
సాక్షి, విజయవాడ: మహిళా ఐఏఎస్ అధికారిణిపై టీడీపీ నేత కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. ఐఏఎస్ అధికారిని డీ హరితను టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి బదిలీ చేయించారు. ఆనం ట్వీట్ చెయ్యగానే మహిళా ఐఏఎస్ హరిత బదిలీ అయ్యారు. అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా మంగళవారం ప్రభుత్వం బదిలీ చేసింది.
దీంతో వెంటనే హరిత అవినీతి అధికారి అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ నేత ఫిర్యాదుతో ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జేఏడీకి బదిలీ చేశారు. నాలుగు రోజుల్లోనే మహిళా ఐఏఎస్ హరితను మూడుసార్లు బదిలీ చేశారు. కాగా గత ప్రభుత్వంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా చేశారు హరిత.
Comments
Please login to add a commentAdd a comment