IPS transfers
-
తెలంగాణలో ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ... హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఏపీలో 10 మంది ఐపీఎస్‌ల బదిలీ
విజయవాడ, సాక్షి: పది మంది ఐపీఎస్ అధికారుల్ని బదిలీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ పేరిట శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం ఎస్పీగా జగదీష్, విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్‌గా మురళికృష్ణ, విజయవాడ డీసీపీగా మహేశ్వరరాజు, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా సునీల్, గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఏఎస్పీగా పంకజ్‌కుమార్ మీనా, పార్వతీపురం ఎస్డీపీవోగా సురానా అంకిత్లను బదిలీ చేశారు. అలాగే.. ఐపీఎస్ అధికారి సత్య ఏసుబాబును డీజీపీ ఆఫీస్‌కు బదిలీ చేసింది ప్రభుత్వం. -
TS: భారీ సంఖ్యలో బదిలీ బాట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కారు పాలనలో మార్పుబాట పట్టింది. ఇప్పటి వరకు వివిధ శాఖలు, విభాగాల్లో కీలకంగా పనిచేస్తూ వచ్చిన పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్, నాన్ కేడర్ ఎస్పీస్థాయి అధికారులను బదిలీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల అమలుతోపాటు కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి తన జట్టును సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాలనా యంత్రాంగంలో భారీ స్థాయిలో మార్పులు చేర్పులు చేపట్టారు. తాజాగా ఒకేసారి 26 మంది ఐఏఎస్‌లు, 23 మంది ఐపీఎస్‌లు, 21 మంది నాన్ కేడర్ ఎస్పీస్థాయి అధికారులకు స్థాన చలనం కల్పించారు. ఐఏఎస్‌లలో 18 మందికి పూర్తిగా కొత్త బాధ్యతలు అప్పగించగా.. మిగతా 8 మందికి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఐదు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. ఐపీఎస్‌లలో అందరినీ కొత్త స్థానాలకు బదిలీ చేశారు. నాన్ కేడర్ ఎస్పీ అధికారులకు కొన్ని స్థానాల్లో కీలక పోస్టింగ్‌లు ఇచ్చారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడం ఇష్టం లేని, 18 గంటలు పనిచేయాలా అని అసంతృప్తిగా ఉండే అధికారులను పెద్దగా పనిలేని స్థానాలకు బదిలీ చేయడానికి సర్కారుకు అభ్యంతరం లేదని ఇటీవల సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇది జరిగి వారం గడవక ముందే భారీగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలు జరగడం గమనార్హం. ఫైనాన్స్ కమిషన్‌కు స్మితా సబర్వాల్ గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా, మిషన్ భగీరథ (ఆర్డబ్ల్యూఎస్) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూసుకున్న స్మితా సబర్వాల్ పెద్దగా ప్రాధాన్యత ఉండని రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. గత ప్రభుత్వం నవంబర్ 30న ఆమెకు నీటిపారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కానీ సర్కారు మారడంతో ఆమె ఆ బాధ్యతలను చేపట్టడానికి ఆసక్తి చూపలేదు. దీంతో నీటి పారుదల శాఖ అదనపు బాధ్యతల నుంచి సైతం స్మితను ప్రభుత్వం తప్పించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈసీ రంగారెడ్డి కలెక్టర్‌గా నియమించిన భారతి హొళికేరిని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించి వెయిటింగ్లో పెట్టింది. తాజాగా రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్‌గా ప్రాధాన్యత లేని పోస్టుకు బదిలీ చేసింది. భూముల వ్యవహారంలో ఆమెపై ఆరోపణలు రావడంతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఆర్డబ్ల్యూఎస్ కార్యదర్శిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. రాహుల్ బొజ్జాకు నీటిపారుదల శాఖ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను నీటిపారుదల శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. సుదీర్ఘకాలం నుంచి అప్రాధాన పోస్టుల్లో కొనసాగుతున్న ఎంసీఆర్హెచ్ఆర్డీ అదనపు డీజీ బెన్హర్ మహేశ్‌దత్ ఎక్కాకు ఎట్టకేలకు కీలక పోస్టింగ్ లభించింది. ఆయనకు ప్రభుత్వం గనుల శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. వెయిటింగ్లో ఉన్న డి.దివ్యను రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌గా నియమించింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను గిరిజన శాఖ కార్యదర్శిగా బదిలీ చేయగా.. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశంకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయ్యారు. కీలకమైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పదవి కె.శశాంకకు దక్కింది. నారాయణపేట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం పరి్ణకారెడ్డి తల్లి, 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి చిట్టెం లక్ష్మి ఇన్నాళ్లూ వెయిటింగ్లో ఉండగా.. ఆమెను టీఎస్ ఫుడ్స్ ఎండీగా నియమించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావుకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జె.శంకరయ్య (నాన్ కేడర్)ను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) ఎండీగా ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం పేషీకి మూడు కొత్త ముఖాలు ప్రభుత్వం మరో ముగ్గురు అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయానికి బదిలీ చేసింది. తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ, ఎండీగా ఉన్న ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి జి.చంద్రశేఖరరెడ్డిని ముఖ్యమంత్రికి కార్యదర్శిగా సీఎంఓకు బదిలీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ బాధ్యతలు కూడా నిర్వహించాలని ఆయనను ఆదేశించారు. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ జాయింట్ ఇన్స్పెక్టర్ జనరల్ వేముల శ్రీనివాసులు (నాన్ కేడర్ అధికారి)ను ముఖ్యమంత్రికి ఓఎస్డీగా సీఎంఓకు బదిలీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కుమార్తె, 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంగీత సత్యనారాయణను టీఎస్ ఫుడ్స్ ఎండీ పోస్టు నుంచి బదిలీ చేస్తూ.. ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శిగా కీలక పదవిలో నియమించారు. దీంతో సీఎం కార్యాలయంలో కీలకమైన పదవుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, డిఫెన్స్ సర్వీసెస్, గ్రూప్–1 అధికారులను నియమించినట్టు అయింది. ఇప్పటికే సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి (ఐఏఎస్), కార్యదర్శిగా షానవాజ్ ఖాసీమ్ (ఐపీఎస్), అదనపు కార్యదర్శిగా అజిత్‌రెడ్డి (డిఫెన్స్ సర్వీసెస్) అధికారులను ప్రభుత్వం నియమించింది. మూడు కమిషనరేట్లకు కొత్త సీపీలు రాష్ట్రంలో మూడు కమిషరేట్లకు ప్రభుత్వం కొత్త పోలీస్ కమిషనర్లను నియమించింది. రామగుండం పోలీస్ కమిషనర్‌గా ఎల్ఎస్ చౌహాన్‌ను, ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా సునీల్‌దత్, సిద్దిపేట పోలీసు కమిషనర్‌గా బి.అనురాధను ప్రభుత్వం బదిలీ చేసింది. మరో ఐదు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావును అదనపు డీజీ (టెక్నికల్ సర్వీసెస్)గా ప్రభుత్వం బదిలీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా అదనపు బాధ్యతల్లోనూ కొనసాగాలని ఆయనను ఆదేశించింది. -
తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. అలాగే, తెలంగాణ డీజీపీగా రవిగుప్తానే కొనసాగనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, మాజీ డీజీపీ అంజనీకుమార్ రోడ్ సేఫ్టీ డీజీగా బదిలీ అయ్యారు. తాజా బదిలీల ప్రకారం.. హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఏసీబీ డీజీగా బదిలీ రాజీవ్ రతన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ. అభిలాష్ బిస్తా అడిషనల్ డీజీగా తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ. సౌమ్య మిశ్రా జైళ్ళ శాఖ అడిషనల్ డీజీగా బదిలీ. ఉమెన్స్ సేఫ్టీలో ఉన్న షికా గోయల్ సీఐడీ అడిషనల్ డీజీగా బదిలీ. సీఐడీ చీఫ్‌గా ఉన్న మహేష్ భగవత్ రైల్వే రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా బదిలీ. ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అనిల్ కుమార్‌ను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీగా బదిలీ. సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను ఐజీపీ హోమ్ గార్డ్స్‌కు బదిలీ. కమలాసన్ రెడ్డి ప్రొహిబీషన్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా బదిలీ. -
9 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐపీఎస్‌లు, పోలీసు అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఆదివారం తొమ్మిది మంది ఐపీఎస్‌లు, ఐదుగురు నాన్ కేడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. ఐపీఎస్‌ల బదిలీకి సంబంధించి ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, నాన్ కేడర్ ఎస్పీల బదిలీలపై హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ వేర్వేరుగా జీఓలు జారీ చేశారు. ► హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీ పి.విశ్వప్రసాద్‌ను హైదరాబాద్ నగర ట్రాఫిక్ సీపీగా బదిలీ చేశారు. ► ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసిన వరంగల్ మాజీ సీపీ రంగనాథ్‌ను హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ (క్రైమ్స్ అండ్ సిట్)గా నియమించారు. ► ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న ఎస్ఎం విజయ్‌కుమార్‌ను హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీగా.. ఇప్పటివరకు వెస్ట్‌జోన్ డీసీపీగా ఉన్న జోయల్ డేవిస్‌ను హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా బదిలీ చేశారు. ► మెదక్ ఎస్పీగా ఉన్న రోహిణి ప్రియదర్శినిని హైదరాబాద్ సిటీ నార్త్‌జోన్ డీసీపీగా నియమించారు. ► సిద్దిపేట సీపీ ఎన్.శ్వేతను హైదరాబాద్ సిటీ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీగా బదిలీ చేశారు. ► పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న ఎల్.సుబ్బారాయుడును హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–1 డీసీపీగా నియమించారు. ► టాస్క్ ఫోర్స్ డీసీపీ నితిక పంత్, గజరావు భూపాల్, చందనాదీప్తి తదితర అధికారులను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఐదుగురు నాన్‌కేడర్ ఎస్పీలు బదిలీ.. ► వెయిటింగ్లో ఉన్న అధికారి ఎన్.వెంకటేశ్వర్లుకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–3 డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–3 డీసీపీగా పనిచేస్తున్న డి.శ్రీనివాస్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ► రాచకొండ కమిషనరేట్‌లో రోడ్డు భద్రత విభాగం డీసీపీగా ఉన్న శ్రీబాలదేవి హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమితులయ్యారు. ► మాదాపూర్ డీసీపీగా ఉన్న జి.సందీప్‌ను రైల్వేస్ ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. రైల్వేస్ ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న జె.రాఘవేందర్రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఏపీలో 11 మంది ఐపీఎస్‌లు బదిలీ..
సాక్షి, అమరావతి: ఏపీలో 11 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో విశాఖ సీపీగా డా. రవిశంకర్ అయ్యన్నార్, వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా సిద్ధార్థ్ కౌషల్, అన్నమయ్య జిల్లా ఎస్పీగా బొడ్డేపల్లి కృష్ణారావు బదిలీ అయ్యారు. మిగిలిన వారి వివరాలు ఇవే.. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా విశ్వజిత్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా త్రివిక్రమ వర్మ, అనంతపురం ఎస్పీగా అన్బురాజన్, విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీగా కే. శ్రీనివాసరావు, గ్రేహౌండ్స్ ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, అనంతపూర్ 14వ బెటాలియన్ కమాండెంట్‌గా ఆర్. గంగాధర్‌రావు, ఏసీబీ ఎస్పీగా అద్నాన్ నయిం అస్మీ, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా పి. జగదీష్ నియామకం అయ్యారు. ఇది కూడా చదవండి: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: టీటీడీ చైర్మన్ భూమన -
తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీలు.. హైకోర్టులో కేంద్రం పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల విచారణను అత్యవసరంగా చేపట్టాలని కేంద్రం.. తెలంగాణ హైకోర్టును కోరింది. ఈ క్రమంలో జూన్ 5వ తేదీన విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, రాష్ట్ర విభజన తర్వాత 14 మంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను కేంద్రం.. ఏపీ, తెలంగాణకు కేటాయించింది. అయితే, కేంద్ర ఉత్తర్వులపై క్యాట్‌ను ఆశ్రయించి అధికారులు ఎక్కడికక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యాట్ ఉత్తర్వులపై కేంద్రం.. హైకోర్టుకు వెళ్లింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో సోమేష్ కుమార్ ఏపీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న డీజీపీ అంజనీ కుమార్ సహా 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. -
AP: 39 మంది ఐపీఎస్‌లు బదిలీ
సాక్షి, అమరావతి: ఏపీలో ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. 39 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక, బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. - విశాఖ పోలీసు కమిషనర్‌గా త్రివిక్రమ్ వర్మ - సీఐడీ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్ - విశాఖ డీసీపీగా వాసన్ విద్యాసాగర్ నాయుడు - నెల్లూరు ఎస్పీగా తిరుమలేశ్వర్ రెడ్డి - విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్‌దేవ్ సింగ్ - పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ - ఎస్ఐబీ ఎస్పీగా జి. సుమిత్ కుమార్ - అల్లూరి జిల్లా ఎస్పీగా సుహిన్ సిన్హా - కాకినాడ ఎస్పీగా ఎస్. సతీష్‌కుమార్ - అనకాపల్లి ఎస్పీగా కేవీ మురళీకృష్ణ - తూర్పుగోదావరి ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి - అంబేద్కర్ కోనసీమ ఎస్పీగా పి. శ్రీధర్ - ఏలూరు ఎస్పీగా మేరీ ప్రశాంతి - అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఆర్. గంగాధరరావు - సీఐడీ ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు - అనంతపురం ఎస్పీగా కే. శ్రీనివాసరావు - సీఐడీ ఎస్పీగా ఫకీరప్ప - సత్యసాయి జిల్లా ఎస్పీగా మాధవరెడ్డి - కర్నూలు ఎస్పీగా జి. కృష్ణకాంత్ - ఆక్టోపస్ ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్ - ఏలూరు రేంజ్ డీఐజీగా జీవీజీ అశోక్‌కుమార్ - దిశ ఐజీగా జి.పాలరాజు - అనంతపురం డీఐజీగా అమ్మిరెడ్డి - సెబ్ డీఐజీగా ఎం. రవిప్రకాష్ - ఏపీఎస్పీ డీఐజీగా బి. రాజకుమారి - డీఐజీ(అడ్మిన్)- సర్వ శ్రేష్ఠ త్రిపాఠి - గ్రే హౌండ్స్ డీఐజీగా కోయ ప్రవీణ్ - లా అండ్ ఆర్ఢర్ అడిషనల్ డీజీగా శంఖా బ్రాగ్చీ - ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏడీజీగా రవిశంకర్ అయ్యన్నార్ - ఎస్ఎల్పీఆర్బీ ఛైర్మన్‌గా(అదనంగా ఏపీఎస్పీ ఏడీజీపీగా) అతుల్‌సింగ్ - ఏపీపీహెచ్‌సీ ఎండీగా పి.వెంకటరామిరెడ్డికి అదనపు బాధ్యతలు - విజయవాడ డీసీపీగా అజిత వేజండ్ల - గ్రే హౌండ్స్ ఎస్పీగా బింధుమాధవ్ - ఏపీఎస్పీ 16వ బెటాలియన్ కమాండెంట్‌గా గౌతమి శాలి - 5వ బెటాలియన్ కమాండెంట్‌గా రాహుల్దేశ్ శర్మ - 3వ బెటాలియన్ కమాండెంట్‌గా సీహెచ్ విజయరావు - 14వ బెటాలియన్ కమాండెంట్‌గా పి. జగదీష్. -
