venkata ramana reddy
-
పార్టీ వ్యవహారాలపై ఎమ్మెల్యే రమణారెడ్డి విసుగు చెందారా?
-
మహిళా ఐఏఎస్ హరితను టార్గెట్ చేసిన టీడీపీ నేత ఆనం
సాక్షి, విజయవాడ: మహిళా ఐఏఎస్ అధికారిణిపై టీడీపీ నేత కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు. ఐఏఎస్ అధికారిని డీ హరితను టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి బదిలీ చేయించారు. ఆనం ట్వీట్ చెయ్యగానే మహిళా ఐఏఎస్ హరిత బదిలీ అయ్యారు. అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా మంగళవారం ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో వెంటనే హరిత అవినీతి అధికారి అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీ నేత ఫిర్యాదుతో ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జేఏడీకి బదిలీ చేశారు. నాలుగు రోజుల్లోనే మహిళా ఐఏఎస్ హరితను మూడుసార్లు బదిలీ చేశారు. కాగా గత ప్రభుత్వంలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా చేశారు హరిత. -
TG Assembly Session: బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
-
కేవీఆర్‌కు పెరిగిన క్రేజ్
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఐదారేళ్లుగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. మహిళా సంఘాలకు రావాల్సిన వడ్డీ రాయితీ కోసం కొట్లాడారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల్లోని డొల్లతనాన్ని వెలికితీశారు. రైతు సమస్యలపై గళమెత్తారు. ఇలా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరు చేసి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. బీజేపీ అంటే గిట్టని వారు సైతం వెంకటరమణారెడ్డి వివిధ సమస్యలపై చేపట్టిన నిరసన కార్యక్రమాలకు సపోర్ట్ చేయడం గమనార్హం.కేసీఆర్, రేవంత్‌రెడ్డిలను ఓడించి..అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి బరిలో దిగినా వెంకటరమణారెడ్డి ఎక్కడా తగ్గలేదు. ఇద్దరినీ ఓడిస్తానని శపథం చేశారు. ఇద్దరు ఉద్ధండులతో జరిగిన పోరులో వెంకటరమణారెడ్డి మూడో స్థానానికి వెళ్లడం ఖాయ మని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వెంకటరమణారెడ్డి జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. ఈ విజయంతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వెంకటరమణారెడ్డి వాక్ చాతుర్యం, పోరాట పటిమే ఆయనను గెలిపించాయని బీజేపీ నాయకత్వం గుర్తించింది. దీంతో పార్టీ ఆయనకు క్రియాశీలక బాధ్యతలు అప్పగించింది. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రాష్ట్ర కన్వీనర్‌గా కేవీఆర్‌ను నియమించారు. దానికోసం రాష్ట్ర రాజధానితో పాటు వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆ కార్యక్రమం ముగియగానే లోక్‌సభ ఎన్నికలు రావడంతో జహీరాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జీగా బీజేపీ ఆయనకు బాధ్యతలు అప్పగించింది. దాదాపు మూడు నెలలపాటు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటించి, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికలకు సన్నద్ధం చేశారు. నేతల మధ్య సమన్వయం కుది ర్చారు. ఎన్నికల సభలు, ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని శ్రేణుల్లో హుషారు పెంచారు. చేవెళ్ల, మహబూబ్‌నగర్, ఖమ్మం, భువనగిరి తదితర పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన పలు సభల్లో ప్రసంగించారు. ప్రస్తుతం నల్గొండ–వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ ఆయనకు ఉమ్మడి వరంగల్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేదు. కొన్ని ప్రాంతాల్లో నాయకత్వ సమస్య వేధిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జీగా నియమితులైన వెంకటరమణారెడ్డి.. దాదాపు మూడు నెలల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పలు సమావేశాలు నిర్వహించారు. జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో క్యాడర్‌తో జరిగిన సమావేశాల్లో పాల్గొని ఎన్నికల్లో గెలవడం కోసం వ్యవహరించాల్సిన వ్యూహాల గురించి వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 1,72,766 ఓట్లు మాత్రమే వచ్చాయి. పార్లమెంట్ స్థానంలో పార్టీ గెలవాలంటే మరో నాలుగు లక్షల ఓట్లు సంపాదించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇన్చార్జి బాధ్యతలు మోసిన వెంటరమణారెడ్డి పార్టీ అభ్యర్థి తరఫున పార్లమెంటు నియోజక వర్గం అంతటా కలియతిరిగారు. ఈ ఎన్నికలలో బీబీ పాటిల్ గెలిస్తే బీజేపీలో వెంకటరమణారెడ్డి ప్రాధాన్యత మరింత పెరుగుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.పాటిల్ గెలిస్తే మరింత ప్రాధాన్యత కామారెడ్డి అసెంబ్లీ స్థానంలో ఇద్దరు ఉద్ధండులను ఓడించి జెయింట్ కిల్లర్‌గా మారిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి బీజేపీలో మంచి ప్రాధాన్యత లభిస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తొలినాళ్లలోనే అయోధ్య రామాలయ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాటు చేసి అయోధ్య శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్‌గా నియమించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీగా వ్యవహరించారు. ఆయన సమర్థతను గుర్తించిన బీజేపీ.. ప్రస్తుతం జరుగుతున్న నల్గొండ–వరంగల్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి బాధ్యతలను అప్పగించింది. -
ఉద్దండులను ఓడించి.. ఉన్నత స్థితికి!
సాక్షి, కామారెడ్డి: ఇద్దరు ఉద్దండులను ఓడించి రాష్ట్రంలోనే కాదు యావత్ దేశం దృష్టిని ఆకర్శించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి బీజేపీ నాయకత్వం మంచి ప్రాధాన్యతనిస్తోంది. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పటికీ ఆయన ఓడించింది మామూలు వ్యక్తులను కాదు. అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్, ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డిలు ఇద్దరినీ ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరుగడించారు. వాక్చాతుర్యం, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పార్టీ కోసం విస్తృతంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా జహీరాబాద్ లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జీగా నియమించింది. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, శ్రేణులను సమన్వయం చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ముఖ్యభూమిక పోశిస్తున్నారు. కాటిపల్లిని ఎన్నికల ఇన్‌చార్జీగా నియమించడంతో టిక్కెట్ ఆశిస్తున్న వారంతా ఆయన చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ ఇచ్చిన బాధ్యతలను భుజాన వేసుకుని పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఆయా ప్రాంతాల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికలకు సమాయత్తం చేశారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కామారెడ్డి జిల్లాకు చెందిన కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలు, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికలను బీజేపీ నాయకత్వం ఈ సారి సవాల్‌గా తీసుకుంటోంది. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా జహీరాబాద్‌పై ఫోకస్ చేస్తోంది. ఇక్కడ టిక్కెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. పది మందికిపైగా నాయకులు టిక్కెట్ ఆశిస్తున్నారు. అలాగే అయోధ్యలో రామమందిర ప్రారంభో త్సవం ఈ నెలలోనే ఉన్న నేపథ్యంలో పూజిత అక్షింతలను ఊరూరికీ, ఇంటింటికీ చేర్చడానికి ఏర్పాటు చేసిన అయోధ్య శ్రీరామ తీర్థ ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్‌గానూ వెంకటరమణారెడ్డిని నియమించారు. దీంతో ఆయన ఇరవై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఇన్‌చార్జీగా, ఇటు అయో ధ్య తీర్థట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కాటిపల్లి మరోవైపు స్థానిక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో కార్యక్రమాలకు హాజరవుతు న్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జిల్లా అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై రివ్యూ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో అండర్–17 జాతీయ కబడ్డీ పోటీల నిర్వహణ విషయంలో నిర్వహణ కమిటీకి అండగా నిలిచా రు. పోటీల నిర్వహణకు ఆర్థిక సహాయం అందించారు. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా చాన్స్..? బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా వెంకటరమణారెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే ఇద్దరు ఉద్దండులను ఓడించిన వెంకటరమణారెడ్డినే శాసనసభ పక్ష నేతగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల బీజేపీ జాతీయ నాయకులు శాసనసభ పక్ష నేత ఎంపికపై చర్చించినపుడు వెంకటరమణారెడ్డి పేరు ప్రస్తావించినట్లు సమాచారం. జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు ఐదారేళ్లుగా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై అనేక పోరా టాలకు నాయకత్వం వహించిన నేపథ్యంలో ఆయనకున్న అనుభవం శాసనసభలో పనిచేస్తుందన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా వెంకట రమణారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారడంతో ఆయనకు పార్టీ నాయకత్వం కీలకమైన బాధ్యతలు అప్పగిస్తుందని భావిస్తున్నారు. ఇవి చదవండి: కాపులపై టీడీపీ కపట ప్రేమ.. -
రాజకీయం అంటే డబ్బు కాదని కాంగ్రెస్ కు వార్నింగ్
-
కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డిలో బీజేపీ సంచలన విజయం సాధించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి విజయం సాధించారు. ఈరోజు కౌంటింగ్ ముందు నుంచి గేర్లు మారుస్తూ కామారెడ్డిలో ప్రతీ రౌండ్‌కు ఆధిక్యం మారుతూ వచ్చింది. చివరకు బీజేపీ అభ్యర్థినే గెలుపు వరించింది. అయితే, కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే, కామారెడ్డి ఓటర్లు మాత్రం స్థానిక నేత అయిన వెంకట రమణ రెడ్డిపైనే నమ్మకం ఉంచి ఆయనను గెలిపించారు. ఇక, కౌంటింగ్‌లో చివరి నిమిషం వరకు కామారెడ్డి ఫలితం ఆసక్తికరంగా సాగాయి. ప్రతీ రౌండ్లోనూ ఆధిక్యం మారుతూ విజయం దోబూచులాడింది. ఒక సమయంలో కేసీఆర్, మరో సమయంలో రేవంత్ గెలుపు దిశగా ఫలితాలు వచ్చినా.. చిరవకు విజయం మాత్రం బీజేపీనే వరించింది. అయితే, వెంకట రమణా రెడ్డి గత ఎన్నికల్లో రెండు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. కామారెడ్డిలో ఇలా.. కామారెడ్డిలో 2009, 2014, 2018, 2012 ఉప ఎన్నికల్లో గంపా గోవర్దన్ గెలుపు. ఈ ఎన్నికల్లో సమీప అభ్యర్థి ప్రస్తుత షబ్బీర్ అలీపై గెలుపు. టీఆర్ఎస్ నుంచి బరిలో కేసీఆర్, రేవంత్ పోటీ. 2018లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పక్షాన గంపా గోవర్దన్, కాంగ్రెస్ తరపున సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన షబ్బీర్ అలీ పోటీ పడగా, గోవర్దన్ నే విజయం వరించింది. గోవర్దన్ 4,557 ఓట్ల తేడాతో విజయం సాదించగలిగారు. గోవర్దన్ కు 68,162 ఓట్లు రాగా, షబ్బీర్ అలీకి 63,610 ఓట్లు వచ్చాయి. ఈ విజయం కామారెడ్డి నియోజకవర్గ ప్రజల ప్రజలందరిది pic.twitter.com/bGLlHGOF6G — Katipally Venkata Ramana Reddy BJP (@kvr4kamareddy) December 3, 2023 -
దండెత్తిన డ్వాక్రా మహిళలు
కామారెడ్డి టౌన్ : స్త్రీ నిధి, అభయహస్తం, వడ్డీలేని రుణాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ డ్వాక్రా మహిళా సంఘాలకు చెందిన 7 వేల మంది మహిళా సభ్యులు శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ గంజ్ నుంచి ర్యాలీ ప్రారంభమై సిరిసిల్ల రోడ్, స్టేషన్‌రోడ్, రైల్వే బ్రిడ్జి మీదుగా నిజాంసాగర్ చౌరస్తాకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు రావలసిన రూ.6 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం త్వరలోనే చెల్లించాలన్నారు. రెండ్రోజుల్లో బకాయిలు చెల్లించకుంటే ఈనెల 6 నుంచి మూడు రోజుల పాటు నిరాహారదీక్షకు దిగుతామని స్పష్టం చేశారు. అప్పటికీ స్పందించకుంటే 10 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. -
‘ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు’
కామారెడ్డి క్రైం: టెక్నాలజీని వాడుకుని ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేయడంతోనే టీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వచ్చాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఓటమి ఎదురైనందుకు తాను ఇలా మాట్లాడటం లేదన్నారు. సాంకేతికతపై అవగాహన ఉన్నందునే మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన గంపగోవర్ధన్‌కు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. తాను నియోజకవర్గంలో 45 రోజలు పాటు ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చే శానన్నారు. అలాగే ప్రజలు అన్నిచోట్ల నుంచి బీజేపీకి ఓట్లు వేశారని పేర్కొన్నారు. ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఓట్లు వేసినా ట్యాంపరింగ్ చేయడంతోనే సీట్లు రాలేదన్నారు. లేదంటే ఎన్నికల ప్రచార సమయంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో, ఎన్ని సీట్లు వస్తాయో సీఎం కేసీఆర్‌కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. రెవెన్యూ, పోలీస్‌శాఖలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేసిందన్నారు. నీతి, నిజాయితీలు, అవినీతి రహిత పాలనే అజెండాగా ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్తామన్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ విధానాన్ని తీసుకువచ్చేలా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, అసెంబ్లీ కన్వీనర్ తేలు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కుంట లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు బాలకిషన్, నాయకులు మహేశ్‌గుప్తా, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం : బాణాల తాడ్వాయి: ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటు లో ఉండి వారి సమస్యలను తీ ర్చేలా కృషి చేయాలని బీజేపీ కామారెడ్డి జిల్లా అద్యక్షడు బా ణాల లక్ష్మారెడ్డి అన్నారు. తా డ్వాయి మండలంలోని క్రిష్ణాజివాడి గ్రామంలో శుక్రవా రం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పని చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఏఒక్క గ్రామానికి నిధులు రాలేదని, కేంద్రం నుంచి ఎల్లారెడ్డి నియోజక వర్గానికి 13, 14ఆర్థిక నిధుల క్రింద రూ.157కోట్లు వచ్చాయని తెలిపారు. మోదీ ప్ర భుత్వం భారత దేశంలో ఉన్న ప్రతి గ్రామానికి రూ.కోట్లల్లో నిధులు విడుదల చేస్తే రాష్ట్రప్రభుత్వం తమ నిధులని చెప్పుకుంటున్నదని ఆరోపించారు. ఈ నెల 16న జుక్కల్, 17న బాన్స్వాడ, 18న కామారెడ్డి నియోజక వర్గాలలో సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యకర్తలు మరింత కష్టపడి రాబోయే ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు మర్రి రాంరెడ్డి, నాయకులు వెంకన్న, బాలకిషన్, సురెందర్‌రెడ్డి, రమణారెడ్డి, వెంకట్రావు, సాయిబాబా, నర్సింహారెడ్డి, సతీష్, రవీందర్రావు, ఏడు మండలాల అ«ధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూతు కమిటి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
అవినీతి పరుల భరతం పట్టండి.. కాటిపల్లి వెంకటరమణారెడ్డి
సాక్షి, భిక్కనూరు: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అవినీతి పరుల భరతం పట్టాలని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని శ్రీ సిద్దరామేశ్వరనగర్లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో గత పాలకులు అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ప్రజలు వీటిని గమనించి గత పాలకులకు బుద్ధి చెప్పాలన్నారు. తాను చేసిన ఉద్యమ ఫలితంగానే ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పావలావడ్డీని విడుదల చేసిందన్నారు. అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దుతానన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు సింగం శ్రీనివాస్, నాయకులు నాగర్తి నర్సారెడ్డి, ప్రవీణ్‌గౌడ్, రాజిరెడ్డి, రాజేందర్‌రెడ్డి, బల్ల శ్రీనివాస్, నరేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లను తరిమికొట్టండి సాక్షి, దోమకొండ: అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్, టీఆర్ఎస్ల అభ్యర్థులను తరిమి కొట్టాలని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని షేర్‌బీబీపేట, అంచనూరు, గొట్టిముక్కులలో ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి మహిళలను, యువకులు, వృద్ధులు, రైతులను ఓటు వేయాలని కోరారు. గతంలో ఎమ్మెల్యేలుగా పని చేసిన షబ్భీర్అలీ, గంప గోవర్థన్‌లు సంపాదనే ధ్యేయంగా పనిచేశారని, ప్రజా సమస్యలను పట్టించుకొలేదని ఆరోపించారు. తాను నిజామాబాద్ జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాలంలో నిజాయితీగా ఉన్నానన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి అధికారులతో కలిసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు పావలావడ్డీ డబ్బులు తాను దీక్ష చేసి ఇప్పించానని ఆయన గుర్తు చేశారు. పార్టీ నాయకులు తేలు శ్రీను, ఆముదాల నరేందర్, కదిరె మోహన్‌రెడ్డి, చింతల రాజేష్ ఉన్నారు. నియోజకవర్గం రూపురేఖలు మారుస్తా సాక్షి, బీబీపేట: బీజేపీకీ ఓటు వేసి నన్ని అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గ రూపు రేఖలు మారుస్తానని బీజేíపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అన్నారు. మండలంలోని కోనాపూర్, మల్కాపూర్ల్లో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలోని ప్రజలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నారని, ప్రభుత్వం ఎక్కడా అభివృద్ధి చేసింది కనిపిస్తలేదన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఆముదాల నరేందర్, బీజేపీ జిల్లా నాయకులు బెంజరం తిరుపతి రెడ్డి, మండలాధ్యక్షుడు దుంప నర్సింలు, ప్రధాన కార్యదర్శి అంజాగౌడ్, అల్వాల రమణ, నరేష్, నవీన్ రెడ్డి, రాజిరెడ్డి, గోపాల్ పాల్గొన్నారు. -
సంజన కేసులో మరో ఇద్దరి అరెస్టు
హయత్‌నగర్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో కారు నడిపి రోడ్డు దాటుతున్న చిన్నారి సంజనను, ఆమె తల్లిని మృత్యుముఖంలోకి నెట్టేసిన కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వెంకటరమణారెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అతనితోపాటు కారులో ఉన్న యాదిరెడ్డి, శ్రీనివాసరెడ్డిని కూడా మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కాగా, చిన్నారి సంజన, ఆమె తల్లి పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. -
టీడీపీ నేతల ముఠా నాయకుడు ఎవరు!
టీడీపీ నేతలు ముఠాగా ఏర్పడి ఏలూరులోని చేనేత సహకార సంఘానికి చెందిన 4 వేల గజాల స్థలాన్ని అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ముఠాలో ఉన్న వాళ్లంతా టీడీపీకి చెందిన చోటామోటా నేతలే కాగా.. తెరవెనుక కథ నడిపిన నాయకుడు ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. కీలక నాయకుడి అభయం లేకుండానే ఆ నేతలు అంత ధైర్యం చేసి వివాదాస్పద స్థలం కొనుగోలు చేశారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏలూరు వీవర్స్ కాలనీలోని సుమారు 4వేల గజాల స్థలాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, నగర శాఖ అధికార ప్రతినిధి పూజారి నిరంజన్‌కుమార్‌తోపాటు అదే పార్టీకి చెందిన రెడ్డి వెంకటరమణ, నడిపూడి ఈశ్వరరావు, లంకా తిరుపతి, ఆరంగి మురళీకృష్ణ, రాజనాల రామచంద్రరావు, గద్దె రుష్యేంద్ర నాగవర దుర్గాప్రసాద్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గజం రూ.8 వేల చొప్పున మొత్తం స్థలాన్ని రూ.3కోట్ల 6 లక్షలకు కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ రికార్డుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి గజం రూ.8 వేల చొప్పున కూడా కాకుండా సొసైటీ అధ్యక్షుడు మత్సా శాంతారావుకు మొత్తంగా రూ.కోటిలోపు మాత్రమే సొమ్ము ఇచ్చి స్థలాన్ని సొంతం చేసుకున్నారని అంటున్నారు. మార్కెట్ ధర ప్రకారం ఆ స్థలం విలువ రూ.7 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. భూముల దరలు ఆకాశన్నంటిన రెండేళ్ల కిందటే నగరానికి చెందిన ఓ న్యాయవాది ఆ స్థలంపై కన్నేసి కొనుగోలు చేసేందుకు శాంతారావును సంప్రదించారు. అప్పట్లో గజం రూ.ఐదు వేల చొప్పున విక్రయానికి డీల్ కుదిరింది. ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు పక్కాగా లేకపోవడం, ప్రభుత్వపరమైన అడ్డంకులు ఉన్నాయని తెలిసి ఆ న్యాయవాది వెనక్కి తగ్గారు. దీంతో సొసైటీ పెద్దలు అధికారం దన్నుతో హల్చల్ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలకు ఏ మాత్రం ధరకు ఆ స్థలాన్ని కట్టబెట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వాళ్లకేమీ తెలియదట నగరంలో విలువైన స్థలాలు ఇలా పార్టీ నేతల అధీనంలోకి వెళ్లిపోతున్నా టీడీపీకే చెందిన తమకు అసలేమీ తెలియకపోవడంపై స్థానికసంస్థల ప్రజాప్రతినిధి గుర్రుగా ఉన్నారట. ఈ విషయమై అసంతృప్తిగా ఉన్న ఏడవ డివిజన్ కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు పాలడుగు దీప్తి, ఆమె భర్త పాలడుకు మురళీశ్యామ్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. రెండురోజుల కిందట జరిగిన కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్ గైర్హాజర్ కావడం వెనుక అసలు కారణం ఈ స్థల వివాదమేనని తెలుస్తోంది. మరోపక్క ఈ స్థలాన్ని అడ్డగోలుగా అమ్మేయడంపై చేనేత కార్మికులు ఆందోళనకు దిగుతున్నారు. చేనేత జౌళి శాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా జరిగిన విక్రయాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్ని మలుపులు తిరిగిన ఈ వివాదం చివరకు ఎటువైపు వెళ్తుంది, చోటామోటా నేతల వెనుక అండగా ఉన్న సూత్రధారి ఎవరు, రిజిస్ట్రేషన్ రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్న చేనేత జౌళి శాఖ అధికారుల యత్నాలు ఫలిస్తాయా అన్నది తేలాల్సి ఉంది. బేరం పెట్టారు గుట్టుచప్పుడు కాకుండా సరిగ్గా నెల కిందట ఈ భూములను నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకుని పండగ చేసుకున్న నేతలకు నాలుగు రోజుల క్రితం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం గుబులు పుట్టించింది. ముఖ్యంగా బంధువుల పేరిట ఒకటికి రెండు స్థలాలు కొనుగోలు చేసిన టీడీపీ నేత ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు రావడం లేదని అంటున్నారు. మరో కార్యకర్తయితే ఎందుకైనా మంచిదని తాను కోనుగోలు చేసిన స్థలాన్ని బేరం పెట్టేశారని తెలిసింది. ఆ స్థలానికి ఎదురుగా ఉన్న చేపల వ్యాపారికి రూ.1.70 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. -
డబ్బు ఉంటేనే రాజకీయాల్లో ఉండాలా
-
కలెక్టర్‌గారూ కరుణించండి
తంబళ్లపల్లె: బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి గత నెల 3వ తేదీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు సమాచారం అందింది. ఇప్పటికి 37 రోజులు అవుతున్నా మృతదేహం స్వగ్రామానికి చేరలేదు. సమాచారం అందినప్పటి నుంచి భార్య లక్ష్మీదేవి, కుమారుడు ఆదినారాయణ, కుమార్తె అరుణ చివరిచూపు కోసం ఎదురు చూస్తున్నారు. మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఎవరిని సంప్రదించాలో తెలియకా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాయకులు, పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని, కలెక్టర్‌గారూ మీరైనా స్పందించాలని కోరుతున్నారు.