
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులు పలువురిని బదిలీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులు పలువురిని బదిలీ చేసింది. 15 నుంచి 20 మంది సీనియర్ అధికారులను బదిలీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రదీప్ చంద్రను, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రకాష్ రాజ్, రెవెన్యూ, ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ల ముఖ్య కార్యదర్శిగా అజయ్ మిశ్రాను నియమించారు.
ఎక్సైజ్ కమిషనర్గా చంద్రవదన్ను పరిశ్రమల శాఖ ఇన్చార్జి కార్యదర్శిగా అరవింద్ కుమార్ను, హెచ్ఆర్డి ఎండీగా వీకే అగర్వాల్ను నియమించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి నాగిరెడ్డి తెలంగాణ ఎన్నికల కమిషనర్గా వెళ్లనున్నారు. ప్రధాన శాఖల ముఖ్య కార్యదర్శులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది.