
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా కేఆర్‌ఎమ్ కిషోర్ కుమార్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బదిలీల వివరాలు..
- రోడ్‌సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా కేఆర్‌ఎమ్ కిషోర్ కుమార్
- హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్
- రైల్వేస్ అడిషనల్ డీజీగా బాలసుబ్రహ్మణ్యం
- సీఐడీ డీఐజీగా సునీల్ కుమార్ నాయక్
- గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండెంట్‌గా అభిషేక్ మహంతి
- ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్ (అదనపు బాధ్యతలు)
- ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ హరికుమార్, కృపానంద త్రిపాఠిని డీజీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment