సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐపీఎస్‌లు, పోలీసు అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఆదివారం తొమ్మిది మంది ఐపీఎస్‌లు, ఐదుగురు నాన్ కేడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. ఐపీఎస్‌ల బదిలీకి సంబంధించి ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, నాన్ కేడర్ ఎస్పీల బదిలీలపై హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ వేర్వేరుగా జీఓలు జారీ చేశారు.
► హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీ పి.విశ్వప్రసాద్‌ను హైదరాబాద్ నగర ట్రాఫిక్ సీపీగా బదిలీ చేశారు.
► ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసిన వరంగల్ మాజీ సీపీ రంగనాథ్‌ను హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ (క్రైమ్స్ అండ్ సిట్)గా నియమించారు.
► ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ను హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీగా.. ఇప్పటివరకు వెస్ట్‌జోన్ డీసీపీగా ఉన్న జోయల్ డేవిస్‌ను హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా బదిలీ చేశారు.
► మెదక్ ఎస్పీగా ఉన్న రోహిణి ప్రియదర్శినిని హైదరాబాద్ సిటీ నార్త్‌జోన్ డీసీపీగా నియమించారు.
► సిద్దిపేట సీపీ ఎన్.శ్వేతను హైదరాబాద్ సిటీ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ డీసీపీగా బదిలీ చేశారు.
► పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న ఎల్.సుబ్బారాయుడును హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–1 డీసీపీగా నియమించారు.
► టాస్క్ ఫోర్స్ డీసీపీ నితిక పంత్, గజరావు భూపాల్, చందనాదీప్తి తదితర అధికారులను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.
ఐదుగురు నాన్‌కేడర్ ఎస్పీలు బదిలీ..
► వెయిటింగ్‌లో ఉన్న అధికారి ఎన్.వెంకటేశ్వర్లుకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–3 డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–3 డీసీపీగా పనిచేస్తున్న డి.శ్రీనివాస్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.
► రాచకొండ కమిషనరేట్‌లో రోడ్డు భద్రత విభాగం డీసీపీగా ఉన్న శ్రీబాలదేవి హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమితులయ్యారు.
► మాదాపూర్ డీసీపీగా ఉన్న జి.సందీప్‌ను రైల్వేస్ ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. రైల్వేస్ ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న జె.రాఘవేందర్‌రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment