old currency
-
రద్దయి రెండేళ్లయినా...ఇంకా పాతనోట్లు..
అహ్మదాబాద్ : పెద్ద నోట్లు రద్దు చేసి రెండేళ్లు కావస్తున్నా ఇంకా ఆ నోట్లు పెద్దమొత్తంలో పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లోని నౌరాసిలో రూ.3.5 కోట్ల విలువైన పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఓ కారులో ఈ నగదును తరలిస్తుండగా...పోలీసులు పట్టుకున్నారు. పాత నోట్లు పట్టుబడిన విషయాన్ని గుజరాత్ ఎక్సైజ్ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ పాత కరెన్సీని ఎక్కడకు తరలిస్తున్నారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం 2016లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెల్సిందే. రద్దు అయిన నోట్లను మార్చుకునేందుకు గడువు కూడా ఇవ్వడం జరిగింది. గడువు పూర్తి అయిన తర్వాత ఎవరి వద్దనైనా పాత నోట్లు ఉంటే శిక్షార్హం అంటూ కేంద్రం జీవో కూడా అమల్లోకి తెచ్చింది. అయినా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకా రద్దయిన నోట్లను సీజ్ చేస్తూనే ఉన్నారు. -
చెత్తలో భారీగా రద్దైన నోట్లు
హైదరాబాద్: నగరంలోని నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాజ్‌పేయినగర్‌లో రైల్వేగేటు వద్ద చెత్తలో భారీగా రద్దైన నోట్లు బయటపడ్డాయి. చంద గంగుభాయి అనే మహిళకు గురువారం ఉదయం రూ. 16 లక్షల రద్దైన నోట్లు దొరికాయి. వాటిలో 1000, 500 రూపాయల నోట్లు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపింది. స్థానిక పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెయ్యి కోట్ల పాత కరెన్సీ తరలింపు..
చెన్నై: నెల్లె ప్రజలు ఇతర ప్రాంతాల ప్రజలతో కలిసి పాత నోట్లను సేకరించారు. ప్రజలు, సంస్థల నుంచి సేకరించిన పాత రూ.500, రూ.1000 నోట్లు బుధవారం తిరుచందూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా చెన్నైకు తీసుకు వచ్చారు. తిరునల్వేలి జిల్లా నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా తీసుకువచ్చిన వెయ్యి కోట్ల విలువైన కరెన్సీని భద్రంగా రిజర్వ్ బ్యాంకుకు అప్పగించారు. అందుకోసం ఆ రైలుకు ప్రత్యేక బోగీని జత చేశారు. ఆ బోగీలో ఒక సహాయ కమిషనర్, ఇద్దరు ఇన్స్పెక్టర్లతో సహా 13 మంది పోలీసుల పహారాతో రైలులో ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వెంటనే నగదు ఉన్న బోగీని మాత్రమే విడిగా తీసి పోలీసు అధికారుల సమక్షంలో రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఆ నగదును పెట్టెను తెరిచారు. ఆ బోగీ నుంచి 174 క్యాష్ బాక్స్ లను లారీలలో ఎక్కించి భద్రంగా బ్రాడ్వేలో గల రిజర్వ్ బ్యాంకుకు తీసుకెళ్లారు. వాటి మొత్తం విలువ వెయ్యి కోట్లని అధికారులు తెలపారు. మోదీ ప్రభుత్వం చేసిన నోట్ల రద్దు నవంబర్ 8వ తేది నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
గ్యాంగ్ అరెస్ట్.. కోట్ల పాతనోట్లు స్వాధీనం
జైపూర్: పాత నోట్ల మార్పిడి ముఠాను అరెస్ట్ చేసి కోట్ల రూపాయల విలువ చేసే రద్దయిన పెద్దనోట్లను రాజస్థాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి రూ.2.7 కోట్ల విలువ చేసే రద్దయిన పెద్దనోట్లు రూ.1000, రూ.500 లను స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం జైపూర్ పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. జైపూర్‌లోని సూరజ్‌పాల్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తడ్చాడుతున్నారు. వీరిపై అనుమానం వచ్చి గస్తీ పోలీసులు ప్రశ్నించిన అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 2.7 కోట్ల విలువైన పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో స్థానిక హోంగార్డు ఉన్నట్లు సమాచారం. పాతనోట్లను ఇచ్చి కమిషన్ ప్రకారం కొత్తనోట్లుగా మార్చేందుకు యత్నిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
రూ. 46 లక్షల పాతనోట్లు స్వాధీనం
తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం రహదారిపై బుధవారం తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 46 లక్షల రద్దైన పెద్దనోట్లతో పాటు 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. -
కోట్లలో పాత డబ్బు స్వాధీనం.. అరెస్టులు
బెంగళూరు: పాత పెద్ద నోట్ల రద్దయి నెలలు గడుస్తున్నా ఇంకా దర్శనం ఇస్తున్నాయి. అది కూడా ఒకటో రెండో కాదు.. ఏకంగా కోట్లల్లో.. దాదాపు ఇంకెవరి దగ్గరా లేవని అనుకుంటున్నా అక్రమ మార్గాల్లో అవి బయటకు వస్తూనే ఉన్నాయి. దాదాపు రూ.5.75కోట్ల విలువైన పాత నోట్లు మార్పిడి చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ ఎస్డీ శరణప్ప తెలియజేశారు. తమకు అందిన సమాచారం మేరకు తొలుత భసవనగుడి వద్ద ఉన్న ఓ హోటల్ వద్ద ఆపిన కారును తనిఖీచేయగా అందులో రూ.2.15కోట్ల పాతనోట్లు లభించాయి. దీంతో ఓ కారుని, బైక్‌ని స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఆ తర్వాత పీఈఎస్ కాలేజీ వద్ద మరో వాహనంలో రూ.1.12కోట్లు, గాంధీ బజార్లో రూ.50లక్షలు, ఇలా పలు ప్రాంతాల్లో వివిధ వ్యక్తుల వద్ద నుంచి రూ.5కోట్లకు పైగా పాత నోట్లు స్వాధీనం చేసుకొని 15మందిని అరెస్టు చేశారు. -
పాతనోట్లు పట్టివేత
► తీగలాగితే..డొంక కదిలింది ► బైక్ చోరీ విచారణలో..నోట్లు దొరికిన వైనం ► వివరాలు వెల్లడించిన సీసీఎస్ పోలీసులు పట్నంబజారు(గుంటూరు వెస్ట్) : బైక్ చోరీపై విచారణ మొదలుపెడితే..పాతనోట్లు పట్టుబడ్డాయి. చోరి అయిన ద్విచక్ర వాహనం కోసం నిఘా ఉంచితే నోట్ల కేటుగాళ్లు దొరికిపోయారు. నగరంపాలెంలోని సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్)లో అడిషనల్ ఎస్పీ బీపీ తిరుపాల్ వివరాలను వెల్లడించారు. ద్విచక్ర వాహనాలు అధికంగా చోరీ అవడంపై ప్రత్యేక దృష్టి సారించిన సీసీఎస్ పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సీఐ మధుసూదనరావు ఆధ్వర్యంలో హెచ్‌సీ కరీముల్లా, కానిస్టేబుళ్లు ఎన్. సాగర్, వి.అనిల్‌ను బృందంగా ఏర్పాటు చేశారు. ఐటీ కోర్ బాలాజీ సాంకేతికంగా అందించిన సమాచారంతో పూర్తిస్థాయిలో నేరస్తులపై దృష్టి సారించారు. అమరావతి రోడ్డులో ఆలా ఆసుపత్రి వద్ద చోరీ చేసిన ద్విచక్రవాహనం ఉందని తెలిసి వెళ్లిన సీసీఎస్ కానిస్టేబుళ్లు అనిల్, సాగర్ అక్కడే ఉన్న వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే వారు పారిపోతుండడంతో వెంటాడి పట్టుకుని తమదైన శైలిలో విచారించడంతో ఆసలు విషయాన్ని బయటపెట్టారు. వారిలో విజయవాడ పాయకాపురానికి చెందిన విన్నకోట సాయికుమార్ నుంచి ఇప్పటివరకు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సాయికుమార్‌తో పాటు మంగళగిరి, తిరువూరు, గుంటూరు నగరానికి చెందిన మునగాళ్ళ రాజేంద్రప్రసాద్, రౌశిం రామకృష్ణ, చిట్టి రామగోపాల్‌శాస్త్రిలను అదుపులోకి తీసుకుని వారి నుంచి 29.90 లక్షల పాతనోట్లు, రూ.4.80 లక్షల కొత్తనోట్లు స్వాధీనం చేసుకున్నారు. కమీషన్ ప్రాతిపదికన వీరు పాతనోట్లకు కొత్తనోట్లు మారుస్తుంటారని పోలీసులు చెప్పారు. గతంలో పలు చీటింగ్ కేసుల్లో సాయికుమార్, రాజేంద్రప్రసాద్ నిందితులుగా ఉన్నట్టు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ అనిల్, సాగర్లను అడిషనల్ ఎస్పీ తిరుపాల్, డీఎస్పీ పి. శ్రీనివాస్ అభినందించారు. -
బీజేపీ నేత ఇంట్లో కోట్లల్లో పాత కరెన్సీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా ఆ ఇంట్లో కట్టలుకట్టలుగా పాత కరెన్సీ. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.45 కోట్ల నోట్లు. సాక్షాత్తు బీజేపీ నేత ఇంటి నుంచి గురువారం ఈ భారీ మొత్తాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. బీజేపీకి చెందిన ప్రముఖ నేత దండపాణి చెన్నై కోడంబాక్కం జక్రియాకాలనీ 2వ వీ«ధిలో నివసిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు ఇతర వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఇతని సోదరులు పోలీస్‌శాఖలో పనిచేస్తూ సినిమా రంగంలో ఉండేవారికి దుస్తులు కుట్టించే రామలింగ్ అండ్ కో అనే కంపెనీని నిర్వహిస్తున్నారు. వీరికి ఇదే కాలనీలో పదికి పైగా ఇళ్లు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దండపాణి తన బంధుమిత్రులతో కలిసి అవసరమైన వారికి రూ.500, రూ.1000ల చెల్లనినోట్లనుకొత్త నోట్లు మార్చి ఇచ్చే వ్యవహారం నడుపుతున్నట్లు కోడంబాక్కం పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో సీఐ చిట్టిబాబు నేతృత్వంలో దండపాణి ఇంటిపై నిఘా పెట్టారు. ఈ దశలో బుధవారం సాయంత్రం వీరింటికి కొందరు అనుమానాస్పద వ్యక్తులు రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించి గురువారం తెల్ల వారుజామున ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పది పెట్టెల్లో దాచి ఉంచిన రూ.45 కోట్ల విలువైన రూ.500, రూ.1000ల చెల్లని నోట్లు పట్టుబడ్డాయి. ఈ నోట్లను స్వాధీనం చేసుకుని దండపాణిని పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంతోపాటు కమీషన్ పై పాత నోట్లను మార్చి ఇచ్చేలా లావాదేవీలు నడుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలా పాతనోట్లు మార్చినందుకు 50 శాతం కమీషన్ పుచ్చుకుంటున్నట్లు తెలుసుకుని పోలీసులు నోరు వెళ్లబెట్టారు. భారీ ఎత్తున పాతనోట్లు పట్టుబడిన విషయాన్ని ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న నగరంలో జ్యువెలరీ షాపు నడిపే ఒక పారిశ్రామిక వేత్తను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్దనోట్లను రద్దు చేస్తూ గత ఏడాది నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన తరువాత చెన్నైలో ఒకే ఇంట్లో రూ.45 కోట్లు పట్టుబడడం కలకలానికి దారితీసింది. కమీషన్ చెల్లించి పాత నోట్ల మార్పిడిని కోరిన వారెవరు. ఇందుకు సహకరించేవారు ఎవరు, దండపాణి పరిధిలో ఇంకా ఎంతమంది వద్ద పాత నోట్లు ఉన్నాయి అని పోలీసులు విచారిస్తున్నారు. -
బీజేపీ నేత ఇంట్లో 45 కోట్ల పాత నోట్లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు బీజేపీ నేత దండపాణి ఇంటి నుంచి రూ.45 కోట్ల పాత కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దండపాణి రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఇతని సోదరులు పోలీస్ శాఖలో పనిచేస్తూ ‘ఏవీ రామలింగం అండ్ కో’ అనే పేరున సినీరంగంలోని వారికి దుస్తులు సరఫరా చేస్తుంటారు. 50% కమీషన్‌పై పాతనోట్లను మార్చే లావాదేవీలు జరుపుతున్నట్లు తెలుసుకున్న కోడంబాక్కం పోలీసులు గురువారం దండపాణి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. పది పెట్టెల్లో దాచి ఉంచిన రూ.45 కోట్ల విలువైన రూ.500, రూ.1,000ల చెల్లని పాతనోట్లు ఈ తనిఖీల్లో పట్టుబడ్డాయి. దండపాణితో పాటు జ్యువెలరీ షాపును నడిపే ఒక పారిశ్రామికవేత్తనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఎంపీ ఇల్లు, కార్యాలయంపై ఐటీ దాడులు దావణగెరె: కర్ణాటకలో మాజీ కేంద్రమంత్రి, దావణగెరె బీజేపీ ఎంపీ జీఎం సిద్దేశ్వర్ నివాసం, కార్యాలయాలపై గురువారం ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. -
రూ.45 కోట్ల పాత కరెన్సీ స్వాధీనం