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఒకేసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. ఎస్పీలు, కమిషనర్లు సహా 60 మంది ఐపీఎస్‌లు బదిలీ కానున్నారు. ఇక బదిలీ అయిన వారిలో నల్లగొండ, సిరిసిల్ల, పాలమూరు, వనపర్తి, మహబూబ్ నగర్ ఎస్పీలు ఉన్నారు. ఇక, కరీంనగర్, రామగుండం సీపీలు బదిలీ అయ్యారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో మెజార్టీగా డీసీపీలు బదిలీ అయ్యారు. రామగుండం సీపీగా సుబ్బారాయుడు, మల్కాజ్గిరి డీసీపీగా జానకి ధరావత్, ఖమ్మం సీపీగా సురేష్, జగిత్యాల ఎస్పీగా భాస్కర్, హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా రాజీవ్ రతన్‌లు బదిలీ అయ్యారు. ఒకేచోట ఎక్కువ రోజులు పోస్టింగ్‌లో ఉన్నవారిందరూ ఈ బదిలీల్లో ఉన్నారు. దీనికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు(బుధవారం) తీవ్రంగా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. భారీ ప్రక్షాళన చేయాలనే ప్రభుత్వ తలంపుతోనే ఇంతటి స్థాయిలో ఐపీఎస్ బదిలీలకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. -
AP: ఐపీఎస్‌లు బదిలీ.. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా హరీష్ కుమార్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు సీనియర్ ఐపీఎస్‌లు బుధవారం బదిలీ అయ్యారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఇక, రైల్వే అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్ నియామకమయ్యారు. ఇది కూడా చదవండి: కోనసీమ జిల్లా పేరు మార్పు.. కొత్త పేరు ఏంటంటే..? -
హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ను అవి నీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీజీగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నగర పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించింది. అలాగే రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 11 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు. ఐపీఎస్‌ల బదిలీల వివరాలివీ.. -
20 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. హోంగార్డ్స్ ఏడీజీగా ఉన్న హరీష్‌కుమార్ గుప్తను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా బదిలీ చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌గా కొనసాగుతున్న ఆర్కే మీనాకు ఏడీజీగా పదోన్నతి కల్పించి అక్కడే కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎవరు.. ఎక్కడంటే.. - వెయిటింగ్లో ఉన్న పి.హరికుమార్కు ఐజీ లీగల్‌గా పోస్టింగ్ - ఎస్ఐబీ డీఐజీ సిహెచ్ శ్రీకాంత్‌కు ఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్‌కు ఐజీగా పదోన్నతి. మెరైన్ ఐజీగా పోస్టింగ్ - సీఐడీ డీఐజీ ప్రభాకరరావుకు ఐజీగా పదోన్నతి. గుంటూరు రేంజ్‌కు బదిలీ - గుంటూరు ఐజీ వినిత్ బ్రిజ్‌లాల్ సాండ్ ఎన్ఫోర్స్మెంట్కు బదిలీ. ఎక్సైజ్ ప్రొహిబిషన్ అదనపు బాధ్యతలు - విజయవాడ జాయింట్ సీపీ డి.నాగేంద్రకుమార్ పదోన్నతిపై ఐజీగా పీ అండ్ ఎల్‌కు బదిలీ - కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీ కొల్లి రఘురామిరెడ్డికి డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - ఏసీబీ జాయింట్ డైరెక్టర్ జీవీజీ అశోక్ కుమార్‌కు డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - ఇంటెలిజెన్స్ ఎస్పీ జి.విజయ్‌కుమార్‌కు డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - డీసీపీ విజయవాడ అడ్మిన్ ఎస్.హరికృష్ణకు డీఐజీగా పదోన్నతి. సీఐడీకి బదిలీ - ఎస్ఐబీ ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు డీఐజీగా పదోన్నతి. ఏసీబీకి బదిలీ - ఎస్వీ రాజశేఖర్‌బాబుకు డీఐజీగా పదోన్నతి. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ శాంతి భద్రతల విభాగం కో–ఆర్టినేటర్‌గా బదిలీ - ఇంటెలిజెన్స్ ఎస్పీ కేవీ మోహన్‌రావుకు డీఐజీగా పదోన్నతి. ఏలూరు రేంజ్‌కు బదిలీ - గుంటూరు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు డీఐజీగా పదోన్నతి. అదే స్థానంలో కొనసాగింపు - పార్వతీపురం ఏఎస్పీ గరుడ్ స్మిత్ సునీల్ నర్సీపట్నం ఓఎస్డీకి బదిలీ - వేకెన్సీలో ఉన్న బి.కృష్ణారావు ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ - చింతూరు ఓఎస్డీ అమిత్ బర్డార్ కాకినాడ 3వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ - బొబ్బిలి ఏఎస్పీ గౌతమి సాలి అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా కర్నూలుకు బదిలీ -
ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా కేఆర్ఎమ్ కిషోర్ కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీల వివరాలు.. రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా కేఆర్ఎమ్ కిషోర్ కుమార్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్ రైల్వేస్ అడిషనల్ డీజీగా బాలసుబ్రహ్మణ్యం సీఐడీ డీఐజీగా సునీల్ కుమార్ నాయక్ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండెంట్‌గా అభిషేక్ మహంతి ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్ (అదనపు బాధ్యతలు) ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ హరికుమార్, కృపానంద త్రిపాఠిని డీజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
కొత్త జట్టుపై ప్రభుత్వం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగబోతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంతో రాష్ట్రంలో ప్రారంభమైన ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పరంపరకు తాజాగా ముగిసిన జెడ్పీ ఎన్నికలతో తెరపడింది. వరుసగా రాష్ట్రంలో శాసనసభ, పంచాయతీ, లోక్ సభ, శాసనమండలి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగడంతో 9 నెలలుగా పాలనా వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంది. ఎట్టకేలకు ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలు శనివారంతో ముగిసింది. దీంతో ఇప్పుడిప్పుడే పరిపాలనా వ్యవహారాల్లో కదలిక ప్రారంభమైంది. గత డిసెంబర్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయఢంకా మోగించి రెండో పర్యాయం పాలనా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ‘కొత్త జట్టు’రూపకల్పనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టిసారించారు. జిల్లా స్థాయిలో పనిచేసే కలెక్టర్లు, ఎస్పీల నుంచి రాష్ట్ర స్థాయిలో పనిచేసే సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు భారీ ఎత్తున స్థానచలనం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ అవసరాలు, ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టు కుని కొత్త జట్టు కూర్పును తయారు చేస్తున్నారు. తమ మాట వినే అధికారులను తమ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలుగా నియమించాలని పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. బదిలీల కసరత్తు పూర్తైనట్లు తెలిసింది. 18 జిల్లాల కలెక్టర్లతోపాటు వివిధ శాఖల ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల హోదా లో పనిచేస్తున్న సుమారు 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేయనున్నట్లు సమాచారం. కొన్ని శాఖల్లో సీనియర్ ఐఏఎస్‌లు దీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు. వీరందరిని కొత్త స్థానాలకు బదిలీ చేయనున్నారు. పలు జిల్లాల ఎస్పీలతో పాటు డీఐజీ, ఐజీ హోదా గల మరో 20 మంది వరకు ఐపీఎస్‌లకు స్థానచలనం కలిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై సీఎం కేసీఆర్ గత ఆదివారమే కసరత్తు చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు సిరిసిల్ల కలెక్టర్‌గా కృష్ణభాస్కర్, సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి ఉండేవారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా అప్పట్లో వీరిని బదిలీ చేశారు. తాజాగా వీరిద్దరినీ పూర్వ స్థానాలకు బదిలీ చేస్తూ గత ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మిగిలిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల విషయంలో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి. -
రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. పోస్టింగ్‌ల వివరాలు.. సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా (క్రైమ్స్) రోహిణి ప్రియదర్శిని, నారాయణపేట్ ఎస్పీగా ఎం.చేతన, ములుగు ఎస్పీగా ఎస్ఎస్పీ గణపతిరావు, మంచిర్యాల డీసీపీగా రక్షిత కే మూర్తి, భద్రాచలం ఏఎస్పీగా రాజేశ్ చంద్ర, ఏటూరునాగారం ఏఎస్పీగా శరత్ చంద్ర పవార్, మహదేవ్పూర్ ఎస్డీపీవోగా సాయిచైతన్య నియమితులయ్యారు. -
ఐపీఎస్‌ల బదిలీల్లోనూ రాజకీయ కోణం
సాక్షి, అమరావతి : ఎన్నికల వేళ జరుగుతున్న పోలీసు బదిలీలపై ఎన్ని విమర్శలు వస్తున్నా చంద్రబాబు సర్కారు తీరు మాత్రం మారలేదు. రాజకీయ కోణంలోనే తాజాగా గురువారం జరిగిన ఆరుగురు ఐపీఎస్‌ల బదిలీ ఉత్తర్వులు సైతం కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా రెండు జిల్లాల ఎస్పీల బదిలీ పోలీసు శాఖలో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ బదిలీల్లోను సామాజిక కోణం చొరబడటంతో విమర్శలకు తావిస్తోంది. ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న బూసారపు సత్య ఏసుబాబును విశాఖపట్నం గ్రేహౌండ్స్ కమాండర్‌గా బదిలీ చేయడం గమనార్హం. గతంలో కడప ఓఎస్డీ(ఆపరేçషన్స్) నుంచి ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆయన ట్రాన్సఫర్ అయ్యారు. ముక్కుసూటిగా వ్యవహరించే సత్యఏసుబాబు ప్రకాశం జిల్లాలోని సీఎం సామాజికవర్గం పెద్దలకు మింగుడు పడలేదు. దీంతో ఎన్నికల సమయంలో అతను ఉంటే పార్టీకి ఇబ్బంది అనే కారణంతో చంద్రబాబుపై వత్తిడి తెచ్చి సత్య ఏసుబాబును గ్రేహౌండ్స్‌కు బదిలీ చేయించారు. కాపు సామాజికవర్గానికి చెందిన సత్య ఏసుబాబును బదిలీ చేయించి సొంత సామాజికవర్గానికి చెందిన, కాకినాడ పోర్టు డైరెక్టర్‌గా పనిచేస్తున్న కోయ ప్రవీణ్ కోసం పావులు కదిపారు. ఈ నేపథ్యంలోనే కోయ ప్రవీణ్‌ను ప్రకాశం జిల్లా ఎస్పీగా నియమించారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎంపీ గరికపాటి రామ్మోహనరావుకు కోయ ప్రవీణ్ దగ్గర బంధువు కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా ఉన్న అభిషేక్ మహంతి బదిలీ కూడా రాజకీయకోణంలోనే జరిగిందనే ప్రచారం ఉంది. కొద్ది రోజుల క్రితం సీఎం సమక్షంలో జరిగిన కడప టీడీపీ పంచాయితీలో ఎంపీగా పోటీకి మంత్రి ఆదినారాయణరెడ్డి అంగీకరించిన సంగతి తెల్సిందే. ఇదే సమయంలో కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి బదిలీకి కూడా మంత్రి ఆది పట్టుబట్టినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ముక్కుసూటిగా వ్యవహరించే అభిషేక్ మహంతి ఉంటే ఎన్నికల సమయంలో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే ఆయన్ను బదిలీ చేయించి తమకు సానుకూలంగా ఉండే వాళ్లను తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ మహంతిని గ్రేహౌండ్స్‌కు బదిలీ చేసి కడప జిల్లా ఎస్పీగా రాహుల్‌దేవ్ శర్మను నియమించారు. వినిత్ బ్రింజ్‌లాల్‌ను గ్రేహౌండ్స్ నుంచి ఏపీ డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. గ్రోవెల్ నవదీప్‌సింగ్‌ను గ్రేహౌండ్స్ నుంచి విజయవాడ సిటీ జాయింట్ పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ఐఏఎస్‌లకు బదిలీ, పోస్టింగ్‌లు పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ మరి కొంతమంది ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి. రాజశేఖర్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనను ప్రస్తుతం వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శిగా పరిమితం చేశారు. అలాగే తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆర్టీజీఎస్ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కార్మిక శాఖ కమిషనర్ డి. వరప్రసాద్‌ను పౌరసరఫరాల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. గనులు శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీనివాస్ శ్రీ నరేష్‌కు తిరిగి చేనేత, జౌళి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. చేనేత, జౌళి శాఖ కార్యదర్శి డాక్టర్ పి. లక్ష్మీనర్సింహను సాధారణ పరిపాలన(సర్వీసెస్) కార్యదర్శిగా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న కె. మాధవీలతను ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ ఎం. విజయ సునీతను పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న జి.సి. కిషోర్‌కుమార్‌ను వికలాంగులు, వయో వృద్ధుల శాఖ సంచాలకులుగా నియమించారు. కృష్ణా జిల్లా డీఆర్వోగా పనిచేస్తున్న లావణ్య వేణిని సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా బదిలీ చేశారు. ఈ స్థానంలో పనిచేస్తున్న పి. శ్రీనివాసులును విశాఖ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమించారు. విశాఖ జిల్లా డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న కె. విజయను పర్యాటక, సాంస్కృతిక శాఖ సీఈవోగా నియమించారు. ప్రస్తుతం కె. విజయ నిర్వహిస్తున్న ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ బాధ్యతలను కె.ధనుంజయరెడ్డికి అప్పగించారు. -
చాటుమాటు పాలన..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రహస్య పాలన సాగుతోంది. ప్రభుత్వ పరిపాలన రోజురోజుకు గోప్యమవుతోంది. సర్కారు జారీ చేసే ఉత్తర్వులు ప్రజలు తెలుసుకోడానికి అందుబాటులో తెచ్చిన జీఓఐఆర్ (గవర్నమెంట్ ఆర్డర్స్ ఇష్యూ రిజిస్టర్) వెబ్సైట్లో జీవోల నమోదు క్రమంగా తగ్గిపోతోంది. గత మూడేళ్లలో వెబ్సైట్లో జీవోల అప్లోడ్ తంతు మూడో వంతుకు పడిపోయింది. చిన్నాచితకా అంశాల జీవోలు మినహా.. పాలనాపరమైన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నియామకాలకు సంబంధించిన కీలక జీవోలను బహిర్గతం చేయడం లేదు. పాలనలో పారదర్శకత పాటిస్తున్నామని గొప్పలు చెబుతున్న సర్కారు.. కీలక నిర్ణయాలు, ఆదేశాల జారీలో మాత్రం గోప్యత పాటిస్తోంది. 2017లో 8,600 జీవోలే 2015 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు అన్ని ప్రభుత్వ శాఖలు కలిపి 21,702 జీవోలు వెబ్సైట్లో అప్లోడ్ చేయగా.. 