ధికి కృషి చేశానని పేర్కొన్నారు. ఈ ఎక్స్‌పోలో ఫర్నిచర్, నిర్మాణాల కోసం వెదురు వంటి ప్రత్యామ్నాయ వస్తువులను ఉపయోగించడం వినూత్నంగా ఉందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, ఎగ్జిబిటర్లకే కాకుండా సాధారణ ప్రజలకూ మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఐఐఐడి హెచ్ఆర్సి, చెర్మైన్ మనోజ్ వాహి మాట్లాడుతూ., కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టినా ఇంటీరియర్ డిజైనింగ్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. వినియోగదారులు, డిజైనర్ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని వీరందరినీ ఒకచోటుకు చేర్చడానికి ఐఐఐడి ఈ వేదికను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇందులో 120 ఎగ్జిబిటర్లు, యైభైకు పైగా కేటగిరీల నుంచి 500 బ్రాండ్లు పాల్గొన్నాయని అన్నారు. చేర్యాల్, పోచంపల్లి, పెంబర్తి నుంచి వచ్చిన కళాకారులు వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుండగా, అనంతపురం నుంచి వచ్చిన కళాకారులచే తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నారని, ఇందులో భాగంగా ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్ కాలేజీల భాగస్వామ్యాన్ని తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐడి–హెచ్ఆర్సి కోశాధికారి ఎఆర్. రాకేష్ వాసు, చీహైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి ఎఆర్. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సీఎస్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సెప్టెంబర్, 2022లో జరిగే గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కాలుష్య నియంత్రణా మండలి కార్యదర్శి నీతూ ప్రసాద్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, నగరంలో కాలుష్య కారక గణేష్ విగ్రహాలను ఉపయోగించవద్దని రాష్ట్ర హైకోర్ట్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, ఈ నేపథ్యంలో మట్టి వినాయకుల విగ్రహాలు వినియోగించే విధంగా నగర వాసులను చైతన్య పర్చాలని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సింథటిక్ కలర్లు, పర్యావరణ హాని కారక కెమికల్స్‌ను విగ్రహాల తయారీలో నిషేధిస్తూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను ట్యాంక్ బండ్‌తో పాటు నగరంలోని ఇతర చెరువుల్లో కూడా నిమజ్జనం చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని సీఎస్ వివరించారు. ఈ అంశాలపై విగ్రహ తయారీదారులను చైతన్య పర్చాలని సూచించారు. నగరంలో మట్టి వినాయకుల తయారీ దార్లను ప్రోత్సహించడంతోపాటు మట్టి విగ్రహాల మార్కెటింగ్ కు తగు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎస్ సూచించారు. హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. చదవండి: (ఉస్మానియా ఆస్పత్రి: వెయ్యి ఇస్తేనే శవం తీసుకెళ్తాం!) -
తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సంయుక్త సదస్సు సందర్భంగా తెలంగాణ చీఫ్ సెక్రటరీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని న్యాయవ్యవస్థ సమస్యల పరిష్కారంపై సీఎం, హైకోర్టు సీజే పలు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచడంపై సీరియస్ అయ్యారు. తమ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని.. న్యాయవ్యవస్థ బలోపేతం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులు ఉన్నాయని ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది లోపలకు వెళ్లి వెనక్కు వస్తే తప్ప మరొకరు వచ్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన తెలంగాణ న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ అంశాలను తాను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. చదవండి👉 (పంజాబ్‌లో టెన్షన్.. టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్) -
హరితహారం లక్ష్యం 19.5 కోట్ల మొక్కలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది హరితహారం కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 19.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.సోమేశ్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఏడాది హరితహారాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల 7.70 శాతం అటవీ విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఎనిమిదో విడత హరితహారం కింద సాగునీటి ప్రాజెక్టుల వద్ద, కాల్వ గట్లపై పచ్చదనం పెంచడాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వారంలోగా కార్యాచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హరితహారం, దళితబంధు, యాసంగి వరిధాన్యం సేకరణ తదితర అంశాలపై సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో శుక్రవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 శాతం కన్నా తక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి పెద్దఎత్తున పచ్చదనం పెంచాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,400 ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామని, మిగిలిన గ్రామాల్లో వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి మండలంలో కనీసం నాలుగు బృహత్ పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేయాలని, పచ్చదనం పెంపునకు ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. దళితబంధు గురించి మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంజూరు చేసిన యూనిట్లకుగాను లబ్ధిదారులను గుర్తించాలని, ఇప్పటికే గుర్తించినవారికి వెంటనే లబ్ధి చేకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కలి్పంచాలి ధాన్యం సేకరణ గురించి సోమేశ్ కుమార్ మాట్లాడుతూరాష్ట్రంలో ఏడు కోట్ల గన్నీబ్యాగులు అందుబాటులో ఉన్నాయని, మరో 4.5 కోట్ల బ్యాగులు త్వరలో వస్తాయని చెప్పారు. అన్ని రైతు వేదికల్లో సమావేశాలు జరిగేలా చూడాలని, వ్యవసాయ విస్తరణ అధికారులతో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ డోబ్రియల్, పురపాలక శాఖ, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరి్వంద్‌కుమార్, రామకృష్ణారావు, రజత్‌కుమార్, హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘ఆప్షన్, వెయిటింగ్ లిస్ట్ విధానం ఉండాలి’
కాచిగూడ (హైదరాబాద్): గ్రూప్స్‌తోపాటు ఇతర ఉద్యోగ ఖాళీల భర్తీలో ఆప్షన్, వెయిటింగ్ లిస్ట్ విధానాన్ని అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బీసీ ప్రతినిధి బృందంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలసి ఉద్యోగ ఖాళీల భర్తీ, అప్షన్ విధానాలపై చర్చించారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ గ్రూప్ 1,2,3,4 సర్వీస్ పోస్టు లను నేరుగా భర్తీ చేయాలని అన్నారు. ఇప్పటికే కొన్ని శాఖలలో ఖాళీలను పదోన్న తులతో భర్తీ చేశారని పేర్కొన్నారు. డైరెక్టు రిక్రూట్ మెంట్ ద్వారా యువతను తీసుకుంటే సమర్థవంత మైన, అవినీతి రహిత పాలన అందించవచ్చ న్నారు. గ్రూప్ 4 లోని పోస్టులను జిల్లా, మం డల స్థాయిలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
పీకే మహంతి పక్షపాతం చూపారు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రత్యూష్ సిన్హా కమిటీ సభ్యుడు పీకే మహంతిపై ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పలు ఆరోపణలు చేశారు. ఆల్ ఇండియా సర్వీసు ఉద్యోగుల విభజన కోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీలో సభ్యుడిగా వ్యవహరించిన పీకే మహంతి పక్షపాతంతో వ్యవహరించారని సోమేశ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. కమిటీ సభ్యుడిగా మహంతి నిష్పాక్షికంగా వ్యవహరించారని చెబుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు. తన కుమార్తె, అల్లుడికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారన్నారు. ఐఏఎస్ పదవికి పీకే మహంతి రాజీనామా చేయడం ద్వారా తన అవకాశాలను దారుణంగా దెబ్బతీశారని సోమేశ్ హైకోర్టుకు వివరించారు. వాదనలు విన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ నందా ధర్మాసనం తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపడ తామని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపులను రద్దు చేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై జస్టిస్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తరఫు సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ, పీకే మహంతి రాష్ట్ర విభజనకు ఒక్కరోజు పదవీ విరమణ చేసినందున ఆయన పేరును జాబితాలో చేర్చలేదన్న కేంద్రం వాదన సరికాదన్నారు. జూన్ 1న మహంతి పేరు మీద పలు జీవోలు జారీ అయ్యాయని, ఐవీఆర్ కృష్ణా రావుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తూ జీవో కూడా ఇచ్చారని తెలిపారు. ఆయన సర్వీసులో ఉన్నారనేందుకు ఈ జీవోలే సాక్ష్యమని వివరించారు. తాత్కాలిక జాబితాలో ఉన్న పలువురు అధికారుల పేర్లు తుది జాబితాలో లేవన్నారు. లాటరీలో రోస్టర్‌ను ముందుగా తెలం గాణకే కేటా యించాల్సిందని, అయితే అందుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని సీతారామమూర్తి చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. -
యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు: సీఎస్ సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ మేరకు సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌న్ నిర్వహించారు. జిల్లాల వారీగా యాసంగిలో సాగు విస్తీర్ణం, పంట దిగుబడి అంచనాలపై చర్చించారు. కొనుగోలు కేంద్రాలు తగ్గించొద్దు: ‘సీఎం సూచనల మేరకు ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పా టు చేయాలి. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలి. సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై ఆయా జిల్లాల అధికారులతో వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించాలి. కొనుగోళ్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపొందించుకోండి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులతో వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. ఎక్కడెక్కడ ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారో నివేదిక రూపొందించుకోవాలి..’అని సీఎస్ సూచించారు. రోజుకు నాలుగైదు కేంద్రాల తనిఖీ: ‘జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించేలా ప్రణాళిక తయారు చేసుకోవాలి. గత సంవత్సరం యాసంగి సీజన్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల సంఖ్యకు తగ్గకుండా ఈసారి కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి కేంద్రానికి ఓ అధికారిని నియమించి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలి. ముఖ్యంగా గన్ని బ్యాగుల సేకరణపై దష్టి పెట్టాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించి తగు పర్యవేక్షణ జరపాలి. రైతుకు కనీస మద్దతు ధర రూ.1,960 లభిం చేలా చర్యలు చేపట్టాలి. వ్యవసాయ విస్తరణాధికారుల సేవలను వినియోగించుకోవాలి. జిల్లాల్లో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలి..’అని ఆదేశించారు. ఏరోజుకారోజు నివేదికలు:‘కొనుగోలు కేంద్రా ల్లో సేకరించిన ధాన్యాన్ని వెం టనే రవాణా చేసేందుకు అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసుకోవాలి. ధాన్యం సేకరణపై ఏరోజు కారోజు నివేదికలు పంపించాలి. జిల్లాల్లో వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలి. పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చర్యలు చేపట్టాలి. అందు కోసం పోలీసు, రవాణా తదితర శాఖల అధికారుల సహకారం తీసుకోవాలి..’అని సీఎస్ చెప్పారు. హైదరాబాద్, కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయా లని సోమేశ్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్‌లో వ్యవసా య శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పంచా యి తీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తాని యా, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్లతో సీఎస్ సోమేష్ కుమార్ టెలీకాన్ఫరెన్స్
-
డ్రగ్స్ కేసు: తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో ఈడీ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణ ఆరోపణలపై సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ విషయంపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వట్లేదని ఈడీ ఆరోపణ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించట్లేదని కోర్డుకు ఈడీ తెలిపింది. దీంతో వారికి కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని సూచించింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 25కు వాయిదా కోర్టు వేసింది. -
సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించండి: కేంద్రం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత స్థాయి అధికారుల క్యాడర్ కేటాయింపులపై డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్(డీవోపీటీ)దే పూర్తి అధికారమని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అఖిల భారత స్థాయి అధికారుల కేటాయింపులకు సంబంధించి ఐదుగురు సభ్యులతో వేసిన ప్రత్యేక కమిటీ సిఫార్సుల మేరకే ఏపీ, తెలంగాణకు కేటాయింపులు చేశామని తెలిపారు. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. సోమేశ్ పిటిషన్‌ను విచారించిన క్యాట్... ఆయన్ను తెలంగాణకు కేటాయిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి తెలంగాణకు కేటాయించేలా ఉత్తర్వులు పొందారని తెలిపారు. క్యాట్ ఉత్తర్వులను రద్దు చేసి సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించేలా ఆదేశించాలని అదనపు సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం వాదనలు కొనసాగనున్నాయి. -
జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. నిర్ణీత గడువు ముగిసినా ఏళ్లకేళ్లుగా జీహెచ్ఎంసీని పట్టుకొని వదలకుండా అతుక్కున్న ఆరుగురు సహాయ వైద్యాధికారులను (ఏఎంఓహెచ్) వదిలించుకుంది. ఆరుగురు ఏఎంఓహెచ్‌లను వారి మాతృసంస్థ అయిన పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు పంపించింది. దీనికి ముందు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ఏళ్లకేళ్లుగా కొనసాగుతున్న.. పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన వీరిని మాతృసంస్థకు పంపించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దాన్ని అమలు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను ఆదేశించారు. అందుకనుగుణంగా, తమను మాతృసంస్థలకు పంపించాల్సిందిగా కోరుతూ స్వీయలేఖలు అందజేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సంబంధిత ఏఎంఓహెచ్‌లకు సూచించారు. లేని పక్షంలో ఎదురయ్యే తీవ్ర పరిణామాలను వివరించి హెచ్చరించినట్లు సమాచారం. వీరిలో జీహెచ్ఎంసీలో డిప్యుటేషన్ మూడేళ్లు, ఐదేళ్లు మించిన వారు కూడా ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో వారు లేఖలు రాయడం.. వారిని వెంటనే మాతృసంస్థలకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆగమేఘాల మీద జరిగాయి. వారు రిలీవ్ అయినట్లుగా కూడా పరిగణిస్తూ, వారిని మాతృశాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంబంధిత సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు రిలీవ్ అయిన ఏఎంఓహెచ్‌ల స్థానాల్లో తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించడంతో పాటు దాన్ని అమలు చేసినట్లు నివేదించాలని ఆదేశించారు. ఈ అంశంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జోనల్ కమిషనర్లకు సూచించారు. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం: గోదాంలో ఉండేది 8 మందే.. ఆ నలుగురు ఎవరంటే! చెత్త పనిలో అవినీతి తగ్గేనా? ►ప్రజలకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు జీహెచ్ఎంసీలోని ఆరోగ్యం– పారిశుద్ధ్య విభాగంలోకి ఏఎంఓహెచ్‌లుగా వచ్చారంటే చాలు ‘చెత్త’ పనులు చేస్తున్నారు. సక్రమ పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం బాగుంటుందనే బ్రిటిష్ హయాం నాటి ప్రాథమిక సూత్రం ఆధారంగా జీహెచ్ఎంసీలో ఏఎంఓహెచ్‌లకు పారిశుద్ధ్య బాధ్యతలప్పగించారు. దాన్ని ఒక బాధ్యతగా చూడాల్సిన వారు చెత్త పనుల్లోని అవినీతిలో కూరుకుపోతున్నారు. స్వీపర్ల నియామకాల నుంచి మొదలు పెడితే బల్క్ చెత్త ఉత్పత్తి చేసే హోటళ్లు, ఫంక్షన్ల హాళ్ల నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేసేంతదాకా దిగజారారు. ►జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఎంతో కాలంగా అవినీతి ఆరోపణలున్నా, ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వాటికి అడ్డుకట్ట పడలేదని జీహెచ్ఎంసీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశాల కనుగుణంగా కమిషనర్ లోకేశ్‌కుమార్ వారిని మాతృశాఖలకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇది బల్దియా చరిత్రలోనే రికార్డు. ఇక రాబోయే రోజుల్లో ఏఎంఓహెచ్లనే వారు జీహెచ్ఎంసీలో ఉండరని తెలుస్తోంది. మిగతా విభాగాలపైనా దృష్టి సారిస్తారా? జీహెచ్ఎంసీకి ఒకసారి వచ్చారంటే చాలు మాతృశాఖలకు తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారు వివిధ విభాగాల్లో ఎందరో ఉన్నారు. అంతేకాదు.. డిప్యుటేషన్ ముగిసినా, కొనసాగింపు లేకుండానే పని చేస్తున్నవారు కూడా ఉన్నారు. డిప్యుటేషన్ ముగిసిన వారిపై, దీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిపై కూడా తగిన చర్యలు తీసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ ఆకస్మిక సమావేశం
సాక్షి, సిద్ధిపేట(మెదక్): ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో సీఎం కేసీఆర్ శనివారం అకస్మిక భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎస్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సబితా ఇద్రారెడ్డి, హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కవిత హాజరైనట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నారు. ఈ భేటీలో పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్ల విడుదల, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు, వైఖరిపై సమీక్షించనున్నట్లు సమాచారం. చదవండి: బీజేపీ ‘ముందస్తు’ వ్యూహం! -
15 లోగా పరస్పర బదిలీలకు దరఖాస్తు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పరస్పర బదిలీకి ఈనెల 15లోగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ (సీఎస్) గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లో జరిగే పరస్పర బదిలీల్లో సీనియారిటీకి రక్షణ కల్పిస్తామన్నారు. ఈ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా కేడర్‌కు చెందిన ఇద్దరు ఉద్యోగులు పరస్పర బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లయితే, వారి సీనియారిటీకి కొత్త లోకల్ కేడర్‌లో కూడా రక్షణ ఉంటుందని వివరించారు. ఈ బదిలీల కోసం దరఖాస్తులు చేసుకునే ఉద్యోగులు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా సమర్పించాలని సూచించారు. ఇప్పటి వరకు పరస్పర బదిలీలకు 31 దరఖాస్తులు అందాయన్నారు. -
అభిషేక్‌ను రెండు వారాల్లో తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని రెండు వారాల్లో తెలంగాణ రాష్ట్ర కేడర్‌లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సోమేశ్‌కుమార్‌ను ముందుగా ఏపీకి కేటాయించగా తామిచ్చిన ఆదేశాలతో తెలంగాణ కేడర్‌లో కొనసాగుతున్నారని గుర్తుచేసింది. అభిషేక్ మొహంతి కేసులో తమ ఆదేశాలను అమలు చేయకపోతే గతంలో తామిచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించి సోమేశ్‌ను తిరిగి ఏపీ కేడర్‌కు పంపుతామని హెచ్చరించింది. ఈ మేరకు క్యాట్ సభ్యులు ఆశిష్కాలియా, బీవీ సుధాకర్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ అభిషేక్ మొహంతి దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో విచారించిన క్యాట్.. తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలంటూ 8 నెలల క్రితం ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో అభిషేక్ కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. కోర్టుధిక్కరణ పిటిషన్ మరోసారి విచారణకు రాగా.. సీఎస్ తరఫున కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ అభ్యర్థించారు. తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో సీఎస్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని, గంట సమయం ఇస్తున్నామని, ఈలోగా హాజరుకాకపోతే సీఎస్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని ధర్మాసనం హె చ్చరించింది. దీంతో కొద్దిసేపటి తర్వాత సీఎస్ ఆన్లైన్లో ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేడర్ కేటాయింపులు చేసే అధికారం కేంద్రానికి ఉందని, ఈ నేపథ్యంలో క్యాట్ ఆదేశాలపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రా నికి నివేదించామని సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. రెండు వారాల్లోగా అభిషేక్‌ను తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 వారాల తర్వాతకు వాయిదా వేసింది. కాగా, సోమేశ్‌తోపాటు ఇతర అధికారులను తెలంగాణకు కేడర్‌కు కేటాయించాలంటూ క్యాట్ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం ఇప్పటికే హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. -
సంజయ్‌పై దాడి సంగతేంటి?
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉద్యోగుల సమస్య లపై దీక్ష చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను కార్యాలయంలోకి వెళ్లి అరెస్టు చేసిన అంశంలో రాష్ట్ర సీఎస్, డీజీపీ, కరీంనగర్ సీపీ, ఇతర పోలీసు అధికారులకు లోక్‌సభ ప్రివి లేజ్ కమిటీ సమన్లు జారీ చేసింది. ఈ అంశంలో బండి సంజయ్ ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. దాడి, అరెస్టు ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ వాదనలు విని.. ఆయన సమ ర్పించిన ఆధారాలను, వీడియో క్లిప్పింగులను పరిశీలించింది. తర్వాత కొద్దిగంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమన్లు్ల జారీ అయ్యాయి. ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాలని కమిటీ చైర్మన్ సునీల్ కుమార్ శని వారం ఆదేశించారు. సమన్లు జారీ అయిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, హుజూరా బాద్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, జమ్మికుంట ఇన్ స్పెక్టర్ కొమ్మినేని రాంచందర్‌రావు, హుజూరా బాద్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాస్, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె.శ్రీనివాసరావు, కరీంనగర్ టూటౌన్ ఇన్స్పెక్టర్ చలమల్ల నరేశ్ ఉన్నారు. -
మరోమారు భూముల విలువలు పెంపునకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల విలువల సవరణ విధానంలో ప్రభుత్వం మార్పు తీసుకువచ్చింది. వ్యవసాయ భూములకు సంబంధించిన ప్రభుత్వ విలువలను రెండేళ్లకోసారి, వ్యవసాయేతర భూముల విలువల నుప్రతియేటా సవరించుకునే నిబంధనను మార్చింది. ఇక మీదట ఎప్పుడైనా భూముల ప్రభుత్వ విలువలను సవరించుకునే వెసులు బాటు కల్పిస్తూ పాత జీవోను సవరించింది. రాష్ట్రంలోని భూముల ప్రభుత్వ విలువలను సవరించేందుకు గాను స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి ప్రత్యేక అనుమతి ఇస్తూ ఈ నెల 19న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీవో (నం.23) విడుదల చేశారు. ఈ సవరణ ఆధారంగా మరోమారు రాష్ట్రం లోని భూముల ప్రభుత్వ విలువలను పెంచేందుకు సర్కారు సిద్ధమవుతోంది. దీనిపై గత రెండు రోజులుగా అన్ని జిల్లాల రిజిస్ట్రార్లతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి కొత్త విలువలు అమల్లోకి తెచ్చేం దుకు గాను ఈ కసరత్తు జరుగుతోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి. సవరించి ఆరు నెలలే: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే భూముల విలువలను సవరించారు. గత ఏడాది జూలైలో ఈ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. సాగుభూమి ఎకరం కనిష్టంగా రూ.75 వేలుగా నిర్ధారించింది. ఇక, ఖాళీ స్థలాలను గజానికి కనిష్టంగా రూ.200గా, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల విలువ చదరపు అడుగుకు రూ.1,000గా ఖరారు చేసింది. దీంతో పాటు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను కూడా పెంచింది. ఈ పెంపు, సవరణల కారణంగా ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.400 కోట్ల వరకు అదనంగా ఆదాయం వస్తోంది. గతంలో ప్రతి యేటా రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల మధ్య ఆదాయం వస్తుండగా, ఈ పెంపు కారణంగా జనవరి 20 నాటికే ఈ ఆదాయం రూ.6,800 కోట్లు దాటింది. ఆర్ఆర్ఆర్ కూడా పరిగణనలోకి.. అంతకుముందు ఏడేళ్లుగా ప్రభుత్వం ఈ విలువలను సవరించకపోవడంతో గత ఏడాది చేపట్టిన ప్రక్రియపై ఎలాంటి వ్యతిరేకత రాలేదు. దీంతో పాటు రాష్ట్రంలో వ్యవసాయ భూము ల విలువలు కూడా రోజురోజుకూ పెరుగుతుండడం, మారుమూల గ్రామాల్లో కూడా ఎకరా కనిష్టంగా రూ.12–15 లక్షల వరకు బహిరంగ మార్కెట్లో ధర పలుకుతుండడం తో మరోమారు భూముల విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రీజినల్ రింగు రోడ్డు లాంటి అభివృద్ధి కారణంగా భూముల విలువలు ఇంకా పెరగనున్న నేపథ్యంలో తాజాగా విలువల సవరణ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావించింది. వ్యవసాయ భూముల విలువలు 50 శాతం పెంపు! రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో భూములు, ఆస్తు ల విలువలు బహిరంగ మార్కెట్లో ఎలా ఉ న్నాయన్న దానిపై గురు, శుక్రవారాల్లో జిల్లా రిజిస్ట్రార్లతో ఆ శాఖ ఐజీ శేషాద్రి సమావేశాలు నిర్వహించారు. వ్యవసాయ భూముల విలువలను ఏ ప్రాంతంలో ఎంత సవరించాలి? వాణిజ్య, నివాస కేటగిరీల్లో ఫ్లాట్లు, అపా ర్ట్మెంట్ల ధరలు ఎంత నిర్ణయించాలి? ఖాళీ స్థలాలను ఏ మేరకు సవరించాలనే దానిపై ఆ యన జిల్లా రిజిస్ట్రార్లతో చర్చిస్తున్నారు. అయి తే వ్యవసాయ భూముల విలువలను 50 శాతం, ఖాళీ స్థలాలను 35 శాతం, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లను 25 శాతం పెంచాల నే అంచనాతో కసరత్తు జరుగుతోంది. సీఎం ఆమోదంతో ఫిబ్రవరి 1 నుంచి కొత్త విలువలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అంటున్నాయి. -
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) డైరెక్టర్ జనరల్ అధర్‌సిన్హాను పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీచేసింది. వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఎ.వాణీప్రసాద్‌ను ఈపీటీఆర్ఐ కొత్త డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. ఈ మేరకు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వెయిటింగ్లో ఉన్న కె.నిర్మలను ప్రభుత్వ రంగ సంస్థల కార్యదర్శిగా బదిలీ చేసి ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి జయేశ్‌రంజన్‌ను తప్పించారు. కె.మనిక్కారాజ్‌ను రెవెన్యూ శాఖ కార్యదర్శిగా బదిలీచేస్తూ ఆ పోస్టు అదనపు బాధ్యతల నుంచి రాహుల్ బొజ్జాను తప్పించారు. పౌసుమి బసు, శ్రుతి ఓఝాలను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా, ఎం.హరితను విద్యాశాఖ ఉప కార్యదర్శిగా, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రను ఎంసీహెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా బదిలీచేశారు. -
దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారంపై సర్కారు దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దీర్ఘకాలిక భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏళ్ల తరబడి పరి ష్కారం కాకుండా పెండింగ్‌లో పడిపోయిన సమస్యల వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తోంది. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్లో సమస్యల వివరాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గ్రామం, మండలం, సర్వే నంబర్, భూ విస్తీర్ణం, సమస్య ఏంటి, పరిష్కారం ఎలా చేయాలి తదితర వివరాలతో నివేదికలు పంపాలని సూచించారు. దీంతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లు ఈ అంశంపై దృష్టి పెట్టి ప్రభుత్వం అడిగిన ఫార్మాట్లో నివేదికలను కలెక్టరేట్లకు పంపినట్టు సమాచారం. ఈ నివేదికల్లో పలు ఆసక్తికర భూ సమస్యలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలు స్తోంది. అయితే వీటిల్లో అనేక సమస్యల పరిష్కారం అంత సులభంగా అయ్యే పని కాదని, భూ సంబంధిత చట్టాలు మార్చాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. చట్టాలు మారిస్తేనే పరిష్కారం దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడంపై రెవెన్యూ యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సమస్యలు పరి ష్కారం కావాలంటే చట్టాలు మార్చాల్సిం దేనని అంటున్నాయి. గత 20–30 ఏళ్లుగా రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ భూముల్లో పేద రైతులు సాగు చేసుకుంటున్నారని, వారికి ఆ ప్రభుత్వ భూమిని అధికారికంగా కేటాయించేందుకు రాష్ట్రంలో అమల్లో ఉన్న భూ చట్టాలు అనుమతించవని అంటున్నారు. అదే విధంగా జిల్లా కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల లోపు భూములను అసైన్ చేయడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయని, ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత ఈ సమస్య మరింత జఠిలం అయిందని పేర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అసైన్డ్ చట్టంలో మార్పులు చేయాలని అభిప్రాయపడుతున్నాయి. సమరయోధుల భూములూ చిక్కుముడులే.. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన భూములపై జరిగిన క్రయవిక్రయ లావాదేవీల పరిష్కారం కూడా అంత సులభం కాదని తెలుస్తోంది. వాస్తవానికి స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములను పదేళ్ల తర్వాత నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకుని అమ్ముకోవచ్చని చట్టం చెబుతోంది. అయితే ఎలాంటి ఎన్వోసీలు లేకుండానే చాలాచోట్ల సబ్ రిజిస్ట్రార్లు ఈ భూములను నిర్దిష్ట గడువు తర్వాత ఇతరులకు రిజిస్ట్రేషన్లు చేశారు. సేల్డీడ్లు కూడా అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ భూములన్నీ ధరణి పోర్టల్‌లో ప్రభుత్వ భూములుగా కనబడుతున్నాయి. ఈ భూములకు ఎన్వోసీని కేవలం లబ్ధిదారుడైన స్వాతంత్య్ర సమరయోధుడు లేదా మాజీ సైనికుడి పేరిట ఇచ్చేందుకు మాత్రమే చట్టాలు అనుమతిస్తాయి. అందువల్ల ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ప్రజోపయోగ కార్యక్రమాల నిమిత్తం సేకరించిన పట్టా భూముల విస్తీర్ణాన్ని ఎడాపెడా నమోదు చేయడంతో చాలాచోట్ల సేకరించిన దాని కంటే ఎక్కువ విస్తీర్ణం ప్రభుత్వ ఖాతాలో జమ అయింది. ఇప్పుడు ఆ భూమిని పట్టాదారుకు ఇవ్వాలంటే ప్రభుత్వ భూమిని ఇతరులకు బదలాయించేందుకు అనుమతి ఉండదు. ఇలాంటి సమస్యలన్నీ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని తీర్చాలంటే చట్టాలు మార్చాలనేది రెవెన్యూ వర్గాల అభిప్రాయం. సాదా బైనామాల సంక్లిష్టత భూ సంబంధిత సమస్యల్లో ప్రధానమైనది సాదా బైనామాలు. తెల్ల కాగితాల ద్వారా జరిగిన క్రయ విక్రయాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనేకసార్లు దరఖాస్తులు స్వీకరించింది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో తహశీల్దార్లు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదే విధంగా ధరణి పోర్టల్‌లో కొత్త సర్వే నంబర్ల నమోదు, పట్టాదారు పేరు మార్పు, విస్తీర్ణంలో తేడాల సమస్యలను కూడా త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. -
సాహోరే.. వారధులు! పాతబస్తీకే మణిహారాలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఐటీ కారిడార్లున్న, ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉన్న శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లు.. ఐటీ తదితర సంస్థలున్న ఉప్పల్ జోన్, కోర్‌సిటీలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లలో ఎస్సార్డీపీ కింద పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం పాతబస్తీ ప్రాంతమైన చార్మినార్ జోన్‌వైపు దృష్టి సారించింది. ఇటీవలే డాక్టర్ అబ్దుల్‌కలాం ఫ్లై ఓవర్ వినియోగంలోకి రాగా.. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు నుంచి కోర్‌సిటీలోకి రాకపోకలు సాగించేవారికి ఉపకరించే రెండు ఫ్లైఓవర్లు త్వరలో పూర్తి కానున్నాయి. వీటిలో ఆరాంఘర్– జూపార్క్ ఫ్లై ఓవర్ వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్డీపీ)లో భాగంగా జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు నిర్మించిన అన్ని ఫ్లై ఓవర్లకంటే పెద్దది. ఇటీవలే ప్రారంభమైన షేక్‌పేట ఫ్లై ఓవర్ (పొడవు 2.71 కి.మీ.) కంటే కూడా ఇదే పెద్దది. దీని పొడవు దాదాపు 4 కి.మీ. బహదూర్‌పురా జంక్షన్ వద్ద మరో ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. ఈ రెండూ వినియోగంలోకి వస్తే విమానాశ్రయం వెళ్లే వారితోపాటు మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి, జూపార్క్ సందర్శకులకు, పాతబస్తీ ప్రజలకు సమయం కలిసి వస్తుంది. రెండింటికీ అయ్యే ఖర్చు దాదాపు రూ. 706 కోట్లు. సీఎస్ సోమేశ్‌కుమార్ తనిఖీ ► రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణాల్ని వేగవంతం చేసి, నిర్ణీత వ్యవధి కంటే ముందే పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బహదూర్‌పురా జంక్షన్‌లోని నిర్మాణ పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ► ఆరాంఘర్– జూపార్కు ఫ్లై ఓవర్ పనుల్ని కూడా వీలైనంత త్వరితంగా పూర్తిచేయాలనగా వచ్చే సంవత్సరం మార్చినాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఆస్తుల సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని సీఎస్ దృష్టికి తేగా.. ఫ్లై ఓవర్ మౌలిక డిజైనింగ్‌కు అంతరాయం కలుగకుండా సేకరించాల్సిన మొత్తం 163 ఆస్తుల్లో కొన్నింటిని మినహాయించాల్సిందిగా సూచించారు. ► సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. బహదూర్‌పురా జంక్షన్ ఫ్లై ఓవర్ ► అంచనా వ్యయం: రూ.69 కోట్లు ► పొడవు: 690 మీటర్లు ► లేన్లు: 6(రెండు వైపులా ప్రయాణం) ► వెడల్పు: 24 మీటర్లు ► ఇరవయ్యేళ్లకు పెరిగే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. బహదూర్‌పురా జంక్షన్ వద్ద ప్రస్తుతమున్న ట్రాఫిక్ చిక్కులు ఉండవు. సిగ్నల్ ఫ్రీగా సాగిపోవచ్చు. ► దాదాపు 70 శాతం పనులు పూర్తయిన ఈ ఫ్లైఓవర్ ఈ సంవత్సరం అందుబాటులోకి రానుంది. ఆరాంఘర్– జూపార్కు ఫ్లైఓవర్ ► అంచనా వ్యయం: రూ.636.80 కోట్లు ► పొడవు: 4.04 కి.మీ. ► లేన్లు: 6 (రెండు వైపులా ప్రయాణం) ► వెడల్పు: 24 మీటర్లు ► 2037 నాటికి రద్దీ సమయంలో 5210 వాహనాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ► ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న ట్రాఫిక్ సిగ్నళ్లు తాడ్బన్, దానమ్మహట్స్, హసన్‌నగర్ జంక్షన్ల వద్ద ఎక్కడా ఆగకుండా నేరుగా రయ్‌మని వెళ్లిపోవచ్చు. ► తద్వారా ప్రయాణ సమయం తగ్గడంతోపాటు లూబ్రికెంట్స్, ఇంధన వ్యయం తగ్గుతుంది. వాయు కాలుష్యం తగ్గి, ప్రజలకు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. వచ్చే సంవత్సరం దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
పెండింగ్‌పై సామరస్యంగా..
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు సామరస్యంగా పరిష్కారమయ్యేలా కేంద్ర ప్రభుత్వం తగిన తోడ్పాటు అందిస్తుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. పెండింగ్ అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సమీర్‌శర్మ, సోమేశ్‌కుమార్‌తో బుధవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇరు రాష్ట్రాల వాదనలను తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. విద్యుత్తు బకాయిలపై చర్చ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చిక్కుముడిగా మారిన 10 ద్వైపాక్షిక అంశాలతో పాటు 8 ప్రాజెక్టులు, అజెండాలోని ఇతర అంశాలను అజయ్ భల్లా సమీక్షించారు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థలకు సంబంధించిన వివాదాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, అనుబంధ కంపెనీ ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన, ఢిల్లీలోని ఏపీ భవన్, పన్ను బకాయిలు, రీఫండ్ అంశాలపై సమీక్షించారు. పునర్విభజన చట్టం జాబితాలో లేని సంస్థల విభజన, నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన, తెలంగాణ డిస్కమ్‌లు ఏపీ జెన్కోకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించారు. రెవెన్యూ లోటు, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్.. ఆంధప్రదేశ్‌కు 2014 – 15కి సంబంధించి రెవెన్యూ లోటు నిధులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సమావేశంలో ప్రస్తావించారు. పోలవరానికి నిధులు, గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు తదితరాలను అజయ్ భల్లా దృష్టికి తెచ్చారు. కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖ, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాల ఆవశ్యకతను వివరించారు. దుగ్గరాజుపట్నం ఓడరేవుకు బదులుగా రామాయపట్నం రేవు అభివృద్ధి, విశాఖపట్నం–చైన్నై పారిశ్రామిక నడవా, కేంద్రం నుంచి పన్ను రాయితీ బకాయిల గురించి కూడా ప్రస్తావించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్, రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కేఎస్.జవహర్ రెడ్డి వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. -
సింగరేణి సీఎండీ పదవీ కాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పదవీ కాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మరో ఏడాది పాటు శ్రీధర్‌ను ఆ పదవిలో కొనసాగిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2015 జనవరి1 నుంచి శ్రీధర్ ఆ పదవిలో కొనసాగుతుండగా, ఇప్పటికే ఐదుసార్లు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పటికే ఏడేళ్ల పాటు ఆ పదవిలో ఉన్న శ్రీధర్‌కు మళ్లీ పొడిగింపు ఇవ్వడం గమనార్హం. -
సులభతర వాణిజ్యంలో నం.1 కావాలి..
సాక్షి, హైదరాబాద్: సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ) ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ ప్రభుత్వ విభాగాల శాఖాధిపతులతో ఈఓడీబీ ర్యాంకుల ప్రక్రియపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో బుధవారం కేటీఆర్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈఓడీబీ ర్యాంకుల్లో తెలంగాణ అగ్రస్థానం సాధించేందుకు వివిధ శాఖలకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాలకు సంబంధించి వంద శాతం సంస్కరణలు, చర్యలు పూర్తయినట్లు అధికారులు వివరించారు. ర్యాంకుల కేటాయింపుల్లో యూజర్ ఫీడ్‌బ్యాక్ (వినియోగదారుల ప్రతిస్పందన) అత్యంత కీలకమని, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అందుతున్న సేవలపై పారిశ్రామికవర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం సమాచారం తీసుకుంటోందని అధికారులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అధికారుల పనితీరుతో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తూ, ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. గతంలోనూ ఈఓడీబీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, త్వరలో ప్రకటించే ర్యాంకుల్లోను మొదటి స్థానం సాధించేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈఓడీబీ కేవలం ర్యాంకుల కోసమే కాదని, ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపరుచుకునేందుకు అద్భుతమైన అవకాశంగా కేటీఆర్ పేర్కొన్నారు. డిజిటల్ సేవలను ప్రారంభించిన మంత్రి మేధో సంపద పరిరక్షణకు సంబంధించిన అన్ని రకాల అంశాలపైనా విద్యార్థులు, స్టార్టప్ నిర్వాహకులు, సృజనాత్మక ఆవిష్కర్తలు...ఇలా ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండేలా రెజల్యూట్ సంస్థ భాగస్వామ్యంతో ప్రభుత్వం రూపొందించిన ‘ఐపీ బడ్డీ రచిట్’డిజిటల్ సేవలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఐటీ పరిశ్రమ ప్రిన్సినల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, రెజల్యూట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రమీందర్ సింగ్ సోయిన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ ఎం.కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో అమల్లోకి వచ్చిన కోవిడ్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్, మరో పక్క కోవిడ్–19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని రకాల సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై రూ.1000 జరిమానా విధించే ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజా రవాణా వ్యవ స్థలు, దుకాణాలు, మాల్స్, సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, ఐఆర్ థర్మామీటర్/థర్మల్ స్కానర్, శానిటైజర్ సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనవరి 2 వరకు రాష్ట్రంలో ఇలాంటి ఆంక్షలు ఇప్పటికే అమల్లో ఉండగా, తాజాగా ఈ నెల 10 వరకు ప్రభుత్వం వాటిని పొడిగించింది. అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం సందర్భంగా కోవిడ్ పరిస్థితులను సమీక్షించిన అనంతరం సీఎస్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. చాలా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు, కోవిడ్–19 కేసు లు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో సైతం ముందు జాగ్రత్తగా నివారణ చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
జీవో 317ను రద్దు చేయాలి
పంజగుట్ట: జీవో 317తో రాష్ట్రాంలోని లక్షలాది ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తక్షణమే ఈ జీవోను రద్దుచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌ను బుధవారం కలిసి వినతిపత్రం సమర్పించారు. 2021 జనగణనలో కుల గణన చేసేలా కేంద్రనికి లేఖ రాయా లని గవర్నర్‌ను కోరారు. జనవరి 3వ తేదీన బీసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నగరం లో జరిగే సావిత్రీబాయి పూలే జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా హాజరు కావా లని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఈ జీవో వల్ల స్థానికత, సీనియారిటీ ఉన్న వారిని పక్క జిల్లాలకు బలవంతంగా బదిలీ చేస్తున్నారని, దీంతో వారు సర్వీస్, సీనియారిటీ కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల మాదిరిగానే బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన, బిహార్ వాసి అయిన సీఎస్ సోమేష్ కుమార్‌కు జీవో 317 వర్తింపచేయాలని, అప్పుడు ఉద్యోగుల భాధ ఆయనకు అర్థం అవుతుందన్నారు. తమ విజ్ఞప్తుల పట్ల గవర్నర్ సానుకూలంగా స్పందించారని, జనగణన కోసం కేంద్రానికి లేఖ రాస్తానని హామీ ఇచ్చారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. -
హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ను అవి నీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీజీగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నగర పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించింది. అలాగే రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 11 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఐపీఎస్‌ల బదిలీల వివరాలివీ.. -
జిల్లా మారితేనే కొత్త పోస్టింగ్‌లు
ఉదాహరణకు.. ఉమ్మడి ఆదిలాబాద్‌కు చెందిన ఉద్యోగి ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నాడు అనుకుంటే.. ప్రస్తుతం కేడర్ ఫిక్సేషన్లో భాగంగా ఆ ఉద్యోగిని మంచిర్యాల జిల్లాకు కేటాయిస్తే.. ఆ ఉద్యోగికి కొత్తగా పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నచోటనే పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఉద్యోగి ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో పని చేస్తూ ఉండి.. మంచిర్యాల జిల్లాకు కేటాయించిన పక్షంలో మాత్రం జిల్లాలో సీనియారిటీ ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా మంచిర్యాలలో కొత్తగా పోస్టింగ్ ఇవ్వాలి. ఆ ఉద్యోగి నిర్మల్ జిల్లా నుంచి రిలీవ్ అయ్యి.. మంచిర్యాల జిల్లాలో చేరతారు. సాక్షి, హైదరాబాద్: కొత్త జోనల్ విధానం అమల్లో భాగంగా జిల్లాలు మారిన ఉద్యోగులకు మాత్రమే కొత్త పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా మారని ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం పనిచేస్తున్న స్థానంలోనే ఉంటారని అందులో పేర్కొన్నారు. సాధారణ బదిలీలపై గతంలో ఇచ్చిన ఆంక్షలను సర్కార్ సడలించింది. సాధారణ బదిలీలు చేయాల్సి వస్తే కొత్తవారిని కూడా బదిలీల ప్రక్రియలో భాగస్వామ్యం చేయనుంది. కొత్త పోస్టింగ్‌ల అమలుకు వీలుగా విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులోభాగంగా ఇప్పటికే కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగుల సీనియారిటీ జాబితాను అన్ని ప్రభుత్వ శాఖలూ సిద్ధం చేశాయి. 25వ తేదీన వీటిని అందుబాటులోకి తెస్తారు. 26, 27 తేదీల్లో కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుంటారు. 28, 29న కౌన్సెలింగ్ పూర్తి చేసి, 30న పనిచేయాల్సిన ప్రాంతానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం జిల్లా కేడర్‌కు వర్తిస్తుంది. జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించిన బదిలీ ఉత్తర్వులు ఆ తర్వాత వచ్చే అవకాశముంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించగా, ఏప్రిల్‌లో జరిగే సాధారణ బదిలీలకు దీంతో ఇబ్బంది కలుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు అనుమానం వ్యక్తం చేశాయి. నిబంధనలు ఇవీ.. ♦జిల్లాకు కొత్తగా వచ్చిన ఉద్యోగుల సీనియారిటీ జాబితాను సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తయారు చేస్తారు. దీన్ని కలెక్టర్ ఆమోదిస్తారు. ఈ జాబితాను శనివారం అందరికీ అందుబాటు లో ఉంచుతారు. 27నుంచి ఉద్యోగులు ఏ ప్రాంతంలో పోస్టింగ్ కోరుకుంటున్నారనే ఆప్షన్లు ఇస్తారు. ♦జిల్లా అధికారులు అన్ని కేడర్లకు సంబంధించిన ఖాళీలను, ఎక్కడ తక్షణ అవసరం ఉందనే వివరాలను గుర్తిస్తారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్తగా జిల్లాకు వచ్చిన ఉద్యోగులతో భర్తీ చేస్తారు. భర్తీ చేయాల్సిన పోస్టులనే కౌన్సెలింగ్‌లో ఉంచుతారు. ఉదాహరణకు జిల్లాకు 40 మంది జూనియర్ అసిస్టెంట్లు మంజూరై... పోస్టులు 50 ఉన్నప్పుడు, అవసరమైన పోస్టులను మాత్రమే అందుబాటులో ఉంచుతారు. ♦ఉద్యోగుల పోస్టింగ్, బదిలీల వ్యవహారం మొత్తం పారదర్శకంగా నిర్వహిస్తారు. తెలంగాణ గెజిటెడ్, నాన్–గెజిటెడ్, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తారు. æ ప్రత్యేక కేటగిరీ, భార్యాభర్తల విషయంలో ప్రాధాన్యత నిర్ధారించేందుకు జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. పోలీసు, రెవెన్యూ, కమర్షియల్ టాక్స్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ విభాగాల్లో అక్కడి అవసరాలకు అనుగుణంగా ఆయా శాఖలు మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ ఏడు రోజుల్లో పూర్తవ్వాలి. స్వాగతిస్తున్నాం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉన్నాయి. దీన్ని స్వాగతిస్తున్నాం. భార్యాభర్తల బదిలీలు, కౌన్సెలింగ్ ద్వారా ఎక్కడి వారక్కడే ఉండేలా కసరత్తు చేయడం మంచి పరిణామమే. ఈ దిశగా చొరవ చూపిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – మామిళ్ల రాజేందర్ (టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు) బదిలీలపై స్పష్టత ఇవ్వాలి కొత్త వారికే పోస్టింగ్‌లు ఇవ్వడం వల్ల.. ఆ జిల్లాలో ఏళ్ల తరబడి బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారికి న్యాయం జరిగే అవకాశం కన్పించడం లేదు. ఏప్రిల్‌లో సాధారణ బదిలీలు నిర్వహిస్తే అప్పటికే ఉద్యోగులు కోరుకున్న పోస్టులో ఇప్పుడొచ్చిన కొత్తవాళ్లు ఉంటారు. ఏళ్ల తరబడి కోరుకున్న ప్రాంతానికి వెళ్లాలనుకునే వారికి నిరాశే. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
