హైదరాబాద్: నగరంలో పాతనోట్ల మార్పిడి ముఠాలు పట్టుపడుతూనే ఉన్నాయి. తాజాగా మరో ముఠాను టాస్క్‌ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. బషీర్‌బాగ్‌లోని మొగల్‌కోర్టు బిల్డింగ్‌లో పాతనోట్లు మార్చడానికి ప్రయత్నిస్తున్న 10మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తరచుగా నగరంలో పాతనోట్లను మార్చుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 8కోట్లు విలువ చేసే పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు.