
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొంత మంది అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌గా జి. జయలక్ష్మిని నియమించింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ప్రత్యేక సీఎస్‌గా ఆర్‌పీ సిసోడియా, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక సీఎస్‌గా జి.అనంతరాము నియమితులయ్యారు.
సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లాను నియమించింది. ఆర్థిక శాఖ (సీటీ) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గిరిజా శంకర్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆ బాధ్యతలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ హరికిరణ్‌ను బదిలీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బాధ్యతల నుంచి అజయ్ జైన్‌ను రిలీవ్ చేసింది.
ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు ఇలా..
Comments
Please login to add a commentAdd a comment