రద్దయిన నోట్లతో ట్రాఫిక్ చలాన్లు కట్టుకోవచ్చని ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది
హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దుచేయడంతో ప్రజల ఇబ్బందులను గుర్తించిన జీహెచ్‌ఎంసీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించి మంచి ఫలితాలను రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ట్రాఫిక్ పోలీసు విభాగం కూడా రద్దయిన నోట్లతో ట్రాఫిక్ చలాన్లు కట్టుకోవచ్చని తెలిపింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను ఈ సేవ, మీ సేవ కేంద్రాలు.. ఆంధ్రాబ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు, ఇతర అధికారిక చెల్లింపు కేంద్రాలలో పాత నోట్ల ద్వారా సోమవారం సాయంత్రం వరకు కట్టుకోవచ్చని డీసీపీ చౌహాన్ ఓ ప్రకటనలో తెలిపారు.