
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. వారిలో ఏడుగురిని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)కి అటాచ్ చేసింది. విశాఖ, బాపట్ల జిల్లా కలెక్టర్ల బాధ్యతలను అక్కడి జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది.