తెలంగాణ మున్సిపల్‌శాఖ కీలక ఉత్తర్వులు
సాక్షి హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ కొరడా ఝుళిపించింది. హెచ్ఎండీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరుతో హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా అక్రమంగా భారీ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలు కూల్చివేతలను ఆదేశించింది. సాధారణంగా హెచ్ఎండీఏ పరిధిలో గ్రామ పంచాయతీలు జీ ప్లస్ 2 వరకు మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. - అంతకు మించి భారీ నిర్మాణాలు, అనుమతి లేని విల్లాలను కూల్చి వేయాలని ఆదేశించింది. కాగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాలాలపై ఆక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి మంగళవారం నాళాల అభివృద్ధి పై సమీక్ష చేయనున్నట్లు తెలిపారు. వారానికి ఒకసారి క్షేత్ర స్థాయిలో నాలలను పరిశీలన చేయనున్నట్లు వెల్లడించారు. నాళాలపై నిర్మణాల కూల్చివేతల బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయించాలని నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: నయా మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై నజర్ -
వచ్చే ఏడాది సెలవులివే.. ఆ నెలలోనే అధిక సెలవులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సాధారణ సెలవులను ప్రభుత్వం వెల్లడించింది. 2022 సంవత్సరంలో మొత్తం 23 ప్రభుత్వ సాధారణ సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ నెలలోనే ఆరు సాధారణ సెలవులు రానున్నాయి. ఉగాది, శ్రీరామనవమితో పాటు మరో నాలుగు సెలవులు ఈ నెలలో రానున్నాయి. చదవండి: కావలి మేఘనకు కేటీఆర్ అభినందనలు, శాలువాతో సత్కారం అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే జనవరి 1న సెలవు దినంగా ప్రకటించినందున, ఆరోజుకు బదులుగా ఫిబ్రవరి 12 రెండో శనివారం రోజున కార్యాలయాలు పని చేస్తాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులు ఐదుకు మించి ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్ హాలిడేస్) వాడుకోరాదని సూచించారు. (చదవండి: కిలో టమాట రూ. 50.. ఎగబడ్డ జనం) -
8కి ముందే ఫారెస్ట్ రైట్స్ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 8 నుంచి పోడు భూముల సమస్యపై దరఖాస్తుల స్వీకరణకు ముందే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు, ఇతర సభ్యులతో ఫారెస్ట్ రైట్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. ఈ కమిటీల ద్వారా ఆయా గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ, అందులో పొందుపరిచే అంశాలు, ఇతర విషయాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. పోడు భూములపై హక్కుల విషయంలో నవంబర్ 8 నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో సోమేశ్‌కుమార్ బుధవారం సచివాలయంలో అటవీ, రెవెన్యూ ఉన్నతాధికారులతో సమా వేశం నిర్వహించారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, విధి విధానాల రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. పోడు భూముల సమస్య అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రత్యేకాధికారులను నియమించాలని పేర్కొన్నారు. పోడు భూములు అత్యధిక విస్తీర్ణం ఉన్న ప్రాంతాలకు సీనియర్ అటవీ శాఖ అధికారులను నియమించాలని సీఎస్ సూచించారు. అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, రెవెన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, సీఎంవో ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఆక్సిజన్ లోటు రాదు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇకపై ఆక్సిజన్ లోటు రాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి రాష్ట్రంలో సౌకర్యం ఉందని తెలిపారు. కరోనా ఇంకా అంతం కాలేదని, అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 3 కోట్ల డోసుల పంపిణీ నేపథ్యంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యాల యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, కొవ్వొత్తులు వెలిగించి, గాల్లోకి బెలూన్లు విసిరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ థర్డ్‌వేవ్ వచ్చినా దాన్ని తట్టుకునేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో కోటి వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు 169 రోజులు పట్టిందని, ఆ తర్వాత కోటి వాక్సిన్ల పంపిణీకి 81 రోజులు, మూడో కోటి వ్యాక్సిన్ల పంపిణీకి 36 రోజుల సమయం పట్టిందని తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రం ముందంజలో ఉంద న్నారు. అనంతరం డీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరు కల్లా వంద శాతం వ్యాక్సినేషన్ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. -
మూడోవారం నుంచి ‘పోడు’ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోడు భూముల సాగుదా రుల నుంచి దరఖాస్తుల స్వీకరణకుగాను విధివిధానాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ నెల మూడోవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు ఏ విధంగా ఉండాలి, అందులో పొందుపరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కోఆర్డినేట్స్ నిర్ణయం, వివిధ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై త్వరలో జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ కన్జర్వేటర్లు, డీఎఫ్‌వోలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. -
రేపటి నుంచి ఆసరా పింఛన్లకు దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ‘57 ఏళ్ల వృద్ధాప్య పింఛన్ల’కు సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ మేరకు అన్ని ‘మీ’సేవా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. అర్హులైన వారంతా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటారు. వృద్ధాప్య పించన్ల వయసును 57ఏళ్లకు తగ్గించినా చాలా మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారని పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అర్హులైన వారందరికీ ఈ పింఛన్లు అందుతాయని సీఎం వారికి హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో శనివారం సమీక్ష నిర్వహించిన సీఎస్... దరఖాస్తు తేదీలను పొడిగించాలని సంబంధిత అధికారులైన పీఆర్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీఎస్టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వర్‌రావులను ఆదేశించారు. -
ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్
-
ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్
Traffic Challan Issued To Telangana CS Somesh Kumar Official Vehicle: తప్పు చేస్తే ఎవరినైనా సరే శిక్షించాల్సిందే. ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తామంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. దానిలో భాగంగానే నిబంధనలు పాటించని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక వాహనానికి చలాన్ విధించి తమకు అందరూ ఒక్కటే అని చాటి చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. (చదవండి: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా..) హైదరాబాద్ టోలిచౌకి పీఎస్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్‌పై అధిక వేగంతో సీఎస్ సోమేశ్ కుమార్ వాహనం (TS09FA0001) వెళ్తుండడాన్ని గుర్తించి చలాన్ విధించారు. మూడు వేల రూపాయల చలాన్ కట్టాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. చదవండి: సీఎస్ చదివాక సంతకం చేయాలి కదా? -
భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. గులాబ్ తుపాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్....! రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మరోసారి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సీఎస్‌తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ, పోలీస్, పంచాయితీ రాజ్, నీటిపారుదల, ఫైర్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రాణ ఆస్తి నష్టం కలుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. అవసరమైతే, హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‌లో ఉన్న ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలైన లోతట్టు ప్రాంతాలు , చెరువులు, కుంటలు, బ్రిడ్జి ల వద్ద ప్రత్యేకంగా అధికారులను నియమించి పరిస్థితులను సమీక్షించాలని అన్నారు. డీజీపీ ఎమ్. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్లతో సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమీషనర్లు, ఎస్.పిలని ఆదేశించామని తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగిందని అన్నారు. చదవండి: Gulab Cyclone: తెలంగాణలో భారీ వర్షాలు -
ధరణి పోర్టల్ ఉపసంఘం చైర్మన్‌గా హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘానికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చైర్మన్‌గా, సభ్యులుగా మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించనున్నారు. ఈ ఉప సంఘం కన్వీనర్‌గా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్త ర్వులు జారీ చేశారు. ధరణి పోర్టల్ సమస్యలపై కమిటీ అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు ఇవ్వాలి -
కుంకుమ పువ్వుకు రెట్టింపు ధర లభిస్తోంది
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశంలోని వేలాదిమంది రైతుల ఆదాయం రెట్టింపు అయిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. ‘ఇటీవల జమ్మూ, కశ్మీర్ పర్యటన సందర్భంగా ‘కుంకుమ పువ్వు’ల సాగు కేంద్రంలో ఓ రైతు నాతో మాట్లాడుతూ గతంలో తమకు కిలో కుంకుమపువ్వుకు రూ.లక్ష వరకూ అందేదని, ‘కేసర్ పార్క్’ఏర్పాటైన తరువాత, సాగు, మార్కెటింగ్‌లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని చేర్చిన తరువాత రెట్టింపు ధర లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశార’ని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం (2023) వేడుక సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లావు బియ్యం కొనుగోలు చేస్తారా? లేదా? అని విలేకరులు అడగ్గా.. ‘‘ఎఫ్‌సీఐ ద్వారా సేకరించే బియ్యం మళ్లీ ప్రజలకే పంచుతున్నాం. ఈ క్రమంలో సేకరించే బియ్యం నాణ్యమైందా? కాదా? అన్నది చూస్తాం. ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం’’అని అన్నారు. చిరుధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థలో చేర్చే ప్రయత్నం చేస్తారా? అన్న ప్రశ్నపై మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ సరఫరా చేయాలని నిర్ణయిస్తే, కేంద్రం అనుమతి పొందితే తాము సేకరించేందుకు సిద్ధమే’’అని తెలిపారు. చదవండి: సోనూసూద్‌పై ఐటీ దాడులు మరింత ఉధృతం -
సెప్టెంబర్ 10 లోపు విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు
హైదరాబాద్: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల టీకా వివరాలకు సంబంధించి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల్లో 18 ఏళ్ళు ఆపై వయస్సు కల్గిన విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోని వారు దగ్గర్లోని పీహెచ్సీ కేంద్రాల్లో వేసుకోవాలని ఆయన సూచించారు. చదవండి: ఐటీ ‘రిటర్న్స్’నూ మళ్లించేశారు..! వంద శాతం పూర్తి చేసుకున్న విద్యాసంస్థల్లో బ్యానర్ రాసి ప్రదర్శించాలి ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 10 లోపు విద్యాసంస్థల్లో వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. పాఠశాలలకు అనుబంధంగా ఉన్న బస్సు డ్రైవర్లు, మధ్యాహ్న భోజన సిబ్బంది, ఇతర సిబ్బందికి టీకాలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కలెక్టర్లు, జిల్లా అధికారులను తెలిపారు. విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠశాల కార్మికుడు ఎవరిలోనైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే, ఆ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రి లేదా పీహెచ్‌సీకి తీసుకెళ్లాలని అన్నారు. అక్కడ వారికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. చదవండి: హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షం -
లాక్‌డౌన్‌లోనూ అద్భుత ప్రగతి సాధించాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటైన ఏడేళ్లలో వేగంగా పురోగతి సాధిస్తోందని సీఎస్ సోమేశ్‌కుమార్ అన్నారు. కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో లాక్డౌన్ కాలంలోనూ రాష్ట్రం అద్భుత వృద్ధిని సాధించిందని తెలిపారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇది సాధ్యమైందన్నారు. ‘ఎగుమతిదారుల సవాళ్లు.. అధిగమించడం’పై గురువారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ భవన్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎగుమతిదారులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారని, ప్రభుత్వం ఎగుమతిదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీనిచ్చారు. కంటైనర్ల కొరత గురించి వివిధ రకాల ఆటంకాలు ఎదుర్కొంటున్నారని, కంటైనర్ల కొరత తీర్చాలని సీఎస్‌కు ఎగుమతిదారులు విజ్ఞప్తిచేశారు. మూలధన వస్తువులకు సంబంధించి జీఎస్టీ రీఫండ్ సమస్యను కేంద్రప్రభుత్వంతో కలిసి పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, రైల్వే, డీజీఎఫ్టీ అధికారులు తదితరలు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి: సీఎస్ సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ విజన్‌కు అనుగుణంగా పనిచేయాలని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ ఉద్యోగులను కోరారు. 122 మంది సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి నందుకు తెలంగాణ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గురువారం బీఆర్కేఆర్ భవన్లో సోమేశ్‌కుమార్‌ను సన్మానించింది. రాష్ట్రంలోని పేద ప్రజలకు సహాయం చేయడానికి పారద ర్శకంగా సేవలను సమర్థవంతంగా అందించాలని ఆయన ఉద్యోగులను కోరారు. సీఎం ఆదేశాల మేర కు ప్రభుత్వంలోని అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా పదోన్నతులు కల్పించామ న్నారు. ఉద్యోగులందరికీ డ్రాఫ్టింగ్, నోట్స్, కంప్యూ టర్ స్కిల్స్‌పై శిక్షణను ఏర్పాటు చేయడం ద్వారా మానవ వనరులను అభివృద్ధి చేయాలని సాధారణ పరిపాలనశాఖకు సూచించారు. కార్యక్రమంలో జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రావు పాల్గొన్నారు. -
జిల్లా కేడర్‌గా టీచర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ పోస్టులను లోకల్ కేడర్‌గా ప్రభుత్వం నిర్ధారించింది. అయితే, వీరందరికి కలిపికాకుండా వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం జీవోలు 254, 255, 256లను జారీ చేశారు. హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్ యాజమాన్యంలోని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, వాటి తత్సమాన పోస్టులను జిల్లా కేడర్‌గా ప్రభుత్వం నిర్ధారించింది. వాటి ఆధారంగానే భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని పేర్కొంది. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ఇవే ఆధారం కానున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని గెజిటెడ్ హెడ్మాస్టర్ గ్రేడ్–1, గ్రేడ్–2 పోస్టులను మల్టీ జోనల్ కేడర్‌గా చేసింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్–1, గ్రేడ్–2 పోస్టుల లోకల్ కేడర్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టులు గతంలో జోనల్ కేడర్‌లో ఉండగా, ఇపుడు మల్టీ జోన్ పరిధిలోకి తెచ్చింది. ఆ పోస్టు బదలాయింపు రాష్ట్ర విద్యా శిక్షణా, పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ), కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (సీటీఈ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)లలో లెక్చరర్ పోస్టులను మల్టీ జోనల్ కేడర్‌కు ప్రభుత్వం బదలాయించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోకు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. -
Hyderabad: రేపటి నుంచి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్‌డ్రైవ్ ఈ నెల 23 నుంచి 10– 15 రోజులపాటు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. శనివారం బీఆర్కేఆర్ భవన్లో వ్యాక్సినేషన్ స్పెషల్‌డ్రైవ్ నిర్వహణపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలోని మొత్తం 4,846 కాలనీ లు, మురికివాడలు తదితర ప్రాంతాలతో పాటు కంటోన్మెంట్ పరిధిలోని 360 ప్రాంతాల్లో స్పెషల్‌డ్రైవ్ కొనసాగుతుందన్నారు. వందశాతం కోవిడ్ టీకాలు వేసిన నగరంగా హైదరాబాద్‌ను మార్చడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. టీకాలు వేసేందుకు జీహెచ్ఎంసీలో 150, కంటోన్మెంట్ ఏరియాలో 25 వాహనాలు వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రతి వాహనంలో ఇద్దరు టీకా వేసే సిబ్బంది, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారన్నారు. ప్రతి కాలనీలో ఇద్దరు వ్యక్తులతో కూడిన మొబిలైజేషన్ టీమ్స్ టీకాలు తీసుకోని వారిని ముందుగానే గుర్తించి, వ్యాక్సిన్ వేసే తేదీ, సమయాన్ని తెలియజేయడంతో పాటు టీకా వేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుందన్నారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ పర్యవేక్షణకు జీహెచ్ఎంసీలోని 12 సర్కిళ్లకు 12 మంది జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: King Cobra: 13 అడుగుల గిరినాగు -
దళిత బంధు: ‘ఆలస్యమవుతుంది, రాదు అనే అనుమానాలొద్దు’
సాక్షి, కరీంనగర్: జిల్లా కలెక్టరేట్లో దళిత బంధుపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మమాట్లాడుతూ.. దళిత బంధు అద్భుతమైన పథకమని కొనియాడారు. పథకం కింద 10 లక్షల రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందనన్నారు. స్వేచ్ఛగా ఏ ఉపాధి పొందుతారో ఆ రంగంలో డబ్బులు ఇస్తారని తెలిపారు. దళిత బంధు రాష్ట్రం మొత్తం అమలు జరుగుతుందని, అనుమానాలు ఏమీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెల 16న సీఎం సభలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందిస్తారని పేర్కొన్నారు. ఇంకా ఎవరిని కూడా లబ్ధిదారులను ఎంపిక చేయలేదని అన్నారు. అందరికీ అమలు అవుతుందని, తమకు ఆలస్యమవుతుందని, మాకు రాదు అనే అనుమానాలు అవసరం లేదన్నారు. దళిత బంధు హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుంటున్నామమని రాహుల్ బొజ్జా అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వచ్చిన దళితుల జాబితా తమ వద్ద ఉందని, వివరాలు లేని వారిని కూడా నమోదు చేస్తారని వెల్లడించారు. ప్రతీ గ్రామం నుంచి నలుగురు కో ఆర్డినేటర్లు ఉంటారని, గ్రామ సభ ద్వారా అందరి ముందు లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రతీ కుటుంబంతో మాట్లాడి ఏ స్కీం తీసుకుంటారో చర్చించి అవగాహన కల్పించి పథకాన్ని గ్రౌండ్ చేస్తారని తెలిపారు ఏడాది నుంచి రెండేళ్ల వరకూ కూడా స్కీం తీరును అధికారులు మానిటర్ చేస్తారని పేర్కొన్నారు. దళిత రక్షక నిధి కూడా ఉంటుందని అన్నారు. సాక్షి, కరీంనగర్: ఇళ్ళందకుంట మండలం కనగర్తి గ్రామంలో దళిత బంధు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దళితులు పురుగుల మందు డబ్బాలతో ధర్నా నిర్వహించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సత్వరం పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వెంటనే పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సదుపాయాలను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు గదుల నిర్మాణాల ఆవశ్యకతను సమీక్షించి ఇప్పటికే పనులు ప్రారంభించిన వాటి పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్, పీడియాట్రిక్ ఐసీయూ పడకలను పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యాక్సినేషన్ కోసం మిగిలిన వారందరినీ గుర్తించేందుకు ప్రత్యేకంగా ‘‘మాప్ అప్ డ్రైవ్’’నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య, విద్య సంచాలకుడు డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టుకు తెలంగాణ సీఎస్ వివరణ
-
సీఎస్ చదివాక సంతకం చేయాలి కదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల్లో హాజరైన న్యాయవాదులకు చెల్లించేందుకు రూ.58 కోట్లు కేటాయిస్తున్నట్లుగా జీవో 208లో పేర్కొన్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ రూ.58 కోట్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసిన నిర్వాసితులకు చెల్లించేందుకేనన్న ప్రభుత్వ ఉద్దేశం బాగుందని, కానీ జీవోలో మాత్రం న్యాయవాదులకు ఇచ్చేందుకే అన్నట్లుగా ఉందని స్పష్టం చేసింది. జీవో రూపొందించే ముందు న్యాయ విభాగం క్షుణ్ణంగా పరిశీలించదా ? జీవోలో ఉన్న అంశాలను పూర్తిగా చదివిన తర్వాతే సీఎస్ సంతకం చేయాలికదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ నిధుల విడుదలను ఆపేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ గురువారం ధర్మాసనాన్ని అభ్యర్థించారు. పిటిషనర్ తప్పుడు సమాచారం ఇచ్చారు భూసేకరణకు సంబంధించి చెల్లించాల్సిన పరిహారం నిర్ణీత సమయంలో చెల్లించలేకపోయామని, ఈ నేపథ్యంలోనే కోర్టు ధిక్కరణ కేసులు దాఖలయ్యాయని ఏజీ తెలిపారు. వారికి డబ్బు చెల్లించేందుకే రూ.58 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేశారని నివేదించారు. నిధుల విడుదల ఆపాలంటూ పిల్ దాఖలు చేసిన పిటిషనర్.. ధర్మాసనానికి తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు. బుధవారం నాటి విచారణ సందర్భంగా వాస్తవాలను ధర్మాసనం ముందుంచలేక పోయామని వివరించారు. కోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో నిర్వాసితులకు డబ్బులు చెల్లించడం ఆలస్యమవుతుంది కాబట్టి, తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ నెల 9న ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని కోర్టు తెలిపింది. -
ఏమైనా జరగొచ్చు! అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లతో సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ సహా.. 16 వరద ప్రభావిత జిల్లాలపై సమీక్షించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, పోలీసు అధికారులతో మాట్లాడారు. వర్సాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. అన్ని జిల్లాల్లో వరదలపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. తాగు, సాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండొద్దని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. -
పంచాయతీల్లోనూ టీఎస్–బీపాస్
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతుల జారీ కోసం అమలు చేస్తున్న ‘టీఎస్–బీపాస్’విధానాన్ని ఇకపై గ్రామ పంచాయతీల పరిధిలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో అక్రమ, అనధికార లేఅవుట్లు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనకు రావడంతో, వాటిని కఠినంగా నియంత్రించడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల్లో కొత్త లేఅవుట్ల అనుమతులు టీఎస్–బీపాస్ ద్వారానే జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇటీవల మెమో జారీ చేశారు. పంచాయతీల్లో లేఅవుట్ల అనుమతులకు ప్రస్తుతం అమలు చేస్తున్న డీపీఎంఎస్, ఈ–పంచాయతీ విధానాన్ని టీఎస్–బీపాస్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. జాప్యం చేసే అధికారులపై జరిమానాలు టీఎస్–బీపాస్ విధానం కింద భవనాలు, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, ఇతర ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయని అధికారులపై జరిమానాలు విధించనున్నారు. జరిమానాల విధింపు త్వరలోనే అమల్లోకి రానున్నట్లు పురపాలక శాఖ టీఎస్–బీపాస్ పోర్టల్‌లో ప్రకటించింది. అక్రమ లేఅవుట్లకు 2 నెలల సమయం టీఎస్–బీపాస్ చట్టం మేరకు లేఅవుట్ల అనుమతులకు వచ్చే ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా లేఅవుట్ కమిటీ ముందు పెడతారు. ఈ కమిటీ సిఫారసుల మేరకు సంబంధిత గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరు మీద అనుమతులు జారీ చేయనున్నారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అక్రమ లేఅవుట్లపై జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్ (డీటీఎఫ్) కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఏర్పాటైన అక్రమ లేఅవుట్లకు నోటీసులు జారీ చేసి టీఎస్–బీఎస్ కింద రెండు నెలల్లోగా క్రమబద్ధీకరణ/అనుమతులు తీసుకునేలా ఆదేశించాలని, విఫలమైన పక్షంలో చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అక్రమ లేఅవుట్ల తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్లను కోరింది. -
’బీరు’ బాబులకు శుభవార్త.. ధర తగ్గింది!
సాక్షి, హైదరాబాద్: ‘బీర్’బలులకు శుభవార్త.. ప్రతి బీర్ బాటిల్‌పై రూ.10 స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని రకాల బీర్లపై ధర రూ.10 తగ్గనుంది, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. సోమేశ్ కుమార్‌తో సినీ ప్రముఖుల భేటీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో టాలీవుడ్ నిర్మాతలు సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమయ్యారు. కరోనా వల్ల చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. -
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా చర్యలు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి (సీఎస్) సోమేష్‌కుమార్ కోరారు. బీఆర్ కేఆర్ భవన్లో శనివారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. వినియోగదారుల కొనుగోళ్లు పెరిగేలా వడ్డీ రిబేట్లతో పాటు మరిన్ని రుణాలు అందించాలన్నారు. రుణాల దరఖాస్తు ప్రక్రియను సరళీకరించి, సత్వర నిర్ణయాలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. లోన్‌మేళాల నిర్వహణ, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుతో పాటు రుణాల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టాలన్నారు. సమావేశానికి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్విం ద్‌కుమార్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీడీడీ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, సీసీటీ నీతూ కుమారి ప్రసాద్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు. -
మూడో వేవ్‌పై ఆందోళనొద్దు.. ఏడాదికోసారి టీకా
సాక్షి, హైదరాబాద్: రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలున్న కొందరు కరోనా మూడో డోస్ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. మిగతావారు రెండు డోసులు తీసుకుంటే సరిపోతుందన్నారు. వ్యాక్సిన్ ప్రభావం ఏడాది పాటు ఉంటుందని, తర్వాత సంవత్సరానికోసారి కోవిడ్ టీకా తీసుకోవాల్సిన అవసరం పడుతుందని చెప్పారు. మంగళవారం రాష్ట్ర వైద్య మండలి ఆధ్వర్యంలో ‘కోవిడ్–19: నేర్చుకున్న పాఠాలు, భవిష్యత్ వ్యూహాలు’ అంశంపై ఏర్పాటు చేసిన వెబినార్‌లో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, మరికొందరు వైద్య నిపుణులు మాట్లాడారు. ఫ్లూ, కోవిడ్ టీకాలు రెండూ కలిపితే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా నాగేశ్వర్‌రెడ్డి సూచించారు. ఒక డోసు కోవాగ్జిన్ తీసుకుని రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకున్నా ఏమీకాదని.. ‘టీకాల మిక్స్ అండ్ మ్యాచ్’ విషయంలో మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. డెల్టా ప్లస్ వేరియెంట్పైనా ప్రస్తుత వ్యాక్సిన్లు బాగానే పనిచేస్తున్నాయని.. దీనిపై తాము చేస్తున్న పరిశోధనల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధిని 12 వారాల నుంచి 8 వారాలకు తగ్గిస్తే మంచిదనే సూచనలు వస్తున్నాయన్నారు. దేశంలో రోజుకు కోటి మందికి చొప్పున టీకాలు వేస్తేనే మంచిదని, దీనిని సాధించేందుకు వ్యాక్సిన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచుకోవాల్సి ఉందని నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది చివరిలోగా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరం ఉందని.. అప్పటిదాకా వ్యాక్సినేషన్‌తోపాటు అందరూ మాస్క్‌లు, ఇతర కోవిడ్ జాగ్రత్తలు కచ్చితంగా పాటించేలా చూడాలని స్పష్టం చేశారు. థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ వస్తుందనే ఆందోళన అవసరం లేదని.. రాబోయే రోజుల్లో ఒకటి తర్వాత మరొకటి చిన్న చిన్న వేవ్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. వందేళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చినపుడు ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేకున్నా కూడా ప్రమాదకర స్థాయిలో థర్డ్ వేవ్ రాలేదని గుర్తు చేశారు. కొత్త వేరియంట్లను అదుపుచేసేలా టీకాలు రావాలి: గులేరియా కోవిడ్ వ్యాక్సిన్లపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, సందేహాలను హెల్త్ వర్కర్లు దూరం చేయాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కేసులు, తీవ్రత పెరగడానికి కరోనా డెల్టా వేరియెంట్ కారణమని చెప్పారు. వీలైనంతగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచుకుని, ఎక్కువ మందికి వేయించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న నాలుగు నుంచి ఆరు వారాల్లో వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంటుందని ఆశాభావం వెలిబుచ్చారు. భవిష్యత్‌లో ఉత్పత్తి చేసే టీకాలు కొత్త వేరియెంట్లను అదుపు చేసేలా ఉండాలన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో పోస్ట్ కోవిడ్, లాంగ్ కోవిడ్ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని గులేరియా సూచించారు. కరోనా నుంచి కోలుకున్నాక రెండు, మూడు నెలల పాటు పోస్ట్ కోవిడ్ సమస్యలు ఉంటాయని చెప్పారు. మ్యుకోర్ మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) లక్షణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నుంచి బయటపడ్డాక 18 రోజుల సమయంలో అది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: సీఎస్ సోమేశ్ ఒకవేళ కరోనా మూడో వేవ్ వస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పారు. కోవిడ్ నియంత్రణ కోసం పటిష్ట చర్యలు చేపట్టేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని కార్యోన్ముఖులను చేయడంలో సీఎం కేసీఆర్ ముందున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ స్వయంగా గాంధీ, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులను సందర్శించి రోగులు, వైద్యుల్లో మనోస్టైర్యాన్ని పెంచారని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకుందని, ఫలితంగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్రియాశీలంగా వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర వైద్యులు, సిబ్బంది భాగస్వాములై కరోనాను పూర్తిగా పారదోలేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వెబినార్‌లో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి, డీఎంఈ డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంసీ చైర్మన్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో వివిధ అంశాలపై హైదరాబాద్‌లోని వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల వైద్య నిపుణులు ప్రసంగించారు. రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలపై టీఎస్ఎంఎస్ రూపొందించిన మూడు నిముషాల నిడివి గల వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. -
భూముల డిజిటల్ సర్వేపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలోని పేదలకు ఉన్న పట్టా భూములకు హక్కుల విషయంలో రక్షణ కల్పించేందుకే ధరణి పోర్టల్‌ను అమల్లోకి తెచ్చినం. భూ తగాదాల్లేని భవిష్య తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల డిజిటల్ సర్వే చేయిస్తోంది. భూములను సర్వే చేయడం ద్వారా వాటి అక్షాంశ, రేఖాంశాలను (కో–ఆర్డినేట్స్) గుర్తించి పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ సదుద్దేశాన్ని అర్థం చేసుకుని వ్యాపార కోణం నుంచి మాత్రమే కాకుండా సేవాభావంతో ఈ బృహత్ కార్యాన్ని నిర్వహించండి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సర్వే కంపెనీలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో భూ తగాదాలు లేని విధంగా ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల వ్యవహారాలను చక్కదిద్దిన నేపథ్యంలో ఈ డిజిటల్ సర్వే కూడా నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేపట్టనున్న భూముల డిజిటల్ సర్వేపై చర్చించేందుకు ప్రగతిభవన్‌లో ఆయన సర్వే ఏజెన్సీలు, కంపెనీల ప్రతినిధులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వే పద్ధతులు, సాంకేతిక అంశాలతో పాటు పలు రాష్ట్రాల్లో భూముల సర్వే అమలయిన తీరుపై కూలంకషంగా చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. అందరూ సహకరిస్తారు... గ్రామాల్లో భూ సర్వే విధానంలో అవలంభిస్తున్న టీపన్ నక్షా విధానాన్ని ప్రాతిపదికగా చేసుకుని సర్వే నిర్వహించాలని సీఎం సూచించారు. గ్రామ సభలను నిర్వహించి ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని, ఈ క్రమంలో అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పారు. జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారని, సర్వే నిర్వహించే క్రమంలో ఏజెన్సీలకు సహకరిస్తారని వెల్లడించారు. అయితే, సర్వే నిర్వహణ పూర్తి బాధ్యతలు మాత్రం ఏజెన్సీలదేనని స్పష్టం చేశారు. భూపరిపాలనలో రోజురోజుకూ గుణాత్మక మార్పులు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘ఆది మానవుని కాలంలో భూమి మీద హక్కులు లేవు. మనిషి వ్యవసాయం నేర్చుకున్న తర్వాతి పరిణామాల్లోనే భూమి మీద హక్కు ప్రారంభమైంది. ఆ తర్వాత రాజుల కాలం నుంచి నేటి ప్రజాస్వామిక దశ వరకు భూహక్కుల ప్రక్రియలో అనేక మార్పులొచ్చాయి. మారుతున్న కాలంతో పాటు ప్రభుత్వాలు కూడా ప్రజల భూములు, ఆస్తులకు రక్షణ కల్పించే విషయంలో ఆధునీకరణ చెందాలి. అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంటుంది’ అని సర్వే ఏజెన్సీల ప్రతినిధులను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాన్ని అర్థం చేసుకుని కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించారు. తగాదాలు లేకపోతే జీడీపీ పెరుగుతుంది.. భూతగాదాలను నూటికి నూరు శాతం పరిష్కరించుకున్న దేశాల్లో జీడీపీ 3 నుంచి 4 శాతం పెరిగిందని గణాంకాలు నిరూపిస్తున్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. గత పాలకులు విస్మరించిన ప్రజా సమస్యలో భూ సర్వే కూడా మిగిలిపోయిందని, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఈ క్రమంలో చిన్న తప్పు జరిగినా భవిష్యత్ తరాలు మూల్యం చెల్లించుకుంటాయని, ప్రభుత్వాలు చేసే తప్పులకు పేద ప్రజలు ఇబ్బందులు పడొద్దన్నదే తెలంగాణ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. అందుకే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందు చూపుతో భూముల డిజిటల్ సర్వే చేపట్టామని, భవిష్యత్తు తరాలకు తగాదాలు లేని భూములన్న తెలంగాణను అందించడమే లక్ష్యమని సర్వే సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సర్వే చేయండిలా.. సమావేశంలో భాగంగా భూముల డిజిటల్ సర్వేకు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ముందుగా రాష్ట్రంలో పైలట్ పద్ధతిలో భూములను సర్వే చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆయన ఆదేశించారు. జూన్11వ తేదీ నుంచి ఈ పైలట్ డిజిటల్ సర్వేను చేపట్టాలని, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని సూచించారు. అందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి తీసుకోవాలని, మిగిలిన 24 గ్రామాలను జిల్లాకు ఒకటి చొప్పున 24 జిల్లాల నుంచి ఎంపిక చేయాలని ఆదేశించారు. భూతగాదాలు లేని గ్రామాల్లో పైలట్ సర్వేను ప్రారంభించాలని, ఆ తర్వాత అటవీ, ప్రభుత్వ భూములు కలిసి ఉన్న గ్రామాల్లో చేయాలని కోరారు. సమస్యలు ఉన్న, సమస్యలు లేని గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించి క్షేత్రస్థాయి అనుభవాన్ని తెలుసుకోవాలని, ఆ తర్వాతే పూర్తి స్థాయి సర్వేకు విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టాలని, అవి పూర్తయిన తర్వాత పట్టణ భూముల సర్వే చేపట్టే అవకాశముందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శాసనసభ మాజీ స్పీకర్ మదుసూధనాచారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ వి.శేషాద్రి, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, డీజీపీ మహేందర్ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, సర్వే లాండ్ రికార్డ్స్ కమిషనర్ శశిధర్, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావులతో పాటు పలు డిజిటల్ సర్వే సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. చదవండి: Fact Check: కేంద్రం మన ఫోన్ కాల్స్ రికార్డు చేస్తుందా? -
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై డీకే అరుణ ఆగ్రహం
సాక్షి, గద్వాల: కరోనా వైరస్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రంలో కరోనా బాధితులకు బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొనడం శోచనీయం అని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉండడంతో పాటు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యామని తెలపడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం గద్వాలలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ.. ‘క్షేత్రస్థాయిలో కరోనా బారిన పడి ప్రజలు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా బారిన పడిన ప్రజలకు నాణ్యమైన చికిత్సతో పాటు నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మీడియాలో వస్తున్న వార్తలు పరిస్థితి ఏ స్థితిలోకి జారిపోయిందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన ఆక్సిజన్, బెడ్లు, మందుల కొరత తీర్చి ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఉంది’ అని తెలిపారు. చదవండి: ‘కేసీఆర్ బయటకు రా.. ప్రజల కష్టాలు చూడు’ చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే: సీఎస్ -
తెలంగాణలో కరోనా కంట్రోల్లో ఉంది: సీఎస్
-
ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే: సీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్లోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి వైద్య సిబ్బంది చాలా కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. కరోనా కట్టడి చర్యలపై సీఎం కేసీఆర్ తమకు దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై బుధవారం సీఎస్ అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్ మెడికల్ ట్రీట్మెంట్ క్యాపిటల్. ఇక్కడ ఇతర రాష్ట్రాల వారే ఎక్కువమంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఆక్సిజన్, మందుల కొరత లేదు. ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం కోవిడ్ ఆస్పత్రుల్లో 62వేల బెడ్స్ ఉన్నాయి. తెలంగాణలో 135 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ నింపుకొని రావడానికి 6 రోజులు పడుతుంది. ఎయిర్‌లిఫ్ట్ చేయడం వల్ల మూడు రోజుల సమయం ఆదా అవుతోంది. కరోనా కట్టడికి ఎంత డబ్బు అయినా ఖర్చు చేయమని సీఎం చెప్పారు. తెలంగాణలో 90వేల రెమిడెసివిర్ వయల్స్ అందుబాటులో ఉన్నాయి. టోసిలిజుమాబ్ 63 వయల్స్ స్టాక్ ఉంది. అనవసరంగా ఆక్సిజన్, రెమిడెసివిర్ మందుల్ని వృథా చేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది.. ఎవరూ భయపడొద్దు. కరోనా ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్‌గా ఉంది. సాధారణ మందులతోనే కరోనా తగ్గిపోతుంది. త్వరలోనే తెలంగాణలో సాధారణ పరిస్థితులు వస్తాయి’ అని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. -
అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష
-
పొద్దున సమీక్ష.. మధ్యాహ్నం పాజిటివ్: సీఎస్‌కు కరోనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ప్రకటించారు. తాజాగా చేసుకున్న పరీక్షల్లో పాజిటివ్ తేలిందని తెలిపారు. కొంత అస్వస్థతకు గురి కాగా పరీక్షలు చేయించుకున్నానని.. పాజిటివ్ వచ్చిందని తెలిపారు. అయితే కరోనా లక్షణాలు ఎలాంటివి లేవని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనను ఇటీవల కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని.. పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పాజిటివ్ ప్రకటన రాకముందు మంగళవారం సీఎస్ సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు ఆదేశాలు జారీ చేశారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కూడా భేటీ అయినట్లు తెలుస్తోంది. సీఎస్‌కు కరోనా సోకడంతో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు రెండు వేలకు చేరువగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. చదవండి: స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ బంద్ -
తెలంగాణలో లాక్డౌన్.. నకిలీ జీవో వైరల్!
సాక్షి, హైదరాబాద్: కరోనాతో రాష్ట్రానికి ముప్పు ఉండడంతో రాత్రి వేళల్లో లాక్డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా పేర్కొంటూ ఓ నకిలీ జీవో గురువారం రాత్రి కలకలం సృష్టించింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలోని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, క్రీడా స్థలాల మూసివేతకు ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొంటూ.. గుర్తుతెలియని ఆగంతకులు నకిలీ ఉత్తర్వులను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. ఏప్రిల్ 30 లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేరు, 2021 ఏప్రిల్ 1వ తేదీతో ఈ నకిలీ జీవోను రూపొందించారు. అచ్చం ప్రభుత్వం జారీ చేసే జీవోలా ఉండడంతో కొందరు నిజంగానే నమ్మి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొన్ని టీవీలు కూడా ఈ వార్త ప్రసారం చేశాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇది నకిలీ జీవో అని సీఎస్ సోమేశ్‌కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. చదవండి: లాక్డౌన్ దిశగా మహారాష్ట్ర! మళ్లీ కరోనా పంజా -
సెకండ్ శాటర్ డే, సండే కూడా..
సాక్షి, హైదరాబాద్: ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు మార్చి నెలలోని నాలుగు ఆదివారాలు, రెండో శనివారం కూడా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్. సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలలో మహాశివరాత్రి, హోలీ సెలవులు మినహాయించి మిగతా రోజులు రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరపాలని ఆయన సూచించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు చెందిన ఉద్యోగ సంఘ ఆఫీస్ బేరర్లు బీఆర్కేఆర్ భవన్లో సీఎస్‌ను గురువారం కలిశారు. శాఖ పరిధిలో ఇటీవల పదోన్నతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది పనితీరు పట్ల సీఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ నేతలు పరిష్కరించాలని కోరిన సమస్యలపై సీఎస్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ శేషాద్రి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, కన్వీనర్ ముజీబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్, సభ్యులు ప్రణయ్‌కుమార్, సిరాజ్ అన్వర్, నరేశ్‌గౌడ్ తదితరులున్నారు. -
ఐఎఫ్ఎస్ల బదిలీ.. సీఎస్ కీలక ఉత్తర్వులు
సాక్షి,హైదరాబాద్: అటవీశాఖలో పనిచేస్తున్న పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ములుగులోని ఫారెస్ట్‌కాలేజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) పర్సన్ ఇన్చార్జి, డీన్‌గా ఉన్న డా.జి.చంద్రశేఖర్‌రెడ్డిని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా పోస్టింగ్ ఇచ్చారు. సీఎం కార్యాలయ ఓఎస్డీ /హైదరాబాద్ ఆర్ అండ్ డీ సర్కిల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రియాంక వర్ఘీస్‌కు ఎఫ్సీఆర్ఐ పర్సన్ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్ప గించారు. ఇక ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్‌గా బి.శ్రీనివాస్ నియమితులు కాగా ఆ స్థానంలో పనిచేస్తున్న డా.అశోక్ కుమార్ సిన్హా ను స్టేట్ ట్రేడింగ్ సర్కిల్ అదనపు పీసీసీఎఫ్‌గా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ క్యూరేటర్‌గా ఉన్న ఎన్.క్షితిజను మహబూబ్‌నగర్ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్‌గా బదిలీ చేశారు. -
తక్షణమే పీఆర్సీ చర్చలు.. సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ), పదోన్నతులు, ఇతర సమస్యలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తక్షణమే ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వారం, పది రోజుల్లో ఈ చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సీఎస్ ఆధ్వర్యంలోని ఈ కమిటీలో ముఖ్య కార్యదర్శులు కె. రామకృష్ణారావు, రజత్‌కుమార్ ఉన్నారు. పీఆర్సీ నివేదిక అందినా... రిటైర్డ్ ఐఏఎస్ సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) గత నెల 31న సీఎస్ సోమేశ్‌కుమార్‌కు తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్లో పీఆర్సీ నివేదిక సమర్పించింది. జనవరి మూడో వారంలో పీఆర్సీ, పదవీ విరమణ వయసుపై ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ అదేరోజు ప్రగతి భవన్లో తనను కలిసిన టీఎన్జీవోలు, టీజీవో నేతలకు హామీ ఇచ్చారు. చదవండి: (పోలీసు శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారో..!) సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ జనవరి తొలి వారంలో పీఆర్సీ నివేదికపై అధ్యయనం జరిపి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని, జనవరి రెండో వారంలో నివేదిక సమర్పిస్తే మూడో వారంలో పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపుపై ప్రకటన చేస్తానని ఆ రోజు ఉద్యోగ సంఘాల నేతలతో పేర్కొన్నారు. అయితే ఈ నెలలో మూడు వారాలు గడిచిపోయినా ఇప్పటివరకు త్రిసభ్య కమిటీ సమావేశమై పీఆర్సీ నివేదికపై అధ్యయనం జరపడం లేదా ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవడం చేయలేదు. ఉద్యోగ సంఘాల నేతలు గత శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో సీఎస్‌ను కలసి పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయాలని వినతిపత్రం సమర్పించారు. పీఆర్సీపై తమను చర్చలకు ఆహ్వానించాలని కోరారు. ఎట్టకేలకు కదలిక... ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని త్రిసభ్య కమిటీని సీఎం కేసీఆర్ ఆదివారం ఆదేశించడంతో ఎట్టకేలకు పీఆర్సీ ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. సీఎం ఆదేశాలతో త్రిసభ్య కమిటీ సోమవారం లేదా బుధవారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా ఈ చర్చల ప్రక్రియ పూర్తయితే ఫిబ్రవరి తొలి వారంలో సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోగా రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది. ఆలోగా పీఆర్సీని ప్రకటించకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిల్లోనూ ఫిబ్రవరి తొలి వారంలో పీఆర్సీ ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది. మహిళా ఉద్యోగుల భద్రతపై సీఎం హామీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం సందర్భంగా భోజన విరామ సమయంలో కేసీఆర్ మహిళా ఉద్యోగులతో ప్రత్యేకంగా మాట్లాడారు. శాఖలవారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు సౌకర్యవంతంగా విధులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు. వారితో చర్చించి కావాల్సిన ఏర్పాట్లు చేసే బాధ్యతను తన కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు అప్పగించారు. తమపట్ల సీఎం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకు మహిళా ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఈ నెల 31లోగా.. పదోన్నతులు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, కారుణ్య నియామకాలు, ప్రత్యక్ష పద్ధతిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పురోగతిపై ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్దేశించింది. ఈ నెలాఖరు వరకు పదోన్నతులు, నియామకాల ప్రక్రియకు సంబంధించి ప్రతీ వారం (జనవరి 6, 12, 20, 27 తేదీల్లో) సమీక్షా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్.. అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులను ఆదేశించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, పలువురు జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయంతో పాటు విభాగాధిపతు(హెచ్ఓడీ)లు, జిల్లా స్థాయిలో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా జనవరి 31లోగా పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలకు సూచించారు. పదోన్నతులు, కారుణ్య నియామకాల ప్రక్రియను జాప్యం లేకుండా పూర్తి చేయాలని, పదోన్నతులతో ఏర్పడే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియమాల ప్రకటనల్లో చేర్చాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆశయం మేరకు ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం.. రాష్ట్ర, జోనల్, జిల్లా కేడర్ల వారీగా పోస్టుల విభజన ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను కోరారు. ఇంకా కొన్ని శాఖలు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదని, సత్వరంగా ముగించాలని కోరారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాణి కుముదిని, సురేశ్ చందా, అధర్ సిన్హా, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. 7 లేదా 9న కలెక్టర్లతో ముఖ్యమంత్రి భేటీ! ► ఉద్యోగుల పదోన్నతులు, ధరణి సమస్యలే ప్రధాన ఎజెండా ►రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామ నర్సరీలపైనా చర్చకు అవకాశం ►నేడు కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కె.చంద్రశేఖర్ రావు మళ్లీ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7 లేదా 9 తేదీల్లో ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని అన్ని కేటగిరీల ప్రభుత్వోద్యోగుల పదోన్నతులు, డీపీసీల ఏర్పాటుతోపాటు, ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారమే ప్రధాన ఎజెండాగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కారుణ్య నియామకా లు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామ నర్సరీలు, ఉపాధి హామీ, రైతు కల్లాలు తదితరవాటిపైనా కలెక్టర్లతో సీఎం చర్చించే అవకాశముందని సమాచారం. కాగా, ఈ అంశాలపై చర్చించి, పురోగతిని సమీక్షించేందుకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లూ తమ జిల్లా కేంద్రాల నుంచి కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని, బీఆర్కేఆర్ భవన్ నుంచి ఉదయం 11:30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని అధికారిక సమాచారం కూడా పంపారు. -
2021లో ప్రముఖుల లక్ష్యాలేంటో ఓ లుక్కేద్దాం..
కొత్త సంవత్సరం వస్తుందనగానే.. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మనలో చాలా మంది లక్ష్యం పెట్టుకుంటారు.. చేస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. న్యూఇయర్ రిజల్యూషన్ పెట్టుకోవడం అన్నది పరిపాటి. వీటిని కచ్చితంగా పాటించేవాళ్లు కొందరైతే.. 31న ఒట్టు పెట్టుకుని.. ఒకటో తేదీ సరికి దాన్ని గట్టు మీద పెట్టేసేవాళ్లు మరికొందరు.. మన సంగతి అలా ఉంచితే.. నిత్యం బిజీబిజీగా గడిపే ప్రముఖులు ఈసారి ఏమనుకుంటున్నారు? ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలనుకుంటున్నారు? అసలు 2021లో స్వదేశీ వస్తువులకే ‘సై’ అన్న ప్రముఖ వ్యక్తి ఎవరు? సొంతూళ్లో ఇల్లు కట్టుకోవడమే ఈ ఏడాది టార్గెట్ అన్న కామ్రేడ్ ఎవరు? హరీశ్‌రావు ఏం చేస్తానన్నారు? సీఎస్ ఏం రాస్తారన్నారు? ఇంతకీ కొత్త ఏడాదిలో డీజీపీ మహేందర్‌రెడ్డి టార్గెట్ ఏమిటి? లోకల్కేవోకల్.. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ లోకల్–వోకల్ నినాదం ఇచ్చారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని 2021లో పూర్తిగా స్వదేశీ వస్తువులనే వాడాలని నిర్ణయించా. రోజూ ఉదయం గంటసేపు యోగ, వ్యాయామం చేస్తాను. సమతుల ఆహారం నేను తీసుకుంటుంటాను. కొత్త ఏడాదిలో ఈ విషయాల్లో శ్రద్ధ పెట్టాలని భావిస్తున్నాను. ఆరోగ్య పరంగా మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. – రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటిదాక చదివా.. ఇక రాస్తా కొత్త సంవత్సరంలో బాగా పుస్తకాలు చదవడంతో పాటు పుస్తకాలు రాయడాన్ని మళ్లీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న. మెథడ్స్ ఆఫ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ పేరుతో ఇప్పటికే రాసినా.. వాటిని గూగుల్‌లో ఎవరైనా చూడవచ్చు. ఈ ఏడాది అభివృద్ధి అనే అంశంపై పుస్తకాలు రాయాలనుకుంటున్నా. అంతేకాదు.. ఆరోగ్యంపై మరింత ఫోకస్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకే ఈ ఏడాది వ్యాయామం చేయడం ప్రారంభిస్తా. – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌పైనే.. శరీరం ఫిట్‌గా ఉంటే ఎలాంటి వ్యాధినైనా, విపత్తునైనా ఎదుర్కోగలుగుతాం. మానవాళిపై కరోనా వైరస్ విసిరిన పంజా మన ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పింది. అందుకే, కొత్త సంవత్సరంలో హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. నాతోపాటు కుటుంబసభ్యుల ఆరోగ్యంపైనా శ్రద్ధ పెడతా. – డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి రెండు మూడు ఉన్నాయి.. నాకు రెండు, మూడు లక్ష్యాలు ఉన్నాయి. సహజసిద్ధమైన అడవులు, సుందర ప్రదేశాలతోపాటు నదుల వెంట పయనిస్తూ చేసే ప్రయాణం నాకెంతో ఇష్టం. అందుకే ప్రత్యేకమైన అటవీ, వృక్ష సంపదకు, సముద్ర జీవనానికి కేరాఫ్ అయిన అండమాన్, నికోబార్ దీవులను ఈ కొత్త సంవత్సరంలో తప్పక విజిట్ చేస్తాను. ఈ ఏడాది చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, కల్పిత సాహిత్యం మరింత ఎక్కువ చదవాలనుకుంటున్నాను. – ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్.శోభ సిక్స్ డేస్ ఏ వీక్.. ఈ ఏడాది తప్పనిసరిగా వారంలో ఆరు రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేయాలన్నది నా లక్ష్యం. గతేడాది అనుకున్నా.. సాధ్యమవలేదు.. ఈసారి మాత్రం పక్కా.. శారీరక దృఢత్వంతోనే మానసిక సంకల్పం కూడా బలంగా ఉంటుందని నేను నమ్ముతాను. అంతేకాదు.. ఆత్మవిశ్వాసంతోపాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.. – స్వాతి లక్రా, ఏడీజీ, విమెన్ సేఫ్టీ వింగ్ నేను.. నా రెహాన్.. ఈ బిజీబిజీ పనుల్లో నేను గ్రహించనే లేదు.. నా కొడుకు రెహాన్ పెద్దవాడు అయిపోతున్నాడు. వాడికిప్పుడు 12 ఏళ్లు. ఈ కొత్త ఏడాది వాడికి బెస్ట్ ఫ్రెండ్‌గా మారాలని నిర్ణయించుకున్నా.. ఈ సంవత్సరం ఎలా ఉందో చూశాం. అందుకే 2021లో ఫిట్నెస్ మీద ఫోకస్ పెడతా. వ్యాయామానికి మరింత టైం కేటాయిస్తాను. – సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ ఎల్ఎల్ఎం పూర్తి చేయాలి 2015లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన తర్వాత ఎల్ఎల్ఎం కోసం అడ్మిషన్ తీసుకున్నా. అయితే పని ఒత్తిడి నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయా. 2021లో అది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దీంతో పాటు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు పోటీ పడే అభ్యర్థులకు ఇచ్చే తర్ఫీదును మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాను. – రాచకొండ సీపీ మహేష్ భగవత్ బోలెడు పుస్తకాలు చదవాలి ఇప్పటివరకు వీకెండ్లో ఒక పుస్తకం మాత్రమే చదివేవాడిని. 2021లో మాత్రం ప్రతీ వీకెండ్లో బోలెడన్ని పుస్తకాలు చదవాలని డిసైడ్ అయ్యా. బోలెడన్ని అంటే కనీసం మూడు నాలుగు పుస్తకాలైనా చదవాలి. గతంలో మూడు నెలలకోసారి సెలవులపై దేశ విదేశాలకు టూర్ వెళ్లేవాడిని. కొత్త సంవత్సరంలో మాత్రం కనీసం రెండు నెలలకోసారి వారం రోజులపాటు సెలవులపై వెళ్లాల్సిందే. – సన్‌షైన్ ఎండీ డా. గురువారెడ్డి లాస్ట్ ఇయర్‌లా చేయను.. అందరూ తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరాన్ని కోవిడ్ పరిస్థితులు నొక్కి చెప్పాయి. నేను చాలా కాలంగా యోగా చేస్తున్నా.. అయితే దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వల్ల నాలుగు నెలల నుంచి చేయడం లేదు. ఈమారు గత ఏడాదిలా కాదు.. యోగాపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా.. అలాగే ప్రాణాయామం ప్రాక్టీస్ చేయాలని నిర్ణయం తీసుకున్నా. – మంత్రి టి.హరీశ్‌రావు ఆరోగ్యమే మహాభాగ్యం.. ప్రజా జీవితంలో ఉండేవాళ్లు పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తూ ఉంటారు. అందుకేవ్యక్తిగత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని అనుకుంటున్నా. అలాగే నా జీవితంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఇన్నాళ్లూ రాజకీయాల్లో లెఫ్టిజమ్, రైటిజం అంటూ అనేక ఇజాలు వింటూ వచ్చాం. కానీ రాబోయే రోజుల్లో అంతా గ్రీనిజమే. – ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ 5 కి.మీ. వాకింగ్ మస్ట్.. నాకు వాకింగ్ చేసే అలవాటు ఉంది. అయితే.. రెగ్యులర్‌గా చేయలేకపోతున్నాను. ఈ కొత్త సంవత్సరంలో మాత్రం అలా చేయను. 2021లో శరీర దారుఢ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇక నడక మానే ప్రసక్తే లేదు. రోజూ ఉదయం, సాయంత్రం కనీసం 5 కిలోమీటర్లు తగ్గకుండా నడుస్తా.. వ్యక్తిగతంగా కొత్త సంవత్సరంలో నేను నిర్దేశించుకుంటున్న లక్ష్యం ఇదే.. – టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ఊర్లో ఓ ఇల్లు ఈ మధ్య చలో సొంతూరు నినాదం పెరుగుతోంది. నాక్కూడా సొంతూళ్లో ఇల్లుండాలనే కోర్కె బలంగా ఉంది. అమెరికాలో వున్న పిల్లలు అప్పుడప్పుడు వచ్చి.. మన పద్ధతులు చూడకుంటే.. మనతో మమేకం కాలేరు.. అందుకే మేం కూడా ఊర్లో ఇల్లు కట్టాలనే ఆలోచనతో ఉన్నాం. ఇక అభ్యుదయ సంగీతం , అన్నమయ్య కీర్తనలు , ఫ్లూట్ మ్యూజిక్ నాకిష్టం.. అవి వింటూ.. అలా మనవళ్లతో కాలక్షేపం చేయాలని ఉంది. – సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ -
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకాన్ని రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకంతో కలిపి అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వయంగా తెలిపారు. ప్రధాని మోదీ బుధవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించారు. బీఆర్కేఆర్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశానికి హాజరైన సీఎస్.. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌ను ఆరోగ్యశ్రీతో కలిపి అమలు చేయనున్నట్టు నివేదించారు. ఈ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తదితర అధికారులు పాల్గొన్నారు. -
హైకోర్టు ముందు హాజరైన సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఓ భూవ్యవహారం కేసులో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకో ర్టు ఎదుట హాజరయ్యారు. తాము ఆదేశాలు జారీ చేసినప్పుడు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సోమేశ్ కుమార్ ప్రస్తుతం సీఎస్ అయినా ఇంకా అమలు కాలేదంటూ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. 6 నెలలు గడువు ఇస్తే ఆదేశాలు అమలు చేస్తామని సీఎస్ నివేదించగా ధర్మాసనం నిరాకరించింది. ఆరు వారాల్లో ఆదేశాలు అమలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్. రామచందర్‌రావు, జస్టిస్ అమర్నాథ్గౌడ్తో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశించింది. షేక్‌పేట మండలంలోని సర్వే నంబర్లు 20, 21, 25లోని 59.18 ఎకరాలకు సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలని, ఈ భూమి యజమానుల వారసులకు సంబంధించిన వినతిపత్రాలపై తగిన నిర్ణయం తీసుకోవాలని 2016లో న్యాయమూర్తి.. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలు అమలు చేయకపోవడంతో మీర్ ఖుర్షిద్ అలీతోపాటు మరికొందరు కోర్టును ఆశ్రయించారు. -
50 వేల పోస్టుల భర్తీకి ఒకేసారి అనుమతి
సాక్షి, హైదరాబాద్ : వివిధ ప్రభుత్వ శాఖల్లో 50 వేల ఉద్యోగాల భర్తీకి ఒకేసారి అనుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇదివరకు ఒక్కో శాఖకు ఒక్కోసారి పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చేవారమని, ఇప్పుడు అలాకాకుండా అన్ని శాఖల్లో భర్తీకి ఒకేసారి అనుమతి ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు. అతి త్వరలో భర్తీకి అనుమతులు ఇస్తామని, ఇప్పటికే ఖాళీల గుర్తింపుపై కసరత్తు మొదలు పెట్టామన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చం ద్రావతి, ఖాద్రీల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు. చక్రపాణి, ఇతర సభ్యులను సీ ఎస్ ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లలో ఘంటా చక్రపాణి అత్యంత పారదర్శకంగా సేవలందిం చారని సీఎస్ కొనియాడారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెం చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఘం టా చక్రపాణి మాట్లాడుతూ రాష్ట్రానికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, నియామకాల భర్తీ ప్రక్రియలో ఉద్యోగులు ఎంతో సహకరించారని, కమిషన్ పరపతి అంతర్జాతీ య స్థాయిలో పెరిగిందన్నారు. టీఎస్పీఎస్సీలో దరఖాస్తు ప్రక్రియ మొదలు ఫలితాల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక, నియామక ఉత్తర్వులు.. ఇలా అన్ని స్థాయిల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసి సత్ఫలితాలు తెచ్చామన్నారు. టీఎస్పీఎస్సీ ఇన్చార్జి చైర్మన్‌గా కృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యుడు డి.కృష్ణారెడ్డి సంస్థ ఇన్చార్జి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి పదవీకాలం గురువారంతో ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
క్షణాల్లో ఈ–పాస్‌బుక్
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను పాత వెబ్సైట్ ద్వారానే అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులను నిర్ణయించే విషయంలో సబ్ రిజిస్ట్రార్లకు గతంలో ఉన్న విచక్షణాధికారాలను రద్దు చేసినట్లు తెలిపారు. స్లాట్‌లోని తేదీ, సమయానికి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే 5 నుంచి 7 నిమిషాల్లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఆ వెంటనే మొబైల్ ఫోన్‌కు ఈ–పాస్‌బుక్ వస్తుందని, వారం పది రోజుల్లో పోస్టు ద్వారా మెరూన్ రంగు పట్టాదారు పుస్తకం ఇంటికి వస్తుందని తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం కొత్తగా రూపొందించిన స్లాట్ బుకింగ్ విధానాన్ని శుక్రవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో ఆవిష్కరించారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు పునరుద్ధరిస్తామన్నారు. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల అనుమతి విషయంలో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. స్లాట్ బుకింగ్ ఉంటేనే.. స్లాట్ బుక్ చేసుకుంటేనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ చేస్తారని సీఎస్ స్పష్టం చేశారు. https:// registration.telangana.gov.in వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్‌లో విక్రయదారు, కొనుగోలుదారు, ఆస్తికి సంబంధించిన వివరాలతో పాటు ఆస్తికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నంబర్ (పీటిన్) ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పీటిన్ లేని వారు ఇదే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రెండ్రోజుల్లోగా వారి మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ రూపంలో జారీ అవుతుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ నంబర్ తప్పనిసరి కాదని, అయితే ఆధార్ నంబర్ ఇచ్చిన వారికి తక్షణ రిజిస్ట్రేషన్, తక్షణ మ్యూటేషన్ సేవలు లభిస్తాయని పేర్కొన్నారు. ఆధార్ నంబర్ ఇవ్వని వారికి ప్రత్యేక ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారని, దీనికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఆధార్ ఉంటే ఆస్తి యజమాని గుర్తింపు నిర్ధారణ సులువు అవుతుందని, మోసాలకు తావుండదని పేర్కొన్నారు. చలాన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు.. రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సిన ఫీజులు, డ్యూటీల మొత్తానికి సంబంధించిన చలాన్‌ను ఆటోమెటిక్‌గా సిస్టం జనరేట్ చేస్తుందని సీఎస్ చెప్పారు. రిజిస్ట్రేషన్ల కోసం స్టాంప్ పేపర్, బాండ్ పేపర్లు కొనాల్సిన అవసరం లేదని, చలాన్లో పేర్కొన్న ఫీజు చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. చలాన్‌ను తీసుకెళ్లి ఏదైనా ఎస్బీఐ శాఖలో ఫీజు చెల్లించాలని చెప్పారు. ఆన్లైన్ బ్యాకింగ్ ద్వారా కూడా తక్షణమే చెల్లించొచ్చన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఎక్కడికి వెళ్లాలి? ఎంత మంది సాకు‡్ష్యలను తీసుకెళ్లాలి? ఏమేం తీసుకెళ్లాలన్న వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో దరఖాస్తుదారులకు వస్తుందని చెప్పారు. డాక్యుమెంట్ రైటర్ల అవసరం లేకుండానే సొంతంగా దస్తావేజు రాసుకునేందుకు వీలుగా వెబ్సైట్లో నమూనా దస్తావేజులు (టెంప్లెట్లు) అందుబాటులో ఉంచామన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యూటేషన్ సైతం పద్ధతి ప్రకారం జరుగుతుందన్నారు. ఒక్కో స్లాట్‌కు 15 నిమిషాల చొప్పున ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌కు రోజుకు 24 స్లాట్ల రిజిస్ట్రేషన్లను కేటాయించామన్నారు. త్వరలో ఈ సంఖ్యను అవసరం మేరకు 48 నుంచి 100కు పెంచుతామన్నారు. అవసరమున్న చోట ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, ఇద్దరు డీటీపీ ఆపరేటర్లను నియమిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ల డేటా భద్రతకు హైకోర్టు చేసిన సూచనలను తప్పకుండా పాటిస్తున్నామని చెప్పారు. ఎక్కడా డేటా లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వివరించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అనుమానాలుంటే రిజిస్ట్రేషన్ల శాఖ ఐటీ కార్యాలయం టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 4788కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. ధరణిలో పెండింగ్ మ్యూటేషన్లకు అవకాశం.. పెండింగ్ మ్యూటేషన్లు పూర్తి చేసేందుకు ధరణి పోర్టల్‌లో అవకాశం కల్పించామని సీఎస్ తెలిపారు. 16,110 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో 1.24 కోట్ల క్లిక్కులు, 74 వేల స్లాట్ బుకింగ్‌లు, 55,216 లావాదేవీలు జరిగాయని సీఎస్ వెల్లడించారు. పోర్టల్‌కు ట్రాఫిక్ విపరీతంగా పెరగడం వల్ల సర్వర్ స్తంభించగా, వెంటనే పునరుద్ధరించామన్నారు. తొలిరోజే రూ.85 లక్షల ఆదాయం వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజైన శుక్రవారం సాయంత్రం నాటికి 37 స్లాట్లు బుక్ కాగా, రూ.85 లక్షలు ఫీజులు, సుంకాల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. 17,567 మంది సైట్‌ను సందర్శించగా, 3,987 వినియోగదారులు సైట్లో తమ పేరున ఖాతాలే రిజిస్టర్ చేసుకున్నారు. 4,143 లావాదేవీలకు శ్రీకారం చుట్టారు. మీ–సేవ కేంద్రాల ద్వారా కూడా రూ.200 చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చని సీఎస్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బిల్డర్లు, డెవలపర్లు ఒకేసారి బల్క్‌గా అన్ని ఆస్తులనూ అప్లోడ్ చేసేందుకు సైట్లో కొత్త విండో సదుపాయం కల్పించారు. 451 మంది బిల్డర్లు, డెవలపర్లు 93,874 ఆస్తులను అప్లోడ్ చేశారు. 12,699 ఆస్తులకు సంబంధించిన పీటిన్లను స్థానిక సంస్థలు జారీ చేశాయి. ప్రస్తుతం చేపడుతున్న రిజిస్ట్రేషన్లు ఇవే.. సేల్ కేటగిరీ కింద సేల్ డీడ్, సేల్ అగ్రిమెంట్ వితౌట్ పొసెషన్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, మార్టగేజ్ కేటగిరీ కింద మార్టగేజ్ వితౌట్ పొసెషన్, మార్టగేజ్ విత్ పొసెషన్, మెమోరాండంఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్, గిఫ్ట్ కేటగిరీ కింద గిఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిలేటివ్ తదితర రిజిస్ట్రేషన్ సేవలను పునరుద్ధరించారు. 97 శాతం రిజిస్ట్రేషన్లు ఈ కేటగిరీకి సంబంధించినవే ఉంటాయని సీఎస్ తెలిపారు. క్రమంగా మిగిలిన రిజిస్ట్రేషన్ సేవలను సైతం పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. -
ధరణి: కులం వివరాలు అడగడం లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రజల వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల హక్కుల పరిరక్షణ, పారదర్శకత కోసమే ధరణి వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ హైకోర్టుకు నివేదించారు. ప్రజల ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వం ఈ విధానానికి రూపకల్పన చేసిందని, ప్రజల ఆస్తుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని వివరించారు. భూరికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం పరిపాలనాపరమైన సంస్కరణలను తెచ్చిందని వివరించారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఆధార్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలన్న నిబంధన ఏమీ లేదని, ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయ ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఆర్థికసాయం అందిస్తున్న నేపథ్యంలో ఆధార్ వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు. కులం వివరాలు అడగడం లేదని, పథకాల అమలులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్న వివరాలను మాత్రమే అడుగుతున్నామని తెలిపారు. ధరణి పోర్టల్ కోసం ఆధార్, కులం వివరాలు అడగడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది గోపాల్ శర్మ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సోమేష్‌కుమార్ శనివారం కౌంటర్ దాఖలు చేశారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా కోటీ ఆరు లక్షల ఆస్తులు నమోదు చేసుకున్నారు. ఇందులో 12,751 పంచాయతీల్లో 59 లక్షలు, 140 మున్సిపాలిటీల్లో 22 లక్షలు, జీహెచ్ఎంసీ పరిధిలో 25 లక్షల ఆస్తుల వివరాలను నమోదు చేశారు. 1971 తెచ్చిన భూయాజమాన్య హక్కులు, పట్టాదారు పాసు పుస్తకం చట్టాన్ని రద్దు చేసి మరింత పారదర్శకత పెంచేలా నూతన చట్టాన్ని తెచ్చాం. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం మున్సిపాలిటీ, రెవెన్యూ, జీహెచ్ఎంసీ చట్టాలను సవరించాం. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు గతంలో కాకుండా సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ కలిసి ఉంటారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యూటేషన్ అయ్యేలా రూపకల్పన చేశాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా గతంలో లోపభూయిష్టంగా ఉండేది. ప్రస్తుత విధానంలో బయోమెట్రిక్ ద్వారా ఎటువంటి అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకున్నాం. అవినీతికి ఆస్కారం లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. సేకరించిన వివరాలు డేటా సెంటర్లో భద్రంగా ఉన్నాయి. ఈ వివరాలు తెలుసుకునే అవకాశం ఉండదు. బహిరంగంగా ఎవరికీ కనిపించవు. రికార్డుల్లో తప్పులు ఉంటే న్యాయస్థానాలను ఆశ్రయించి సవరించుకోవచ్చు. సంక్షేమ పథకాల అమలులో భాగంగానే ఆధార్ వివరాలు అడుగుతున్నాం. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలి’అని కోరారు. ఈ పిల్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. 23న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు లేనట్లే! ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈ నెల 23 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ పడింది. 23న ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుండగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. రిజిస్ట్రేషన్లపై కోర్టు స్టే విధించింది. ఈ అంశాన్ని 23న హైకోర్టు మరోసారి విచారించనుంది. హైకోర్టు నుంచి అనుమతి వస్తే తప్ప రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించే అవకాశం లేదు. ఈ కారణాల వల్ల 23 నుంచి ప్రారంభం కా వాల్సిన రిజిస్ట్రేషన్లు మరో 3, 4 రోజులు వాయిదా పడే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు.. 23న శ్రీకారం
సాక్షి, హైదరాబాద్ : ఈనెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం అయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభిస్తారని సీఎం తెలిపారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించే అంశంపై ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ‘ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నది. అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నది. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. ధరణి ద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని, నిశ్చింతను వ్యక్తం చేస్తున్నరు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ అద్భుతంగా వున్నది. ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించింది. మరో మూడు నాలుగు రోజులలో నూటికి నూరుశాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నది. ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడినంకనే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నం. అందుకే కొన్ని రోజులు వేచి చూసినం. ధరణి పోర్టల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న’అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్., సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు , రెవెన్యూశాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ధరణి సేవలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: ధరణి సేవలు షురూ అయ్యాయి. దాదాపు 2 నెలలుగా నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ సోమవారం లాంఛనంగా ప్రారంభమ య్యాయి. కొత్త రెవెన్యూ చట్టం నేపథ్యంలో సెప్టెంబర్ 9న ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిలిపివేసింది. ధరణి పోర్టల్‌నే భూరికార్డుగా పరిగణిస్తూ సాగు భూముల రిజిస్ట్రేషన్ల సేవలను తహసీల్దారు కార్యాలయంలోనే నిర్వహించేలా గత సెప్టెంబర్‌లో భూహక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం –2020(ఆర్వోఆర్)ను ప్రభుత్వం తెచ్చింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించేందుకు తలపెట్టిన ధరణి పోర్టల్‌ను గతనెల 29న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అయితే సాంకేతిక సమస్యలన్నిం టినీ అధిగమించి సోమవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు ఉదయం 10.30 గంటలకే 946 మంది రిజిస్ట్రేషన్ల కోసం ఫీజులు చెల్లించగా... 888 మంది స్లాట్‌బుక్ చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషా బాద్ మండలంలో తొలి రిజిస్ట్రేషన్ పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కొనుగోలుదారుకు అందించారు. మండలానికి చెందిన మంచాల ప్రభాకర్ తన భార్య ప్రశాంతి పేరుతో 4 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేశారు. ఆయన భార్యకు డిజిటల్ సంతకంతో కూడిన రిజిస్ట్రేషన్ పత్రాలను సోమేశ్‌కుమార్ అందజేశారు. స్మార్ట్‌గా స్లాట్ బుకింగ్... ధరణి పోర్టల్‌లో స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. స్మార్ట్ ఫోన్ ఉన్న వారెవరైనా నేరుగా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇది వరకు రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్‌ను సంప్రదించి, కొంత నగదును కమిషన్ రూపంలో ఇస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరితంగా అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొనుగోలు/అమ్మకందారుడెవరైనా నేరుగా స్మార్ట్‌ఫోన్ ద్వారా స్లాట్‌బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కొనుగోలుదారు, అమ్మకందారులిరువురితోనే పూర్తయ్యేలా ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేసింది. అలాగే మీసేవా కేంద్రాల్లో కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 1.48 ఎకరాలకు సంబంధించి 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం చేశారు. రిజిస్ట్రేషన్ల సమయంలో ఫింగర్ ప్రింట్ ఎంట్రీలో ఇబ్బందులు తలెత్తితే కంటి చూపు (ఐరిస్) ద్వారా వివరాలు అప్డేట్ చేసేలా వెసులుబాటు కల్పించారు. పారదర్శకంగా పోర్టల్: సోమేశ్‌కుమార్ ధరణి పోర్టల్ పారదర్శకంగా ఉంది. భూముల క్రయవిక్రయదారులు ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా, స్వేచ్ఛగా ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ఉన్న చోట తహసీల్దార్లు సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. సాంకేతిక నిపుణులు వాటిని వెంటనే పరిష్కరిస్తారు. రెండుమూడు రోజుల్లో సమస్యలను పూర్తిగా పరిష్కరించి రిజిస్ట్రేషన్లకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటాం. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై త్వరలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారు. -
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ధరణి సేవలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ర్టవ్యాప్తంగా సోమవారం నుంచి ధరణి సేవలు ప్రారంభం అయ్యాయి. శంషాబాద్ తాహసిల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో రైతులకు ధరణి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించిన 59.46 లక్షల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం అయ్యాయి. కాగా ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాలా అక్టోబర్ 29న ముఖ్యమంత్రి ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూ రిజిస్ట్రేషన్ల కోసం 946 మంది నగదు చెల్లించగా, 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నట్లు సోమేశ్ కుమార్ తెలిపారు. మీసేవా కేంద్రాల్లోనూ రూ.200 లు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవచ్చున్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లపై త్వరలోనే ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తామని, ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. అత్యంత పారదర్శకంగా , ఎలాంటి అవినీతికి తావు లేకుండా స్పెషల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామని చెప్పారు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. (ప్రతి ఇంచూ డిజిటల్ సర్వే ) -
ఇప్పటివరకు రూ.387.90 కోట్లు పంపిణీ
సాక్షి,హైదరాబాద్: నగరంలో వరదలతో నష్టపోయి ఇప్పటి వరకు నగదు సహాయం అందని బాధిత కుటుంబాలకు వారి ఇంటివద్దే నగదు పంపిణీని చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత కుటుంబాలకు నగదు పంపిణీపై ఆదివారం బి.ఆర్.కె.ఆర్.భవన్లో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌లతో ఆయన సమీక్ష నిర్వహించారు. చదవండి: ఎగసిపడ్డ జ్వాల.. తిరగబడ్డ వరద బిడ్డ వరద బాధితులకు ఇప్పటివరకు రూ.387.90 కోట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం మున్సిపల్ శాఖకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస, ఆర్థికసాయం కోసం రూ.550 కోట్లను మంజూరు చేయగా ఇప్పటివరకు వరదలతో నష్టపోయిన 3.87లక్షల కుటుంబాలకు నగదు పంపిణీ చేసినట్లు వివరించారు. చదవండి: హైదరాబాద్ మెట్రో క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇలా.. -
ట్రెండ్ సెట్టర్‌గా ధరణి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, వ్యవసాయేత ఆస్తుల తక్షణ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనున్న ధరణి పోర్టల్ దేశంలోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలవనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ అన్నారు. ఈ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ సేవల్లో రెవెన్యూ అధికారుల బాధ్యత మరింత పెరిగిందని, వారు రెవెన్యూ విధులతో పాటు జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గానూ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు ఒక బృంద పనితీరుతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ధరణి పోర్టల్‌పై మంగళవారం ఇక్కడ రెవెన్యూ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో సీఎస్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ నెల 29న ధరణిని ప్రారంభించనున్నారని, ఆయన అంచనాల మేరకు సులభంగా, పారదర్శకంగా, వేగంగా ప్రజలకు సేవలందించాలని రెవెన్యూ సిబ్బందిని సీఎస్ ఆదేశించారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వెంటనే జరగాలన్నారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్... ధరణి పోర్టల్ పనితీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ అధికారులకు సీఎస్ వివరించారు. స్లాట్ బుకింగ్, సిటిజన్ ఓపెన్ పోర్టల్ సక్సెసర్ మాడ్యూల్స్, పార్టిషన్ మాడ్యూల్స్ ఎలా చేయాలో తెలిపారు. తహసీల్దార్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల విధులు, బాధ్యతలను వివరించారు. ధరణి సాంకేతిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూంతో పాటు జిల్లా స్థాయి టెక్నికల్ సపోర్ట్ బృందాలు పనిచేస్తాయని చెప్పారు. ధరణి పటిష్ట అమలుకు అవసరమైన సౌకర్యాలను తహసీల్దార్ కార్యాలయాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, రెవెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొన్నారు. మూడుచింతలపల్లిలో ధరణికి శ్రీకారం రేపు పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ శామీర్‌పేట/హైదరాబాద్: వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల తక్షణ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి పోర్టల్‌కు వేదిక, ముహూర్తం ఖరారయ్యాయి. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం, మండల కేంద్రమైన మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పోర్టల్‌ను ఈ నెల 29న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్, పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పోర్టల్‌లో అందించే సేవలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ అధికారులకు సీఎస్ వివరించారు. అలాగే సీఎం మరో దత్తత గ్రామమైన లింగాపూర్ తండాలోనూ సీఎస్, సీపీ, పలువురు ఉన్నతాధికారులు పర్యటించారు. -
ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
-
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్ : మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు ఆదేశాలు ఇచ్చారు. కాగా నాయిని మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.. తెలంగాణ ఉద్యమంలో, ప్రభుత్వంలో కలిసి పని చేసిన అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. (మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత) నాయిని నర్సింహారెడ్డి ప్రస్థానం.... నాయిని స్వస్థలం నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము 1944లో నాయిని నర్సింహారెడ్డి జననం నాయిని తండ్రి దేవారెడ్డి, తల్లి సుభద్రమ్మ నాయిని సోదరుడు మాధవరెడ్డి.. చెల్లెల్లు ధమయంతి, సుధేష్న మేనమామ కూతురు అహల్యను వివాహమాడిన నాయిని నాయినికి దేవేందర్‌రెడ్డి, సమతా రెడ్డి సంతానం పెద్దమునగల్, ఎడవెల్లిలో నాల్గవ తరగతి వరకు చదువు 5వ తరగతి నుంచి దేవరకొండలో విద్యాభ్యాసం కుటుంబ బాధ్యతలతో హెచ్ఎస్సీ మధ్యలోనే ఆపేసిన నాయిని సొంతూరులో వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్న నాయిని సోషలిస్టు పార్టీకి ఆకర్శితులైన నాయిని సోషలిస్టు పార్టీ కేంద్ర నాయకులు రామ్ మనోహర్ లోహియా,.. రాష్ట్ర నాయకుడు బద్రి విశాల్ పిట్టి మాటతో 1962లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన నాయిని సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ సెక్రటరీగా కొత్త బాధ్యతలు వెయ్యి మంది సభ్యులున్న మున్సిపల్ కార్మిక సంఘాన్ని ఐఎన్టీయూసీ నుంచి.. సోషలిస్టు పార్టీలోకి తీసుకురావడంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాయిని 1969లో సోషలిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయిని ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నాయిని ఉద్యమం సమయంలో ఓ 30సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తి నాయిని 1978 అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ తరపున ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపు ప్రముఖ నాయకుడు టి.అంజయ్యపై 3వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో రూ.3 కోట్లతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీలో చేరాలని ఎన్టీఆర్ కోరగా తిరస్కరించిన నాయిని 1983లో జనతాపార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి 307 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గెలుపు 1984లో ఉపఎన్నికల్లో జనతాపార్టీ తరపున హిమాయత్‌నగర్ నుంచి ఓటమి 1985లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి 10,500 ఓట్ల మెజార్టీతో గెలుపు 1989లో జనతాదళ్ పార్టీ తరపున పోటీచేసి నాయిని ఓటమి 1995లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నుంచి మరోసారి నాయినికి ఆహ్వానం కార్యకర్తల ఒత్తిడితో టీడీపీలో చేరిక.. నాయినికి ముషీరాబాద్ టికెట్ పొత్తులో భాగంగా ముషీరాబాద్ టికెట్ కోసం బీజేపీ పట్టు సనత్‌నగర్ నుంచి పోటీచేయాలని నాయినిని కోరిన టీడీపీ టీడీపీ ప్రతిపాదనను తిరస్కరించి ఎన్నికలకు దూరంగా ఉన్న నాయిని 2001లో కేసీఆర్ నుంచి నాయినికి ఆహ్వానం 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం 2004లో టీఆర్ఎస్ నుంచి ముషీరాబాద్‌లో పోటీ చేసి గెలుపు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా పనిచేసిన నాయిని 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు -
శబరిమల ఆలయం: వాటికి అనుమతి లేదు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహ్తా గురువారం లేఖ రాశారు. శబరిమల ఆలయంలో నెయ్యి అభిషేకం, పంపానదిలో స్నానాలకు అనుమతి లేదని లేఖలో ఆయన వెల్లడించారు. వర్చువల్ క్యూపోర్టల్ ద్వారా దర్శనం కోసం భక్తుల నమోదు తప్పనిసరని పేర్కొన్నారు. https://sabarimalaonline.org లో భక్తులు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. తొలుత రోజుకు వెయ్యి, వారాంతంలో రోజుకు రెండు వేల మంది భక్తులకు మాత్రమే అనుమతినిస్తామన్నారు. దర్శనానికి 48 గంటల ముందు కరోనా వైరస్ నిర్థారణ పరీక్ష తప్పనిసరి అని స్పష్టం చేశారు. పదేళ్ల లోపు, 60 ఏళ్లకు పైబడిన వారికి దర్శనానికి అనుమతి లేదని ఆయన తెలిపారు. చదవండి : హైదరాబాద్ సీపీ ఇంట్లోకి వరదనీరు -
భారీ వర్షాలు: కేసీఆర్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు కోరారు. రాష్ట్రంలో చాలా చోట్ల నేడు (ఆదివారం) వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళ వారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. భారీ వర్షాలు, వాటితోపాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు. ఏపీలోనూ భారీ వర్షాలు.. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. క్రమంగా బలపడి 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో గాలుల వీచే అవకాశం ఉందని విశాఖ జిల్లాకు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మత్స్య కారులు వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశించారు. -
రూ.80 కోట్ల భూమికి ఎసరు
రెవెన్యూ అధికారుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. కీసర తహసీల్దార్ నాగరాజు,, మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ అవినీతి బాగోతం మరవకముందే.. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మంగళవారం మరో భూబాగోతం వెలుగుచూసింది. కాసులకు కక్కుర్తి పడిన రెవెన్యూ అధికారులు.. ఏకంగా రూ. 80 కోట్ల విలువైన అసైన్డ్ భూమికి ఎసరు పెట్టారు. పైగా చనిపోయిన తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి కుట్రకు తెర తీశారు. ఎన్ఓసీ కోసం దరఖాస్తు పెట్టుకోవడంతో.. అనుమానం వచ్చి కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో ఈ అక్రమార్కుల గుట్టు రట్టయింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఈ కేసుకు సంబంధం ఉన్న ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ సహా మరొకరిపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఆరుగురు ఉద్యోగులు, నలుగురు మాజీ సైనికులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. సాక్షి, సంగారెడ్డి/సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి గ్రామంలో సర్వే నంబరు 181లో అసైన్డ్ భూమి ఉంది. రాష్ట్ర రాజధానికి చేరువలో ఉన్న ఈ భూమి రూ.కోట్లలో విలువ చేస్తుండటంతో.. 2013లో జిన్నారంలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న జి.నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ కె.నారాయణ, ఖాజీపల్లి వీఆర్ఓ జే.వెంకటేశ్వర్రావు తదితరుల కన్ను పడింది. అయితే.. అసైన్డ్భూమి మాజీ సైనికులకు కేటాయించే వెసులుబాటు ఉండటంతో.. తోట వెంకటేశ్వర్లు, ఉప్పు రంగనాయకులు, ఎన్.గంగాధర్‌రావు, ఎం.మధుసూదన్‌లను మభ్యపెట్టి రంగంలోకి దింపారు. పథకం ప్రకారం.. వీరు జిన్నారం తహసీల్ కార్యాలయంలో భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐదెకరాల చొప్పున నలుగురికి 20 ఎకరాల భూమిని అధికారులు కేటాయించారు. ప్రస్తుతం దాని విలువ రూ.80 కోట్లు ఉంది. అయితే.. మాజీ సైనికులు, రెవెన్యూ అధికారుల మధ్య ఏ మేరకు ఒప్పందం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది. మృతి చెందిన తహసీల్దార్ పేరుతో నకిలీ పట్టాలు అసైన్డ్ భూమిని తాము నేరుగా కేటాయిస్తే ఇరుకున పడతామనే ఉద్దేశంతో అప్పటి తహసీల్దార్ తదితరులు పకడ్బందీ వ్యూహం రచించారు. ఇందుకుగాను 2010 కంటే ముందు జిన్నారంలో పనిచేసి మృతి చెందిన తహసీల్దార్ పరమేశ్వర్ సంతకంతో పాస్ పుస్తకాలు ఇవ్వాలని పథక రచన చేశారు. ఈ మేరకు నోట్ కూడా తయారు చేశారు. తాము ఎంపిక చేసిన నలుగురు మాజీ సైనికులకు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున మొత్తం 20 ఎకరాలు.. మృతి చెందిన తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలను సృష్టించారు. అయితే.. ఎవరికీ అనుమానం రాకుండా 2007 నుంచి పహాణీ మొదలుకొని ఇందుకు సంబంధించిన అన్ని భూ రికార్డులు మాజీ సైనికుల పేర్లతో ఉన్నట్లుగా రికార్డులలో దిద్దడం చేశారు. నిందితులపై క్రిమినల్ చర్యలు జిన్నారం మండలం భూ బాగోతంతో సంబంధం ఉన్న ఎనిమిది మంది రెవెన్యూ అధికారులు, నలుగురు మాజీ సైనికులపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జిన్నారం తహసీల్దార్‌గా పనిచేసి.. ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీఓ నరేందర్, అప్పటి డిప్యూటీ తహసీల్దార్ నారాయణలను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే.. వీఆర్వో వెంకటేశ్వర్ రావు, ఆర్ఐ విష్ణువర్ధన్, సర్వేయర్ లింగారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరప్ప, సూపరింటెండెంట్ సహదేవ్, 2019లో సంగారెడ్డి ఆర్డీఓపై కూడా శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాజీ సైనికులు వెంకటేశ్వర్లు, ఉప్పు రంగనాయకులు, ఎన్ గంగాధర్‌రావు, ఎం మధుసూదన్‌లకు కేటాయించిన అసైన్డ్ పట్టాలను కూడా రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుట్టు రట్టయిందిలా.. మాజీ సైనికులకు కేటాయించినది అసైన్డ్ భూమి కావడంతో ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) అవసరమైంది. ఎవరికైనా అసైన్డ్ భూమి కేటాయించిన పదేళ్ల తర్వాత వారికి ఈ భూమికి సంబంధించి యాజమాన్య హక్కులు (అమ్ముకోవడానికి వీలుగా) లభిస్తాయి. దీం తో 2019లో వారు ఎన్ఓసీకి దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్‌కు పంపిన ఫైళ్లలో రెవెన్యూ అధికారులు రాసుకు న్న ప్లాన్ పేపర్ (నోట్) కూడా ఉంది. దీంతో కలెక్టర్ హనుమంతరావుకు అనుమానం వచ్చింది. వెంటనే మైనార్టీ సంక్షేమ అధికారి తిరుపతిరావును విచారణ అధికారిగా నియమించారు. పూర్తి విచారణ అనంతరం.. అప్పట్లో జిన్నారం తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ జి.నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ కె.నారాయణ, వీఆర్వో వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడింది నిజమేనంటూ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించారు. అక్రమాలు వాస్తవమే జిన్నారం మండలం ఖాజీపల్లి సర్వే నం.181లో అసైన్డ్ భూమి ఉన్నమాట వాస్తవమే. చనిపోయిన తహసీల్దార్ పరమేశ్వర్ సంతకం ఫోర్జరీ అయినట్లు అనుమానంతో విచారణకు ఆదేశించా. దీంతో అసలు విషయం బయటపడింది. నలుగురు మాజీ సైనికులకు కేటాయించిన 20 ఎకరాల భూమిని ప్రస్తుతం సుమారుగా రూ.80 కోట్లు విలువ చేస్తుంది. – హనుమంతరావు, కలెక్టర్, సంగారెడ్డి -
డిప్యూటీ కలెక్టర్ శిక్షణకు సంతోషి
సాక్షి, హైదరాబాద్ : చైనాతో ఘర్షణలో మృతి చెందిన సంతోష్‌బాబు సతీమణి బికుమల్ల సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిన్నర పాటు శాఖాపరమైన శిక్షణ, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఆమెకు ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా ఏదేనీ జిల్లాలో క్షేత్రస్థాయి పాలనా వ్యవహారాల్లో శిక్షణకు పంపనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఎంసీహెచ్‌ఆర్‌సీలో జరిగే శిక్షణకు హాజరుకావాలని శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఎలాంటి ఆపద ఉన్నా కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తుండడం, పలు ప్రాంతాలను వరదలు పోటెత్తుతున్న నేపథ్యంలో ఎవరికైనా ఎలాంటి కష్టం ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 040–23450624కు కాల్ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమైతే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి బీఆర్కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. జిల్లాల్లో రైల్వే లైన్లకు దగ్గరగా ఉన్న చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎస్ సూచించారు. -
బాధ్యతలు స్వీకరించిన సంతోష్ బాబు భార్య
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా నేడు బాధ్యతలు చేపట్టారు. బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కలిసి శనివారం ఆమె జాయినింగ్ రిపోర్ట్ సమర్పించారు. సంతోషికి రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నిరోజుల క్రితం ఆమెకు నియామక పత్రాన్నిఅందజేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం వారికి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆమెకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు. దీంతోపాటు సంతోష్‌బాబు కుటుంబానికి హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలం, రూ.5 కోట్ల నగదును కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కాగా, గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరో 20 మంది సైనికులు అమరులయ్యారు. (హెలికాప్టర్‌తో రైతులను రక్షించిన రెస్క్యూ టీం) -
అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా!