చెన్నై: రద్దు అయిన పాత నోట్లను భారీ మొత్తంలో తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 45 కోట్ల పాత కరెన్సీని పోలీసులు గురువారం ఉదయం పట్టుకున్నారు. చెన్నైలోని కోడంబక్కంలో ఉన్న వస్త్ర దుకాణం రామలింగం అండ్ కో లో ఈ మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆ దుకాణంలో విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ షాపు యజమాని దండపాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ జ్యూవెలరీ వ్యాపారికి సంబంధించిన సొమ్ము తన దగ్గర ఉన్నట్లు ఆయన చెబుతున్నారు. అయితే కానీ పోలీసులు మాత్రం పాత కరెన్సీపై ఆరా తీస్తున్నారు. అవినీతి, లంచాల వల్ల వచ్చిన సొమ్ము అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రద్దయిన పాత నోట్లతో పట్టుబడ్డ ముఠా
-
రూ.కోటికిపైగా పాత నోట్లతో పట్టుబడ్డ ముఠా
హైదరాబాద్: పెద్ద నోట్లు రద్దయిన తర్వాత చాలాకాలం తర్వాత భారీ మొత్తంలో పాత నోట్లు బయటపడ్డాయి. రద్దయిన పాత నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తూ ఓ మూఠా హైదరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం 13మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.కోటీ 85లక్షల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా పాత నోట్ల మార్పిడి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. పట్టుబడ్డ నగదుకు ఐదు రెట్ల పెనాల్టీతోపాటు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి చెప్పారు. మొత్తం పాత వెయ్యి రూపాయల నోట్లు, ఐదువందల నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారి నుంచి రెండు కార్లు, 13 సెల్ఫోన్లు కూడా లభించినట్లు తెలిపారు. -
గోదాంలో రూ. 61.6 లక్షల పాత కరెన్సీ స్వాధీనం
హైదరాబాద్: ఒక గోదాంలో అక్రమంగా దాచి ఉంచిన రూ.61.60 లక్షల పాత కరెన్సీని హైదరాబాద్ సుల్తాన్‌బజార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్పోర్ట్స్ కిట్స్ పేరిట హనుమాన్టేకిడీలో అహ్మద్ అనే వ్యక్తి ఒక గోదాంను అద్దెకు తీసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. విశ్వనీయ సమాచారం మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు గోదాంపై దాడిచేశారు. అందులో ఉన్న రూ.61.60 లక్షల పాత కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అహ్మద్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు లక్షల రూపాయల పాత కరెన్సీ అహ్మద్‌కు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
బాంబ్ నాగా ఎక్కడ?
- ‘కట్టల’పాము కోసం వేట.. అంతలోనే పోలీసులకు మెసేజ్ - తండ్రికి సాయంగా నాగా కొడకులు గాంధీ, శాస్త్రీ - దందాలో రాజకీయప్రముఖుల హస్తం! బెంగళూరు: మాజీ కార్పొరేటర్ బాంబ్ నాగా అలియాస్ వి.నాగరాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఈ కరుడుగట్టిన నేరగాడి ఇంట్లో రూ.25 కోట్ల విలువైన రద్దయిన రూ.1000, రూ.500 నోట్లను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగా పోలీసులకు ఝలకిచ్చి సినీఫక్కీలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం అతను తమిళనాడులో తలదాచుకున్నట్లు సమాచారం. పోలీసుశాఖలో పరిచయస్థులైన కొంత మంది సీనియర్ అధికారుల సహాయంతో కోర్టులో లొంగిపోవడానికి నాగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కాయిన్ బాక్స్‌ల ద్వారా నాగరాజు తన అనుచరులకు ఫోన్లు చూస్తూండటాన్ని పసిగట్టిన పోలీసులు.. అతను తమిళనాడులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో బెంగళూరు నుంచి బయలుదేరిన పోలీసు బృందాలు.. వేలూరు, ధర్మపురి, కాట్పాడి, చెన్నై తదితర ప్రాంతాల్లో విసృతంగా గాలిస్తున్నాయి. బాంబ్నాగతో పాటు తప్పించుకున్న రౌడీషీటర్లైన అతడి కుమారులు గాంధీ, శాస్త్రీల కోసం కూడా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వీరిద్దరూ బెంగళూరులోనే వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు తన తండ్రికి తెలియజేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బ్లాక్ అండ్ వైట్ దందాతో పాటు వ్యాపారవేత్తలను, బిల్డర్లను బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూడడంతో 45 కేసుల్లో నిందితుడిగా ఉన్న బాంబ్‌నాగపై కోకా యాక్ట్ ప్రయోగించడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా, నాగా నేరాల్లో పలువురు రాజకీయ ప్రముఖులకూ సంబంధాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరీ బాంబ్ నాగా? వి.నాగరాజ్ అలియాస్ బాంబ్ నాగా.. పశ్చిమ బెంగళూరులో పేరుమోసిన రౌడీ షీటర్. శ్రీపురంలో మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతంలోని ఇతని ఇంటిపై శుక్రవారం బెంగళూరు పోలీసులు దాడి చేయగా.. రూ.25కోట్ల విలువైన పాతనోట్ల కట్టలు బయటపడ్డాయి. నాగా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, ఎత్తైన ఇనుప గేట్లతో పకడ్బందీగా రక్షణ ఏర్పాట్లు ఉండటం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది. నాగా ఇంట్లోకి ప్రవేశించడానికి పోలీసులు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. చివరికి ఐరన్‌రాడ్లను కట్ చేసే వారిని తీసుకొచ్చి గేట్లను తెరిచారు. పోలీసులు దాడి చేసిన సమయంలో నాగా ఇంట్లో లేడు. అతని ఇంట్లోని పాత నోట్లను లెక్కించేందుకు పోలీసులకు 5 గంటలకుపైగా సమయం పట్టింది. పలు రాజకీయ హత్యలు.. కిడ్నాపు కేసుల్లో నాగా నిందితుడిగా ఉన్నాడు. గతంలో బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో.. అసెంబ్లీ ఎన్నికల్లో నాగా పోటీ చేసి ఓడిపోయాడు. ఓ కిడ్నాప్ కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు నాగా ఇంటిపై పోలీసులు దాడి చేశారు. కాగా, అసోంలోని గువాహటిలో రూ.1.10 కోట్ల విలువైన రద్దయిన నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు 9 బంగారు కడ్డీలను.. కేజిన్నర బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
ఏటీఎం వ్యాన్‌లో డబ్బు వస్తుందన్నాడు!
