Traffic challans
-
ఒక స్కూటర్ ట్రాఫిక్ చలాన్లు 311
బెంగళూరు: అరవీర భయంకరంగా బ్యాటింగ్ చేసే బ్యాటర్ క్రికెట్ మైదానంలో 300 పరుగులు చేస్తే అద్భుతం అంటాం. అయితే ఒక గేర్‌లెస్ స్కూటర్ యజమాని క్రికెట్ గ్రౌండ్లో కాకుండా నడిరోడ్డుపై ట్రిపుల్ సెంచరీచేశాడు. అయితే అది పరుగుల రూపంలో కాకుండా ట్రాఫిక్ చలాన్ల రూపంలో. ఒకే స్కూటర్‌పై ఏకంగా 311 ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు ఉండటం చూసి కర్ణాటకలోని వాహన వినియోగదారులు ఔరా అని అచ్చెరువొందారు. ఈ ఘటనకు బెంగళూరు మహానగరం వేదికైంది. సోమవారం బెంగళూరు సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ఈ స్కూటర్ యజమాని ఈ 311 చలాన్లకు జరిమానా కింద రూ.1,61,500 కట్టేసి జప్తులో ఉన్న వాహనాన్ని తీసుకెళ్లడంతో ఈ కథ సుఖాంతంగా ముగిసింది. ఇన్ని చలాన్లు ఎలా ? కలాసిపాళ్య ప్రాంతానికి చెందిన పెరియస్వామికి ఒక గేర్‌లెస్ స్కూటర్ ఉంది. ఇతను ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారం చేస్తాడు. ఇతనికి సమీప బంధువు సుదీప్ వ్యాపార భాగస్వామిగా ఉన్నాడు. సుదీప్‌కు తరచూ స్కూటర్‌పై వెళ్తూనే ఫోన్ మాట్లాడే అలవాటు ఉంది. హెల్మెట్ అస్సలు ధరించడు. ట్రావెల్ ఏజెన్సీ వ్యవహారాలన్నీ బండితోపాటే ఫోన్లోనే నడిపిస్తాడు. అత్యధికంగా ఇతను నడిపేటప్పుడు ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. రెడ్ సిగ్నల్ దాటి వెళ్లడం, రాంగ్ రూట్, హెల్మెట్ ధరించకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఇలా పలు రకాల చలాన్లు అలా పడుతూనే ఉన్నాయి. సుదీప్గానీ, స్కూటర్ యజమాని పెరియస్వామిగానీ ఏనాడూ ఈ చలాన్లు కట్టలేదు. దీంతో చలాన్లు చాంతాడంత పెరిగిపోయాయి. పెరియస్వామి, సుదీప్, మరో వ్యక్తి ఈ స్కూటర్‌ను వాడినట్లు తెలుస్తోంది. ఓ వ్యక్తి ఫిర్యాదుతో శిభమ్ అనే వ్యక్తి సరదాగా చలాన్లను ఆన్లైన్లో చెక్ చేస్తున్న సమయంలో ఈ స్కూటర్ నంబర్‌ప్లేట్ మీద వేల రూపాయల చలాన్లు నమోదైన విషయం గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో శిభమ్ ఇటీవల ఒక భారీ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ స్కూటర్‌పై నమోదైన చలాన్ల సంఖ్యను గత ఏడాది కాలంగా గమనిస్తూ ఉన్నా. ఎప్పటికప్పుడు కొత్త చలాన్లు వస్తూనే ఉన్నాయి. కట్టాల్సిన జరిమానా పెరుగుతూనే ఉంది. ఇప్పుడది రూ.1లక్ష నుంచి రూ.1,60,000 దాటింది. ఇప్పటికైనా పోలీసులు మేలుకొని దానిని సీజ్ చేస్తారా? లేదంటే కొత్త రికార్డ్ సృష్టించేదాకా అలాగే రోడ్లపై తిరగనిస్తారా?’’అంటూ అతను చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. విషయం చివరకు పోలీసులకు తెలియడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఓనర్‌ను పిలిపించి స్కూటర్‌ను స్వాదీనం చేసుకున్నారు. అప్పటికిగానీ ఓనర్‌కు ఈ విషయం తెలియలేదు. పోలీస్‌స్టేషన్‌కు బంధువు సుదీప్‌ను రప్పించి వాళ్ల ముందే చీవాట్లు పెట్టినట్లు వార్తలొచ్చాయి. 311 చలాన్లను ఒకేసారి ప్రింట్ తీస్తే 20 అడుగుల పొడువు పేపర్ బయటికొచి్చంది. ఎట్టకేలకు హెల్మెట్ వందల చలాన్ల గేర్‌లెస్ స్కూటర్ అంశం నగరంలో హాట్‌టాపిక్‌గా మారడంతో పోలీసులు వెంటనే యజమానితో జరిమానా మొత్తాన్ని కట్టేలా ఒప్పించినట్లు వార్తలొచ్చాయి. సోమవారం సుదీప్ ఈ మొత్తాన్ని కట్టేసి వాహనాన్ని వెంటతీసుకెళ్లారు. ఈ సందర్భంగా సుదీప్ ఒక కొత్త హెల్మెట్‌ను ధరించారు. ‘‘ఇకనైనా చలాన్ల సెంచరీలు కొట్టడం ఆపండి’’అని పోలీసులు అతనికి హితబోధ చేసి పంపించారు. జరిమానా కట్టించుకుని ఊరకే వదిలేయకుండా ఇలాంటి వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కొందరు నెటిజన్లు డిమాండ్‌చేశారు. -
తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ట్రాఫిక్ ఛలాన్ల రాయితీ గడువును మరోసారి పెంచారు. వచ్చే నెల(ఫిబ్రవరి) 15వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత పొడిగింపు ఉండదని అధికార వర్గాలు వెల్లడించినా.. పొడిగింపు వైపే ప్రభుత్వం మొగ్గు చూపించినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు అవకాశమిచ్చారు. తొలుత పదిహేను రోజులపాటు అవకాశమిచ్చిన పోలీసులు ఆ తర్వాత జనవరి 10 నుంచి ఈ నెలాఖరు వరకు పొడిగించారు. .. తద్వారా పెండింగ్ చలాన్ల రాయితీ చెల్లింపులకు నెల రోజులకు పైగా సమయం దొరికింది. ఇక.. తెలంగాణ వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లకు గాను ఇప్పటి వరకు 1,52,47,864 చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. -
TS: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు
హైదరాబాద్, సాక్షి: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ఇవాళ్టి(జనవరి 10)తో ముగియాల్సి ఉంది. డిస్కౌంట్ ఛాన్స్ తో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని... గడువు ముగిస్తే అలాంటి అవకాశం ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెబుతూ వచ్చారు. మొత్తం పెండింగ్ చలాన్లు 3 కోట్ల 9 లక్షల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటివరకు కోటీ 7 లక్షల మంది మాత్రమే ఛలాన్లు చెల్లించగా.. రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ క్రమంలో గడువును పొడిగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గడువు పొడిగించిన నేపథ్యంలో.. ఇంకా ఎవరైనా చెల్లించకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై కొద్దిరోజుల కిందట తెలంగాణ సర్కార్ రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
TS Challan: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు నేడే ఆఖరు
నిజామాబాద్: రాయితీపై ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం బుధ వారం ముగియనుంది. కొంత మంది వాహనాదారులు చలాన్లను చెల్లించగా మరికొందరు స్పందించడంలేదు. ప్రభుత్వ అధికారులకు సంబంధించిన వాహనాలకు కూడా జరిమానాలు ఉన్నా ఇంకా చెల్లించనట్లు తెలుస్తోంది. వాహనా లకు ఉన్న జరిమానాలను ఆర్టీసీ బస్సులపై 90శాతం, టూ వీలర్, త్రీవీలర్ వాహనాలకు 80శాతం, ఫోర్ వీలర్, భారీ వాహనాలపై 60 శాతం సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించి నేటి వరకు గడువు విధించింది. 2018 నుంచి 2024 జనవరి 8 నాటికి జిల్లాలో 5 లక్షల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ. 30 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. సోమవారం నాటికి 2.25 లక్షల కేసులకు రూ. 2.50 కోట్లు చెల్లించారు. ఇంకా జిల్లాలో 2.75 లక్షల వరకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గడువు పెంచాలంటున్న వాహనదారులు ప్రజాపాలన కార్యక్రమం కారణంగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవడానికి మీ సేవ, ఆధార్ సెంటర్లు ప్రజలతో సందడిగా మారడంతో ట్రాఫిక్ చలాన్లు చెల్లించలేకపోతున్నామని వాహనాదారులు చెబుతున్నారు. ఆన్లైన్, పేటీఎం ద్వారా చలాన్లు చె ల్లించడానికి అవగాహన లేకపోవడంతో చెల్లించలేకపోతున్నామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం గడువు పెంచితే చెల్లిస్తామని చెబుతున్నారు. వెంటనే చెల్లించాలి రాయితీ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు ప్రభుత్వం ఇచ్చిన గడువు బుధవారం ముగుస్తుంది. జిల్లా లోని వాహనదారులు తమ వాహనాలపై ఉన్న చలాన్లను వెంటనే చెల్లించుకోవాలి. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గడువు పెంపునకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. – నారాయణ, ట్రాఫిక్ ఏసీపీ, నిజామాబాద్ -
TS: చలాన్ల చెల్లింపులపై భారీ స్పందన.. రూ. 67 కోట్లు వసూలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్‌కు విశేష స్పందన లభిస్తోంది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు ప్రభుత్వం భారీగా డిస్కౌంట్ ఇచ్చిన నేపథ్యంలో వాహనాదారులు చలాన్లను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 76లక్షలకు పైగా చలాన్లను క్లియర్ చేసుకున్నారు. రాష్ట్రంలో మూడు కోట్ల 59 లక్షల పెండింగ్ చలాన్స్ కట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 77 లక్షల చలాన్లు క్లియర్ చేసినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వ ప్రసాద్ తెలిపారు. ఈ చలాన్లకు సంబంధించి శనివారం వరకు రూ. 67 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. హైదరాబాద్ కమిషరేట్‌లో రూ. 18 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్‌లో రూ. 14 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌లో రూ. 7.15 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. ట్రాఫిక్ చలాన్ల వెబ్సైట్లో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఫేక్ చలాన్ వెబ్సైట్లను నిలిపివేశామని తెలిపారు. మరోవైపు.. చలాన్ల పెండింగ్‌పై వాహనదారుల స్పందనను గమనించిన ప్రభుత్వం.. చలాన్ల చెల్లింపులపై మరింత వెసులుబాటు కల్పించింది. ఈనెల పదో తేదీ వరకు డిస్కౌంట్‌తో చలాన్లను చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. -
ఆఫర్ ఉందని చలాన్లు కడుతున్నారా ?..జాగ్రత్త !
-
3 రోజుల్లో చలాన్లకు రూ. 8.44 కోట్ల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల నుంచి భారీ స్పందన లభి స్తోంది. పెద్దఎత్తున జరిమానాలు పడిన వాహనదారులు ప్రభుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకుంటు న్నారు. 3 రోజుల్లోనే 9.61 లక్షల చలాన్లకు సంబంధించి రూ.8.44 కోట్ల మేర జరిమానాలను చెల్లించారు. ఈ మేరకు రవాణా శాఖ వర్గాలు వివరాలు వెల్లడించాయి. హైదరా బాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 3.54 లక్షల చలాన్లతో రూ. 2.62 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరి ధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపుతో రూ.1.80 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 93 వేల చలాన్ల నుంచి రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కాగా, చెల్లింపులు అధికంగా ఉంటున్న నేపథ్యంలో సర్వర్ తరచూ మొరాయిస్తున్నట్లు వాహనదారులు తెలిపారు. -
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాహనదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై తెలంగాణ సర్కార్ జీవో విడుదల చేసింది. నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. బైక్‌లు, ఆటోలకు 80 శాతం.. బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ వెహికల్స్‌కు 60 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మంగళవారంనుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ జరిమానాలను రాయితీతో చెల్లించొచ్చు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదా యం రానుంది. దీంతోపాటు పెండింగ్ చలాన్ల పేరిట ట్రాఫిక్ పోలీసులనుంచి ఎదురయ్యే ఇబ్బందునుంచి వాహనదారులకు విముక్తి లభించనుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రూ ల్స్‌ను అతిక్రమించిన వాహనదారుల జరిమానాలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఇటీవల ట్రైసిటీ పరిధిలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులు, సిబ్బంది నగరంలోని వాహనదారులనుంచి జరిమానాలను ముక్కుపిండి వసూలు చేశారు. జరిమానాల్లో 50 శాతం చెల్లిస్తేనే వాహనాలను వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. ఇదీ చదవండి: ‘బావ-బావమరిది చెమట కక్కి సంపాదించారా?’ -
త్వరపడండి చలాన్లపై భారీ డిస్కౌంట్
-
TS: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు ఎదుర్కొంటున్న వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ నేపథ్యంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై భారీ రాయితీలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలపై చలాన్ల మొత్తంలో 80 శాతం రాయితీ ఇచ్చింది. అలాగే కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలపై పెండింగ్ చలాన్ల మొత్తంలో 60 శాతం రాయితీని, ఆర్టీసీ డ్రైవర్లకు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీని ప్రకటించింది. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులో రాయితీలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించడంతో పోలీస్ అధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. https://echallan. tspolice.gov.in/publicview/ వెబ్సైట్లో వాహనదారులు ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో పెండింగ్ చలాన్లను రాయితీపై చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్ చలాన్ల విలువ రూ. 800 కోట్లు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 కోట్ల ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉండగా వాటి విలువ సుమారు రూ. 800 కోట్ల వరకు ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. భారీ రాయితీలు కల్పించడం వల్ల పెండింగ్‌లో ఉన్న చలాన్లను వాహనదారులు చెల్లిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 30న తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో మెగా జాతీయ లోక్ అదాలత్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చిలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులపై ఇదే తరహాలో ఇచ్చిన డిస్కౌంట్‌ను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వాహనదారులు సద్వినియోగం చేసుకోగా జిల్లాల్లోని వాహదారులకు ఈ అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన లేక ఆశించినట్లు వినియోగించుకోలేకపోయారని అధికారులు తెలిపారు. అప్పట్లో సుమారు రూ. 350 కోట్ల మేరకు రాయితీలను ఉపయోగించుకొని వాహనదారులు చెల్లింపులు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం. రాయితీలు ఇలా.. ద్విచక్ర వాహనాలు,ఆటోలు 80% కార్లు, ట్రక్కులు, ఇతర భారీ వాహనాలు 60% ఆర్టీసీ డ్రైవర్లు,తోపుడు బండ్లకు..90% -
TS: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చలాన్ల చెల్లింపుల్లో వాహనదారులకు ఊరట అందించింది. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది. వివరాల ప్రకారం.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ ఆఫర్ ఇచ్చారు. చలాన్ల చెల్లింపులో భారీ డిస్కౌంట్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. ఇక, ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు. చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు. చలాన్లలో డిస్కౌంట్ ఇలా.. ►ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్ ► ద్విచక్ర వాహనాల చలాన్లకు 80 శాతం డిస్కౌంట్ ►ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్ ►లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్. కాగా, నవంబర్ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. మరి ఈసారి ఎలా ఉండనుందో చూడాలి. -
TS: మళ్లీ ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్?
హైదరాబాద్, సాక్షి: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు గతంలో చేపట్టిన కార్యాచరణను మరోసారి అమలు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో అతిత్వరలో చలాన్లపై రాయితీల ప్రకటన అధికారికంగా చేయనుంది. అయితే ఈసారి ఆ రాయితీలు భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు విధించడం సాధారణమే. కేవలం రాజధాని హైదరాబాద్‌లోనే కాకుండా.. చిన్నచిన్న పట్టణాల స్థాయి దాకా ఉల్లంఘనకు ఛలాన్ల విధింపు ఉంటోంది. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికత కారణంగా ఈ పని మరింత సులభతరం అయ్యింది. అయినా కూడా చలాన్లు చెల్లించడం లేదు చాలా మంది. దీంతో పెండింగ్ చలాన్ల సంఖ్య పెరిగిపోతోంది. నవంబర్ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని.. అదీ కొత్త ఏడాది కానుకగా ఇవ్వాలనే ఆలోచనలో పోలీస్ శాఖ ఉన్నట్లు సమాచారం. న్యూఇయర్‌కి.. కుదరకుంటే జనవరి చివరకు దీనిపై ప్రకటన చేయొచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి. గతంలో.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. మరి ఈసారి ఎలా ఉండనుందో చూడాలి. ఇదీ చదవండి: వైన్ షాపులు.. కావవి బార్లు! -
ట్రాఫిక్ చలాన్ల స్కాం: పోలీసులే దొంగలైతే.. రూ. 3.23 కోట్లు స్వాహా..
హర్యానా: హర్యానాలో హవాల్దార్ జనక్, ఓంబీర్ అనే ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ట్రాఫిక్ చలాన్ సొమ్మును ప్రభుత్వ ఖాతాలో కాకుండా తమ వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకుంటూ దాదాపుగా మూడు కోట్లు దోచుకున్నారు. ఇద్దరిలో ఒక కానిస్టేబుల్ జనక్ పోలీసులకు పట్టుబడగా మరో కానిస్టేబుల్ ఓంబీర్ మాత్రం పరారీలో ఉన్నాడు. పాల్వాల్ స్టేషన్లో వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీగ లాగితే.. కొద్దీ రోజుల క్రితం హర్యానా ఎస్పీ లోకేంద్ర సింగ్ మే నెలలో విధించిన ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన నివేదికను కోరగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హర్యానా ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న జనక్, ఓంబీర్ ఇద్దరూ చేతులు కలిపి ఈ చలానా సొమ్ములో చిన్నమొత్తాన్ని ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్లలో వేస్తూ మిగిలింది తమ ఖాతాలోకి దారి మళ్లించారు. ప్రభుత్వ అకౌంట్లో కాకుండా.. ట్రాఫిక్ డీఎస్పీ సందీప్ మోరే తెలిపిన వివరాల ప్రకారం.. చాలా కాలంగా మా ఖాతాలో ఏ రోజుకు ఆ రోజు వేయాల్సిన సొమ్మును 15 రోజులకు ఒకసారి వేస్తూ ఉండటంతో అనుమానం వచ్చి జనవరి 2020 నుండి మార్చి 2023 వరకు రికార్డులను పరిశీలిస్తే ఈ స్కాం బయటపడింది. ఈ కానిస్టేబుళ్లు ఇద్దరూ కలిసి కరోనా సమయం నుండి మొదలుపెట్టి ఇప్పటివరకు సుమారు 3.23 కోట్లు స్వాహా చేశారని తెలిపారు. మూడు సంవత్సరాల నుండి.. 2020 జూన్, అక్టోబర్ నెలల్లో మొత్తం రూ. 14 లక్షలు చలాన్ల రూపంలో రావాల్సి ఉండగా వీరు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని తెలిపారు. బహుశా నకిలీ చలాన్లు సృష్టించి వీళ్ళు మాయ చేసుంటారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆగస్టు 1 నుండి 31 వరకు సుమారు రూ. 1.4 లక్షలు డిపార్ట్ మెంటుకు రావాల్సి ఉండగా అందులో రూ.14,500 తగ్గిందని, అక్టోబరులో రూ.1800 తగ్గిందని ఇలా వీరు గడిచిన మూడు నాలుగేళ్ళలో కేవలం రూ.30 లక్షలు మాత్రమే డిపార్ట్ మెంట్ ఖాతాలో వేసి మిగిలిన రూ.3.23 కోట్లు కాజేశారని తెలిపారు. ఇది కూడా చదవండి: పెళ్ళైన ఒక్క రోజుకే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నవవధువు.. -
సూర్యుడికి పంచ్.. వీళ్లకి పోలీసుల పంచ్
సూర్యుడు, జనం ‘యూ హౌమచ్ అంటే యూ హౌమచ్’ అనుకుంటున్నారు. ‘అంతు చూస్తా’ అని ఎండలాయన అంటుంటే ‘మగ్గు తీస్తా’ అని సామాన్యుడు కౌంటర్ వేస్తున్నాడు. ఈసారి ఎన్నడూ లేనంతగా వేడి ఉండటంతో జనం బయటకు బయలుదేరుతూ బకెట్ నీళ్లు, మగ్గు తీసుకెళుతున్నారు. మధ్య దారిలో మగ్గుడు నీళ్లు కుమ్మరించుకుని సూర్యుడికి పంచ్ ఇస్తున్నారు. అయితే ఇలా చేసే వారికి పోలీసులు వేసే పంచ్ వెరైటీగా ఉందనుకోండి. ఈ వైరల్ విశేషాలు... మనకు ఎండలు, ఉష్ణం ఎక్కువ కనుకనే ‘చల్లగా బతుకు’ అనే ఆశీర్వాదం పుట్టింది. కాని వేసవిలో ఎంత కాకలు తీరిన వారైనా– ఏసిలు, కూలర్లు పెట్టుకున్నా– ఇష్షో బుష్షో అంటూ ఉబ్బరింతతో తబ్బిబ్బరింత అవడం సర్వసాధారణం అయింది. ఏ ఏడుకాయేడు ఎండలు పెరగడమే తప్ప కూల్ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ సంవత్సరమైతే ఉడుకు పీక్ మీద ఉంది. కాని బయటకు వెళ్లక తప్పదు. పనులు చేసుకోక తప్పదు. ఈ ఎండ దెబ్బకు కొందరైతే తిక్క వేషాలు కూడా వేస్తున్నారు. తమిళనాడులోని తంజావూరులో అరుణాచలం అనే కుర్రాడు స్కూటర్ ముందు నీళ్ల బకెట్ పెట్టుకొని ఒక చేత్తో నడుపుతూ మరో చేత్తో మగ్గుతో నీళ్లు కుమ్మరించుకుని వైరల్ అయ్యాడు. ఆరాటంలో నీళ్లు కుమ్మరించుకోవడం అతనికి సరదాగానే ఉన్నా పోలీసులు మాత్రం ‘అలా చేయకూడదు నాన్నా’ అని ముద్దు చేశారు. వారు ముద్దు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? 2000 ఫైన్ పడుద్ది. నీళ్లు కుమ్మరించుకున్నందుకు అరుణాచలం, ఆ వీడియో తీసినందుకు అతని స్నేహితుడు ప్రసన్న చెరో వెయ్యి వేసుకుని లాఠీ సెగ తగలకుండా బయటపడ్డారు. థానేలో జంట... ఇటు అరుణాచలం ఫీట్ వార్తల్లో ఉండగానే అటు ముంబై సమీపంలోని థానేలో ఆదర్శ్ శుక్లా అనే యూ ట్యూబర్‌కు కూడా ఎండ వల్ల మైండ్ బెసికింది. ఒక నీళ్ల బకెట్టును, స్నేహితురాలిని స్కూటర్ మీద కూచోబెట్టుకుని చౌరాస్తాకు చేరుకుని ఆమె చేత మగ్గుల కొద్దీ నీళ్లు కమ్మరించుకున్నాడు. జనానికి కాలక్షేపం, తనకు నాలుగు సబ్స్క్రిప్షన్లు అనుకున్నాడేమో కాని పోలీసులు వెంటనే స్పందించి ‘తగిన చర్య తీసుకొనబడును’ అని సందేశం పంపారు. దాంతో బేర్మన్న యూ ట్యూబర్ ‘సారీ... హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తప్పే. ఫైన్ కడతా’ అని వీడియో రిలీజ్ చేశాడు. కాని ట్రాఫిక్‌లో తనకు, ఎదుటివారికి ప్రాణాంతకం కాగల ఫీట్ చేసినందుకు కదా పోలీసులు ఫైన్ వేస్తారు. అది మర్చిపోయాడు. ఎండలకు వీలైనంత చల్లగా ఉండండి. ఇలాంటి క్రేజీ ఐడియాల జోలికి పోకండి. -
ట్రాఫిక్ చలాన్లతో పోలీసులు వేధిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పోలీసులు వాహనదారులను ట్రాఫిక్ చలాన్లతో వేధిస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో ఆరోపించారు. శనివారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడో చాటుగా ఉండి ఫొటోలు తీసి, చలాన్లు వేస్తున్నారని తెలిపారు. కృష్ణానదీ జలాల పంపిణీ సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు. వర్షాలొస్తే కుంటలు ఉప్పొంగి పాత బస్తీలో చాలా ప్రాంతాలు జలమయమతున్నాయని, ఈ నేపథ్యంలో జలాశయాలకు మరమ్మతులు చేయాలని కోరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు వివిధ బోర్డుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీలో మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆరోగ్య శ్రీ కార్డులను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించడం లేదని, ఈ పథకం కింద చికిత్సలకు నిధులు పెంచాలని కోరారు. వివి ధ కారణాలతో తొలగించిన హోంగార్డులను మానవీయకోణంలో తిరిగితీసుకోవాలన్నారు. -
వాహనదారులకు బంపర్ ఆఫర్.. చలాన్లపై 50 శాతం డిస్కౌంట్..!
బెంగళూరు: పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఫిబ్రవరి 11 వరకు చలాన్లపై 50 శాతం డిస్కంట్ ఇస్తున్నట్లు తెలిపింది. వాహనదారులు పేటీఎం, ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా చెల్లింపులు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. అందరికీ న్యాయం చేకూర్చేలా ట్రైఫిక్ ఫైన్లపై రాయితీ కల్పించాలని కర్ణాటక స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ తీర్మానం చేసింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు ఈ ప్రతిపాదన పంపింది. దీంతో కర్ణాటకవ్యాప్తంగా చలాన్లపై 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రవాణా శాఖ విడుదల చేసింది. ఫిబ్రవరి 11 వరకు విధించే ట్రాఫిక్ చలాన్లపై 50శాతం డిస్కంట్ వర్తిస్తుందని చెప్పింది. అయితే ఈ ఆఫర్ ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. చదవండి: దారుణం.. అమ్మాయితో చాటింగ్ చేస్తున్నాడని 20 ఏళ్ల యువకుడిని.. -
బాబోయ్ చలాన్ల బాదుడు.. అలా చేస్తే 2వేలు, 10వేల వరకు జరిమానా
ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడంతో పాటు ప్రమాదాలకు కారణమయ్యే వాహనదారుల భరతం పట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం మోటారు వెహికల్ యాక్ట్‌లో తాజాగా కీలక సవరణలు చేసింది. ఈ మేరకు జరిమానాల మోత మోగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గురువారం నుంచి రాష్ట్రంలో కొత్త రోడ్డు భద్రతా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సాక్షి, చెన్నై: రాజధాని చెన్నై సహా అనేక నగరాల్లో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. కేవలం సిటీ దాటేందుకే గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనూ కొందరు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అలాగే అనేక ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాజాగా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. హెల్మెట్, సీట్ బెల్ట్‌లు ధరించకుండా వాహనాలు నడిపే వారిని, త్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహనదారులను, సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా దూసుకెళ్లే కుర్ర కారును, రాత్రుల్లో మద్యం తాగి నడిపే వారిని, బైక్ రేసింగ్‌లు నిర్వహిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకునే వారిని ఇకపై ఊపేక్షించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా మోటార్ వెహికల్ యాక్ట్‌లో సవరణలు చేసింది. ఫలితంగా జరిమానాల వడ్డనే కాదు, నిబంధనలు కూడా మరింత కఠినమయ్యాయి. ఇందుకు తగ్గట్లు చెన్నైలో అనేక మార్గాల్లో పెద్దఎత్తున నిఘా నేత్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నేరగాళ్లను, ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టనున్నారు. అమల్లోకి కొత్త జరిమానాలు.. ఇకపై అతివేగంగా వాహనం నడిపే వారికి తొలిసారి రూ. 1000, మళ్లీ పట్టుబడితే రూ. 10 వేలు జరిమానా విధించనున్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు రూ. 2 వేల విధించనున్నారు. మానసికంగా, ఆరోగ్య రీత్యా సామర్థ్యం లేని వారు వాహనాలు నడిపితే తొలిసారి రూ. 1000, రెండోసారి రూ. 2 వేలు వసూలు చేస్తారు. అంబులెన్స్, అగ్నిమాపక వంటి అత్యవసర సేవల వాహనాలకు దారి ఇవ్వకుండా వ్యవహరించే వాహనదారులకు విధించి ఫైన్‌ను రూ. 10 వేలుకు పెంచారు. నిషేధిత ప్రాంతాల్లో హారన్ ఉపయోగిస్తే రూ. 1000, రిజిస్ట్రేషన్లు సక్రమంగా లేని వాహనాలకు తొలిసారి రూ. 2,500, తర్వాత రూ. 5,000 , అధిక పొగ వెలువడే వాహనాలకు రూ. 10 వేలు, బైక్ రేసింగ్‌లకు పాల్పడే వారి నుంచి రూ. 10 వేల వరకు ఫైన్ వసూలు చేస్తారు. అలాగే హెల్మెట్ ధరించని వారికి రూ. 1000, సిగ్నల్ దాటితే రూ. 500 జరిమానాగా నిర్ణయించారు. లా అండ్ ఆర్డర్ పోలీసులకూ ఆ అధికారం.. ట్రాఫిక్ పోలీసులే కాదు, ఇకపై లా అండ్ ఆర్డర్ విభాగంలోని ఎస్ఐ, ఆ పైస్థాయి అధికారుల కూడా వాహనాలు తనిఖీ చేసేందుకు, జరిమానా విధించేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు మోటారు వెహికల్ యాక్ట్‌లో మార్పులు చేశారు. రవాణాశాఖ చెక్‌పోస్టులు మినహా తక్కిన అన్ని ప్రాంతాల్లో పోలీసులు జరిమానా విధించే నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. -
హెల్మెట్ లేకుంటే నా ‘తోపుడు బండి’ని ఆపేస్తారు సార్..!
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఎవరూ లేరు కదా అని హెల్మెట్ పెట్టుకోకపోయినా.. నిఘా కెమెరాల ద్వారానే చలాన్లు జారీ చేస్తున్నారు పోలీసులు. దీంతో భారీగా జారీ అవుతున్న చలాన్లతో ప్రజలు బెబెలెత్తిపోతున్నారు. కొందరు సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారుకూడా. ఈ క్రమంలో తోపుడు బండిపై కూరగాయలు విక్రయించే వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హెల్మెట్ లేకుంటే నా బండిని పోలీసులు ఆపేస్తారు సార్ అంటూ అతడు చెప్పిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీడియోను షాకాస్మ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. తోపుడు బండికి హెల్మెట్ ఎందుకు ధరించావని వీడియో తీసిన వ్యక్తి అడిగాడు. దానికి,హెల్మెట్ లేకుంటే పోలీసులు అడ్డుకుంటారని సమాధానమిచ్చాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో ఈ నిబంధన కేవలం బైక్‌లకు మాత్రమేనని ఆ వ్యక్తికి వివరించే ప్రయత్నం చేశాడు వీడియో తీసిన వ్యక్తి. ట్విటర్లో వీడియో షేర్ చేస్తూ బ్రదర్ నీ తెలివి అమోఘం అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అక్టోబర్ 9వ తేదీన వీడియో పోస్ట్ చేయగా.. 28,800వ్యూస్ వచ్చాయి. దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఫైన్లు వేస్తున్నారనే కారణంగా అమాయకులు భయపడుతున్నారు, చాలా బాధకరమైన విషయం, సరైన అవగాహన లేదు అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. కొందరి తప్పుడు సూచనలతో అమాయకులు భయపడుతున్నారంటూ మరొకరు పేర్కొన్నారు. Bhai apka knowledge to Kamal hai bhai 🤣🤣 pic.twitter.com/twjvQhNe6a — ShaCasm (@MehdiShadan) October 9, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం -
హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్లపై వాహనదారుల గరంగరం
-
పోలీసుల చలాన్లపై వాహనదారులు గరంగరం.. మైత్రివనంలో హైటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లు వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తమ బైక్‌లపై ట్రాఫిక్ చలాన్ విధించారని మైత్రివనం దగ్గర ట్రాఫిక్ పోలీసులతో వాహనదారులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి బైక్ స్టాప్‌లైన్‌ను దాటించాడని బైక్‌పై పోలీసులు చలాన్ విధించారు. దీంతో, ఆగ్రహానికి లోనైన బైకర్.. తన బైక్‌కు తానే నిప్పంటించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పివేశారు. కాగా, పోలీసులు నగరంలో చాలాచోట్ల ట్రాపిక్ నిబంధనలు పాటించని వారికి చలాన్లు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే తనిఖీల్లో పాత చల్లాన్లు ఉంటే కట్టాలని కూడా కోరుతున్నట్టు సమాచారం. అయితే, సోమవారం నుంచి హైదరాబాద్‌లో ఆపరేషన్ రోప్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దీంతో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త రూల్స్ ఇవే.. ► స్టాప్ లైన్ దాటితే రూ.100 జరిమానా ► ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే 1,000 జరిమానా ► ఫుట్‌పాత్‌లను ఆక్రమించినా, వాహనాలను అడ్డంగా పార్క్ చేసినా జరిమానా విధిస్తారు. -
‘చలాన్ల బాదుడు.. కేసీఆర్ ఎన్ని కోట్లు వసూలు చేశారో తెలుసా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారు. తాజాగా ప్రజల రక్తమాంసాలను పీల్చేస్తూ.. ట్రాఫిక్ చలాన్ల రూపంలో కేసీఆర్ సర్కార్ మరో స్కామ్ చేస్తోందని కాంగ్రెస్ నేత, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మండిపడ్డారు. మధు యాష్కీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో 2014లో ట్రాఫిక్ చలాన్ల కేసులు 50 లక్షలుగా ఉండి ఫైన్ల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ. 95 లక్షలుగా ఉంది. ఇక, కేసీఆర్ సర్కార్ పాలనలో 2021లోనే కేసుల సంఖ్య 2 కోట్లకు పైనే ఉండగా.. చలాన్ వేసిన మొత్తం రూ.877 కోట్లకు చేరింది. టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో 9 కోట్ల కేసులు పెట్టి.. రూ. 2,671 కోట్ల రూపాయలను ఫైన్లుగా వసూలు చేశారు. అర్దరాత్రి వరకూ బార్లకు, వైన్ షాపులకు అనుమతులు ఇచ్చి.. ఆయా షాపులు పక్కనే చీకట్లో మాటేసి, డ్రంకన్ డ్రైవ్ పేరుతో చలాన్లు బాదేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దారి దోపిడీ దొంగల కన్నాహీనంగా మారి చలాన్లు, ఫైన్ల పేరుతో నిలువు దోపిడీ చేస్తోంది. ట్రాఫిక్ అధికారులను కేవలం ఫొటోలు తీసేందుకు, చలాన్లు రాసేందుకు మాత్రమే అన్నట్లుగా మార్చేసింది. ఇన్ని వేల కోట్ల రూపాయలను దోచుకుని కూడా హైదరాబాద్ నగరంలో రోడ్లను మాత్రం బాగుచేయడం లేదు. చలాన్ల సొమ్మును ఎక్కడ ఖర్చు పెట్టిందే శ్వేత పత్రం విడుదల చేయాలి. ఔరంగజేబు జిజియా పన్ను వేసినట్లుగా కేసీఆర్ వాహనదారులపై చలాన్ల పన్నేస్తూ జేబులు గుల్ల చేస్తున్నాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు చలాన్లపై కేసీఆర్ సర్కార్‌ను నిలదీయాలి’’ అని కోరారు. ఇది కూడా చదవండి: మల్లారెడ్డా మజాకా మామూలుగా ఉండదు.. మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిండు.. -
బ్రదరూ! అక్కడుంటాడొకడు.. క్లిక్మనగానే ఇంటికి డైరెక్టుగా ట్రాఫిక్ చలానా!
టాఫిక్ పోలీస్ లేడని దర్జాగా దూసుకెళ్లినా.. నిబంధనలు అతిక్రమించినా ఒకడున్నాడు చూడ్డానికి. ఇకపై కూడళ్ల వద్ద మిమ్మల్ని నిరంతరం పర్యవేక్షిస్తాడు. ఏమాత్రం నిబంధనలు పాటించకపోయినా క్లిక్‌మని జరిమానా వేసేస్తాడు. – కాజీపేట ఇకపై ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే మీ జేబుకు చిల్లు పడడం ఖాయం. ఎందుకంటే కాజీపేట చౌరస్తాలో ఇటీవల కొత్తగా ఆటోమెటిక్ ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమల్లోకి వచ్చింది. చక్కగా తన పనితాను చేసుకుంటూ వెళ్తోంది. ఇక ముందు బీట్ కానిస్టేబుల్ చౌరస్తాలో నిలబడి నిబంధనలు అతిక్రమించిన వాహనదారుల ఫొటోలు తీసి జరిమానా విధించే పని ఉండదు. ఆటోమెటిక్ కెమెరాలు తీసిన ఫొటోల ఆధారంగా నేరుగా ఈ–చలానా ఇంటికే వచ్చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ వంటి నగరాల్లో ఈవిధానం అమలవుతుండగా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటన్నింటికోసం వరంగల్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి నిర్వహణ కొనసాగించనున్నారు. (చదవండి: బిహార్‌లో హైదరాబాద్ పోలీసులపై కాల్పులు) ఈ నిబంధనలు పాటించాల్సిందే.. ► హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దు ► రాంగ్ రూట్లో ప్రయాణించొద్దు ► వాహనాలపై పరిమిత సంఖ్యలో ప్రయాణించాలి ► ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించొద్దు ► నంబర్ ప్లేట్ వంచొద్దు. స్టిక్కర్లు అంటించొద్దు. ఈవిధానంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రాంతం నుంచి వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వారి ఫొటోలు ఈకెమెరాల్లో నిక్షిప్తమై కంట్రోల్ కేంద్రం నుంచి ఆటోమెటిక్‌గా ఈ–చలానా వాహనదారులకు చేరేలా ఏర్పాటు చేశారు. త్వరలో ఏఎంపీఆర్ విధానం ఆటోమెటిక్‌గా ఇంటిగ్రెటేడ్ కమాండ్ కంట్రోల్ విధానం అమలు అనంతరం అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఏఎంపీఆర్ (ఆటో మెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్) అమలు చేయనున్నట్లు సమాచారం. ఎవరైనా తమ వాహనం నంబర్లో ఒక సంఖ్య తొలగించి వాహనం నడిపితే సీసీ కెమెరాల్లో ఆవాహనం ఫొటో నిక్షిప్తమై తొలగించిన నంబర్‌ను గుర్తు పడుతోంది. అనంతరం ఆయజమాని సెల్‌ఫోన్‌కు ఈ–చలాన్ ద్వారా జరిమానా విధిస్తుంది. (చదవండి: లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే ఇంట్లో కూర్చోవాలి: బండి సంజయ్) -
అన్న హత్యకు సుపారీ ఇచ్చిన ఘనుడు.. మన డీటీఓ సార్ భద్రునాయక్
ఆయన జీవితం ఆద్యంతం వివాదాస్పదమే.. వృత్తిలో.. నిజ జీవితంలో.. పుట్టి పెరిగిన ప్రదేశంలో.. పనిచేసే చోట ఎక్కడైనా తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్న అతని నేర ప్రవృత్తి తార స్థాయికి చేరింది. పాపం పండటంతో తను పన్నిన కుట్రలన్నీ బయటపడ్డాయి. సొంత అన్నను హత్య చేసేందుకు కిరాయి హంతక ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని, ఓ యువకుడి హత్యకు కారణమైన అతను పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా చేసింది ఓ రౌడీ షీటరో.. పాత నేరస్తుడో కాదు.. ఈ ఘనతలన్నీ మన డీటీఓ సార్ భద్రునాయక్వే.. వికారాబాద్: రెండేళ్ల క్రితం వికారాబాద్ డీటీఓగా విధులు చేపట్టిన భద్రునాయక్‌కు వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుంది. జిల్లాలో లారీల్లో ఓవర్ లోడ్ (కెపాసిటీకి రెండింతలు) వేసేందుకు ఓనర్ల నుంచి నెలనెలా మూమూళ్లు తీసుకుంటాడనే ఆరోపణలున్నాయి. ఓవర్‌లోడ్ కారణంగా.. వేసిన కొద్ది రోజులకే రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఈ విషయాన్ని ఆర్అండ్బీ, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు బాహాటంగా చెబుతున్నారు. ఇక లైసెన్సులు, ఫిట్నెస్, ప్రధానంగా వ్యవసాయ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ల సమయంలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిమిత రుసుముకు మూడు నుంచి పది రెట్లు ఎక్కువ మొత్తం వసూలు చేస్తాడని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇతని తీరును నిరసిస్తూ ఏకంగా డీటీఓ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. వాహనదారులతో దురుసు ప్రవర్తన, దుర్భాషలాడటం వంటి కారణాలతో వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు డీటీఓ భద్రునాయక్ తనను దుర్భాషలాడారని ఇటీవల ఓ వ్యక్తి చన్గొముల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ వాహనాన్ని అడ్డుకుని సీజ్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సమయంలో పలువురు వాహనదారులు, ప్రజలు బాధితుడికి అండగా వచ్చారు. భద్రునాయక్ ఆగడాలపై మండిపడుతూ నిరసన వ్యక్తంచేశారు. ఇంత జరిగినా.. డీటీఓపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇందులో కొందరు నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని పీఎస్‌లోనే పంచాయితీ పెట్టి.. బాధితుడు ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా ఒప్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆయనపై కేసు నమోదు కాకుండా జిల్లా పోలీసులే గట్టెక్కించారని తెలిసింది. జిల్లా రవాణాధికారిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారనే వార్తలు శుక్రవారం సంచలనంగా మారాయి. పోలీసులు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయాలపై శనివారం ఉదయం వరకు స్పష్టత లేకపోవడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగింది. వసూళ్లకు ముఠా ఏర్పాటు రెండేళ్లుగా వికారాబాద్ డీటీఓగా విధులు నిర్వహిస్తు న్న భద్రునాయక్ అనేక వివాదాలకు తెరతీసినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు నోరు మెదపక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆదాయ వనరు లు సమకూర్చుకునేందుకు తన కార్యాలయానికి చెందిన కొందరు కింది స్థాయి ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, ఆర్టీఏ బ్రోకర్లతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నా యి. ఈయన క్యాడర్ ఎంవీఐ అయినప్పటికీ తన పలుకుబడితో డీటీఓగా పోస్టింగ్ వేయించుకుని రెండేళ్లుగా వికారాబాద్‌లో తిష్ట వేయడం గమనార్హం. విచారణలో కొత్త కోణాలు సొంత అన్నను హత్య చేయించేందుకు రూ.కోటితో పాటు ఎకరం పొలం ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్న భద్రునాయక్‌ను అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విచారణలో ఆయన పనిచేస్తున్న రవాణా శాఖతో పాటు అవినీతి నిరోధక శాఖల పనితీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. అన్నను హత్య చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకోవడం, భద్రునాయక్ అక్రమాస్తుల చిట్టాను ఏసీబీకి చెబుతానని సొంత అన్నే అతన్ని బెదిరిస్తూ రావడం, భద్రునాయక్ అనేక చోట్ల అక్రమ ఆస్తులు కలిగి ఉండటం అవినీతి నిరోధక, ఇన్కమ్ ట్యాక్స్ శాఖల నిఘా వైఫల్యాలను సూచిస్తోంది. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయన ఆగడాలను ఉపేక్షిస్తుండటం ఆర్టీఏ ఉన్నతాధికారుల డొల్లతనం, లోపాయికారీ ఒప్పందాలను ప్రస్ఫుటం చేస్తోంది. ప్రవీణ్ హత్య కేసును విచారణ చేస్తున్న సూర్యాపేట పోలీసులు భద్రునాయక్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేయగా.. అతనిపై చేసిన ఫిర్యాదును బుట్టదాఖలు చేయించి, ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చేసిన మన జిల్లా పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. -
Hyderabad: తాగి బండి నడిపితే జైలే.. బీఏసీ 300 దాటిందంటే ఇక అంతే!
బంజారాహిల్స్: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో 85 శాతం మంది యువతే ఉంటున్నారు. జైలుకు వెళుతున్న వారిలో సైతం ఎక్కువగా యువకులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రతిరోజు వేర్వేరు చోట్ల శ్వాస విశ్లేషణ పరీక్షలు (బ్రీత్ ఎనలైజర్) నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారిపై కోర్టులో అభియోగపత్రాలు సమర్పిస్తున్నారు. కేసు నమోదు చేస్తే జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని తెలిసినా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిలో 85 శాతం మంది 18–40 ఏళ్ల వారే ఉంటున్నట్లు ఇటీవల పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ పరిధిలోని ఐదు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) 300 పైన నమోదైన వారికి జైలుశిక్ష విధించారు. బీఏసీ 397గా నమోదైన ఓ డ్రైవర్‌కు వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో బీఏసీ 300కు పైగా నమోదైన వాహనదారులు 9 మందికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా కూడా విధించారు. చదవండి👉🏻 ఖమ్మంలో వనజీవి రామయ్యకు రోడ్డు ప్రమాదం 485 మంది కోర్టులో హాజరు.. డ్రంక్ అండ్‌డ్రైవ్‌లో వాహనం ఆపిన వెంటనే మద్యం తాగిన వాహనదారుడు పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. శ్వాస విశ్లేషణ పరీక్షలో వచ్చిన కౌంట్‌ను జత చేసి న్యాయస్థానానికి పంపిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ బీఏసీ 300 దాటితే వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. వీరికి వారం రోజుల జైలుశిక్షతో పాటు రూ.2100 జరిమానా విధిస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఏడాది 2100 కేసులు నమోదు కాగా ఇందులో 485 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఇందులో 9 మందికి జైలుశిక్ష పడింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండుసార్లు పట్టుబడ్డ వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దయింది. పోలీసులు ఎక్కడికక్కడ ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో నాలుగైదు చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి. చదవండి👉🏼 ‘బీర్’ప్రియులకు చేదు వార్త.. భారీగా ధరలు పెంపు? తీరు మారడం లేదు.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని చట్టపరంగా శిక్షించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో విరివిగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో పట్టుబడ్డ ప్రతి ఒక్కరి వివరాలు ట్యాబ్‌లో పొందుపరుస్తున్నారు. మందుబాబుల పేరు, వివరాలు నమోదు చేయగానే గతంలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి ఉంటే ఆ వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా రెండుమూడు సార్లు సైతం పట్టుబడిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇటీవల జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడుపుతూ ఎర్రగడ్డకు చెందిన ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ ట్యాబ్‌లో ఫీడ్ చేయగానే అంతకుముందే పట్టుబడ్డట్లుగా తేలింది. దీంతో ఆయనున న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి డ్రైవింగ్ లైసెన్స్‌రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. దీని ఆధారంగా కోర్టులు రెండు రోజుల నుంచి నెల రోజుల పాటు శిక్షలు వేస్తున్నాయి. చదవండి👉 కామారెడ్డిలో దారుణం.. కుళాయి వద్ద గొడవ.. కక్ష పెంచుకుని హత్య -
వాహనదారులకు అలర్ట్
-
వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ప్రభుత్వం పొడిగించింది. చలాన్లపై రాయితీని ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ హోం శాఖ ప్రకటించింది. పెండింగ్ చలాన్ల ద్వారా ఇప్పటివరకు రూ.250 కోట్లు వసూలైనట్లు హోంశాఖ తెలిపింది. చదవండి: రేవంత్‌రెడ్డి చిప్పకూడు తింటావ్.. జాగ్రత్త..! రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి విశేష స్పందన రావడంతో పాటు, ఈ అవకాశాన్ని పొడిగించాలని విజ్ఞప్తులు రావడంతో పొడిగించామని వివరించారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేకపోయినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర హోం మంత్రి కోరారు. -
ఏప్రిల్ 1 నుంచి నిబంధనలు కఠినం చేస్తాం: ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్
-
ఆఫర్ క్లోజెస్ సూన్.. ఇప్పుడు కె.జి.యఫ్ 2 వంతు
హైదరాబాద్: మిగిలింది మూడు రోజులే.. మీ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చాలానాలను మార్చ్ 31వ తారీఖులోపు చెల్లించండి. అవకాశాన్ని నిర్లక్ష్యంతో చేజార్చు కోకండి. ప్రభుత్వం ఇచ్చిన రాయితీని సద్వినియోగం చేసుకోండి. ఆలస్యం చేయకు మిత్రమా అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అంటూ కె.జి.యఫ్ ఛాప్టర్ 2 ట్రైలర్‌లోని ఆఫర్ క్లోజెస్ సూన్ డైలాగ్ మీమ్‌ను వాడేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. వాహనదారులు.. సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికీ కూడా వాహనాల చలాన్లను క్లియర్ చేసుకోకుంటే.. వెంటనే ఆన్లైన్లో చెల్లించండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఇచ్చిన భారీ డిస్కౌంట్ల ఆఫర్ ముగిసిపోనుంది కాబట్టి. ఇప్పటికే తెలంగాణలో 50 శాతం ఛలాన్లు క్లియర్. హయ్యెస్ట్ ఎవరంటే.. ప్రత్యేకించి.. హైదరాబాద్ సిటీలో పెండింగ్ చలాన్లలో టూ వీలర్స్ టాప్‌లో ఉన్నాయి. ఓ స్కూటర్ ఓనర్‌కు.. అత్యధికంగా 178 చలాన్లు ఇంకా ఉన్నాయట. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు ఆయనకి ఈ చలాన్లు ఎక్కువగా పడ్డాయట. ఇక ఆగస్టు 2019 నుండి ఇప్పటివరకు 178 చలాన్ల మొత్తం 48,595 రూపాయలుగా ఉంది. రాయితీ పోను అతను చెల్లించాల్సి వచ్చేది కేవలం రూ. 12,490 మాత్రమే. మరో బైకర్‌కు రూ.73,690 చలాన్లు ఉన్నాయట. అతను ప్రత్యేక రాయితీని ఉపయోగించుకుని 19,515 చెల్లిస్తే సరిపోతుంది. మరి వాళ్లు ఉపయోగించుకుంటారో లేదో? చూడాలి. -
Police Warning: ట్రాఫిక్‌లో హారన్ మోగిస్తున్నారా.. తప్పదు భారీ మూల్యం
కోల్కత్తా: రోడ్డుపై భారీగా ట్రాఫిక్ ఉందని.. కదలేకపోతున్నామని.. అసహనంతో అనవసరంగా హారన్ మోగిస్తున్నారా.. ఇలా చేస్తే ఇకపై తప్పదు భారీ మూల్యం. అవసరం లేకున్నా హారన్ మోగించారని 615 మంది వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు రూ. 2 వేలు జరిమానా విధించారు. ఈ ఆసక్తికర ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌండ్ పొల్యూషన్‌ను నివారించేందుకు, వాహనదారుల్లో క్రమశిక్షణను పెంపొందించే ఉద్దేశ్యంతో, యాంటీ-హాంకింగ్ డ్రైవ్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది జూలై నుంచి కోల్కత్తా నగరంలో ప్రత్యేక యాంటీ-హాంకింగ్ డ్రైవ్‌లు చేపడుతున్నట్టు వెల్లడించారు. జూలై నెలలో ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ సెంటర్స్ వద్ద, ఆసుపత్రుల వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు తెలిపారు. ఇందులో భాగంగా కేవలం 12 రోజుల్లోనే 1,264 వాహనదారులకు జరిమానా విధించినట్టు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన యాంటీ పొల్యూషన్ సెల్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. తాజగా యాంటీ-హాంకింగ్ డ్రైవ్‌లో భాగంగా ఫిబ్రవరి నెలలో ట్రాఫిక్ పోలీసులు రోజుకు సగటున 22 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అధిక సంఖ్యలో వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తూ హారన్ మోగిస్తుండటం గమనించినట్టు తెలిపారు. దీంతో వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచేందుకే 615 మంది వాహనదారులకు రూ. 2వేల చొప్పున జరిమానా విధించినట్టు ట్రాఫిక్ డీసీ అరిజిత్ సిన్హా పేర్కొన్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిలో భాగంగా లాక్డౌన్ విధించిన సమయంలో ట్రాఫిక్ భారీగా తగ్గిపోయి.. సౌండ్ పొల్యూషన్ తగ్గినట్టు పోలీసులు తెలిపారు. కరోనా రూల్స్ ఎత్తేయడం, సాధారణ స్థితికి పరిస్థితులు చేరుకోవడంతో మళ్లీ సౌండ్ పొల్యూషన్ పెరుగుతున్నట్టు చెప్పారు. దీంతో వాహనదారులపై ఫోకస్ పెంచినట్టు పోలీసులు వెల్లడించారు. -
త్వరపడండి, తొందరపడకండి!
-
వాహన దారులకు బంపర్ ఆఫర్
-
బాప్రే.. ఒక్క నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు క్లియర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్‌కు విశేష స్పందన వస్తోంది. నిమిషానికి 700 పెండింగ్ చలాన్లను అధికారులు క్లియర్ చేస్తున్నారు. బైక్‌లు, ఆటోలకు 75 శాతం, కారు, లారీ, హెవీ వెహికిల్స్‌కు 50 శాతం రాయితీని తెలంగాణ పోలీసులు కల్పించిన విషయం తెలిసిందే. మాస్క్ చలాన్లపై 90 శాతం రాయితితో వాహనాదారు పెద్ద ఎత్తున క్లియర్ చేసుకుంటున్నారు. చలాన్ల రయితీ ఈ నెల 31 వరకు అందుబాటులో ఉండనుంది. గత నాలుగేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 6.19 కోట్ల ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌కు ప్రత్యేక అవకాశం కల్పించిన తెలంగాణ పోలీసులు వాహనదారులకు మరో శుభవార్త చెప్పారు. చలాన్ల చెల్లింపుల కోసం గంటల తరబడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే చలానాలు చెల్లించాలని సూచించారు. ఈ-చలాన్ ద్వారా అన్ని పెండింగ్ చలాన్లు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి సేవలను కూడా ఉపయోగించుకోవచ్చని సూచించారు. అటు మీ సేవ, ఈ సేవలో కూడా చలానాలు చెల్లించేలా అవకాశం కల్పించారు ట్రాఫిక్ పోలీస్‌లు. -
వాహనదారులకు గుడ్ న్యూస్
-
అతి తెలివంటే ఇదే.. నంబర్ ప్లేటు కనిపించకుండా చేసి..
సాక్షి, హైదరాబాద్: సిగ్నల్ జంపింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, రోడ్లపై పార్కింగ్.. ఇలా పలు ట్రాఫిక్ ఉల్లంఘనల పేరిట ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనదారులకు చలాన్లు విధించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎక్కువగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నది యువతే. దీంతో వారు ట్రాఫిక్ పోలీసుల నుంచి చలాన్లు తప్పించుకోవడానికి వింత దారులు వెతుకుతున్నారు. వాహనం నంబర్ కనిపించకుండా నంబర్ ప్లేట్లపై స్టిక్కర్లు అంటించడం, నంబర్‌ప్లేటు సగానికి విరగ్గొట్టడం, లేదంటే వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి తన పాదాన్ని నంబర్ కనిపించకుండా ప్లేటుపై అడ్డంగా పెట్టడం చేస్తున్నారు. చలాన్లు పడకుండా తప్పించుకొనేందుకు యువత చేస్తున్న ఈ వింత ప్రయత్నాలను చూసి అటు పోలీసులు, ఇటు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
నానాటికీ పెరిగిపోతున్న ‘ట్రాఫిక్ కేసులు’.. కనిపించకుండానే చలాన్ పడిపోద్ది!
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫిక్ ఉల్లంఘనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు లక్షల్లో, మృతులు వేల సంఖ్యలో ఉండటానికీ ఇవే ప్రధాన కారణం. ఈ ఉల్లంఘనల్ని తగ్గించడానికి ప్రయత్నించాల్సిన యంత్రాంగాలు ఏటా పెరిగిపోతున్నా పట్టించుకోవట్లేదు. పైగా అదేదో ఘనతగా ఆర్భాటంగా ప్రకటిస్తున్నాయి. 2018లో 1.02 కోట్లుగా ఉన్న ట్రాఫిక్ వయెలేషన్స్ గత ఏడాది నాటికి 2.33 కోట్లకు చేరింది. పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా ఇక్కడా వీటిని ఆదాయ వనరుగా చూడటంతోనే ఈ పరిస్థితి దాపురించిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తెలియకుండా తడిసిమోపెడు... ►ట్రాఫిక్ విభాగం అధికారులు నమోదు చేస్తున్న ఉల్లంఘనల కేసుల్లో అత్యధికం హెల్మెట్ కేసులే ఉంటున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు కేవలం వాహన చోదకుడు హెల్మెట్ ధరించకపోతేనే ఈ– చలాన్ జారీ చేసే వారు. ఇటీవల కాలంలో వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్ రైడర్) హెల్మెట్ ధరించకపోయినా చలాన్ జారీ చేస్తున్నారు. మరోపక్క వాహనచోదకులు హాఫ్ హెల్మెట్ ధరించినా జరిమానా తప్పట్లేదు. ఒకటి రెండుసార్లు అనుభవంలోకి వస్తే తప్ప ఈ విషయం వాహనచోదకులకు అర్థం కావట్లేదు. ఇలాంటి సున్నితాంశాలపై అవగాహన కల్పించాల్సిన పోలీసులు ఆ విషయం మర్చిపోతున్నారు. అదేమని ప్రశ్నిస్తే మోటారు వాహనాల చట్టంలో (ఎంవీ యాక్ట్) ఉన్న నిబంధనల్నే తాము అమలు చేస్తున్నామని తప్పించుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసుల లెక్కలో డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తీ ఎంవీ యాక్ట్‌లో నిష్ణాతుడి కిందికే వస్తుండటం గమనార్హం. కనిపించకుండా బాదేస్తున్నారు.. ►ఒకప్పుడు ట్రాఫిక్ పోలీసులు కేవలం కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించే వారు. దీని ప్రకారం రోడ్డు మీద ఉల్లంఘనుడిని ఆపి చలాన్లు జారీ చేసేవారు. ఇటీవల కాలంలో 95 శాతం నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతోంది. రహదారులపై సంచరిస్తున్న ట్రాఫిక్ ఉల్లంఘనుల ఫొటోలను వివిధ మార్గాల్లో సేకరిస్తున్న పోలీసులు ఈ– చలాన్లు జారీ చేస్తున్నారు. దాదాపు ఎక్కడా కనిపించకుండా జరిమానా విధించేస్తున్నారు. ►వాహన చోదకుల్లో అనేక మంది పోలీసులు కనిపించినప్పుడు మాత్రమే నిబంధనలు పాటిస్తుంటారు. నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో వాళ్లు కనిపించే అవకాశం లేకపోవడంతో అడ్డంగా బుక్కవుతున్నారు. నగరంలో సంచరించే ద్విచక్ర వాహన చోదకుల్లో దాదాపు 90 శాతం మంది వద్ద హెల్మెట్లు ఉంటాయి. వీళ్లలో చాలా మంది వాటిని వాహనానికో, పెట్రోల్ ట్యాంక్ మీదో ఉంచుతారు. చౌరస్తాలకు సమీపంలోనో, ట్రాఫిక్ పోలీసులు ఉన్న చోటో మాత్రమే తీసి తలకు పెట్టుకుంటారు. ఇలాంటి నిర్లక్ష్యాలకు పాల్పడే వాళ్లూ నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్లో బుక్కైపోతున్నారు. ►రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధించడమనే విదేశాల్లోనూ ఉంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఈ ఆదాయమే పోలీసులకు జీతంగా వస్తుంటుంది. ఆయా చోట్ల పోలీసు విభాగాలు ప్రభుత్వంలో భాగంగా కాకుండా, మున్సిపల్ కార్పొరేషన్లలో అంతర్భాగంగా పని చేస్తాయి. మేయర్ ఆధీనంలో ఉండే వీరికి జీతాలను ఆయా కార్పొరేషన్లే చెల్లిస్తుంటాయి. ఈ కారణంగానే ఆయా పోలీసు విభాగాలు ప్రతి నెలా కనీసం తమ జీతాలకు సరిపడా అయినా జరిమానాల రూపంలో వసూలు చేసి మున్సిపల్ కార్పొరేషన్ల ఖజానాకు చేర్చాల్సి ఉంటుంది. నగరంలో పరిస్థితులు అలా ఉండవు. పోలీసులు ప్రభుత్వంలో భాగంగా పని చేస్తుంటారు. వీరికి జీతాలు సర్కారు ఖజానా నుంచి వస్తాయి. అయినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం జరిమానాలు విధించడానికి ఆసక్తి చూపుతుంటారు. తగ్గితేనే విజయం సాధించినట్లు ప్రతి ఏటా తాము గతేడాది కంటే ఇన్ని వేల, లక్షల చలాన్లు ఎక్కువగా విధించామంటూ పోలీసులే ప్రకటిస్తుంటారు. ప్రాక్టికల్‌గా చూస్తే ఏటా ఉల్లంఘనుల సంఖ్య తగ్గించడం ద్వారా ప్రమాదాలు నిరోధిస్తేనే పోలీసులు విజయం సాధించినట్లు. ఈ అంశంలో నిర్దిష్టమైన ప్రణాళిక కొరవడింది. అవగాహన పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ ఆర్భాటాలకు, ప్రచారానికే పరిమితం అవుతున్నాయి. ఒకటో తరగతి నుంచీ ట్రాఫిక్ పాఠాలు నేర్పాలనే ప్రతిపాదన ఏళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయింది. ఇలాంటి చర్యల వల్లే ప్రతి ఒక్కరిలో అవగాహన పెరిగి, ఉల్లంఘనులు తగ్గుతారు. – శ్రీనివాస్, మాజీ పోలీసు అధికారి -
బండి అమ్మేసినా.. ఆ చలాన్లు కట్టడానికి సరిపోదేమో..
సాక్షి, గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): ఒకే ద్విచక్ర వాహనంపై ఒకటికాదు రెండుకాదు ఏకంగా.. 117 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. మంగళవారం సదరు వాహనాన్ని అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అబిడ్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాలు.. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. హోండా యాక్టివా(ఏసీ09ఏయూ1727)నంబర్ యాక్టివాను ఆపి తనిఖీ చేశారు. 2015 సంవత్సరం నుంచి దాదాపు 117 చలానాలు పెండింగ్‌లో ఉండటంతో అవాక్కయ్యారు. హెల్మెట్,మాస్క్, నో పార్కింగ్‌లో నిలుపుతూ.. సదరు వాహనదారుడు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. రూ. 30 వేల పెండింగ్ చలానాలు ఉండటంతో వాహానాన్ని సీజ్ చేశారు. -
ఇది మామూలు లిస్టు కాదు.. నాలుగేళ్లుగా ‘జంప్’ అవుతున్నాడు, కానీ ఈసారి
బంజారాహిల్స్: స్కేటింగ్ కోచ్ జునైద్ శనివారం (టీఎస్09 ఎఫ్డీ 3792) యాక్టివాపై వెళ్తుండగా.. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో పట్టుబడ్డాడు. ఆ స్కూటర్‌కు సంబంధించిన పెండింగ్ చలానాలు పరిశీలించగా గత నాలుగేళ్లుగా పెండింగ్ చలానాలతో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నట్లుగా తేలింది. మొత్తం 107 పెండింగ్ చలానాలు ఈ బైక్‌పై నమోదై ఉన్నాయి. చలాన్ల జాబితా చాంతాడంత ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. రూ. 35,835 జరిమానా పెండింగ్‌లో ఉండటంతో ఆ మొత్తాన్ని సదరు వాహనదారుడు చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో బైక్‌ను పోలీసులు సీజ్ చేశారు. హెల్మెట్ లేకుండా పోలీసులను తప్పించుకొని తిరుగుతున్న అతడు ఎట్టకేలకు జూబ్లీహిల్స్‌లో పోలీసులకు చిక్కాడు. అబిడ్స్‌లో నివసించే జునైద్ హైటెక్ సిటీ గూగుల్ బిల్డింగ్‌లో స్కేటింగ్ కోచ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. (చదవండి: ‘మేడారం’ పనులు మొదలయ్యేదెప్పుడు?) -
హైదరాబాద్: ఒక బైక్‌పై 88 చలాన్లు.. కంగుతిన్న పోలీసులు
సాక్షి,సుల్తాన్‌బజార్: ఓ ద్విచక్ర వాహనంపై 88 చలాన్లు పెండింగ్‌లో ఉన్న వ్యక్తి ఎట్టకేలకు సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. బుధవారం సుల్తాన్‌బజార్ ట్రాఫిక్ పోలీసులు అఫ్జల్‌గంజ్‌లో వాహన తనిఖీలు చేస్తుండగా (టీ.ఎస్.11.1588) ఈ నెంబర్ గల ద్విచక్రవాహనం అబ్దుల్ రహా్మన్ అనే వ్యక్తిది. కాగా ఇతనిని పోలీసులు ఆపి తనిఖీ చేయగా ద్విచక్ర వాహనంపై 2019 నుంచి ఇప్పటి వరకు 28 చలాన్లు పెండింగ్‌లో ఉండటమే కాకుండా దానిపై రూ.28,110 వేలు చెల్లించాల్సి ఉంది. చదవండి: ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్ దీంతో కంగుతిన్న పోలీసులు వెంటనే ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనంపై నెంబర్‌ప్లేట్స్ టాంపరింగ్ స్టిక్కర్స్ పెట్టడంలాంటి దానిపై మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం చీటింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్‌కుమార్ హెచ్చరించారు. చదవండి: ట్రాఫిక్ చలాన్ వేశారని బుల్లెట్ యజమాని ఆత్మహత్యాయత్నం -
ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్
-
ఎవరైనా ఒక్కటే: తెలంగాణ సీఎస్ వాహనానికి ట్రాఫిక్ చలాన్
Traffic Challan Issued To Telangana CS Somesh Kumar Official Vehicle: తప్పు చేస్తే ఎవరినైనా సరే శిక్షించాల్సిందే. ఈ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తామంటున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. దానిలో భాగంగానే నిబంధనలు పాటించని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక వాహనానికి చలాన్ విధించి తమకు అందరూ ఒక్కటే అని చాటి చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. (చదవండి: బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా..) హైదరాబాద్ టోలిచౌకి పీఎస్ పరిధిలోని పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లై ఓవర్‌పై అధిక వేగంతో సీఎస్ సోమేశ్ కుమార్ వాహనం (TS09FA0001) వెళ్తుండడాన్ని గుర్తించి చలాన్ విధించారు. మూడు వేల రూపాయల చలాన్ కట్టాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులు ఆదేశించారు. చదవండి: సీఎస్ చదివాక సంతకం చేయాలి కదా? -
బైక్‌పై 65 చలాన్లు.. అవాక్కైన పోలీసులు.. ఇక్కడో ట్విస్టు కూడా..
సాక్షి, కుత్బుల్లాపూర్: ఒక ద్విచక్ర వాహనానికి ఏకంగా 65 చలాన్లు ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు అవాక్కయ్యారు. సుచిత్ర లయోలా కాలేజీ వద్ద బుధవారం రాత్రి ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అల్వాల్‌కి చెందిన సయ్యద్ సాజిద్ (టీఎస్ 10 ఈపీ 8619) ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రికార్డులు పరిశీలించిన అనంతరం చలాన్ల గురించి ఆరా తీయగా 64 ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 23,580 రూపాయలు అపరాధ రుసుం ఉన్నట్లు తెలుసుకుని రసీదు ఇచ్చి వాహనాన్ని సీజ్ చేశారు. అయితే ఈ వాహన వివరాలు తనిఖీ చేయగా ఉమారామ్నగర్ అల్వాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా తేలింది. అయితే సదరు వాహనం తనదంటే తనది అని ఇద్దరూ మొండికేయడంతో వాహనానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు తీసుకురావాలని ఇద్దరికీ సూచించామని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. చదవండి: Hyderabad: బైక్‌పై చలాన్లు చూసి షాకైన పోలీసులు విల్లాలో చోరీ నిజాంపేట్: సోలార్ ఫెన్సింగ్‌ను తొలగించి ఓ విల్లాలో దొంగతనానికి పాల్పడిన సంఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పోలీసులు తెలిపిన వివరాలు. బాచుపల్లిలోని శ్రీనివాస లేక్వ్యూలోని పసుపులేటి వెంకట శివకుమార్‌కు చెందిన విల్లాలోకి దొంగలు ప్రవేశించి రెండున్నర తులాల బంగారు హారం, 20 తులాల రెండు వెండి ప్లేట్ల ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. -
పోలీసులు ఫైన్లు వేస్తున్నారనే కోపంతో కాల్చేశాడు
పెద్దేముల్: పోలీసులు ఫైన్ వేస్తున్నారని ఓ యువకుడు బైక్‌కు నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన పెద్దేముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దేముల్ గ్రామానికి చెందిన తలారి సంగప్పకు చెందిన బైకు (టీఎస్ 34డీ 2183)పై ఇప్పటివరకు పోలీసులు వివిధ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద సుమారు రూ.5వేల వరకు ఫైన్ వేశారు. సదరు మొత్తం సంగప్ప ఇంతవరకు చెల్లించలేదు. తాజాగా ఆదివారం గౌతాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద మరోమారు ఫైన్ వేస్తుండగా తప్పించుకున్న సంగప్ప మండల కేంద్రంలో రైతు సేవా సహకార సంఘం వెనకాల భాగంలో తన బైక్‌కు తానే నిప్పంటించుకున్నాడు. విషయం తెలుసుకున్న ట్రైనీ ఎస్ఐ కృష్ణకాంత్, హెడ్ కానిస్టేబుల్ మల్లేశం అక్కడికి చేరుకుని ఆరా తీశారు. బైక్‌ను ఎందుకు తగులబెట్టావని అడగ్గా ఇప్పటివరకు రూ.5వేలు ఫైన్ వేశారని వారి బాధను భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించానని సంగప్ప తెలిపాడు. పోలీసులు బైక్‌పై ఆన్లైన్లో పరిశీలించగా వివిధ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల కింద రూ.4,800 ఫైన్ వేసినట్టు తేలింది. -
రూ.397 కోట్లు సమర్పణ.. బాధ్యులు ఎవరు?
సాక్షి, హైదరాబాద్ : ఎవరింట్లో అయినా దొంగలు పడి తులం బంగారం ఎత్తుకుపోతే నానా హైరానా పడిపోతాం. అదే రహదారిపై వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ చలాన్ పడుతుందని తెలిసీ ఉల్లంఘనలకు పాల్పడతాం. ట్రాఫిక్ ఉల్లంఘనులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో అప్పుడప్పుడు ప్రమాదాలు చోటు చేసుకోవడమే కాదు... అనునిత్యం నగరవాసి జేబుకు చిల్లుపడుతూనే ఉంది. వాహనచోదకుల అవగాహనా రాహిత్యం... మౌలిక వసతుల లేమి.. ఎడ్యుకేషన్ కోణంలో అధికారుల వైఫల్యం.. .కారణం ఏదైతేనేమి మూడు కమిషనరేట్లకు చెందిన వాహనచోదకులు గత ఏడాది అక్షరాలా రూ.397,89,42,640 జరిమానాల రూపంలో ఖజానాకు సమర్పించుకున్నారు. ఇదే కాలంలో చోరీలు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలు వంటి వివిధ రకాలైన నేరాల్లో ప్రజలు కోల్పోయింది రూ.57,38,20,973 కావడం గమనార్హం. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో సరాసరిన రోజుకు 186 కేసులు నమోదు అవుతుండగా.... ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్య మాత్రం 31,956గా ఉంది. ఈ పరిస్థితులకు బాధ్యులు ఎవరు? నిబంధనలు పట్టని వాహనచోదకులా..? మౌలిక వసతుల కల్పనలో ఘోరంగా విఫలమౌతున్న జీహెచ్‌ఎసీనా? ట్రాఫిక్ ఎడ్యుకేషన్‌లో విఫలమౌతున్న పోలీసులా? అనేది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ మిలియన్ డాలర్ల ప్రశ్నే. చదవండి: ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు నగరంలో రోడ్డు నిబంధనల పాటించకుండా ట్రాఫిక్ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేసే వారిలో పదే పదే ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారే ఎక్కువగా ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రాఫిక్ విభాగం అధికారులు జారీ చేసిన చలాన్ల సంఖ్య... వాహనాల సంఖ్య కంటే కాస్త ఎక్కువగా ఉండటమే దీనికి నిదర్శనం. ఇందులో ప్రతి ఒక్క వాహనచోదకుడూ ఉల్లంఘనలకు పాల్పడటం అనేది జరుగదు. కనిష్టంగా తీసుకున్నా పది లక్షల మంది వాహనచోదకులు నిబంధనలు పాటిస్తూనో, సొంత వాహనాలు లేని కారణంగానో ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలకు పూర్తి దూరంగా ఉన్నారని లెక్కేయచ్చు. అయితే ట్రాఫిక్ విభాగం అధికారులు జారీ చేసిన చలాన్ల సంఖ్య మాత్రం ఏటా సరాసరిన 30 లక్షలకు పైగా ఉంది. అనేక మంది వాహనచోదకులు పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతూ రిపీటెడ్ వైలేటర్స్‌గా ఉండటమే దీనికి కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. అవగాహనే కీలక ప్రాధాన్యం ‘ఉల్లంఘనులకు చెక్ చెప్పడానికి జరిమానాలు విధిస్తున్నాం. వారీలో రహదారి నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికీ పెద్దపీట వేస్తున్నాం. క్రమం తప్పకుండా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థి దశ నుంచే మార్పులు తీసుకురావడానికి కళాశాలలు, పాఠశాలలకూ వెళ్ళి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. కొందరు సెలబ్రెటీలను భద్రతాంశాలపై ప్రచారం కోసం తీసుకురావడంతో పాటు మీడియా ద్వారానూ ప్రచారం చేస్తున్నాం. ట్రాఫిక్ పోలీసులకు సంబంధించిన సోషల్‌మీడియా ద్వారా నెట్‌జనులకు దగ్గరవుతున్నాం. ఎన్ఫోర్స్మెంట్ కంటే ఎడ్యుకేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం.’ – నగర ట్రాఫిక్ అధికారులు ఎవరికి వారే మారాలి ‘నగరంలో ఈ పరిస్థితుల నెలకొనడానికి ఏ ఒక్కరో కారణం కాదు. ప్రభుత్వ యంత్రాగాల అలసత్వం, వాహనచోదకుల నిర్లక్ష్యం వెరసి నగరవాసి జేబుకు మాత్రం చిల్లుపడుతోంది. కేవలం చలాన్ల రూపంలోనే కాకుండా విలువైన పనిగంటలు, ఇంధనం రూపంలోనూ నష్టపోతున్నారు. అన్ని ఉల్లంఘనల్లోనూ అత్యంత కీలకమైంది పార్కింగ్. ఏ ప్రదేశంలోనూ కూడా నిబంధనల ప్రకారం పార్కింగ్ ఉండట్లేదు. అయినప్పటికీ యథేచ్ఛగా కార్యకలాపాలు జరిగిపోతున్నాయి. నిబంధనలను ఇబ్బందిగా ఫీల్ అవుతున్న నగరవాసి, మౌలిక వసతుల కల్పనను ఓ భారంగా భావిస్తున్నా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ ఎడ్యుకేషన్‌కు సరైన ప్రాధాన్యం ఇవ్వని ట్రాఫిక్ కాప్స్ సమూలంగా మారితేనే పరిస్థితుల్లో మార్పు వచ్చేది’. – రోమల్, జగదీష్ మార్కెట్ ట్రాఫిక్ కేసులు ఇలా... కమిషనరేట్ చలాన్లు విధించిన జరిమానా హైదరాబాద్ 54,74,479 రూ.173,84,01,535 సైబరాబాద్ 47,71,328 రూ.178,39,40,605 రాచకొండ 14,18,355 రూ.45,66,00,500 మొత్తం 1,16,64,162 రూ.397,89,42,640 (నవంబర్ వరకు) నేరాల కేసులు ఇలా... కమిషనరేట్ కేసులు దుండుగల పాలైంది హైదరాబాద్ 22,641 రూ.26,15,21,679 సైబరాబాద్ 24,868 రూ.15,31,78,771 రాచకొండ 20,641 రూ.15,91,20,523 మొత్తం 68,150 రూ.57,38,20,973 (డిసెంబర్ 20 వరకు) -
ఆర్నెల్లలో డ్రంకన్ డ్రైవ్ కేసులు.. మూడే!
సాక్షి, అమరావతి: గత ఆర్నెల్లలో రాష్ట్రంలో డ్రంకన్ డ్రైవ్ కేసులు కేవలం మూడు మాత్రమే నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో రహదారి భద్రత ఉల్లంఘనలపై రవాణా శాఖ రోడ్డు సేఫ్టీపై ఏర్పాటైన సుప్రీంకోర్టు కమిటీకి తాజాగా నివేదిక పంపింది. మద్య నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోనే డ్రంకన్ డ్రైవ్ కేసులు తగ్గిపోయాయని సుప్రీంకోర్టు కమిటీకి నివేదించింది. టోల్గేట్లలో బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలను రవాణా శాఖ ముమ్మరం చేయడంతో కేసులు తగ్గిపోయాయి. ఈ మూడు కేసులు గుంటూరు జిల్లాలో రెండు, కృష్ణా జిల్లాలో ఒకటి నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆర్నెల్ల వ్యవధిలో 2 వేలకు పైగా డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, ఈ దఫా సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం గమనార్హం. రాత్రి 8 గంటల తర్వాత మద్యం అమ్మకాలు లేకపోవడం, ఎక్కడా మద్యం దొరక్కపోవడం ప్రధాన కారణాలుగా రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. (చదవండి: రూ.8,000 కోట్లతో ‘ఉపాధి’) సుప్రీంకోర్టు కమిటీకి పంపిన నివేదికలో ప్రధానాంశాలివే... ఆర్నెల్ల వ్యవధిలో డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన 3,829 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో రెండో దఫా పట్టుబడితే జైలుకు పంపనున్నారు. అతి వేగంతో వెళుతున్న 5,888 మందిపై కేసులు నమోదయ్యాయి. హైవేలపై స్పీడ్ గన్లతో తనఖీలు ముమ్మరం చేశారు. హెల్మెట్ లేకుండా బండి నడుపుతూ 11,686 మంది పట్టుబడ్డారు. కౌన్సిలింగ్‌తో పాటు చలాన్లు విధించారు. ఓవర్ లోడ్‌తో వెళ్లే 5,690 గూడ్స్ వాహనాలపై కేసులు నమోదయ్యాయి. ఓవర్ లోడ్‌తో వెళ్లే 511 ప్రయాణికుల వాహనాలపై కేసులు పెట్టారు. గూడ్స్ వాహనాల్లో ప్రయాణికుల్ని తరలిస్తున్న 91 వాహనాల్ని సీజ్ చేశారు. ఆర్నెల్ల వ్యవధిలో రోడ్డు ప్రమాద మరణాలు గతం కంటే తగ్గిపోయాయి. గతేడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రోడ్డు ప్రమాద మరణాలు 4 వేల వరకు ఉంటే ఈ ఏడాది 2 వేలకు పైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో గత ఆర్నెల్లలో ట్రాఫిక్ ఉల్లంఘనలివే... జిల్లా డ్రంకన్ డ్రైవ్ అతి వేగం డ్రైవింగ్ లైసెన్సు లేని అనంతపురం 0 320 327 చిత్తూరు 0 8 269 తూర్పుగోదావరి 0 30 289 గుంటూరు 2 1 459 కృష్ణా 1 1 101 కర్నూలు 0 147 330 నెల్లూరు 0 1,926 603 ప్రకాశం 0 2 146 శ్రీకాకుళం 0 0 8 విశాఖపట్నం 0 3,446 302 విజయనగరం 0 0 42 పశ్చిమగోదావరి 0 7 722 వైఎస్సార్ కడప 0 0 231 మొత్తం 3 5,888 3,829 -
ట్రాఫిక్ జరిమానాలు ఆపేయాలి: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ చలానాలు అధికంగా విధిస్తున్నారని, సీఎం ఆదేశాల మేరకు భారీ జరిమానాలు వేస్తున్నారని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన గన్‌పార్క్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ట్రాఫిక్ పోలీసులకు లక్ష్యం ఇచ్చినట్టు కనిపిస్తోందని, రాష్ట్రం మొత్తం ఈ చలానాలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చలానా కట్టకపోతే పెనాల్టీలు వేస్తున్నారని, ఆటో నడిపే వారికి వారు సంపాదించే సగం డబ్బు చలానాలకే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ఈ జరిమానాలు వేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. తక్షణమే ఈ జరిమానా వేసే విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం అసెంబ్లీలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. -
సీఎం కేసీఆర్ వాహనానికి ట్రాఫిక్ చలానా
-
కేసీఆర్ వాహనానికి ట్రాఫిక్ చలానా!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కాన్వాయ్‌లోని వాహనానికి ట్రాఫిక్ చలానా పడింది. హైదరాబాద్, సైబరాబాద్, సూర్యాపేట పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో ఫైన్ తప్పలేదు. అతివేగంగా నాలుగుసార్లు వెళ్లడంతో చలానా విధించినట్టు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. దీంతో చలానా మొత్తం రూ.4,140 ను సీఎంవో అధికారులు బుధవారం చెల్లించారు. (చదవండి: హైదరాబాద్: సిటీ బస్సులకూ ఇక రైట్ రైట్!) -
ఉల్లంఘనులకు శుభవార్త
కర్ణాటక, బనశంకరి: లాక్డౌన్ అమలైనప్పటి నుంచి పోలీసులు సీజ్ చేసిన వాహనాలను మే 1వ తేదీ నుంచి వెనక్కి అప్పగిస్తామని నగర పోలీస్ కమిషనర్ భాస్కర్‌రావ్ తెలిపారు. గురువారం నగరంలో మీడియా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి సీజ్ చేసిన బైక్‌లు, కార్లు తదితరాలను లాక్డౌన్ ముగిసే వరకు వాహనాలను వెనక్కి ఇచ్చేది లేదని, కోర్టు ద్వారానే విడిపించుకోవాలని గతంలో ప్రకటించడంతో వేలాది మంది వాహనదారుల్లో తీవ్ర ఆదుర్దా నెలకొంది. ఈ తరుణంలో శుభవార్తను వినిపించారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి సీజ్ చేసిన వాహనాలను మే 1వ తేదీ నుంచి వెనక్కి ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి అనుమతి మేరకు వాహనాలను వెనక్కి ఇచ్చేస్తున్నామని, కానీ అంతకు ముందు వాహనాల రికార్డులు పరిశీలించి వెనక్కి ఇస్తామన్నారు. బెంగళూరులో ఇప్పటి వరకు లాక్ డౌన్ నుంచి 47 వేల వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.(5,88,989 ఉల్లంఘనలు) -
5,88,989 ఉల్లంఘనలు
సాక్షి, సిటీబ్యూరో: కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా లాక్డౌన్ ట్రాఫిక్ ఉల్లంఘనుల ముందు ఏమీ పనిచేయడం లేదు. గత నెల 23 నుంచి ఇప్పటివరకు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో నమోదైన 5,88,989 ఉల్లంఘన గణాంకాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. 15,605 వాహనాలను ఇరు కమిషనరేట్ల పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్‌లో 5,05,439 ట్రాఫిక్ కేసులు నమోదు కాగా.. 10,694 వాహనాలను సీజ్ చేశారు. రాచకొండలో 83,550 ట్రాఫిక్ కేసులు నమోదైతే 4,911 వాహనాలు సీజ్ అయ్యాయి. ఆయా కమిషనరేట్లలో జారీ చేసిన ఈ చలాన్లలో ఎక్కువగా వాహన చోదకుడితో పాటు పిలియన్ రైడర్‌కు హెల్మెట్లు లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లు ఎక్కువగా ఉన్నాయని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా పోలీసులే నేరుగా వాహనాలు ఆపి వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనల కింద కేసులు నమోదు చేశారు. 3 కి.మీ దాటితే.. మొన్నటివరకు మూడు కిలోమీటర్ల పరిధిని చూసీ చూడనట్టు వ్యవహరించిన పోలీసులు రెండు రోజులుగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయా చోదకుల ఆధార్‌కార్డు చిరునామా ఆధారంగా వాహనాలను సీజ్ చేస్తున్నారు. సరైన కారణం ఉంటే తప్ప పోలీసులు వదలడంలేదు. సీజ్ చేసిన వాహనాలను సమీప ఠాణాలకు తరలిస్తున్నారు. లేదంటే సమీప ప్రాంతాల్లోని సినిమా థియేటర్ల ఆవరణలో పార్కింగ్ చేస్తున్నారు. బుధవారం రోడ్డెక్కిన ప్రతి వాహనదారుడిని ఆయా చెక్‌పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారి వాహనాలను సీజ్ చేశారు. కఠినంగా లాక్డౌన్ అమలు.. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనాలపై ప్రయాణిస్తుండడంతో కరోనా వ్యాప్తికి కారకులవుతారు. ఓవైపు భౌతిక దూరం పాటించాలంటూ ఎంతగా చెబుతున్నా కొంతమంది పాటించడంలేదు. లాక్‌డౌన్‌ను వచ్చే నెల మే 7 వరకు పొడిగించడంతో ఈసారి సమర్థంగా అమలుచేస్తున్నాం. లాక్డౌన్ ముగిశాక సంబంధిత వాహనదారులు కోర్టుకు హాజరు కావాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు రెండు నెలల సమయం పట్టవచ్చు. అందుకని ఎవరూ రోడ్లపైకి రావద్దు. – వీసీ సజ్జనార్,సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
నంబర్ ప్లేట్‌కు ఆకు అతికించాడుగా..
పంజగుట్ట: ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి నంబర్ ప్లేట్‌కు ఆకు అతికించిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు అత్తాపూర్‌కు చెందిన నందకిషోర్ విద్యార్థి. అతను తన (ఎపీ28డీఎక్స్ 5079) యమహా ఎఫ్‌జెడ్ బైక్‌పై బుధవారం ఉదయం షాలీమార్ జంక్షన్ నుంచి పంజగుట్ట వైపు వస్తుండగా పంజగుట్ట సర్కిల్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్సై రామకృష్ణ సిబ్బంది అతడి వాహనం వెనక ఏదో అంటించి ఉండటాన్ని గుర్తించి వాహనాన్ని ఆపారు. దగ్గరికి వెళ్లి చూడగా అతను ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌కు ఆకును అతికించినట్లు గుర్తించారు. అతని వాహనం వివరాలు పరిశీలించగా ఏడు చలాన్లకు గాను రూ.2045 పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అతడిని లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించగా నందకిషోర్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘అడ్డుగా వచ్చాడని వేసుకెళ్లి పోయాడు’
-
లైసెన్స్ రద్దు.. గోల!
సాక్షి, హైదరాబాద్: పెనాల్టీ పాయింట్ల విధానం అమలు, డ్రైవింగ్ లెసెన్స్ రద్దు విషయంలో పోలీసు, రవాణా శాఖలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ విషయంలో ఇటీవల సినీనటు డు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆర్టీఏ రద్దు చేసిన విషయం తెలిసిందే. బాగా తీవ్రమైన కేసుల్లో మినహా ఇతర సంద ర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలన్న ఆలోచన ఇరు శాఖల్లో కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటివరకు రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌ల సంఖ్య చాలా స్వల్పంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. తనిఖీలు అంతంతే... ఉభయ శాఖల నిర్లక్ష్యం, సమన్వయ లో పం ట్రాఫిక్ ఉల్లంఘన లకు పాల్పడేవారికి బా గా కలసివస్తోంది. ఎ లాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డా.. చలాన్లు కట్టే సి ఎంచక్కా వెళ్లిపోతున్నారు. అదే డ్రైవింగ్ లైసెన్సు రద్దయితే.. కాస్తోకూస్తో క్రమశిక్షణ గా ఉండేవారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు వరుసగా అసెంబ్లీ, స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల నేప థ్యంలో అదనపు విధుల కారణం గా 12 పెనాల్టీ పాయింట్ల నమోదు ప్రక్రియను పోలీసులు పెద్దగా పట్టించుకో లేదు. కొంతకాలంగా సాధారణ వాహన తనిఖీలు కూడా సరిగా జర గడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెమ్మదించిన 12 పాయింట్ల విధానం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్, యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు తెలంగాణ ప్రభుత్వం 12 పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో సీటు బెల్టు పెట్టుకోకపోవడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం, సిగ్నల్ జంప్ తదితర ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తి పట్టుబడితే అతడి డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌కు పెనాల్టీ పాయింట్లు జత చేస్తారు. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా పెనాల్టీ పాయింట్లు నిర్ణయిస్తారు. వీటిని రవాణా శాఖ ఎం–వ్యాలెట్‌లోనూ పొందుపరుస్తారు. కానీ కొంతకాలంగా పోలీసులు కేవలం చలాన్లాకే పరిమితమవుతున్నారని, 12 పెనాల్టీ పాయింట్లకు సంబంధించి నమోదు సరిగా జరగడం లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. మరోవైపు పోలీసులు పంపిన సిఫారసులను ఆర్టీఏ కూడా అంతే తేలిగ్గా తీసుకుంటుందని పోలీసు శాఖ వారు ఆరోపిస్తున్నారు. -
స్పీడ్ లిమిట్‌లోనే ఉన్నా... భారీగా చలాన్లు..!
న్యూఢిల్లీ : అనుమతించిన స్పీడ్‌లోనే వాహనాలు ప్రయాణించినప్పటికీ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు విధించారు. వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విమర్శలు రావడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. వేసిన చలాన్లను విత్‌డ్రా చేసేందుకు నిర్ణయించారు. వివరాలు.. ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ఉన్న 24వ జాతీయ రహదారిపై ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో దాదాపు ఒకటిన్నర లక్షల చలాన్లు విధించారు. వీటిలో అధిక భాగం ఓవర్‌స్పీడ్‌కు సంబంధించినవే. అయితే, ఉన్నఫళంగా చలాన్లు విత్‌డ్రా చేస్తామనడానికి కారణాలేంటనే ప్రశ్నకు ట్రాఫిక్ ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. జాతీయ రహదారులపై గంటకు 70 కి.మీ వేగంతో మాత్రమే ప్రయాణించాలి. ఈ మేరకు ప్రజా పనుల విభాగం వేగం 70 దాటితే శిక్షార్హులు అనే బోర్డులు కూడా పెట్టాయి. అయితే, 24వ జాతీయ రహదారిపై నిజాముద్దీన్ బ్రిడ్జి, ఘాజీపూర్ మధ్య 60 కి.మీ వేగంతో వెళ్లిన వాహనాలకు సైతం చలాన్లు విధించారు. దాంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకే చలాన్లు వెనక్కు తీసుకుని ఉండొచ్చు’ అని అన్నారు. ఇదిలాఉండగా.. ఓవర్‌స్పీడ్ చలాన్లను ఇప్పటికే చాలామంది చెల్లించారని.. మరి ఆ సొమ్మునంతా వారికి తిరిగి ఇస్తారా అనే ప్రశ్నకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల నుంచి సమాధానం కరువైంది. అక్రమంగా ఫైన్లు వేయడంతో కోర్టుకు వెళ్తామన్న పలువురి హెచ్చరికల నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక విమర్శల నుంచి తప్పించుకోవడానకి 60 కి.మీ వేగం దాటితే శిక్షార్హులు అనే సూచిక బోర్డులు పెట్టాలని ట్రాఫిక్ అధికారులు ప్రజా పనుల విభాగాన్ని కోరడం గమనార్హం. -
హెల్మెట్ పెట్టుకోలేదని బస్సు డ్రైవర్‌కు చలాన్!
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచి దేశంలో ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. అర్థం పర్థం లేని నిబంధనలతో అయినదానికి, కానిదానికి జరిమానాలు ఎడాపెడా విధించేస్తున్నారు. తాజాగా బస్సు డ్రైవర్‌కు హెల్మెట్ పెట్టుకోలేదని ఆన్లైన్ చలాన్ విధించారు. హెల్మెట్ పెట్టుకోకుండా బస్సు నడుపుతున్నందుకు రూ. 500 కట్టాలని నోటీసు పంపించారు. దీంతో ఆ డ్రైవర్ బిత్తరపోయి.. ఈ విషయాన్ని బస్సు యాజమానికి తెలిపాడు. ఈ ఘటన నోయిడాలో జరిగింది. నోయిడాకు చెందిన నిరాంకార్ సింగ్‌కు సొంతంగా 40 నుంచి 50 బస్సులు ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు, కంపెనీలకు తన బస్సులను అద్దెకిచ్చి నడిపిస్తుంటాడు. సెప్టెంబర్ 11వ తేదీన ఆయనకు ఒక చలాన్ వచ్చింది. తన బస్సు నడుపుతున్న డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని, అందుకు రూ. 500 చలాన్ చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు నోటిసు పంపారు. దీంతో నిరాంకర్ సింగ్, ఆయన డ్రైవర్ బస్సు నడిపేందుకు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలంటూ విస్తుపోయారు. ట్రాఫిక్ సిబ్బంది ఒకవేళ పొరపాటున తనకు ఈ చలాన్ పంపించి ఉండొచ్చునని, కానీ, ఒక బస్సు యాజమానికే ఇలాంటి చలాన్ వస్తే.. ఇక మిగతా చలాన్లు ఎంతవరకు సవ్యంగా వస్తున్నాయన్నది సందేహాలు రేకెత్తిస్తోందని, దీనిపై ట్రాఫిక్ అధికారులను సంప్రదించడమే కాదు.. అవసరమైతే న్యాయం పోరాటం చేస్తానని నిరాంకర్ సింగ్ స్పష్టం చేశారు. -
అలా చేస్తే రూ.22 వేల చలానా తప్పించుకోవచ్చు..!
న్యూఢిల్లీ : నూతన మోటారు వాహన చట్టం అమల్లోకి రావడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు పడుతున్నాయి. చలానా మొత్తాలు ఏకంగా 10 రెట్లు పెరిగాయి. గతంలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా విధించగా.. ఇప్పుడది రూ.5000లకు చేరింది. ఇక ఈ చట్టంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాహనం ఖరీదు కంటే చలానా మొత్తమే ఎక్కువగా ఉన్న ఉదంతాలూ వెలుగుచూశాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు యథాతదంగా నూతన మోటారు వాహన చట్టాన్ని అమలు చేస్తుండగా.. కొన్ని రాష్ట్రాలు జరిమానా మొత్తాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలాఉండగా.. పంజాబ్‌కు చెందిన సునీల్ సంధూ అనే పోలీసు సోషల్ మీడియా వేదికగా వాహనదారులకు భారీ ఊరట కలిగించే ప్రయత్నం చేశాడు. అన్ని పత్రాలు ఉండి కూడా కొందరు జరిమానాలు చెల్లిస్తున్నారని.. అలాంటి వారు కొంచెం ఓపిగ్గా వ్యవహరిస్తే దాదాపు రూ.22 వేల చలానా నుంచి బయటపడొచ్చని తెలిపాడు. ‘లైసెన్స్ లేకుండా ట్రాఫిక్ సిబ్బందికి చిక్కితే రూ.5 వేలు ఫైన్ చెల్లించాలి. దాంతోపాటు బండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకుంటే రూ.5 వేలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే రూ.10 వేలు, ఇన్సూరెన్స్ లేకపోతే రూ.2 వేలు చెల్లించాల్సి వస్తుంది. అంటే మొత్తం అక్షరాల రూ.22 వేలు జరిమానా చెల్లించాలి. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ.. వాటిని ట్రాఫిక్ సిబ్బందికి సమర్పించకపోతే భారీ చలానాలు తప్పవు. అటువంటి సందర్భాల్లో కాస్త సహనం ప్రదర్శించాలి. చలానా మొత్తం చెల్లించడానికి వాహనదారుడికి 15 రోజుల గడువు ఉంటుంది. ఆ సమయంలో కాస్త కష్టమైనా ఫరవాలేదు. ఓపికతో వాహనం పత్రాలన్నీ సంబంధిత అధికారులకు సమర్పిస్తే సరి. విధించిన చలానాలను రద్దు చేస్తారు. నామమాత్రంగా కేవలం రూ.100 మాత్రమే జరిమానాగా విధిస్తారు’ అని సునీల్ సంధూ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో వైరల్ అయింది. -
ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయత్నం
సాక్షి, హైదరాబాద్ : నూతన మోటారు వాహన సవరణ చట్టంతో వాహనాదారులు బెంబేలెత్తుతున్న సంగతి మనకు తెలిసిందే. ట్రాఫిక్ ఉల్లంఘనపై విధిస్తున్న జరిమానాలతో తమ వాహనాలను బయటికి తీయడానికి కూడా వాహనదారులు భయపడుతున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెలువడుతున్ననేపథ్యంలో తెలంగాణలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశానుసారం కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. ఇకపై హెల్మెట్, బండి ఇన్సురెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, లైసెన్స్ లేని వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లు విధించకుండా వాటిని వారితోనే కొనిచ్చే ప్రయత్నాన్ని మొదలు పెట్టినట్లు ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్ రావు పేర్కొన్నారు. ఇది మంచి ప్రయత్నం అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. -
బైక్ ధర కన్నా..చలాన్లే ఎక్కువ.. మీరే ఉంచుకోండి!
-
బైక్ ధర కన్నా..చలాన్లే ఎక్కువ.. మీరే ఉంచుకోండి!
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టంలో భారీ ట్రాఫిక్ జరిమానాలు విధిస్తుండటంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ గురువారం వినూత్న నిరసనను చేపట్టింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసం ఎదుట కొన్ని మోటారు బైక్‌లను వదిలేసింది. ఈ బైక్‌ల ధరల కన్నా చలాన్ల రుసుమే ఎక్కువగా ఉందని, నమ్మశక్యంగానీరీతిలో విధించిన ఈ చలాన్లను భరించలేక బైక్‌లను వదిలేసి పోతున్నామని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ నివాసం ఈ బైక్‌లతో ఎదుట ఆందోళన నిర్వహించారు. కొత్త చట్టంలో సామాన్య ప్రజలు భరించేలేనిరీతిలో జరిమానాలు విధిస్తున్నారని, చాలా కేసుల్లో బైక్‌ల ధరల కన్నా.. జరిమానాల మొత్తం అధికంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ నిరసనను చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పౌరుల వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ నోటీసుల పేరిట తమ వెబ్సైట్లో వాహనదారుల పూర్తి వివరాలు పొందుపరుస్తున్నారని, కేవలం బండి రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటే చాలు.. వాహనదారుల పూర్తి వివరాలు వెబ్సైట్లో తెలుసుకునేవిధంగా ఉన్నాయని, ఇది పౌరుల వ్యక్తిగత ప్రైవసీపై దాడి చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమాచారం సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి చేరే అవకాశముందని బీ. శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ట్రాఫిక్ చలాన్లను తగ్గించనున్న మరో రాష్ట్రం!
యశవంతపుర: ఈ నెల ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మోటారు వాహన చట్టంతో వాహనదారులపై భారీ జరిమానాలు పడుతున్నాయి. రవాణా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు చలానాలు రాస్తున్నారు. దీనిపై ప్రజలలో వ్యతిరేకత వ్యక్తం కావటంతో గుజరాత్ మాదిరిగా కన్నడనాట కూడా చలాన్లను సగానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం బీఎస్ యడియూరప్ప బుధవారం ఈ విషయమై రవాణాశాఖ అధికారులకు సూచనలు చేశారు. తగ్గింపునకు సంబంధించి అధికారులతో చర్చించి సీఎం చేసిన ఆదేశాలను గట్టిగా పరిశీలిస్తున్నట్లు డీసీఎం, రవాణా శాఖమంత్రి లక్ష్మణ సవది తెలిపారు. ఇప్పటికే గుజరాత్లో మోటారు వాహన చట్టంలో మార్పులు తెచ్చి జరిమానాలను సగం వరకూ తగ్గించారు. దీంతో వాహనదారులకు కొంతైనా ఊరట దక్కింది. రాష్ట్రంలో కూడా చలాన్ల బాదుడుపై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ మాదిరిగా వ్యవహరించాలని సంకల్పించింది. గుజరాత్ తరహాలో ట్రాఫిక్ చలాన్లు తగ్గిస్తామని సీఎం బీఎస్ యడ్యూరప్ప మీడియాతో పేర్కొన్నారు. 2 రోజుల్లో నివేదిక ఇతర రాష్ట్రాలలో విధిస్తున్న జరిమానాల విధానాన్ని కర్ణాటక అధికారులు అధ్యయనం చేశారు. రెండు రోజుల్లో సంపూర్ణ నివేదికను సీఎంకు అందజేయనున్నారు. ఆ తరువాత జరిమానాలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జరిమానాల విధానంపై అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు డీసీఎం లక్ష్మణ సవది తెలిపారు. బెంగళూరులో కొత్త ట్రాఫిక్ జరిమానాలపై ఆవేదన వ్యక్తమవుతోంది. గుజరాత్లో హెల్మెట్ ధరించకుంటే రూ. వెయ్యికి బదులు రూ.500, సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే రూ.500 జరిమానాగా వసూలు చేస్తున్నారు. త్రిబుల్ రైడ్‌కు కేంద్రం వేయి రూపాయిల జరిమానాను విధించగా గుజరాత్ ప్రభుత్వం నూరు రూపాయలను వసూలు చేస్తోంది.ఇదే విధానాన్ని కర్ణాటకలోనూ అమలు చేయాలని సీఎం యడియూరప్ప నిర్ణయించారు. గుజరాత్లో మొదటి సారి సగమే విధించినా రెండోసారి అవే ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్రం విధించిన జరిమానాలను వసూలు చేస్తున్నారని కర్ణాటక అధికారుల బృందం చేసిన సర్వేలో తెలింది. ఎలాంటి విధానం అవలంబించాలన్న దానిపై పూర్తి నివేదిక వచ్చాక చర్చించి వారం నుండి తగ్గింపు జరిమానాలను అమలు చేసే అవకాశం ఉంది. జరిమానాల వసూలుపై సీఎం ఆరా రాష్ట్రంలో ఇప్పటివరకు వసూలైన కొత్త జరిమానాల వివరాలను సీఎం యడియూరప్ప అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల్లో కోటి రూపాయిల వరకు జరిమానాలు వసూలు చేసిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే ఐదు వందలకు మించి వసూలు చేస్తే ప్రజలపై భారం పడటంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని అధికారులు వివరించినట్లు తెలిసింది. చదవండి: ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు -
చలానా.. కోట్లు..సాలీనా!
మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, ఓవర్‌స్పీడ్ డ్రైవింగ్... ఏదైతేనేమి ఏటా వాహనదారులు వందల కోట్ల రూపాయలు జరిమానాలు చెల్లిస్తున్నారు. అయినా వారిలో మార్పు రావడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లా చూసినా ట్రాఫిక్ చలాన్ల మోత మోగిపోతోంది. చలాన్లలో ఓవర్‌స్పీడ్, హెల్మెట్‌లేని డ్రైవింగ్‌లే అధికం. నిబంధనలు పాటించని వాహనదారులు రూ.కోట్లు చలాన్లు కడుతున్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు గణాంకాలను పరిశీలిస్తే... ఒక్క రంగారెడ్డి జిల్లా నుంచి ఖజానాకు రూ.88 కోట్ల ఆదాయం వచ్చింది. నల్లగొండ నుంచి అత్యల్పంగా రూ.4 కోట్లు వసూలయ్యాయి. ఇక కేసుల విషయానికొస్తే.. రంగారెడ్డి జిల్లా నుంచి ఎక్కువ నమోదు కాగా, ఆదిలాబాద్ నుంచి తక్కువ నమోదయ్యాయి. చలాన్లకు కొత్త చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో టౌన్ స్కాన్... – సాక్షి, నెట్వర్క్ -
ఆదాయం కోసం కాదు; ప్రాణాలు కాపాడాలని చేశాం
సాక్షి, ఢిల్లీ : ట్రాఫిక్ జరిమానాలను భారీగా పెంచడంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి స్పందించారు. ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవడానికి జరిమానాలను పెంచలేదనీ, తమకు ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమంటూ బుధవారం స్పష్టం చేశారు. అయితే పెంచిన జరిమానాలను రాష్ట్రాలు వాటి అధికార పరిధికి లోబడి తగ్గించుకోవచ్చన్నారు. మరోవైపు భారీ ట్రాఫిక్ జరిమానాలపై సోషల్‌మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో మంత్రి తమ చర్యను సమర్థించుకున్నారు. ఈ విషయంలో ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని గడ్కరీ తెలిపారు. -
ట్రాఫిక్ చలాన్లను కడితే బికారే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలపై సోషల్ మీడియా తనదైన రీతిలో స్పందిస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై భారీగా చలాన్లను పెంచడాన్ని తీవ్రంగా దూషిస్తోంది. చలాన్లను చెల్లించిన తర్వాత రోడ్డుపై అడుక్కుతినాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఒకరు బాలీవుడ్ చిత్రం ‘సంజూ’లో రణీబీర్ కపూర్ రోడ్డుపై అడుక్కుంటున్న దృశ్యాన్ని పోస్ట్ చేశారు. అప్పటి వరకు జల్సాగా రోడ్లపై బలాదూర్ తిరిగిన ఓ యువకుడు ట్రాఫిక్ చలాన్లను చెల్లించాక బస్టాండ్‌లో వచ్చిపోయే బస్సుల వెంట తిరిగుతూ నూనె డబ్బులు అమ్ముతున్న దశ్యం అంటూ మరో బాలీవుడ్ చిత్రంలోనే ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ట్రాఫిక్ చలాన్లను చెల్లించేందుకు రుణాల కోసం బ్యాంకుల ముందు బారులు తీరిన ప్రజలంటూ తమదైన శైలిలో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. చదవండి: ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు భారీగా పడిపోవడానికి కారణం యూత్ కొత్త కార్ల కొనుగోలుకు మొగ్గుచూపకుండా ఊబర్, ఓలా క్యాబ్‌ల పట్ల ఆకర్షితులవడమేనంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు వదిలి పెట్టలేదు. ఇంతకుముందు సంగతేమోగానీ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పెంచిన చలాన్లు అమల్లోకి వస్తాయని ప్రకటించిన నాటి నుంచి వాహనాల కొనుగోలు భయంకరంగా పడిపోయిందని పలువురు సెటైర్లు వేశారు. రోడ్లు, ట్రాఫిక్ లైన్లు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, అందుకు భారీ వడ్డింపులే మార్గమని ఆలోచిస్తే బాగుండేదని కూడా సోషల్ మీడియా యూజర్లు సూచిస్తున్నారు. రోడ్డుపై ఎన్ని గుంతలు ఉంటే గుంతకు రోజుకు వెయ్యి రూపాయల చొప్పున మున్సిపాలిటీకి, తెల్లటి, నల్లటి ట్రాఫిక్ చారికల్ సవ్యంగా లేకపోతే లైన్‌కు ఐదు వందల రూపాయల చొప్పున ట్రాఫిక్ విభాగానికి ముందుగా చలాన్లు విధించండని, ఆ తర్వాతనే వాహనదారుల జోలికి రావడమే సమంజసమని పలువురు సూచించారు. -
నా కారుకే జరిమానా విధించారు : గడ్కరీ
ముంబై : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 పై విస్తృత చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. పలువురు వాహనదారులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని అనుసరించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన పలువురు వాహనదారులకు అధికారులు భారీ జరిమానాలు విధించారు. దీనిపై స్పందించిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ .. ఈ చట్టం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిలో మార్పు వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ చట్ట ప్రకారం విధించే జరిమానాలను ఆయన సమర్థించారు. ప్రధాని నరేంద్ర మోదీ 100 రోజుల పాలనపై గడ్కరీ ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోటార్ వాహన సవరణ చట్టంపై ఆయన స్పందిస్తూ.. అధిక వేగం కారణంగా ముంబైలో తన వాహనం కూడా జరిమానాకు గురైందని చెప్పారు. తాను ఆ జరిమానాను చెల్లించినట్టు వెల్లడించారు. దేశంలో రోడ్డు భద్రతను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని జాతీయ రహదారులపై 786 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని చెప్పారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లలో 30 శాతం నకిలీవేనని తెలిపారు. ట్రాఫిక్ అధికారులు ఎవరిపై వివక్ష చూపరని తెలిపిన ఆయన.. నిబంధనలు ఉల్లఘించిన వారు ఎవరైనా సరే తప్పకుండా జరిమానా కట్టాల్సిందేనని అన్నారు. గతంలో కొందరు ముఖ్యమంత్రుల వాహనాలకు అధికారులు జరిమానాలు విధించినట్టు గుర్తుచేశారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఇతర పత్రాలను తమ వెంట ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ భారీ జరిమానాల కారణంగా అవినీతి పెరుగుతుందనే ఆరోపణలను గడ్కరీ ఖండించారు. తాము అన్ని చోట్ల కెమెరాలు పెట్టామని.. అలాంటప్పుడు అవినీతికి అస్కారం ఎక్కడుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన సవరణ చట్టం కారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినవారికి విధించే జరిమానాలు గతంతో పోల్చితే భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. -
మన చలానాలూ.. సదుపాయాలూ తక్కువే
భువనేశ్వర్‌లో ఓ ఆటో డ్రైవర్‌కి ట్రాఫిక్ పోలీసులు రూ.45వేలు జరిమానా విధించారు. రోజుకు రూ.500 కిరాయి చెల్లించి నడుపుకుంటున్న ఆటోకి, అంత చలానా ఎక్కడి నుంచి తేవాలంటూ బోరుమన్నాడు. ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని ఓ వాహనదారుడికి రూ.25 వేల జరిమానా పడింది. రూ.13 వేలు పెట్టి సెకండ్ హ్యాండ్లో కొన్న బైకుకు అంత జరిమానా చెల్లించలేనంటూ పోలీసుల వద్దే దాన్ని వదిలిపోయాడు. – సాక్షి, హైదరాబాద్ మోటారు వాహన సవరణ చట్టం– 2019 ప్రస్తుతం తెలంగాణలో అమలు కాకున్నా.. వాహన దారులను మాత్రం బెం బేలెత్తిస్తోంది. అమలులో జాప్యం ఉండ వచ్చు గానీ, అమలు మాత్రం ఖాయమన్న సంగతిని వాహనదారులకు పోలీసులు ప్రచారం ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో ఇప్పటికే భారీ జరిమా నాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కానీ, పోలీసులు చెబుతున్న ట్రాఫిక్ జరిమానాలు చాలా మంది నెల వేతనం కంటే అధికంగా ఉండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇక నిజంగానే ఫైన్ కట్టాల్సి వస్తే తమ గతేం కాను అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డ్రైవింగ్ వృత్తిగా జీవించే ఆటో, క్యాబ్, బస్సు, లారీ డ్రైవర్లు తీవ్ర మథన పడిపోతున్నారు. వీరిలో చాలా మంది బండ్లను ఫైనాన్స్‌లో తీసుకుని నెల వాయిదాలు కట్టుకుంటున్నారు. కొత్త జరిమానాలు అమలులోకి వస్తే.. తమ ఆదాయం, ఫైనాన్స్ వాయిదాలకంటే అవే అధికంగా ఉంటే తమ బతుకులు రోడ్డు పాలు అవుతాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది డ్రైవర్ల కనీస వేతనం రూ.8,000 నుంచి రూ.15 వేల వరకు ఉంది. ఇక నెలలో రెండు ఫైన్లు పడితే రూ.10 వేలు జేబుకు చిల్లు పడుతుం దని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే ఓనర్లు తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని వారు అంటున్నారు. ఫైనాన్స్‌లో కొని సొంతంగా నడుపుకునే ఆటో, క్యాబ్‌లలో నెల కిస్తీ రూ.8000 నుంచి రూ.13,500 నుంచి మొదలవుతాయి. రోడ్డు, పార్కింగ్ సదుపాయాలు మెరుగు పరచకుండా ఇష్టానుసారంగా ఫైన్లు విధించడం సబబు కాదంటున్నారు. పోలీసులపై మండిపడుతున్న నెటిజన్లు.. ప్రమాదాల నివారణలో భాగంగా చలానాలు విధించడాన్ని తప్పుబట్టడం లేదు. కానీ, సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్న చలాన్లపై పునరాలోచించుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. అదే సమయంలో చలానాలు విదేశాలతో పోలిస్తే.. మన వద్దే తక్కువ అయితే సంతోషమే. కానీ, ఆయా దేశాల్లో ఉన్నంత అక్షరాస్యత, విశాలమైన, నాణ్యమైన రోడ్లు, మెరుగైన వైద్య సదుపాయాలు, ప్రమాద స్థలానికి నిమిషాల్లో చేరుకోగలిగే హెలికాప్టర్ అంబులెన్సులు, గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్లు, ఉచిత వైద్యం తదితర సదు పాయాలు ఇక్కడా ఉండాలి కదా మరి? అని వారు ప్రశ్నిస్తున్నారు. -
గీత దాటితే మోతే!
సాక్షి, వేటపాలెం (ప్రకాశం): మీ పిల్లలకు వాహనాలిస్తున్నారా? మైనర్ అయి ఉండి పోలీసులకు పట్టుబడితే ఇకపై మీరు జైలుకెళ్లాల్సి ఉంటుంది. మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే నామమాత్రపు జరిమానా చెల్లించి బయటపడొచ్చని అనుకుంటున్నారా? ఇక మీదట డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే మాత్రం భారీ జరిమానాతో పాటు జైలుకెళ్లాల్సిందే. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో అంబులెన్సుకు దారి ఇవ్వకపోతే ఇకపై భారీ జరిమానా చెల్లించుకోవాల్సిందే. ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి వచ్చే నెల 1 నుంచి భారీగా జరిమానాలు పోలీసులు విధించనున్నారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. ఇప్పటి వరకు విధించే జరిమానాలు కొన్ని రెట్టింపు కాగా, మరికొన్ని మూడు, నాలుగు రెట్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే పిల్లల తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు రూ. 25 వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే అవకాశమూ ఉంది. ఒకవేళ పిల్లలు ప్రమాదం చేస్తే తల్లిదండ్రులు, సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. రోడ్డుపై వెళ్లే అంబులెన్సుకు దారి ఇవ్వకపోతే రూ. 10 దివేల జరిమానా చెల్లించాలి. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఇటీవల జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మరోవైపు హైవేలపై జరుగుతున్న ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, మద్యం మత్తులో జరిగే ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అయితే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీ ఎత్తున జరిమానాలు విధించేందుకు అటు పోలీసులు, ట్రాఫిక్ అధికారులతో పాటు రవాణా శాఖ అధికారులు సిద్ధమయ్యారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనకు పాల్పడే వాహనదారులకు రూ. 1లక్ష వరకు జరిమానా విధించే అధికారం ఆయా శాఖల అధికారులకు ఉంది. రోడ్డుపై పరిమితికి మించి వేగంగా దూసుకెళ్లే వాహనదారులకు రూ. 1000 నుంచి రూ. 2 వేల వకు జరిమానా విధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. వాహన బీమా లేకుండా వాహనం నడిపితే రూ. 2వేలు , సీటుబెల్టు లేకుండా వాహనం నడిపితే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినా రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 10 వేలు జరిమానాతో పాటు జైలుశిక్ష అనుభవించాలి. రవాణా చేసే వాహనాలు ఓవర్ లోడుతో పట్టుబడితే రూ. 20 వేలు చెల్లించేలా నిబంధనల్లో మార్పు చేశారు. అధికారులే ఉల్లంఘిస్తే జరిమానాలు రెట్టింపు అవుతాయని నిబంధనల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు. -
బీ కేర్‌ఫుల్...డబ్బులు ఊరికేరావు
శ్రీనగర్‌కాలనీ: ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ తప్పనిసరిగా పాటిస్తే ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడమేగాకుండా 80శాతం ప్రమాదాలను నివారించవచ్చని ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ సీఐ శ్రీకాంత్‌గౌడ్ అన్నారు. హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ తదితర ఉల్లంఘనలకు పాల్పడినా చలాన్లు కడితే సరిపోతుందిలే అనుకంటే పొరపాటే...కొత్త నిబంధనలతో జరిమానాలు ఐదు రెట్లు పెరగడంతో పాటు కఠిన శిక్షలు అమలులోకి వస్తున్నాయన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలి వస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ జరిమానాలు, ట్రాఫిక్ నిబంధనలపై బుధవారం వాహనదారులకు అవగాన కల్పించారు. చలాన్లు ఐదింతలు... నూతన ట్రాఫిక్ నిబంధనల ద్వారా చలాన్లు ఐదింతలు పెరిగాయి. వాహనదారుల్లో మార్పు తక్కువగా ఉండటంతో ఉన్నతాధికారులు చలాన్లను తీవ్రతరం చేశారు. వాహనదారులు ఈ విషయమై అవగాహన పెంచుకొని ట్రాఫిక్ ఉల్లంఘనలపట్ల జాగ్రత్తగా ఉండాలి. తాగినడిపితే జైలుకే... డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 10 వేల జరిమానాతో పాటు జైలు కెళ్లాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లను ఒకప్పుడు వారాంతాల్లో నిర్వహించే వాళ్లం...ఇప్పుడు ప్రతిరోజు డ్రైవ్‌లను నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవర్ల పని పడుతున్నాం. రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దుచేసి కఠిన శిక్షలను అమలు చేస్తున్నాం. చలానా కట్టకపోతే కఠిన చర్యలు.. చలానాలు కట్టకపోతే ఏమీకాదులే అని అనుకుంటే పొరపాటే.. నూతన నిబంధనలతో జైలుకు వెళ్లాల్సిందే. పెండింగ్‌లో ఉన్న చలానాలు చెల్లించకపోతే ఎదురయ్యే పరిణామాలను సవివరంగా ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఐదు కంటే ఎక్కువ చలానాలు ఉన్న వాహనాలకు చార్జిషీట్లు వేస్తూ, ఆరు నెలల జైలుతో పాటు జరిమానా కూడా విధిస్తున్నారు. వాహనదారులు ప్రతిఒక్కరూ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండాలి. ఇన్సూరెన్స్ లేకపోతే వాహనదారుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ ఇన్సూరెన్స్‌లు సైతం వినియోగించుకోవచ్చు. చలాన్లను ఈ–సేవా, మీ–సేవా, ఏపీ–ఆన్లైన్, ఎస్బీఐ, పోస్ట్ఆఫీస్, నెట్ బ్యాంకింగ్, ట్రాఫిక్ పోలీస్ యాప్ ద్వారా మొబైల్ ద్వారా కూడా చెల్లించవచ్చు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు...బీ కేర్‌ఫుల్...డబ్బులు ఊరికే రావు... ‘ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవండి...డబ్బును ఆదా చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. Follow Traffic Rules...Save Your Money. pic.twitter.com/hfElm0hLCm — Hyderabad City Police (@hydcitypolice) August 22, 2019 కొత్తగా అమలులోకి రానున్న చలాన్ల రేట్లు ఇవీ -
చట్టాలు కఠినంగా ఉన్నాయ్ చూసి నడపండి
అల్లిపురం(విశాఖ దక్షిణం): ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా ఫైన్ల మోత మోగనుంది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా, శిక్ష రెండూ అనుభవించాల్సి ఉంటుంది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇప్ప?టి వరకు విధించే జరిమానాలన్నీ కొన్ని రెట్టింపు కాగా, మరికొన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ మంత్రి వర్గం తీర్మానించింది. ఇకపై చిన్నపిల్లలకు (మైనర్లకు) వాహనాలు ఇస్తే పిల్లల తల్లిదండ్రులకు, సంరక్షకులు లేదా వాహనం ఇచ్చిన వ్యక్తికి రూ.25వేల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్సు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. వారి పిల్లలు ప్రమాదం చేస్తే తల్లిదండ్రులు, సంరక్షకులను దోషులుగా నిర్దారిస్తారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోతే రూ. 10వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుýడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. రోడ్లపై అతివేగంతో దూసుకెళ్లే వాహనచోదకులకు రూ.1000 నుంచి రూ.2000 జరిమానా విధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. బీమా లేకుండా వాహనం నడిపితే రూ. 2 వేలు జరిమానా చెల్లించాలి. సీటు బెల్టు ధరించక పోతే రూ.1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లెసెన్సు రద్దు చేస్తారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించినా రూ.1000 జరిమానాతో పాటు మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్సు రద్దవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘిస్తే రూ. 500 జరిమానా విధిస్తారు. అధికారుల ఆదేశాలు పాటించకుంటే గతంలో రూ.500 పెనాల్టీ విధించేవారు. ఇప్పుడు దానిని రూ.2 వేలకు పెంచారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాన్ని నడిపితే రూ.5వేలు, మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా నడిపితే రూ. 5 వేలు, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. రవాణా చేసే వాహనాలు ఓవర్ లోడింగ్ చేస్తే రూ.20 వేలు పెనాల్టీ చెల్లించేలా నిబంధనలు మార్పు చేశారు. ఇలాంటిæ నిబంధనలు స్వయంగా సంబంధిత అధికారులే ఉల్లంఘిస్తే జరిమానాలు రెట్టింపవుతాయి. దీనికి కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ™తగ్గుతాయి. ఇటీవల కాలంలో జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బిల్లు ఆమోదం పొందితే ఇలాంటి కఠిన నిబంధనలతో వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గుతుంది. -
30 రోజులు .. రూ.49 లక్షలు !
సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతున్న ‘నిషా’చరులు గత నెలలో చెల్లించిన జరిమానా ఎంతో తెలుసా.? అక్షరాల రూ.49,64,400. 498 మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధించిందని ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ బుధవారం వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో నలుగురికీ రెండు రోజుల చొప్పున జైలు శిక్ష పడిందని ఆయన పేర్కొన్నారు. 167 మంది డ్రైవింగ్ లైసెన్సులను (డీఎల్స్) న్యాయస్థానం శాశ్వతంగా రద్దు చేయడం, సస్పెండ్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చిక్కిన వారి మద్యం తీసుకున్న మోతాదు తదితరాలు పరిశీలించిన కోర్టు నలుగురి డ్రైవింగ్ లైసెన్సులను పూర్తిగా రద్దు చేయగా.. 17 మందివి మూడేళ్లు, 29 మందివి రెండేళ్లు, 16 మందివి ఏడాదిన్నర, 40 మందివి ఏడాది, 59 మందివి ఆరు నెలలు, ఒకరిది నాలుగు నెలలు, మరొకరిది వారం పాటు సస్పెండ్ చేసినట్లు అనిల్‌కుమార్ వెల్లడించారు. జైలుకు వెళ్లిన మిగిలిన మందుబాబుల్లో ఒకరికి నెల, 26 మందికి 10 రోజులు, 47 మందికి వారం, ఎనిమిది మందికి ఆరు రోజులు, 21 మందికి ఐదు రోజులు, మరో 21 మందికి నాలుగు రోజులు, 42 మందికి మూడు రోజులు, 125 మందికి రెండు రోజులు, 93 మందికి ఒక రోజు జైలు శిక్ష పడింది. మరో 116 మంది కోర్టు సమయం ముగిసే వరకు అక్కడే ఉండేలా న్యాయమూర్తి శిక్ష విధించారు. ఇలాంటి ఉల్లంఘనులకు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సెలింగ్ ఇస్తున్నామని, జైలు శిక్షలు పడిన వారికి భవిష్యత్తులో పాస్‌పోర్టు, వీసాలు, ఉద్యోగాలు రావడంలో అడ్డంకులు ఎదురు కావచ్చని అనిల్‌కుమార్ హెచ్చరించారు. -
ఒక్కో వాహనంపై 27 చలాన్లు
హిమాయత్‌నగర్: నగరంలో రోడ్లపై హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, ర్యాష్‌డ్రైవింగ్‌తో తోటి వాహనదారులను భయభ్రంతాలకు గురి చేస్తున్నారు. పలు దఫాలుగా సిగ్నల్స్ పాయింట్స్ వద్ద రికార్డైన సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా చలాన్లు ఇంటికి పంపినా స్పందించ లేదు. మంగళవారం తనిఖీలు నిర్వహిస్తున్న నారాయణగూడ ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణంరాజు హెల్మెట్ లేకుండా వెళ్తున్న రెండు బైక్‌లను ఆపి తనిఖీ చేయగా ఒక్కో వాహనంపై 27 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బొజ్జు హనుమంతు ‘ఏపీ–11ఏఎన్.5220’ వాహనంపై 27 చలాన్లు, రూ.6140, సంజయ్‌కుమార్ 11ఏ.ఎన్.8104, 27 చలాన్లు, రూ.3010 బకాయిలు ఉన్నాయి. హనుమంతు బకాయిలను చెల్లించడంతో వాహనాన్ని వదిలివేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అర్ధరాత్రి ఆగడాలపై నజర్
సాక్షి, సిటీబ్యూరో: అర్ధరాత్రి రహదారులపైకి వచ్చి బీభత్సం సృష్టిస్తున్న వాహనచోదకులపై నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా కొన్నింటిని కట్టడి చేసే ఉద్దేశంతో శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా 9864 కేసులు నమోదు చేసి 1031 వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. శాంతిభద్రతల విభాగం అధికారుల సాయంతో నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో కొందర నేరగాళ్లు, అనుమానితులతో పాటు చోరీకి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అర్ధరాత్రి సమయాల్లో నెంబర్ ప్లేట్లు లేకుండా, అడ్డదిడ్డమైన నెంబర్ప్లేట్స్తో, హారన్లు, సైలెన్సర్ల ద్వారా వాయు కాలుష్యానికి కారణమవుతూ సంచరిస్తున్న వాహనాలతో పాటు ట్రిపుల్ రైడింగ్, ప్రమాదకరమైన డ్రైవింగ్, రేసింగ్‌లపై ట్రాఫిక్ పోలీసులు దాడులు చేపట్టారు. ఇందులో భాగంగా కొందరు అనుమానితులు సైతం చిక్కారు. మారేడ్‌పల్లి ట్రాఫిక్ పోలీసులు టివోలీ చౌరస్తా వద్ద చేపట్టిన డ్రైవ్‌లో ఎనిమిది చైన్ స్నాచింగ్ కేసులతో సంబంధం ఉన్న మహ్మద్ అజీజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని బేగంపేట శాంతిభద్రతల విభాగం ఠాణాకు అప్పగించారు. అలాగే టోలిచౌకీలోని బాపుఘాట్ వద్ద లంగర్‌హౌస్ ట్రాఫిక్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఫహీమ్, మహ్మద్ అబ్దుల్ అలీం, షేక్ సాజిద్ అనే అనుమానితులను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. నల్లకుంట ట్రాఫిక్ పోలీసులు తార్నాక స్ట్రీట్ నెం.1లో చేపట్టిన తనిఖీలో ఓ మైనర్ బుల్లెట్ నడుపుతూ పోలీసులకు చిక్కాడు. వాహనాన్ని పరిÔశీలించగా నకిలీ నెంబర్ ప్లేట్ తగిలించినట్లు గుర్తించిన పోలీసులు దీనిపై ఆరా తీయగా ఉస్మానియా వర్శిటీ పరిధిలో చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో కేసును శాంతిభద్రతల విభాగానికి అప్పగించారు. నమోదైన కేసులు ఇలా... ఉల్లంఘన కేసులు సక్రమంగాలేనినెంబర్ప్లేట్ 6261 నెంబర్ ప్లేట్ లేకుండా 1853 హారన్/సైలెన్సర్ న్యూసెన్స్ 662 ట్రిపుల్ రైడింగ్ 938 డేంజరస్డ్రైవింగ్ 150 మొత్తం 9864 పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు 1031 శాంతిభద్రతల విభాగానికి అప్పగించినవి: 255 -
‘ఇయర్ ఫోన్లు’ ఉంటే ‘సెల్’లోకే!
సాక్షి,సిటీబ్యూరో: 2017 నవంబర్ 15... బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.1/12 జంక్షన్... సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఓ గర్భిణి రోడ్డు దాటుతోంది... సిగ్నల్‌ను పట్టించుకోని ఆర్టీసీ డ్రైవర్ బస్సు ముందుకు నడిపాడు... ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న ఆమె విషయం గమనించలేకపోయింది... ఫలితం గా బస్సు కింద పడి కన్నుమూసింది. ఈ ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర ట్రాఫిక్ పోలీసులు ‘ఇయర్ ఫోన్’ను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వీటిని ధరిస్తే పాదచారులే కాదు వాహనం నడిపే వారూ చుట్టుపక్కల పరిస్థితులను గమనించలేరని గుర్తించారు. దీంతో ఇయర్ ఫోన్లు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తూ చిక్కుతున్న వారిపై న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. ఈ నెలలో ప్రారంభించిన ఈ విధానంలో ఇప్పటి వరకు 192 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. వీరిలో ఆరుగురికి న్యాయస్థానం రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది. త్వరలో సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వారి పైనా చార్జ్షీట్లు దాఖలు చేయనున్నట్లు నగర ట్రాఫిక్ డీసీపీ–2 ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. సెల్ కన్నా ఇదే డేంజర్... నగరంలోని అనేక ప్రాంతాల్లో సెల్‌ఫోన్, ఇయర్ ఫోన్ డ్రైవింగ్ సర్వసాధారణమైంది. ప్రధానంగా యువతే ఈ రకంగా వాహనాలు నడుపుతున్నారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ కన్నా ఇయర్ ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సెల్‌ఫోన్ వాడే వ్యక్తి కేవలం కాల్ వచ్చినప్పుడే లిఫ్ట్ చేసి మాట్లాడటానికి వినియోగిస్తాడని, ఓ చెవిలో ఫోన్ పెట్టుకున్నా... మరో చెవి ద్వారా పరిసరాలను కాస్త అయినా పరిశీలించే, పరిస్థితుల్ని గుర్తించే ఆస్కారం ఉంటుందన్నారు. ఇయర్ ఫోన్ డ్రైవింగ్ చేసే వారిలో అత్యధికులు కాల్ మాట్లాడటం కంటే సంగీతం, పాటలు వినడానికే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఎఫ్ఎం రేడియో సంస్కృతి పెరిగిన నేపథ్యంలో ఈ ధోరణి మరింత ఎక్కువైందని చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిమానాలే... ఇలా సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఇయర్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ చిక్కిన వారికి ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసుల కేవలం జరిమానా మాత్రమే విధించే వారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనలను మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదకరంగా మారేవి, ఎదుటి వ్యక్తికి ప్రమాదకరంగా పరిగణించేవి, వాహనం నడిపే వారితో పాటు ఎదుటి వారికీ ముప్పు తీసుకువచ్చేవి. సెల్/ఇయర్ ఫోన్ డ్రైవింగ్‌కు ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ మూడో కేటగిరీలోకి చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉల్లంఘనులకు కేవలం జరిమానా విధించడం కాకుండా కోర్టుల్లో అభియోగపత్రాలు దాఖలు చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ కంటే ప్రమాదకరమైంది కావడంతో తొలిదశలో ఇయర్ ఫోన్ డ్రైవింగ్‌పై దృష్టి పెట్టారు. కోర్టులో చార్జ్షీట్లు దాఖలు చేయడానికి అనువుగా ఇందుకు ఎంవీ యాక్ట్‌లో ప్రత్యేక సెక్షన్ లేదు. దీంతో ప్రమాదరకంగా వాహనం నడపటం (సెక్షన్ 184) కింద అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. ‘బ్లూటూత్’ను ఎలా గుర్తిస్తారో? ఈ నెలలో ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసుల 192 మంది ఇయర్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వారి ని పట్టుకున్నారు. వీరి నుంచి వాహనాలు స్వాధీ నం చేసుకున్న అధికారులు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సిలింగ్ అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేస్తూ కోర్టులో హాజరుపరిచా రు. కేసు పూర్వాపరాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆరుగురికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించింది. ద్విచక్ర వాహన చోదకు డు ఇయర్‌ఫోన్/సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తుంటే గుర్తించడం తేలికే. కార్లలో వెళ్తున్న వారి విషయంలోనే ఇది కాస్త కష్టసాధ్యం. మరోపక్క ఇటీవల కాలంలో కార్లలో బ్లూటూత్స్ వినియోగిస్తున్న నేపథ్యంలో వారిని ఎలా పట్టుకుంటా రు? ఇలాంటి వాహనాల్లో తిరుగుతూ పెద్ద ఎత్తున మ్యూజిక్ వినే వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది కీలకంగా మారింది. నగరంలోని రోడ్లపై పాదచారులు సైతం ఇయర్‌ఫోన్, సెల్ఫోన్లు వినియోగించి నడుస్తూ వాహనచోదకులకు ఇబ్బందులు తెస్తున్నారు. అయితే మోటారు వెహికిల్ యాక్ట్ ప్రకారం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదని ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. -
పాతనోట్లతో ట్రాఫిక్ చెలాన్లు.. గడువు పెంపు
హైదరాబాద్: పాత రూ.500, రూ.1000 నోట్లతో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లు క్లియర్ చేసుకునే అవకాశాన్ని మరో 10 రోజుల పాటు పొడిగించినట్లు ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ మంగళవారం వెల్లడించారు. తొలుత ఆదివారం నుంచి ఇచ్చిన 48 గంటల గడువు సోమవారం సాయంత్రం తో ముసిగింది. రెండు రోజుల్లోనే 7,013 మంది వాహనదారులు రూ.13.53 లక్షలు చెల్లించారు. ట్రాఫిక్ అధికారుల లెక్కల ప్రకారం రూ.40 కోట్ల మేర ట్రాఫిక్ ఈ-చలాన్ల బకాయిలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత కరెన్సీతో చెల్లింపు గడువు పెంచితే మరింత మందికి ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఈ నెల 24 వరకు సమయం పొందారు. వాహనదారులు పెండింగ్ ఈ-చలాన్లను ఈ-సేవ, మీ-సేవ సెంటర్లతో పాటు బిల్ డెస్క్, ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌లు, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్‌ల్లో చెల్లించవచ్చని డీసీపీ చౌహాన్ తెలిపారు. వాహనంపై జారీ అయి ఉన్న ఈ-చలాన్‌కు సంబంధించిన ప్రింట్ ఔట్ తీసుకుని చెల్లింపుల కోసం వెళ్ళడం మంచిదని సూచించారు. -
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు పాత నోట్లతో..
హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దుచేయడంతో ప్రజల ఇబ్బందులను గుర్తించిన జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించి మంచి ఫలితాలను రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ట్రాఫిక్ పోలీసు విభాగం కూడా రద్దయిన నోట్లతో ట్రాఫిక్ చలాన్లు కట్టుకోవచ్చని తెలిపింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను ఈ సేవ, మీ సేవ కేంద్రాలు.. ఆంధ్రాబ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు, ఇతర అధికారిక చెల్లింపు కేంద్రాలలో పాత నోట్ల ద్వారా సోమవారం సాయంత్రం వరకు కట్టుకోవచ్చని డీసీపీ చౌహాన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
ట్రాఫిక్ పోలీసుల దసరా ఆఫర్
సాధారణంగా దసరా సీజన్ వచ్చిందంటే వివిధ దుకాణాల వాళ్లు ఆఫర్లు ప్రకటిస్తారు. ఈ-షాపింగ్ సైట్లు కూడా ఇప్పటికే పండగ ఆఫర్లతో ముందుకు వచ్చేశాయి. ఇలాంటి సమయంలో తాము మాత్రం ఎందుకు వెనకబడాలని.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సైతం వాహనచోదకులకు దసరా ఆఫర్ ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి తాము విధించే చలానాల్లో సగం మొత్తం కడితే సరిపోతుందంటూ '50% ఆఫ్' అనే ఆఫర్‌ను ప్రకటించారు. అయితే ఇందుకు ఓ చిన్న నిబంధన కూడా పెట్టారు. వాహన చోదకులు ముందుగా 'అదాలత్'కు హాజరై.. అక్కడే తమకు ట్రాఫిక్ పోలీసుల నుంచి అందిన చలానాలో సగం కడితే సరిపోతుందన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు గోషామహల్‌లోని పోలీసు స్టేడియంలో నిర్వహించే అదాలత్‌కు చలానాలు తీసుకుని వచ్చి.. ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. -
రాజధానిలో బ్రేకేసిన ఆటోలు
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో సమ్మె కారణంగా దాదాపు చాలా వరకు ఆటోలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఆటోల్లో మీటర్ చార్జీలు పెంచాలని, ట్రాఫిక్ చలానాల పెంపు జీవోను రద్దు చేయాలని కోరుతూ... ఆటో సంఘాల జేఏసీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెను చేపట్టింది. దీంతో హైదరాబాద్‌లో తిరిగే లక్షా 20 వేల ఆటోల్లో 65 శాతం వరకు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. అందులో సుమారు 25 వేల స్కూల్ ఆటోలు నిలిచిపోవడంతో... విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు.. మహాత్మాగాంధీ, జూబ్లీ తదితర బస్స్టేషన్ల వద్ద ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. దాంతో శనివారం సిటీ బస్సులు కిక్కిరిసిపోయాయి. అయితే, బీఎంఎస్‌తో పాటు మరికొన్ని ఆటో సంఘాలు సమ్మెకు దూరంగా ఉండడంతో.. పలు ప్రాంతాల్లో ఆటోలు తిరిగాయి. కొందరు ఆటోవాలాలు ప్రయాణికుల నుంచి అందినకాడికి వసూలు చేయడం కనిపించింది. కాగా.. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని, ఆదివారం నుంచి మరింత ఉధృతం చేస్తామని ఆటో జేఏసీ ప్రతినిధులు సత్తిరెడ్డి, వెంకటేశం తెలిపారు. సమ్మె ప్రభావం... మొత్తం ఆటోలు : లక్షా 20 వేలు సమ్మెలో పాల్గొన్నవి : 65 శాతం తిరిగిన ఆటోలు : 35 శాతం సమ్మెకు మద్దతునిస్తున్న సంఘాలు : 16 (ఆటో సంఘాల జేఏసీ) దూరంగా ఉన్న సంఘాలు : బీఎంఎస్, ఆటో సంఘాల నాన్ పొలిటికల్ జేఏసీ -
నేటి అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్
హైదరాబాద్‌లో సుమారు 1.20 లక్షల ఆటోలు ఆగిపోయే అవకాశం ఇందులో 25 వేల స్కూల్ ఆటోలు గ్రేటర్ పరిధిలో 1520 లక్షల మందికి ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆటో చార్జీలు పెంచాలని, ట్రాఫిక్ చలానాలు రూ.1,000కి పెంచు తూ గత సంవత్సరం జారీ చేసిన జీవో 108ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో సంఘాల జేఏసీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆటో బంద్‌కు పిలుపునిచ్చిం ది. 16 ఆటో సంఘాల నేతృత్వంలో ఈ సమ్మె చేపట్టాలని నిర్ణయించినట్లు జేఏసీ ప్రతినిధులు బి.వెంకటేశం (ఏఐటీయూసీ), ఎ.సత్తిరెడ్డి (ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ల సమాఖ్య), నరేందర్ (ఐఎఫ్టీయూ) గురువారం తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆటో కనీస చార్జి రూ.16 నుంచి రూ.25 చేయాలని, ఆపైన ప్రతి కి.మీ.కి రూ.15కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. భారతీయ మజ్దూర్ సంఘ్(బీఎంఎస్) బంద్‌కు దూరంగా ఉంది. ఆర్టీసీ అదనపు బస్సులు! ఆటో సమ్మె అనివార్యమైతే 100 బస్సులు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. సికింద్రాబాద్-ఆఫ్జల్‌గంజ్, లక్డీకాపూల్-వీఎస్టీ, రామ్‌నగర్-కోఠి, రామంతాపూర్-లక్డీకాపూల్, చార్మినార్-ఆఫ్జల్‌గంజ్, సనత్‌నగర్-లక్డీకాపూల్ వంటి రూట్లలో ఇవి అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కోటేశ్వర్రావు తెలిపారు.