
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు డీజీ (విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్)గా ఉన్న కుమార్ విశ్వజిత్‌ను అదనపు డీజీ (రైల్వేస్)గా నియమించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ సెల్ (సీఐ) విభాగంలో ఐజీగా ఉన్న డాక్టర్ కొల్లి రఘురామిరెడ్డిని విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీగా బదిలీ చేసింది. డ్రగ్ కంట్రోలర్ డీజీగా కూడా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు మరో 28 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.