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఈనెల 5న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 20వ తేదీ తర్వాత నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన భేటీ వాయిదా పడే అవకాశం ఉందని కృష్ణా, గోదావరి బోర్డు వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం సిద్ధమైన ప్రభుత్వం ► షెడ్యూల్ ప్రకారం అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొనేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం మార్గదర్శకాల మేరకు మంగళవారం కేంద్ర జల్ శక్తి శాఖకు అజెండాను పంపాలని నిర్ణయించింది. ► కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల విషమయంలో బోర్డులకు తెలుగు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకున్నాయి. వీటిపై జూన్ 4న కృష్ణా బోర్డు, 5న గోదావరి బోర్డు సమావేశాలు జరిగాయి. సీడబ్ల్యూసీ అనుమతి లేని వాటిని కొత్త ప్రాజెక్టులుగానే పరిగణిస్తామని, వాటి డీపీఆర్‌లు ఇస్తే పరిశీలన, ఆమోదం కోసం అపెక్స్ కౌన్సిల్‌కు పంపుతామని బోర్డులు సూచించాయి. ► ఈనెల 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఆ రోజు ఇరు రాష్ట్రాల సీఎంలు అందుబాటులో ఉంటారో లేదో తెలపాలని సీఎస్‌లకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి గత నెల 28న లేఖ రాసింది. -
విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతి నెలా తప్పనిసరిగా విద్యుత్ బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. పెండింగ్ విద్యుత్ బిల్లులపై శుక్రవారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మున్సిపాలిటీలు, పంచాయతీ రాజ్, డిస్కంల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు బకాయిపడిన విద్యుత్ బిల్లుల అంశంపై త్వరలో ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. డిస్కంలకు రావాల్సిన బకాయిలపై గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో చర్చించి ఒక వారంలోపు సమగ్ర నివేదిక రూపొందించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. పని చేయని బోరు బావులకు సంబంధించిన బిల్లులతోపాటు ఇతర విద్యుత్ బిల్లుల బకాయిల వివాదాలపై పంచాయతీలు, మున్సిపాలిటీలు, డిస్కం అధికారులు తక్షణమే సమావేశమై పరిష్కరించుకోవాలని సూచించారు. -
ర్యాపిడ్ కిట్ల వాడకంపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ర్యాపిడ్ కిట్లవాడకంపై హైకోర్టులో మంగళవారం రోజున విచారణ జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల ర్యాపిడ్ కిట్లు వాడకంలో ఉన్నాయి. మరో 4 లక్షల కిట్లు ఆర్డర్ చేశాం. రాజస్థాన్‌లో ర్యాపిడ్ కిట్ల వాడకం ఇప్పటికే ఆపేశారని సీఎస్ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు ర్యాపిడ్ కిట్ల వాడకంపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. ఎన్ఆర్ఐ, సిటీ స్కాన్ ఛార్జీలపై ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలపై ఇప్పటివరకు 726 ఫిర్యాదులు అందాయని సీఎస్ చెప్పారు. కాగా.. 726 ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ హైకోర్టు వివరణ కోరింది. హైకోర్టు ఆదేశాలన్నీ అమలు చేయడానికి రెండు వారాల సమయం కావాలని సీఎస్ కోరారు. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేస్తూ.. ఆ రోజున సీఎస్, వైద్యాధికారులు మరోసారి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. -
కరోనా హెల్త్ బులిటెన్ : హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా పరీక్షలు, బాధితులకు అందిస్తున్న ఏర్పాట్లపై హైకోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. పరీక్షల విషయంలో ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. ఈసారి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ని కోర్టు ముందు నిలబెట్టింది. ఆయన ద్వారా అన్ని వివరాలను అడిగి తెలుసుకుంది. మంగళవారం విచారణ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. కరోనాపై జారీ చేసే హెల్త్ బులిటిన్‌ను తప్పులు లేకుండా ప్రతి రోజు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఐసీఎంఆర్, ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని తెలిపింది. పేద వాళ్ళ కోసం ఫంక్షన్ హాల్స్, కమ్యూనిటీ సెంటర్స్, వెల్ఫైర్ అసోసియేషన్ సెంటర్స్‌ను వాడుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. గతంలో ప్రభుత్వంపై వచ్చిన ఫిర్యాదులపై తాము ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా పాటిస్తున్నారో కౌంటర్ దాఖలు చేయాలని సీఎస్‌ను ధర్మాసనం ఆదేశించింది. (ర్యాపిడ్ కిట్ల వాడకంపై హైకోర్టులో విచారణ) తప్పనిసరిగా అమలు చేస్తాం.. మరోవైపు విచారణ సందర్భంగా కరోనా నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. కరోనా బాధితులు పెరుగుతున్న దృష్ట్యా 857 హోటల్స్ గదుల్లో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ‘కోవిడ్ బారిన పడిన 248 మంది ప్రస్తుతం ఆ హోటల్ గదుల్లో ఉన్నారు. కోవిడ్ బాధితులను ఆస్పత్రుల్లో చేర్చుకునే పద్ధతిని మరింత సులభతరం చేస్తాం. గతంలో హైకోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పని సరి అమలు చేసి,. రిపోర్టు సమర్పిస్తాం. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల రాపిడ్ కిట్లు వాడకంలో ఉన్నాయి. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మరో 4 లక్షల కిట్లు ఆర్డర్ చేశాం ఎమ్ఆర్ఐ, సిటీ స్కాన్లపై ప్రైవేట్ హాస్పిటల్లో ఛార్జ్‌ల విషయంపై వారితో చర్చిస్తున్నాం. వాటిపై ఇప్పటి వరకు 726 ఫిర్యాదు అందాయి. వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చి విచారణ కోరుతున్నాం. ప్రతి రోజు కరోనా పై పూర్తి సమాచారాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు తప్పనిసరిగా అందిస్తాం. ప్రతి హాస్పిటల్స్ వద్ద డిస్‌ప్టే బోర్డ్లను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఎక్కువగా 21-50 ఏళ్ల వయస్సు గల వారే కరోనా బారిన పడుతున్నారు. దీనిని నివరించడానికి అన్ని చర్యలు చేపడుతున్నాం. అని సీఎస్ కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం.. రాపిడ్ కిట్ల వాడకం మరోసారి నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణ ఆగస్ట్ 13కు వాయిదా వేసింది. -
కొత్త రెవెన్యూ డివిజన్‌గా వేములవాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో ఉన్న వేములవాడ, వేములవాడ (రూరల్), చందుర్తి, బోయిన్పల్లి, కోనరావుపేట్, రుద్రంగి మండలాలను కొత్తగా ఏర్పాటు చేసిన వేములవాడ రెవెన్యూ డివిజన్లో విలీనం చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వేములవాడను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వినోద్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఆరు మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని వినోద్ సంతోషం వ్యక్తం చేశారు. -
వైద్యారోగ్య కార్యదర్శిగా ముర్తజా రిజ్వీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అటవీ శాఖకు బదిలీ అయ్యా రు. ఆమె స్థానంలో ఆ శాఖ కార్యదర్శిగా సయీద్ అలీ ముర్తజా రిజ్వీ నియమితులయ్యారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ యోగితా రాణా బదిలీ కాగా, ఆమె స్థానంలో మళ్లీ వాకాటి కరుణ నియమితులయ్యారు. ఈ మేరకు పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధి కారులకు స్థానచలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో కీలక మార్పులు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షల నిర్వహణ తీరు, రోగులకు చికిత్స సదుపాయాలు, ప్రైవేటు ఆస్పత్రుల ఫీజుల దోపిడీ అంశాలపై ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుబడుతూ రాష్ట్ర హైకోర్టు గత కొన్ని రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. హైకోర్టులో ప్రభుత్వ వాదనను సరిగా వినిపించలేకపోయారనే కారణంతో వైద్యారోగ్య శాఖలో కీలక మార్పులు చేసినట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఓఎస్డీగా పని చేస్తున్న రిజ్వీ కొద్దికాలం కిందటి వరకు కేంద్ర ప్రభుత్వంలో డిప్యూటేషన్‌పై కీలక పదవిలో పనిచేశారు. తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీగా, ఉమ్మడి రాష్ట్రంలో హైదాబాద్, నల్లగొండ జిల్లాల కలెక్టర్‌గా వ్యవహరించారు. ముక్కుసూటి వ్యవహారశైలి, దూకుడు పనితీరు కారణంతోనే ప్రస్తుత సంక్షోభ సమయంలో రిజ్వీని రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా నియమించినట్టు చర్చ జరుగుతోంది. వాకాటి కరుణ గతంలో సైతం ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్‌గా పనిచేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన, కేసీఆర్ కిట్స్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఆమెను భూ రికార్డుల ప్రక్షాళన కోసం ప్రభుత్వం మూడేళ్ల క్రితం మిషన్ డైరెక్టర్‌గా నియమించింది. ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఆమె సేవలను ప్రజారోగ్య విభాగానికి అవసరమని భావించి తిరిగి పాత పోస్టుకు రప్పించింది. ►అడిషనల్ సీఈవో - జ్యోతి బుద్ధప్రకాష్ ►వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి - సయ్యద్ అలీ ముర్తుజా రజీ ►అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- శాంతికుమారి ►ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్- అదర్ సిన్హా ►నాగర్‌కర్నూల్ కలెక్టర్- ఎల్ శర్మన్ ►పాఠశాల విద్యా డైరెక్టర్- శ్రీదేవసేన ►హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్- వాకాటి కరుణ ►పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి- కేఎస్ శ్రీనివాసరాజు ►సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి- విజయ్‌కుమార్ ►సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్- యోగితా రాణా ►సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా కొనసాగింపు ►ఆదిలాబాద్ కలెక్టర్- సిక్తా పట్నాయక్ ►పెద్దపల్లి ఇంచార్జ్ కలెక్టర్- భారతీ హోలీకేరి ►గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి- ఇ. శ్రీధర్ ►ప్రత్యేక ప్రధాన కార్యదర్శి- రాణి కుముదిని దేవి ►తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు.. పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్‌కుమార్‌కు అప్పగింత -
17 మంది అదనపు కలెక్టర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 17 జిల్లాలకు కొత్త అదనపు కలెక్టర్లను (స్థానిక సంస్థలు) నియమించింది. ఇందులో 8 మంది ఐఏఎస్, 9 మంది నాన్ ఐఏఎస్ అధికారులున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరుపుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 29 జిల్లాలకు అదనపు కలెక్టర్లను (స్థానిక సంస్థ) నియమించినట్టు అయింది. ఐఏఎస్ అధికారులు అనుదీప్ దురుశెట్టి (భద్రాద్రి కొత్తగూడెం), కోయ శ్రీహర్ష (జోగుళాంబ గద్వాల), అభిలాష అభినవ్ (మహబూబాబాద్), బి.సత్యప్రసాద్ (రాజన్న– సిరిసిల్ల), కుమార్ దీపక్ (పెద్దపల్లి), ఆదర్శ్ సౌరభి (ములుగు), భోర్ఖాడే హేమంత్ సహదేవ్‌రావు (నిర్మల్), తేజస్ నంద్లాల్ పవార్ (మహబూబ్‌నగర్) అదనపు కలెక్టర్లుగా నియమితులయ్యారు. నాన్ ఐఏఎస్ అధికారులైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు కోట శ్రీవాత్సవ (వనపర్తి), జాల్దా అరుణశ్రీ (జగిత్యాల), అనుగు నర్సింహారెడ్డి (కరీంనగర్), కందూరి చంద్రారెడ్డి (నారాయణపేట), ఎన్.నటరాజ్ (కుమ్రంభీం–ఆసిఫాబాద్), వైవీ గణేష్ (జయశంకర్ భూపాలపల్లి), బి.వెంకటేశ్వర్లు (మెదక్), జి.పద్మజారాణి (సూర్యాపేట), డి.శ్రీనివాస్‌రెడ్డి (యాదాద్రి–భువనగిరి)లను అదనపు కలెక్టర్లుగా నియమించారు. యాదాద్రి–భువనగిరి అదనపు కలెక్టర్ జి.రమేశ్‌ను అక్కడి నుంచి బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశించారు. -
‘సీఎం జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : నగర పోలీసులపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ముందు పోలీసులను ఎందుకు పెట్టారని పోలీసులను ఉత్తమ్ ప్రశ్నించారు. ఈ మేరకు బంజారాహిల్స్ డీసీపీతో ఉత్తమ్ ఫోన్లో ప్రశ్నించారు. తనను కలవడానికి వస్తున్న కార్యకర్తలను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అవమానించారన్నారు. సోమేశ్ కుమార్ సీఎస్ పదవికి అనర్హుడని ఉత్తమ్ ధ్వజమెత్తారు. (కొత్త సచివాలయం అవసరమా?) సోమేశ్ ఈ రాష్ట్ర క్యాడర్ కాదని, వైద్యశాఖపై సమీక్షకు గవర్నర్ పిలిస్తే సీఎస్ వెళ్లకపోవడం దారుణమని ఉత్తమ్ అన్నారు. ఒక్క మనిషి మూఢ నమ్మకానికి సచివాలయం కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో న్యాయ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారన్నారు. ఓ వైపు ప్రజలు కరోనా వ్యాధితో కుదేలై పోతుంటే.. మరోవైపు నాయకులు మూఢ నమ్మకాల పేరుతో వేల కోట్లతో కొత్త భవనాలు నిర్మిస్తున్నారని దుయ్యబట్టారు. సచివాలయం మన అందరి ఆస్తి అని, రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని విమర్శించారు. 2012-13లో పూర్తయిన భవనాలు ఇప్పుడు కూల్చడం దారుణమని, సచివాలయం కూల్చివేయడంతో ఈ రోజు బ్లాక్ డే అని పేర్కొన్నారు. (తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం) కరోనా నివారణలో కేసీఆర్ విఫలమయ్యారని ఉత్తమ్ కుమార్ విమర్శించారు. సచివాలయంలో ఆస్పత్రి పెడితే తప్పేంటని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఏపీలో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చారని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులను ఎందుకు నియంత్రించడం లేదని ఉత్తమ్ కుమార్ సందేహం వ్యక్తం చేశారు. -
గ్రేటర్లో కరోనా.. 31వరకు రొటేషన్ డ్యూటీలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగుల రొటేషన్ డ్యూటీల గడువును పొడిగించారు. కరో నా వైరస్ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యం లో ఆయా కార్యాలయ ఉద్యోగుల్లో 50 శాతం మంది రొటేషన్ పద్ధతిలో రోజు విడిచి రోజు/వారం విడిచి వారం విధులకు హాజరు కావాలని గ తంలో జారీచేసిన ఉత్తర్వుల అమలు గడువు ఈ నెల 4తో ముగి సింది. గ్రేటర్లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అవసరాలున్నా తనకు చెబితే తక్షణమే పంపించే లా చర్యలు తీసుకుంటానని మంత్రి హామీనిచ్చారు. గాంధీ ఆసుపత్రిలో పేషెంట్లకు నర్సులు అన్నం తినిపిస్తున్నారని, అలాంటి మా నవత్వం ఇప్పుడెంతో అవసరమని, ఇలాంటి సేవలతో పుణ్యం లభిస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వై ద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, ఫీవర్, గాంధీ ఆస్పత్రుల æ సూపరింటెండెంట్లు డాక్టర్ శంకర్, డాక్టర్ రాజారావు పాల్గొన్నారు. -
మా పనితీరును శంకించొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.. మా పనితీరుని శంకించొద్దు..’అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులను పట్టించుకోవడం లేదని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుందని, ఇది సరైన పద్ధతి కాదని మంత్రి అన్నారు. అలాంటి ప్రచారం వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల మీద నమ్మకం సన్నగిల్లుతుందని, ఇది ప్రజలకు నష్టం చేకూరుస్తుందని చెప్పారు. సోమవారం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులపై పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్న వారి మాటలు ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. చెస్ట్ హాస్పిటల్లో మరణించిన వ్యక్తి అంతకుముందు అనేక ఆస్పత్రులు తిరిగి వచ్చాడన్నారు. అర్ధరాత్రి వచ్చినా కూడా అడ్మిట్ చేసుకుని చికిత్స అందించామని చెప్పారు. కానీ గుండె సమస్యతో చనిపోయాడని, ఇందుకు సంబంధించి వైద్యులు కూడా ప్రకటన చేశారని, కానీ అతనికి ఆక్సిజన్ అందలేదనడం సరికాదని, ఆ వీడియో గమనిస్తే అతనికి ముక్కులో ఆక్సిజన్ పైపున్న సంగతి కనిపిస్తుందని వెల్లడించారు. ఇదే ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు చికిత్స అందించి కరోనా బారిన పడి హెడ్నర్స్ విక్టోరియా చనిపోయిందని, ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తుంటే ఇలాంటి విమర్శలు చేయడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది, వైద్యుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది 3 నెలలుగా విరామం లేకుండా పనిచేస్తున్నారని, కరోనా వచ్చిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు మాత్రమే చనిపోతున్నారని మంత్రి వివరించారు. పరీక్షలు అవసరమున్న వారందరికీ చేస్తామని ప్రకటించారు. జాతీయ సగటు కంటే తక్కువ మరణాలు.. రాష్ట్రంలో కోవిడ్–19 మరణాలు జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్నట్లు ఈటల చెప్పారు. దేశంలో మరణాలు 3 శాతం ఉండగా.. మన రాష్ట్రంలో మాత్రం 1.7 శాతంగా ఉందని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లో బాధితుల సంఖ్య భారీగా ఉందని, హైదరాబాద్‌లో కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమీక్షిస్తున్నారని చెప్పారు. ‘కరోనా పాజిటివ్ ఉండి లక్షణాలు లేని వాళ్లను ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం హోమ్ ఐసోలేషన్‌లో పెట్టి చికిత్స అందిస్తున్నాం. లక్షణాలున్న వాళ్లను మాత్రం వైద్యుల సలహా మేరకు ఆస్పత్రుల్లో చికిత్స చేస్తున్నాం. రేపట్నుంచి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వ ల్యాబ్‌ల ఆధ్వర్యంలో మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతం 2 వేల శాంపిల్స్ మాత్రమే ఉన్నాయి. వీటి పరీక్షలు పూర్తి చేస్తే అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించే వీలుంటుంది. కోవిడ్–19 కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్‌లో లాక్డౌన్ పెడదామని సీఎం అన్నారు..’అని మంత్రి ఈటల స్పష్టం చేశారు. ప్రైవేటుకు వెళ్తే డబ్బులు వృథా కరోనా లక్షణాలున్నవారు కింగ్ కోఠి, చెస్ట్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్‌కి రావాలని మంత్రి ఈట ల సూచించారు. ‘ప్రైవేట్ ల్యాబ్‌లో చేస్తున్న పరీ క్షల్లో 70 శాతం పాజిటివ్ రావడం గమనించాం. ఇది చాలా ఎక్కువని ఆ ల్యాబ్‌ల మీద నిపుణులతో పరిశీలన చేయిస్తున్నాం. తేడాలుంటే ల్యా బ్ యాజమాన్యంపైనా కఠిన చర్యలు ఉంటా యి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17,081 బెడ్లు సిద్ధం గా ఉన్నాయి. అందులో మూడున్నర వేల బెడ్ల కు ఆక్సిజన్ అందుబాటులో ఉందని, మరో ఆరున్నర వేల బెడ్లకు ఆక్సిజన్ సప్లై రెండ్రోజుల్లో పూర్తవుతుంది. ప్రజలు ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్ళి డబ్బులు వృథా చేసుకోవద్దు. రాష్ట్రంలో కొత్తగా 4,700 మంది వైద్య సిబ్బందిని నియమించామని, కొత్తగా 150 అంబులెన్స్‌లు కూడా సమకూర్చుకున్నాం..’అని ఈటల చెప్పారు. అ త్యవసర పరిస్థితి ఉంటే 104 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే అంబులెన్స్ పంపిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వెల్లడించారు. అనుమానితులు గాంధీ ఆస్పత్రికి వెళ్లొద్దని, ముందు పరీక్షలు నిర్వహించిన తర్వాతే తీవ్రతను బట్టి అక్కడికి పంపిస్తామని వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తెలిపారు. -
తెలంగాణలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కరోనా కట్టడి చర్యలను పర్యవేక్షించడంలో భాగంగా కేంద్రం బృందం సోమవారం హైదరాబాద్‌లో పర్యటించింది. నగరంలోని కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు టిమ్స్, గాంధీ ఆస్పత్రులను కేంద్ర బృందం సందర్శించింది. అదేవిధంగా దోమల్‌గూడలోని కంటైన్మెంట్ ప్రాంతాన్ని పరిశీలించింది. చెస్ట్ ఆస్పత్రిలో కరోనా పేషెంట్ మృతికి సంబంధించిన వివరాలను ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ అడిగి తెలుసుకున్నారు. (లాక్‌డౌన్‌పై చర్చించనున్న తెలంగాణ కేబినెట్) అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య శాఖ ఉన్నతాధికారులతో సుమారు ఐదు గంటల పాటు కేంద్ర బృందం చర్చించింది. తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్నచర్యలను అధికారులు కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో సర్వైలెన్స్, కంటైన్మెంట్ చర్యలు, ఆసుపత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరెస్ నివారణ చర్యలపై అధికారులు కేంద్ర బృందానికి వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేశామని తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు, వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్, క్లినికల్ మేనేజ్మెంట్పై కేంద్ర బృందం పలు సూచనలు చేసిందని చెప్పారు. కేసులు పెరుగుతున్ననేపథ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సీఎస్ అధికారులను అదేశించారు. అనంతరం కేంద్రం బృందం ఢిల్లీ బయలుదేరింది. మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై కేంద్ర బృందం నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. -
ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి
-
వాలగానే వేసేద్దాం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి ఏ సమయంలోనైనా మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున వాటిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మిడతల నిరోధక చర్యలపై దృష్టి సారించింది. ప్రస్తుతం మహారాష్ట్రలోనే ఉన్న మిడతల దండు రాష్ట్రంలోకి వచ్చేందుకు అవకాశాలు అలాగే ఉన్నందున, తగిన జాగ్రత్తలపై ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల జిల్లాల కలెక్టర్లు, అటవీ, పోలీసు ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మిడతల దండును ఎదుర్కోవడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎలాంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలో జిల్లా కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. (మిడతల దండు మళ్లీ వచ్చేసింది) సాధారణంగా మిడతల దండు ఉదయం వేళ ప్రయాణం చేస్తుంటుంది. ఈ సమయంలో వీటిని చంపడం అంత సులువు కాదు. చెట్లపై, చేనుపై వాలినపుడే వాటిని చంపేందుకు సులువవుతోంది. దీంతో రాత్రివేళ, వేకువజామున మిడతలను చంపేందుకు సిద్ధపడాలని, అందుకు అవసరమైన సామగ్రిని సిద్ధంగా పెట్టుకోవాలని సీఎస్ కలెక్టర్లను ఆదేశించారు. ముందుగా రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించే సరిహద్దు జిల్లాలను గుర్తించాలి. అన్ని గ్రామాలలోనూ మిడతలు ప్రవేశించే మార్గాలను గుర్తించి, అక్కడి ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతి జిల్లాకు 500 లీటర్ల రసాయనాలను సిద్ధంగా పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రంగు కలిపిన నీటితో గ్రామాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. వీటన్నింటిపై వ్యవసాయ శాఖ త్వరలోనే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ విడుదల చేయనుంది. (ఒమెన్ నుంచి ముంబై వైపు మిడతల యాత్ర!) రూ. 53.55 లక్షలు కేటాయింపు... ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రసాయనాల కొనుగోలుకు, పీపీఈ కిట్లకు జిల్లాకు రూ. 5.95 లక్షల చొప్పున రూ. 53.55 లక్షలు కేటాయించింది. ఈ నిధులను విపత్తు నిర్వహణ నిధుల నుంచి వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. (కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు...) జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ పోలీసు లేదా ఎస్పీ, జిల్లా అటవీ అధికారి, జిల్లా వ్యవసాయాధికారి, జిల్లా ఫైర్ అధికారి, డీపీవోతో పాటు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి కీటక శాస్త్రవేత్తతో కలిపి ప్రతి జిల్లాకు జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మిడతల దాడి జరిగే అన్ని మండలాలు, సరిహద్దు గ్రామాలలో గ్రామ కమిటీలను గుర్తించాలి. ప్రభుత్వ సిబ్బందితోపాటు ప్రభుత్వ సంస్థలు, సంఘాలు, సమూహాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయాలి. మిడతలు ప్రవేశించే స్థలాలను గుర్తించి, వాటిని చంపేందుకు స్ప్రే చేయడానికి తగిన స్థలాన్ని గుర్తించాలి. భారీ వాహనాలు, ఫైరింజన్లు వెంటనే వచ్చేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి. రాత్రివేళ పిచికారీ చేయాల్సి ఉన్నందున లైటింగ్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదకరమైన రసాయనాలు స్ప్రే చేస్తున్నందున పీపీఈ కిట్లు ధరించాల్సి ఉంటుంది. పంటలకు, పశుపక్షాదులకు ఎటువంటి ఆరోగ్య, ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు కూడా అందుబాటులో ఉండేలా చూడాలి. మొక్కల నర్సరీలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వేప పూత ముందుగా చల్లుకోవడం మంచిది. అటవీ ప్రాంతం అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్ సమస్య వచ్చే అవకాశం ఉన్నందున కమ్యూనికేషన్ సెట్ వినియోగించాల్సి ఉంటుంది. -
ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా అర్బన్ పార్కులు
సాక్షి,హైదరాబాద్/మేడ్చల్: రాష్ట్రంలో ప్రభుత్వపరంగా అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రాబోయే రోజుల్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును సీఎస్ సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోడల్ పార్కు (మియావాకి ప్లాంటేషన్)లో రాష్ట్రమంతటా కనీసం ఒక ఎకరంలో భారీగా మొక్కలు నాటి చిట్టడవులుగా మారుస్తామని చెప్పారు. నిధుల కొరతను అధిగమించి శాచురేషన్ పద్ధతిలో అటవీ పునరుజ్జీవ చర్యలు చేపడతామని,ఫెన్సింగ్ నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కొద్దిసేపు పాల్గొన్న మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన ఈ ఆక్సిజన్‌పార్కు ఆహ్లా దకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అటవీ పునరుజ్జీవనం, తేమ పరిరక్షణ తదితర వివరాలను సీఎస్‌కు అధికారులు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 5 కి.మీ పరిధిలో 59 అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 16 న సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఉద్యానవనాల అభివృద్ధిపై చర్చిస్తారని వెల్లడించారు. వీటిలో 32 ఇప్పటికే పూర్తయ్యాయని సీఎస్‌కు పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 95 అటవీ పార్కులు ఏర్పాటు చేయాలనే ప్రణాళికలున్నాయని చెప్పారు. కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు పీసీసీఎఫ్‌లు డీఎఫ్‌వోలు పాల్గొన్నారు. -
యుద్ధప్రాతిపదికన మొక్కల పెంపకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రస్తుత వర్షాకాల సీజన్లో యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో పట్టణాల్లో హరితహారం నిర్వహణపై సమీక్ష జరిపారు. రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవంతో పాటు ఆక్రమణలనుంచి కాపాడాలన్న సీఎం కేసీఆర్ విజన్‌ను అమలు చేయడానికి అధికారులు పచ్చదనం పెంపొందించడానికి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 129 లొకేషన్ల లోని 188 ఫారెస్ట్ బ్లాక్‌లకు సంబంధించి 1.60 లక్షల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించడానికి మొక్కలు నాటడానికి వీలున్న ప్రతీ చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను కోరారు. జీహెచ్ఎంసీ ద్వారా కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్ మెంట్ కార్యక్రమం క్రింద చేపడుతున్న రోడ్లకు ఇరుప్రక్కల, శ్మశాన వాటికలు, పాఠశాలలు, చెరువులు, డ్రైన్ల వెంట నాటాలన్నారు. మెట్రో కారిడార్ల ఇరుప్రక్కలు, మీడియంలు, డిపోల వద్ద పచ్చదనం పెంపొందించాలన్నారు. హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ, హెచ్ఎంఆర్ఎల్, అటవీ శాఖల ద్వారా అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లలో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.క్యాంపా నిధుల కింద అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల అభివృద్ధికి గాను కేంద్రానికి పంపడానికి రూ.900 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ ఫారెస్ట్ బ్లాక్‌ల కోసం క్యాంపా కింద ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఫారెస్ట్ బ్లాక్‌ల భూసమస్యల పరిష్కారం కోసం ఆర్డీఓ, డీఎఫ్ఓ, సంబంధిత ఏజెన్సీలతో ఫారెస్ట్ బ్లాక్ లెవల్ కమిటీని ఏర్పాటు చేసి వారంలోపు పరిష్కరించాలన్నారు. నాటే మొక్కల పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్షించనున్నట్లు సీఎస్ తెలిపారు. -
థర్మల్ స్ర్కీనింగ్ ఏర్పాటు చేశాం: సోమేశ్‌కుమార్
-
వారికి క్వారంటైన్ లేదు: సోమేశ్ కుమార్
సాక్షి, తెలంగాణ: కేంద్ర పౌరవిమానయాన మార్గదర్శకాల ప్రకారం ఆదివారం అర్ధరాత్రి నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాజీవ్‌గాంధీ ఎయిర్ పోర్ట్ నుంచి కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్ ప్రారంభమైనట్లు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సోమవారం రోజున ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల ఆరోగ్యంపై పలు జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రయాణికుల్ని టచ్ చేయకుండా సెన్సార్లు కూడా ఏర్పాటు చేశాం. ప్రతి అంశంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రయాణాల్ని సాగించే ప్రతి ప్రయాణికుడి దగ్గర ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. ఆరోగ్య సేతు యాప్ ఉన్న వాళ్లనే లోపలికి అనుమతిస్తున్నాం. చదవండి: రెడ్ అలర్ట్: ఆ సమయంలో బయటకు రావొద్దు ఇవాళ రాజీవ్‌గాంధీ ఎయిర్ పోర్ట్ నుంచి 19 ఫ్లైట్స్ రావడం మరో 19 ఫ్లైట్స్ వెళ్లడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సెక్యూరిటీ పరంగా, ఆరోగ్య పరంగా ఎయిర్ పోర్ట్‌లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి పరీక్షల అనంతరమే అనుమతిస్తున్నాం. ఎలాంటి కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారంటైన్ లేదు. 1600 మంది ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కి వస్తున్నట్లు' సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. చదవండి: ఏపీలో మరో 44 కరోనా కేసులు -
సొంతూళ్లకు వలస కార్మికులు
-
కరోనాతో మృతి చెందితే ఎక్స్‌గ్రేషియా..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో విపక్ష నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో భేటీ అయ్యారు. కరోనాతో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఇచ్చిన 15 వందల రూపాయలు సరిపోవుని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. 12 కేజీల దొడ్డు బియ్యం కాకుండా నాణ్యమైన బియ్యం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తరుగు పేరుతో రైతుల నుంచి ఎక్కువ ధాన్యం తీసుకుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 80 వేల మందికి కరోనా పరీక్షలు చేస్తే.. తెలంగాణలో ఎందుకు పరీక్షలు చేయడం లేదని ప్రశ్నించారు. కాగా పేదలకు పంచేందుకు కందిపప్పు కేంద్రం నుంచి రాగానే పంపిణీ చేస్తామని సీఎస్ హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ చెప్పారు. సీఎస్‌తో భేటీ అయిన వారిలో ఉత్తమ్‌తో పాటు, చాడ వెంకట్‌రెడ్డి, కోదండరామ్, తదితరులు ఉన్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అన్నం కావాలా..‘అన్నపూర్ణ’ను అడగండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్న సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా రోజూ 2 లక్షల మందికి ఉదయం, సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఎక్కడైనా భోజనం అవసరం ఉంటే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ నంబర్ 21111111 కు సంప్రదించాలని కోరారు. జీహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా ఆహారాన్ని కోరవచ్చు అన్నారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌తో కలసి శుక్రవారం ఆయన టోలిచౌకిలోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు. వండిన ఆహారాన్ని అవసరమైన చోటకు తరలించేందుకు ప్రతీ సర్కిల్లో ఒక ప్రత్యేక వాహనాన్ని సిద్ధంగా ఉంచామని సీఎస్ తెలిపారు. భోజనం విషయమై ప్రభుత్వానికి తగు సహకారం అందించాలని, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
కరోనాను కట్టడి చేస్తాం
సాక్షి, సూర్యాపేట: కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తామని, ఇకపై కేసులు పెరగకుండా కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం ఆయన ఆయా జిల్లాల్లో పర్యటించా రు. డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. సీఎస్ వెంట ఈ పర్యటనలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైన సూర్యాపేట పట్టణంలోని మార్కెట్ బజార్‌ను వారు సందర్శించారు. తర్వాత కలెక్టరేట్లో కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ ఆర్.భాస్కరన్, జిల్లా అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు. అనంతరం సోమేశ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ కట్టడికోసం కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్యాధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 83 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో కరోనాను కట్టడి చేయడానికి అదనపు అధికారులను నియమించినట్లు చెప్పారు. జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ అధికారిని, అలాగే మున్సిపాలిటీకి సంబంధించి సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించామన్నారు. ఇక్కడ ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ ఉండడంతో పూర్తిస్థాయి డీఎంహెచ్ఓను నియమించినట్టు తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలెవరూ బయటకు రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగానికి మరింత ధైర్యం చెప్పేందుకు వచ్చామన్నారు. టీం వర్క్‌తో కట్టడి చేయండి.. టీం వర్క్‌తో కరోనాను కట్టడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్ గద్వాల జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైరస్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, 12 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన మోమిన్‌మహల్లా ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానిక వైద్యాధికారులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కరోనా నియంత్రణ ప్రత్యేక అధికారి రోనాల్డ్‌రాస్, కలెక్టర్ శృతిఓఝా, ఇన్చార్జ్ ఎస్పీ అపూర్వరావు, వైద్యశాఖ, హాట్‌స్పాట్ కేంద్రాల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. ప్రజల్లో అవగాహన పెంచి చికిత్స చేసుకునేందుకు స్వతహాగా ముందుకు వచ్చేలా చూడాలన్నారు. కాగా, జిల్లాలో పాజి టివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం పై సీఎస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా, వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమేశ్‌కుమార్ బృందం.. జిల్లా ప్రత్యేక అధికారి రజత్‌కుమార్ సైనీ, కలెక్టర్ పౌసమి బసు, ఎస్పీ నారాయణ, వైద్యాధికారులతో గంటపాటు సమీక్షించింది. లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, వైరస్ వ్యాప్తి నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పౌసమి వివరించారు. చదవండి: నిర్మాణ రంగ కార్మికులకు...ఆర్థిక భరోసా..! -
కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం
-
సూర్యాపేట జిల్లా డీఎంహెచ్‌ఓపై వేటు
సాక్షి, సూర్యాపేట: జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ నిరంజన్‌పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో నూతన డీఎంహెచ్‌ఓగా డాక్టర్ బి.సాంబశివరావు నియమితులయ్యారు. కాగా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో కరోనా నియంత్రణకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించింది. (మార్కెట్ బజార్లో సీఎస్, డీజీపీ పర్యటన) మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు బుధవారం సూర్యాపేటలో పర్యటించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడానికి కారణమైన మార్కెట్ బజార్లో వీరు పర్యటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా జిల్లాలోని 80 కేసుల్లో.. మార్కెట్ బజార్‌లోని వ్యాపారులు, వారి కాంటాక్టుల నుంచి నమోదైనవి 65 కేసులు ఉన్నాయి. (‘మార్కెట్ బజార్’ అంటే హడల్) ప్రత్యేకాధికారిగా సర్పరాజ్‌అహ్మద్ జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఈ మేరకు జిల్లా ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారి సర్పరాజ్‌అహ్మద్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఎక్త్సెజ్ శాఖ కమిషనర్‌గా ఉన్నారు. అలాగే సూర్యాపేట మున్సిపాలిటీకి కూడా ప్రత్యేక అధికారిని పెట్టారు. మున్సిపల్ పరిపాలనశాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.వేణుగోపాల్‌రెడ్డిని ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన గతంలో నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా పని చేశారు. మున్సిపాలిటీలో కరోనా నియంత్రణ బాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. (క్వారంటైన్లో ఉన్నా గైర్హాజరట!) ‘పేట’ డీఎస్పీ బదిలీ, కొత్త డీఎస్పీగా మోహన్‌కుమార్ సూర్యాపేట డీఎస్పీ ఎం.నాగేశ్వర్రావును మంగళవారం రాత్రి బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన స్థానంలో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా పనిచేస్తున్న ఎస్.మోహన్‌కుమార్‌ను నియమించారు. ఈయన బుధవారం విధుల్లో చేరనున్నారు. సూర్యాపేట డీఎస్పీగా నాగేశ్వర్రావు రెండున్నర సంవత్సరాల పాటు పనిచేశారు. కాగా ఈయన హైదరాబాద్ డీజీపీ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. (కరోనా: ఉప్పు తెచ్చిన ముప్పు! ) -
మీ ప్రాణాలు మీ చేతుల్లోనే: సీఎస్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనురిస్తోంది. కరోనా నియంత్రణ చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలు అవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు బుధవారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వీరు స్యూరాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించి, స్వయంగా పరిశీలన చేయనున్నారు. (క్వారంటైన్లో ఉన్నా గైర్హాజరట!) మార్కెట్ బజార్ లో సీఎస్, డీజీపీ పర్యటన ముందుగా ప్రత్యేక హెలికాప్టర్లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సూర్యాపేట చేరుకున్నారు.ఇందులో భాగంగా సూర్యాపేటపట్టణంలోని కరోనా వ్యాప్తి చెందిన కంటోన్మెంట్ ప్రాంతాలైన కూరగాయల మార్కెట్‌ను సీఎస్ సోమేష్ కుమార్... డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి. జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కరోనా ఏ విధంగా వ్యాప్తి చెందింది మ్యాప్ రూపంలో అధికారులకు మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ... ప్రజలు ఆందోళన చెందవద్దని, కొద్దిరోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని అన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో అధికార యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని, రెడ్ జోన్ ఏరియాలోని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దొని సీఎస్ సూచించారు. మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయని, కొద్దిరోజులు ఓపిక పడితే సమస్య సద్దుమణుగుతుందన్నారు. కాగా సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో 26 కేసులు నమోదు కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 80కి చేరింది. ఇప్పటికే జిల్లాలో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. (‘మార్కెట్ బజార్’ అంటే హడల్) -
మే 7 వరకు లాక్డౌన్ పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్రంలో అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టకపోవడంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగించాలని, కేంద్రం సూచించిన సడలింపులను రాష్ట్రంలోఅమలు చేయరాదని మంత్రివర్గం నిర్ణయించింది. వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కంటైన్మెంట్ జోన్లకు సంబంధించిన 14 రోజుల తప్పనిసరి ఐసోలేషన్ గడువు మే 7తో ముగియనుండటంతో ఆ మేరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యాంశాలివీ.. ♦ కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర వస్తువులు/సేవల రవాణాకు మాత్రమే అనుమతి ♦ సామూహిక ప్రార్థనల్లో పాల్గొనకుండా ప్రార్థన స్థలాలు మూసివేత ♦ ఈ–కామర్స్, యాప్ ఆధారిత, ఆన్లైన్ కంపెనీలు.. ఆహారాన్ని డెలివరీ చేయరాదు.