IAS Officers Transfer
-
TG: ఐఏఎస్‌ల బదిలీ.. స్మితాసబర్వాల్ ఎక్కడికంటే..
సాక్షి,హైదరాబాద్:తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 13 మంది ఐఏఎస్‌లు, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి సోమవారం(నవంబర్ 11) ఉత్తర్వులు జారీ చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కూడా బదిలీ అయిన అధికారుల జాబితాలో ఉన్నారు. తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా ఉన్న ఆమెను వేరే శాఖకు కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎవరు.. ఎక్కడికంటే..యూత్ అండ్ టూరిజం కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా స్మితా సబర్వాల్బీసీ వెల్ఫేర్ సెక్రెటరీగా శ్రీధర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రెటరీగా అనిత రామచంద్రన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా సురేంద్రమోహన్ట్రాన్స్కో సీఎండీగా కృష్ణభాస్కర్ఇంటర్మీడియెట్ బోర్డు డైరెక్టర్‌గా కృష్ణ ఆదిత్యఆరోగ్యశ్రీగా సీఈవోగా శివశంకర్ ఆయుష్ డైరెక్టర్‌గా చిట్టెం లక్ష్మిఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా హరికిరణ్పంచాయతీరాజ్ డైరెక్టర్‌గా శ్రీజనలేబర్ కమిషనర్‌గా సంజయ్‌కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తిజీఏడీ కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్ -
AP: టూరిజం ఎండీగా ఆమ్రపాలి.. తెలంగాణ ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు
సాక్షి,విజయవాడ: తెలంగాణ నుంచి ఇటీవలే వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఆదివారం(అక్టోబర్ 27) ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఆమ్రపాలి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణిమోహన్, వైద్య ఆరోగ్య కమిషనర్‌గా వాకాటి కరుణ, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ఐఏఎస్ అధికారి రొనాల్డ్‌రోస్‌కు ఇంకా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. కాగా, ఏపీకి కేటాయించిన తమను తెలంగాణలోనే కొనసాగించాలని ఐఏఎస్ అధికారులు పెట్టుకున్న అభ్యర్థనను కేంద్ర డీఓపీటీ శాఖ తిరస్కరించడంతో వీరు ఏపీకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: దీపావళికి కూటమి ప్రభుత్వం ఇచ్చే కానుక ఇదేనా -
కాట.. ఏపీబాట !
సాక్షి, సిటీబ్యూరో: ఊహించినట్లుగానే జీహెచ్ఎంసీ కమిషనర్ కాట ఆమ్రపాలి..ఆంధ్రప్రదేశ్ బాట పట్టక తప్పలేదు. తనను తెలంగాణలోనే కొనసాగించాలని మరికొందరు ఐఏఎస్ అధికారులతో పాటు క్యాట్‌ను ఆశ్రయించగా..అక్కడ చుక్కెదురుకావడంతో.. వెంటనే హైకోర్టు మెట్లెక్కినా, ఉపశమనం లభించలేదు. ముందైతే డీఓపీటీ ఆదేశాల కనుగుణంగా ఏపీలో రిపోర్ట్ చేయాలని హైకోర్టు పేర్కొనడంతో జీహెచ్ఎంసీ నుంచి వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఐఏఎస్ అధికారులకు అనుకూలంగా క్యాట్ తీర్పునివ్వగలదని జీహెచ్ఎంసీ వర్గాలు భావించాయి. క్యాట్‌లో ఊహించని పరిణామం ఎదురవడంతో.. కనీసం హైకోర్టు అయినా మిగతా వారితోపాటు ఆమ్రపాలికి అనుకూలంగా ఆదేశాలివ్వగలదని ఆశించినప్పటికీ, హైకోర్టు సైతం ఏపీకి వెళ్లాలని స్పష్టం చేయడంతో జీహెచ్ఎంసీ వర్గాలు ఉస్సూరుమన్నాయి. ఇప్పుడిప్పుడే.. బల్దియా వ్యవహారాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయని భావిస్తున్న తరుణంలో కమిషనర్ మార్పుతో పరిస్థితులు మళ్లీ మొదటికి రానున్నాయి. దాదాపు 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీహెచ్ఎంసీలో ఆరుజోన్లు, 30 సర్కిళ్లు, వేల సంఖ్యలో ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే పరిధికి తగ్గట్లే చెత్త సమస్యలు, తదితరమైనవి ఉన్నాయి. ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ సైతం సవ్యంగా జరగని దుస్థితినుంచి పరిస్థితుల్ని ఓ గాడిన పెట్టేందుకు ఆమ్రపాలికి సమయం సరిపోలేదు. జీహెచ్ఎంసీని అర్థం చేసుకొని, ఇప్పుడిప్పుడే ఒక్కో విభాగంపై పట్టు సాధిస్తున్న తరుణంలో అనూహ్యంగా వెళ్లాల్సి వచ్చింది. అసలే అస్తవ్యస్తంగా ఉన్న జీహెచ్ఎంసీలో సిబ్బంది జీతాల చెల్లింపుల నుంచి నిర్వహణ పనులకు సైతం నిధుల కటకట ఉంది. క్రమశిక్షణ లేని సిబ్బంది..బదిలీలైనా సీట్లను వదలని ఉద్యోగులు.. ఒప్పందాలున్నా పనులు సవ్యంగా చేయని కాంట్రాక్టు ఏజెన్సీలు..విధులకు చుట్టపుచూపుగా వచ్చిపోయే ఉద్యోగులు..వచ్చినా పనులు చేయకుండా కాలక్షేపం చేసే వాళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే జీహెచ్ఎంసీలో సమస్యలకు అంతేలేదు. అంతర్గత బదిలీల్లోనూ ఆమ్రపాలినే మాయ చేసి కావాల్సిన సీట్లలో పాతుకుపోయిన వారు కూడా ఉన్నారు. ఈనేపథ్యంలో కొత్త కమిషనర్‌కు బాధ్యతల నిర్వహణ కత్తిమీద సామే కానుంది. జీహెచ్ఎంసీ విభజన, దాదాపు ఏడాది కాలంలో జరగనున్న పాలకమండలి ఎన్నికలు ఇలా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. కమిషనర్‌గా ఇలంబర్తి ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) అప్పగించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలంబర్తి గతంలో సెంట్రల్‌జోన్ (ఖైరతాబాద్) కమిషనర్‌గా పనిచేశారు. ఆ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఆయనకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలప్పగించిందని జీహెచ్ఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. -
ఐఏఎస్‌ల విభజన వివాదానికి తెర
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పదేళ్లుగా కొనసాగుతున్న ఐఏఎస్ అధికారుల విభజన వివాదానికి నాటకీయ పరిణామాల మధ్య తెరపడింది. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్), హైకోర్టులో కేసులపై బుధవారం స్పష్టత వచ్చింది. ఐఏఎస్ అధికారులు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలన్న..‘కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ)’ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ నుంచి ఐదుగురు ఐఏఎస్‌లు ఏపీకి రిలీవ్‌కాగా.. ఏపీ నుంచి ముగ్గురు తెలంగాణలో రిపోర్టు చేశారు. ఇక ఐపీఎస్‌లకు సంబంధించిన కేడర్ ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. రిలీవ్.. ఇతర అధికారులకు బాధ్యతలు ఇరు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల తుది కేటాయింపుల్లో భాగంగా ‘కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ)’.. తెలంగాణలో పనిచేస్తున్న ఐదుగురు ఐఏఎస్‌లను ఏపీ కేడర్‌కు కేటాయిస్తూ ఈ నెల 9న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై, క్యాట్ ఆదేశాలపై ఐఏఎస్‌లు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్లను కొట్టివేసింది. మరోవైపు బుధవారంలోపే ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను వెంటనే రిలీవ్ చేసింది. రిలీవైన అధికారుల్లో ఇంధన శాఖ కార్యదర్శి/జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల ఇన్చార్జి సీఎండీ రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ కమిషనర్ కాట ఆమ్రపాలి, స్త్రీ/శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, యువజన, పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్, ఆయుష్ డైరెక్టర్ మల్లెల ప్రశాంతి ఉన్నారు. ఇక రిలీవైన అధికారుల స్థానంలో ఇతర అధికారులకు ఇన్చార్జులుగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. భారీగా ఐఏఎస్‌ల బదిలీలకు చాన్స్! మొత్తంగా ఐదుగురు ఐఏఎస్‌లు తెలంగాణ నుంచి వెళ్తుండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఐఏఎస్‌లు ఇక్కడికి వస్తున్నారు. వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. వెళ్లినవారి శాఖల్లో పూర్తిస్థాయిలో నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాష్ట్ర పాలన యంత్రాంగంలో మరోసారి భారీగా మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు తెలంగాణలో ఉన్న డీజీ స్థాయి అధికారులు అంజనీకుమార్, అభిలాష్ భిష్త్లు కూడా డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీకి వెళ్లాల్సి ఉండనుంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు రావొచ్చని అంటున్నారు. ప్రత్యూష్ సిన్హా సిఫార్సులే ఫైనల్ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫారసుల ఆధారంగా ఐఏఎస్ అధికారులు సోమేశ్‌కుమార్, కాటా ఆమ్రపాలి, జి.అనంతరాము, ఎం.ప్రశాంతి, వాకాటి కరుణ, ఎ.వాణిప్రసాద్, రోనాల్డ్ రోస్, ఎస్ఎస్ రావత్‌లను ఏపీ కేడర్‌కు.. హరికిరణ్, జి.సృజన, శివశంకర్ లహోటిలను తెలంగాణ కేడర్‌కు కేంద్రం కేటాయించింది. ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిష్త్, అభిషేక్ మహంతిలను ఏపీకి కేటాయించారు. అయితే ఈ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించగా.. ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను కొట్టివేస్తూ 2017లో తీర్పు ఇచ్చింది. దానిపై కేంద్రం తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయగా.. సోమేశ్‌కుమార్‌ను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. సోమేశ్‌కుమార్ తక్షణమే ఏపీలో రిపోర్టు చేయాలంటూ 2023 జనవరి 10న తీర్పు ఇచ్చింది. అంతేగాకుండా ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులను హైకోర్టు సమర్థించింది. దీంతో సోమేశ్‌కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టును కోల్పోవాల్సి వచ్చింది. ఈ తీర్పును ఇతర అధికారులకు కూడా వర్తింపజేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ ఏడాది జనవరి 3న తీర్పునిచ్చింది. 10 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐపీఎస్‌ల కేటాయింపుపై క్యాట్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. ఆ అధికారుల ప్రస్తుత, మిగిలిన సర్వీసు, వ్యక్తిగత అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. గతంలో జరిపిన తుది కేటాయింపులను పునఃసమీక్షించే బాధ్యతను డీవోపీటీకి అప్పగించింది. ఈ మేరకు డీవోపీటీ మాజీ సెక్రెటరీ దీపక్ ఖండేకర్‌తో ఏర్పాటైన ఏకసభ్య కమిటీ.. కేడర్ కేటాయింపుపై ఆయా అధికారుల విజ్ఞప్తులను తిరస్కరించింది. ఈ కమిటీ చేసిన సిఫార్సు ఆధారంగా.. ఐఏఎస్‌లు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని డీవోపీటీ ఆదేశించింది. సందీప్‌కు మళ్లీ ఇంధనశాఖ బాధ్యతలు ప్రభుత్వం కీలకమైన ఇంధనశాఖ కార్యదర్శి/ట్రాన్స్‌కో, జెన్కోల ఇన్చార్జి సీఎండీగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలను అప్పగించింది. గతంలో ఆయనకు పలుమార్లు ఈ పోస్టుల అదనపు బాధ్యతలను నిర్వహించిన అనుభవం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రవాణా శాఖ కమిషనర్ టి.