![Traffic Challan Issued On TS CS Somesh Kumar Govt Vehicle Due To Over Speed - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/29/somesh.jpg.webp?itok=U9eTiMG1)
Traffic Challan Issued To Telangana CS Somesh Kumar Official Vehicle: తప్పు చేస్తే ఎవరినైనా సరే శిక్షించాల్సిందే. ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తామంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. దానిలో భాగంగానే నిబంధనలు పాటించని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక వాహనానికి చలాన్ విధించి తమకు అందరూ ఒక్కటే అని చాటి చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది.
(చదవండి: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా..)
హైదరాబాద్ టోలిచౌకి పీఎస్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్‌పై అధిక వేగంతో సీఎస్ సోమేశ్ కుమార్ వాహనం (TS09FA0001) వెళ్తుండడాన్ని గుర్తించి చలాన్ విధించారు. మూడు వేల రూపాయల చలాన్ కట్టాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు.
చదవండి: సీఎస్ చదివాక సంతకం చేయాలి కదా?
Comments
Please login to add a commentAdd a comment