∙శేఖర్‌బాబు మాటలు నమ్మే నగదు సమీకరించా ∙మార్పిడి వ్యవహారం అతడికే తెలుసు ∙పోలీసుల విచారణలో ఫజలుద్దీన్ వెల్లడి సిటీబ్యూరో: ఎంత భారీ మొత్తం పాత కరెన్సీ సమీకరించినా మార్చేద్దామని, బ్యాగులు, సంచులు కాకుండా ఏకంగా ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే వ్యాన్లలోనే కొత్త నోట్లు వస్తాయని శేఖర్‌బాబు తనను నమ్మించినట్లు నోట్ల మార్పిడి కేసులో మూడో నిందితుడి ఫజలుద్దీన్ సైఫాబాద్ పోలీసులకు చెప్పాడు. పాత నోట్ల మార్పిడికి యత్నిస్తూ సోమవారం రాత్రి చిక్కిన దళారులను నగదుతో సహా సమావేశపరిచిన ఫజలుద్దీన్ను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం పదిమంది దళారుల్ని అరెస్టు చేసి, రూ.రూ.3,01,46,000 విలువైన పాతనోట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించిన ప్రధాన సూత్రధారులుగా ఉన్న ఐదుగురిలో ఫజలుద్దీన్ ఒకడు. తాము సమీకరించిన సొమ్ము రియల్ ఎస్టేట్ వ్యాపారులదేనని నిందితుడు వెల్లడించాడు. మెహదీపట్నం ప్రాంతానికి చెందిన శేఖర్‌బాబుతో రియల్ ఎస్టేట్ లావాదేవీల నేపథ్యంలోనే ఫజలుద్దీన్‌కు పరిచయమైంది. డీమానిటైజేషన్ నేపథ్యంలో పాతనోట్ల మార్పిడికి కుట్ర పన్నిన శేఖర్‌బాబు ఆ విషయాన్ని ఫజలుద్దీన్తో చెప్పాడు. ఏటీఎం వాహనాన్ని ఫజలుద్దీన్‌కు చూపించినప్పుడు శేఖర్‌తో పాటు వ్యక్తి ఉన్నాడని, అయితే అతను ఎవరన్నది తనకు తెలియన్నాడు. దీంతో శేఖర్‌బాబు సహా మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. బ్యాంకు అధికారులతో ఉన్న సంబం«ధాల నేపథ్యంలో భారీగా మార్పిడి చేద్దామంటూ శేఖర్‌బాబు చెప్పినందున సోమవారం రాత్రి బషీర్‌బాగ్ మొఘల్స్ కోర్ట్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులో తన కార్యాలయానికి దళారులు అందరినీ పిలించానని ఫజలుద్దీన్ అంగీకరించాడు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన పోలీసులు నగదు మూలాలు కనుక్కోవడానికి, అసలు వ్యక్తుల్ని గుర్తించడానికి పది మంది దళారుల్నీ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
రూ. 92 లక్షల పాత నోట్లు స్వాధీనం
హైదరాబాద్: రద్దైన పెద్ద నోట్లు మార్పిడికి నేటితో గడువు ముగుస్తుండగా పెద్ద మొత్తంలో పాత నోట్లు బయటపడుతున్నాయి. తాజాగా పాత నోట్ల మార్పిడికి యత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి వద్ద నుంచి రూ. 92 లక్షల విలువైన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రభుత్వ సాయం కోరిన టీటీడీ
తిరుమల: పాత కరెన్సీ నోట్లు మార్పిడికి ఈ రోజు చివరి తేది కావడంతో టీటీడీ అధికారులు నోట్లు మార్పిడి కోసం ప్రభుత్వ సహాయం కోరారు. టీటీడీ బోర్డు వద్ద ప్రస్తుతం రద్దైన నోట్లు రూ. 12.7 కోట్లు ఉన్నాయి. ఈ నోట్లను మర్చడానికి ఆర్బీఐ ఒప్పుకోకపోవడంతో.. శ్రీవారి ఆదాయానికి నష్టం వాటిల్లనుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు గడువు ముగియనుండటంతో ప్రభుత్వం నోట్ల మార్పిడిలో సాయం చేయాలని కోరారు. -
చెన్నై ఆర్బీఐలో పాత నోట్ల మార్పు
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం సాక్షి, న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్ కలిగి ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి నుంచి రద్దయిన పెద్ద నోట్లను స్వీకరించడానికి అధికారం అప్పగించిన 5 కార్యాలయాలలో చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం ఒకటని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి మేఘవాల్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా మంత్రి జవాబిచ్చారు. గత ఏడాది నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వ తేదీ వరకూ దేశంలో లేని భారతీయ పౌరులకు రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోవడం లేదా జమ చేయడానికి వ్యవధి ఇచ్చారన్నారు. దేశంలో నివశిస్తున్న పౌరులకు వ్యవధి కాలం మార్చ్ 31వరకూ ఉందని, బయట దేశాలలో నివశిస్తున్న పౌరుల కోసం జూన్ 30 వరకూ వ్యవధి ఉందని మంత్రి చెప్పారు. భారతదేశంలో నివశిస్తున్న అర్హులైన భారతీయ పౌరులకు నోట్ల మార్పిడి కి ద్రవ్య పరిమితి లేదని,ఎన్నారై లకు మాత్రం ఫెమా నిబంధనలకు లోబడి పరిమితి ఉంటుందని కేంద్ర మంత్రి వివరించారు. గత నెలాఖరు నాటికి ఏపీ నుంచి 509 మంది, తెలంగాణ నుంచి 301 మంది పాస్‌పోర్ట్ కలిగి ఉన్న వారు రద్దయిన పెద్ద నోట్లను మార్చుకోవడం లేదా జమ చేయడం చేశారని కేంద్ర మంత్రి చెప్పారు. రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి కోసం భారీ సంఖ్యలో దరఖాస్తుదారులు చెన్నై లోని రిజర్వ్ బ్యాంక్ సందర్శిచడంతో త్వరిత గతిన సేవలు అందించడానికి అనువుగా డాక్యుమెంట్లను ధృవీకరించడానికి 7 గురు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారని, సరైన డాక్యుమెంట్లు ఉన్నవారి వద్దనుంచి రద్దయిన నోట్లను స్వీకరించడానికి ప్రత్యేకంగా 3 కౌంటర్లను ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వివరించారు. నిబంధనల ప్రకారం రద్దయిన పెద్ద నోట్ల మార్పిడి కోసం బ్యాంక్ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని, దివ్యాంగులు,సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని మంత్రి చెప్పారు. -
పాతనోట్ల ముఠా అరెస్టు
హైదరాబాద్: నగరంలో పాతనోట్ల మార్పిడి ముఠాలు పట్టుపడుతూనే ఉన్నాయి. తాజాగా మరో ముఠాను టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. బషీర్‌బాగ్‌లోని మొగల్కోర్టు బిల్డింగ్‌లో పాతనోట్లు మార్చడానికి ప్రయత్నిస్తున్న 10మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తరచుగా నగరంలో పాతనోట్లను మార్చుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 8కోట్లు విలువ చేసే పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. -
సీఎం నియోజకవర్గంలో పాత కరెన్సీ కలకలం
చెన్నై(కేకే.నగర్): తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సొంత నియోజకవర్గమైన ఇడైపాడిలో 10 లక్షల రూపాయలకు పైగా పాత రూ.500, 1000 నోట్లు ముక్కలు ముక్కలుగా చింపి చెత్తకుప్పలో పడేసిన దృశ్యం అక్కడున్న ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇడైపాడి నుంచి కొంగనాపురం వెళ్లే రోడ్డుపై ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రి ఎదురుగా చెత్తకుప్పలో పాత రూ.500, 1000ల కరెన్సీ చిన్న చిన్న ముక్కలుగా చింపి పడి ఉన్నాయి. అవన్నీ గాలికి కొట్టుకుని వెళ్లి దూరంగా పడుతూ ఉండగా ఆ మార్గంలో వెళుతున్న విద్యార్థులు ఆ నోట్లను తీసుకుని ఆశ్చర్యంగా చూశారు. చెత్తకుప్పలో మందుల వ్యర్థాలతో పాటు కరెన్సీ ముక్కలు ఉన్న సమాచారం ఆ ప్రాంతంలో దావానంలా వ్యాపించింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలతో పాటు, పోలీసులు అక్కడకు వచ్చారు. ఈ విషయం ఆదాయపన్ను విభాగ అధికారులకు తెలిసింది. చెత్తకుప్పలో పడేసిన కరెన్సీ నోట్లు ముక్కల విలువ లక్షల రూపాయలు ఉండవచ్చని తెలుస్తోంది. -
హైదరాబాద్‌లో కరెన్సీ ముఠాల మోసాలు
-
బ్లాక్ అండ్ వైట్!
⇒సిటీ హల్చల్ చేస్తున్న ‘కరెన్సీ గ్యాంగ్‌లు’ ⇒ఆర్బీఐతో లింకులున్నాయంటూ ప్రచారం ⇒ఆ ఆర్డినెన్స్ లేకుంటే నామమాత్రపు కేసే ⇒సందట్లో సడేమియా అన్నట్లు నకిలీ, ‘టాయ్’గాళ్ళు ⇒వివిధ కేసుల్లో 10 రోజుల్లో 36 మంది అరెస్టు సిటీబ్యూరో: ఓ వైపు నగరవాసులు ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల్లో డబ్బు దొరక్క ఇబ్బందులు పడుతుండగా... మరోపక్క ‘కరెన్సీ గ్యాంగ్స్’ సిటీల హల్చల్ చేస్తున్నాయి. పాత కరెన్సీ మారుస్తామని కొందరు, నకిలీ నోట్లతో ఇంకొందరు రెచ్చిపోతున్నారు. ఈ రెండూ చాలవన్నట్లు మల్కాజిగిరిలో ఓ వ్యక్తి బొమ్మ కరెన్సీతో ఏకంగా బ్యాంకుకే వెళ్ళి సంచలనం సృష్టించాడు. మొత్తమ్మీద గడిచిన పది రోజుల్లో కరెన్సీ క్రైమ్‌కు సంబంధించి పోలీసులు 36 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.3.2 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పాత, కొత్త నోట్లతో పాటు టాయ్ కరెన్సీలూ ఉన్నాయి. నెలాఖరుతో ముగియనున్న గడువు... డీమానిటైజేషన్ తర్వాత కేంద్రం పాత నోట్లను మార్చుకోవడానికి అనేక అవకాశాలు ఇచ్చింది. తొలినాళ్ళల్లో బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనే మార్చుకునేలా ఏర్పాట్లు చేసింది. ఆపై ఈ నెల 31 వరకు రిజర్వు బ్యాంక్ వద్ద పాత నోట్లను మార్పిడి చేసుకునే అవకాశం ఉంది. నెలాఖరుతో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో ‘నల్లబాబుల’ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ తర్వాత పాత కరెన్సీ కలిగి ఉండటం కూడా నేరం. దీంతో నేరుగా ఆర్బీఐకి వెళ్ళి మార్చుకోవడానికి ‘లెక్కలు’ తిప్పలు వచ్చిపడతాయి. దీంతో ఎవరికి వారు తమకు ఉన్న పరిచయాల ఆధారంగా పాత నోట్లను గుట్టచప్పుడు కాకుండా మార్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆర్బీఐతో లింకులున్నాయంటూ... పాత నోట్లను మార్చిపెడతామంటూ రంగంలోకి దిగుతున్న వారికి భారీ డిమాండ్ ఉంటోంది. పాత నోట్ల మొత్తంలో 40 నుంచి 50 శాతం కొత్త నోట్లు ఇస్తామంటూ వీరు హల్చల్ చేస్తున్నారు. తమకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లింకులు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటూ ‘నల్లబాబుల్ని’ ఆకర్షిస్తున్నారు. తెలంగాణతో పాటు ఏపీ చెందిన ‘పాత వాళ్ల’ను సిటీకి రప్పించి భారీ మొత్తాల మార్పిడికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి కమీషన్ రాయుళ్ళు నిజంగా మార్చడం అనేది జరుగదని పోలీసులు పేర్కొంటున్నారు. కేవలం ఫలానా అధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయని చెబుతూ ‘నల్లబాబుల్ని’ ఆకర్షిస్తుంటారని, అవకాశం చిక్కితే వారిని మోసం చేయడానికీ వెనుకాడరని స్పష్టం చేస్తున్నారు. డీమానిటైజేషన్ ప్రకటన వెలువడిన తర్వాత భారీగా ‘మార్పిడి’ జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదన్నారు. ఆర్డినెన్స్ లేకుంటే నామ్‌కే వాస్తేనే... ఇలా మార్పిడికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై నగర పోలీసులు అనేక మందిని పట్టుకుంటున్నారు. వాస్తవానికి వీరిపై కేవలం మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణతోనే కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. అయితే డీమానిటైజేషన్ తర్వాత కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఓ పక్క వీరు దర్యాప్తు చేస్తూనే మరోపక్క భారీ మొత్తం పట్టుబడినప్పుడు ఆ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇస్తున్నారు. దీంతో ఆ అధికారులు వారి కోణంలో విచారణ చేస్తున్నారు. తాము స్వా«ధీనం చేసుకున్న డబ్బును న్యాయస్థానంలో అప్పగిస్తున్నామని, ఐటీ అధికారులకు అవసరమనుకుంటే కోర్టు ద్వారా తీసుకుంటారని ఓ అధికారి పేర్కొన్నారు. నకిలీ నోట్లతో రంగంలోకి... కరెన్సీ కొరత, మార్పిడికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో రూ.2 వేల నకిలీ కొత్త నోట్లతో రంగంలోకి దిగుతున్న ముఠాలు ఉంటున్నాయి. రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసుల బుధవారం అరెస్టు చేసిన ముఠా ఇందుకు నిదర్శనం. కలర్ జిరాక్సు ద్వారా నకిలీ రూ.2 వేల నోట్లు తయారు చేసిన ముగ్గురు సభ్యుల ముఠా దాన్ని నాలుగు నెలల పాటు దాచి ఉంచింది. తాజాగా ఏర్పడిన నగదు కొరత, మార్పిడి ముఠాలకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ నకిలీ నోట్లు మార్చేయడానికి రంగంలోకి దిగింది. విషయం వెంటనే ఎస్వోటీకి తెలియడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘కరెన్సీ క్రైమ్’ పెరిగిన మాట వాస్తవమేనని పోలీసులే అంగీకరిస్తున్నారు. ఎక్కడికక్కడ నిఘా, సమాచార వ్యవస్థను పటిష్టం చేసి వీరికి చెక్ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎయిర్‌పోర్టులో పాత నోట్ల కట్టలు
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో పాత కరెన్సీ నోట్ల కట్టలు వెలుగుచూశాయి. కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి వద్ద రూ.10లక్షల నగదు బయటపడింది. వ్యక్తి ఎయిరిండియా విమానంలో మస్కట్ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. డబ్బు ఎలా వచ్చిందనే దానిపై సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దొరికిన మొత్తంలో రూ.1.76 లక్షలు పాత రూ.వెయ్యి నోట్లు కాగా మిగిలినవి పాత రూ.500 నోట్లు. -
షిర్డీ సాయి హుండీలో భారీగా పెద్దనోట్లు
సాక్షి, ముంబై: దేశంలోని సంపన్న దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందిన షిర్డీ సాయిబాబా దేవాలయానికి నోట్ల రద్దు ప్రకటన అనంతరం భక్తుల నుంచి భారీ ఎత్తున కానుకలు రావడం విశేషం. గత 24 రోజులలో హూండీలో భక్తులు ఏకంగా రూ. 9.50 కోట్ల బాబాకు కానుకలుగా సమర్పించడం విశేషం. వీటిలో పెద్ద ఎత్తున పాత నోట్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రూ. 1.27 కోట్ల విలువ చేసే పాత రూ. 1000 నోట్లుండగా సుమారు రూ. కోటికిపైగా విలువ చేసే పాత రూ. 500 నోట్లు కానుకల ద్వారా అందినట్టు సాయిబాబా ట్రస్టు పేర్కొంది. -
పోలీసు అధికారే సూత్రధారి
నగదు మార్పిడి కేసులో మలుపు టప్పాచబుత్ర క్రైం ఇన్స్పెక్టర్ నిందితుడిగా గుర్తింపు సీఐ, కాంగ్రెస్ నేత కోసం గాలింపు బంజారాహిల్స్ : పాత కరెన్సీకివ బదులు కొత్త నోట్లు ఇస్తామని రప్పించి బాధితులను బెదిరించి రూ.30లక్షల నగదుతో ఉడాయించిన ఘటనలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ను ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. సీఐతో పాటు అతడి సన్నిహితుడు ఎన్బీటీ నగర్‌కు చెందిన కాంగ్రెస్ నేత తిరుమలేష్ నాయుడు కోసం బంజారాహిల్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టారు.వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన ఎయిర్టెల్ సిమ్‌కార్డ్ ఏజెంట్ లక్ష్మణ్ అగర్వాల్‌తో పాటు మరో పది మందిని తిరుమలేష్ నాయుడు గత కొద్ది రోజులుగా ఫోన్లో సంప్రదిస్తూ తమ వద్ద పెద్దమొత్తంలో రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లు ఉన్నాయని కొత్త నోట్లు తీసుకొస్తే 15 శాతం కమీషన్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో అగర్వాల్‌తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు గురువారం రూ.1.20 కోట్లు తీసుకుని ఫిలింనగర్ సారుుబాబా దేవాలయం సమీపంలోని సాయిగెస్ట్‌హౌజ్‌కు వచ్చారు. నోట్ల మార్పిడిలో భాగంగా నోట్లు లెక్కిస్తుండగా టప్పాచబుత్ర క్రైం ఇన్స్పెక్టర్ రాజశేఖర్, మరో నలుగురితో సహా యూనిఫాంలో అక్కడికి వచ్చి తుపాకీ చూపి బెదిరించడంతో వారు డబ్బులు అక్కడే వదిలి పారిపోయారు. రెండు గంటల తర్వాత మళ్లీ గెస్ట్‌హౌజ్‌కు వచ్చి చూసుకోగా, అక్కడ ఎవరూ కనిపించకపోగా నగదు కూడా చోరీకి గురైనట్లు