ఇలంబర్తికి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతగా అప్పగించింది. మరోవైపు ఏపీకి రిలీవైన రోనాల్డ్ రోస్ సతీమణి, ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిణి విశాలాచ్చి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఆమె సైతం తెలంగాణ నుంచి బుధవారం రిలీవ్ అయ్యారు. ఆమె స్థానంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా ఆర్వీ కర్ణన్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏపీ నుంచి తెలంగాణలో రిపోర్టు చేసిన ముగ్గురు ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీ నుంచి రిలీవైన ఐఏఎస్ అధికారులు శివశంకర్ లోతేటి, శ్రీజన, సి.హరికిరణ్ బుధవారం తెలంగాణలో రిపోర్టు చేశారు. ఈ మేరకు సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిశారు. మరోవైపు తుది కేటాయింపుల్లో భాగంగా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సి ఉన్న ఐపీఎస్ అధికారులపై సందిగ్ధం కొనసాగుతోంది. రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీ అంజనీకుమార్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ భిస్త్ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ ఇంకా ఉత్తర్వులు రాలేదని తెలిసింది. -
క్యాట్ పిటిషన్ కహానీ
-
TG: ఆమ్రపాలికి కేంద్రం షాక్
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఆమ్రపాలితో పాటు తెలంగాణ కేడర్ కావాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. వీరందరినీ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ 11 మంది ఐఏఎస్‌లలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్ కూడా ఉన్నారు. వీరందరూ తమకు తెలంగాణ కేడర్ కావాలని కేంద్రంలోని డీవోపీటీ శాఖకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరి విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఇదీ చదవండి: ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం: వినోద్‌కుమార్ -
TG: పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి శనివారం(ఆగస్టు31)ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో సురేంద్రమోహన్,యాస్మిన్‌బాషా,వినయ్ కృష్ణారెడ్డి, మల్సూర్ తదితరులున్నారు. వీరిలో సురేంద్రమోహన్ను మైన్స్ అండ్ జియాలజీ సెక్రటరీగా యాస్మిన్ బాషాను హార్టీ కల్చర్ డైరెక్టర్‌గా మల్సూర్‌ను మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్‌చైర్మన్‌గా నియమించారు. -
మహిళా ఐఏఎస్ హరితను టార్గెట్ చేసిన టీడీపీ నేత ఆనం
సాక్షి, విజయవాడ: మహిళా ఐఏఎస్ అధికారిణిపై టీడీపీ నేత కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. ఐఏఎస్ అధికారిని డీ హరితను టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి బదిలీ చేయించారు. ఆనం ట్వీట్ చెయ్యగానే మహిళా ఐఏఎస్ హరిత బదిలీ అయ్యారు. అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా మంగళవారం ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో వెంటనే హరిత అవినీతి అధికారి అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ నేత ఫిర్యాదుతో ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జేఏడీకి బదిలీ చేశారు. నాలుగు రోజుల్లోనే మహిళా ఐఏఎస్ హరితను మూడుసార్లు బదిలీ చేశారు. కాగా గత ప్రభుత్వంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా చేశారు హరిత. -
ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొంత మంది అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భూ పరిపాలన చీఫ్ కమిషనర్‌గా జి. జయలక్ష్మిని నియమించింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ప్రత్యేక సీఎస్‌గా ఆర్పీ సిసోడియా, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక సీఎస్‌గా జి.అనంతరాము నియమితులయ్యారు. సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లాను నియమించింది. ఆర్థిక శాఖ (సీటీ) కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న గిరిజా శంకర్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. ఆ బాధ్యతలను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించింది. వ్యవసాయ శాఖ డైరెక్టర్ హరికిరణ్‌ను బదిలీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ బాధ్యతల నుంచి అజయ్ జైన్‌ను రిలీవ్ చేసింది. ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు ఇలా.. -
AP: భారీగా కలెక్టర్ల బదిలీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లుశ్రీకాకుళం-స్వప్నిల్ దినకర్పార్వతీపురం- శ్యామ్ ప్రసాద్విశాఖపట్నం-హరీంద్రప్రసాద్అనకాపల్లి- కె.విజయఅంబేద్కర్ కోనసీమ జిల్లా-రావిరాల మహేష్కుమార్లపల్నాడు-అరుణ్బాబునెల్లూరు- ఆనంద్తిరుపతి- వెంకటేశ్వర్అన్నమయ్య జిల్లా - చామకూరి శ్రీధర్వైఎస్సార్ జిల్లా - లోతేటి శివశంకర్శ్రీసత్యసాయి జిల్లా- టీఎస్ చేతన్నంద్యాల -బి.రాజకుమారి -
Telangana: 41మంది ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీగా అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీ చేపట్టింది. అందులో 41 మంది ఐఏఎస్‌లు కాగా.. ఇద్దరు ఐపీఎస్, ఒకరు ఐఎఫ్ఎస్ అధికారి ఉన్నారు. ఇందులో కీలకమైన ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, ట్రాన్స్‌కో, జెన్కో సంస్థల ఇన్చార్జి సీఎండీ పోస్టుల నుంచి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని ప్రభుత్వం తప్పించింది. ఆయనను వాణిజ్య పన్నులు, ఎౖక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శిగా మరో కీలక పోస్టు కు బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్కు ఇంధన శాఖ, ట్రాన్స్‌కో, జెన్కో బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే మరికొందరు అధికారుల బదిలీ ఉండనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కఠిన చర్యలకు దిగడంతో..: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కీలకమైన ఇంధన శాఖ, ట్రాన్స్‌కో, జెన్కోల బాధ్యతను రిజ్వీకి అప్పగిస్తూ జనవరి 3న ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన రిజ్వీ.. అన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించినట్టు ఉద్యోగ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ ఉద్యోగ సంఘాలతోపాటు కొందరు రాజకీయ పెద్దల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నట్టు తెలిసింది. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలను కలిసి రిజ్వీని బదిలీ చేయాలంటూ పైరవీలు చేసినట్టు సమాచారం. విద్యుత్ సంస్థల ఆర్థిక వ్యవహారాల్లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా మెరిట్, సీనియారిటీ ఆధారంగా విద్యుదుత్పత్తి కంపెనీలు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను చెల్లించాలని రిజ్వీ ఆదేశాలు జారీ చేయడం కొందరికి రుచించలేదనే చర్చ జరిగింది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో రిజ్వీని ప్రభుత్వం బదిలీ చేయనున్నట్టు నెల రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో రిజ్వీని ఇంధన శాఖ, ట్రాన్స్‌కో, జెన్కో బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. అయితే ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచి్చపెట్టే వాణిజ్య పన్నులు, ఆబ్కారీ శాఖలను అప్పగించింది. ఈ రెండు శాఖల్లో ఆదాయం లీకేజీని అరికట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. సుల్తానియాకు ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్‌ను కూడా ప్రభుత్వం ఆరు నెలలు గడవక ముందే ఆ శాఖ నుంచి తప్పించి అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న సందీప్‌కుమార్ సుల్తానియాకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టు ఇచ్చారు. ప్రణాళిక ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలూ అప్పగించారు. అంతేకాదు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలూ ఆయనే చూస్తారని పేర్కొన్నారు. ఆమ్రపాలి చేతికి నగరాభివృద్ధి.. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ కాటా ఆమ్రపాలికి ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణంగా ఈ పోస్టులో అత్యంత సీనియర్ అధికారులను నియమిస్తుంటారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమితులైన అధికారుల్లో జూనియర్ ఆమ్రపాలి కావడం గమనార్హం. ఇప్పటికే ఆమె మూసీ రివర్ ఫ్రంట్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్లకు ఎండీగా, ఓఆర్ఆర్ కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో ఉన్నారు. దీంతో హైదరాబాద్ నగరాభివృద్ధికి సంబంధించిన కీలక విభాగాలన్నీ ఆమ్రపాలికి అప్పగించినట్టు అయింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ హెచ్ఎండీఏ కమిషనర్‌గా కీలక పోస్టుకు బదిలీ అయ్యారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్ కె.అశోక్‌రెడ్డి జలమండలి ఎండీగా బదిలీ అయ్యారు. గతంలో ఆయన బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీగా వ్యవహరించారు. శైలజా రామయ్యర్‌కు మళ్లీ చేనేత బాధ్యతలు మంత్రి డి.శ్రీధర్‌బాబు సతీమణి శైలజా రామయ్యర్‌ను ప్రభుత్వం పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి పోస్టు నుంచి దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి పోస్టుకు బదిలీ చేసింది. పరిశ్రమల శాఖ కిందకు వచ్చే చేనేత, వస్త్ర, హస్తకళల శాఖ బాధ్యతలు కూడా ఆమెకు అప్పగించింది. 2012 జూలై నుంచి 2022 నవంబర్ వరకు శైలజా రామయ్యర్ చేనేత శాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. రిజిస్ట్రేషన్ల శాఖకు జ్యోతిబుద్ధ ప్రకాశ్.. రవాణా శాఖ కమిషనర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ కీలకమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ, సర్వే–సెటిల్మెంట్–ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, భూభారతి పీడీ అదనపు బాధ్యతల నుంచి నవీన్ మిట్టల్‌ను ప్రభుత్వం తప్పించింది. జ్యోతిబుద్ధ ప్రకాశ్‌కే అదనపు బాధ్యతలుగా ఈ పోస్టులను అప్పగించింది. మళ్లీ వారికి ప్రాధాన్యత లేని పోస్టింగ్స్... సీనియర్ ఐఏఎస్ సబ్యసాచి ఘోష్, సంజయ్‌కుమార్, వాణీప్రసాద్, అహ్మద్ నదీమ్‌లకు మళ్లీ పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టింగ్స్ లభించాయి. యువజన అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ పశు సంవర్థక శాఖకు బదిలీ అయ్యారు. వెయిటింగ్లో ఉన్న సంజయ్‌కుమార్ కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ పొందారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ.వాణీప్రసాద్‌ను ప్రభుత్వం యువజన అభివృద్ధి శాఖకు బదిలీ చేసింది. -
IASల బదిలీ.. కొత్త GHMC కమిషనర్ గా ఆమ్రపాలి
-
భారీగా ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. వారిలో ఏడుగురిని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)కి అటాచ్ చేసింది. విశాఖ, బాపట్ల జిల్లా కలెక్టర్ల బాధ్యతలను అక్కడి జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది. -
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్‌గా జి.సాయి ప్రసాద్పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్వ్యవసాయ ముఖ్యకార్యదర్శిగా రాజశేఖర్కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిపౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సిద్ధార్థ్ జైన్పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్‌కుమార్ సింఘాల్పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్ (ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు)సీఆర్డీఏ కమిషనర్‌గా కాటమేని భాస్కర్ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్గౌర్సీఎం సెక్రటరీగా ప్రద్యుమ్నఆర్థిక శాఖ కార్యదర్శిగా వినయ్ చంద్ఉద్యాన, మత్స్య, సహకారశాఖ కార్యదర్శిగా అహ్మద్బాబుపశు సంవర్థకశాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్గనుల శాఖ డైరెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్(ఏపీఎండీసీ ఎండీగా అదనపు బాధ్యతలు)శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్‌లు జీఏడీకి బదిలీ -
వారంలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల వరకు పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కొత్తగా అధికారింలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా అధికారులతో కొత్త జట్టు కూర్పుపై దృష్టిసారించింది.మరో వారం పది రోజుల్లో బదిలీల కసరత్తు పూర్తి చేసి ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలి పాయి. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎలాంటి వివాదాలు, ఆరోపణల్లో చిక్కుకోని అధికారులకు బదిలీల్లో ప్రాధాన్యత లభించే అవకాశాలున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతోపాటు ప్రభుత్వం ముందు ఉన్న ఇతర సవాళ్లను దృష్టిలో పెట్టుకొని చురుకుగా పనిచేసే అధికారులను కీలక పోస్టుల్లో నియమించే అవకాశాలున్నాయి. సీఎస్ రేసులో జయేశ్ రంజన్, వికాస్‌రాజ్ మరికొందరు సీఎస్ శాంతికుమారి స్థానంలో కొత్త సీఎస్ పోస్టు రేసులో ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్, కె. రామకృష్ణారావు, అరవింద్‌కుమార్, జయేశ్ రంజన్, సంజయ్‌జాజు, వికాస్‌రాజ్ ఉన్నారు. శశాంక్ గోయల్‌కు రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగా రామకృష్ణారావు, అరవింద్‌కుమార్‌కు ఏడాది,జ యేశ్ రంజన్, వికాస్‌రాజ్‌కు మూడేళ్లు, సంజయ్ జాజుకు ఇంకా 4 ఏళ్ల సరీ్వసు మిగిలి ఉంది.వారిలో గోయల్, కె.రామకృష్ణారావు, జయేశ్ రంజన్, సంజయ్ జాజు, వికాస్‌రాజ్ పేర్లను ప్రభుత్వం సీఎస్ పదవికి పరిశీలించే అవకాశాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసు శాఖ ఇన్చార్జి డీజీపీగా రవిగుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియ మించిన విషయం తెలిసిందే. ఆయన్ను బదిలీ చేయకుండా కొనసాగించే అవకాశం ఉంది. డీజీపీని మార్చాలని ప్రభుత్వం భావిస్తే రేసులో కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, శివధర్‌రెడ్డి రేసులో ఉన్నారు. ఇన్చార్జీల స్థానంలో పూర్తిస్థాయి అధికారులువిద్య, వైద్యం, పురపాలన, రెవెన్యూ, ఆర్థిక, పంచాయతీరాజ్, సంక్షేమం, పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయం వంటి కీలక శాఖలకు కొత్త కార్యదర్శులను నియమించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇన్చార్జీల పాలనలో ఉన్న చాలా శాఖలకు పూర్తిస్థాయి అధికారులను ప్రభుత్వం నియమించనుంది. రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో ఇన్చార్జి సీఎండీ ఎస్వీఎం రిజ్వీ బదిలీ కానున్నట్టు గత వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముక్కుసూటిగా, నిక్కచి్చగా వ్యవహరించే అధికారిగా పేరుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర విద్యుత్ సంస్థలను గాడినపెట్టే బాధ్యత అప్పగించింది.కానీ రాజకీయ సిఫారసులను పక్కనపెట్టి పూర్తిగా నిబంధనల మేరకే నిర్ణయాలు తీసుకుంటుండటంతో రిజ్వీని బదిలీ చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. విద్యుత్ సంస్థల్లో కీలకపాత్ర పోషించే ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాల నేతలు సైతం ఆయనకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన్ను పెద్దగా ప్రాధాన్యంలేని ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ పోస్టు కు బదిలీ చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా కొత్త అధికారిని నియమించే అవకాశాలున్నాయి. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు కొత్త సీఎండీని సైతం నియమించనుంది.జిల్లాలకు కొత్త సారథులుజిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలపై ఇప్పటి వర కు ఎన్నికల సంఘం ఆంక్షలు కొనసాగాయి. ఎన్నికలు ముగియడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీ స్థా యి అధికారులను వారం రోజుల్లో బదిలీ చేసే అవకాశముంది. కొందరు అధికారులు ముఖ్యమైన జిల్లాల్లో పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. -
మూడు జిల్లాల కలెక్టర్లు బదిలీ
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులను, ఆరుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. వీరి స్థానంలో కొత్త అధికారులను నియమించేందుకు ఒక్కో పోస్టుకు ముగ్గురి పేర్లు సూచిస్తూ వెంటనే జాబితా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజాబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీశాతో పాటు ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ పి.జాషువా, అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వీరికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని స్పష్టం చేసింది. -
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, విజయవాడ: పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా శశిభూషన్ కుమార్ బదిలీ అవ్వగా, బుడితి రాజశేఖర్‌ను జీఏడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పంచాయతీ రాజ్ కమిషనర్‌గా కన్నబాబు, మత్స్యశాఖ కమిషనర్‌గా సూర్యకుమారిలను బదిలీ చేయగా, సెర్ప్ సీఈవోగా మురళీధర్ రెడ్డికి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా హర్షవర్ధన్‌కి అదనపు బాధ్యతలు, సీసీఎల్ఏ సెక్రటరీగా వెంకట్రామిరెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. -
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి షా, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శేబరిష్ బదిలీ అయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ నుంచి జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా భోర్ఖాడే హేమంత్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా కేశవ్ పాటిల్ బదిలీ అయ్యారు. -
ఏపీలో 21 మంది ఐఏఎస్ ల బదిలీ
-
TS: పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్ లిస్టులో ఉన్న అధికారులకు పోస్టింగ్ ఇచ్చినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలియజేసింది. పశుసంవర్థకశాఖ సంయుక్త కార్యదర్శిగా అమోయ్‌కుమార్ ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ టీఎస్ ఐఆర్డీ సీఈవోగా కాత్యాయని దేవి గనుల శాఖ డైరెక్టర్‌గా సుశీల్ కుమార్ రోడ్లు భవనాల శాఖ సంయుక్త కార్యదర్శిగా హరీశ్ వైధ్య ఆరోగ్య శాఖ సయుక్త కార్యదర్శిగా టి. వినయ్ కృష్ణా రెడ్డి చదవండి: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -
TS: ఆరుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారి బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆరగురు ఐఏఎస్ అధికారులు, ఒక ఐపీఎస్ అధికారి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది. ఇంటర్ విద్య డైరెక్టర్‌గా శృతి ఓజా, గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా ఈవీ నర్సింహారెడ్డి, ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా జ్యోతి బుద్ధప్రకాష్, ఎక్సైజ్ కమిషనర్‌గా ఇ.శ్రీధర్, సివిల్ సప్లయ్ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్ బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరిపై బదిలీ వేటు పడింది. కలెక్టర్ భారతీ హోలికేరికి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం జీఏడీకీ రిపోర్టు చేయాలని ఆదేశించింది. రంగారెడ్డి కలెక్టర్‌గా గౌతమ్‌కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. చదవండి: CM Revanth Reddy: మాతో పని చేయడానికి ఇబ్బంది ఉంటే విధుల నుంచి తప్పుకోవచ్చు -
తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ.. ఆమ్రపాలికి ఆ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. పదోన్నతుల బదిలీలుగా పేర్కొంటూ పలువురిని తన పేషీలో చేర్చుకుంది ప్రభుత్వం. ఊహించినట్లుగానే యువ ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి బాధ్యతలు దక్కాయి. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమెను నియమించింది. డిప్యూటీ సీఎం ఓఎస్డీ(ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా కృష్ణభాస్కర్, వ్యవసాయ కార్యదర్శిగా బి.గోపి, TSSPDCL (దక్షిణ) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ అలీ ఫరూకీని, ట్రాన్స్ కో జేఎండీ (జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్)గా సందీప్ కుమార్, TSNPDCL(ఉత్తర) వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్నాటి వరుణ్ రెడ్డి, ఎంపీడీసీఎల్‌కు సీఎండీగా క్రాంతి వరుణ్‌రెడ్డి, వైద్య..ఆరోగ్య శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ కమిషనర్‌గా శైలజా రామయ్యర్‌ను నియమించారు. విద్యుత్ డిపార్ట్మెంట్లోనే ఈ బదిలీలు ఎక్కువగా జరిగాయి. ఇంధన శాఖ కార్యదర్శిగా సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని నియమిస్తూ.. ట్రాన్స్‌కో చైర్మన్ అండ్ ఎండీగా అదనపు బాధ్యతలూ అప్పజెప్పారు. ఇటీవలె డీ. ప్రభాకర్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి అభినందించాక.. ఆమ్రపాలికి ఏదో ఒక బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం విపరీతంగా జరిగింది. అందుకు తగ్గట్లే ఆమెకు హెచ్ఎండీఏ కమిషనర్ బాధ్యతల్ని అప్పజెప్పారు. -
20 మంది ఐఏఎస్, ఐపీఎస్, నాన్ కేడర్ ఎస్పీలపై ఈసీ వేటు..
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాష్ట్ర పరిపాలనపై దఖలుపడిన అధికారం మేరకు ఈ చర్య తీసుకుంది. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది. వీరిలో 18 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆంక్షలు విధించింది. బదిలీ అయిన అధికారులు సత్వరమే బాధ్యతల నుంచి తప్పుకొని తమ తర్వాతి స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కూడా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, దేవాదాయ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని ఆదేశించింది. ఈ మూడు శాఖలకు కొత్త ముఖ్య కార్యదర్శులతోపాటు బదిలీ వేటుపడిన 20 మంది అధికారుల స్థానంలో గురువారం సాయంత్రం 5 గంటల్లోగా కొత్త అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక్కో పోస్టుకు ముగ్గురు ఐఏఎస్/ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రతిపాదించాలని.. వారికి సంబంధించిన గత ఐదేళ్ల వార్షిక పనితీరు మదింపు నివేదిక (ఏపీఏఆర్)లు, విజిలెన్స్ క్లియరెన్స్‌లను సైతం జత చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్.బీ జోషి గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. దీనితో బదిలీ అయిన వారు తక్షణమే ఆయా పోస్టులకు వెళ్లాలని సీఎస్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, నిబంధనల అతిక్రమణ, తమ దృష్టికి వచ్చిన ఇతర అంశాల ఆధారంగానే పెద్ద సంఖ్యలో అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. పెద్ద ఎత్తున ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌లతో కూడిన బృందం ఈనెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో పర్యటించింది. ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమైంది. ఈ సమయంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలిపై ప్రతిపక్షాల ప్రతినిధులు ఈసీ బృందానికి పలు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లా కలెక్టర్లుగా, ఎస్పీలుగా బదిలీ చేశారని, నిష్పక్షపాతంగా వ్యవహరించే యువ అధికారులను పక్కనపెట్టారని పేర్కొన్నట్టు సమాచారం. దీనికితోడు ఈ అధికారులు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేసిన విషయం కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. గతంలో ఎన్నికల నిర్వహణను ఎత్తిచూపుతూ.. కేంద్ర, రాష్ట్రాల ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ఉన్నతాధికారులు, డీజీపీ, సీఎస్, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశాల సందర్భంగా గతంలో నిర్వహించిన ఎన్నికల తీరుపై సీఈసీ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలతోపాటు తర్వాత జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు, మద్యం, బంగారం, ఇతర కానుకలు పంపిణీ చేసినట్టు ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయని గుర్తు చేసినట్టు తెలిసింది. తెలంగాణతోపాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఓటర్లను అత్యధికంగా ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా ఎన్నికల సమయంలో జప్తు చేస్తున్న డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం, వెండి, ఇతర కానుకలు నామమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిసింది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలు నిర్వహించిన తీరుపై పదేపదే ఆక్షేపణలు తెలిపినట్టు సమాచారం. మరోవైపు డ్రగ్స్, లిక్కర్ మాఫియాపై చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో పెద్ద మొత్తంలో దొరికి డ్రగ్స్ రాష్ట్రం నుంచే తరలివెళ్లినట్టు నివేదికలు ఉన్నాయని.. డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపారా? అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. రవాణా శాఖ కార్యదర్శి అధికార పార్టీ సభలకు వాహనాల కేటాయింపులో సహకరించినట్టు వచ్చిన ఆరోపణలతో ఆయనను తొలగించినట్టు తెలిసింది. వివిధ జిల్లాల్లో ఎస్పీలు ప్రతిపక్షాల సభలు, సమావేశాలకు అనుమతులు నిరాకరించడం, నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని వేటు వేసినట్టు సమాచారం. మరో నాలుగు రాష్ట్రాల్లోనూ బదిలీలు.. తెలంగాణతోపాటు శాసనసభ సాధారణ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో వేటుపడిన వారిలో 9 మంది కలెక్టర్లతోపాటు పలువురు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ఉన్నారు. అధికార వర్గాల్లో ప్రకంపనలు రాష్ట్రంలో విస్తృతంగా సమీక్షలు జరిపి వెళ్లిన వారంలోనే కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది అధికారులపై బదిలీ వేటు వేయడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ చేసిన అధికారులను ఇంకా ఎలాంటి ఇతర పోస్టుల్లో ఇంకా నియమించలేదు. అయితే బదిలీ అయిన 10 మంది జిల్లా ఎస్పీల్లో 9 నాన్ కేడర్ ఎస్పీలే (ఐఏఎస్ కాకుండా ఎస్సై, సీఐ వంటి పోస్టుల నుంచి సీనియారిటీతో ఎస్పీగా నియామకమైనవారే) కావడం గమనార్హం. సాధారణంగా జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్లే వ్యవహరిస్తారు. ఇలాంటిది నాలుగు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయడం, వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ ఆదేశించడం గమనార్హం. -
తెలంగాణ: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ అయ్యారు. అదే విధంగా వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది ప్రభుత్వం. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు నూతన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీగా కె. హరిత భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక ములుగు జిల్లా కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి టూరిజం కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మీ టూరిజం డైరెక్టర్‌గా కె. నిఖిల ఆయుష్ డైరెక్టర్‌గా హరిచందన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్‌గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య నియమితులయ్యారు. హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి నియమించారు. ఇక తెలంగాణ స్టేట్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్, సెర్ప్ సీఈవోగా పాట్రు గౌతమ్, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా మంద మకరందు, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా ముజమిల్ ఖాన్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా కె. హరితను నియమించారు. చదవండి: కవిత, కేటీఆర్‌పై సుఖేష్ సంచలన ఆరోపణలు, గవర్నర్‌కు మరో లేఖ హస్త కళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా అలగు వర్షిణి, క్రీడల డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా హైమావతి, పర్యాటక శాఖ డైరెక్టర్‌గా కే నిఖిల, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా సత్య శారదాదేవి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా స్నేహ శబారిష్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక ఆల, మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్‌గా వెంకటేశ్ ధోత్రే నియమితులయ్యారు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న కే స్వర్ణలతను జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేశారు. అభిలాష అభినవ్‌ను ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌గా, కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా మను చౌదరిని, టీఎస్ దివాకరను జగిత్యాల అదనపు కలెక్టర్‌గా నియమించారు. నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్‌గా కుమార్ దీపక్, పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా చెక్క ప్రియాంక, కరీంనగర్ అదనపు కలెక్టర్‌గా జల్దా అరుణశ్రీ, సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్, రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్ నియమితులయ్యారు. -
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్‌గా అనంతరాము బాధ్యతలు నిర్వహించనున్నారు. సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జి.జయలక్ష్మి, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా రజత్ భార్గవ బదిలీ అయ్యారు. పర్యాటక, సంస్కృతికశాఖ అదనపు బాధ్యతలు కూడా రజత్ భార్గవకు అప్పగించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యతలను సీఎస్ పర్యవేక్షించనున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇంతియాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. చదవండి: స్థూల జాతీయ వృద్ధి రేటులో దేశంలోనే ఏపీ అగ్రగామి