2017లో కేవలం 8,696 జీవోలే అప్లోడ్ అయ్యాయి. ఈ లెక్కన మూడేళ్లలో జీవోల సంఖ్య మూడో వంతుకు పతనమైంది. పాలనాపర అంశాలపై సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవోలు జారీ చేస్తున్నా.. వాటిని వెబ్సైట్లో మాత్రం అప్లోడ్ చేయడం లేదు. సాంకేతిక విభాగం క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంతోనే జీవోలు ప్రజల్లోకి వెళ్లడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు రెండు, మూడేళ్లుగా వెబ్సైట్లో కనిపించడం లేదు. ఉన్నతాధికారుల బదిలీలు, కొందరి నియామకాలు, పదోన్నతులు, శాఖాపరమైన అంశాలు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల జీవోలు కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లేదు. కొన్ని ఆయా శాఖల ప్రత్యేక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నా ఆ వెబ్సైట్లపై అవగాహన లేక వివరాలు ప్రజల్లోకి వెళ్లడం లేదు. కుప్పలుతెప్పలుగా సాధారణ జీవోలు చిన్నాచితకా ఉత్తర్వులే వెబ్సైట్లో కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. అధికారులు, ఉద్యోగులకు టీఏ, డీఏ మంజూరు, పేపర్ బిల్లుల చెల్లింపులు, స్టేషనరీ, లేబర్ కేసుల వివరాలు వందల్లో దర్శనమిస్తున్నాయి. ఇవి ప్రజలకు పెద్దగా ఉపయోగపడనప్పటికీ.. ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలంటూ గవర్నర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఇటీవల ఫిర్యాదు చేసింది. త్వరలో ఈ అంశంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతున్నట్లు సంస్థ కార్యదర్శి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఎం.పద్మనాభరెడ్డి చెప్పారు. -
ఐపీఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ చేపడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ రేంజ్ డీఐజీగా ప్రమోద్ కుమార్‌ను నియమించగా.. ప్రస్తుత డీఐజీ రవి వర్మను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఆదిలాబాద్ ఎస్పీగా విష్ణు ఎస్ వారియర్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఎస్పీగా ఉన్న నివాసులును డీజీపి కార్యాలయానికి బదిలీ చేశారు. కొమురంభీం జిల్లా ఎస్పీగా మలేశ్వర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. -
తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు, ప్రమోషన్లు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతిని సీసీఎస్ డీసీపీగా నియమించారు. ఆయన స్థానంలో ఏఆర్ శ్రీనివాస్ (ఐపీఎస్)ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా నియమించారు.నార్త్‌జోన్ డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఎన్.ప్రకాష్‌రెడ్డిని నల్లగొండ జిల్లా ఎస్పీగా నియమించారు. అలాగే, ఐపీఎస్ అధికారి తరుణ్జోషిని గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా నియమించారు. మెదక్ జిల్లా ఎస్పీగా ఉన్న బి.సుమతి హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా నియమితులయ్యారు. ఆమె స్థానంలో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఎస్పీగా ఉన్న ఎస్.చంద్రశేఖర్‌రెడ్డిని మెదక్ ఎస్పీగా నియమించారు. మహబూబ్‌నగర్ ఎస్పీగా ఉన్న పి.విశ్వప్రసాద్‌ను నిజామాబాద్ ఎస్పీగా నియమించారు. ఓఎస్డీ (క్రైమ్స్)గా ఉన్న ఐపీఎస్ అధికారి బి.నవీన్‌కుమార్‌ను రంగారెడ్డి జిల్లా ఎస్పీగా నియమించింది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏఎస్పీగా ఉన్న సన్‌ప్రీత్‌సింగ్ శంషాబాద్ డీసీపీగా నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ♦ నల్లగొండ ఎస్పీగా ఎన్ ప్రకాశ్‌రెడ్డి ♦ ఆదిలాబాద్ ఎస్పీగా విక్రమ్‌జిత్ దుగ్గల్ ♦ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా తరుణ్ జోషి ♦ నార్త్ జోన్ డీసీపీగా బి.సుమతి ♦ రంగారెడ్డి ఎస్పీగా డి. నవీన్‌కుమార్ ♦ శంషాబాద్ డీసీపీగా సన్‌ప్రీత్ సింగ్ ♦ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఏఆర్ శ్రీనివాస్ ♦ మెదక్ ఎస్పీగా చంద్రశేఖర్‌రెడ్డి ♦ నిజామాబాద్ ఎస్పీగా విశ్వప్రసాద్ ♦ హైదరాబాద్ రేంజ్ డీఐజీగా అకున్ సబర్వాల్ ♦ హైదరాబాద్ జాయింట్ కమిషనర్(ఎస్బీ)గా ప్రమోద్ కుమార్ ♦ ఇంటెలిజెన్స్ ఐజీలుగా రాజేష్‌కుమార్, శివశంకర్‌రెడ్డి ♦ హైదరాబాద్ అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా సందీప్ శాండిల్య ♦ ఐజీస్పోర్ట్స్‌గా వి.వి. శ్రీనివాసరావు ♦ సీఐడీ ఐజీగా ఆర్బి నాయక్ ♦ అడిషినల్ కమిషనర్ (పరిపాలన)గా పి.మురళీకృష్ణ ♦ అడిషనల్ కమిషనర్ (సాయుధ బలగాలు)గా శివప్రసాద్ ♦ హైదరాబాద్ డీసీపీగా అవినాష్ మహంతి ♦ అదనపు డీజీపీలుగా అంజనీ కుమార్, రాజీవ్‌రతన్‌లకు ప్రమోషన్ -
15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీచేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. బదిలీల వివరాలు.. - అప్పా డైరెక్టర్‌గా ఉన్న మాలకొండయ్యకు ఏసీబీ డైరెక్టర్‌గా బాధ్యతలు - వెయిటింగ్లో ఉన్న అంజనా సిన్హాకు టెక్నికల్ సర్వీసెస్ ఐడీపీగా పోస్టింగ్ - వెయిటింగ్లో ఉన్న కుమార్ విశ్వజిత్ ఉత్తర కోస్తా ఐజీపీగా నియామకం - సూర్యప్రకాశ్ రావుకు కోస్తా సెక్యూరిటీ ఐజీపీ బాధ్యతలు - పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న రాజకుమారి ఆరో బెటాలియన్ (మంగళగిరి) కమాండెంట్‌గా నియామకం - వెయిటింగ్లో ఉన్న సర్వశ్రేష్ట త్రిపాఠికి గుంటూరు అర్బన్ ఎస్పీగా బాధ్యతలు - గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ నారాయణ నాయక్‌ను గుంటూరు రూరల్ ఎస్పీగా నిమించారు - ఇంటిలిజన్స్ ఎస్పీగా రామకృష్ణకు బాధ్యతలు - వెయిటింగ్లో ఉన్న భాస్కర్ భూషణ్ పశ్చిమ గోదావరి ఎస్సీగా నియామకం - పశ్చిమ గోదావరి ఎస్సీగా పనిచేస్తున్న రఘురాం రెడ్డికి గ్రూప్ కమాండర్ (గ్రేహౌండ్స్- విశాఖ)గా బాధ్యతలు - పోస్టింగ్ కోసం ఎదురుచూస్తోన్న గజరావ్ భూపాల్ నెల్లూరు ఎస్పీగా నియామకం - సెంథిల్ కుమార్‌కు గ్రూప్ కమాండర్ (ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్) బాధ్యతలు - తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్, సెక్యూరిటీ ఆఫీసర్‌గా నాగేంద్ర కుమార్ నియామకం - ఇంటెలిజెన్స్ ఎస్పీగా కోటేశ్వరరావు - సీఐడీ ఎస్సీగా కాంతిరాణా టాటా నియమితులయ్యారు. -
ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
-
ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులను భారీగా బదిలీ చేశారు. ఒకేసారి ఏకంగా 24 మంది ఐపీఎస్‌లను బదిలీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. అధికారి ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం ఏఎస్ ఖాన్ డీసీపీ, విజయవాడ ఎస్పీ, శ్రీకాకుళం గ్రేవాల్ నవ్‌దీప్ సింగ్ ఎస్పీ, నెల్లూరు ఎస్పీ, విజయనగరం కోయ ప్రవీణ్ ఓఎస్డీ, విజయనగరం ఎస్పీ, విశాఖ రూరల్ రవిప్రకాష్ డీసీపీ, విజయవాడ ఎస్పీ, తూర్పుగోదావరి హరికృష్ణ ఎస్పీ, పశ్చిమగోదావరి ఎస్పీ, రాజమండ్రి రఘురాం రెడ్డి ఎస్పీ, కర్నూలు ఎస్పీ, పశ్చిమగోదావరి విజయకుమార్ ఎస్పీ, తూర్పుగోదావరి ఎస్పీ, కృష్ణా తఫ్సీర్ ఇక్బాల్ ఎస్పీ, విజయనగరం డీసీపీ, విజయవాడ అశోక్ కుమార్ ఎస్పీ, వైఎస్ఆర్ జిల్లా డీసీపీ, విజయవాడ రామకృష్ణ ఎస్పీ, చిత్తూరు ఎస్సీ, గుంటూరు రూరల్ రాజేష్ కుమార్ కమాండెంట్, కాకినాడ ఎస్పీ, గుంటూరు అర్బన్ శ్రీకాంత్ జేడీ, ఏసీబీ ఎస్పీ, ప్రకాశం సెంథిల్ కుమార్ ఎస్పీ, అనంతపురం ఎస్పీ, నెల్లూరు జి.శ్రీనివాస్ టీటీడీ సీవీఅండ్ ఎస్ఓ ఎస్పీ, చిత్తూరు గోపీనాథ్ జట్టి ఎస్పీ, గుంటూరు అర్బన్ ఎస్పీ, తిరుపతి అర్బన్ రాజశేఖర్ బాబు ఎస్పీ, తిరుపతి అర్బన్ ఎస్పీ, అనంతపురం నవీన్ గులాటీ ఎస్పీ, శ్రీకాకుళం ఎస్పీ, వైఎస్ఆర్ జిల్లా రవికృష్ణ ఎస్పీ, ఇంటెలిజెన్స్ ఎస్పీ, కర్నూలు మోహనరావు ఎస్పీ, ఇంటెలిజెన్స్ ఎస్పీ, విజిలెన్స్, గుంటూరు విక్రమ్ జిత్ దుగ్గల్ ఎస్పీ, విశాఖపట్నం గ్రేహౌండ్స్, విశాఖ రూరల్ సత్యనారాయణ ఎస్పీ, గుంటూరు రూరల్ ఎస్పీ, ఇంటెలిజెన్స్ ప్రమోద్ కుమార్ ఎస్పీ, ప్రకాశం ఎస్పీ, ఇంటెలిజెన్స్ రవికుమార్ మూర్తి ఎస్పీ, రాజమండ్రి ఎస్పీ, సీఐడీ ప్రభాకర రావు ఎస్పీ, కృష్ణా కమాండెంట్, కాకినాడ -
రేప్‌ల ఎఫెక్ట్.. 10మంది ఐపీఎస్‌ల బదిలీ
ఉత్తరప్రదేశ్‌లో వరుసపెట్టి జరుగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో, ఎట్టకేలకు అఖిలేష్ ప్రభుత్వం స్పందించింది. పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. గతవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి లాంటి అత్యున్నత అధికారులను సైతం అఖిలేష్ ప్రభుత్వం గత వారం తప్పించింది. మొరాదాబాద్, బిజ్నోర్, హాపూర్, సహారన్పూర్, ఔరియా జిల్లాలకు చెందిన ఎస్పీలు, సీనియర్ ఎస్పీలను బదిలీ చేశారు. వీళ్లకు ఎలాంటి పోస్టింగు ఇవ్వకుండా లక్నోలోని డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేశారు. కొత్తగా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఐజీ పోస్టును సృష్టించి, అధికారిని నియమించారు. బదాయూలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం, హత్య కేసుతో యూపీ సర్కారు ప్రతిష్ఠ ఒక్కసారిగా మసకబారిపోయింది. తర్వాత ఏకంగా ఓ మహిళా జడ్జిపై ఆమె అధికారిక నివాసంలోనే అత్యాచారం, హత్యాప్రయత్నం జరగడంతో పరిస్థితి మరింత దిగజారింది.