గుర్తించారు. దీనిపై శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు టప్పాచభుత్ర క్రై ం ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌ను ఈ నాటకానికి సూత్రధారిగా గుర్తించారు. అతనితో పాటు తిరుమలేష్‌నాయుడు, మల్లేష్, రాజు అనే ఇద్దరు బ్రోకర్లు ఇందులో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. లక్ష్మణ్ అగర్వాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్ 395 కింద కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. అన్నీ వివాదాలే.. ఈ కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టప్పాచబుత్ర డీఐ మూడేళ్ల క్రితం నాంపల్లి ఇన్స్పెక్టర్గా ఉన్న సమయంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకీ పట్టుబడ్డాడు. ఆ కేసు నడుస్తుండగానే ఇటీవల టప్పాచబుత్ర డీఐగా బదిలీ అయ్యారు. గతంలో సీసీఎస్లోనూ సీఐగా పని చేశారు. 1998 బ్యాచ్‌కు చెందిన రాజశేఖర్ వ్యవహారంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్‌కు వచ్చి ఆరా శుక్రవారం ఉదయం నిందితుడు తిరుమలేష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి నగదు చోరీ కేసులపై ఆరా తీశారు. సీఐ శ్రీనివాస్‌ను కలిసి గత కొద్ది రోజులుగా ఎన్బీటీ నగర్లో కమీషన్ దందా నడుస్తున్నదని దీనిపై దృష్టి సారించాలంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఆయన వెళ్లిన రెండు గంటలకే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అతడికి ఫోన్‌చేయగా వస్తున్నానంటూ రాత్రి 9 గంటల వరకు గడిపాడు. తీరా రాత్రి 11 గంటలకు ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. మరో కేసు నమోదు నిందితుడు తిరుమలేష్‌పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గత నెల 30న అనంతపురం జిల్లాకు చెందిన వెంకటబాబా ,సతీష్, సాయికుమార్, వెంకట్ అనే వ్యక్తులు రూ. 25లక్షల కొత్త కరెన్సీ నోట్లు తీసుకొని ఫిలిమ్‌నగర్‌లోని సాయిగెస్ట్‌హౌజ్‌కు రాగా తిరుమలేష్ నాయుడు తన అనుచరులతో కలిసి వెంకటబాబాపై దాడి చేసి రూ. 12.50 లక్షలు లాక్కుని పరారయ్యాడు. ఈమేరకు బాధితుడు శనివారం బంజారాహిల్స్ పోలీస్ష్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాగులో పాత కరెన్సీతో బాలకృష్ణ సతీమణి
తిరుపతి ఎయిర్‌పోర్టులో గుర్తింపు రికార్డులున్నాయని ధ్రువీకరణ రేణిగుంట: సినీనటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుందరాదేవి బ్యాగులో రూ.10లక్షలు బయటపడటం కాస్సేపు కలకలం రేపింది. తిరుమల సందర్శనకు ఆమె హైదరాబాద్ నుంచి శనివారం ఉదయం స్పైస్‌జెట్ విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టులో దిగారు. చెక్ఔట్ సందర్భంలో ఎయిర్‌బోర్టు సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఆమె బ్యాగ్‌లో నగదు కట్టలు గుర్తించినట్లు విమానాశ్రయం సిబ్బంది తెలిపారు. ఆ రూ.10లక్షలు పాతనోట్లకు ఆమె ఐటీ రికార్డులు చూపడంతో, సక్రమంగా ఉన్నట్లు వారు చెప్పారు. ఈ విషయమై ఎయిర్‌పోర్టు డెరైక్టర్ పుల్లాకు సమాచారం ఇచ్చాక, ఆమెను నగదుతోపాటు పంపించినట్లు వెల్లడించారు. తర్వాత ఆమె కుటుంబసభ్యులతో కలసి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లినట్లు తెలిసింది. అయితే ప్రయాణంలో అంత నగదు కూడా ఎందుకు తీసుకువెళ్తున్నారనే అంశం చర్చనీయాంశమైంది. -
పాత నోట్లతో విక్రయాలకు పర్మిషన్ ప్లీజ్...
న్యూఢిల్లీ : పాత నోట్లతో మొబైల్ ఫోన్లను కస్టమర్లు కొనుగోలుచేసే విధంగా అనుమతివ్వాలని దేశీయ హ్యాండ్సెట్ల తయారీదారులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో మొబైల్ ఫోన్ విక్రయాలు పడిపోయి, రోజుకి 50 శాతం రెవెన్యూలను వదులుకోవాల్సిన వస్తున్న నేపథ్యంలో హ్యాండ్సెట్ తయారీదారుల్లో ఆందోళన మొదలైంది. పాత నోట్ల రద్దుతో తమ రెవెన్యూలను రోజుకు రూ.175-200 కోట్ల మేర కోల్పోతున్నామని ప్రభుత్వానికి నివేదించారు. ఆదార్ కార్డులు లేదా వాటర్ కార్డుల ద్వారా విక్రయాలు జరిపేలా తమకు అనుమతివ్వాలని కోరుతూ టెలికాం, ఐటీ, ఆర్థిక శాఖలకు హ్యాండ్ సెట్ తయారీదారులు లేఖ రాశారు. విక్రయించిన ప్రతి డివైజ్ ఐఎమ్ఈఐ(ఇంటర్నేషనల్ మొబైల్ ఈక్విప్మెంట్ ఐడెంటీ)తో ట్రేస్ అవుతుందని, దీనివల్ల దుర్వినియోగానికి పాల్పడే అవకాశముండదనే వెల్లడించారు. రిటైల్ అవుట్లెట్ల ద్వారా జరిపే మొబైల్ హ్యాండ్సెట్ విక్రయాలు 40-50 శాతం క్రాష్ అయ్యాయని, మొత్తం ఇండస్ట్రి టర్నోవర్‌లో ఇవి 85 శాతానికి అందిస్తాయని తయారీదారులు పేర్కొన్నారు. ప్రజలకు చేతుల్లోకి సరిపడ నగదు వచ్చేంతవరకు ఈ అమ్మకాలు మరింత పడిపోయే అవకాశముందని ఆవేదన వ్యక్తంచేశాయి. కాగ, ఇండస్ట్రి కలెక్షన్ రోజుకు రూ.350-400 కోట్ల మేర ఉంటుంది. ఇటీవలే ప్రభుత్వం మొబైల్ ఫోన్ రీఛార్జ్‌లకు పాత నోట్లను వాడుకోవచ్చని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
పాత కరెన్సీని మార్చేందుకు ప్రయత్నిస్తూ..
హైదరాబాద్: పాత కరెన్సీని మార్చేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను సైబర్ టవర్స్ సమీపంలో మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.9 లక్షల విలువైన కొత్త కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ఖాతాదారుడికి రూ.2 వేలు మాత్రమే ఏటీఎంల నుంచి వస్తుండగా, ఇంత పెద్ద మొత్తంలో కొత్త కరెన్సీ ఎలా వచ్చిందన్న దానిపై పోలీసులు దృష్టిసారించారు. దీని వెనక బ్యాంకు అధికారుల ప్రమేయం ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
రూ. 50 లక్షల పాత నోట్లు స్వాధీనం
-
రూ. 69 లక్షల పాత నోట్లు స్వాధీనం
మద్దిపాడు: ప్రకాశం జిల్లా మద్దిపాడులో రూ. 69 లక్షల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్దిపాడు సమీపంలో ఓ కారులో పెద్ద ఎత్తున నగదు తరలిస్తుండటంతో పోలీసులు కారును అడ్డుకున్నారు. మొత్తం రూ. 500, 1000 నోట్లతో కూడిన రూ. 69 లక్షలు ఉండటంతో నగదును స్టేషన్‌కు తరలించారు. ఈ నగదు ఒంగోలుకు చెందిన డాక్టర్‌కు సంబంధించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌పై దృష్టి
• నేటి నుంచి 24 వరకు హెచ్ఎండీఏ స్పెషల్ డ్రైవ్ • ఫీజు కింద పాత కరెన్సీని ఆమోదించాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: దాదాపు ఎనిమిది నెలల నుంచి నిరీక్షిస్తున్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్ పై హెచ్ఎండీఏ పూర్తి స్థారుులో దృష్టి సారించింది. ఈ నెల 16 నుంచి 24 వరకు పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. దీనిలో భాగంగా అధికారులు ఆయా తేదీల్లో క్షేత్రస్థారుు పరిశీలన చేయనున్నారు. ఫీజు చెల్లింపునకు పాత కరెన్సీని కూడా ఆమో దించి తద్వారా ఆదాయం పెంచుకునేందుకు హెచ్ఎండీఏ ఈ స్పెషల్‌డ్రైవ్ చేపట్టింది. ఆన్లైన్లో ఆర్కిటెక్ట్ వద్ద అప్డేట్ చేసిన షార్ట్ ఫాల్ డాక్యుమెంట్లను పరిశీలించి అర్హత ఉన్న వాటికి త్వరితగతిన క్లియరెన్స చేయ నున్నారు. దాదాపు హెచ్ఎండీఏకు వచ్చిన లక్షా 15వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో కేవలం వెరుు్యకి మాత్రమే ఇప్పటివరకు మోక్షం కలిగించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌తో పెండింగ్‌లో ఉన్న దాదాపు లక్షా 14 వేల దరఖాస్తుల్లో అర్హతలున్న వారికి క్లియరెన్స ఇవ్వడంపై హెచ్ఎండీఏ కమిషనర్ చిరం జీవులు దృష్టి సారించారు. గడిచిన ఎనిమిది నెలలుగా దరఖాస్తుల టెక్నికల్ స్క్రూటినీ, టైటిల్ వెరిఫికేషన్‌కు మాత్రమే పరిమితమైన అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించ లేదు. దీంతో లక్షా 14 వేల దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండిపోయారుు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎల్ఆర్ఎస్ దర ఖాస్తుల పరిశీలన ప్రక్రియను పరిశీలించి క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని చిరంజీవి నిర్ణరుుంచారు. ‘ఆయా జోనల్స్తో పాటు సర్కిళ్ల ఏసీపీలు దరఖాస్తులను పరిశీలించి సైట్ విజిట్ చేస్తున్నారు. అరుునా ప్రొసీ డింగ్స ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగు తోంది. ఏసీపీలు ప్రాసెస్ చేసినవి, షార్ట్ ఫాల్ ఉన్న దరఖాస్తులే 15 వేలకు పైగా ఉన్నారుు. వీరందరి నుంచి ఫీజు కట్టించి, ప్రొసీడింగ్‌స జారీ చేస్తాం. సిబ్బంది కొరత ఉన్నా అనుకున్న సమయానికి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి అర్హత గల వారికి అనుమతిస్తామని’ చిరంజీవి చెప్పారు. -
పాతనోట్లతో ట్రాఫిక్ చెలాన్లు.. గడువు పెంపు
హైదరాబాద్: పాత రూ.500, రూ.1000 నోట్లతో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లు క్లియర్ చేసుకునే అవకాశాన్ని మరో 10 రోజుల పాటు పొడిగించినట్లు ట్రాఫిక్ డీసీపీ ఎల్ఎస్ చౌహాన్ మంగళవారం వెల్లడించారు. తొలుత ఆదివారం నుంచి ఇచ్చిన 48 గంటల గడువు సోమవారం సాయంత్రం తో ముసిగింది. రెండు రోజుల్లోనే 7,013 మంది వాహనదారులు రూ.13.53 లక్షలు చెల్లించారు. ట్రాఫిక్ అధికారుల లెక్కల ప్రకారం రూ.40 కోట్ల మేర ట్రాఫిక్ ఈ-చలాన్ల బకాయిలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత కరెన్సీతో చెల్లింపు గడువు పెంచితే మరింత మందికి ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఈ నెల 24 వరకు సమయం పొందారు. వాహనదారులు పెండింగ్ ఈ-చలాన్లను ఈ-సేవ, మీ-సేవ సెంటర్లతో పాటు బిల్ డెస్క్, ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌లు, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్‌ల్లో చెల్లించవచ్చని డీసీపీ చౌహాన్ తెలిపారు. వాహనంపై జారీ అయి ఉన్న ఈ-చలాన్‌కు సంబంధించిన ప్రింట్ ఔట్ తీసుకుని చెల్లింపుల కోసం వెళ్ళడం మంచిదని సూచించారు. -
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు పాత నోట్లతో..
హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దుచేయడంతో ప్రజల ఇబ్బందులను గుర్తించిన జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించి మంచి ఫలితాలను రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో ట్రాఫిక్ పోలీసు విభాగం కూడా రద్దయిన నోట్లతో ట్రాఫిక్ చలాన్లు కట్టుకోవచ్చని తెలిపింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను ఈ సేవ, మీ సేవ కేంద్రాలు.. ఆంధ్రాబ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు, ఇతర అధికారిక చెల్లింపు కేంద్రాలలో పాత నోట్ల ద్వారా సోమవారం సాయంత్రం వరకు కట్టుకోవచ్చని డీసీపీ చౌహాన్ ఓ ప్రకటనలో తెలిపారు. -
కరెంటు బకాయిల చెల్లింపులకు పాత నోట్లు
హైదరాబాద్: కరెంటు బకాయిల చెల్లింపులకు పాత రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవాలని చేసిన విజ్ఞప్తికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం ఉదయం కేటీఆర్ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... కరెంటు చార్జీల చెల్లింపులకు పాత నోట్లను అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. ఫలితంగా మొండి బకాయిలు వసూలు అవటంతోపాటు దేశవ్యాప్తంగా వినియోగదారుల ఇబ్బందులు తగ్గుతాయన్నారు. కేటీఆర్ సూచనలకు సానుకూలంగా స్పందించిన ఆర్థికమంత్రి జైట్లీ కేంద్ర విద్యుత్ శాఖాధికారులతో మాట్లాడారు. గురువారం సాయంత్రమే విద్యుత్ శాఖ కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ పాత నోట్లను స్వీకరిస్తామని ప్రకటన చేశారు. ఈనెల11వరకు విద్యుత్ బకాయిల చెల్లింపులకు పాతనోట్లు చెల్లుబాటవుతాయని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి సత్వర నిర్ణయానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. -
సొంత కరెన్సీ ముద్రించనున్న ఐఎస్ఐఎస్
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) సొంత కరెన్సీని ముద్రించుకోవాలని నిర్ణయించుకుంది. మళ్లీ బంగారం, వెండి నాణేలతో మారకం చేసే ఆలోచనలో ఐఎస్ఐఎస్ ఉంది. పాతకాలంలో దినార్లో నాలుగు గ్రాముల బంగారం, దిర్హమ్లో మూడు గ్రాముల వెండి ఉండేది. ఇరాన్, సిరియాలలోని కీలక ప్రాంతాలను ఇప్పటికే ఐఎస్ఐఎస్ ఆక్రమించిన విషయం తెలిసిందే. **