సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు పదోన్నతి పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పదోన్నతులు, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో అదనపు డీజీగా ఆర్ కే మీనా.. ఎస్‌ఐబీ చీఫ్‌గా శ్రీకాంత్.. మెరైన్ పోలీస్ చీఫ్‌గా ఎ.ఎస్.ఖాన్.. ప్రొవిజినల్ లాజిస్టిక్ ఐజీగా నాగేంద్రకుమార్..ఇంటెలిజెన్స్ ఐజీగా రఘురామిరెడ్డి.. ఏసీబీ ఐజీగా అశోక్‌కుమార్.. గుంటూరు రేంజ్ ఐజీగా జె. ప్రభాకర్‌రావు.. ఇంటెలిజెన్స్ డీఐజీగా విజయ్‌కుమార్.. ఏలూరు రేంజ్ డీఐజీగా కేవీ మోహన్ రావులతో పాటు మరికొందరు పదోన్నతి పొందారు.
పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా హరీష్‌కుమార్ గుప్తా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్.. నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్ సునీల్.. ఎపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌గా అమిత్ బర్దార్, కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి, ఎపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌గా బి. క్రిష్ణారావు బదిలీ అయ్యారు. వీరిలో వినీత్ బ్రిజ్‌లాల్‌కు ప్రొహిబిషన్, ఎక్సైజ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment