‘ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారు’ | BJP Leader Katipally Ramana Reddy Slams TRS Over EVM Tamper Issue | Sakshi
Sakshi News home page

‘ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారు’

Published Sat, Dec 15 2018 9:42 AM | Last Updated on Sat, Dec 15 2018 9:42 AM

BJP Leader Katipally Ramana Reddy Slams TRS Over EVM Tamper Issue - Sakshi

విలేకరులతో మాట్లాడుతోన్న బీజేపీ నాయకులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి

కామారెడ్డి క్రైం: టెక్నాలజీని వాడుకుని ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్‌ చేయడంతోనే టీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఓటమి ఎదురైనందుకు తాను ఇలా మాట్లాడటం లేదన్నారు. సాంకేతికతపై అవగాహన ఉన్నందునే మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన గంపగోవర్ధన్‌కు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. తాను నియోజకవర్గంలో 45 రోజలు పాటు ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం చే శానన్నారు. అలాగే ప్రజలు అన్నిచోట్ల నుంచి బీజేపీకి ఓట్లు వేశారని పేర్కొన్నారు.

ప్రజలు బీజేపీపై విశ్వాసంతో ఓట్లు వేసినా ట్యాంపరింగ్‌ చేయడంతోనే సీట్లు రాలేదన్నారు. లేదంటే ఎన్నికల ప్రచార సమయంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో, ఎన్ని సీట్లు వస్తాయో సీఎం కేసీఆర్‌కు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.  రెవెన్యూ, పోలీస్‌శాఖలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని టీఆర్‌ఎస్‌ ఖూనీ చేసిందన్నారు. నీతి, నిజాయితీలు, అవినీతి రహిత పాలనే అజెండాగా ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్తామన్నారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్‌ విధానాన్ని తీసుకువచ్చేలా పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం చిన్నరాజులు, అసెంబ్లీ కన్వీనర్‌ తేలు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కుంట లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు బాలకిషన్, నాయకులు మహేశ్‌గుప్తా, నరేందర్‌రెడ్డి  పాల్గొన్నారు.     


ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం : బాణాల

తాడ్వాయి: ఎన్నికలలో గెలుపు ఓటములు సహజమని, కార్యకర్తలు నిరుత్సాహపడవద్దని ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటు లో ఉండి వారి సమస్యలను తీ ర్చేలా కృషి చేయాలని  బీజేపీ  కామారెడ్డి జిల్లా అద్యక్షడు బా ణాల లక్ష్మారెడ్డి అన్నారు. తా డ్వాయి మండలంలోని  క్రిష్ణాజివాడి  గ్రామంలో    శుక్రవా రం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్‌ 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పని చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఏఒక్క గ్రామానికి నిధులు రాలేదని, కేంద్రం నుంచి ఎల్లారెడ్డి నియోజక వర్గానికి  13, 14ఆర్థిక నిధుల క్రింద రూ.157కోట్లు వచ్చాయని తెలిపారు.  

మోదీ ప్ర భుత్వం భారత దేశంలో ఉన్న ప్రతి గ్రామానికి  రూ.కోట్లల్లో నిధులు విడుదల చేస్తే రాష్ట్రప్రభుత్వం తమ నిధులని చెప్పుకుంటున్నదని ఆరోపించారు. ఈ నెల 16న జుక్కల్, 17న బాన్స్‌వాడ, 18న కామారెడ్డి నియోజక వర్గాలలో సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యకర్తలు మరింత కష్టపడి రాబోయే ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకుడు మర్రి రాంరెడ్డి, నాయకులు వెంకన్న, బాలకిషన్, సురెందర్‌రెడ్డి, రమణారెడ్డి, వెంకట్‌రావు, సాయిబాబా, నర్సింహారెడ్డి, సతీష్, రవీందర్‌రావు, ఏడు మండలాల అ«ధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బూతు కమిటి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement